అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి మెడకే చుట్టుకునేలా ఉంది. ఎప్పుడైతే సుశాంత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయో అప్పుడే రియా మూలాలు కూడా కదిలిపోయేలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రియా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఆమె తరుఫు లాయర్ తెలిపారు.
Also Read: సంచలన విషయాలు : సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడా..?
‘సుశాంత్ ను ప్రేమించడం నేరమైతే.. ఆ ప్రేమ కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రియా సిద్ధంగా ఉన్నానని తెలిపిందని ఆమె లాయర్ తెలిపారు. అందుకే అరెస్ట్ అయ్యే చాన్స్ ఉన్నా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించలేదని భావోద్వేగానికి గురైంది. రియా నిర్ధోషి కావడం వల్లే బీహార్ పోలీసులు , సీబీఐ, ఈడీ,ఎన్.సీ.బీ కేసుల్లో ఒక్కదానికి కూడా ముందస్తు బెయిల్ తీసుకోలేదని లాయర్ వివరించారు.
తాజాగా ముంబైలోని రియా ఇంటికి చేరుకొని పోలీసులు విచారణ జరిపారు. అనంతరం ఎన్.సీ.బీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు..ముంబై పోలీసుల రక్షణ నడుమ రియా బయలు దేరారు. ఏ క్షణమైనా రియా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ అరెస్ట్ అయ్యారు. రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మన్నట్లుగా అతడు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. దీంతో రియా అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 4’ కంటెస్టెంట్స్ వీళ్ళే !
బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో అందరూ అనుమానిస్తున్నట్టే అతడి ప్రియురాలు రియా చుట్టే ఉచ్చు బిగుసుకుంటుంది. డ్రగ్స్ వ్యవహారమే సుశాంత్ మృతికి కారణంగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రియాను ఆదివారం విచారించి అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.