
వరుసగా రెండు సార్లు టీఆర్ఎస్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ తెలంగాణలో ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. టీఆర్ఎస్ కూడా ఆ పార్టీనే గుర్తిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఎంతో మంది బలమైన నేతలున్నారు. బీజేపీలో పెద్ద నేతలు ఎవరూ లేరు. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయంగా తెలంగాణలో అందరూ కాంగ్రెస్ ను మాత్రమే చూస్తారు.
Also Read: గుడ్‌న్యూస్..: ప్రజలకు ఇక ఎమ్మార్వో, వీఆర్‌వోల వేధింపులుండవ్..
తెలంగాణలో బీజేపీ తాము బాగా పుంజుకుంటున్నామని చెప్పుకుంటున్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీకి రెండంకెల అసెంబ్లీ సీట్లు రావడం కష్టమేనంటున్నారు. కరోనా లాక్ డౌన్ లో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించలేక విఫలమైన నరేంద్రమోడీపై దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతతో తెలంగాణలో ఆ పార్టీకి కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. హిందుత్వ, ముస్లిం వ్యతిరేకత తప్ప బీజేపీకి మరో ఆప్షన్ లేదు. అది తెలంగాణలో పనిచేసే చాన్స్ లేదు. తెలంగాణలో అభివృద్ధి ఎజెండానే పనిచేస్తుంది.
తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ కు గణనీయమైన ఓటుబ్యాంకు, నేతలు, కార్యకర్తల బలం ఉంది. ఏపీలో వైఎస్ఆర్ ఉన్నప్పటి మూలాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ లాంటి నేత తెలంగాణలో లేకపోవడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీఎం క్యాండిడేట్ ను చూపించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ పై పోరాడే నేతకు పగ్గాలు అప్పగించాలి.
ఈ క్రమంలోనే వచ్చేసారికి ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని యోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ జగన్ బాటలో నడవబోతోందట.. జగన్ గెలుపునకు కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తను నియమించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Also Read: అదే ‘వి’ సినిమా కొంప ముంచిందా?
ఎన్నికలకు ముందు టికెట్ల జారీ, లాబీయింగ్, నేతలను లాగడం.. వివిధ విభాగాల పర్యవేక్షణ కోసం.. సోషల్ మీడియా ప్రచారం సహా.. ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గుర్తించే పనిని కాంగ్రెస్ ఈ వ్యూహకర్తకు అప్పగించాలని యోచిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహకర్త కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది.