Homeజాతీయ వార్తలుహరీష్ రావు అసెంబ్లీ గైరుహాజరు పై ఊహాగానాలు?

హరీష్ రావు అసెంబ్లీ గైరుహాజరు పై ఊహాగానాలు?

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. తెరాస స్థాపించిన దగ్గర్నుంచి హరీష్ రావు లేకుండా అసెంబ్లీ లో తెరాస గళం వినబడలేదు. మొట్టమొదటసారి కారణం ఏదైనా ఇలా జరగటం అందరికీ కొత్తగా వుంది. తెరాస పై ఈగవాల నివ్వకుండా ఇప్పటివరకూ హరీష్ రావు కాపాడుకుంటూ వస్తున్నాడు. బయటికి ఎన్ని వదంతులు వచ్చినా తెరాస కి బలం హరీష్ రావే. మొట్టమొదటిసారి ఆ గళం అసెంబ్లీ లో వినబడకుండా సమావేశాలు జరుగుతున్నాయి. దీనివెనక రాజకీయ ఊహాగానాలు మస్తుగా వినబడుతున్నాయి.

Also Read : జగన్ బాటలో టీ.కాంగ్రెస్ భారీ ప్లాన్.?

తెలంగాణాలో హరీష్ రావు ది ప్రత్యేక స్థానం. తనపేరు తెలియనివారు లేరంటే ఆశ్చర్యపోనక్కరలేదు. వ్యక్తిగతంగా తన నియోజక వర్గం లో ఏ సమస్య వచ్చినా అన్నీ తానై చూసుకుంటాడు. ప్రజలకి అంతగా కనెక్ట్ అయ్యే నాయకులు బహు అరుదు. పత్రికా సమావేశాల్లో గానీ, బహిరంగ సభల్లో గానీ , అసెంబ్లీ లో గానీ ముక్కుసూటిగా అవతలి వాళ్ళకు సూటిగా తగిలేలా మాట్లాడటం లో తనకు తానే సాటి. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో తన పాత్ర స్పూర్తిదాయకం.    కేటిఆర్ రాజకీయాల్లోకి రాకముందు కెసిఆర్ కి కుడి భుజం హరీష్ రావే. కేటిఅర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా చానాళ్ళు తనే నెంబర్ టు. కానీ రాను రానూ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం తన పొజిషన్ ఏమిటో తనకే తెలియదు. కేటిఆర్ నంబర్ టు అయిన తర్వాత కెసిఆర్ దగ్గర తన ప్రభ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పైకి గుంభనంగా వున్నా లోపల ఏదో జరుగుతుందనే అనుమానం ప్రజల్లో వుంది.

నిజంగా హరీష్ రావు ఆరోగ్య కారణాలతో అసెంబ్లీ కి రాలేకపోయినా జరుగుతున్న పరిణామాల్ని బట్టి రక రకాల ఊహాగానాలు రాజకీయ కారిడార్ల లో షికార్లు చేస్తున్నాయి. హరీష్ రావు తన దారి తను చూసుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని , అందుకే అసెంబ్లీకి వచ్చి తెరాస ని కాపాడే పని చేయటానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. అలాగే బిజెపితో రహస్య మంతనాలు కొలిక్కి వచ్చాయని అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ముందు జరగబోయే పరిణామాలకి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడుతున్నాడని కూడా వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు. ఇటువంటి పుకార్లు అదివరకు కూడా చాలాసార్లు వచ్చినా అవి నిజం కాలేదు. హరీష్ రావు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు దూరంకావటం తో ఈ పుకార్లు మరింత గాలిలో త్వరగా వ్యాపిస్తున్నాయి. ఈ పుకార్లలో నిజమో అబద్దమో చెప్పాల్సింది కాలమే.

Also Read : సంచలనం: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్?

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular