Home Blog Page 8326

రేపటి నుంచి అసెంబ్లీ: టీఆర్ఎస్ vs కాంగ్రెస్ ఫైటేనా?

Telangana Assemblyఈసారి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సమావేశాలు హాట్‌హాట్‌గా జరిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. విపక్షాలు, అధికార పక్షం వ్యూహ, ప్రతివ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్‌‌ కరోనా కట్టడిలో ఫెయిల్‌ అయ్యారు. దీనికితోడు సచివాలయాన్ని కూల్చడం.. కొత్త సెక్రటరేటియట్‌ నిర్ణయం తీసుకోవడం. మరోవైపు నిర్బంధ సాగు.. ఉస్మానియా వైఫలం.. ఇవన్నీ ప్రతిపక్షాలకు కలిసొచ్చే అంశాలు. వీటన్నింటికీ తోడు కేసీఆర్‌‌ ముఖ్యంగా ఫామ్‌హౌజ్‌కు పరిమితం కావడం. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరిస్తూ విపక్షంపై ఎదురుదాడికి దిగేందుకు అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తోంది. కొవిడ్‌కు సంబంధించి పరీక్షల నిర్వహణ, కట్టడి చర్యలు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి? తెలంగాణలో పరిస్థితి? ఏంటన్న దానిపై ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ కూడా పూర్తి స్థాయులో సమాచారం సేకరించినట్లు సమాచారం. మరోవైపు విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం కేసీఆర్‌ కూడా ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: గుడ్‌న్యూస్‌..: ప్రజలకు ఇక ఎమ్మార్వో, వీఆర్‌‌వోల వేధింపులుండవ్‌..

కరోనా కట్టడితోపాటు సహాయక చర్యల్లో వైఫల్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతిని సామాన్యులు ఇబ్బందుల పాలవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో ప్రమాదం, ఏపీ జల దోపిడీ, రైతాంగ సమస్యలను లేవనెత్తాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, సౌకర్యాల లేమిపై సమగ్ర సమాచారాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సేకరించి పెట్టుకున్నారు. ఆరుగురు సభ్యులే ఉన్నప్పటికీ ప్రభుత్వంపై దీటుగా దాడి చేయాలన్న ఎత్తుగడతో ఆ పార్టీ ఉంది. సోమవారమే సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎజెండాను ఖరారు చేసుకుంటున్నారు. అలాగే, మీడియా పాయింట్‌ ఉండబోదని స్పీకర్‌ ప్రకటించిన నేపథ్యంలో దాన్ని కొనసాగించేలా బీఏసీలో పట్టుబట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.

మరోవైపు కొవిడ్‌ నేపథ్యంలో కేంద్రం చేసిన సాయం.. వాటి లెక్కలు బయట పెట్టాలని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలనూ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారన్న దానిపైనా ప్రభుత్వాన్ని నిలదీయనుంది.

Also Read: కరోనా కాఠిన్యం: చెదిరిపోతున్న జర్నలిస్టులు

వీటన్నింటినీ ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర సర్కార్ కూడా దీటుగా సమాధానం ఇవ్వడానికే రెడీ అవుతోంది. విపక్షాలపై ఎదురుదాడి చేసే ఎత్తుగడను అవలంబించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో ట్రబుల్‌ షుటర్‌‌ అయిన మంత్రి హరీశ్‌ రావు ఈసారి సమావేశాలకు దూరంగానే ఉండనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఎదురుదాడి ఎవరి నుంచి మొదలవుతుందా అని ఆసక్తి నెలకొంది. ఇందుకు మంత్రి ఈటల రాజేందర్‌, ఆయనకు సహాయంగా మరో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలనూ రంగంలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీశైలం ప్రమాద ఘటన, ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై అసెంబ్లీ వేదికగానే సమాధానం చెప్పాలని భావిస్తోంది. జీఎస్టీ లోటును కేంద్రం భర్తీ చేయకపోవడంతో రాష్ట్రానికి జరుగతున్న నష్టం, రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలను పెండింగ్‌లో ఉంచడం వంటి అంశాలను ప్రస్తావించి బీజేపీని కార్నర్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

డిజిటల్ ప్రచారంలో దూసుకెళుతున్న బీజేపీ?

Bjp it cell
కరోనాకు సాకుతో ఎన్నికలు వాయిదా వేయడం కుదరని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది. దీంతో కరోనా సమయంలోనూ అధికార, ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇక బీహార్ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో కేంద్రంలోని బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి. అయితే బీజేపీ అధిష్టానం కరోనాను ఎదుర్కొంటూ ప్రచారంలో దూసుకెళ్లేందుకు మందస్తుగానే వ్యూహాలు రెడీ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

ప్రస్తుతం దేశంలో కరోనా ఎఫెక్ట్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివ్ బారినపడే వారిసంఖ్య భారీగా పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు అమెరికాతో పోటీపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడమంటే కత్తి మీద సాము చేయడం లాంటిదే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి వాటిని ముందుగానే ఊహించిన బీజేపీ అధిష్టానం మిగతా పార్టీల కంటే ముందుగా డిజిటల్ ప్రచారానికి ఏర్పాట్లు చేసుకుంది.

దేశంలో సమర్థవంతంగా సోషల్ మీడియాను వినియోగించుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ముందుగానే విన్పించేది బీజేపీ పేరే. బీజేపీ నేతలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కన్పిస్తుంటారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు.. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేలా ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాను విస్కృతంగా వాడుతుంటం చూస్తూనే ఉన్నాం. దీంతో మిగతా పార్టీలు సైతం సోషల్ మీడియాపై అవగాహన పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రతీఒక్కరికి డిజిటల్ సేవలు అందుబాటులో ఉండటంతో అన్ని పార్టీలు కూడా దీనిపై దృష్టిసారిస్తున్నాయి.

Also Read: ముఖేశ్‌ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్‌ అంచనా వేయగలమా..!

బీహార్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర నేతలకు అధిష్ఠానం మార్గదర్శకాలను జారీ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ ఉండాలో 5నిమిషాల నిడివితో డాక్యుమెంటరీలను బీజేపీ రూపొందించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో ‘డిజిటల్ ర్యాలీ’కి రూపకల్పన చేశారు.

ఒక్కో బీజేపీ ఎంపీ 60గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేయాలని అధిష్టానం ఇప్పటికే సూచించినట్లు సమాచారం. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విరివిగా యూబ్యూబర్స్ సేవలను వాడుకుంది. అయితే అక్కడ పరిస్థితుల కారణంగా ఓటమి చెందింది. అయితే బీహార్లో మాత్రం పకడ్బంధీగా ప్రచారంలో దూసుకెళ్లేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక  ప్రతిపక్షాలు డిజటల్ ప్రచారాన్ని ఏమేరకు ఉపయోగించుకుంటారో వేచిచూడాల్సిందే..!

 గుడ్‌న్యూస్‌..: ప్రజలకు ఇక ఎమ్మార్వో, వీఆర్‌‌వోల వేధింపులుండవ్‌..


కరోనా టైంలో కరోనాను పట్టించుకోకుండా.. సీఎం కేఈఆర్‌‌ ఇతర వాటిపైనే దృష్టి పెట్టారని ఓ వైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొత్త సెక్రటేరియట్‌, నిర్బంధ సాగు తదితర ప్రణాళికలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఫోకస్‌ అంతా ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం మీదనే పెట్టినట్లుగా తెలుస్తోంది. సోమవారం నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎలాగైన దీనిని పాస్‌ ఆన్‌ చేయాలనే ఉత్సుకతతో ఉన్నట్లు సమాచారం. అయితే. రాష్ట్రంలో రెవెన్యూ శాఖలోని అవినీతి పీడను అంతం చేసేందుకు ఈ కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేశారు.

Also Read: రేపటి నుంచి అసెంబ్లీ: టీఆర్ఎస్ vs కాంగ్రెస్ ఫైటేనా?

ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అల్లర్లకు పోకుండా.. ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌‌ సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి అయిన హరీష్‌రావు తాజాగా కరోనా బారిన పడ్డారు. ఆయనే స్వయంగా ట్వీట్‌ కూడా చేశారు. దీంతో ఈ కొత్త రెవెన్యూ చట్టం బిల్లును స్వయంగా సీఎం కేసీఆర్‌‌ ప్రవేశపెడుతారని చెబుతున్నారు. ఈ చట్టం వల్ల కలిగే ఉపయోగాలు, గతంలో రెవెన్యూ శాఖలోని లోపాల వల్ల ప్రజలు ఎలా వేధింపులకు గురయ్యారు, దోపిడీకి గురయ్యారు అన్నది అసెంబ్లీ వేదికగా వివరిస్తారని అంటున్నారు.

కొందరు ఎమ్మార్వోలు, వీఆర్‌‌వోల కారణంగా రాష్ట్రంలో ప్రజలు దోపిడీకి గురవుతున్నారనేది బహిరంగ రహస్యం. వారి వల్లే మొత్తం రెవెన్యూ శాఖ అవినీతిలో అగ్రగామిగా ఉంటోందని కేసీఆర్‌ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వోలు, వీఆర్‌వోల ప్రమేయం తగ్గించేలా, వారి అధికారాలను కట్ చేసేలా రెవెన్యూ చట్టం ఉండబోతోంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో ఎమ్మార్వో , వీఆర్‌వోల పాత్ర లేకుండా కటింగ్‌ పెట్టబోతున్నారు. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే ఆటోమెటిక్‌గా భూమి కొన్న వ్యక్తి పేరు మీద మ్యుటేషన్‌ జరిగేలా వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఎమ్మార్వోలు, వీఆర్‌వోలు ఇతర ఉద్యోగుల తరహాలోనే సాధారణ పనులకు పరిమితం కానున్నారు.

Also Read: కరోనా కాఠిన్యం: చెదిరిపోతున్న జర్నలిస్టులు

ఈ చట్టం ద్వారా భూవివాదాలకూ పరిష్కారం చూపాలని భావిస్తున్నారట. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వాటికి సాధ్యమైనంత తొరగా పరిష్కారం చూపాలని గడువు విధించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తారట. రిటైర్డ్ జడ్జిలతో ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయించింది.

మళ్లీ జనంలోకి జనసేనాని.. బాబుపై యుద్ధం సంధిస్తారా..?

నాలుగు రోజులు సినిమాలు చేయడం.. వచ్చిన డబ్బులతో పార్టీ కార్యక్రమాలు చేపట్టడం.. మళ్లీ డబ్బులు అయిపోగానే మళ్లీ వచ్చి సినిమాలు చేయడం.. ఇదీ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జీవన చక్రం. 2019 ఎన్నికల్లో పోటీచేసిన పవర్‌‌స్టార్‌‌.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కనీసం ఆయన పోటీ చేసిన స్థానంలోనూ ఆయన గెలవలేకపోయారు. దీంతో కొద్ది రోజులపాటు రాజకీయాలను పక్కన పెట్టిన ఆయన మళ్లీ సినీ ఇండస్ర్టీకి వచ్చారు. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోయారు. తాజాగా మరో వార్త వినిపిస్తోంది.

Also Read: హైకోర్టు మీ ఇష్టం అనేసినా… జగన్ మాకొద్దు అన్నాడు

దసరా నుంచి మళ్లీ జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకోవాలని నిర్ణయించారంట. ఇందుకు కార్యాచరణ సిద్ధమైందని.. పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌‌ ప్రకటించారు. అంతేకాదు ఇకపై పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఆయన కృషి చేస్తారట. పార్లమెంట్ నియోజకవర్గాల్ని కేంద్రాలుగా చేసుకొని పార్టీ ఆఫీసులు కూడా తెరుస్తారట. ప్రతి ఆఫీస్ లో అవసరమైన సిబ్బందితో పాటు సోషల్ మీడియా ఇన్‌చార్జులను నియమిస్తారట.

వాస్తవానికి ఎన్నికల ప్రాసెస్ ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన పదిహేను నెలలు గడిచిపోయింది. వెంటనే జనాల్లోకి రావాలనుకున్నారు పవన్. కానీ అప్పట్లో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాబు నుంచి విడిపోయి బీజేపీతో పవన్‌ జతకట్టారని అంటుంటారు. జనసేన–-బీజేపీ కలిసిన వెంటనే ఈ రెండు పార్టీలు సంయుక్తంగా ప్రజల్లోకి వెళ్లాయని అంతా అనుకున్నారు. కానీ అప్పట్లో బాబు మనిషి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండడం.. కరోనా తదితర పరిస్థితుల వల్ల పవన్‌కు అవకాశం చిక్కలేదు.

ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నరకు పవన్‌కు ఆ అవకాశం రానే వచ్చింది. సోము వీర్రాజు రాకతో పవన్ తన ప్రణాళికను మరోసారి బయటకు తీశారు. జనం మధ్యలోకి వెళ్లి పొలిటికల్ మైలేజీ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఇప్పుడు పవన్‌ జనాల్లోకి ఏం ఉపన్యాసం ఇస్తారు. ఎన్నికల సమయంలో పూర్తిగా జగన్‌ను తిట్టడంలోనే తన ప్రచారం కొనసాగించారు. చంద్రబాబును ఏ కోషాన కూడా ఒక్క మాట కూడా అనలేదు. మరి ఇప్పుడు ఆయన ఏ పంథాలో వెళ్తారో చూడాలి. అదే కనుక జరిగితే జనాల మధ్య, జనాల చేత ఆయన ఛీత్కారాలు ఎదుర్కోవడం మినహా మరే ఉపయోగం ఉండదు.

Also Read: ఏపీ నెంబర్ వన్ సరే… ఘనత బాబు దా? జగన్ దా?

ఇంతకుముందే చెప్పుకున్నట్టు చంద్రబాబును ఇప్పటివరకు పల్లెత్తు మాట అనని పవన్ కల్యాణ్.. ఇప్పుడు బాబును విమర్శిస్తారా, లేక సైలెంట్‌గా ఉంటారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు, బాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కూడా బాబును ఇప్పుడు చెడుగుడు ఆడాల్సిందే. ఆ ముచ్చట తీరుతుందా లేదా అనేది చూడాలి.

వాళ్ళ తాట తీసేదాకా నిమ్మగడ్డ రమేష్ ఊరుకునేలా లేడు..!

Sacked A.P. SEC Ramesh Kumar challenges his removal in High Court - The  Hindu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 30వ తేదీన మళ్లీ తన పోస్టులో గవర్నర్ చేత నియమితులయ్యారు. దానికి ముందు కొద్ది నెలలు ఏపీ ప్రభుత్వం తో చాలా కష్టతరమైన యుద్ధం చేసిన రమేష్ కుమార్ కు కాంట్రవర్సీలు ఏమి కొత్తకాదు. ఇక ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కు చిరాకు తెప్పించేలా మరొక సంఘటన జరిగింది. 

నిన్నటి నుండి మీడియా వర్గాలు అన్నింటిలో ఒక నోటిఫికేషన్ బాగా వైరల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు…. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని…. అలాగే నిమ్మగడ్డ రమేష్ తక్షణమే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పినట్లుగా వార్త ప్రచారం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన నిమ్మగడ్డ రమేష్ వాటిని కొట్టి పారేశాడు. ఇవన్నీ ఫేక్ వార్తలని.. తాము ఎలాంటి షెడ్యూల్ నూ విడుదల చేయలేదని చెప్పేశారు. అయితే రమేష్ కుమార్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని… వెంటనే షెడ్యూల్ విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 

అలాగే సోషల్ మీడియా అకౌంట్ లలో ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకునేలా ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. చాలా రోజులు మనశ్శాంతి లేకుండా ఉన్న రమేష్ కుమార్ ఎట్టకేలకు శాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉన్న దశలో ఇటువంటి వార్తలు అతనికి మళ్లీ ఒక్కసారిగా చిర్రెత్తించాయి అనే చెప్పాలి. 

ఇక ఆ ఫేక్ షెడ్యూల్ విషయానికి వస్తే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 9న మొదలై సెప్టెంబర్ 11 కి పూర్తవుతుందని…. పోలింగ్ సెప్టెంబర్ 21న జరిగితే…. సెప్టెంబర్ 24న కౌంటింగ్ ఉంటుందని వార్త వచ్చింది. అలాగే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరుగుతుందని ఇక పోలింగ్ సెప్టెంబర్ 23న జరగనుండగా…. సెప్టెంబర్ 27న ఓట్ల లెక్కింపు ఉంటుంది అని అందులో ఉంది.

థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా?  

cinema theaters
కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. నాటి నుంచి లాక్, అన్ లాక్ పేరిట కొన్నింటికి నిబంధనలు.. మరికొన్నింటికి సడలింపులిస్తూ పోయింది. అయితే కొన్నిరంగాలకు కేంద్రం ఇంకా మినహాయింపులు ఇవ్వలేదు. ప్రధానంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, సినిమా షూటింగులు ఈ కోవలోకి వచ్చాయి. ఈ రంగాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకేచోటే చేరే అవకాశం ఉండటంతో వీటికి ఇప్పటివరకు మినహాయింపు దక్కలేదు. ఇటీవలే కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తెరుచుకోవచ్చని.. షూటింగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి

Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

అయితే థియేటర్ల ఓపెనింగులను మాత్రం కేంద్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్ లో పెడుతూ వస్తోంది. ఇక థియేటర్లు ఓపెన్ అవుతాయని అనుకునే సమయానికి మళ్లీ మళ్లీ వాయిదావేస్తూ పోతుంది. దీంతో థియేటర్లను నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు నెలల తరబడి ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. థియేటర్ల మూసివేతతో ఇప్పటికే ఓటీటీ, టీవీరంగాలు దూసుకెళుతున్నాయి. సినీ ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడుతున్న తరుణంలో థియేటర్లు ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలు రెడీ చేస్తోంది.

దీనిలో భాగంగా అన్ లాక్ 5.0 థియేటర్ల భవిష్యత్ పై కేంద్రం చర్చించేందుకు సిద్ధం అవుతుంది. ఈమేకు ఈనెల 8న కేంద్ర హోంశాఖ అధికారులు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, థియేటర్ల యూనియన్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ లో చర్చించనున్నారట. థియేటర్లు.. మల్టీఫ్లెక్స్ ల భవితవ్యంపై చర్చించి సమష్టిగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో థియేటర్లు ఏ రోజు నుంచి ఓపెన్ చేయబోతున్నారనేది ప్రకటించబోతున్నారట .

Also Read: కరోనాకి దూరంగా ‘పుష్ప’ ప్రత్యేక జాగ్రత్తలు !

దీంతోపాటు కుదేలైన ఈ రంగాన్ని ఎలా ఆదుకోవాలి? ఎలాంటి ప్రోత్సాహాలు అందించాలనేది చర్చించనున్నారు. టిక్కెట్టు ధరలు తగ్గించి ఆదుకోవాలని థియేటర్ యాజమాన్యాలు కేంద్రాన్ని కోరానున్నాయి. థియేటర్లు నడిపే సమయంలో కరోనా నిబంధనలు పాటించడం సాధ్యమయ్యేనా? వంటి వాటిపై చర్చించి మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఇక థియేటర్లు ఓపెన్ చేస్తే ఏమేరకు ప్రేక్షకులు వస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రం థియేటర్లపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..? 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ సూసైడ్‌లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న సూసైడ్‌ సుశాంత్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌కు డ్రగ్స్‌ సప్లయ్‌ చేసిన కుక్‌ను, అతడి మేనేజర్‌‌ను ఎన్సీబీ అరెస్టు చేయగా.. సుశాంత్‌కు డ్రగ్స్‌ సప్లై చేసినట్లుగా వారు ఒప్పుకున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. మొత్తానికి చ‌నిపోయిన ఇన్నాళ్లకు సుశాంత్‌ను డ్రగ్స్‌ తీసుకొనే వ్యక్తిగా చిత్రీకరించారు. మొదటి నుంచీ సుశాంత్‌ మరణం అనుమానాస్పదమనే అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నటి రియా చక్రవర్తి కారణమంటూ ఫిర్యాదు కూడా చేశారు. అయితే.. సుశాంత్‌ మరణం విషయంలో చేస్తున్న కేసు విచారణలో ఈ డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడం ఆసక్తి కలిగిస్తోంది.

Also Read: థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా?

రియా రిక్రూట్‌చేసిన సుశాంత్‌ మేనేజర్‌‌ను అరెస్టు చేసి విచారించగా.. అతను ఈ డ్రగ్స్‌ వ్యవహారం బయటపెట్టాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇంకొంత మందిని అరెస్టు చేశారు. సుశాంత్‌ అంటే యూత్‌కు క్రేజ్‌. అందులోనూ ధోనీ బయో హీరో. ప్రతిభావంతమైన నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. చాలా మంది బాలీవుడ్‌ పెద్దలు కూడా సినిమాల్లోని అతని యాక్టింగ్‌ను కీర్తించారు.

ఇలా అందరిలోనూ మంచివాడిగా పేరు తెచ్చుకున్న సుశాంత్‌ను ఇప్పుడు డ్రగ్స్‌ వినియోగదారుడిగా నిలబెడుతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌కు బలవంతంగా డ్రగ్స్‌ వాడే అలవాటు చేశారనేది కూడా మరో వాదన. అంటే.. ఇప్పుడు సుశాంత్‌ లేడు కాబట్టి ఏ వాదన అయినా అతని చేయచ్చు అనే దిశగా విచారణ సాగుతోందని పలువురు అంటున్నారు. గ‌త కొంత‌కాలంగా సుశాంత్ విష‌యంలో వ‌స్తున్న వార్తలు కొంత విస్మయకరంగానే ఉంటున్నాయి.

Also Read: కరోనాకి దూరంగా ‘పుష్ప’ ప్రత్యేక జాగ్రత్తలు !

ఈ కేసులో రియా ప్రమేయంపై వచ్చిన ఆరోపణలకు, ప్రస్తుత పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. ఆమె సుశాంత్‌ను ఫైనాన్షియల్‌గా దెబ్బతీసిందనే తీవ్ర ఆరోపణ ఉంది. ఆ దిశగా విచారణ జరగాల్సిన కేసు.. ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ మీదకు మళ్లింది. రియా మీద వచ్చిన ఆరోపణలపైనా ఇప్పుడు అలికిడి లేదు. రియా సోదరుడిని అరెస్టు చేసినా.. అది డ్రగ్స్‌ కోణంలో విచారణ చేశారు. రేపోమాపో  రియాను కూడా అరెస్టు చేస్తార‌ని ఆమె తండ్రే అంటున్నాడు. అయితే.. ఆమె అరెస్ట్ సుశాంత్‌ సూడైడ్‌ కేసులో కాకుండా ఈ డ్రగ్స్‌ కోణంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్: ఇక రియల్ ఎమోషన్స్ స్ట్రార్ట్


తెలుగు రియల్టీ షోలో బిగ్ బాస్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. పదుల సంఖ్యలో సెలబ్రెటీలను ఒక దగ్గర చేర్చి వారిమనసత్వాలు ఎలా ఉంటాయో చూపించడంతోపాటు టాస్కులతో ఆనందాన్ని పంచుతుంటోంది. తొలి నుంచి ‘బిగ్ బాస్’ తెలుగుప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బుల్లితెరపై అత్యధిక టీఆర్పీలతో నెంబర్ వన్ షోగా దూసుకెళోతుంది. ఇప్పటికే బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3 సీరిసులతో ఆకట్టుకున్న నిర్వహాకులు మరోసారి బిగ్ బాస్-4ను తీసుకొస్తున్నారు.
Also Read: థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా?

నేటి సాయంత్రం 6 నుంచి రాత్రి 9గంటల వరకు బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం కాబోతుంది. ‘స్టార్ మా’లో మొత్తం మూడు గంటలపాటు ప్రారంభ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. బిగ్ బాస్-4కు సంబంధించిన తాజా ప్రోమో ఓ రేంజ్లో అదిరిపోయింది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్-4 శని, ఆదివారాల్లో రాత్రి 9గంటలకు ప్రసారం కానుంది. మిగతా వారాల్లో మాత్రం 9:30కు ప్రసారం కాబోతుంది. ఇక శని- ఆది వారాలు మాత్రమే ఈ షోలో నాగార్జున పాల్గొంటారట.

‘బిగ్ బాస్-4’లో ప్రారంభ ఎపిసోడ్లో కింగ్ నాగార్జున ఈమేరకు సందడి చేయబోతున్నాడో ప్రోమోలోనే చిన్న క్లూ ఇచ్చాడు. తాను నటించిన  సోగ్గాడే చిన్నినాయనా మూవీలోని బంగార్రాజు గెటప్ లో రాబోతున్నట్లు హింటిచ్చాడు. దీంతో ప్రారంభ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. మాస్కులు ముఖానికే.. ఎంటటైన్మెంట్ కాదంటూ కింగ్ నాగార్జున ఎంట్రీతోనే చెప్పిన డైలాగులు అందరికీ కనెక్ట్ అయ్యాయి.

Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభం నుంచి కంటెస్టుల విషయంలో చాలా పేర్లు విన్పించాయి. స్టార్ సెలబ్రెటీలు, గ్లామర్ బ్యూటీల బిగ్ బాస్-4లో పాల్గొంటున్నట్లు ప్రచారం జరగడంతో అంచనాలు పెరిగాయి. గత సీజన్లకు భిన్నంగా కొత్తగా బిగ్ బాస్-4 ఉండనుందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ షోను ఎంతమేరకు సాఫీగా కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కరోనా టైంలో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ‘బిగ్ బాస్’ ఆదివారం నుంచే వస్తుందటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కరోనా కల్లోలం..: ఇప్పట్లో వదిలేలా లేదు కదా..!

Carona india
కరోనా వైరస్‌ ఇప్పట్లో మనల్ని వదిలేదా లేదు. అప్పుడే మనకు మనశ్శాంతి చేకూరే పరిస్థితి కనిపించడం లేదు. దొరికిందే ఛాన్స్‌ అంటూ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇండియాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 90,632 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 41,13,811కి చేరుకుంది. వరల్డ్‌ వైడ్‌ ఒక్కరోజులో ఇన్ని కేసులు ఇప్పటివరకు ఎక్కడా నమోదు కాలేదు. ఈ 24 గంటల్లో 1065 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 70,626కి చేరింది. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

Also Read: కరోనాపై మరో అధ్యయనం.. షాకింగ్ న్యూస్

ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వైరస్‌ ఉధృతి ఆగడం లేదు. టెస్టుల సంఖ్య పెంచిన కొలదీ.. కేసుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఓ వైపు డిశ్చార్జి సంఖ్య పెరుగుతోందనే సంతృప్తి ఉన్నా.. రోజు వస్తున్న కేసుల సంఖ్యను చూస్తే భయం వేస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఇప్పటికే 30 వేలు దాటాయి. తాజాగా 32 వేలకు చేరుకున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య 10కి కాస్త అటు, ఇటుగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కరోనా కేసుల్లో స్వల్పంగా మార్పులు ఉంటున్నాయే తప్ప పూర్తిగా తగ్గుముఖం పట్టట్లేదు. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది చనిపోయారు. 2,974 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,40,969కి చేరుకుంది. ఇందులో 1,07,530 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య 886కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,553గా నమోదైంది. హోం ఐసోలేషన్‌లో 25,449 మంది ఉన్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 325 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఆదిలాబాద్‌లో -22, భద్రాద్రి కొత్తగూడెంలో-69, జగిత్యాలలో-81, జనగామ-39, జయశంకర్ భూపాలపల్లి-24, జోగుళాంబ గద్వాల-21, కామారెడ్డి-86, కరీంనగర్-144, ఖమ్మం-128, కొమరంభీమ్ -25, మహబూబ్ నగర్-44, మహబూబాబాద్-73, మంచిర్యాల-63, మెదక్-34, మేడ్చల్ మల్కాజ్‌గిరి-185, ములుగు-15, నాగర్ కర్నూలు-51, నల్లగొండ-158, నారాయణపేట్-11, నిర్మల్-19, నిజామాబాద్-95, పెద్దపల్లి-69, రాజన్న సిరిసిల్ల-45, రంగారెడ్డి-197, సంగారెడ్డి-82, సిద్ధిపేట్-88, సూర్యాపేట్-102, వికారాబాద్-14, వనపర్తి-41, వరంగల్ రూరల్-40, వరంగల్ అర్బన్-117, యాదాద్రి భువనగిరి-67 కేసులు నమోదయ్యాయి.

Also Read: ఎన్-95 మాస్క్ ను మళ్లీ మళ్లీ వాడాలంటే ఇలా చెయ్యండి!

మరోవైపు రాష్ట్రంలో కరోనా టెస్టులు జోరుగా నడుస్తున్నాయి. మరోసారి 60 వేల వరకు టెస్టులను నిర్వహించారు. కొత్తగా వ్యాప్తంగా 62,736 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 17,30,389కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతీ 10 లక్షలమంది జనాభాకు సగటున 46,608 పరీక్షలను నిర్వహించినట్లు ఆఫీసర్లు తెలిపారు.

పెట్రోల్‌ బంకుల్లో ‘చిప్‌’ ట్రిక్స్‌

0

petrol bunk
మోసం.. మోసం.. మోసం.. ఎందులో లేదు మోసం. సామాన్యులను మోసం చేయడమే ఈ వ్యాపారుల పనా..? అటు నిత్యావసరాల నుంచి మొదలు.. నిన్నటి పెట్రోల్‌ స్కాం వరకూ.. ప్రతిదాంట్లోనూ మోసం. తాజాగా.. అత్యాధునిక చిప్‌లతో పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న 8 మంది పెట్రోల్‌ పంప్‌ ఓనర్లతోపాటు 13 మందిని అరెస్ట్ చేశారు. 11 బంకులను సీజ్‌ చేశారు. 14 ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌, 8 డిస్‌ప్లే బోర్డులు, 3 సీలింగ్‌ కేబుల్‌ బండిల్స్‌, మదర్‌‌బోర్డు, ఐ ట్వంటీ కార్‌‌ స్వాధీనం చేసుకున్నారు. ట్యాంపరిం చేస్తూ రూ.లక్షలు కొల్లగొట్టిన ముఠా వివరాలను ఈ మేరకు సీపీ సజ్జనార్‌‌ వెల్లడించారు. ఈ ‘చిప్‌’ ట్రిక్స్‌తో లీటర్ పెట్రోల్‌కు 970 ఎంఎల్‌ మాత్రమే వస్తుంది. అంటే.. ఈ లెక్కన ఒక్కో పెట్రోల్‌ పంపు నుంచి ఏ స్థాయిలో మోసం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మదర్‌‌ బోర్డు ఏర్పాటు ఏలూరు నివాసి అయిన సుభాని బాషా అతని గ్యాంగ్‌ పని అని సీపీ చెప్పారు.

Also Read: కరోనా టైంలో ఫుడ్‌ వేస్టేజ్‌ తగ్గిందంట..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని లీగల్‌ మెటరాలజీ కంట్రోలర్‌‌ సమన్వయంతో సాగించిన ఈ ఆపరేషన్లో ఏపీలోని 22, తెలంగాణలో 11 పెట్రోల్‌ పంపులపై ఏకకాలంలో దాడిచేశారు. ఈ సరికొత్త కుంభకోణాన్ని ఛేదించి అక్రమార్కుల ఆట కట్టించారు. ఇంత ఆధునిక, సాంకేతికత నైపుణ్యంతో కూడిన మోసాన్ని దేశం ఇంతవరకూ చూడలేదు. హైదరాబాద్‌లో బయటపడిన ఈ స్కాం మూలాలు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అంచనాకు వచ్చారు.

వినియోగదారులకు ప్రత్యక్షంగానే శఠగోపం పెడుతున్న ఈ అత్యాధునిక స్కామ్‌కు రూపకల్పన చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయా జిల్లాల్లోనూ మూలాలు వెతుకుతున్నారు. డిస్‌ప్లే వెనకాల చిప్‌ అమర్చడం ద్వారా కంటికి కనిపించకుండా.. తనిఖీలకు దొరకకుండా కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ స్కామ్‌కు సూత్రధారి అయిన సుభానితోపాటు ముంబైకి చెందిన జోసఫ్‌, థామస్‌ అనే వ్యక్తులు కూడా ఉన్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. సుభాని, బాజి బాబా, మాదాసు గిరి శంకర్‌‌, ఇప్పిలి మల్లేశ్వర్‌‌రావు కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు జిల్లాలో ఈ చిప్స్‌ అమర్చినట్లు విచారణలో తేలింది. తెలంగాణలో 4 బీపీసీఎల్‌, 2 హెచ్‌పీసీఎల్‌, 5 ఐఓసీఎల్‌ బంకుల్లో అమర్చారు. రంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, హుజూర్‌‌నగర్‌‌, మిర్యాలగూడ, ఆర్‌‌సీపురంలో గుర్తించారు.

Also Read: ముఖేశ్‌ ఫ్యామిలీ లగ్జరీ లైఫ్‌ అంచనా వేయగలమా..!

ఒక సాఫ్ట్‌వేర్‌‌, ఒక ప్రోగ్రాం డిజైన్‌ చేయడానికి నిందితులు చాలా తెలివిగా ఆలోచించారు. అయితే.. ఇదంతా బంక్‌ ఓనర్లకు తెలియకుండా అయితే జరగదు. ఆయిల్‌ కార్పొరేషన్‌ సర్‌‌ప్రైజ్‌ విజిట్‌ చేయడం ద్వారా ఈ తతంగం అంతా వెలుగులోకి వచ్చింది. ఇక నుంచి ఆయిల్‌ కార్పొరేషన్‌ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్రలోని బంకుల నిర్వాహకులు ప్రత్యేక చిప్‌లు తెప్పించుకొని ఇలాగే మోసం చేస్తున్నారని.. ఈ విధానం మన తెలుగు రాష్ట్రాల దాకా అమల్లోకి తెచ్చారు. ఈ చిప్‌ అమర్చినందుకు ఒక్కో బంక్‌ యజమాని నుంచి సుభాని గ్యాంగ్‌ రూ.80 వేల నుంచి 1.20 లక్షల వరకు వసూలు చేస్తోందంట. 2018లో దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్‌ పంపుల్లో కొత్త సాఫ్ట్‌ వేర్‌‌ ఇన్‌స్టాలేషన్‌ చేశారు. ఈ తర్వాత 2019 నుంచి సుభానీ గ్యాంగ్‌ తమ ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు సీపీ వెల్లడించారు.

అదే ‘వి’ సినిమా కొంప ముంచిందా?

Nani V movie
హీరోలు నాని, సుధీర్ బాబు కలిసి నటించిన ‘వి’ చిత్రం నిన్ననే ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘వి’ సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు తొలుత మొగ్గుచూపాడు. అయితే అమెజాన్ ప్రైమ్ మంచి ధర ఇవ్వడం.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘వి’ మూవీని ఓటీటీ రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపారు.

Also Read: థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎలా?

నాని 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాకు ముందు విడుదలైన ట్రైలర్, టీజర్, ఫస్టు లుక్ వంటిలో హీరో నానిని, సుధీర్ బాబు డిఫరెంట్ చూపించారు. దీంతో ఈ సినిమా మంచి కంటెంట్ తో వస్తుందని అంతా భావించారు. అయితే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాత్రం టాలీవుడ్లో ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా వచ్చిన పాతకథనే రోటిన్ గా తెరపై చూపించాడు.

గత మూడునెలలుగా టాలీవుడ్ నుంచి ఒక్క భారీ సినిమా కూడా ఓటీటీ రాలేదు. ‘వి’ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి మంచి ప్రచారం చేసింది. హీరోయిన్లు నివేదా థామస్, అదితిరావులు కూడా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా మాత్రం ఎక్కడా ప్రేక్షకులను అంచనాలను అందుకోలేక మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

దర్శకుడు ఇంద్రగంటితో నాని చేసిన సినిమాలకు భిన్నంగా ‘వి’ని తెరకెక్కించారు. ఇంద్రగంటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. నాని, సుధీర్ బాబులను కొత్త తరహాలో చూపించాడు. అయితే సినిమాలో సెకాండాఫ్ ఫ్లాప్ బ్యాక్, ట్వీస్టులు, డ్రామా లేకపోవడం, క్లైమాక్స్ ఆకట్టుకోలేక పోవడంతో సినిమా ప్లాపు టాక్ సొంతం చేసుకుంది. సినిమాపై పెరిగిన విపరీతమైన అంచనాలు కూడా సినిమాను దెబ్బతిసినట్లు తెలుస్తోంది. ‘వి’ సినిమాను నిర్మాత దిల్ రాజు ఓటీటీకి ఇచ్చి సేఫ్ జోన్లోకి వెళ్లాడనే అభిప్రాయం టాలీవుడ్ సర్కిల్స్ లో విన్పిస్తోంది.

కరోనా కాఠిన్యం: చెదిరిపోతున్న జర్నలిస్టులు

Journalistsఇంతకీ నా ఊరేది..!
‘‘పుట్టిందోకాడా..
సదివింది మరోకాడా..
బతికేది పట్నంలా..
కరోనా జిందగీని ఉల్టాపల్టా చేసింది..
ఇప్పుడు నేనేక్కడికి పోవాలె.
పుట్టిన ఊరికి పోవాల్నా…
అక్కడేవరున్నారు..?
సదువుకున్న కాడికెళ్లాలా..
చుట్టపు చూపు తప్పా మరేమీ లేకపాయే..
పట్నంల ఉండల్నా..
ఉండలేవ్పొమ్మనవట్టే…
మరినేనేడికి పోవాలే..?’’
మేం పడ్డ కష్టాలు మీరు పడొద్దు బిడ్డా అంటూ అమ్మనాన్న మంచిగ సదువుకోవాలని చెప్పిళ్లు. ఊళ్లో సదివితే సోపతి ఎక్కువై పాడైతనని చుట్టాల ఇంట్లో ఉంచి బడికి తోలిండ్రు. పుట్టిన ఊళ్లో నాకు తెలిసినోళ్లు తక్కువ. పండుగ.. పబ్బానికి పోతే ఇంటి పక్కన ఉన్నోళ్లో.. లేక తోటి వయస్సుల్లో కొంచెం ఎరుకయిండ్లు. ఇగ సదువు పూర్తి కాగానే ఉద్యోగమంటూ పట్నం పోయినా..ఊరి బాట తొక్కుడు తక్కువైంది. పని బిజీలో ఉన్న సోపతిగాండ్లకు ఫోన్చేసుడు మరిచినా.. ఇగ పెళ్లి చేసుకున్నాకా కుటుంబ.. ఉద్యోగం.. జీవితం ఈ మూడే కనిపించినై. ఉన్నతంగా బతకాలనే ఆశతో అందరినీ మరిచిన. ఉద్యోగమే నేనుగా బతికిన. కాలంతో పరుగు పెట్టినా. ఉన్న బంధాలు తెగిపోయినై. కష్టమస్తే పలుకరించే వాళ్లే లేరు. పట్నం కదా.. పక్కనున్నోళ్లు కూడా బిజీ. వారికీ వారి జీవితం.. వారి కుటుంబం. ఇక మనతో ముచ్చట్లు ఎక్కడివి. అంతా యాంత్రిక జీవనం. అలా అక్కడా ఎవరూ లేకుండా బతికీడ్చిన.
 

Also Read: సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం..

    • జీవితం కంగాలైంది..
      జీవితంలో ఇంత పెద్ద ఆపద వస్తదనుకోలే. కరోనా జీవితాన్ని కంగాలు..కంగాలు చేసింది. బతుకుమీద భయాన్ని తెచ్చింది. బయటికి వెళ్లకుండా చేసింది. మరి బయటికి పోకపోతే బతికేదెట్లా..! కరోనాకు ప్రంపచమే వణకింది. ఇట్లనే ఉండాలని శాసించింది. ఇంకేముంది కంపెనీలు దివాలా తీశాయి. ఉద్యోగాలు పీకాయి. బతుకు బజార్ల పడింది. పట్నంలో విపరీతంగా కరోనా కేసులు. ఉపాధి కోసం రమ్మన్న పట్నమే.. ఇగా ఇప్పుడు ముల్లెమూట సదురుకొని పోమన్నది. ఇక్కడ ఉంటే బతకలేవంటూ తరిమిది. నీకిడా ఎవరూ లేరు..నీకెవరూ ఏమీ కారని బోధ చేసింది.
    •  మరి ఏడికి పోవాలె..
      సరిగ్గా గప్పుడే బుర్ర గిర్రున తిరిగింది. ఆలోచన మొదలైంది. భయం పట్టుకుంది. మెదట్ల అతలాకుతలమైంది. ప్రశ్నల మీద ప్రశ్నలు మనసును తొలిచివేశాయి. నేను ఎవరూ.. ఎక్కడ పుట్టాను.. ఎక్కడ పెరిగాను. ఏడ సదివినా.. ఏడ కొలువు చేస్తున్న అని. గిప్పుడెక్కడికి పోవాలె. ‘‘ఇంతకీ నా ఊరేదీ’’ అనే ఆలోచనలు బయలెల్లాయి. ఒళ్లంతా వణుకుడు పట్టింది. చెమటలు పట్టాయి. ఎట్లా బతకాలనే రద్దీ పట్టుకుంది. ఒక్కసారిగా నడి సంద్రంలో పడినట్లు అనిపించింది. చుక్కాని లేని నావ అయింది నా బతుకు. పుట్టింది ఓ కాడా.. సదువుకున్నది ఓ దగ్గరా.. కొలువు చేసేది పట్నంలా.. ఏదీ ఎంచుకోవాలె. ఏ ఆలోచన రావట్లే. మనసు కకావికలం అవుతున్నది. సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నది. నా జీవితం ఏంది..? నా బాట ఎటూ అనే ఆలోచన వేధిస్తున్నది. అప్పుడు మొదలైంది నాలో ఓ ప్రశ్న.. ‘‘ఇంతకీ నా ఊరే ఏదీ’..!!
    •  పట్నంలనే ఉంటే..
      పీజీలు చేసిన. పట్టాలు తీసుకున్న. ఇన్నాళ్లు కాలర్ కు మరక అంటకుండా.., ఇస్ర్తీ నలుగుకుండా బతికిన. గిప్పుడు పల్లెకు పోవుడేంది.. ఉద్యోగం రాదా.. బతకలేమా.. అనుకుంటే గప్పటికే ధైర్యమనిపిస్తది కనీ.., ముందు సూత్తే ఏ తోవ లేదు. ఉద్యోగం మళ్లీ చేస్తమనే ఆలోచన అందడం లేదు. బడాబడా కంపెనీలే మూసేస్తున్నరు. ఏండ్లకేండ్లు అనుభవం ఉన్న సార్లను వద్దంటున్నరు. మనం ఓ లెక్కన. చిన్నాచితక ఉద్యోగమూ దొరకేలా లేదు. ఇన్నాళ్లు ఓ మెకానిజం లైఫ్ కు అలవాటు పడిన బతుకాయే.. మరోపని సహించడం లేదు. మరి ఎట్లా..? రోజులు ఎల్లదీసేదెట్లా..! అంతా అంధకారం. అద్దె కొంప..రోజు తిండితిప్పలు. కొలువు లేదాయే.. పైకం రాకపాయే. ఇక్కడ ఉంటే బతుకుమీద ఆశ సచ్చేలా ఉన్నది. అందుకే పట్నాన్ని ఇడిసి పెడుదామనుకున్న. ముల్లెమూట సదిరిన. అందరూ ఊళ్లకు పయనమవుతుంటే నేను పోదామనుకున్న అప్పుడు మొదలైంది ఆలోచన ‘ఇంతకీ నా ఊరేదని’..!!
    •  సదువుకున్నకాడికి పోతే..
      అక్కడ ఎవరున్నారు..? సుట్టంగా పోయి సదువుకున్నం. ఉన్నత చదువుల కోసం వారిని వదిలేసి మరెక్కడికో పోయిన. కలిసి సదువుకున్న దోస్తులను ఉద్యోగం.. సంపాదన, భార్యాపిల్లలు అంటూ మరిచిపోయిన. ఇప్పుడు నన్ను గుర్తుపట్టే బడి దోస్తులను ఎంకులాడడం కష్టం. మరి సుట్టాల ఇంటి దగ్గర ఉందామంటే.. ఉద్యోగం ఉన్నన్ని రోజులు పట్టించుకోని నన్ను వాళ్లు రానిస్తరా.. ఒకవేళా రానిచ్చినా నేను ఏ ముఖం పెట్టుకొని వెళ్లేది. సరే అన్ని చంప్పుకొని పోయినా.. ‘సుట్టం మూడొద్దుల సంబురమే’ అన్నట్టుగా ఒకటి రెండు రోజులే. మరి జీవితాంతం ఎట్లా.. నా భార్యాపిల్లలు ఎలా..? అనే జఠిలమైన ప్రశ్నల్లోంచి మళ్లీ ఉదయించింది “ఇంతకీ నీ ఊరేదీ’’..?

Also Read: కేసీఆర్ రెవిన్యూ ప్రక్షాళన విప్పిన ఫామ్ హౌస్ గుట్టు..!

  •  పల్లె రానిస్తుందా..!
    సదువులంటూ నా పల్లెకు దూరమైన. ఉద్యోగమంటూ పుట్టిన ఊరిని మొత్తానికే మరిసిన. పండుగ పబ్బానికి వచ్చినప్పుడు.. కలిసే స్నేహాన్ని నిలుపుకోలేక పోయిన.
    పక్క ఇండ్లల్లో ఉండే బంధాలను ఆప్యాయంగా పలుకరించలేక పోయిన. ఏదో నా ఆస్తి వాళ్లు గుంజుకున్నట్టు పట్నం నుంచి ఊళ్లకే వచ్చి సక్కగా ఇంట్ల సొత్తి. దుకాణానికి పోవాలే అన్నా.. అమ్మనాన్ననే పంపితి. బయటికి పోతే ఎక్కడ నా ఆస్తులు కరిగిపోతాయోననే ఇగో ఫీలింగ్తో పట్నంలా ఉన్నట్లే నాలుగు గోడల మధ్య టీవీ, కంప్యూటర్ అంటూ గడిపితిని. ఇగ నా ఊరిని నేనెప్పుడు సూత్తిని. నన్ను ఊరు ఎప్పుడు చూసే. ఊర్లో ఎవలు తెలిసినోళ్లు ఉన్నరు. ఎవ్వళ్లు తెల్వదు. ఉద్యోగం.., పైసల మాయలో పడి.. నాకు నేనే అనే యావలో బతికిన. బంధాలను మరిచినా. మా అమ్మనాన్నల పేర్లు చెబితే తప్పా నేను ఎవరికీ తెలియదు. పలుకుబడి లేకపాయే. మరి ఇప్పుడు నా ఊరు నన్ను గుర్తుపడుతుందా.. నన్ను రానిస్తుందా.. నేను మరిచిన తొవ నన్ను స్వాగతిస్తుందా..! బంధాలు నన్ను మళ్లీ అల్లుకుంటాయా..! నా పల్లె ‘తల్లి’ నన్ను కడుపున పెట్టి చూసుకుంటదా..! ఉపాధినిచ్చి మళ్లీ నా జీవితానికి చిగురినిస్తదా..! అసలు నా ఊరు నన్ను గుర్తుపడుతదా.! గుర్తు పట్టకపోతే.. రానివ్వకపోతే. ‘‘మరి ఇంతకీ నా ఊరేది’’..? నా బతుకేది..!

“బతుకుపోరులో అన్ని మరిసి ఆగమైన మనిషిని నేను. ఇప్పుడు నా వాళ్లు అనే బంధాల కోసం పరుగెడుతున్న జీవిని నేనే. ఇదంతా కరోనా పుణ్యమే. నువ్వు ఒంటరి అని తెలిసేలా చేసింది. అసలు బతుకు ఇది కాదని జ్ఞానోదయం చేసింది. కొత్త బతుకుపై ఆశలు చిగురించేలా చేసింది.”

– నాగరాజు పల్లెబోయిన

ఏపీ ఖజానా ఆదాయం కోసం జగన్ జిమ్మిక్కులు చూడండి..!

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM YS Jagan  Mohan Reddy's YSRCP govt - India News

ప్రస్తుతం ఏపీలో ఏ పని జరగాలన్నా అప్పు చేయడమే శరణ్యం లాగా అయిపోయింది పరిస్థితి. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ జగన్ అభివృద్ధిని గాలికి వదిలేశాడు అన్న మాటలకు ఊతం ఇచ్చేలా ప్రతీ నెలా ఎక్కడో ఒకచోట అప్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతున్నారు. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ప్రస్తుతం మరుగున పడిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లేవనెత్తేందుకు జగన్ ఖచ్చితంగా కొత్త ఆదాయ మార్గాలను వెతకాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో అతను ఎంతో తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. వాటి గురించి మాట్లాడుకుంటే…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎవరూ పట్టించుకోని అంశాలలో పన్నులు, ధరలు పెంచి రాష్ట్రానికి కనీస ఆదాయాన్ని సమకూర్చాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మద్యం ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ ధరలు భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు వంటివి ఎంతో సైలెంట్ గా జగన్ కొత్త ప్రక్రియలో మమేకమైపోయాయి. దీనిని కూడా ప్రజానీకం ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. 

వీటిలో ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం వల్ల అసలు తెలియకుండానే భారీ లాభం రాష్ట్ర ఖజానాకు చేరేస్తుంది. పైగా ఈ మూడు రాజధానుల దెబ్బతో ఒక్కసారిగా అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇకపోతే ఈ సంవత్సరంలోనే రెండుసార్లు కరెంట్ చార్జీలు పెంచేశారు. సామాన్య ప్రజలపై అధిక భారం పడేలా ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత రవాణా శాఖలో కూడా జగన్ మెల్లగా పన్నులు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే మనిషి కి ప్రతిరోజూ ఉండే అవసరాలలో ఇవి ఏవీ ఉండవు. అందుకే ఎప్పుడో ఒకసారి చెల్లించే  రూపాయి, రెండు రూపాయలు అటూ ఇటూ అయినా పట్టించుకోకుండా వెచ్చిస్తారు.

 

ఇక రవాణాశాఖలో పన్నుల విషయానికి వస్తే…. దాదాపు జగన్ టార్గెట్ రూ. 400 కోట్లు అని సమాచారం. అందుకు ఫోర్ వీలర్ లైఫ్ టాక్స్ పెంపుకు రంగం సిద్ధం చేశారు. దీని వల్ల రాష్ట్రానికి రూ. 140 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక టూ వీలర్ పై 2010 తర్వాత పన్నుని పెంచింది లేదు. ప్రస్తుతం ఇది 9.12 శాతంగా ఉంది. దీని వల్ల దాదాలు రూ. 180 కోట్ల రూపాయలు లాభం రానుంది. వ్యూహాత్మకంగా ఇలా జగన్ ఆదాయం పెంచేస్తున్న పద్ధతి చూసి విశ్లేషకులు నోర్లెళ్లబెడుతున్నారు.

కరోనాకి దూరంగా ‘పుష్ప’ ప్రత్యేక జాగ్రత్తలు !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు. నిజానికి ఆగ‌స్ట్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయాలని ప్లాన్ చేసి.. ఆ తరువాత ఆగిపోయారు. ఇక ఎట్టిపరిస్థితుల్లో ఈ నెల రెండో వారం నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని.. సెట్ కూడా వేశారు. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూట్ స్టార్ట్ చేస్తున్నాం అని అంతా రెడీ చేసుకున్నాక.. టీమ్ లోని ఓ సభ్యుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఇక షూటింగ్ ను వచ్చే నెలకు పోస్ట్ ఫోన్ చెయ్యకతప్పలేదు. మరి వచ్చే నెల లోపు కరోనా తగ్గుతుందని నమ్మకం ఏముంది.. అందుకే ఈ నెలలోనే స‌భ్యులంద‌రికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ ఈ నెలాఖరులోగా జన సాంద్రతకు దూరమైన ప్రాంతానికి తరలించాలని టీమ్ భావిస్తోంది.

Also Read: పూరి కథలు.. మహేష్ తోనా ? రానాతోనా ?

అలాగే ఈ సినిమా షూట్ జరుగుతున్న అంత కాలం ముఖ్యంగా పుష్ప చిత్రబృందం వారు ఇత‌రుల‌ను కలిసే అవకాశం లేకుండా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని.. ఒకవేళ ఎవరికైనా అర్జెంట్ గా బయట వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే.. ఇక వారిని మళ్లీ వెంటనే టీమ్ లోకి జాయిన్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేకర్స్ పతిష్ఠంగా నిర్ణయించారు. ఇక ఇత‌రులు పుష్ప టీం ఉన్న ప్ర‌దేశానికి వచ్చే అవకాశం లేకుండా కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారట. వచ్చే నెల 15 నుండి మొదలవ్వనున్న ఫస్ట్ షెడ్యూల్ లో ముందుగా బన్నీ – రష్మిక పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సాంగ్ తరువాత సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ షూట్ ను కూడా పూర్తి చేస్తారట. ఈ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకుంటున్నారు.

Also Read: బ్రేకప్ లు, డైవోర్స్ కథలో రామ్ ‌!

ఇక ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. కానీ విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్రలో మరో తమిళ్ హీరో ఆర్యను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఆర్య గతంలో బన్నీ వరుడు సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఇక రష్మిక కెరీర్ కూడా పీక్ కి వెళ్ళిపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చేసే చిత్రాలేంటి?

రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ ఫెయిల్ అయ్యి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన మెగా స్టార్ చిరంజీవి పక్కా ప్రణాళికతో సినిమాలు చేస్తున్నారు. మంచి కథా, కథనంతో సినిమాలు చేస్తున్నారు. సైరా తర్వాత ఓటమి ఎరుగని దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు.

Also Read: బ్రేకప్ లు, డైవోర్స్ కథలో రామ్ ‌!

లాక్ డౌన్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడింది.కరోనా తగ్గాక మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆచార్య మూవీ తర్వాత చిరంజీవి చేసే సినిమా ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది.

‘ఆచార్య’ తరువాత చిరంజీవి చేతిలో రెండు సినిమాలున్నాయి. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ రిమేక్ లో తాను నటిస్తానని చిరంజీవి ప్రకటించారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సుజీత్ కు అప్పగించారు. ఇప్పుడు సుజిత్ ను తప్పించారనే టాక్ నడుస్తోంది. వివి వినాయక్ ఈ ప్రాజెక్ట్ చేపట్టవచ్చని అంటున్నారు.

Also Read: పూరి కథలు.. మహేష్ తోనా ? రానాతోనా ?

తమిళం ‘వేదాళం’ రిమేక్ ను చిరంజీవితో చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. దీనికి మెహర్ రమేశ్ ను దర్శకుడిగా ఎంచుకున్నట్టు తెలిసింది. అతడు కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సో చిరంజీవి వరుసగా రెండు సినిమాలు లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.