Home Blog Page 8321

హవ్వా.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల కులాలు వెతికారంట

కులం మీకు ఏమిచ్చింది.? అంటే.. పేరు ఇచ్చింది.. పరపతి ఇచ్చింది. సమాజంలో ఇప్పుడు క్రేజ్ కూడా ఇస్తోందని అంటున్నారు పలువురు సెలెబ్రెటీలు.. తెలంగాణలో పెద్దగా కులపట్టింపులు లేకున్నా.. ఏపీలో మాత్రం ఈ కులాల కొట్లాట ఎక్కువ. అందుకే అక్కడ రాజకీయం రెడ్డి, కమ్మ, కాపులుగా చీలిపోయింది. రాజకీయాల్లోనే కాదు.. ఇప్పుడు సినిమాలు.. దాన్ని దాటి బిగ్ బాస్ వరకు ఈ కుల కుంపట్లు పాకాయి.. నిజంగా నిజమిదీ..

Also Read: గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!

సెలబ్రిటీలకు సంబంధించి ఎవరైనా వారి సక్సెస్‌ పాయింట్స్‌ ఏంటని గమనిస్తే.. వారు ఎలా ఆ స్థాయికి వచ్చారు..వారికి రోల్‌ మోడల్‌ ఎవరు.. తాము వారిని ఎలా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని నెట్‌లో సెర్చ్‌ చేస్తుంటారు. కానీ.. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విభిన్నం. కులం పిచ్చి తొలగడం లేదు. సక్సెస్‌ అయిన వారి హిస్టరీ చూడకుండా.. వారి కులాలను వెతుకుతున్నారు.

గతంలో బ్యాడ్మింటన్‌ స్టార్‌‌ పీవీ సింధు కూడా ఒలింపిక్స్‌లో సంచలన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ పొందింది. ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సింధు గురించి విశేషాలు తెలుసుకోడానికి ఇంట్రెస్ట్‌ చూపారు. కానీ.. మన తెలుగు వారు మాత్రం ఆమె కులం గురించి  ఇంట‌ర్‌‌నెట్‌లో వెతికారు. ఆమె కులం సెర్చ్ చేయ‌డం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. గూగుల్‌లో సింధు అని పేరు కొట్టగానే పక్కన క్యాస్ట్‌ క్లిక్‌ చేస్తే డీఫాల్ట్‌ వచ్చింది. దీంతో తీవ్ర విమ‌ర్శలు వచ్చాయి. అయినా.. మ‌నోళ్ల తీరులో మార్పు ఇప్పటికీ మార్పు రావడం లేదు.

Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

సోష‌ల్ మీడియా జోరు పెరిగాక ఈ కుల సంబంధిత చ‌ర్చలు, వాదోప‌వాదాలు మ‌రీ ఎక్కువయ్యాయి. తాజాగా బిగ్ బాస్ షో మొద‌లైన నేప‌థ్యంలో అందులో పార్టిసిపెంట్ల కులాల గురించి ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం. యాంక‌ర్ లాస్య హౌస్‌లోకి అడుగు పెట్టగానే ఆమె రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందింద‌ని.. ఆమెకు స‌పోర్ట్ చేద్దామ‌ని ఒక వ‌ర్గం వాళ్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. మ‌రోవైపు గంగ‌వ్వ మున్నూరు కాపు అని.. ఆమెను గెలిపించుకుందామ‌ని ఇంకో వ‌ర్గం ప్రచారం మొద‌లుపెట్టింది.

మిగ‌తా పార్టిసిపెంట్లలో కొంద‌రి కులాలు కూడా వెలికితీసే ప్రయత్నం చేశారంట. ఇది చూసి తెలుగు రాష్ట్రాల జ‌నాల్లో కుల పిచ్చి ఈ స్థాయికి చేరిందేందంటూ ట్రోల్‌ నడుస్తోంది. మ‌న‌వాళ్లు మార‌ర‌ని, ఈ జాఢ్యం ఎప్పటికి వ‌దులుతుందో తెలియకుండా పోయిందని పెదవి విరుస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు సిగ్గుతో తలదించుకోవాలి

సహజంగా ఒక భావం అందరిలో వుంది. దేశంలో దక్షిణాది మిగాతా ప్రాంతాల కన్నా సామాజిక రంగం లో చాలా ముందున్నాయని. కానీ అది తప్పని తేలింది. జాతీయ గణాంక కార్యాలయం 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు నిర్వహించిన సర్వే లో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. ఇందులో అక్షరాస్యత లో చూసుకుంటే మొదటి అయిదు స్థానాల్లో దక్షిణాది నుంచి కేవలం ఒక్క కేరళ నే వుంది. మిగతా రాష్ట్రాలేవీ దరిదాపుల్లో కూడా లేవు. అభివృద్ధి కి ఆమడ దూరంగా ఉంటాయని ప్రత్యేక ప్రతిపత్తి తో అధిక నిధులు తీసుకునే కొండప్రాంతాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లు మొదటి అయిదు స్థానాల్లో చోటు సంపాదించుకున్నాయి.ఈశాన్య భారతానికి సంబంధించిన అస్సాం మొదటి అయిదు స్థానాల్లో నిలిచింది.

Also Read : బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?

తెలుగు రాష్ట్రా లెక్కడ?

వినటానికే మనస్కరించని స్థాయిలో మన ఫలితాలు వున్నాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు , సంస్కరణలు చేసామని గొప్పలు చెప్పుకొనే మన రాజకీయ నేతలు వాళ్ళ గొప్ప లేమిటో తేటతెల్లం చేసే వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. మొత్తం దేశం లో కిందనుంచి అక్షరాస్యతలో అధమ స్థానం సంపాదించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ కి దక్కినందుకు మనమందరం సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణా కూడా తక్కువేమీ తినలేదు. నీతో పోటీ నేనున్నాని కిందనుంచి నాలుగో స్థానం లో వుంది. ఈ రెండు రాష్ట్రాలకన్నా ఉత్తర ప్రదేశ్ ఐదో స్థానం లో వుండి మెరుగనిపించింది. ఆంధ్ర ప్రదేశ్ 66.4 శాతంతో అట్టడుగున వుంటే  హైదరాబాద్ నగరాన్ని కలిగివున్న తెలంగాణా 72.8 శాతం తో చివరి అయిదు స్థానాల్లో చోటు దక్కించుకొని ‘ఘనత ‘ సాధించాయి. జాతీయ సగటు 77.7 శాతం కంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు దిగువన వుండి మనందరికి తలదించుకొనే పరిస్తితి  కల్పించాయి.

దీనికి బాధ్యులెవరు?

ఒకరిమీద ఒకరు పోటీపడి అభివృద్ధి లో ముందున్నామని చెప్పుకొనే ఇరుపార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇటీవలికాలంలో ప్రభుత్వాలు నడిపిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వున్న తెలుగు దేశం, వై ఎస్   రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాంగ్రెస్, కెసిఆర్ ముఖ్యమంత్రిగా వున్న తెరాస లు దీనికి ఏమి సమాధానం చెబుతాయి. ( ఈ సర్వే జరిగేనాటికి వై ఎస్ ఆర్ సి పి అధికారం లో లేదు కాబట్టి మినహాయిద్దాం ). అభివృద్ధి అంటే ఏమిటి? ఖద్దరు బట్టలు, పచ్చ బట్టలు, గులాబి బట్టలు కాదు. సామాజిక రంగం లో మనిషి ఎంత నాగరికత చెందాడనేది. దానికి ముందుగా కొలిచే కొలబద్ద కనీస అక్షరాస్యత . ఇందులో దేశం లోనే అధమ స్థానం లో నిలిపిన ఘనత సాధించిన ఈ రాజకీయ నాయకులకు అభివృద్దిని గురించి గొప్పలు చెప్పుకొనే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా నోరు మూసుకొని తమ చేతగాని తనానికి ఓ మూల కూర్చోవటం మంచిది. వీళ్ళు మన చెవిలో పూలు పెట్టి కులాలు, మతాలూ, ప్రాంతాలు,వర్గాలు పేరిట ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని తెలుసుకోండి.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

ఆసక్తి కలిగించే మరిన్ని గణాంకాలు 

సరే కనీస అక్షరాస్యత లో వెనకబడ్డామనుకున్నా , చదువుకున్న వాళ్ళలో నైనా హైస్కూల్ విద్యలో మనం ముందున్నామా అంటే అదీ లేదు. దేశంలోని మొదటి అయిదు స్థానాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడా పత్తా లేవు. జాతీయ సగటు కన్నా వెనకబడి వున్నాయి. ఇందులో తెలంగాణా కొంత మెరుగు. జాతీయ సగటు కి దగ్గరలో వుంది. ఆంధ్రలో పరిస్తితి అదీ లేదు. ఇక గ్రాడ్యుయేట్ ల శాతం చూసుకున్నా ఒక్క తెలంగాణా నే మూడో స్థానం లో వుంది , అదీ హైదరాబాద్ వుంది కాబట్టి. ఆంధ్ర ఇందులోనూ జాతీయ సగటు కి దిగువనే వుంది. ఒక్క సాంకేతిక/వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రం ఆంధ్ర మూడో స్థానం లో వుంది. తెలంగాణా ఏడో స్థానం తో సరిపెట్టుకుంది. ఒక విషయం లో మాత్రం రెండు రాష్ట్రాలు ముందంజ లో వున్నాయి. అది ప్రైవేటు స్కూళ్ళలో విద్యాభ్యాసం చేయటంలో. ప్రాధమిక విద్య నుంచి హైస్కూల్ విద్య వరకు చూస్తే ప్రభుత్వ పాటశాలలు కాకుండా ప్రైవేటు స్కూళ్లలోనే విద్యనభ్యసించే విద్యార్ధులు మన రాష్ట్రాల్లో ముందంజ లో వున్నారు. తెలంగాణా మొదటి స్థానం లో, ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానం లో నిలిచాయి. వీటితో పోటీగా మూడో స్థానం లో హర్యానా నిలిచింది. అంటే విద్య కోసం అధిక డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళలో చదివించటం మన రెండు రాష్ట్రాల్లో ఎక్కువయ్యింది. ప్రభుత్వ స్కూళ్ళ పై పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం లేకపోవటమే దీనికి కారణం. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వ స్కూళ్ళ ఈ పరిస్థితి కి ఇన్నాళ్ళు మనల్ని పరిపాలించిన పాలకులు కాదా?

భాషా మాధ్యమం పై ఆసక్తి గలిగించే గణాంకాలు 

తెలుగు లో విద్యాభ్యాసం జరగాలా లేక ఇంగ్లీష్ లో విద్య బోధన జరగాలా అని మన రాష్ట్రాల్లో చర్చ జరగటం , అది ఆంధ్ర ప్రదేశ్ లో వివాదాంశం గా మారటం మనందరికీ తెలిసిందే. దీనిపై జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన అంశాలు ఆసక్తికరంగా వున్నాయి. మొత్తం దేశం లో మాతృ భాషలో కాకుండా ఆంగ్లం లో స్కూలు విద్య ని అభ్యసిస్తున్న రాష్ట్రాల్లో కేరళ అగ్రభాగాన వుంది. అక్కడ మలయాళం లో కాకుండా ఆంగ్లం లో హై స్కూలు విద్యనభ్యసించే విద్యార్ధులు 78.8 శాతం మంది వున్నారు. ఆ తర్వాత స్థానం లో తెలుగు విద్యార్ధులు వున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 74.8 శాతం మంది విద్యార్ధులు ఆంగ్లం లో విద్య నభ్యసిస్తున్నారు. ఆశ్చర్యకరంగా దక్షిణాది లో మిగతా రాష్ట్రాలు కర్ణాటక లో 40.4 శాతం మంది, తమిళనాడు లో 37.4 శాతం మంది మాత్రమే ఆంగ్లం లో విద్య నభ్యసిస్తున్నారు. అదే మిగతా భాషా విద్యార్ధుల్లో అతి తక్కువమంది మాతృ భాష కాకుండా ఆంగ్లం లో స్కూలు విద్య నభ్యసిస్తున్న వాళ్ళలో పశ్చిమ బెంగాల్ ప్రధమ స్థానం లో వుంది. అక్కడ కేవలం 4.9 శాతం మంది మాత్రమే ఆంగ్ల మాధ్యమం లో చదువుతున్నారు. దిగువ నుంచి ఆ తర్వాత స్థానాల్లో గుజరాతీలు ( 12.1 శాతం), అస్సామీస్ ( 18.4 శాతం), హిందీ మాతృ భాషా పరులు  ( 19.5 శాతం) , మరాఠీలు (28.2 శాతం) మంది వున్నారు.

దీన్నిబట్టి మొత్తం దేశం లో మాతృ భాష కాని పరాయి భాషలో చదువుతున్న విద్యార్ధులు అత్యధికంగా   మలయాళీలు, తెలుగు వాళ్ళు  మాత్రమే. ఇక్కడ మాతృ భాషపై లెక్చర్లు దంచే వామపక్ష మేధావులు కేరళ లో మాత్రం ఆంగ్ల భాష ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు అధ్యయనం చేసిన అంశాల్లో తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యత లో దేశం లోనే వెనకబడి వుండటం, చదివే వాళ్ళలో కూడా ప్రభుత్వ పాటశాలల్లో చదివే వాళ్ళ సంఖ్య దేశం లోనే తక్కువగా వుండటం, మాతృ భాష లో విద్యాభ్యాసం చేయని విద్యార్ధుల్లో దేశం లోనే రెండో స్థానం లో వుండటం ఆసక్తికరం. ఈ గణాంకాలు వెల్లడించిన అంశాలు అధ్యయనం చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు తీసుకుంటారని ఆశించవచ్చా?  మరిన్ని ఆసక్తికర అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం, సెలవు.

Also Read : ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం!

చంద్రబాబును చావుదెబ్బ కొట్టేలా ప్లాన్ చేసిన వైసీపీ నాయకులు…?

YCP leaders target Chandrababu ...?

2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏం బాగాలేదు. టీడీపీ ఘోర పరాజయానికి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా ఒక రకంగా కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ శాయశక్తులా ప్రయత్నించినా ఎన్నికల్లో విజయం మాత్రం దక్కలేదు. లోకేశ్ పరాజయం కూడా టీడీపీకి ఒక విధంగా మైనస్ అయింది.

2019 ఎన్నికల ఫలితాల తరువాతైనా టీడీపీ బలపడుతుందని, నారా లోకేశ్ రాజకీయంగా మెరుగవుతాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబును మానసికంగా దెబ్బ తీసే విధంగా వైసీపీ నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు.

పేర్ని నాని, కొడాలి నాని టీడీపీ ఎమ్మెల్యే అయినా వైసీపీకి మద్దతు ఇస్తున్న వల్లభనేని వంశీ విమర్శలు చేసే సమయంలో పదేపదే లోకేశ్ ప్రస్తావన తెస్తున్నారు. వైసీపీ నేతలు లోకేశ్ వల్ల టీడీపీకి పెద్దగా ప్రయోజనం లేదని… భవిష్యత్తు రాజకీయాలను శాసించే స్థాయికి లోకేశ్ ఎదగలేడని విమర్శలు చేస్తూ చంద్రబాబును మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరూ టీడీపీ నాయకత్వం కోరుకోవడం లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ నేతల్లో, కార్యకర్తల్లో పరోక్షంగా ఒత్తిడిని పెంచుతున్నాయి. లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలహీనపడుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు లోకేశ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొడతారో చూడాల్సి ఉంది. వైసీపీ నాయకులు మొత్తానికి చంద్రబాబును చావుదెబ్బ కొట్టేలా ప్లాన్ చేశారనే చెప్పాలి.

అమరావతి రైతులపై ‘జగన్ మార్క్’ బెదిరింపు..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వికేంద్రీకరణ బిల్లును ఎంత ఆపాలని చూసిన సాధ్యం కాలేదు. సీఎం జగన్ పంతంతో శాసనమండలిని రద్దుచేసి మరీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకున్న సంగతి తెల్సిందే. ఇటీవలే గవర్నర్ కూడా ఈ బిల్లుపై సంతకం చేయడంతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది.

Also Read: అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?

ఈ మేరకు ప్రభుత్వం వీలైనంత తర్వాత రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం చర్యలను అమరావతి రైతులు, టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ మూడు రాజధానులను వ్యతిరేకించడంతో మిగతా ప్రాంతాల్లో టీడీపీ కనుమరుగయ్యేలా కన్పిస్తోంది. దీంతో టీడీపీ నేతలు మునుపటిలా ఈ విషయంలో మాట్లాడటం లేదు. కేవలం కోర్టుల్లో కేసులు వేస్తూ రాజధాని తరలిపోకుండా అడ్డుపడున్నారు.

ఈ విషయంలో టీడీపీ సైలంటవ్వడంతో అమరావతి రైతులే రాజధాని కోసం ముందుండి పోరాడుతున్నారు. దీంతో ప్రభుత్వం వారిని నయనోభయానో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం అమరావతి ప్రజలకు అండగా ఉంటామని చెబుతున్నా రైతులు పట్టువదలకపోవడంతో జగన్ సర్కార్ బెదిరింపు చర్యలకు దిగుతోంది.

ఆ ప్రాంతానికి చెందిన మంత్రి కొడాలి నాని ఇటీవల సీఎం జగన్ కు ఒక రాసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. పేదలకు చోటులేని ప్రాంతంలో ప్రజాప్రతినిధులు కూర్చుని శాసనాలు చెయ్యడం భావ్యం కాదని మంత్రి చెప్పుకొచ్చారు. అందుకే అమరావతిలో శాసనసభ కూడా వద్దని సూచించినట్లు మంత్రి జగన్ సూచినట్లు లేఖను విడుదల చేశారు.

Also Read: ఎంత ఘోరం:పాడైపోయిన బీర్లు ఏపీ ప్రజలు తాగారా?

అమరావతి రైతులు ఇలాగే పోరాటం చేస్తే మీకు శాసన రాజధాని కూడా ఉండదనే ఉద్దేశం వచ్చేలా ఈ లేఖ ఉందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. సీఎం జగన్ మొండితనం తెలిసిన అమరావతి రైతులు  రాజధాని ఉద్యమంపై వెనక్కి తగ్గి ప్రభుత్వానికి సహకరిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

వంద సీట్లు పక్కా.. ఇదే కేసీఆర్‌‌ అస్త్రం


కేసీఆర్‌‌.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌‌రావు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎం. కేసీఆరే లేకుంటే.. ఉద్యమాన్ని లేపకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదనడంలో ఎంతవరకూ సందేహం లేదు. ఉద్యమాన్ని ఉవ్వెత్తునకు తీసుకెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే దాకా కొట్లాడారు. అభిమానుల మెప్పుపొంది రెండు సార్లు రాష్ట్రానికి సీఎం అయ్యారు.

రాష్ట్రానికి సీఎం కావడం అంటే ఎంతో రాజకీయ చతురత ఉండాలి. అంతకుమించి మైండ్‌గేమ్‌ ప్లాన్‌ తెలిసి ఉండాలి. వీటిలో ఎవరైనా కేసీఆర్‌‌ తర్వాతే అని చెప్పాలి. ఆయన ఒక్కసారి మైక్‌ పట్టారంటే ఆ స్పీచ్‌ వినేందుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. పక్క రాష్ట్రం ఏపీలోనూ కేసీఆర్‌‌కు అభిమానులు ఉన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు సంధించాలన్నా.. వారి ఎత్తులు తిప్పకొట్టాలన్నా అది కేసీఆర్‌‌తోనే అవుతుంది.

ఏటా ఎలక్షన్లు వస్తున్నాయంటే కేసీఆర్‌‌ తనదైన స్టైల్‌లో ప్రజలను మభ్యపెడుతుంటారు. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా ప్రచారానికి వెళ్లిన ప్రతీచోట.. తాను సర్వే చేయించానని.. వంద సీట్లు మనవేనని.. టీఆర్‌‌ఎస్‌కు తిరుగులేదని చెబుతుంటారు. దాని ప్రకారమే టీఆర్ఎస్‌ సైన్యం కూడా ప్రచారం ప్రారంభిస్తుంటుంది. చివరగా అటూఇటుగా ఫలితాలు రానే వస్తాయి. దీంతో కేసీఆర్‌‌ మాటకు తిరుగులేదనేది మరోసారి నిరుపితమవుతుంది. అలాంటి వ్యూహమే ఆది నుంచి కేసీఆర్‌‌ అమలు చేస్తున్నారు. ఇప్పుడు గ్రేటర్‌‌ ఎన్నికలకు టైం వచ్చింది.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాము సర్వే చేయించామని.. వంద సీట్లకు అటు ఇటూగా వస్తాయని స్పష్టం చేశారు. కొంత మంది ఏదేదో ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. అదే సమయంలో.. గ్రేటర్‌లో బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఒకటో.. రెండో కార్పొరేట్ సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉన్న సీట్లు పోతాయని చెప్పారు.

వాస్తవానికి గత బల్దియా ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌ స్వీప్‌ చేసింది. టీడీపీ ఒకటి, కాంగ్రెస్‌ ఐదు వచ్చాయి. టీఆర్‌‌ఎస్‌ చెప్పినట్లుగానే 99 సీట్లు సాధించింది. ఈ సారి కూడా అదే స్థాయిలో ఫలితాలు సాధిస్తామన్న నమ్మకంతో ఉంది. అయితే.. ఈసారి కరోనా పరిస్థితులు.. తదితర కారణాలతో ప్రజల్లో కేసీఆర్‌‌ ప్రభుత్వంపై అంతోఇంతో మైనస్‌ ఏర్పడింది. వీటన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకే ఇదంతా మైండ్‌ గేమంటూ ప్రతిపక్షాలూ విమర్శిస్తున్నాయి. ఒకప్పుడు చెప్పినట్లుగా ఇప్పుడు రిజల్ట్స్‌ రావని అంటున్నాయి. త్వరలోనే జరగనున్న బల్దియా ఎన్నికల్లో ఎవరి పైచేయి నిలుస్తుందో చూద్దాం..!

అడవిని దత్తత తీసుకున్న యంగ్ రెబల్ స్టార్… ఖర్చెంతంటే…?

Young Rebel star who adopted the jungle

మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత చాలామంది సినీప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపారు. సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధి కోసం పాటు పడటంపై ప్రజల నుంచి ప్రశంసలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం వారికి భిన్నంగా అడవిని దత్తత తీసుకున్నాడు.

Also Read : గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!

ప్రభాస్ త‌న తండ్రి స్మార‌కంగా అడవిని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. 1650 ఎక‌రాల‌ విస్తీర్ణంలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న ఖాజీప‌ల్లి అర్బ‌న్ ఫారెస్ట్ ను దత్తత తీసుకోవడానికి ప్రభాస్ ముందుకు రావడం గమనార్హం. ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి కోసం మొదట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేస్తానని ప్రభాస్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చొరవతో ప్రభాస్ అడవిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. నిన్న ఈ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరగగా తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు అధికార పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్ కుమార్ రాష్ట్రంలో మరిన్ని అట‌వీ భూముల ద‌త్త‌త కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడతామని… అడవుల అభివృద్ధే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నామని తెలిపారు.

Also Read : డ్రగ్స్ వ్యవహారంలో ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ ?

జేపీ మృతిపై స్పందించిన ప్రధాని మోదీ..తెలుగులో నివాళి 

ప్రముఖ విలన్ కమ్ క్యారెక్టర్ కమ్ కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జేపీ నేడు స్వర్గస్తులయ్యారు. నేటి ఉదయం ఆయన బాతుర్రూంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే జేపీ మృతిచెందారు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ ప్రముఖ నటుడిని కోల్పోయింది. ఆయన అకాల మృతిపై చిత్రసీమలోని ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

తాజాగా దేశ ప్రధాని మోదీ సైతం జయప్రకాశ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమస్యలపై ప్రస్తావిస్తుంటారు. నేడు జయప్రకాశ్ మృతిచెందిన విషయం తెలుసుకున్న్ ప్రధాని మోదీ తెలుగులో ఆయనకు నివాళి ఘటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రధాని తెలుగులో ట్వీట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.

‘జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు.. తన దీర్ఘకాల సినీయాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు.. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు.. వారి కుటుంబ సభ్యులకు.. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.. ఓం శాంతి..’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.

Also Read: రిటైర్ మెంట్ తీసుకున్న జేపీ ఎందుకు వెనక్కొచ్చాడు?

జయప్రకాశ్ మృతిపై టాలీవుడ్ పరిశ్రమ దిగ్భాంతిని వ్యక్తం చేసింది. ఉదయం నుంచి టాలీవుడ్లోని సెలబ్రెటీలంతా ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు స్టార్లు సోషల్ మీడియాలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, మాస్ మహారాజ్ రవితేజ, సుధీర్ బాబు, దర్శకుడు అనిల్ రావుపూడి, సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ ప్రణీత తదితరులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

బ్రేకింగ్: సుశాంత్ కేసులో రియా అరెస్ట్

Riya chakravarthy
Riya chakravarthy

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో నటి రియాచక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేశారు. రియాను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈరోజు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ చివరికీ డ్రగ్ కేసు వైపు మరలుతోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో పోలీసులు చేపట్టిన విచారణలో డ్రగ్ మాఫియాతో సంబంధాలు వెలుగుచూశాయి. దీంతో సీబీఐ, ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేస్తుండటంతో బాలీవుడ్లో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: రియా వెనుక బాలీవుడ్ హీరోలు?

బాలీవుడ్ నటుడు సుశాంత్ కు రియా చక్రవర్తి ఆదేశాలతోనే డ్రగ్ ఇచ్చినట్లు ఆమె సోదరుడు విషోక్ చక్రవర్తి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. డ్రగ్ కేసులో సంబంధం ఉన్న పలువురిని ఎన్సీబీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వీరితోపాటు రియాచక్రవర్తిని సైతం పోలీసులు గత మూడురోజులుగా విచారించగా సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చిన మాట నిజమేనని అయితే తనకు డ్రగ్స్ అలవాటు లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

డ్రగ్ సరఫరా చేస్తున్న బాసిత్ అనే వ్యక్తి తనను ఐదు సందర్భాల్లో కలిచాడని.. అతడే తమ ఇంటికి వచ్చే వెళ్లేవాడంటూ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతోపాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు రియా చక్రవర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. చాలామంది స్టార్ల పేర్లు విన్పిస్తుండటంతో బాలీవుడ్ కలకలం మొదలైంది. ఎప్పుడు ఎవరు అరెస్టు అవుతారననే ఆందోళనలో బాలీవుడ్ చిత్రసీమ వణుకుతోంది.

Also Read: జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్?

ఇప్పటికే రియా చక్రవర్తి ఫోన్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రియాను కస్టడీలోకి తీసుకొన్న ఎన్పీబీ పోలీసులు వైద్యపరీక్షలు చేయించి అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. రియా తెలిపిన వివరాలను ప్రకారం బాలీవుడ్ స్టార్లను ప్రశ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. దీంతో డ్రగ్స్ ఉచ్చుకు బాలీవుడ్ పరిశ్రమ నిండా మునిగే అవకాశం కన్పిస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

డ్రగ్స్ వ్యవహారంలో ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ ?

 Prabhas heroine arrested in drugs case?

డ్రగ్స్ వ్యవహరం ఏదో ఒక సందర్భంలో ఒక భాషకు సంబంధించిన ఇండస్ట్రీని కుదిపేస్తూ వస్తోంది. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ సంవత్సరం జూన్ 14వ తేదీన మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కూడా డ్రగ్స్ కు ముఖ్య పాత్ర ఉంది. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారం మరో ఇండస్ట్రీని కుదిపేస్తుండటం గమనార్హం.

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగుతోంది. ప్రభాస్ తో బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటక సర్కార్ డ్రగ్స్ వ్యవహారం విషయంలో చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఈ కేసును విచారణ జరుపుతున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు ఇప్పటికే ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేశారు.

సంజన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆధారాలు బలంగా ఉండటం వల్లే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రస్తుతం సంజనను సోదాల అనంతరం అదుపులోకి తీసుకుని హెడ్ క్వార్టర్స్ లో విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సంజనా ఇంట్లో సోదాలు నిర్వహించారు. కన్నడ చిత్రపరిశ్రమ మత్తు వదిలే విధంగా పోలీసులు ఈ కేసులో ప్రముఖ నటులను అరెస్ట్ చేస్తుండటం గమనార్హం. సంజనను విచారించిన తరువాత పోలీసులు ఇంకా ఎవరెవరిపై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది.

స్ఫూర్తినిస్తున్న ఐపీఎల్ పాట.. వింటే అదుర్స్?

1

Ipl 2020 theme song

కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడి ప్రస్తుతం యూఏఈ దేశంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగబోతోంది. అయితే ఇప్పటికే చెన్నై జట్టులో 13మంది కరోనా బారిన పడి ఆ టీం మనోధైర్యం దెబ్బతింది. అయినా ఈ మెగా ఈవెంట్ కోసం ఆటగాళ్లు అంతా సిద్ధమయ్యారు. క్రికెట్ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Also Read : అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?

కరోనాను తట్టుకొని ఆటగాళ్లు ముందుకు రావడంతో బీసీసీఐ వారిలో స్ఫూర్తి నింపేందుకు తాజాగా ముందడుగు వేసింది. కరోనాపై యుద్ధం చేస్తున్నామనే అర్థం వచ్చేలా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసంను నింపేలా ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించారు.

తాజాగా బీసీసీఐ ఐపీఎల్ పై విడుదల చేసిన పాట దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ‘ఆయేంగే హమ్ వాపస్’ అనే లిరిక్స్ తో సాగిన ఈ పాట ఆసాంతం అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా రూపొందడం విశేషం.

కరోనాపై విజయం సాధించి భారత్ లో మళ్లీ ఐపీఎల్ జరుగుతుందనే ఉద్దేశంతో కొత్తగా ఈ పాటను రూపొందించినట్టుగా తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు జరగబోయే ఈ సుధీర్ఘ పోటీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి మ్యాచ్ ఆడుతున్నాయి.

Also Read : గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!

‘వి’ పాయే.. ఓటీటీలో నెక్స్ట్ ఏంటీ?

Tollywood in ott

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో గతంలో పూర్తయిన సినిమాలన్నీ కూడా ఓటీటీలో రిలీజు చేసేందుకే నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. థియేటర్లో ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కన్పించకపోవడంతో నిర్మాతలు వడ్డీల భారాన్ని భరించలేక సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరలేకే నిర్మాతలు సినిమాలను ఓటీటీలు అడిగిన ధరకే కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!

నిర్మాతలు కూడా తమ సినిమాల కంటెంట్ అంతంత మాత్రంగానే ఉంటేనే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. మంచి కంటెంట్ కలిగి ఉండి థియేటర్లలో కలెక్షన్లు కురిపిస్తుందని భావించిన నిర్మాతలు మాత్రం వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు. అయితే చిన్న సినిమాలకు మాత్రం ఓటీటీలు వరంగా మారాయి. చిన్న నిర్మాతలు ఓటీటీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. అయితే పెద్ద సినిమాలకు మాత్రం ఓటీటీ వల్ల పెద్దగా గిటుబాటు అయ్యే పరిస్థితి లేదు. దీంతో వారంతా థియేటర్లనే నమ్ముకున్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో థియేటర్లకు జనం వచ్చే పరిస్థితులు లేకపోవడంతో పెద్ద సినిమాలు సైతం ఓటీటీల్లోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే అనేక చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజై మంచి టాక్ సంపాదించుకున్నాయి. వీటితో ఓటీటీ నిర్వాహకులతోపాటు చిన్న నిర్మాతలు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ నుంచి ఓటీటీలో రిలీజైన పెద్ద సినిమాగా ‘వి’ రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

‘వి’ సినిమా వల్ల ఓటీటీలకు ఏమేరకు లాభం వచ్చిందో తెలియదుగానీ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే నిర్మాత భారీగా నష్టపోయేవాడనే టాక్ విన్పించింది. నిర్మాత దిల్ రాజు ‘వి’ సినిమాను ముందుగానే అంచనావేసి మంచి ధరకు ఓటీటీ విక్రయించి సేఫ్ అయ్యాడు. ఈ సినిమా ప్లాప్ టాక్ రావడంతో ఇక ఓటీటీ రానున్న సినిమాలపై అందరి దృష్టిపడింది. సాయిధరమ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’.. అనుష్క నటించిన ‘నిశబ్దం’ మూవీలు ఓటీటీలో రిలీజ్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

సాయిధరమ్ తేజ్ మూవీకి ఇంకా కొంత వర్క్ మిగిలివున్నట్లు తెలుస్తోంది. దీంతో నిశబ్ధం మూవీ ఓటీటీ ఈనెలాఖరు ఓటీటీ రానుందని.. ఈమేరకు చిత్రయూనిట్ తో ఓటీటీ నిర్వాహకులు డీల్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ‘నిశబ్ధం’ మూవీ ఓటీటీ వస్తుందో? రాదోననే ఆసక్తి అందరిలో నెలకొంది.

గుడ్ న్యూస్:  ‘ఆచార్య’  తర్వాత సినీ ఇండస్ట్రీలో మరో కొత్త ప్రాజెక్టు   

matnee entertainments

విభిన్న కథనాలను నిర్మిస్తూ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ మరో క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జెతో ఓ సినిమాను చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దర్శకుడు స్వరూప్ కి ఇది రెండో సినిమా కాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి ఇది ఎనిమిదో చిత్రంగా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తూ ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది.

Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

ఓ గోడపై కోడిపుంజు నిల్చుని ఉండగా.. ఇందులో వాంటెడ్ పోస్టర్ అతికించబడి కన్పిస్తుంది. అతడిని పట్టుకున్న వారికి 50లక్షల రివార్డ్ అని ప్రకటించబడి ఉంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సినిమాను తెరకెక్కబోతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. దీంతో దర్శకుడు స్వరూప్, మ్యాట్నీ ఎంటట్మైమెంట్ కాంబోలో మరో విభిన్న కథ తెరకెక్కుతుందని టాక్ విన్పిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుందని నిర్మాతలు ప్రకటించారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించి డిసెంబరులో సినిమాను పట్టాలెక్కంచేందుకు రెడీ అవుతోంది.

Also Read: జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్?

ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ‘ఆచార్య’ మూవీ రాబోతుంది. నిర్మాత రాంచరణ్ తో కలిసి మ్యాట్నీ సంస్థ మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ వాయిదా పడింది. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే పట్టాలెక్కించేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. అదేవిధంగా కింగ్ నాగర్జునతో ‘వైల్డ్ డాగ్’ మూవీని మ్యాట్నీ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీలను త్వరగా పూర్తిచేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు.

గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!

gangavva
కిందటి ఆదివారం నుంచే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ షో ఇప్పటివరకు నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ పరంపరను కొనసాగించేందుకే ‘బిగ్ బాస్’ ఉవ్విళ్లురుతున్నాడు. బిగ్ బాస్-4 సీజన్లో ప్రస్తుతానికి 16మంది కంటెస్టులు ఎంట్రీ ఇచ్చారు. వివిధ రంగాల్లో ఫేమస్ అయిన 16మందిని ఒకేచోట చేర్పిన బిగ్ బాస్ ఇక ఆటకు సిద్ధమవుతున్నాడు.

Also Read: జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్?

తొలిరోజు బిగ్ బాస్-4 ఇంచుమించుగా బిగ్ బాస్-3 సీజన్ ను తలపించినట్లే కన్పించింది. దీంతో ఈ షోపై మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే రానున్నా రోజుల్లో బిగ్ బాస్ కొత్తకొత్త టాస్కులతో ఆకట్టుకునే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ప్రారంభం రోజు నుంచి బిగ్ బాస్ ఆట మొదలైట్టారు. కంటెస్టులకు కనెక్షన్ పేరుతో 14మందిని ఏడు జట్లుగా విడగొట్టాడు. ఇక మరో ఇద్దరిని ఓ సిక్రెట్ రూపంలో పెట్టడం ఆసక్తిని రేపుతోంది.

బిగ్ బాస్ ఆట ప్రారంభం కావడంతోనే నామినేషన్ ప్రక్రియ షూరు అయింది. ఆదివారం రోజునే కనెక్షన్ గేమ్ లింక్ పెట్టి బిగ్ బాస్ నామినేషన్ గుట్టు విప్పేశాడు. ఏడు జంటల్లోంచి గంగవ్వ, సుజాత, సూర్య కిరణ్, అభిజీత్, అఖిల్ సర్తాక్, దివి, మెహబూబ్ నామినేట్ అయ్యారు. అయితే గంగవ్వ నామినేషన్ ప్రాసెస్ లో మాత్రం అందరూ ఒకటే రిజన్ చెప్పడం కొసమెరుపు. గంగవ్వకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని ఎలాగైనా సేవ్ అవుతుందని నామినేషన్ చేసినట్లు చెప్పారు.

Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

నిజంగానే గంగవ్వకు భారీ ఫాలోయింగ్ ఉండటంతో బిగ్ బాస్ సైతం ఆమెను బాగానే వాడాలని చూస్తున్నాడు. ఈ కారణంగానే గంగవ్వ మాట్లాడే మాటలు.. సైటర్లను ఎక్కవగా ఫోకస్ చేస్తున్నాడు. బిగ్ బాస్ వల్లే ప్రస్తుత సీజన్ కు హైప్ వచ్చినట్లు కన్పిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు అనుకూలంగా కామెంట్లు పెడుతున్నారు. ఓటింగ్ రేసులోని గంగవ్వ అందరికీ కంటే ముందుంది.

50శాతం పైగా ఓట్లు ఆమె ఒక్కదానికే పోలైనట్లు తెలుస్తోంది. ఆమె దారిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. దీనిని బట్టి ఆమె రేంజ్ ఏంటో అర్థమవుతుంది. ఆమె వయస్సు రీత్య పెద్దది కావడంతో బిగ్ బాస్ విధించే టాస్కులను గంగవ్వ ఏమేరకు పూర్తి చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?


అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి ఆలయ రథం ఆహుతి వెనుక అసలు ఏం జరిగింది..? దురదృష్టవశాత్తు జరిగిందా.. ఎవరైనా దుండగుల హస్తం ఉందా..? ఆలయంలోని సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలేంటి..? ఆలయ కమిటీ ఎందుకు పట్టించుకోలేరు..? ఇన్నేళ్లుగా లేని ప్రమాదం ఇప్పుడే ఎందుకు జరిగింది..? ఈ నిప్పు వెనుక దాగి ఉన్న ముసుగు వీరులెవరు..? పోలీసులు తమ విచారణలో వెల్లడైనట్లు చెబుతున్న తేనెతుట్టు కట్టుకథేనా..? అసలు అర్ధరాత్రి తేనెతుట్టల నుంచి తేనె తీయడం ఎలా సాధ్యం..? అర్ధరాత్రి ఆలయంలో అగ్ని ప్రమాదం ఏంది..? ఇవీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్న ప్రశ్నలు.

Also Read: ఎంత ఘోరం:పాడైపోయిన బీర్లు ఏపీ ప్రజలు తాగారా?

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహా స్వామి ఆలయ రథం ఆదివారం తెల్లవారు జామున మంటల బారిన పడి పూర్తిగా దగ్ధమైంది. సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం మంటల బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలోని సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో ఉంది ఈ ఆలయం. అంతర్వేది తిరునాళ్లుగా రాష్ట్రం మొత్తం గుర్తింపు పొందింది. అంతర్వేది ఆలయం వెలుపల నిర్మించిన షెడ్‌లో స్వామివారి రథాన్ని ఉంచుతారు. ఏటా స్వామివారి ఉత్సవాల సందర్భంగా.. ఈ రథాన్ని బయటికి తీసుకొస్తారు. ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఆదివారం 3 గంటల సమయంలో హఠాత్తుగా షెడ్‌లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల బారిన పడి రథం పూర్తిగా కాలిపోయింది.

6 దశాబ్దాల కిందట టేకు కలపతో చేసిన ఈ రథం ఇప్పుడు ఆకస్మాత్తుగా ఇలా అగ్నికి ఆహుతి కావడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అప్పట్లోనే రూ.94 లక్షల ఖర్చుతో పూర్తి టేకు కలపతో కనులు మిరుమిట్టు గొలిపే రీతిలో తయారైన ఈ రథాన్ని 57 ఏళ్ల నుంచి ఉత్సవాలకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి సమీపంలోని ప్రత్యేక షెడ్డులో దీనిని భద్రపరిచారు. ఇంత చరిత్ర కలిగిన రథం ఒక్కసారిగా ఖాళీ బూడిదైంది. ఈ ప్రమాదానికి ముందుగా చెప్పినట్లుగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణమనుకుంటే.. అక్కడి పరిస్థితులు దానిని నమ్మేలా లేవు. రథాన్ని పెట్టే షెడ్డులో విద్యుత్‌ సరఫరా కోసం ఒకట్రెండు బల్బుల మాత్రమే ఉన్నాయి. రథాన్ని దహనం చేసే స్థాయిలో ఓల్టేజీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : చంద్రబాబు తపో భంగానికీ ఏపీ బీజేపీ పెద్ద ప్లాన్లు?

సడెన్‌గా ఈ ఘటన జరగడంపై ఇప్పటికే అన్నివర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇంత పెద్ద ఆలయంలో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలూ పనిచేకపోవడంపై భక్తులు ఫైర్‌‌ అవుతున్నారు. అయితే.. ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ.మోహనరావు, జిల్లా ఎస్పీ నయీంఅస్మీ, ఫోరెన్సిక్‌ ఐజీ రాజేంద్ర ససేన్‌ పర్యవేక్షణలో పోలీసు ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోను విచారణ చేపట్టేందుకు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం ఆలయంలోని సిబ్బంది, అర్చకులను వ్యక్తిగతంగా విచారిస్తుండగా మరో బృందం క్లూస్‌ను సేకరించే పనిలో ఉన్నారు. ఇంకో బృందం గ్రామస్తులను విచారిస్తున్నారు. మరో ప్రత్యేక బృందం ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించే పనిలో ఉన్నారు.

మరోవైపు ఆలయ ఇన్‌చార్జి ఈవోను తప్పించాలనే లక్ష్యంతో కొందరు వ్యక్తులేమైనా ఇలాంటి వ్యూహాత్మక కుట్ర పన్నారా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కొందరు నియోజకవర్గ వైసీపీ నాయకులు సోమవారం దేవాదాయమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను కలిసినట్టు తెయడంతో.. వారి నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌తో ఆలయ ఇన్‌చార్జి ఈవో ఎన్‌ఎస్‌ చక్రధరరావుపై బదిలీ వేటు పడింది. దీంతో అధికార వైసీపీలో ఈవో వ్యవహారంపై కొంత కాలంగా ఇద్దరు కీలక నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో ఒకరిది పైచేయిగా మిగిలిందనే విమర్శలు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు దేవాదాయశాఖ కమిషనర్‌ భ్రమరాంబ కూడా అంతర్వేది చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయని తీరు, సిబ్బంది వ్యవహారశైలిపై విచారణ చేపట్టారు.

ఈ అగ్నిప్రమాద ఘటనపై రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చనేది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నడుస్తున్న టాక్‌. ఘటన జరిగిన రోజున పిచ్చివాడి చర్యగాను.. నిప్పుల కుంపటి అని.. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అని ప్రచారం చేసిన పోలీసు యంత్రాంగం.. చివరకు శోధించి శోధించి ‘తేనెతుట్ట’ కారణంగానే జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేయడంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు మొదలయ్యాయి. రాజకీయ కుట్ర కోణం దాగి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రకోణాల వైపు వెళ్లకుండానే ‘తేనెతుట్ట’తోనే కేసు విచారణ ముగించేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read: అమరావతిని పూర్తిగా లేపేసేలా వైసీపీ ప్లాన్?

ప్రభుత్వ అధికారిక మీడియాలో అంతర్వేది రథం దగ్ధం వెనుక ‘తేనె సేకరణకు ప్రయత్నించే ముఠా కారణం’ అని నిర్ధారించడం ఇప్పుడు వివిధ రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశమైంది. రథం షెడ్డుకు ముందు భాగంలో 40 అడుగుల ఎత్తులో ఉండే భవనంపైన ఉన్న ఆ తేనెతుట్టను అర్ధరాత్రి వేళ తొలగించడం సాధ్యమా..? దానివల్ల తేనె సేకరించే వ్యక్తులకు వచ్చే ఆదాయం ఎంత..? ప్రాణాలను పణంగా పెట్టి తేనెపట్టుకోడానికి నాలుగంతస్తుల ఎత్తులో ఉన్న షెడ్డును ఎలా ఎక్కగలరు..? అలా ఎక్కి సురక్షితంగా తేనెపట్టు పట్టుకోగలరా..? అంటూ భక్తులు వేస్తున్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం లేదు. మరోవైపు మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్‌ను వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడే ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రుల వాహనాలను ముందుకు వెళ్లకుండా ఆపారు.

దీంతో ఈ తేనెతుట్ట ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం వాదనను భక్తులు కొట్టిపారేస్తున్నారు. దీనివెనుక ఏదో కుట్ర ఉందని దాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే చర్యలపై ప్రభుత్వం ఉదాసీనత పనికిరాదని హితవు పలుకుతున్నారు.

అక్టోబర్ 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్..!

Advertisement New Rules

ప్రకటన కంపెనీలకు కేంద్రం షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రకటనలు, అడ్వర్టైజ్ మెంట్లకు సంబంధించి రూల్స్ మార్చేందుకు రెడీ అవుతోంది. ఈమేరకు సెప్టెంబర్ 18లోపు సలహాలు, సూచనలు అందించాలని సంబంధిన కమిటీని కోరింది. ఇందులో వచ్చిన సూచనలు, సలహాలను, అభ్యంతరాలను పరిశీలించిన తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నహాలు చేస్తోంది.

Also Read: చైనా దుస్సాహాసం.. భారత్ ను హెచ్చరిస్తున్న మీడియా

ఇందుకోసం కేంద్రం కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019కింద సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ)ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారంగా కంపెనీల ప్రకటనల్లో ఇకపై పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం కుదరదని తెలుస్తోంది. అలాగే ప్రమాదకరమైన సన్నివేశాల్లో పిల్లలు నటించడానికి కూడా వీల్లేకుండా నిబంధనలు రూపొందిచినట్లు తెలుస్తోంది.

పిల్లలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇకపై చేయకుండా చర్యలు తీసుకోనుంది. ఆల్కహల్, పొగాకు సంబంధింత ఉత్పత్తి ప్రకటనల్లో పిల్లలు కనిపించకుండా చర్యలు తీసుకోనుంది. ప్రొడక్టులను సంబంధించి అతి ప్రచారం చేయకుండా నిబంధనలు సవరించనుంది. ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలు సైతం ఆయా కంపెనీలు, ప్రొడక్టులపై తీసుకోవాలని సూచించింది. లేకుంటే వారికి కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది.

Also Read: బ్రేకింగ్:భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు!

అంతేకాకుండా ప్రకటనల్లో డిస్‌క్లైమర్ కచ్చితంగా కనిపించేలా చర్యలు తీసుకోనుంది. ఇప్పటి వరకు అతిగా డిస్ క్లైమర్ ఉండేది. ఇకపై అలాంటివి కుదరదు. స్పష్టంగా కంటికి కన్పించేలా ఉండాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. అలా లేకుండా రూల్స్‌ను అతిక్రమించినట్లే చెబుతోంది. యాడ్ ఏ భాషలో ఉందో డిస్‌క్లైమర్ కూడా అదే భాషలో ఉండాలని కేంద్రం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. కేంద్రం తాజా నిబంధనలు ప్రకటనల కంపెనీలకు షాకిచ్చేలా కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనిపై ప్రకటనల కంపెనీలు ఎలా ముందుకెళుతాయో వేచి చూడాల్సిందే..!

ఆపరేషన్‍ 2020:పోలీసులు, మావోయిస్టుల మధ్య అసలు ఏం జరుగుతోంది?

పోలీసులు, మావోయిస్టుల మధ్య అసలు ఏం జరుగుతోంది..? మావోయిస్టుల ఏరివేలకు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ 2020కి ఏమైనా శ్రీకారం చుట్టారా..? తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పేరు వినిపించకుండదనే పంతంతో స్వయానా పోలీసు బాస్‌ రంగంలోకి దిగారా..? అందుకే ఆసిఫాబాద్‌లో నాలుగు రోజులు మకాం వేశారా..? ఆదిలాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోకి యాక్షన్‌ టీంలు ప్రవేశించాయనే సమాచారంతోనే నెల రోజులుగా గోదావరి తీరాన్ని చక్రబంధం చేశాయా..? రోజుకో తీరుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. ఈ ప్రశ్నలకు బలాన్నే చేకూరుస్తున్నాయి.

Also Read: పీవీకి భారతరత్న కోసం అసెంబ్లీలో తీర్మానం

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెళ్లు అలియాస్‌ భాస్కర్‌‌ ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌, స్థానిక కేడర్‌‌తో కలిసి ఆయన తన కార్యకలాపాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందుకే డీజీపీ మహేందర్‍రెడ్డి నాలుగు రోజులు అక్కడ మకాం వేసి హెలీకాప్టర్ ద్వారా ఏరియల్‌ సర్వే చేశారు. కూంబింగ్ చేస్తున్న బలగాలకు సూచనలు చేశారు. వరుస సమీక్షలూ పెట్టారు. మరోవైపు అగ్రనేతలు గణపతి, ఆయన భార్య సుజాత, కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్‍, ఆయన భార్య తారాభాయ్‍, కటకం సుదర్శన్‍, మల్లా రాజిరెడ్డి, తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, కడారి సత్యనారాయణ లొంగిపోతున్నట్లుగా లీకులు ఇచ్చి మావోయిస్టు పార్టీని గందరగోళానికి గురి చేశారు. ఇదే సమయంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లపల్లి వద్ద జరిగిన ఎన్‍కౌంటర్‍లో అగ్రనేత హరిభూషణ్‌ గన్‌మెన్‌ శంకర్‌‌ అలియాస్‌ దుడి దేవాలు హతమయ్యాడు. ఒక రకంగా ఇది మావోయిస్టులకు హెచ్చరికగా పరిగణించవచ్చు. లొంగిపోకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనే సంకేతాలు పరోక్షంగా మావోయిస్టు పార్టీకి తెలంగాణ పోలీసులు పంపించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

శంకర్‌‌ ఎన్‍కౌంటర్‍ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఐదు జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‍ను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. కాగా.. మావోయిస్టుల కదలికలను గమనించిన పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటినా గోదావరి తీరంలోని సీఐల బదిలీ కూడా చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసి, అనుభవం ఉన్న సీఐలను అపాయింట్‍చేశారు. 24 గంటల్లోనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు మరోసారి ప్రయత్నించారు. ఆదివారం రాత్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పెద్దమిడిసిలేరు–తిప్పాపురం రహదారిపై మందుపాతరను పేల్చారు. రాత్రి 11 గంటల సమయంలో ఇది జరిగింది. దీంతో జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. దళాలను వెంటాడారు.

సోమవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో పూసుగుప్ప అటవీ ప్రాంతంలో 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయని.. ఇందులో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారని ఆ జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఎస్‍బీబీఎల్‌ తుపాకీ, మరో పిస్తల్‌తోపాటు రెండు కిట్‍బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ బాస్‌ నుంచి కింది స్థాయి పోలీస్‍స్టేషన్‌ వరకు మావోయిస్టులతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోలీసులు దూకుడు ప్రదర్శించడంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో యుద్ధభూమిని తలపిస్తోంది.

Also Read: తెలంగాణలో ఇక వీరంతా బీసీ కులాల్లోకి..

అటు ఆదిలాబాద్‌, ఇటు కొత్తగూడెం జిల్లాల్లోని మన్యం ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల జాడ కనిపిస్తే చాలు క్షణాల్లో బలగాలు అక్కడకు చేరిపోతున్నాయి. ఆదివారం ఏడూళ్లబయ్యారం పోలీసులు తాటి సన్ను అనే మావోయిస్టు కొరియర్‍ను అరెస్ట్ చేశారు. సోమవారం దుమ్ముగూడెం పోలీసులు నీలం ఉపేంద్ర అనే సానుభూతిపరుడిని పట్టుకున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే ఉత్తర తెలంగాణలో తిరిగి మావోయిస్టు ఉద్యమం ఊపిరి పోసుకోకూడదనే లక్ష్యంతో తెలంగాణ పోలీసు నిఘాను పెంచినట్లు తెలుస్తోంది. ఆపరేషన్‍2020 చేపట్టినట్లే అర్థమవుతోంది.

-శ్రీని

ఎంత ఘోరం:పాడైపోయిన బీర్లు ఏపీ ప్రజలు తాగారా?

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వైన్స్‌ షాపులు మూత పడ్డాయి. ఒక్క మద్యం దుకాణాలే కాదు బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు కూడా క్లోజ్‌ అయ్యాయి. ఇక మద్యం కోసం మందుబాబులు లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చే వరకు విలవిలలాడారు . లాక్ డౌన్ సడలింపుల తర్వాత వైన్స్ తెరుచుకోవతంతో మందుబాబులు లిక్కర్ కోసం ఎగబడ్డారు.

Also Read: జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?

సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా మందుబాబులు బీర్లు కొనుగోలు చేస్తారు. అసలే ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. చల్లటి బీర్లు తాగితే ఎక్కడ జలుబుచేసి ఏ వైరస్‌ ఎక్కడ అంటుకుంటుందోనని అందరిలోనూ భయం కనిపిస్తోంది. దీంతో చాలా వరకు బీర్లు వైన్స్‌ షాపుల్లో పాత స్టాక్‌ పేరుకుపోయినట్లు సమాచారం. చాలాచోట్ల డేట్‌ ఎక్స్‌పైరీ అయిన బీర్లను పారబోసిన దాఖలాలూ చూశాం.

అయితే.. ఆదాయమే లక్ష్యమని అలవాటుపడ్డ మద్యం మాఫియా ఇప్పుడు కొత్త దందాకు తెరతీసింది. ఏపీలో ఇప్పటికే మద్య నిషేధం కోసం అక్కడి సీఎం జగన్‌ ప్రయత్నాలు సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత వైన్స్‌లు తెరిచే సమయంలో భారీ ఎత్తున మద్యం ధరలు పెంచారు. ఇటీవల కొన్నింటి ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో బీర్లు కూడా ఉన్నాయి. ఒక్కో బీరుకు సుమారు రూ.30 వరకు తగ్గింది. ఇప్పుడు ప్రజల్లో కరోనా భయం కొంత తొలగడంతో ఆ రాష్ట్రంలో బీర్లకు కొంత డిమాండ్‌ పెరిగింది.

దీనిని ఆసరాగా తీసుకున్న మద్యం మాఫియా పాత బీర్లు అంటే ఎక్స్‌పైర్‌‌ అయిన బీర్లను కూడా షాపుల్లో అమ్ముతున్నారు. ఎక్స్‌పైరీ డేట్‌ కనిపించకుండా కొత్త స్టిక్కర్‌‌ అంటిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా బీర్ల కంపెనీల వద్ద పేరుకుపోయిన సరుకును ఇలా ‘క్లియర్‌’ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ‘ఎక్స్‌పైర్‌‌ అయినా ఓకే’ అంటూ ఎక్సైజ్‌ శాఖకు చెందిన రీజనల్‌ కెమికల్‌ ల్యాబ్‌లు ‘క్లియరెన్స్‌’ ఇచ్చాయని.. ఒక ఉన్నత స్థాయి అధికారి ఒత్తిడే దీనికి కారణమని సమాచారం. బడ్డీ కొట్టులో బిస్కెట్‌ ప్యాకెట్‌ నుంచి మెడికల్‌ షాప్‌లో మందుల దాకా… ఏది కొన్నా ఎక్స్‌పైరీ డేట్‌ చూస్తాం! తేదీ దాటిన వస్తువులు వినియోగిస్తే ప్రమాదం తప్పదు మరి! కానీ… ఏపీలో స్వయంగా ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లోనే గడువు ముగిసిన బీర్లను విక్రయిస్తున్నారు.

Also Read: చంద్రబాబు తపో భంగానికీ ఏపీ బీజేపీ పెద్ద ప్లాన్లు?

గతంలో అప్పుడప్పుడు వైన్‌ షాపుల్లో తనిఖీలు చేసే ఎక్సైజ్‌ శాఖ ఇప్పుడు వాటిని మరిచింది. అంటే ఇదంతా సర్కార్‌‌ తెలిసే నడుస్తోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సర్కార్‌‌ కంట్రోల్‌లో ఉండమంటేనే ఎక్సైజ్‌ సైలెంట్‌ అయిపోయిందా అని టాక్‌. ఈ కాలం చెల్లిన బీర్లు తాగడం వల్ల ఇప్పటికే కొంత మంది వాంతులు, ఇతరత్రా అనారోగ్య సమస్యల బారిన పడినట్లు సమాచారం. మాన్‌ఫ్యాక్చరీ నుంచి ఆరు నెలల్లోపే బీరు స్టాక్‌ అయిపోవాలి. ఇటీవల  సేలింగ్‌ తగ్గిపోయిన బీర్లను కేసుల కొద్దీ పడేయలేక షాపుల వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మేలో ఎక్స్‌పైర్‌‌ అయిన బీర్లను ఇప్పుడు అమ్ముతుండడమే ఇందుకు సాక్ష్యం. కడప జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. డబ్బులే తప్ప.. ప్రజల ప్రాణాలతో తమకేం సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది ఏపీలోని మద్యం మాఫియా.

సాధారణంగా మద్యం ఎంత ఎక్కువ నిల్వ ఉంటే అంత రుచి. కానీ, బీరు అలా కాదు. బ్రూవరీలో తయారుచేసిన వెంటనే వాటిపై బెస్ట్‌ బిఫోర్‌ యూజ్‌ తేదీ వేస్తారు. ఆ తేదీలోపే ఆ బీరు తాగాలని దాని అర్థం. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం మద్యం తయారీచేసిన డిస్టిలరీ లేక బ్రూవరీలో తప్ప ఇంక బయట ఎక్కడా స్టిక్కర్లు, లేబుళ్లు అంటించకూడదు. అలా అంటిస్తే దాన్ని అక్రమంగా భావించి కేసులు పెడతారు. కానీ.. ఇప్పుడు వైన్‌ షాపుల్లోనే తమ ఇష్టారాజ్యంగా స్టిక్కర్లు వేస్తూ ప్రజలకు అమ్ముతున్నారు.