
మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత చాలామంది సినీప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపారు. సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధి కోసం పాటు పడటంపై ప్రజల నుంచి ప్రశంసలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం వారికి భిన్నంగా అడవిని దత్తత తీసుకున్నాడు.
Also Read : గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!
ప్రభాస్ తన తండ్రి స్మారకంగా అడవిని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. 1650 ఎకరాల విస్తీర్ణంలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ ను దత్తత తీసుకోవడానికి ప్రభాస్ ముందుకు రావడం గమనార్హం. ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి కోసం మొదట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేస్తానని ప్రభాస్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చొరవతో ప్రభాస్ అడవిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. నిన్న ఈ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరగగా తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అధికార పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ రాష్ట్రంలో మరిన్ని అటవీ భూముల దత్తత కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని… అడవుల అభివృద్ధే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నామని తెలిపారు.
Also Read : డ్రగ్స్ వ్యవహారంలో ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ ?