Home Blog Page 8322

జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్?

దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ‘ఆర్ఆర్ఆర్’లో తొలిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగ్ నిలిచింది.

2021 జనవరి 8న సంక్రాంతి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదాపడటంతో ఈ మూవీ సంక్రాంతికి వచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. గతంలోనూ పలుసార్లు రిలీజ్ తేది వాయిదా పడినట్లుగా మరోసారి వాయిదా పడే అవకాశం కన్పిస్తోంది. ఇటీవలే షూటింగు ప్రారంభించేందుకు రెడీ అయిన దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కరోనా బారినపడటంతో మరోసారి షూటింగు నిలిచిపోయింది.

ఇటీవలే కరోనా నుంచి బయటపడిన దర్శకుడు రాజమౌళి షూటింగును ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. దీంతోపాటు హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లు ‘ఆర్ఆర్ఆర్’ త్వరగా పూర్తిచేసి మరో ప్రాజెక్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో రాజమౌళిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో రాజమౌళి సైతం వీలైనంత త్వరగా షూటింగును ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈమేరకు అన్ని‘ఆర్ఆర్ఆర్’ చిత్రయూనిట్ నయా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఇటీవలే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కరోనా ప్రభావం లేని దేశాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం ‘బెల్ బాటామ్’ షూటింగ్ నిశ్చితంగా జరుపుకుంటుంటోంది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రయూనిట్ కూడా కరోనా లేని యూరప్ దేశాలపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆయా దేశాల్లోని లోకేషన్ల అనుమతి కోసం నిర్మాత దానయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాలో ఒళ్లుగగుర్పిచేలా ఓ యాక్షన్ ఎసిపోడ్ చిత్రీకరణ చేసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ విన్పిస్తోంది.

తెలంగాణలో ఇక వీరంతా బీసీ కులాల్లోకి..


‘కులాల జాబితాలు సవరించడం తప్పనిసరి. అది జరిగినప్పుడే రిజర్వేషన్‌ ఫలాలను ఇప్పటికే వాటిని అనుభవిస్తున్న వారు తన్నుకుపోకుండా చూడగలం’ అని గతంలోనే సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తమను ఆ జాబితాలోకి మార్చాలని.. తమను ఈ జాబితాలోకి తీసుకురావాలంటూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా కులాల నుంచి డిమాండ్లు కూడా వచ్చాయి. వీటిపై పూర్తిస్థాయిలో బీసీ కమిషన్‌ కూడా నివేదిక ఇచ్చింది. పలు కులాలను బీసీ ఏగా.. మరికొన్నింటిని బీసీ డీలుగా గుర్తింపు ఇవ్వాలని సిఫారసు చేసింది.

Also Read: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

దీంతో సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీలో సీఎం కేసీఆర్‌‌ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. అందులో భాగంగా పలువురు కులస్తులగా బీసీలోకి మార్చేందుకు నిర్ణయించారు. దీని ప్రకారం.. 17 కొత్త కులాల్లో బీసీ ఏ లుగా చాలా మంది గుర్తింపులోకి వస్తున్నారు. ఈ జనాభా 28,402 ఉన్నట్లుగా తేలింది. అదేవిధంగా బీసీ డీ జాబితాలో చేరే కులాల జనాభా సంఖ్య 15,409గా నిర్ధారించారు. కేబినెట్‌ నిర్ణయంతో మొత్తంగా 9,849 కుటుంబాలకు లబ్ధిచేకూరుతోంది. కొత్తగా చేరుతున్న కులాలు ఇలా ఉన్నాయి..

బీసీ ఏ
అద్దపువారు
బాగోతుల
బైల్ కమ్మర
ఏమాటి
గంజికూటివారు
గౌడ జెట్టి
కాకి పడగల
పటం వారు/మాసయ్యలు
ఓడ్
సన్నాయి
శ్రీ క్షత్రియ రామజోగి
తెర చీరల
తోలుబొమ్మలాటవారు (బొప్పల)
———
బీసీ డీ
అహిర్ యాదవ్
గొవిలి
కుల్ల కడగి
సారోల్లు

Also Read: తెలంగాణ సర్కార్ మరో భారీ ఆఫర్

పీవీకి భారతరత్న కోసం అసెంబ్లీలో తీర్మానం

పాములపర్తి వెంకట నరసింహారావు అంటే ఎవరికీ తెలియదు. పీవీ నరసింహారావు అంటేనే అందరూ ఈజీగా గుర్తుపట్టేస్తారేమో. బహుభాషావేత్త, రచయిత. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు తెచ్చి.. కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి ఎక్కించిన ఘనాపాటి. మొట్టమొదటి తెలుగు ప్రధాని. అందులోనూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన లీడర్‌‌. అందుకే.. ఇటీవల ఆయన శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర సర్కార్‌‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున కార్యక్రమాలూ చేపట్టింది. ఇప్పుడు తాజాగా పీవీకి కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది.

Also Read: తెలంగాణ సర్కార్ మరో భారీ ఆఫర్

తెలంగాణ వర్షాకాల శాసనసభ సమావేశాలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. నేటి సమావేశాల్లో ముఖ్యంగా ప్రశ్నోత్తరాలను పక్కన పెట్టి.. సీఎం కేసీఆర్‌‌ ప్రధానంగా పీవీకి భారతరత్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

సమావేశాల్లో సీఎం కేసీఆర్‌‌ మాట్లాడుతూ.. ‘పీవీ తెలంగాణ ముద్దుబిడ్డ. సువిశాలమైన భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉన్నది. ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నది. ప్రధానిగా సేవలందించే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. ఈ పదవి చాలా అరుదుగా దక్కుతుంది. అలాంటి పదవి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దక్కింది. కానీ.. పీవీకి దక్కాల్సిన గౌరవ దక్కలేదు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా ఆర్థిక మంత్రి చేసిన ఘతన పీవీదే’ అని గంటాపథంగా చెప్పారు.

Also Read: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

పీవీ శతజయంతి ఉత్సవాల్లోనూ సీఎం కేసీఆర్‌‌ పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని గుర్తుచేశారు. ‘దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలందరూ స్మరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది. అందుకే ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శత జయంతి ఉత్సవాలను సంవత్సరంపాటు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పీవీ మన ఠీవీ అని తెలంగాణ సగర్వంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది’ అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.

జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి(జేపీ) మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్లో విలన్ క్యారెక్టర్లకు జయప్రకాశ్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గానూ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే గతంలోనూ ఆయన గుండెకు సంబంధ సమస్యతో చికిత్స చేసుకున్నారు. కాగా నేడు తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందినట్లు తెలుస్తోంది.

Also Read: రిటైర్ మెంట్ తీసుకున్న జేపీ ఎందుకు వెనక్కొచ్చాడు?

టాలీవుడ్ ఒక గొప్పనటుడిని కొల్పోవడంపై ప్రముఖులంతా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. జేపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్లో అగ్రనటులతోపాటు ఆయనతో నటించిన సహచర నటీనటులుంతా జేపీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, మాస్ మహారాజ్ రవితేజ, సుధీర్ బాబు, దర్శకుడు అనిల్ రావుపూడి, సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ ప్రణీత, నిర్మాత బండ్ల గణేష్, హీరో గోపీచంద్, శ్రీరామ్ ఆదిత్య, సురేష్ ప్రొడక్షన్స్, యాంకర్ శ్రీముఖి తదితరులంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.

Also Read: సీమ టపాకాయ్.. నటనలో జేపీ విలక్షణ

జేపీ మృతి టాలీవుడ్ చిత్రపరిశ్రమని తీరని లోటు.. అద్భుతమైన నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది.. ఆయన మరణం షాక్ గురి చేసింది.. మీ అద్భుతమైన నటన ఎప్పటికీ గుర్తిండి పోతుంది.. జేపీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలంతా ట్వీట్లు చేశారు.

రిటైర్ మెంట్ తీసుకున్న జేపీ ఎందుకు వెనక్కొచ్చాడు?

20 ఏండ్లకు పైగా ఇండస్ట్రీలో నటుడిగా సత్తాచాటారు.  తన రాయలసీమ యాస.. తన కామెడీ డైలాగ్స్‌.. తన యాక్టింగ్‌కు ఏ డైరెక్టర్‌‌ అయినా ఫిదా కావాల్సిందే. అలాంటి జయప్రకాశ్‌ రెడ్డి సడన్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నారు. గతేడాదే గుంటూరు‌ వెళ్లిపోయారు. తన కెరీర్‌‌ మంచి ట్రాక్‌లో ఉండగానే జేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీ లో కూడా ఎవరికీ తెలియదు. ఆల్రెడీ ఒప్పుకున్న ఓ చిన్న సినిమా కంప్లీట్‌ చేసుకొని ఆయన తన పిల్లల దగ్గరికి వెళ్లిపోయారు.

Also Read: ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

జేపీ టాలీవుడ్‌కు ఏడాది కిందటే  బైబై చెప్పి గుంటూరు వెళ్లిపోయారు. జయప్రకాష్ రెడ్డి కొడుకు గుంటూరులో సెటిల్ అయ్యారు. జేపీ కుమార్తె విజయవాడలో సెటిల్ అయ్యారు. ఆయన అల్లుడు బెజవాడలోనే అసిస్టెంట్ ఇంజనీర్‌‌గా పనిచేస్తున్నారు. ఇలా కొడుకు-కూతురు ఇద్దరూ గుంటూరు–-బెజవాడల్లోనే సెటిల్ అవ్వడంతో జేపీ హైదరాబాద్‌ను వీడివెళ్లారు.

అయితే.. అప్పటికే  స్క్రిప్ట్‌ రాసుకొని.. సూపర్‌‌ స్టార్‌‌ మహేశ్‌బాబుతో సినిమా షూటింగ్‌ బిజీలో ఉన్న అనిల్‌ రావుపూడికి ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. జేపీ వెళ్లిపోయిన సంగతి కూడా టాలీవుడ్‌లో అందరికీ తెలియదు. ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో జేపీ కోసం ప్రత్యేక డైలాగులు రాసిన రావిపూడి ఊరుకోలేదు. దశాబ్దాల పాటు ఇండస్ర్టీకి దూరంగా ఉన్న లేడీ సూపర్ స్టార్‌‌ విజయశాంతినే తన సినిమా కోసం ఒప్పించి తీసుకొచ్చారు. అలాంటిది జేపీ తీసుకురాలేనా అనుకున్నాడు. జేపీ ఆప్యాయంగా గురువు గారు అని పిలుచుకునే అనిల్‌.. జేపీని బలవంతంగా ఒప్పించి మరోసారి హైదరాబాద్‌ తీసుకొచ్చారు.

Also Read: సీమ టపాకాయ్.. నటనలో జేపీ విలక్షణ

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌కు తండ్రి పాత్ర పోషించిన జేపీకి ఆ సినిమాలో అనిల్‌ రావూపూడి రెండే రెండు డైలాగులు ఇచ్చారు. ఫస్టాఫ్‌ అంతా ‘పీక కోసి..’ అనే డైలాగ్‌ మీద నడిపించగా.. సెకండ్‌ ఆఫ్‌లో ‘కూజాలు చెంబులౌతాయి’ అంటూ చెప్పిన డైలాగ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. థియేటర్లలో విజిల్స్‌ పడ్డాయి. ఈ రెండు డైలాగ్స్ సినిమా అంతటికి పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి.

అలా అనీల్ రావిపూడి బలవంతం పెట్టడంతో మరోసారి హైదరాబాద్ వచ్చిన జయప్రకాష్ రెడ్డి.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించి తిరిగి గుంటూరు వెళ్లిపోయారు. ఇప్పుడు ఏకంగా ఈ లోకాన్నే వీడి వెళ్లిపోయారు.

సీమ టపాకాయ్.. నటనలో జేపీ విలక్షణ

‘‘పెళ్ళినాడు గుడక మాంసం ఏదిరా.. ఒక్క దినము గుడక ఉండలేవా?’’
‘‘వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉందేమి రా..’’
‘‘మీ మనసులు దెల్చుకున్న్యాం. మా అలవాట్లని మార్చుకున్న్యాం..’’
‘‘ఏమీ రా నోరు లెచ్చండాదే…’’
‘‘ఒరేయ్‌ పులీ.. ఏమీరా నెత్తిన అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్‌.. బోడెమ్మ లెక్క…’’
‘‘సీమ సందుల్లోకి రారా చూసుకుందాం.. నీ పతాపమో.. నా పతాపమో…’’
‘‘యాందిరా యాంజేస్తన్రా..’’
‘‘కూజా చెంబైంది..’’

క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ జయప్రకాశ్‌ రెడ్డి ఫేమస్‌ డైలాగ్స్ ఇవి కొన్ని మాత్రమే. ఇవే కాదండోయ్‌ ఇక చాలానే ఉన్నాయి. బుర్ర మీసాలు.. పంచెకట్టుతో రాయలసీమ స్టైల్‌లో డైలాగ్స్‌ చెప్పడంలో జేపీ తరువాతే ఎవరైనా. ఆయన నటించిన చివరి సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇందులో విలన్ ప్రకాశ్ రాజ్ తండ్రిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించారు. విలనిజంతో పాటు హాస్యాన్ని కూడా పండించారు. ఎవడిగోల వాడిది, సీమ టపాకాయ్, నమో వెంకటేశ, రెఢీ వంటి సినిమాల్లో విలనిజంతో పాటు తన దైన శైలిలో హాస్యాన్ని పండించారు.

Also Read: ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. ఆయన కెరీర్‌‌ను మార్చిన సినిమా ‘ప్రేమించుకుందాం రా’నే. అప్పటికే సినిమా ప్రయత్నాలు చేసి.. చిన్నచిన్న పాత్రలతో సరైన గుర్తింపు రాక విసిగిపోయిన ఆయన ఒకానొక సందర్భంలో ఇంటిబాట పట్టారట. ఆయనే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.అనూహ్యంగా సురేశ్‌ ప్రొడక్షన్‌ నుంచి ‘ప్రేమించుకుందాం రా’ సినిమా కోసం పిలుపురావడంతో తన కెరీర్ మలుపుతిరిగిందని అంటుంటారు. ఈ సినిమాకు ముందు ‘చిత్రం భళారే విచిత్రం’, ‘జంబలకిడిపంబ’ వంటి సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించినా ఆయనకు పెద్దగా బ్రేక్‌ దొరకలేదు.

రాయలసీమ మాండలికం జేపీకి పెద్ద ఎస్సెట్‌ అని చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమా కూడా అనంతపురం జిల్లాలోనే చేశారు. ఇక ఈ సినిమాతో ఆయన ఇండస్ర్టీలో వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. ఫ్యాక్షన్‌ సినిమాలకు తప్పనిసరిగా విలన్‌ క్యారెక్టర్‌‌ కావాలంటే అది జేపీనే అని డైరెక్టర్లు కూడా ఫిక్స్‌ అయ్యారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో జేపీ సీరియస్‌నెస్‌తో కనిపిస్తే.. ఇక శ్రీనువైట్ల, వినాయక్‌ సినిమాలు ఆయనలోని హాస్యాన్ని కూడా వెలుగు తీశాయి. ‘ఢీ’ సినిమాలోని జేపీ పాత్ర ఇప్పటికీ ఎవరూ మరిచిపోరు. ‘కృష్ణ’ సినిమాలోనూ అటు ఫ్యాక్షన్‌ ఇటు కామెడీతో అదరగొట్టారు.

అటు పెద్ద సినిమాలు చేస్తూనే.. ఇటు చిన్న సినిమాలకూ సమప్రాధాన్యం ఇస్తుండేవారు. సాధారణ సీన్‌ను కూడా తన యాస, ఎక్స్‌ ప్రెషన్స్‌తో జయప్రకాశ్‌ రెడ్డి తగిన న్యాయం చేస్తారని ఇండస్ట్రీలో టాక్‌. అందుకే ఆయన 20 ఏళ్లలో వెనుకబడిన సందర్బాలు లేవనే చెప్పాలి. ఎంత స్టార్‌‌ హీరో అయినా.. ఎంతటి పేరున్న హీరోయిన్‌ అయినా.. పేరుమోసిన విలనిజం అయినా.. ఎవరికైనా సినీ ఇండస్ర్టీలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ.. ‘ప్రేమించుకుందాం రా’ సినిమా తర్వాత ఆయనకే డిమాండ్‌ పెరిగింది.

Also Read: రిటైర్ మెంట్ తీసుకున్న జేపీ ఎందుకు వెనక్కొచ్చాడు?

తెలుగుతోపాటు పక్క భాషల్లోనూ జేపీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. త‌మిళంలో ప‌లు సినిమాల్లో న‌టించారు. ‘ఆరు’ సినిమాలో చెన్నైలోని తెలుగు విల‌న్ పాత్రలో జేపీ తెలుగులోనే మాట్లాడగా.. ఇక ఉత్తరాది మీమ్స్ పేజ్ వాళ్లు అయితే జేపీ ఫొటోను వాడుకుంటుంటారు! తెలుగు నుంచి హిందీలోకి అనువాదం అయిన యాక్షన్ సినిమాల‌తో జేపీకి అక్కడ గుర్తింపు ద‌క్కింది. సౌత్ సినిమాల్లో హోం మినిస్టర్‌‌ పాత్రలో కనిపించే నటుడు అంటూ మీమ్స్ పేజ్ వాళ్లు జేపీ ఫొటోను వాడుతుంటారు. జేపీకి సినిమాలతో పాటే నాటకరంగం అంటే కూడా చాలా ఇష్టమట.

ఖాళీ స‌మ‌యాల్లో ఆయ‌న నాట‌కాన్ని కూడా వ‌ద‌ల్లేదట. త‌ను, త‌న స్నేహితుడొక‌రు రాసుకున్న ‘అలెగ్జాండ‌ర్’ నాట‌కాన్ని చిన్న చిన్న టౌన్లకు వెళ్లి ప్రదర్శించారట. అది ఏక‌పాత్రాభిన‌యం. దాన్ని సినిమాగా తెర‌కెక్కించాల‌నేది జేపీ చిర‌కాల ఆకాంక్ష. ఈ మ‌ధ్యనే దాన్ని సినిమాగా తీశార‌ని తెలుస్తోంది. చివ‌ర‌గా జేపీ అల‌రించిన సినిమా ‘స‌రిలేరు నీకెవ్వరూ’లో ‘కూజా చెంబైంది..’ అంటూ గుర్తుండిపోయే పాత్రలో క‌నిపించారు. ఇప్పుడు ఆయన మన నుంచి దూరమైనా తన కటౌట్‌, తన డైలాగులు మాత్రం నిత్యం అభిమానుల్లో ఉండిపోతాయని చెప్పొచ్చు.

చంద్రబాబు తపో భంగానికీ ఏపీ బీజేపీ పెద్ద ప్లాన్లు?

chandrababu bjp
మాట్లాడితే 40 ఇయర్స్‌ ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబును బీజేపీ గెలికి మరీ కౌంటర్‌‌ పెట్టుకోవాలని చూస్తోందా..? చంద్రబాబునే టార్గెట్‌ చేసిన ఆ పార్టీ.. ప్రస్తుతం అధికారంలోకి ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడా మాట్లాడడం లేదు. అంతేకాదు గత ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, అవినీతిపైనే ఎక్కుపెడుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు.చంద్రబాబు.. ఇప్పుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు. దశాబ్దాల రాజకీయ అనుభవం. పాలనలో, రాజకీయంలో ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేయాలంటే ఎవరికీ సాధ్యపడదు. కానీ.. గత ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతిని ఇప్పుడు డిఫెన్స్‌లోకి పడిపోయారు. ఆయన రాజకీయ జీవితం కాస్త ఒక్కసారిగా ఉల్టాపల్టా అన్నట్లు అయింది. అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ నేతలను ముఖ్యంగా జగన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. చంద్రబాబు మీద కక్ష తీర్చుకునే సమయం వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీకి బీజేపీ కూడా తోడుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ పెద్దగా మైలేజ్‌ లేకున్నా కేంద్రంలోని అధికారాన్ని చెప్పుకొని చంద్రబాబు మీద రెచ్చి పోవాలని వ్యూహాలు రచిస్తోంది.

Also Read: జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?

బాబును చెడుగుడు ఆడుకోవడానికి బీజేపీ నేతలు సిద్ధమయ్యారట. బాబుని టార్గెట్‌ చేస్తూ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్‌ నరసింహారావు వంటి వారు రోజూ ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశాల్లోనూ  సోము వీర్రాజు గత పాలన గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన అమరావతి రాజధానికి కేంద్రం ఇచ్చిన ఏడు వేల కోట్ల రూపాయ‌లు ఏమయ్యాయి బాబూ అంటూ గట్టిగానే నిలదీశారు. బీజేపీ ఇలా ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబుతో కెలికి కయ్యం పెట్టుకోవాలని చూస్తోంది. ఆయన సహనానికి పరీక్ష పెడుతోంది. చంద్రబాబు రెచ్చిపోయి ఎప్పుడైనా రివర్స్ అటాక్ చేయకపోతారా అన్నట్లు వేచిచూస్తోందట. చంద్రబాబు ఆ వేడిలో ఏకంగా మోడీ మీదకు దండెత్తితే అదే ఆయనకు శాపంలా తయారవుతుందనేది బీజేపీ నేతల ఎత్తుగడట. మోడీని చంద్రబాబు ఏమైనా అంటే ఎప్పటికీ బాబుతో ఇక పొత్తు ఉండదని, ఆ విధంగా తమ పెద్ద నేతల మీద చంద్రబాబు నోరు పారేసుకుంటే దాన్ని సాకుగా చూపించి ఆయన్ని పూర్తిగా దూరం పెట్టాలన్నది బీజేపీ నేతల నయా వ్యూహంలా కనిపిస్తోంది.

Also Read: జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మళ్లీ ఫెయిల్ కానుందా…?

‘తేనె తెట్టెను కుదిపితే ఎవరికి నష్టం.. అది అందరికీ తెలిసిందే..’.. అయితే చంద్రబాబు వంటి లీడర్‌‌ను కుదపాలనుకోవడం కూడా అలాంటిదేనని రాజకీయ వర్గాల్లో టాక్‌. అయితే.. ఏజ్‌ ప్రాబ్లంతో ఈ మధ్య బాబు కూడా కొంత అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. దీనినే తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ విమర్శలు శ్రుతి మించితే మాత్రం బాబుకు తపోభంగం కలగక మానదు అని కూడా అంచనా వేస్తున్నారు. అప్పుడు మళ్లీ బాబు మోడీనీ, బీజేపీ నేతలను తప్పకుండా టార్గెట్ చేస్తారు. ఎటుపెట్టి టీడీపీని దూరం చేయడమే టార్గెట్‌గా ఏపీ బీజేపీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి చంద్రబాబు ఏమైనా రివర్స్‌ అటాక్‌ చేస్తారా..? లేదా మోదీతో సంధి కోసం ప్రయత్నిస్తారా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

బ్రేకింగ్:భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు!

India, china
అనుకున్నట్టే అవుతోంది. ఇన్నాళ్లు ఆయుధాలు వాడకూడదని నిర్ణయించుకున్న చైనా-భారత్ సరిహద్దుల్లో 60 ఏళ్ల తర్వాత కాల్పుల కలకలం చేసుకుంది. 1962 యుద్ధంలో భారత్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు తుపాకులు సరిహద్దుల్లో వాడకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా ముష్టిఘాతాలు, తలపడడాలు తప్పితే నేరుగా తుపాకులతో కాల్చుకోలేదు.

Aslo Read: డ్రగ్ కేసులో స్టార్ల పేర్లను బయటపెట్టిన రియా చక్రవర్తి?

తాజాగా చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తూర్పు లఢక్ లోని పాంగాంగ్ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపినట్లు సమాచారం.

అయితే తొలుత భారత్ కాల్పులు జరిపిందంటూ చైనా పశ్చిమ కమాండర్ బుకాయించాడు. అయితే చైనా కాల్పులు జరిపాకే భారత్ కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ తమ వాదనను సమర్థించుకున్నారు. దీనిపై భారత సైన్యం స్పందించలేదు.

కాగా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖను చైనా మార్చేందుకు ప్రయత్నిస్తుండడంతో భారత్ అడ్డుకుంటుంటోంది. పాంగాంగ్ సరస్సు సమీపంలో కీలక పర్వత ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. చైనా కుట్రలను భారత్ తిప్పికొడుతూ పర్వత ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటోంది.

Aslo Read: కీలక మలుపు: వరవరరావు అల్లుళ్లకు నోటీసులు

కాగా డ్రోన్ లతో భారత సైన్యంపై నిఘా వేసేందుకు చైనా పంపించిందని.. హెచ్చరించినా వినకపోవడంతోనే భారత్ కాల్పులు జరిపి ఉంటుందని తెలుస్తోంది. ఈ తాజా కాల్పులపై భారత్ సైన్యం అధికారికంగా స్పందించలేదు.

కీలక మలుపు: వరవరరావు అల్లుళ్లకు నోటీసులు


భీమా కోరెగావ్‌లో జనవరి 1న జరిగిన హింస కేసులో పోలీసులు ఆగస్టులో ఫెరీరా, గొంజాల్వెజ్, భరద్వాజ్‌తోపాటు తెలుగు కవి వరవరరావు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాను కూడా అరెస్టు చేశారు. నిందితులు అగ్ర మావోయిస్టు నేతలతో సంప్రదింపులు జరిపినట్టు ఈమెయిల్స్ లభించినట్టు పోలీసులు చెప్పారు. తర్వాత దిల్లీ హైకోర్టు ఆదేశాలతో పోలీసులు గౌతమ్ నవ్‌లఖాను తమ కస్టడీ నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. 56 ఏళ్ల సుధా భరద్వాజ్ 30 ఏళ్లకు పైగా ఆదివాసీల హక్కుల సాధనకై పోరాడుతున్నారు. 78 ఏళ్ల వరవరరావు విరసం నేత, గౌతమ్ నవ్‌లఖా ప్రముఖ యాక్టివిస్ట్. ఆయన పౌరహక్కులు, మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కుల అంశాలపై పనిచేస్తున్నారు. అరుణ్ ఫెరీరా, వర్నెన్ గొంజాల్వెజ్ ఇద్దరూ న్యాయవాదులు. సుప్రీం కోర్టు ఈ ఐదుగురినీ అక్టోబర్ 25 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.

Also Read: బ్రేకింగ్:భారత్-చైనా బలగాల మధ్య కాల్పులు!

భీమా కోరెగావ్‌ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్‌ ఇవ్వాలని విరసం నేత వరవరరావు అల్లుళ్లకు ముంబై ఎన్‌ఐఏ పోలీసులు నోటీసులు పంపారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉందన్న ఆరోపణలపై వరవరరావును కస్టడీలో పెట్టగా.. తాజాగా ఆయన అల్లుళ్లను కూడా సాక్ష్యం కోసం ముంబై రావాలని పిలవడం చర్చనీయాంశం అయింది. సెప్టెంబరు 9న విచారణకు రావాలని నోటీసులు అందాయని వరవర రావు అల్లుళ్లు సత్యనారాయణ, కూర్మనాథ్‌ కూడా ఈ మేరకు ధ్రువీకరించారు.

సీఆర్‌పీసీ సెక్షన్ 160, 91 కింద ఈ నోటీసులు చ్చారు. (160 సెక్షన్ కింద అనుమానం ఉన్న ఎవరినైనా సాక్ష్యం కోసం పోలీసులు పిలిపించవచ్చు. 91 సెక్షన్ కింద సాక్షాలుగా పత్రాలు వంటివి చూపమని కోరుతారు.) ప్రస్తుతం కె.సత్యనారాయణ హైదరాబాద్‌లోని ఇఫ్లు విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కూర్మనాథ్ హైదరాబాద్‌లో జర్నలిస్టుగా ఉన్నారు. 2018 ఆగస్టులో వరవరరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాల సేకరణలో భాగంగా సత్యనారాయణ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేశారు. పుణె నుంచి వచ్చిన పోలీసు బృందం ఆయన ఫ్లాట్లో తనిఖీలు చేపట్టింది. తనకు భీమా కోరెగావ్ కేసుతో సంబంధం లేదని సత్యనారాయణ వాదించినా పోలీసులు తనిఖీలు వదల్లేదు. ఆయనతోపాటే కూర్మనాథ్ ఇంట్లోనూ సోదాలు చేశారు.

Also Read: డ్రగ్ కేసులో స్టార్ల పేర్లను బయటపెట్టిన రియా చక్రవర్తి?

కేవలం వరవరరావు అల్లుణ్ణి కాబట్టే తనను మానసికంగా వేధిస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. ‘నేను వరవరరావుకు బంధువును అనేది వాస్తవం. కానీ నాకూ భీమా కోరెగావ్ అల్లర్లకూ ఏ సంబంధమూ లేదు’ అని సత్యనారాయణ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని.. కరోనాతోనూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వృద్ధాప్యం కావడంతో రకరకాల వ్యాధులు, సమస్యలు ఉన్నాయని, ఆయనకు ఇస్తున్న ట్రీట్‌మెంట్‌పై ఎలాంటి సమాచారమూ ఇవ్వడం లేదని ఇప్పటికే పలుమార్లు కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. ఆయన అభిమానులూ ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేయాలంటూ ప్రజాసంఘాలు కూడా విన్నవించాయి. ఇప్పటికే ఆయన క్షేమ సమాచారం తెలియక సతమతం అవుతున్న ఆయన కుటుంబానికి తాజాగా నోటీసులు రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ముంబైలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా అక్కడికి రావడం తమకు ఆందోళనగా ఉందని కూర్మనాథ్ మీడియాతో అన్నారు. విచారణకు రావాల్సిందేనని ముంబై పోలీసులు నోటీసులు ఇవ్వడం.. వైరస్‌ నేపథ్యంలో రాలేకపోతున్నామని వరవరరావు అల్లుళ్లు అంటుండడంతో కేసు ఎటు మలుపు తిరుగుతుందో తెలియకుండా ఉంది.

రియా వెనుక బాలీవుడ్ హీరోలు?

Riya chakravarthyబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి వెనుక ఎవరున్నారన్నది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.. రియా ఎదుగుదలను చూడలేక కొందరు బాలీవుడ్ హీరోలే రియాను పావుగా వాడి అతడిని నీరుగార్చారా? డ్రగ్స్ కు బానిసను చేసి అతడి మరణానికి కారణమయ్యారా? సోమవారం విచారణలో పలువురు బాలీవుడ్ హీరోల పేర్లను రియా వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. వారి పేర్లు మాత్రం బయటకు రాలేదు.

Also Read: ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

దీన్ని బట్టి సుశాంత్ లాంటి వర్ధమాన నటుడిని ఎదగనీయకుండా బాలీవుడ్ హీరోలు కుట్రపన్నారనే వార్తలు మీడియాలో వెలువడున్నాయి. సుశాంత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు వెనుక ఎవరు ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలీవుడ్ స్టార్లు రియాను ప్రలోభ పెట్టి ఇలా చేశారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. సుశాంత్ మరణించడానికి మానసికంగా రియా ఇబ్బంది పెట్టిందా అనే విషయంలోనూ సీబీఐ ఆరాతీస్తోంది.

తాజాగా సోమవారం విచారణలో సుశాంత్ మృతి కేసులో బాలీవుడ్ స్టార్ల ప్రమేయంపై రియా నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ కేసు గొప్ప మలుపు తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: బిగ్ బాస్ 4 : ఈ సారి వారిదే డామినేషన్

సుశాంత్ సింగ్ కు తాను డ్రగ్స్ ఇచ్చానని రియా ఒప్పుకున్నట్టు సమాచారం. తన తమ్ముడు షోవిక్ ద్వారా డ్రగ్స్ తెప్పించి సుశాంత్ కు ఇచ్చానని రియా దర్యాప్తులో అంగీకరించినట్టు సమాచారం. దీంతో ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ఇచ్చానని.. తాను మాత్రం వాడలేదని రియా తెలిపినట్లు సమాచారం.   సుశాంత్ వ్యవహారంలో రియా పాత్ర ఉందని తేలడంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ముంబై పోలీసులు విచారించినా.. సీబీఐ విచారించినా ఈ కేసు తెగడం లేదు. రోజుకో విషయం బయటపడుతూ ఉత్కంఠ రేపుతోంది. సోమవారం ఎన్.సీ.బీ విచారణలో బాలీవుడ్ హీరోల పేర్లను రియా బయటపెట్టినట్టు సమాచారం.

తెలంగాణ సర్కార్ మరో భారీ ఆఫర్

1

Land in Telangana

హైదరాబాద్ సహా నగరాల్లో పెద్ద ఎత్తున భూముల కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. అక్రమంగా లేఅవుట్లు వెలుస్తున్నాయి. దీంతో ఈ అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు తెలంగాణ సర్కార్ మరో అవకాశం ఇచ్చింది.

Also Read: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల్లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వీలుగా తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రత్యేక ఎల్.ఆర్.ఎస్ మేళాలు నిర్వహించనుంది.

ఈ సారి ఎల్.ఆర్ఎస్ అవకాశం కేవలం నూతన మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కొత్త మున్సిపాలిటీల్లో ఎల్.ఆర్ఎస్ అవకాశంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: బ్రేకింగ్ : తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్

ఇక ఎల్.ఆర్.ఎస్ పై అవగాహన కల్పించేందుకు ప్రతీ మంగళ, శనివారాల్లో మేళాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ శాఖ ఆదేశించింది. అక్రమ లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందులు తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ తో క్రమబద్దీకరించుకోవాలంటున్నారు.

ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూశారు. విలన్ గా కమెడియన్ గా ఆయన నటనా గొప్పతనాన్ని గురించి భవిష్యత్తు తారలు మరియు తరాలు తరతరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గతంలోనూ ఆయన గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ, ఈ తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. దాంతో వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Also Read: టీవీ9 దేవి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నిజానికి ఆయన రేపు హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనాలి. కానీ ఈ లోపే ఈ దారుణం జరిగిపోయింది. ఇక గత ఐదు నెలలు నుండి కరోనా కారణంగా సినీమా షూటింగ్ పై ప్రభుత్వ నిషేధం ఉండడంతో  ఆయన గుంటూరులోని తన కుమారుడి నివాసంలోనే ఉంటున్నారు. 1946 మే 8న జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి.. బ్రహ్మపుత్రుడు చిత్రంతో రామానాయుడు సహాయంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తరువాత అవకాశాలు లేక మళ్లీ కొన్నాళ్ళు జాబ్ చేసి.. ఎలాగోలా మళ్లీ ఇండస్ట్రీకే వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

Also Read: బిగ్ బాస్ 4 : ఈ సారి వారిదే డామినేషన్

ముఖ్యంగా రాయలసీమ మాండలీకంతో ఆయన పలికే మాటలు అలాగే కామెడీ విలనిజమ్ తో పాటు సీరియస్ విలన్ గానూ ఆయన పలు పాత్రలను పండించి తనకంటూ ప్రత్యేకమైన నటుడిగా నిలిచిపోయారు. Oktelugu.com తరఫున జయప్రకాశ్ రెడ్డి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు


మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం కేసీఆర్‌‌ కేబినెట్‌ మీట్‌ పెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకటించిన వెంటనే జిల్లాల వారీగా వీఆర్వోల దగ్గర ఉన్న పెండింగ్‌ ఫైల్స్‌ ను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. వెంటవెంటనే తహసీల్దార్లు వాటిని తమ పరిధిలోకి తీసుకొని కలెక్టర్లకు అందజేశారు. వీటితోపాటే ఇంకొన్ని నిర్ణయాలు వెల్లడించారు.

Also Read: బ్రేకింగ్ : తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్

– ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020, ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్–2020ని ఆమోదించింది. దీని ప్రకారం తెలంగాణలో వీఆర్వోను రద్దు చేస్తూ ప్రకటించారు.
– తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్– గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.
– తెలంగాణ  జీఎస్టీ యాక్టు -2017లో సవరణ బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020, ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020, ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002‌కు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
– ఆయుష్ మెడికల్ కాలేజీల్లో లెక్చరర్ల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.
– టీఎస్ బిపాస్ బిల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
– తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లుతో పాటు ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972కు సవరణ బిల్లును ఆమోదించింది.
– కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది.

Also Read: దుబ్బాక టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి అతడేనా?

– కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
– 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ పచ్చజెండా ఊపింది. కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.