Home Blog Page 8320

బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే !


కరోనా కాలం ఇంకా పోకముందే షూటింగ్ లను మొదలుపెట్టేశారు మన హీరోలు. సాయితేజ్, నాగచైతన్య, క్రిష్ టీం, నాగార్జున ఇలా కొంతమంది షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నారు. కానీ మిగిలిన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇప్పుడు షూట్ ఏంటి.. ఎందుకు రిస్క్ అంటూ ఇప్పట్లో షూటింగ్ వద్దు అంటున్నారు. పైగా ఈ ఏడాది మొత్తం షూట్ పోస్ట్ ఫోన్ చేస్తారట. కానీ బాలయ్య మాత్రం షూట్ కి రెడీ అంటున్నాడు. బోయపాటితో పాటు బాలయ్య కుటుంబ సభ్యులు కూడా కొన్నాళ్లు ఆగుదాం అంటున్నా… నాకేం భయం షూట్ చేయాల్సిందే అంటున్నాడట. పైగా అందరి కంటే మనమే ముందు షూటింగ్ ను పూర్తి చేయాలని.. సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని బాలయ్య సన్నాహాలు చేస్తున్నాడు. దాంతో బోయపాటి శ్రీను ప్రస్తుతం షెడ్యూల్ వేస్తున్నాడు. సెప్టెంబర్ 14 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలోని విలేజీ సెట్ లో షూట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు.

Also Read: డ్రగ్స్ వ్యవహారంలో ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ ?

నిజానికి దర్శకుడు బోయపాటి శ్రీను ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తీయాలనుకున్నారు. సినిమాలో ఎక్కువగా యాక్షన్ ఉండటంతో ఎక్కువమంది సిబ్బంది షూట్ కి అవసరం అవుతారు. ఈ కరోనా కాలంలో అధిక సిబ్బందితో షూట్ అనేది సాధ్యం కాదు, అందుకే బోయపాటికి కూడా ఇప్పుడు షూట్ చేయడం ఇష్టం లేదనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అయితే కరోనా ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉన్నా.. ఇప్పుడు షూట్ చేయకపోతే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయలేరు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు సినిమాని పూర్తి చేయాలి. మరి బాలయ్య ఊపు చూస్తుంటే.. నవంబర్ లోపే షూటింగ్ ను పూర్తి చేసేలా ఉన్నాడు. కాకపోతే షూట్ స్టార్ట్ చేసి పూర్తి చేసేదాకా మిగిలిన నటీనటులు కూడా అంతే క్రమశిక్షణతో సపోర్ట్ చేస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న.

Also Read: బ్రేకింగ్: సుశాంత్ కేసులో రియా అరెస్ట్

ఇది బాలయ్య బాబు సినిమా కాబట్టి.. ఆయనకు కోపం వస్తే.. క్యారెక్టర్ తో పాటు యాక్టర్ కూడా రిస్క్ లో పడతాడు కాబట్టి.. ఇష్టం ఉన్నా లేకపోయినా షూట్ కి రావాల్సిందే. అయితే ఇక్కడ మరో సమస్య ఏంటంటే.. రెండు సంవత్సరాల నుండి వెతుకుతున్నా ఇంతవరకూ బాలయ్య బాబుకు ఫామ్ లో ఉన్న హీరోయిన్ దొరకలేదు. దాంతో బోయపాటి ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు. అయితే ఒకపక్క కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా దెబ్బకు సినీ లోకం అల్లాడిపోయింది. ఇంకా ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. బాలయ్య తోటి హీరోలు వెంకీ, చిరు లాంటి స్టార్ హీరోలు కరోనా వల్లే.. ఈ సంవత్సరం మొత్తం షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నారు. అలాగే కొంతమంది హీరోలు సైతం షూటింగ్ అంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది.

శిరోముండనం కేసు: నిందితుల అరెస్ట్ ను నిలిపేస్తూ హైకోర్టు సంచలనం

తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ నాయకులకు గొప్ప ఊరట లభించినట్టైంది.

Also Read: జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

వైసీపీ నేత కవల కృష్ణమూర్తి అతడి అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్రపతి కూడా స్పందించి సామాజికన్యాయశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఈ కేసులో బాధితుడు ప్రసాద్ చెప్పేవన్నీ అబద్దాలు అని ప్రమాదంలో గాయపడ్డ విజయ్ బాబు వెల్లడించాడు. దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి అక్టోబర్ 5కు వాయిదా వేసింది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్రపతి కూడా సీరియస్ అయ్యి విచారణ చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కార్ కూడా దీనిపై సీరియస్ గా ముందుకెళుతోంది.

తాజాగా ఈ శిరోముండనం కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఆరుగురు నిందితులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. బాధితుడి వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేస్తూ హైకోర్టు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేశారు.

Also Read: బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలంటూ బాధితుడు వరప్రసాద్ కు హైకోర్టు నోటీసులుజారీ చేసింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ట్రైనీ ఎస్ఐ ఫిరోషాతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు.

నటి శ్రావణి ఆత్మహత్య.. వెనుక షాకింగ్ విషయాలు

tv actor sravani
tv actor sravani

ప్రముఖ టెలివిజన్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ప్రముఖ సీరియల్ లో శ్రావణి నటిస్తోంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మధురానగర్ లో తన నివాసంలో రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

శ్రావణి ఆత్మహత్యకు ప్రేమనే కారణంగా తెలుస్తోంది. ప్రేమ పేరుతో వంచనకు గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

Also Read: బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే !

శ్రావణి 8 ఏళ్లుగా తెలుగు టాప్ సీరియల్స్ లో నటిస్తోంది. మౌనరాగం, మనసు మమత లాంటి ఈటీవీ సీరియల్స్ లో రాణిస్తోంది. ఈ క్రమంలోనే కాకినాడకు చెందిన ఓ యువకుడితో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత యువకుడి నుంచి వేధిపులు మొదలయ్యాయి. అతడి నిజస్వరూపం తెలిసి శ్రావణి దూరం పెట్టింది.

డబ్బులు ఇవ్వాలని లేకపోతే వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని ఆ యువకుడు బెదిరించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రూ.లక్ష ఇస్తే ఫొటోలు డిలీట్ చేస్తానని యువకుడు చెప్పడంతో విడతల వారీగా శ్రావణి పంపింది. డబ్బులు ఇచ్చినా వేధింపులు ఆపకపోవడంతో శ్రావణి జూన్ 22న ఎస్ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది.

Also Read: ఆమె ఓ స్ఫూర్తి.. కానీ ఆమెకు కూడా వేధింపులా ?

పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆమె ఓ స్ఫూర్తి.. కానీ ఆమెకు కూడా వేధింపులా ?


ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ ఆమె.. ఒక మామూలు కుటుంబం నుంచి సరైన కనీస సౌకర్యాలు కూడా లేని ఒక ఆడపిల్ల.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించడం వెనుకున్న కష్టం గురించి, ఆమె వెనుకున్న పట్టుదల గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఆమె కరణం మల్లీశ్వరి. వెండితెరపై బయోపిక్స్ హవా నడుస్తోన్న ఈ కాలంలో ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర, వారి వారి గొప్పతనాన్ని చెప్పకపోతే ఎలా..? వాళ్ళు సాధించిన విజయాలను వెండితెరపై చూపించకపోతే ఎలా..? అందుకే నేటితరం ప్రేక్షకుల కోసం ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ కరణం మల్లీశ్వరి బయోపిక్ ను కోన వెంకట్ నిర్మిస్తున్నారు. అయినా మల్లీశ్వరి అంటే అవార్డులు కాదు.. ఒక స్ఫూర్తి. ఆమె సాధించిన వాటి వెనుక ఉన్న కన్నీళ్లు కష్టాలు అవరోధాలు అన్నిటికి మించి కంటతడి పెట్టించే ఎన్నో అంశాలు ఆమె జీవితంలో ఉన్నాయి.

Also Read: డ్రగ్స్ వ్యవహారంలో ప్రభాస్ హీరోయిన్ అరెస్ట్ ?

అయితే ఈ బయోపిక్ గురించి కరణం మల్లీశ్వరి మనోగతం వింటుంటేనే.. మారుమూల గ్రామాల్లోని నిరుపేద ఆడపిల్లలకు గొప్ప స్ఫూర్తిలా అనిపిస్తోంది. ఆడపిల్లనైతే మాత్రం కొన్నిటికే పరిమితం అని ఎందుకు అనుకోవాలి ? నేను నా చిన్నతనంలో ఇలాగే అనుకున్నాను. ఎవరేమన్నా లక్ష్యపెట్టకుండా కష్టపడ్డాను. కానీ నాకు కండలు తిరిగిన దేహం లేదు, దేహం కోసం కొండంత బరువులు ఎత్తేదాన్ని. బలం కోసం అందరూ ఆహారం తింటారని నేను అప్పుడు అనుకోలేదు. మనకు ఉన్న దానిలోనే మనం సాధించాలి అనుకున్నాను. నేను నా శారీరక సామర్థ్యం కోసం నిరంతరం వ్యాయామాలు చేసేదాన్ని. అలాగే అప్పట్లో నా ఆహారం ఏమిటో తెలుసా అంబలి. అలాగే బచ్చలికూర, మునగాకు ఇవే నాకు అప్పట్లో ప్రొటిన్‌ ఫుడ్‌. ఏమైనా నా మనోబలమే ముందుకు నడిపింది నన్ను. నా దారిలో కూడా ఎవరికీ తెలియని ముళ్లపొదలు అడ్డొచ్చాయి. నాకు కూడా రాళ్లు గుచ్చుకున్నాయి. అన్నీ ఓర్చుకున్నా. ఏదైనా సాధించాలి అంటే.. ముందు ఓపిక ఉండాలి.. అన్నిటికీ మించి కష్టాలను భరించడం నేర్చుకోవాలి. అంతేగాని ఎవ్వరికీ దాసోహం కాకండి’ అంటూ కరణం మల్లీశ్వరి తెలిపింది.

Also Read: బ్రేకింగ్: సుశాంత్ కేసులో రియా అరెస్ట్

మొత్తానికి కరణం మల్లీశ్వరి జీవితంలో కూడా చాలా విశేషాలు ఉన్నట్లు ఉన్నాయి. అప్పట్లో ఆమెకు కూడా వేధింపులు ఎదురయ్యాయి అట. వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. నిజానికీ కరణం మల్లీశ్వరి బయోపిక్‌ మాట ఇప్పటిది కాదు. ఐదేళ్లుగా చిత్రబృందం ఈ బయోపిక్ చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రచయిత, నిర్మాత కోన వెంకట్‌, దర్శకురాలు సంజనారెడ్ఢి ఎట్టకేలకు ఈ బయోపిక్ ను నవంబర్ నుండి మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఏదో రెగ్యులర్‌ సినిమా ఫార్ములాతో కాకుండా, ఆడపిల్లలకు స్ఫూర్తి కలిగించేలా ఈ బయోపిక్ ను కోన వెంకట్‌ సిద్ధం చేస్తున్నారట.

ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం!

kcr in assembly

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు. కర్రవిరగకుండా పాముచచ్చేలా ఆయన ప్లాన్లు ఉంటాయి. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తే సమ్మె చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు అప్పట్లో బెదిరించారు. ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమైంది. భారీ అవినీతి కూపమైన రెవెన్యూను ప్రక్షాళన చేయడం అంత ఈజీ పనికాదని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క ఉద్యోగి సమ్మెకు వెళ్లకుండా.. చాకచక్యంగా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశారు కేసీఆర్..ఈరోజు అసెంబ్లీలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.

Also Read: కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టంతో అవినీతిని అంతమొందిస్తారా…?

సీఎం కేసీఆర్ అన్నంత పనిచేశాడు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం.  రెవెన్యూ కోర్టుల స్థానంలో జిల్లాకో ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రిటైర్డ్ జడ్జి స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్.. ఇకపై మండలం నుంచి జిల్లా వరకు అన్ని భూవివాదాలను పరిష్కరించనుంది. దీంతో తహసీల్దార్ నుంచి ఆర్డీవో, జేసీ వరకు ఉన్న మూడంచెల వ్యవస్థకు కేసీఆర్ చరమగీతం పాడారు. ఇక ట్రిబ్యునల్ లో తీర్పు నచ్చని వారు కలెక్టర్ కు అప్పీల్ చేసే సౌకర్యం కల్పించారు.ఇలా రెవెన్యూ వ్యవస్థలో అవినీతి లేకుండా పూర్తి పారదర్శకంగా కేసీఆర్ ముందుకు పోతున్నారు.

భూవివాదాల పరిష్కారానికి ప్రతి శనివారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా రెవెన్యూ కోర్టులను నిర్వహించేవారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ ఈ భూవివాదాలపై తీర్పులు చెప్పేవారు. ఈ క్రమంలో వివాదాల్లో జాప్యం, మితిమీరిన అవినీతి ఆరోపణలు వచ్చేవి. దీంతో ఈ వ్యవస్థనే తీసివేస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు.

Also Read: బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….

ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి మంగళం పాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం శాసనసభ ముందుకు రానున్న భూ యాజమాన్య హక్కులచట్టం -2020(ఆర్ఓఆర్) బిల్లులో ఈ మేరకు పొందుపరిచినట్లు సమాచారం.

మొత్తం రెవెన్యూ శాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ ముందుకెళ్తున్నారు.   రెవెన్యూ కోర్టుల్లో మితిమీరిన అవినీతి ఆరోపణలు రావడంతో వీటిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందుకే రెవెన్యూ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

Gottipaati raviజగన్ దెబ్బకు టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు టీడీపీ నేతలు జైలుకు వెళ్లారు. దీంతో టీడీపీ బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయింది. కానీ ఒకే ఒక్కడు ఆ టీడీపీ ఎమ్మెల్యే మాత్రం జగన్ ఎన్ని ముప్పుతిప్పలు పెట్టినా ఎదురొడ్డి నిలుస్తున్నాడు. ఆర్థికంగా దెబ్బతీస్తున్నా తట్టుకుంటున్నారు. జగన్ కు ఎదురెళుతూ సత్తా చాటుతున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

ఏపీలో అన్ని జిల్లాల్లో వైసీపీ గాలి వీచినా ప్రకాశం జిల్లాలో మాత్రం ఆ గాలిని తట్టుకొని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. కొందరు చేరడం లేదు. గత కొన్ని నెలలుగా  వైయస్ఆర్సిపి నాయకత్వం టీడీపీ ఎమ్మెల్యేలను, మాజీ నేతలను ఆకర్షిస్తోంది. పలువురిని చేరేలా ఒప్పిస్తోంది. వినని వారిని  సామధానభేద దండోపాయాలు ప్రయోగించి దారికి తెస్తోంది. ఎలాగైనా సరే ప్రకాశం జిల్లాలో టిడిపిని తుడిచిపెట్టే ప్రయత్నాలకు అన్ని ప్రయత్నాలను వైసీపీ అధిష్టానం చేస్తోందని టాక్.

ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనులను వైసీపీ సర్కార్ చేస్తోంది. ఇప్పటికే బెదిరించారు. వారి మైనింగ్ లీజులను కూడా రద్దు చేశారు. ఈ దాడి తరువాత, టిడిపి సీనియర్ శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణ మూర్తి, చీరాలకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దెబ్బకు వైసీపీలో చేరారు. దీంతో ప్రకాశం జిల్లాలో ఇది వైసీపీకి దక్కిన విజయంగా మారింది.

అయితే అందరూ అధికార పార్టీ వైపు చూస్తున్నా కూడా.. వైయస్ఆర్సి ఎంత ప్రయత్నించినా టిడిపి అద్దంకి ఎమ్మెల్యే  గొట్టిపాటి రవి కుమార్ మాత్రం మెట్టుదిగడం లేదు.. టిడిపిని విడిచిపెట్టమని అతనిపై ఒత్తిడి తీసుకురావడానికి అధికార పార్టీ అన్నింటినీ ప్రయోగించింది.. కానీ ఈ హామీలు ఏవీ కార్యరూపం దాల్చలేదు.దీంతో సీరియస్ అయిన  వైసీపీ ప్రభుత్వం గొట్టిపాటికి ప్రధాన ఆదాయ వనరు అయిన మైనింగ్ లీజులను కూడా రద్దు చేసింది. అతని గనులను కూడా స్వాధీనం చేసుకుంది. కానీ గొట్టిపాటి హైకోర్టుకు వెళ్లి తన లీజులను తిరిగి పొందాడు. కాబట్టి, ఇప్పుడు వైసీపీ ప్లాన్ బి అమలు చేస్తోంది. గొట్టిపాటి ప్రధాన అనుచరులను ఆయననుంచి దూరం చేసి ఆయన కాళ్ళ క్రింద నుండి బలమైన నేతలను లాగాలని అధికార పార్టీ నిర్ణయించింది.

Also Read : మందుబాబులకు మళ్లీ షాక్ ఇస్తోన్న జగన్ సర్కార్

తాజాగా గొట్టిపాటికి బలమైన అనుచరుడు అయిన చింతా రామారావు, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు మరియు సంతమగళూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకుడిని ఆకర్షించి వైసీపీలో చేర్చుకున్నారు. ఇది గొట్టిపాటి రవి కుమార్ కు బలమైన దెబ్బగా అభివర్ణిస్తున్నారు.  ఇంతవరకు  అద్దంకి నియోజకవర్గంలో టిడిపికి బలంగా.. గొట్టిపాటి రైట్ హ్యాండ్ గా ఉన్న చింతా రామారావు తన మద్దతుదారులతో కలిసి మంత్రి బలినేని శ్రీనివాస రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాడు. దీంతో అక్కడ టీడీపీకి బలమైన దెబ్బ తగిలింది. గొట్టిపాటికి ఇది షాక్ లా మారింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై తాను అధికార పార్టీలో చేరినట్లు చింతా రామారావు తెలిపారు.

గొట్టిపాటికి ఇది ఒక షాక్. ఎందుకంటే అతను తన కేడర్‌ను మొదటి నుంచి కాపాడుకుంటున్నాడు. నిజానికి ఆయన మొదట కాంగ్రెస్ తో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత  వైసీపీలో చేరి సీటును గెలుచుకున్నాడు. కానీ తరువాత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు గురై టిడిపిలోకి గత ప్రభుత్వంలో ఫిరాయించాడు. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. మాతృపార్టీ అయిన వైసీపీలోకి ఎంత ఒత్తిడి తెచ్చినా చేరడం లేదు. గొట్టిపాటిని ఎంత దెబ్బతీస్తున్నా సరే పార్టీ మారేందుకు మాత్రం మొగ్గుచూపకపోవడం విశేషం.

-నరేశ్

Also Read : అమరావతి రైతులకు జగన్ సర్కార్ షాక్ ఇవ్వనుందా….?

బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

chandrababu

జగన్ ప్రభుత్వంపై పోరాటంలో కోర్టులనే టీడీపీ ఆయుధంగా వాడుతోంది. జగన్ సర్కార్ ను ముందుకెళ్లకుండా ఏపీ సర్కార్ ముందరికాళ్లకు బంధం వేస్తోంది.  ఇందుకోసం టీడీపీ  ప్రతిసారి వాడుతున్న కోర్టులనే ఆశ్రయిస్తూ ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. కోర్టుల ద్వారా అడ్డుకుంటున్న చంద్రబాబుకు షాకిస్తూ తాజాగా అమరావతి కుంభకోణంపై జగన్ సర్కార్ హైకోర్టునే ఆశ్రయించడం సంచలనమైంది. అమరావతిపై సీబీఐని దించేందుకు ఏపీ సీఎం జగన్ నడుం బిగించాడు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Also Read : అమరావతి రైతులకు జగన్ సర్కార్ షాక్ ఇవ్వనుందా….?

గత చంద్రబాబు సారథ్యంలోని టిడిపి పాలనలో అమరావతి రాజధాని పేరుతో జరిగిన మోసాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సిబిఐని ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును అభ్యర్థించి సంచలనం సృష్టించింది. ఇప్పుడీ వార్త ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.

అమరావతి కుంభకోణంపై ఇప్పటికే జగన్ సర్కార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును చేస్తోంది. అయితే సిట్ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదిస్తున్న రాష్ట్ర  అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ఈమేరకు అమరావతి కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థించారు.

గత ప్రభుత్వం చేసిన కుంభకోణంలో సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అడ్వకేట్ జనరల్  కోర్టుకు తెలిపారు. ప్రస్తుత రిట్ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రతివాదులుగా చేయాలని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికైన వైసీపీ ప్రభుత్వానికి నాడు చంద్రబాబు పరిపాలనా విధానాలను సమీక్షించే అధికారం ఉందని, దానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు లేవని ఆయన వాదించారు. సిఆర్‌పిసి నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, చట్ట ఉల్లంఘన లేదని ఆయన అన్నారు.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

అమరావతి కుంభకోణంపై దర్యాప్తు వద్దంటూ తెలుగుదేశం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును కోరిన ఏజి, పిటిషనర్లు సైతం ఈ భూ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీకి సహకరిస్తున్నారని వాదించారు.  వారికి స్వయంగా ప్రాథమిక హక్కులు లేదా చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన లేనందున ఈ కేసులో వారికి ప్రమేయం అవసరం లేదని ప్రభుత్వం ఏజీ హైకోర్టుకు విన్నవించారు.  అమరావతి కుంభకోణం విషయం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వ్యక్తిగతంగా  పిటీషనర్లను ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడంలో పిటిషనర్లు విఫలమయ్యారని ఏజీ వివరించారు.  అలాగే, ఈ విషయంలో రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను వారు కోర్టు ముందు ఉంచలేదని ఆయన అన్నారు.

అమరావతి కుంభకోణంపై జరుగుతున్న ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక కోర్టును కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇదివరకే లేఖ రాసిందని, ఇంకా హైకోర్టు స్పందన కోసం   వేచి ఉందని ఏజి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Also Read : మందుబాబులకు మళ్లీ షాక్ ఇస్తోన్న జగన్ సర్కార్

స్కూళ్లకు వచ్చుడు స్టూడెంట్ల ఇష్టమే..!

0

School in telangana

కరోనా కట్టడిలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అమలు చేసిన కేంద్రం అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుపెట్టింది. ఒక్కో నెల ఒక్కో వాటికి పర్మిషన్‌ ఇస్తూ వస్తోంది కేంద్రం. ఈనెలతో అన్‌లాక్‌ 4.0 ప్రారంభమైంది. అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా 9‌‌–12 తరగతి విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలను అనుమతినిచ్చింది. తాజాగా వీటికి సంబంధించిన ఎస్‌ఓపీని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. టీచర్లు, స్టూడెంట్లు పాటించాల్సిన రూల్స్‌ను అందులో పేర్కొంది. స్టూడెంట్స్‌ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చని.. లేదంటే ఆన్‌లైన్‌లోనూ క్లాస్‌ వినొచ్చని సూచించింది. ఆ ఆప్షన్‌ను స్టూడెంట్స్‌కు వదిలేసింది. అందుకు పేరెంట్స్‌ లేదా గార్డియన్స్‌ నుంచి లిఖితపూర్వకంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంది.

Also Read : అంతర్వేది రథం ఆహుతి వెనుక కుట్ర ఎవరిది..?

అయితే.. ఈ రూల్స్‌ ఓన్లీ కంటైన్‌మెంట్‌ జోన్లకు బయట ఉన్న స్కూళ్లకు మాత్రమే. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న స్కూళ్లు, కాలేజీలు తెరువడానికి వీల్లేదు. ఆయా జోన్ల పరిధిలోని స్కూళ్లకూ స్టూడెంట్లను అనుమతించరు. విద్యార్థులు, టీచర్లు కంటైన్‌మెంట్‌ జోన్లను సందర్శించరాదని ఆదేశించింది. అలాగే.. రీ ఓపెన్‌కి ముందే లేబరోటరీస్‌తో సహా క్లాస్‌ రూమ్‌లను అన్నింటినీ 1 శాతం సోడియం హైపోక్లోరైడ్‌ సొల్యూన్‌తో శానిటైజ్‌ చేయాలని పేర్కొంది. గతంలో క్వారంటైన్‌ సెంటర్స్‌గా కొనసాగిన వాటిలో డీప్‌ క్లీనింగ్‌, శానిటైజ్‌ చేయాలి. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ మొత్తం కలిపి 50 శాతం స్టాఫ్‌ మించరాదు.

వీటితోపాటు.. స్కూల్‌ మేనేజ్‌మెంట్లు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌కు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఒక్కరూ ఆరడుగుల ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. దాని ప్రకారమే విద్యార్థులకు సీటింగ్‌ ఏర్పాటు చేయాలి. స్కూల్‌ ఆవరణలోనే హ్యాండ్‌ వాష్‌ సదుపాయం కల్పించాలి. స్టాఫ్‌ రూమ్స్‌, లైబ్రరీల్లోనూ ఫిజికల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి. ఔట్‌ సైడ్‌ యాక్టివిటిస్‌ నిర్వహించాలనుకుంటే కరోనా రూల్స్ పాటించాలి. స్కూళ్లు, కాలేజీల లోపలికి ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతించాలి. ఎవరైనా టీచర్‌‌ లేదా స్టూడెంట్‌ లేదా స్టాఫ్‌ కరోనా లక్షణాలతో కనిపిస్తే సమీపంలోని హెల్త్‌ కేర్‌‌ సెంటర్‌‌కు పంపించాలి. అంతేగాకుండా.. స్కూల్‌ గోడలపై కరోనా మీద అవగాహన వచ్చేలా పోస్టర్లను అంటించాలి. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తే వాటినీ పూర్తస్థాయిలో శానిటైజ్‌ చేయాలి.

టాయిలెట్స్‌ను మరియు స్కూల్‌ ఫ్లోర్స్‌నూ ప్రతిరోజూ శుభ్రం చేయించాలి. టాయిలెట్స్‌లో సోప్‌ లేదా హ్యాండ్‌ వాష్‌ లిక్విడ్‌ను పెట్టాలి. ఫ్రీటైమ్‌లో కానీ.. స్కూల్‌ వదిలాక కానీ స్టూడెంట్లు గుమికూడకుండా వారికి సరైన అవగాహన కల్పించాలి. విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. ఆ స్టూడెంట్‌ను ఓ గదిలో ఐసోలేట్‌ చేయాలి. తదుపరి హెల్త్‌ సెంటర్‌‌ను సంప్రదించి కరోనా టెస్టు చేయించాలి అని కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.

Also Read : స్ఫూర్తినిస్తున్న ఐపీఎల్ పాట.. వింటే అదుర్స్?

మందుబాబులకు మళ్లీ షాక్ ఇస్తోన్న జగన్ సర్కార్

ap cm for wineshop
liquir shop

పొద్దంతా పనిచేసి రాత్రికి ఒక క్వాటర్ తాగి గమ్మున పడుకునేవారు చాలా మంది ఉంటారు. కొందరు లొల్లి పెడుతారు. సరే పనిచేసిన అలిసిపోయిన వారి బాధను మద్యం తీరుస్తుంది. కానీ ఏపీలో మద్యం బాగా కాస్ట్.. మరి ఏం చేయాలి. పక్కరాష్ట్రం నుంచి వచ్చిన చీప్ మద్యంను కొని తాగేస్తున్నారు. ఏపీలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. దీంతో శానిటైజర్ కూడా తాగి చనిపోయిన మందుబాబులున్నారు. పక్కరాష్ట్రాల నుంచి మద్యం ను రానీయకుండా ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ దారులు మూసుకుపోయాయి.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

ఇటీవల కొందరు హైకోర్టుకు ఎక్కడంతో ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. అయితే ఈ 3 బాటిళ్లపై కూడా ఏపీ ఎక్సైజ్ శాఖ అభ్యంతరం తెలుపుతోంది. 3 బాటిల్స్ తెచ్చుకోవాలని తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎక్సైజ్ శాఖ సూచించింది. ఈ తీర్పును అడ్డుపెట్టుకొని మద్యం అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని.. ఇతర రాష్ట్రాల నుంచి ఇష్టారీతిన మద్యం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ తన నివేదికలో పేర్కొంది.

ఇలా మందుబాబులను ఏపీ సర్కార్ వెంటాడుతోంది. రాష్ట్రంలో కొందామంటే భారీ రేట్లు. పైగా మంచి క్వాలిటీ మద్యం దొరకడం లేదు. పోనీ పక్కరాష్ట్రాల నుంచి 3 బాటిల్స్ చొప్పున తెంచుకుందామన్న ఒప్పుకోవడం లేదు. దానిపైన కూడా కోర్టుకెళుతోంది.

ఇలా మందుబాబుల డబ్బులు గుంజడమే పనిగా పెట్టుకుందన్న విమర్శలు తాగుబోతుల నుంచి వినిపిస్తున్నాయి. ఆ మూడు బాటిల్స్ తో ఏపీలోకి భారీగానే అక్రమ రవాణా అవుతోందట.. మరి ఆ 3 బాటిల్స్ ను అయినా తెచ్చుకోనిస్తారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఏపీ మద్యంప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

అమరావతి రైతులకు జగన్ సర్కార్ షాక్ ఇవ్వనుందా….?

Jagan shock to Amravati farmers

ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదనే చందాన కోర్టులో దాఖలవుతున్న పిటిషన్ల వల్ల మూడు రాజధానుల అమలు సాధ్యం కావడం లేదు. అయితే మూడు రాజధానుల నిర్ణయానికి కోర్టుల్లో అడ్డంకులు తొలగిన తరువాత జగన్ సర్కార్ అమరావతి రైతులకు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

అమరావతి రైతులు ఇచ్చిన భూములను జగన్ సర్కార్ ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టు మెట్లెక్కారు. దీంతో వైసీపీ ప్రభుత్వ పెద్దలు అమరావతిని శాసన రాజధానిగా ఉంచకుండా రైతులకు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. వైసీపీ ముఖ్య నేతలే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అమరావతిలో అసెంబ్లీ కూడా ఉండదని ప్రచారం జరుగుతోంది.

వైసీపీ మంత్రి కొడాలి నాని ఈ మేరకు నిర్ణయం తీసుకుని సీఎం జగన్ కు చెప్పారని… జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పారని ఒక ప్రణాళిక ప్రకారం జగన్ సర్కార్ అమరావతి నుంచి శాసన రాజధానిని తరలించే ప్రక్రియ చేపట్టబోతుందని తెలుస్తోంది. అమరావతి రైతులు మాత్రం వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని చెబుతున్నారు. జగన్ సర్కార్ తమను బెదిరించాలని ప్రయత్నిస్తోందని వాపోతున్నారు.

తమకు శాసన రాజధాని ఉన్నా లేకపోయినా నష్టం లేదని రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని తాము పోరాడుతునామని వాళ్లు తెలుపుతున్నారు. జగన్ సర్కార్ అమరావతి రైతులకు ఏ విధంగా షాక్ ఇవ్వబోతుందో చూడాల్సి ఉంది.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టంతో అవినీతిని అంతమొందిస్తారా…?

k.chandrashekar rao

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్లను నిలిపివేసి, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి సంచలన నిర్ణయాల అమలుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బందికి ప్రభుత్వం కొన్ని రోజుల పాటు సెలవులు ఇచ్చింది. రెవిన్యూ వ్యవస్థ విషయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read : బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?

తెలంగాణ రాష్ట్రంలో తహశీల్దార్‌, వీఆర్వోలు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల సోదాల్లో పట్టుబడుతున్నారు. వీఆర్వోలు, తహశీల్దార్లు దాచిపెట్టిన అవినీతి సొమ్మును చూసి షాక్ అవ్వడం సోదాలకు వచ్చిన అధికారుల వంతవుతోంది. వీఆర్వోల, తహశీల్దార్ల అవినీతిపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఅర్ సైతం రెవిన్యూ శాఖలో అవినీతిని అంతమొందించాలని కొత్త రెవిన్యూ బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

సీఎస్ కలెక్టర్లకు వీఆర్వోల దగ్గర ఉన్న రెవిన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటలెకి తెలంగాణ సర్కార్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ రిజిస్టేషన్ల శాఖలో భారీగా మార్పులు చేయనున్నారని…. పూర్తిస్థాయిలో సమీక్షలు జరిపిన తరువాతే ఎమ్మార్వోలకు తెలంగాణ సర్కార్ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను అప్పగించనుందని తెలుస్తోంది.

కేసీఆర్ సర్కార్ గృహ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్టార్లకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొందరు అధికారులు ధనార్జనే లక్ష్యంగా అవినీతిని పాల్పడుతున్నారని తెలిసి సీఎం కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి సీఎం కొత్త చట్టం ద్వారా అనుకున్నది సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Also Read : హవ్వా.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల కులాలు వెతికారంట

అక్షరాస్యతలో అథమ స్థాయిలో ఏపీ…. ఈ క్రెడిట్ ఎవరికో…?

Andhra Pradesh at the lowest level of literacy

కొన్ని రోజుల క్రితం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి మొదటి స్థానం వచ్చింది ఆ సమయంలో టీడీపీ, వైసీపీ పార్టీలు తమ వల్లే ఏపీకి మొదటి స్థానం వచ్చిందని గొప్పలు చెప్పుకున్నాయి. తమ పార్టీలే ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణమని విశ్లేషణలు సైతం ఇచ్చాయి. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి తొలి ర్యాంకు రాగా అక్ష్యరాస్యత విషయంలో బీహార్ కంటే తక్కువ ర్యాంకులో ఏపీ ఉంది.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

అయితే అటు తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతలు అక్షరాస్యత విషయంలో వచ్చిన ర్యాంకుల గురించి ప్రస్తావించడం గమనార్హం. సాధారణంగా దేశంలో అక్షరాస్యత విషయంలో కేరళ తొలి స్థానంలో బీహార్ చివరి స్థానంలో నిలుస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉండటం గమనార్హం. 96.2 అక్షరాస్యత శాతంతో కేరళ తొలి స్థానంలో ఉంది.

బీహార్ రాష్ట్ర అక్షరాస్యత రేటు 70.9 శాతం కాగా ఏపీ అక్షరాస్యత శాతం 66.4 శాతం కావడం గమనార్హం. అక్షరాస్యతలో జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ అధ్వాన్నమైన పరిస్థితిలో ఉండటం గమనార్హం. జాతీయ అక్షరాస్యత సగటు 77.7 శాతం కాగా ఏపీ అక్షరాస్యత శాతం దాదాపు 10 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, వివిధ పథకాలు అమలు చేస్తున్నా అనుకున్న ఫలితాలను సాధించడంలో విఫలమవుతోంది.

జగన్ సర్కార్ ఇప్పటికైనా ఈ ర్యాంక్ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది. అక్షరాస్యత విషయంలో ఇతర రాష్ట్రాలు ముందుకెళుతుంటే ఏపీ వెనుకబడటానికి గల కారణాలను అన్వేషించాల్సి ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఏపీ అక్షరాస్యత శాతం మరింత దిగజారే అవకాశం ఉంది.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

బాలకృష్ణను కెలికిన పోసాని… ఏం జరిగిందంటే….?

posani reacts on balakrishna real estate

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో మిగతా వాళ్లతో పోలిస్తే బాలకృష్ణ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఏ విషయం గురించైనా బాలకృష్ణ ముక్కుసూటిగా మాట్లాడతారు. కాస్త భోళాతనం ఉన్న బాలయ్య పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల గురించి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తెలంగాణ సర్కార్ తో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు చర్చలు జరపడంపై బాలయ్య సీరియస్ అయ్యారు.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

తనను పిలవకపోవడం గురించి స్పందిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, భూములను పంచుకోవడం కోసం వాళ్లు తెలంగాణ సర్కార్ ను కలుస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై టాలీవుడ్ స్టార్ హీరోలు సైలెంట్ కావడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా సినీ నటుడు, రచయిత, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళి ఈ వివాదం గురించి స్పందించి బాలకృష్ణను కెలికారు.

తనదైన శైలిలో బాలకృష్ణ వ్యాఖ్యలపై పోసాని విమర్శలు చేశారు. నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే భూములతో అవసరం ఉందదని పేర్కొన్నారు. తన లాంటి వ్యక్తి బాలయ్య వ్యాఖ్యల గురించి స్పందించకపోవడమే మంచిదని తాను ఏ విధంగా మాట్లాడతానో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. డబ్బు, పేరు ఉన్నవాళ్లే తెలంగాణ సర్కార్ ను కలిశారని… తెలంగాణ సర్కార్ కాళ్లు పట్టుకునే స్థితిలో చిరంజీవి, నాగార్జున లేరని అన్నారు. రాజకీయాల్లో ఇప్పుడు సినిమా వాళ్లకు స్కోప్ లేదని… సీఎం జగన్ తనకు పదవులు ఆఫర్ చేసినా తిరస్కరించానని పోసాని అన్నారు.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

వైసీపీలో గంటా చేరికకు బ్రేక్ వేస్తుంది అతనేనా…?

Ganta Srinivasa Rao

ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే గంటా శ్రీనివాసరావు చేసే రాజకీయాలు ఎప్పుడూ చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆయన ప్రతిసారి పోటీ చేసే నియోజకవర్గంలో మార్పును కోరుకుంటూ ఉండటంతో పాటు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండటానికి కుదిరితే ఆ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే గంటాకు వైసీపీలో చేరడానికి సమయం అనుకూలించడం లేదనే చెప్పాలి.

Also Read : జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

2019 ఎన్నికల ముందు నుంచి వైసీపీలో చేరడానికి గంటా శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు గంటా శ్రీనివాసరావు శిష్యుడు ఆవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఎన్నికల ఫలితాల తరువాతైనా పార్టీ మారాలని గంటా ప్రయత్నిస్తుంటే ఆయనకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వల్లే వైసీపీలో గంటా చేరిక అంతకంతకూ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

గంటా విజయసాయిరెడ్డి ద్వారా పార్టీలో చేరే ప్రయత్నం చేసి ఉంటే అనుకూల ఫలితాలు ఉండేవని… అలా కాకుండా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతల ద్వారా గంటా ప్రయత్నం చేయడంతో ఆయనకు జగన్ నుంచి పార్టీలోకి గ్రీన్ సిగ్నల్ లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గంటా సన్నిహితులు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్లే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలుస్తోంది.

అందువల్లే గంటా విజయసాయిరెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. గంటా ఈ సంవత్సరం చివరి నాటికి వైసీపీలో చేరడం సాధ్యం కాకపోతే బీజేపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. మరి గంటా వైసీపీలో చేరతాడో లేదో విజయసాయిరెడ్డి గంటా విషయంలో మెత్తబడతాడో లేదో చూడాల్సి ఉంది.

Also Read : బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!