Home Blog Page 44

ప్రైవేటు సంస్థలకు ఉచితంగా ప్రభుత్వ భూమినా? నిజమెంత?

AP land allotment
AP land allotment

AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ భూమిపై పూర్తి హక్కులు సంబంధిత యాజమాన్యాల కేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మంగళవారం జీవో జారీ చేశారు. మార్కెట్ ధరకు తీసుకున్న భూములను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని.. తమకు పూర్తి హక్కులు కల్పించాలని కంపెనీలు సుదీర్ఘకాలంగా కోరుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాజెక్టుల విషయంలో.. టూరిజం కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. ప్రాజెక్టు డెవలపర్గా తమకు ఇస్తున్న భూములపై పూర్తిగా హక్కులు ఉండాలని కంపెనీలు పట్టుబడుతున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఏపీటీడీసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం.

భూముల కేటాయింపు అలా..
ఏ ప్రభుత్వంలోనైనా పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ లెక్క తోనే ప్రభుత్వాలు భారీ ఎత్తున సాధారణ ధరకు ప్రైవేటు కంపెనీలకు భూములను కేటాయిస్తాయి. అయితే చౌకగా భూములు తీసుకున్న వారిలో కొందరు వాటిని బ్యాంకులో తనకా పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. అయితే భూయాజమాన్య హక్కులు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నప్పుడే ఆ పరిస్థితి ఉంటే.. ఇప్పుడు అదే కంపెనీలకు సేల్ చేసి.. హక్కులు బదలాయిస్తే ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.

ఆ చట్టానికి సవరణ..
ఇప్పటిదాకా ప్రభుత్వ భూముల కేటాయింపులు ఒక ప్రక్రియ కొనసాగేది. ఆయా కంపెనీల స్వభావం, పెట్టి పెట్టుబడి, ఉపాధి కల్పన స్థాయిని బట్టి ఉచితంగా, రాయితీ ధరకు, కనీస విలువ ఆధారంగా మార్కెట్ విలువకు భూములు కేటాయిస్తూ వస్తున్నారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన భూ కేటాయింపు పాలసీ ప్రకారం కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి. కంపెనీలకు మార్కెట్ ధర ప్రకారం భూములు కేటాయించినా.. ఉచితంగా అందించినా.. యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వం వద్దనే ఉంటున్నాయి. వాటిని నిషేధిత జాబితా 22 (a) లో ఉంచేవారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉండదు. ఒకవేళ కంపెనీలు ఆ భూములను తనకా పెట్టి రుణాలు తీసుకోవాలన్న ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఇప్పుడు పర్యాటక ప్రాజెక్టులు శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ఈ నిబంధనను సడలించి ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై వ్యతిరేక ప్రచారం మొదలైంది. మరి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? అలానే ముందుకు వెళుతుందా అన్నది చూడాలి.

ఆగస్టు లో అసలు సినిమా పోటీ మొదలవ్వనుందా..?

August movie releases
August movie releases

August movie releases: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల మధ్య ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటుంది. హీరోలు వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ను ఏర్పాటు చేసుకున్నప్పటికి చిన్న పెద్దా అనే తేడా లేకుండా కొన్ని మూవీస్ మధ్య ఎప్పటికప్పుడు పోటీ ఉంటుంది… ఈ మధ్యకాలంలో అసలు సినిమాల మధ్య పెద్దగా పోటీలు లేకుండా పోయాయి. ఇక వచ్చే నెల ఆగస్టులో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సూర్య హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా వచ్చిన వారం రోజులకే రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం ‘ఇరుముడి’ సినిమా సైతం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం కానుంది. ఈ రెండు సినిమాలు వచ్చిన వారం రోజులకి టాక్సిక్ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది… అయితే ఆగస్టు నెలలో ఏ సినిమాలు విజయాన్ని సాధించబోతున్నాయి.

ఇంకా ఏ సినిమాలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసుకోబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆగస్టు నెలకి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పెద్ద సినిమాలను సైతం ఆగస్టు లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు కాబట్టి ఆగస్టులో అయిన మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తే బాగుంటుంది.

జూన్ నెలలో రిలీజ్ అయిన పెద్ది సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టలేక పోయింది. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ సైతం భారీగా నష్టాల్లో ఉంది. ఒక పెద్ద సినిమా వచ్చి 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడితేనే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మళ్లీ లాభాల బాట పట్టే అవకాశాలైతే ఉన్నాయి…

అఖిల్ కి లెనిన్ మూవీ తో భారీ సక్సెస్ రాబోతోంది..?

Lenin First Day Collections
Lenin First Day Collections

Akhil Lenin movie: అఖిల్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు భారీ ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులకు ఆశించిన మేరకు విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈనెల 10వ తేదీన ‘లెనిన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నిన్న రిలీజైన ట్రైలర్ ఓకే అనిపించినప్పటికి అఖిల్ ఈ సినిమాలో ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనియంశంగా మారింది. ఈ ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఒక రా అండ్ రస్ట్రీక్ క్యారెక్టర్ లో అఖిల్ కనిపించబోతున్నాడు. అఖిల్ చాక్లెట్ బాయ్ లా ఉంటాడు.

కాబట్టి అతనికి ఈ సినిమా ఏమాత్రం సెట్ అయింది. ట్రైలర్లో అతని నటన అలరించినప్పటికి సినిమాలో ఏ మాత్రం ఎఫెక్టివ్ గా నటించాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాతోనే అతనికి భారీ సక్సెస్ దక్కితే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతాడు. లేకపోతే మాత్రం ఆయన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ దశకు దగ్గరలో ఉన్నాడు. ఈ సినిమాతో అతను ఊపిరి పోసుకుంటాడా? లేదంటే ఈ మూవీతో మరోసారి ఫ్లాప్ ని మూట గట్టుకుంటాడా? అనేది తెలియాలంటే మాత్రం జులై 10 వరకు వెయిట్ చేయాల్సిందే…

ఇప్పటివరకు ఆయన అనుకున్న సక్సెస్ ని సాధించలేకపోయాడు. దాంతో నాగార్జున సైతం అఖిల్ విషయంలో కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా లెనిన్ సినిమా విషయంలో ఆయన చాలావరకు అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది… ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధిస్తుందా? ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

విశాఖ-మావిగన్.. ఎటు తేల్చుకోలేకపోతున్న జగన్

Jagan Visakhapatnam
Jagan Visakhapatnam

Jagan Visakhapatnam: వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో అస్సలు మార్పు రావడం లేదు. ముఖ్యంగా రాజధానుల విషయంలో ఆయన ఇంకా గందరగోళం లోనే ఉన్నారు. తొలుత అమరావతి రాజధాని కి జై కొట్టిన జగన్ తర్వాత మూడు రాజధానులు అన్నారు. మొన్నటికి మొన్న మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అసలు ఇంతటి గందరగోళం ఎందుకని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి అమరావతి రాజధాని విషయంలో వ్యతిరేకముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై పడిందని.. ముఖ్యంగా విద్యాధికులతో పాటు తటస్తులు దీనిని తప్పుపడుతూ ఓట్ల రూపంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా ఎందుకో జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో అదే..
తాడేపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. మావిగన్ అనేది తమ పార్టీ అజెండా అని.. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అన్న అజెండాతో ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో అమరావతి రైతుల పట్ల తమకు వ్యతిరేక భావన లేదని.. వారికి న్యాయం చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే అపరిచితుడు గుర్తుకొస్తున్నారు. ఏకకాలంలో మూడు మాటలు చెబుతున్నారు. అమరావతి రైతులంటే తనకు కోపం లేదని చెబుతూనే వారి పట్ల సానుభూతి చూపుతున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ మూడు రాజధానుల మాట మళ్లీ తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని చెబుతున్నారు. అయితే ఏం మాట్లాడుతున్నారో తెలియక అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గుణపాఠాలు నేర్చుకొని జగన్..
ఏదైనా ప్రతికూల అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ ఎందుకో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనుక పడ్డారు. అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడి రైతులకు వ్యతిరేకంగా మారిపోయారు. గుంటూరు తో పాటు కృష్ణాజిల్లాలో రాజకీయంగా నష్టపోయారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని జగన్మోహన్ రెడ్డి చెబితే ఉత్తరాంధ్ర ప్రజలు కనీస స్థాయిలో కూడా ఆహ్వానించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ చెబుతున్న మాటకు అటు విజయవాడ ప్రజలు కానీ.. అటు మచిలీపట్నం ప్రజలు కానీ.. మరోవైపు గుంటూరు ప్రజలు కానీ పెద్దగా స్పందించడం లేదు.. అయితే జగన్ ఈరోజు ప్రెస్మీట్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూనే.. మావిగన్ ప్రస్తావన చేయడం మాత్రం ఒక గందరగోళంగా మారింది.

ఆ రికార్డ్ బాలయ్య తర్వాత నాని కే సాధ్యమైందా..?

Balakrishna Nani
Balakrishna Nani

Balakrishna Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పంతుల తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ సినిమాలను చేశారు. వీళ్లను ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా భావించేవారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు సైతం వీళ్ళను రిఫర్ చేస్తూ ఉండడం విశేషం…ప్రస్తుతం సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న వీళ్ళు అవకాశం దొరికినప్పుడు మాత్రం పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు.

టైర్ వన్ హీరోలందరు పాన్ ఇండియా నేపథ్యంలో ముందుకు దూసుకెళ్తుంటే వీళ్ళు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న ఈ హీరోలందరూ వండర్స్ ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక బాలయ్య బాబు సైతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం…

ఈ జనరేషన్ లో ఉన్న కుర్ర హీరోలలో నాని సైతం విశేషంగా అలరిస్తున్నాడు. ఇప్పటివరకు సీనియర్ హీరోలకు టైర్ వన్ హీరోలకు సాధ్యం కానీ ఒక రికార్డుని బాలయ్య బాబు క్రియేట్ చేయగా ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో నాని దానిని రీ క్రియేట్ చేయడం విశేషం…ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే బాలయ్య బాబు హీరోగా చేసిన బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ రెండు సినిమాలు కూడా 1993 సెప్టెంబర్ 3 వ తేదీన రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న నలుగురు హీరోల్లో ఎవరు కూడా ఒకే తేదీన రెండు సినిమాలను రిలీజ్ చేయలేకపోయారు.

ఇక వీళ్ళ తర్వాత జనరేషన్ లో వచ్చిన హీరోలు సైతం అలాంటి ఫీట్ ని సాధించలేకపోయారు. మొత్తానికైతే నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రమణ్యం, జెండా పై కపిరాజు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య తర్వాత ఆ రికార్డు ను క్రియేట్ చేసిన హీరో నాని నే కావడం విశేషం…

ప్యారడైజ్ పరిస్థితి ఏంటి..? రిలీజ్ డేట్ ఎందుకని పోస్ట్ పోన్ చేస్తున్నారు..?

Paradise movie release
Paradise movie release

Paradise movie release: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ నటనతో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్న నటుడు నాని… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నాని లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన రిలీజ్ అవ్వబోతుందంటూ గతంలో కొన్ని కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా సెప్టెంబర్ లో వస్తుంది అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం దసర కి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమా దసర కి వచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు వచ్చిన కూడా ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. కానీ ఇలా అస్తమానం సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ సినిమా మీద అంచనాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది.

తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలైతే ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక నాని ఈ సినిమాతో పెను సంచలనాలని క్రియేట్ చేయగలిగితే మాత్రమే టైర్ వన్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు వెనుకబడిపోయే ప్రమాదమైతే ఉంది..

టాలీవుడ్ 2026 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఇదే.. సెన్సేషన్ సృష్టించిన చిరు, సమంత..

Chiranjeevi Samantha
Chiranjeevi Samantha

Chiranjeevi Samantha: ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువగా నమోదు అయ్యిందనే చెప్పాలి. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదురుకుంది. చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగలడమే కాకుండా, బయ్యర్స్ కి కనీసం డబ్బులు రొటేషన్ కూడా చేసుకోలేని పరిస్థితి కలిగింది. అయితే ఈ ఏడాది బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చి పెట్టిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం గురించి మాట్లాడుకోవాలి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 304 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 183 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 122 కోట్ల రూపాయిలు మాత్రమే.

అంటే దాదాపుగా 61 కోట్ల రూపాయలకు పైగా లాభాలు అన్నమాట. ఇక అదే సంక్రాంతికి విడుదలైన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఓకే రాజు’ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. దాదాపుగా 48 కోట్ల 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను , 88 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, సంక్రాంతి సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 28 కోట్లు మాత్రమే. దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. అదే సంక్రాంతికి విడుదలైన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 38 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిసినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.

ఆ తర్వాత కొన్నేళ్లు సక్సెస్ లేక ఇబ్బంది పడిన టాలీవుడ్ కి సమంత ‘మా ఇంటి బంగారం’ రూపం లో లాభాల వర్షం కురిసింది అని చెప్పొచ్చు. రీసెంట్ గానే విడుదలై ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు 39 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా బయ్యర్స్ కి ఇప్పటి వరకు 28 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం , భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా భారీగా పెరగొచ్చు. ఇక ‘పెద్ది’ చిత్రం విషయానికి వస్తే , కలెక్షన్స్ భారీ రేంజ్ లోనే వచ్చాయి కానీ, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం లో విఫలం అయ్యింది. అనేక ప్రాంతాల్లో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 205 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినప్పటికీ, ఇంకా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వని పరిస్థితి. ఇక కపుల్ ఫ్రెండ్లీ , విష్ణు విన్యాసం వంటి చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. ఇదే 2026 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్.

OTT లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. ఎందులో చూడాలంటే..

Obsession Movie
Obsession Movie

Obsession Movie: కేవలం 7 కోట్ల రూపాయిల బడ్జెట్ తో హాలీవుడ్ లో కర్రీ బార్కర్ అనే ఒక యూట్యూబర్ తెరకెక్కించిన ‘అబ్సెషన్’ అనే చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఘటన యావత్తు సినీ లోకాన్ని షాక్ కి గురయ్యేలా చేసింది. ఇందులో హీరో గా మైఖేల్ జాన్సన్ నటించగా, హీరోయిన్ గా ఇండే నవారెట్టే నటించింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రానికి హీరోయినే విలన్ అని చెప్పొచ్చు. దర్శకుడి ప్రతిభ, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మన్స్ కారణంగా ఈ చిత్రం ఆడియన్స్ కి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కలిగించింది. ఆ కారణం చేతనే ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కేవలం ఒక్క హైదరాబాద్ సిటీ లోనే ఈ చిత్రం 53 షోస్ తో రన్ అవుతోంది అంటే సాధారణమైన విషయం కాదు.

సినిమా విడుదలై నెల రోజులు దాటింది , ఇప్పటికీ ఈ చిత్రం బుక్ మై షో యాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 7 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. వీకెండ్స్ వస్తే హౌస్ ఫుల్స్ ని కూడా నమోదు చేసుకుంటోంది ఈ చిత్రం. కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండే ఈ చిత్రానికి ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఇంగ్లీష్ వెర్షన్ నుండి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారమైన విషయం కాదు. అయితే ఇంతటి అద్భుతమైన రన్ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం రెంట్ రూపం లో అందుబాటులోకి వచ్చింది. మూవీ లవర్స్ కి ఇక పండగే అనుకోవచ్చు. థియేటర్స్ లో వసూళ్ల సునామీ ని సృష్టించిన ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే బీర్ అనే మ్యూజిక్ స్టోర్ ఉద్యోగి ‘వన్ విష్ విల్లో’ అనే బొమ్మ ని కొంటాడు. అతనికి తన స్నేహితురాలు నిక్కీ అంటే మొదటి నుండి ఎంతో ఇష్టం. ఆమెకు ప్రపోజ్ చేసే ధైర్యం లేక , ‘వన్ విష్ విల్లో’ బొమ్మని , ఆమెని తన ప్రేయసి గా చేయాల్సిందిగా కోరుకుంటారు. ఆ బొమ్మ బీర్ కోరికని తీరుస్తుంది. ఇక ప్రేయసి గా బీర్ జీవితం లోకి వచ్చిన నిక్కీ , అతనికి ప్రతీ రోజు చుక్కలు చూపించడం మొదలు పెడుతోంది. అతని కోరిక ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకొని బీర్ పడే మనోవేదనే ఈ సినిమా. హారర్ చిత్రం కాదు కానీ , హారర్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ని ఇస్తుంది ఈ చిత్రం.

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న బుల్లిరాజు..రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..

Bulli Raju
Bulli Raju

Bulli Raju: అప్పుడప్పుడు మన తెలుగు సినిమాల్లో కొన్ని పాత్రలు హీరో పాత్రలను మించి హైలైట్ అవుతుంటాయి. ఎంతలా అంటే కేవలం ఆ పాత్రల కోసం ఆడియన్స్ రిపీట్ గా సినిమా థియేటర్స్ కి వెళ్లేంత. అలాంటి పాత్రల్లో ఒకటి బుల్లి రాజు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లో వెంకటేష్ కొడుకుగా ఈ బుల్లి రాజు పాత్రలో కనిపించారు మాస్టర్ రేవంత్. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారిపోయారు రేవంత్. ముఖ్యంగా తన హావభావాలతో, కామెడీ టైమింగ్ తో ఆ చిత్రం లో ఆయన పలికిన డైలాగ్స్ ఒక రేంజ్ లో పేలాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ లో పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారు. ఈ సినిమా తర్వాత రేవంత్ అలియాస్ బుల్లిరాజు కి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఈ బుడ్డోడు అనేక సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించిన ఈ సినిమాలో కూడా రేవంత్ కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇకపోతే రీసెంట్ గానే అనిల్ రావిపూడి మొదలుపెట్టిన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ మల్టీ స్టార్రర్ చిత్రం లో కూడా రేవంత్ ని తీసుకున్నారట. అయితే ఆ బుడ్డోడి తల్లిదండ్రులు డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ని చూసి అనిల్ రావిపూడి కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయ్యిందట. ఒక్క రోజు కాల్ షీట్ కి లక్ష రూపాయిల చొప్పున రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారట. సినిమాలో అత్యంత కీలక పాత్ర కాబట్టి అనిల్ రావిపూడి , నిర్మాత సాహు గారపాటి లు నో చెప్పలేక ఒప్పుకున్నారట.

రోజుకు ఒక లక్ష రూపాయిలు అంటే స్టార్ కమెడియన్ రేంజ్ రెమ్యూనరేషన్ అన్నమాట. ఓవర్ నైట్ లో ఈ బుడ్డోడికి వచ్చిన ఫేమ్ తో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వెళ్లిపోయారంటే, భవిష్యత్తులో ఈ బుడ్డోడు ఇంకా ఎంత పెద్ద స్థాయికి వేళ్తాడో అని అంటున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ బుడ్డోడి కాల్ షీట్స్ కోసం క్యూలు కడుతున్నారు. ఈ బుడ్డోడి అదృష్టం ఎలా ఉందంటే , పట్టిందల్లా బంగారం అనే రేంజ్ లో ఉంది. ఇప్పటి వరకు ఇతను చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి , ఇక అనిల్ రావిపూడి సినిమా ఎలాగో హిట్ కాబట్టి, ఈ బుడ్డోడి ఖాతాలో మరో సూపర్ హిట్ జమ అయ్యినట్టే.

దువ్వాడకు కలిసి రాని దూకుడు!

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas: రాజకీయాల్లో చాలా అంశాలు పనిచేస్తాయి. దూకుడు ఎంతగా ఉపయోగపడుతుందో.. అంతలా మైనస్ చేస్తుంది. ఈ విషయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చక్కటి ఉదాహరణ. చాలా దూకుడుతో యువనేతగా రాజకీయాల్లోకి వచ్చారు. అంతే దూకుడుతో ఇబ్బందులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు. అరెస్టుల భయంతో ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అసలు దువ్వాడ శ్రీనివాస్ ను ఆదరించే పార్టీ ఏది అనే చర్చ బలంగా నడుస్తోంది. ఆయనను భరించే శక్తి ఏ పార్టీకి లేదన్నది శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్ లో ఒక మాట.

యువజన కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఈయనతో పాటు రాజకీయ అరంగేట్రం చేసిన చాలా మంచి నేతలుగా ఎదిగారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోయారు. కేవలం దూకుడుతో చేసిన రాజకీయాల మూలంగానే ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాజకీయ ప్రత్యర్థులుగా కింజరాపు కుటుంబం ఉంది. కానీ పార్టీలో ప్రత్యర్థులుగా ధర్మాన కుటుంబాన్ని మార్చుకున్నారు దువ్వాడ. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తన ఆలోచనలను మార్చుకోలేకపోయారు. ఆపై కుటుంబ కలహాలతో తన పొలిటికల్ జీవితాన్ని తానే నాశనం చేసుకున్నారు.

నిత్యం ఓటమి..
2000లో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా ఉండేవారు దువ్వాడ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ యువనేతగా గుర్తింపు సాధించారు. 2006లో జడ్పిటిసి గా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. టెక్కలి నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అక్కడ నుంచి తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 లో టెక్కలి నుంచి పోటీ చేసిన దువ్వాడకు ఓటమి తప్పలేదు.

ప్రత్యర్ధులతో పాటు శత్రువులు..
అయితే దువ్వాడ శ్రీనివాస్ దూకుడు మూలంగా రాజకీయంగా ప్రత్యర్ధులు ఉన్నారు. ఆయన పని చేసే పార్టీలోనే ప్రత్యర్ధులుగా చాలామంది నేతలను మార్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ధర్మాన బ్రదర్స్ తో శత్రుత్వం పెంచుకున్నారు. అదే సమయంలో కింజరాపు ఫ్యామిలీని శాశ్విత ప్రత్యర్థులుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ శ్రేణులతో సఖ్యతగా మెలగాల్సిన ఆయన.. వారితో విభేదాలు పెంచుకుంటూ తన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందులు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలే కానీ.. దూకుడు తనం ఎల్లకాలం పనిచేయదు అనడానికి.. దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లైఫ్ ఒక ఉదాహరణ.

జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. లోకేష్ స్పందన అదే!

Nara-Lokesh
Nara-Lokesh

Nara Lokesh: జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న గ్యాప్ ను తగ్గించుకునేందుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతోంది. అటు జూనియర్ ఎన్టీఆర్ సైతం లోకేష్ విషయంలో తన మనసు మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య ఉన్న గ్యాప్ క్రమేపి తగ్గుతున్నట్లు పరిస్థితి బట్టి అర్థం అవుతోంది. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనలో నారా లోకేష్ తన మామ నందమూరి హరికృష్ణ ను ఆకాశానికి ఎత్తేసారు. ఆపై జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే రెడ్ కార్పెట్ వేస్తామని ఓపెన్ గానే ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలకృష్ణ విషయంలో స్పందిస్తున్నారు. పుట్టినరోజు తో పాటు ప్రత్యేక దినాల సమయంలో పలకరిస్తున్నారు.

అప్పట్లో విభేదాలు..
నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్కు విభేదాలు అనేవి ఎప్పటినుంచో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రధానంగా 2009లో టిడిపికి మద్దతుగా ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ ఎన్నికల తర్వాత స్పష్టమైన మార్పు కనిపించింది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ అప్పట్లో సమైక్యాంధ్రకు మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో చంద్రబాబుకు కనీసం మాట కూడా చెప్పకుండా రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే సమైక్యవాదిగా చంద్రబాబు హరికృష్ణతో రాజీనామా చేయించారని అప్పట్లో తెగ ప్రచారం నడిచింది. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా చూపించే క్రమంలో.. హరికృష్ణ కావాలనే ఆ పని చేశారన్న అనుమానం చంద్రబాబులో ఉంది. దీంతో హరికృష్ణ అప్పటినుంచి చంద్రబాబుతో దూరంగా ఉంటూ వచ్చారు. ఇంతలోనే ఆయన అకాల మరణం చెందారు.

హరికృష్ణ మరణం తర్వాత..
హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు అండగా నిలబడ్డారు చంద్రబాబు, బాలకృష్ణ. అయితే ఇంతలో లోకేష్ ఎంట్రీ తో సీన్ మారింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి టిడిపి టికెట్ దక్కించుకున్న కొడాలి నాని.. వైసీపీలో చేరారు. దీంతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. 2019లో టిడిపి తరఫున గెలిచి వైసీపీలోకి ఫిరాయించారు వల్లభనేని వంశీ మోహన్. ఆయనకు సైతం టిడిపిలో టిక్కెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్. పైగా కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ చంద్రబాబుతో పాటు లోకేష్ ను తిడుతుంటే కనీసం నియంత్రించలేదు. చివరకు స్వయంగా తన మేనత్త అయిన నారా భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీరియస్ గా స్పందించలేదు. తన తాత నందమూరి తారక రామారావు పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీని.. రాజశేఖర్ రెడ్డి పేరుతో మార్చినా సీరియస్ గా తీసుకోలేదు. దీంతో టీడీపీ శ్రేణులు దీనిని తప్పు పట్టుతూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో పునరాలోచనలో పడ్డాయి.

గ్యాప్ పూరించే వ్యూహం..
అయితే అప్పట్లో ఏర్పడిన గ్యాప్ అలానే కొనసాగుతూ వస్తోంది. ఈ తరుణంలో లోకేష్ తన పరిణితి చూపారు. అటు జూనియర్ ఎన్టీఆర్ సైతం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ విషయంలో బాగానే స్పందిస్తున్నారు. అయితే ఏ లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టారు అనే ఆరోపణ వచ్చిన క్రమంలో.. అదే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తో నారా లోకేష్ అలరించారు. పనిలో పనిగా హరి మామయ్య అంటూ హరికృష్ణ గురించి గొప్పగా చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో పని చేసేందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇష్టమా? జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమా? అని ఇంటర్వ్యూలో అడిగిన వారికి ఇద్దరూ ఇష్టమే అని తేల్చి చెప్పారు. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆప్షన్ గా ఉన్నారని.. ఆయన పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని తేల్చి చెబుతున్నారు లోకేష్. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమానే ప్రపంచంగా చూస్తున్నారు.. రాజకీయాల కోసం అస్సలు ఆలోచించడం లేదు.

సోషల్ మీడియా కి 'గుడ్ బై' చెప్పేసిన 'ధురంధర్' హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే..

Ranveer Singh
Ranveer Singh

Ranveer Singh: ‘ధురంధర్’ సిరీస్ తో హీరో రణవీర్ సింగ్ ఓవర్ నైట్ లో ఎలాంటి స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం. డిసెంబర్ నెల నుండి జూన్ వరకు ఆయన మేనియా నే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నడిచింది. ‘ధురంధర్ 2’ చిత్రం ఓటీటీ లో విడుదలై చాలా రోజులైంది , కానీ ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతుంది అంటే , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చినప్పటికీ, కచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అనిపించే విధంగా ఉంటాయి, అలాంటి సినిమాల్లో ‘ధురంధర్’ సిరీస్ కూడా ఒకటి. అందుకే ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇంత పెద్ద హిట్ తర్వాత రణవీర్ సింగ్ కి తన తదుపరి చిత్రాన్ని హ్యాండిల్ చేయడం కత్తి మీద సాము లాంటిది.

అందుకే చాలా జాగ్రత్తగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన తన ఫోకస్ ని పూర్తి స్థాయిలో ‘ప్రళయ్’ అనే చిత్రం పై పెట్టారు. ఈ చిత్రాన్ని హాసన్ మెహతా కుమారుడు , జై మెహతా తెరకెక్కిస్తున్నారు. గతం లో హాసన్ మెహతా రణ్వీర్ సింగ్ తో ‘స్కాం 1992’ అనే చిత్రాన్ని తీసి భారీ హిట్ ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు రణ్వీర్ తో పని చేస్తుండడం తో ఈ సినిమాపై అంచనాలు మొదటి నుండే భారీగా ఉండేవి ఇప్పుడు ‘ధురంధర్ 2’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా తారా స్థాయికి చేరుకున్నాయి. భారీ బడ్జెట్ తో జాంబీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాని రణవీర్ సింగ్ స్వయంగా తన సొంత బ్యానర్ అయినటువంటి ‘మా కోసం ఫిలిమ్స్’ పై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టనున్నారు. సుమారుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో , హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్ ని చేయించే ప్లాన్ లో ఉన్నారు రణవీర్ సింగ్. మరో పక్క ‘డాన్ 3’ వివాదం సాగుతూనే ఉంది. రణవీర్ సింగ్ పై బ్యాన్ కూడా విధించారు. ఇలాంటి అంశాలు సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారమై తన దృష్టిని మరలించే అవకాశం ఉన్నందున , ఆయన ఒక 18 నెలల పాటు సోషల్ మీడియా కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగానే రణవీర్ సింగ్ సోషల్ మీడియా లో పెద్దగా యాక్టీవ్ గా ఉండరు, అప్పుడప్పుడు మాత్రమే ఆయన పోస్టులు వేస్తుంటారు , ఇప్పుడు అది కూడా ఉండబోవడం లేదు.

బుచ్చి బాబు కి ప్రముఖ నిర్మాతతో అడ్వాన్స్ ఇప్పించిన రామ్ చరణ్.. పెద్ద ప్లానింగే జరుగుతోంది..

Ram Charan
Ram Charan

Ram Charan: ఒక చిన్న డైరెక్టర్ కి పాన్ ఇండియన్ సూపర్ సినిమా తీసే అద్భుతమైన అవకాశం ఇస్తే, దానిని తేలికగా తీసుకుంటే మారుతీ ‘రాజా సాబ్’ అవ్వుద్ది, సిరీస్ గా తీసుకుంటే బుచ్చి బాబు ‘పెద్ది’ అవ్వుద్ది అంటూ సోషల్ మీడియా లో గత కొంతకాలంగా నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్నటువంటి బుచ్చి బాబు కి , రామ్ చరణ్ వంటి సూపర్ స్టార్ పిలిచి మరీ ‘పెద్ది’ సినిమా అవకాశం ఇవ్వడం ఆయన జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన. తనకు వచ్చిన ఆ అరుదైన అవకాశాన్ని సీరియస్ గా తీసుకొని ప్రాణం పెట్టి పని చేసి ‘పెద్ది’ చిత్రాన్ని మనకి అందించారు బుచ్చి బాబు. సినిమాలో చాలా తప్పులు ఉన్నాయి , కానీ రామ్ చరణ్ ని వాడుకోవడం లో సక్సెస్ అయ్యారు బుచ్చి బాబు.

దాని ఫలితమే టాక్ కాస్త డివైడ్ గా వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ చిత్రం, వీకెండ్స్ లో పలు ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ ని నమోదు చేసుకోవడం గమనార్హం. తానూ ఇచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నందుకు సంతృప్తి చెందిన రామ్ చరణ్ , బుచ్చి బాబు కి మరో అవకాశం ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. రీసెంట్ గానే ఆయన ఒక ప్రముఖ నిర్మాత చేత బుచ్చి బాబు కి భారీ మొత్తం లో అడ్వాన్స్ ఇప్పించారట. ఈ వారం లోనే బుచ్చి బాబు తన రైటింగ్ టీం తో కలిసి హైదరాబాద్ లో ఆఫీస్ ప్రారంభించబోతున్నారు అట. ప్రస్తుతం సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి సిద్దమైన రామ్ చరణ్ , ఈ దసరా నుండి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొని వెళ్ళబోతున్నారు.

ఈ సినిమా పూర్తి అయినా వెంటనే రామ్ చరణ్ బుచ్చి బాబు తో మరో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ అభిమానులు మాత్రం బుచ్చి బాబు తో మరో సినిమా చేయడాన్ని స్వాగతించడం లేదు. ఆయన తోటి హీరోలు సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ తరహా డైరెక్టర్స్ తో జెన్ జీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలు చేస్తూ ముందుకు దూసుకొని వెళ్తుంటే, రామ్ చరణ్ ఇంకా మీడియం రేంజ్ డైరెక్టర్స్ తో చేయడం ఏంటి?, అసలు బాలేదు , ఆయన తక్షణమే తన ఆలోచనలు విరమించుకోవాలని అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

ఆ మహిళా మంత్రి మార్పు!?

Vangalapudi Anitha
Vangalapudi Anitha

Vangalapudi Anitha: రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకోవైపు శాంతిభద్రతల అంశం కూడా తెరపైకి వస్తోంది. ప్రధానంగా హోం శాఖ పై చర్చ నడుస్తోంది. సంబంధిత మంత్రి వంగలపూడి అనిత పనితీరుపై కూడా చర్చ జరుగుతోంది. ఆమె హోం శాఖ మంత్రిగా రెండేళ్లపాటు తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఒకానొక దశలో హోంశాఖ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మంత్రి అనిత సీరియస్ గా వ్యవహరిస్తారా? లేకుంటే హోం శాఖలో కూడా వేలు పెట్టాల్సి వస్తుంది అన్నట్టు పవన్ మాట్లాడినట్లు ప్రచారం నడిచింది. తర్వాత పవన్ దీనిపై సర్దుబాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకోవాలన్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ వంగలపూడి అనిత గత ప్రభుత్వాలతో పోల్చితే.. హోం శాఖ పరంగా గట్టి చర్యలే చేపడుతున్నారు.

అప్పట్లో సైతం మహిళలే..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలే హోం శాఖ మంత్రులుగా ఉండేవారు. తొలుత మేకతోటి సుచరిత, తరువాత దానేటి వనిత హోం శాఖ మంత్రులుగా వ్యవహరించారు. అయితే వారిద్దరూ అనుకున్న స్థాయిలో ముద్ర చూపలేకపోయారు. అప్పట్లో వారు శాంతిభద్రతలపై సమీక్షించిన దాఖలాలు కూడా లేవు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను మాత్రమే యంత్రాంగం పాటించేది అనే విమర్శ ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో మంత్రులు డమ్మీలు అనే ఆరోపణలు ఉన్నాయి. దానికి చాలా రకాల కారణాలు ఉండేవి. హోం శాఖ పరంగా సంబంధిత మంత్రుల కంటే అప్పుడు సలహాదారుడుగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించేవారు అనే విమర్శ ఉంది.

నిత్య సమీక్షలు..
కానీ ఇప్పుడు వంగలపూడి అనిత మాత్రం హోం శాఖ విషయంలో గట్టిగానే చర్యలు చేపడుతున్నారు. నిత్య సమీక్షలు చేస్తున్నారు. ఆదిలో తడబడ్డారు కానీ.. ఇప్పుడు శాఖలో ఇమిడిపోయారు. స్వతహాగా ఆమె విద్యాధికురాలు. ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. క్రమశిక్షణ విషయంలో ఎలా ఉండాలో అలా ఉన్నారు. చంద్రబాబు సైతం ఆమెకు స్వేచ్ఛ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం శాఖ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అయితే తన రెండు సంవత్సరాల శాఖ ప్రగతి పరంగా మంచి మార్కులు పడుతున్నాయి. అయితే పవన్ హోం మంత్రి అంటూ కొత్త ప్రచారం మొదలైంది. కానీ తాను ఏరి కోరి తీసుకున్న గ్రామీణ శాఖలను విడిచిపెట్టి పవన్ హోం శాఖను అందిపుచ్చుకునే అవకాశం లేదు.

'ఓజీ 2' లో సుభాష్ చంద్రబోస్ గా నటించబోతుంది ఎవరు..? రేసులో ముగ్గురు పాన్ ఇండియన్ హీరోలు..

OG 2
OG 2

OG 2: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఓజీ 2’ గురించే చర్చ. ఈ చిత్రం నుండి ఎలాంటి టీజర్, గ్లింప్స్ , ఫస్ట్ లుక్ పోస్టర్ వంటివి రాలేదు. కేవలం ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో ని విడుదల చేసారంటే. పవన్ కళ్యాణ్ అభిమానులు మెంటలెక్కిపోయి, ఈ వీడియో ని ఒక రేంజ్ లో వైరల్ చేశారు . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్ అద్భుతంగా అందించడంతో, అది కూడా బాగా వైరల్ అయిపోయింది. అంతే కాకుండా, ఈ వీడియోలో సుజిత్ చెప్పిన పెట్ సన్నివేశం, స్నో బ్లడ్ అయిపోయే సంభాషణ బాగా వైరల్ ఆయ్యింది. జెన్ జీ ఆడియన్స్ ఇప్పటికీ ఈ మేనియా నుండి బయటకు రాలేదు. ఇదంతా పక్కన పెడితే , ‘ఓజీ 2’ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ క్యారెక్టర్ అత్యంత కీలకం అని మొదటి భాగం లోనే చెప్పుకొచ్చారు.

ఇక ఆ తర్వాత సుజిత్ విడుదల చేసిన కామిక్ బుక్ లో కూడా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ క్యారెక్టర్ ఉంటుంది. ఓజాస్ గంభీర తండ్రి జై గంభీర కి నేతాజీ మధ్య మంచి స్నేహం ఉంది. నేతాజీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆజాద్ హింద్ ఫోర్స్ లో కూడా జై గంభీర కీలక భాగస్వామ్యం గలవాడు. అయితే ఈ నేతాజీ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కానీ ఏది కూడా అధికారికంగా ఖరారు కాలేదు. కొంతమంది అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ నేతాజీ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మరికొంతమంది శివరాజ్ కుమార్ ఈ క్యారెక్టర్ చేస్తాడని అంటున్నారు. ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరిని ఖరారు చేసే పనిలో పడ్డారట డైరెక్టర్ సుజిత్.

త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రామ్ చరణ్ , సల్మాన్ ఖాన్ వంటి వారు ఈ పాత్ర చేస్తే ‘ఓజీ 2’ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. దేశానికీ ఎంత గర్వకారణమైన వీరుడి పాత్రలో నటిస్తే , ఏ హీరో అభిమానికి అయినా గర్వంగానే ఉంటుంది. పైగా ఇలాంటి ఐకానిక్ సూపర్ స్టార్స్ నటిస్తే నేషనల్ లెవెల్ లో ఎవ్వరూ ఊహించనంత చర్చ జరిగే అవకాశం ఉంది , చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది. చూస్తుంటే ‘ఓజీ 2’ ని మామూలు రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. ఈ చిత్రం పవర్ స్టార్ వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

'రాజు వెడ్స్ రాంభాయ్' హీరో అఖిల్ రాజ్ పై దాడి.. సంచలనం రేపుతున్న వీడియో..

Akhil Raj Bigg Boss 10
Akhil Raj Bigg Boss 10

Akhil Raj: గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ‘రాజు వెడ్స్ రాంభాయ్’ హీరో అఖిల్ రాజ్ నే కనిపిస్తున్నారు. ఒక డెలివరీ బాయ్ తన ఇంటికి వచ్చి తప్పు ఆర్డర్ వాళ్లకు అందించడం , అనంతరం అది తెలియక అఖిల్ రాజు తల్లి ఆ పార్సిల్ ని తెరిచి చూసి , తమ పార్సిల్ కాదని పక్కన పెట్టేయడం. 20 నిమిషాల తర్వాత ఆ డెలివరీ బాయ్ తిరిగి రావడం , ఓపెన్ చేసిన పార్సిల్ ని చూసి ఉచితంగా వస్తే తీసేసుకుంటారా అని అనడం , అందుకు అఖిల్ రాజ్ ఆవేశంతో ఊగిపోతూ ఆ డెలివరీ పై చెయ్యి చేసుకోవడం వంటివి జరిగాయి. వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. దీంతో అఖిల్ రాజ్ కూడా రెస్పాన్స్ ఇస్తూ జరిగిన వాస్తవాలను జనాలకు వివరించే ప్రయత్నం చేశారు.

ఇదంతా పక్కన పెడితే , నిన్న కారులో వెళ్తున్న అఖిల్ రాజ్ పై గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు దాడి చేయడం సంచలనం గా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కొండాపూర్ లో కారు లో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అఖిల్ రాజ్ ని సమీపించి కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అఖిల్ రాజ్ కారు ని వేగంగా నడుపుతూ అక్కడి నుండి పరార్ అయ్యారు. ఈ సంఘటన పై నేడు ఆయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు ని నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. మరోపక్క ఆ డెలివరీ బాయ్ కూడా అఖిల్ రాజ్ పై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రోజురోజుకి ఈ వివాదం ముదురుతూనే ఉంది.

అయితే అఖిల్ రాజు డెలివరీ బాయ్ పై విరుచుకుపడ్డాడు కారణం ఏంటో స్పెషల్ వీడియో ద్వారా ఆడియన్స్ కి వివరించినప్పటికీ, ఆయనపై నెగెటివిటీ తగ్గలేదు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఉందని అంటున్నావు కదా, నువ్వు చెప్పేవి నిజమైతే దాన్ని ముందు బయటపెట్టు అని అంటున్నారు నెటిజెన్స్. ఎంత ప్రయత్నం చేసినా జనాలు నమ్మకపోవడం తో , ఇప్పుడు తనపై దాడి కి దిగినట్టు స్పెషల్ నాటకం ఆడుతున్నాడని , ఇవంతా జనాలు నమ్మే రోజులు పోయాయని అంటున్నారు నెటిజెన్స్. కనీసం రాబోయే రోజుల్లో అయినా అఖిల్ రాజ్ సీసీటీవీ కెమెరాల వీడియో ని సోషల్ మీడియా లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

వైసిపి భవనం ఖాళీ చేయాల్సిందే!

Ashok Gajapathi Raju
Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతలా ఉంటుంది అక్కడ పరిస్థితి. పూసపాటి అశోక్ గజపతిరాజు సంప్రదాయ రాజకీయాలను నమ్ముకున్నారు. కానీ పొలిటికల్ గా బొత్స ఫ్యామిలీ ఎంట్రీ తో అక్కడ సీన్ మారింది. బొత్స ఫ్యామిలీ దూకుడు రాజకీయాలు చేస్తూ వచ్చింది. కానీ అశోక్ గజపతిరాజు మాత్రం ఆ పాత రాజకీయాలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రాజుగారు గవర్నర్గా నియమితులయ్యారు. రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన రాజకీయాలు మాట్లాడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తాను ఒక వ్యక్తిని అని.. తన ఆస్తులను బలవంతంగా లాక్కోవాలని భావిస్తే ప్రశ్నించవద్ద అని ప్రశ్నిస్తున్నారు అశోక్ గజపతిరాజు. ఇటీవల జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆయన.. విజయనగరంలోనే ఉంటూనే వైసీపీ పై గట్టి ఆరోపణలు చేశారు. ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

* అశోక్ గజపతిరాజు ఫిర్యాదు ..
పూసపాటి రాజవంశీయుడిగా.. విజయనగరం సంస్థానానికి అధినేతగా ఉన్నారు అశోక్ గజపతిరాజు. ఆ కుటుంబానికి ఉన్న వేలాది ఎకరాల ఆస్తులను ప్రజా ప్రయోజనాల కోసం విడిచిపెట్టిన గొప్ప మనసు వారిది. అందుకే విజయనగరం జిల్లా ప్రజలు కూడా రాజకీయాలకు అతీతంగా అశోక్ గజపతిరాజుకు గౌరవం ఇస్తారు. రాజుగారు కూడా తన బంగ్లాను టిడిపి కార్యాలయంగా మార్చి సేవలందిస్తూ వచ్చారు. అందుకే కాబోలు వైసిపి అదే రాజవంశీయుల ప్రైవేటు భూమిని పార్టీ కార్యాలయం కోసం లీజుకు రాయించుకుంది. ఇప్పుడు దాని పైనే పెద్ద యుద్ధం చేస్తున్నారు అశోక్ గజపతిరాజు. తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ స్థలం ఎకరా భూమిని వైసీపీ కార్యాలయ భవనం కోసం లీజుకు ఇవ్వడాన్ని తప్పుపడుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

* ప్రభుత్వ భూమి గా మార్చేసి..
గత కొద్ది రోజులుగా దీనిపై వివాదం నడుస్తోంది. వందల సంవత్సరాల క్రితం రాజవంశీల ప్రైవేటు భూమిగా రికార్డుల్లో ఉంది. అదే భూమిని ప్రభుత్వ భూమి గా మార్చి.. ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం కోసం 33 సంవత్సరాల లీజుకు ఇచ్చేశారు. దీనిపైన ఇప్పుడు అశోక్ గజపతిరాజు పోరాటం చేస్తున్నారు. గత మూడు రోజులుగా దీనినే హైలెట్ చేస్తూ జిల్లా కలెక్టర్ ను ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడంతో యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటుంది. కచ్చితంగా వైసీపీ భవనాన్ని ఖాళీ చేస్తారు అని తెలుస్తోంది. అదే జరిగితే ఆ పార్టీకి అది ఎంతో అవమానకరం.