Homeబిజినెస్Car Loan Interest Rates: కొత్తగా కారు కొంటున్నారా.. తక్కువ వడ్డీ రేట్లు చూసి టెమ్ట్...

Car Loan Interest Rates: కొత్తగా కారు కొంటున్నారా.. తక్కువ వడ్డీ రేట్లు చూసి టెమ్ట్ కావొద్దు.. ముందు ఇవి తెలుసుకోండి..

Car Loan Interest Rates: కొత్త కారు కొనుగోలు చేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే చాలా మంది ఒకే మొత్తంతో కాకుండా లోన్ ద్వారా కొనాలని చూస్తున్నారు. అంతేకాకుండా మిగతా వాటి కంటే కారు లోన్ పై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రసత్తుం కొన్ని బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్ ఇస్తున్నారు. అయితే కారు కొనే ముందు చాలామంది కేవలం తక్కువ వడ్డీ రేటును మాత్రమే చూసి నిర్ణయం తీసుకుంటారు. కానీ వడ్డీతో పాటు […]

Car Loan Interest Rates: కొత్త కారు కొనుగోలు చేయాలని చాలా మందికి ఉంటుంది. అయితే చాలా మంది ఒకే మొత్తంతో కాకుండా లోన్ ద్వారా కొనాలని చూస్తున్నారు. అంతేకాకుండా మిగతా వాటి కంటే కారు లోన్ పై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రసత్తుం కొన్ని బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్ ఇస్తున్నారు. అయితే కారు కొనే ముందు చాలామంది కేవలం తక్కువ వడ్డీ రేటును మాత్రమే చూసి నిర్ణయం తీసుకుంటారు. కానీ వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు, లోన్ నిబంధనలు కూడా మొత్తం ఖర్చుపై ప్రభావం చూపుతాయి. అందుకే కార్ లోన్ తీసుకునే ముందు అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే?

ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ?
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్ లోన్ ఆఫర్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పోటీపడుతున్నాయి. యూకో బ్యాంక్ అత్యల్పంగా 7.35 శాతం నుంచి 10.00 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.45 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో లోన్లు ఇస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ 8.80 శాతం నుంచి 9.85 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ 8.15 శాతం నుంచి, ఐసీఐసీఐ బ్యాంక్ 8.40 శాతం నుంచి కార్ లోన్లను అందిస్తోంది.

ప్రాసెసింగ్ ఫీజులు పరిశీలించాలి:
వడ్డీ రేటు తక్కువగా ఉందని వెంటనే లోన్ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులు కూడా మొత్తం లోన్ ఖర్చును పెంచుతాయి. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కార్ లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. అయితే ఇతర బ్యాంకులు రూ.1,000 నుంచి గరిష్టంగా లోన్ మొత్తంలో 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి.

లోన్ తీసుకునే ముందు కేవలం వడ్డీ రేటును మాత్రమే కాకుండా, మొత్తం చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించాలి. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, ఇతర అదనపు ఖర్చులను కలిపి ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో ముందుగానే అంచనా వేసుకోవాలి. తక్కువ వడ్డీ ఉన్నా ఇతర ఛార్జీలు ఎక్కువగా ఉంటే లోన్ ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. మీ క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే అంత తక్కువ వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తాయి. కాబట్టి లోన్‌కు దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

ఆర్థిక నిపుణులు సూచించే 20/4/10 సూత్రం కార్ కొనుగోలులో చాలా ఉపయోగపడుతుంది. దీని ప్రకారం కారు విలువలో కనీసం 20 శాతం డౌన్ పేమెంట్ చేయాలి. లోన్ కాలపరిమితి నాలుగు సంవత్సరాలకు మించకుండా చూసుకోవాలి. అలాగే కారు కోసం ప్రతి నెల చెల్లించే ఈఎంఐతో పాటు నిర్వహణ ఖర్చులు కలిపి మీ నెలవారీ ఆదాయంలో 10 శాతం దాటకుండా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper