Home Blog Page 316

Teenage Phone Addiction: ఆ అమ్మాయి సెలబ్రిటీ కాదు.. సెక్యూరిటీగా బౌన్సర్లు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Teenage Phone Addiction: ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. తల్లిదండ్రులకు ఒకే ఒక్క కుమార్తె. స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతోంది.. మొదట్లో ఆ అమ్మాయి చదువులో చురుకుగా ఉండేది. తల్లిదండ్రులు కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఒక్క గానొక్క కుమార్తె కావడంతో తల్లిదండ్రులు కూడా ఆమెను గారాబం చేశారు. ఆర్థికంగా లోటు కూడా లేకపోవడంతో ఆమె అడిగినవన్నీ ఇచ్చేశారు. ఆ బాలిక స్నేహితులు ఖరీదైన ఫోన్ లు వాడేవారు. దీంతో ఆమె కూడా తన తల్లిదండ్రులను కొనివ్వాలని కోరింది. దానికి వారు సమ్మతం తెలిపారు.

ఎప్పుడైతే ఫోన్ ఆమెకు అందించారో.. అప్పటినుంచి ఆమె వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది.. నిత్యం ఫోన్లో తరచూడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులతో మాట్లాడేది కాదు. స్కూల్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆమె ఫోన్ రెస్ట్ ఇచ్చేది. ఆ తర్వాత నిత్యం అందులోనే ఉండేది. మొదట్లో చెప్పి చూశారు.. తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. ఆ తర్వాత మరోసారి చెప్పారు.. ఈసారి వాళ్లతో మాట్లాడటం మానేసింది . దీంతో వారు ఫోన్ లాక్కున్నారు. అన్నం తినడం మానేసింది. కూతురు మీద ప్రేమతో మళ్ళీ ఫోన్ తిరిగి ఇచ్చేశారు.

ఈసారి కూతురి అలవాటు మొత్తం మార్చేయడానికి ఆ తల్లిదండ్రులు సరికొత్త ఉపాయం ఆలోచించారు. ఏకంగా బౌన్సర్లను పెట్టారు. ఆమె ఫోన్ చూస్తే చాలు వెంటనే లాక్కునే విధంగా ప్లాన్ రూపొందించారు. పడుకునేటప్పుడు ఆ బౌన్సర్లు అత్యంత నిష్కర్షగా ఫోన్ లాక్కునేవారు. ఆ బౌన్సర్ల కోసం ఆ తల్లిదండ్రులు ఏకంగా నెలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతేకాదు ఆ బౌన్సర్లు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు..

ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.. అది కాస్త విస్తృతంగా సర్కులేట్లో ఉంది. ఒక ఫోన్ ఒక బాలిక జీవితాన్ని ఎలా మార్చింది.. ఆమె వల్ల కుటుంబం ఎంతగా ఇబ్బంది పడింది.. చివరికి ఆ అలవాటును మార్చడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది.. ఇవన్నీ కూడా సినిమాను మించి ఉన్నాయి. అందువల్లే అలవాటు వ్యసనం కాకూడదు అంటారు. ఆ వ్యసనాన్ని మార్చుకోవాలంటే ఇదిగో ఈ స్థాయిలో కష్టపడాలి. ఇది కేవలం ఆ తల్లిదండ్రుల సమస్య మాత్రమే కాదు.. ఈ ప్రపంచంలో ఉన్న అందరిదీ. అందువల్ల తమ పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి. అవసరమైతేనే ఇవ్వాలి.

Haji Khalil: 70 ఏళ్ల వయసులో 20 ఏళ్ల పడుచు యువతితో ఆ నేత…

Haji Khalil: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. ఆయనకు ఆ ముచ్చట్లు చాలానే జరిగాయి. కానీ అతడు మరిన్ని ముచ్చట్ల కోసం ఆరాటపడుతున్నాడు. పైన బట్ట.. కింద పొట్ట వచ్చినప్పటికీ.. ఆయన ఇంకా పాతిక సంవత్సరాల పడుచు యువకుడిననే అనుకుంటున్నాడు. చివరికి అన్నంత పని చేశాడు. అయితే ఇప్పుడు ఆయన వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది.

ఆయన పేరు హాజీ ఖలీల్. వయసు 70 సంవత్సరాలు . ఒక రకంగా పింఛన్ తీసుకునే వయసు కూడా దాటిపోయింది. ఈ వయసులో కనీసం నాలుగు అడుగులు గట్టిగా నడిస్తేనే కూలబడిపోయే స్థాయి వచ్చేసింది. అటువంటి వయసులో అతనికి పెళ్లి కావలసి వచ్చింది. పైగా ఆయనకు అప్పటికే మూడు వివాహాలు జరిగాయి. 11 మంది పిల్లలు. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. 11 మంది పిల్లలను కన్నప్పటికీ.. ఖలీల్ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ఖలీల్ పెళ్లి చేసుకోబోయే యువతి వయసు 20 సంవత్సరాలు. ఆ యువతి పేరు యాస్మిన్. తన పిల్లల వయసు కంటే ఈ యాస్మిన్ వయసు తక్కువ. మూడు పెళ్లిళ్లు జరిగి.. 11 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఖలీల్ నాలుగో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. ఖలీల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నాడు.. ఇతడికి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. యాస్మిన్ ది పేద కుటుంబం. వారికి డబ్బును ఆశగా చూపించి ఖలీల్ పెళ్లికి ఒప్పించినట్టు తెలుస్తోంది.

ఖలీల్ యాస్మిన్ ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని ఆయన రెండవ భార్య బయటపెట్టింది. రెండవ భార్య నజ్రీన్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘోరాన్ని మొత్తం ఆమె వివరించి చెప్పింది. అయితే ఈ విషయాన్ని బయట పెడుతున్న నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. అందువల్లే ఆమె పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్టు సమాచారం.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కెలకడం అవసరమా

Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. పోనీ ఈ మాట ఎవరైనా పడని వారు అంటే లెక్క చేయనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమైన, అనుకూలమైన, సలహా ఇచ్చే స్థాయిలో ఉన్న వారు కూడా చెబుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్నేహితుల గురించి అందరికీ తెలిసిన విషయమే. అక్కడ స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. తరచూ ఆ ఇద్దరు నేతలు మంచి చెడుల్లో పాలుపంచుకునేవారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓ పెళ్ళిలో కలిసిన విజయ్ ను జగన్మోహన్ రెడ్డి ప్రాణ స్నేహితుడని.. జగన్ స్ఫూర్తితోనే విజయ్ తమిళనాడులో గెలిచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అంతటితో ఆగకుండా సింహం సింగిల్ గా రావాలి అంటూ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇస్తున్నారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ ను కెలుకుతున్నారు.

* జగన్ పై తీవ్ర వ్యతిరేకత..
అసలే పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒక భావనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే వ్యతిరేకతతో ఉన్నారు. అసలు రాజశేఖర్ రెడ్డి అన్న ఆయనకు పడదు. మెగాస్టార్ చిరంజీవికి భిన్నంగా కూడా.. పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై ఉంటారు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు అధికారంలోకి రాకూడదని బలమైన విశ్వాసంతో ఉన్నారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో బలంగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వను అంటూ తేల్చి చెప్పారు. అనంతపని చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. భాగస్వామ్య పార్టీతో చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవుతున్నా.. భరిస్తున్నారే తప్ప బయటపడడం లేదు. దానికి కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకత. కానీ అవేవీ లెక్కచేయడం లేదు వైసిపి. ఇంకా పవన్ కళ్యాణ్ ను కెలుకుతూనే ఉంది.

* ప్రధాన ప్రతిపక్షానికే నష్టం..
ప్రజల నిర్ణయం స్థిరంగా ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తనకు దాదాపు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చింది కనుక.. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వస్తే … తనకు బలం పెరుగుతుందని అంచనా వేస్తోంది. కానీ తమిళనాడులో అన్న డీఎంకే పరిస్థితి.. 2009లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోక తప్పదు. ఏదైనా ప్రధాన రాజకీయ పక్షం కూటమి నుంచి బయటకు వస్తే.. దాని ప్రభావం ప్రధాన ప్రతిపక్ష పార్టీపై పడుతుంది. అది తెలిసి కూడా పవన్ కళ్యాణ్ విషయంలో అనవసరంగా కెలుకుతూనే ఉన్నారు. పైగా పక్క రాష్ట్రంలో వేరే పార్టీ విజయాన్ని అడ్డం పెట్టుకొని. ఇలా గుణపాఠాలు నేర్చుకోకుండా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే మాదిరిగా ముందుకు వెళితే మాత్రం ఆ పార్టీకే నష్టం.

Undavalli Arun Kumar: ‘మార్గదర్శి’ని వదలని ఉండవల్లి

Undavalli Arun Kumar: మార్గదర్శి పై మళ్లీ పోరాటం ప్రారంభించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అటు సూర్యుడు సాయంత్రానికి అలసిపోయి.. పడమటన ఉదయిస్తాడు కానీ.. మార్గదర్శిపై తన పోరాటం ఆగదని ఉండవల్లి చాటి చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ.. ఈ కేసు కొలిక్కి రావడం లేదు. గత ఏడాది ఆగస్టులో తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. దానిని సవాల్ చేస్తూ ఇప్పుడు ఉండవల్లి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో విశేషం ఏమిటంటే.. తాము మార్గదర్శి ద్వారా నష్టపోయాం అని ఏ ఒక్కరూ చెప్పకపోవడం. మార్గదర్శి కూడా తన ఖాతాదారులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు కూడా చేసేసింది. ఎవరైనా మిగిలి ఉంటే వస్తే ఇస్తామని కూడా సూచించింది. అందుకే కోర్టు కూడా ఈ కేసును కొట్టివేసింది. కానీ మార్గదర్శిని విడిచి పెట్టే అవకాశం లేదు అని తేల్చి చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.

* దశాబ్దాలుగా పోరాటం..
ఎవరికైనా అన్యాయం జరిగితేనే.. లేకుంటే ఏదైనా నష్టపరిహారం కోసమో.. లేకుంటే న్యాయం కోసం.. న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సర్వసాధారణం. కానీ 2004లో ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి చిట్ ఫండ్ పై న్యాయపోరాటం ప్రారంభించారు. ఖాతాదారులకు అన్యాయం చేశారు అంటూ రామోజీరావు పై పెద్ద ఉద్యమమే చేశారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారో ఇట్టే పసిగట్టవచ్చు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కాబట్టి.. ఆయనకు వ్యతిరేకంగా ఈనాడు ఉంది కాబట్టి.. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీ మార్గదర్శిపై పోరాడుతూనే ఉన్నారు.

* పిటిషన్ల మీద పిటిషన్లు..
అయితే ఈ కేసులో దురదృష్టం ఏమిటంటే.. కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు కొనసాగుతున్నాయి. న్యాయస్థానాలు మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తోంది. ఖాతాదారుల లావాదేవీలు, డిపాజిట్లు, చెల్లింపులు ఇలా అన్ని వివరాలు తీసుకుంటోంది. అంతా సవ్యంగా ఉన్నాయి కదా ఇంకేంటి అభ్యంతరాలు అంటూ కొట్టేస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో రామోజీరావు మరణించిన తర్వాత ఈ కేసు విచారణ అవసరం లేదని చెప్పి తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. అప్పట్లో ఎవరికైనా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఖాతాదారులకు చెల్లింపులు చేయకపోతే ఆశ్రయించాలంటూ పత్రిక ప్రకటనలు కూడా ఇచ్చింది. కానీ ఏ ఒక్క ఖాతాదారుడు కూడా ఫిర్యాదు చేయలేదు. దీంతో ఏం చేయాలో తెలియక కోర్టు కొట్టి వేసింది. అయినా సరే ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్గదర్శి విషయాల్లో తగ్గేదిలే అంటూ ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అందుకే ఇప్పుడు రామోజీరావు వారసులు నోటీసులు అందుకున్నారు. సమాజంలో చాలా రకాల కేసులు నడుస్తున్నాయి. అంతెందుకు అక్రమస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన బెయిల్ పై ఉన్నారు. అటువంటి వారి జీవితంలో పరిణామాలను విశ్లేషించే ఉండవల్లి అరుణ్ కుమార్.. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో మాత్రం మొండి పట్టుదలగా ఉన్నారు. అందులో రాజకీయ ఆకాంక్ష ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏ ఒక్కరూ తమకు నష్టం జరిగిందని ముందుకు రాలేని కేసులో కూడా.. ఉండవల్లి ఉడుం పట్టులా వ్యవహరిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Amaravati Capital Income: అమరావతి తో 2.50 లక్షల కోట్ల ఆదాయం.. తేల్చేసిన ‘సాక్షి’

Amaravati Capital Income: అమరావతి రాజధానిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వ్యతిరేకమే. మొన్ననే అమరావతి బదులు మావిగన్ ప్రతిపాదన చేశారు జగన్మోహన్ రెడ్డి. మరోసారి రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని చెప్పుకొచ్చారు. అంతకుముందు మూడు రాజధానులు అనే తెరపైకి తెచ్చింది కూడా ఆయనే. టోటల్ గా చెప్పాలి అంటే అమరావతికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఇక సాక్షి మీడియా గురించి చెప్పనవసరం లేదు. అమరావతికి వ్యతిరేకంగా పుంకాను పుంకాలుగా రాస్తూనే ఉంటుంది సాక్షి. అటువంటి మీడియాలో అమరావతికి అనుకూలంగా ఒక కథనం వచ్చింది. అమరావతి ద్వారా ప్రభుత్వం రెండు లక్షల 50 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే సమకూర్చుకుంది అనేది సాక్షి కథనం సారాంశం. ఓ వ్యతిరేక కథనంలో భాగంగా ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయింది దాని సారాంశం.

* చంద్రబాబు ఇంటి పక్కనే గ్రీన్ జోన్..
అమరావతిలో చంద్రబాబు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్ని రకాల వసతులతో ఈ భవన నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ భవనం పక్కనే మూడు వేల గజాలకు పైగా ఖాళీ స్థలాన్ని ఉంచారు. మరో నిర్మాణం జరగకుండా ఉండేందుకు గ్రీన్ జోన్ పరిధిలో చేర్చారు అని సాక్షి మీడియా ఒక కథనం రాసుకొచ్చింది. చంద్రబాబు కుటుంబానికి మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ కథనంలో పేర్కొంది. ఈ నిర్ణయంతో సిఆర్డిఏ కు భారీగా నష్టం జరిగిందని కూడా చెప్పింది. అమరావతిలో ప్రస్తుతం గజం ధర 50వేల రూపాయలు అని.. చంద్రబాబు ఇంటి పక్కనే గ్రీన్ జోన్ పరిధిలో చేర్చడంతో 18 కోట్ల నష్టం జరిగిందన్నది ఈ కథనం సారాంశం. ఇప్పటివరకు అమరావతి అనేది అప్పుల కుప్ప అని.. దాని ద్వారా పూర్తిగా ఆదాయం రాదని తేల్చేసిన సాక్షి.. ఇప్పుడు అక్కడ గజం భూమిని 50 వేల రూపాయల రేటు కట్టిమరి అక్కడ ఉన్న విలువను చాటి చెప్పింది.

* సాక్షి కథనంలో..
సాక్షి మీడియా నిత్యం అమరావతి పై విషం చిమ్ముతూ వచ్చింది. అయితే అమరావతి రాజధానికి భూమి సమీకరించిన ప్రభుత్వం.. తన వద్దే ఓ ఐదు వేల ఎకరాలను పెట్టుకుంది. అమరావతి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందు చూపుతో ఆలోచన చేసింది. అయితే గజం ధర 50 వేల రూపాయలు పలుకుతోంది అని అదే సాక్షి చెప్పింది. ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న భూమి విలువ అక్షరాల రెండున్నర లక్షల కోట్లు. అమరావతి రాజధాని నిర్మాణానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. దాని ద్వారా రూపాయి ఆదాయం వచ్చే అవకాశం లేదు అని సాక్షి ఇన్నాళ్లు కథనాలు ప్రచురించింది. కానీ చంద్రబాబుపై వ్యతిరేక కథనం అల్లే క్రమంలో గజం ధర 50 వేల రూపాయలను చెప్పడం ద్వారా.. రాజధాని నిర్మాణం పూర్తి కాకముందే.. ప్రభుత్వం చేతిలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం ఉందని బయట పెట్టింది. అందుకే అంటారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా వరమో.. శాపమో అని..!

Vijay TVK: టీవీకే చీఫ్ రాజీనామా. విజయ్ కేబినెట్లో త్రిష..

Vijay TVK: తమిళనాడు రాజకీయాలు ఊహకందని విధంగా మారిపోతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలవడ్డాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు డీఎంకేకు జై కొట్టాయి. అయితే ఫలితం మాత్రం వేరే విధంగా వచ్చింది. అలాగని ఒకే పార్టీకి ఏకపక్షంగా అధికారాన్ని కట్టబెట్టలేదు తమిళ ప్రజలు.

మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉన్నప్పటికీ టీవీకే లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో అవతరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో టీ వీ కే అధికారాన్ని దక్కించుకుంది. రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు.. ఈ నేపథ్యంలోనే తమిళనాడు అధికారులు విజయ్ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా.. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజయ్ ఆహ్వానం పలికినట్టు వార్తలు వస్తున్నాయి.

విజయ్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండు స్థానాలలో కూడా ఘన విజయం సాధించారు.. పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని విజయ్ నిర్ణయించుకున్నారు. తిరుచ్చి ఈస్ట్ స్థానంలో గెలిచినప్పటికీ.. విజయ్ అక్కడ రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆ స్థానంలో త్రిషకు టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. అక్కడ త్రిష గెలిస్తే విజయ్ క్యాబినెట్ లో ఆమెకు చోటు లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఇంతవరకు విజయ్ పార్టీలో త్రిషకు ప్రాథమిక సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఆమె ఆస్థానంలో ఎలా పోటీ చేస్తుంది.. విజయ్ ఆమెకు ఎలా అవకాశం ఇస్తాడు.. రాజకీయాల మీద త్రిషకు ఆసక్తి ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. అలాంటప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. ఆ స్థానంలో గెలుస్తుందా.. అనే ప్రశ్నలను తమిళ మీడియా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే త్రిషతో సంబంధం విషయంలో విజయ్ మీద తమిళ మీడియా అనేక రకాల కథనాలను ప్రసారం చేసింది. ఇప్పటికీ ప్రసారం చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా క్యాబినెట్లో మంత్రి అంటూ చెబుతోంది. ఇవన్నీ పుకార్లే అయినప్పటికీ.. తమిళ ప్రజలకు కావలసినంత వినోదం ఈ వార్తల ద్వారా లభిస్తున్నది.

 

View this post on Instagram

 

A post shared by OkTelugu (@okteluguofficial)

Donald Trump: బరాక్ ఒబామా కాపురంలో చిచ్చు పెట్టిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump:  తా చెడ్డ కోతి.. వనమెల్లా చెరిచిందట.. ఇప్పుడు ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నూటికి నూరు శాతం సరిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఆ విధంగా ఉంటాయి మరి.

ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని అపహరించి తమ దేశానికి తీసుకొచ్చారు. ఆయన మీద ద్రోహి అని ముద్ర వేశారు. సంబంధం లేకపోయినా సరే ఇరాన్ దేశంతో యుద్ధం చేశారు. అక్కడ కనీ విని ఎరగని స్థాయిలో నష్టాన్ని చేకూర్చారు. ప్రాణనష్టానికి.. ఆస్తి నష్టానికి కారకులయ్యారు. ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.

ఇక్కడ తోనే ట్రంప్ ఆగిపోవడం లేదు. స్వదేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆయన పరిపాలన మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికీ ట్రంప్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు ట్రంప్ దృష్టి అమెరికాలో ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మీద పడింది. ట్రంప్ నిర్వాకం వల్ల ఒబామా కుటుంబంలో రచ్చ ఏర్పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఒబామా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం.. తనను క్రియాశీల రాజకీయాలలో కొనసాగాలని డెమొక్రటిక్ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన వాపోయారు. మరోవైపు ఒబామా భార్య మిషెల్ ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయాలు వద్దని చెబుతున్నారు.. “మనకు రాజకీయాలు వద్దు. ఈ సమయంలో నువ్వు నాకోసం ఎక్కువ సమయం కేటాయించాలని” తన భార్య కోరుతోందని ఒబామా చెబుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ నిర్ణయాల వల్ల ఒబామా సంసారంలో తీవ్రమైన ఉద్రిక్తత చోటుచేసుకుంటున్నది. కొన్ని సందర్భాలలో తీవ్రమైన నిరాశకు గురవుతోంది.

అమెరికన్ రాజ్యాంగం ప్రకారం పూర్వ అధ్యక్షులు రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉంటారు. ట్రంప్ అధ్యక్షుడిగా అయిన తర్వాత.. ఒబామా కూడా రాజకీయాలకు చాలావరకు దూరంగా ఉన్నారు. ఆయన పనితీరు మీద పెద్దగా మాట్లాడేవారు కాదు. అయితే ట్రంప్ తీసుకుంటున్న విధానాలు.. ఆయన సాగిస్తున్న నిర్ణయాలు అమెరికా భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థికంగా.. సామాజికంగా.. భద్రతాపరంగా అమెరికా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. అందువల్లే ఒబామా ట్రంప్ పరిపాలన మీద విమర్శలు చేస్తున్నారు. అందువల్లే డెమోక్రటిక్ పార్టీ ఒబామా మీద ఒత్తిడి తీసుకొస్తోంది. అధ్యక్షుడిగా పదవి నుంచి దూరమై 16 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ.. ఒబామా డెమోక్రటిక్ పార్టీకి పనిచేస్తూనే ఉన్నారు. ఈ తరహా రాజకీయాలు చేస్తున్న వారిలో ఒబామా అరుదైన వారని అమెరికన్ మీడియా కొనియాడుతోంది.

YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ ఇద్దరు

YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో సంక్లిష్ట పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని ఓ వాతావరణం ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుండడం చర్చకు దారితీస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా టీవీ డిబేట్లతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఆ పార్టీ ఆగ్రనేతలపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే వారిని దూరం పెట్టడం వల్ల అలా చెబుతున్నారా? లేకుంటే ఆశించిన స్థాయిలో వారికి చెల్లింపులు చేయడం లేదా? అందుకే వారు ఎదురు తిరిగారా? అనేది తెలియడం లేదు. ప్రధానంగా పాషా, కె ఎస్ ప్రసాద్ ఇప్పుడు వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఒకరికొకరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక సాక్షి ఛానల్ లో జరిగే డిబేట్ కు హాజరు కాబోమని తేల్చి చెబుతున్నారు. అయితే ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరిని పెంచి పోషించిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఆ పార్టీ అగ్ర నేతలను వ్యతిరేకిస్తుండడం చూస్తుంటే తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

* చెల్లింపులు నిలిచిపోవడంతో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో పనిచేసే వారికి ఆశించిన స్థాయిలో చెల్లింపులు జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీలో ఇటువంటి వాటిని సజ్జల రామకృష్ణారెడ్డి హ్యాండిల్ చేసేవారు. అయితే ఇప్పుడు చెల్లింపులు నిలిపివేయడంతో ఆయన టార్గెట్ అవుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. సాక్షి ఛానల్ డిబేట్ లు అంటే ముందుగా పాషా, కె ఎస్ ప్రసాద్ గుర్తుకు వస్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా డిబేట్లు ఇచ్చే వీరు అవసరం అనుకుంటే వ్యక్తిగత దాడికి దిగుతారు కూడా. అంతలా ఉంటుంది వీరి జోరు. అయితే క్రమేపి ఇటీవల వారి నోరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై పడుతోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా సాక్షిలో కనిపించే వీరు ఇకనుంచి ఆ ఛానల్ వైపు వెళ్ళమని చెబుతుండడం కూడా విశేషం.

* మావిగన్ పై వ్యతిరేకత..
మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తెచ్చిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం- విజయవాడ= గుంటూరును కలుపుతూ మావిగన్ అని పేరు పెట్టాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు. ఆ సమయంలో విశ్లేషకుడి రూపంలో కేఎస్ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆ తర్వాత సాక్షి ఛానల్ డిబేట్లో పాల్గొని భిన్నంగా స్పందించారు. దీంతో అందరూ పేటీఎం డబ్బులు దక్కకపోవడంతోనే కేఎస్ ప్రసాద్ అలా మాట్లాడారని.. సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు. అదే సమయంలో పాషా సైతం జగన్ మావిగన్ ప్రతిపాదనను గట్టిగానే తిప్పి కొట్టారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇద్దరూ ఒకరికొకరు ఇంటర్వ్యూలు ఇస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంగా ఏర్పడి పార్టీని పాతాళంలోకి నెట్టేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

* సజ్జల కోవర్ట్ అంటూ ఆరోపణ
ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై ఆ ఇద్దరూ ఇప్పుడు బాహటంగానే ఆరోపణలు చేస్తున్నారు. కోవర్టు అంటూ కొత్త ముద్ర వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇచ్చి.. పక్కదారి పట్టించి.. పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారన్న ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. అయితే వీరికి చెల్లింపులు నిలిచిపోయాయని.. అందుకే అలా మాట్లాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే సాక్షి ఛానల్ కు వెళ్తుంటే.. తమను పెయిడ్ ఆర్టిస్టుల మాదిరిగా చూస్తున్నారని.. అందుకే అటువైపు వెళ్ళమని చెబుతున్నారు. మొత్తానికి ఇద్దరు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులుగా మారిపోవడం చూస్తుంటే మాత్రం ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

TVK In Andhra Pradesh: ఏపీలో టీవీకే.. విజయ్ గురి వారిపైనే..

TVK In Andhra Pradesh: తమిళనాడు ఎన్నికల్లో గెలుపు ఊపులో ఉన్నారు దళపతి విజయ్. అందరి అంచనాలకు భిన్నంగా రెండు ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి మరి తమిళనాడులో అధికారం పొందనున్నారు. ఈ తరుణంలో తన పార్టీని విస్తరించాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా దక్షిణాది రాష్ట్రాలపై ఆయన ఫోకస్ పెడతారని సమాచారం. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో పాటు కొందరు సినిమా పెద్దల ద్వారా అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలోగా తెలుగు రాష్ట్రాల్లో విజయ్ పార్టీ విస్తరణ ఖాయమన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. అయితే తెలంగాణ కంటే ఏపీలోనే విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కలిసి వచ్చే వర్గాలు ఉన్నాయి. అందుకే ఏపీలో పార్టీ విస్తరణకు ఛాన్స్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది.

* క్రిస్టియన్ వర్గం అధికం..
ఏపీలోని కోస్తా ప్రాంతంలో క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు ఎక్కువ. తెలంగాణతో పోల్చుకుంటే ఆ సామాజిక వర్గం ఇక్కడే ఎక్కువగా కనిపిస్తారు. ఆ వర్గాల్లో విజయ్ కు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే విజయ్ తెలుగు సినిమా రీమేక్ లు ఎక్కువగా ఇక్కడ ఆదరణ పొందుతున్నాయి. ఏపీ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలను పరిగణలోకి తీసుకొని.. విజయ్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు ఏపీలో ఉన్న పొలిటికల్ స్పేస్ ను వివరించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ ఏపీలో పార్టీ విస్తరణ వెనుక ఓ జాతీయ పార్టీ పెద్దల ప్రోత్సాహం ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. ప్రధానంగా క్రైస్తవ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని విజయ్ కొత్త పార్టీ విస్తరణ ఉంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

* వైసీపీకి షాక్..
ఒకవేళ విజయ్ పొలిటికల్ విస్తరణ ఏపీలో ఉంటే కచ్చితంగా అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంప్రదాయ ఓటు బ్యాంకుగా క్రిస్టియన్ వర్గం ఉంది. దానికి 2024 ఎన్నికల్లో గండి పడింది. షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా క్రిస్టియన్ వర్గం ఒకటి ఎదురు నిలిచింది. దాని ఫలితంగా ఆ వర్గంలో చీలిక వచ్చింది. 2014, 2019లో ఆదరించిన ఆ వర్గాలు 2024 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేకం అయ్యాయి. అయితే ఇప్పుడు దళపతి విజయ్ ఎంట్రీ కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటివరకు తమిళనాడులో విజయ్ గెలుపును వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. కానీ విజయ్ ఏపీలో పార్టీ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయి.

Karimnagar Jewelry Robbery: ధర్మపురిలో మకాం.. రెండురోజులు స్కెచ్.. కరీంనగర్ లో దోపిడీ.. మహారాష్ట్ర జంప్.. దొంగల పెద్ద ప్లానింగ్

0

Karimnagar Jewelry Robbery: కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ షాప్‌లో జరిగిన భారీ దోపిడీపై విచారణ కొనసాగుతోంది. పోలీసులు దొంగలను పట్టుకునేందుకు 20 బృందాలతో గాలిస్తున్నారు. వారు పారిపోయిన మార్గాలను గుర్తిస్తున్నారు. అంతర్రాష్ట ముఠా పనే అని పోలీసులు నిర్దారించారు. ఇదే సమయంలో దొంగలు రాష్ట్రం దాటినట్లు గుర్తించారు. ఈ దోపిడీ సంఘటనలో నిందితుల వ్యవహార శైలి పక్కా వూహ్యంతో చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రాంతంలో మకాం వేసి, మరో ప్రాంతానికి వచ్చి దోపిడీ చేసి సరిహద్దులు దాటి పారిపోవడం ద్వారా వారు పోలీసులకు సవాలు విసిరారు.

ధర్మపురిలో మకాం..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు నిందితులు ధర్మపురి పరిసరాల్లోనే తమ మకాం వేశారు. ఈ కాలంలో వారు టార్గెట్‌ ప్రాంతం, మార్గాలు, సమయం, సరిహద్దులు, వెళ్లే బాటలు వంటి వివరాలను రహస్యంగా సేకరించినట్లు గుర్తించారు. ఈ స్టేజింగ్‌ పద్ధతి కేవలం సంచారం కోసం కాక, సీక్రెట్‌ గూడ్‌ గా మారిందని, తర్వాత దోపిడీని ‘‘సమయ పాలన’’, ‘‘మార్గ పాలన’’తో నిర్వహించారని పోలీసులు చెప్తున్నారు.

పక్కా ప్లాన్‌తో దోపిడీ..
కరీంనగర్‌కు వచ్చి దోపిడీ చేసిన విధానం కూడా యాదృచ్ఛికం కాదనే అనుమానాలు పెంచుతోంది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా దుండగులు ప్రి‑ప్లాన్‌తో వచ్చిన అంతర్రాష్ట్ర ముఠా కావచ్‌�ఛిజిౌజీఛ్ఛి అనే అభిప్రాయానికి పోలీసులు చేరుకున్నారు. ముందే ఒక ప్రాంతంలో మకాం వేయడం, అక్కడి నుంచి మరో నగరానికి వెళ్లి నేరం చేయడం సాధారణ స్థానిక చోరీ కంటే ఎక్కువ నిర్దేశిత ప్లానింగ్‌ను సూచిస్తుంది.

అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానం..
నేరం తర్వాత నిందితులు చాలా చాకచక్యంగా సరిహద్దులు దాటి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇది వారు ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా, అనేక రాష్ట్రాల మధ్య నాలుగైదు మార్గాలు తెలిశారనే అభిప్రాయానికి దారితీస్తోంది. అలాంటి నమూనాలు సాధారణంగా అంతర్రాష్ట్ర ముఠాలలో కనిపిస్తాయి. ఈ కేసులోనూ అటువంటి ముఠా నిర్మాణం ఉంటుందా అనేది పోలీసుల ప్రధాన దృష్టి పెట్టారు.

పోలీసులకు సవాల్‌..
సరిహద్దులు దాటి పారిపోవడం వల్ల ఈ కేసు పోలీసులకు స్థానిక అభియోగం కాక అంతర్‌రాష్ట్ర అభియోగంగా మారింది. ఇది రెండు లేదా ఎక్కువ రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగాల మధ్య సమన్వయం, సమాచార పంపిణీ, సాఫ్ట్‌వేర్, సీసీటీవీ, మొబైల్‌ ట్రాకింగ్‌ లాంటి టెక్నికల్‌ ఆధారాలపై ఆధారపడి ఉంటుంది.

సాధారణ ప్రజా భద్రతపై ప్రశ్నలు..
ఈ ఘటన స్థానికులకు భద్రతా భావనపై ప్రశ్నలు తెస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల భద్రతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాన్‌తో వచ్చి, మకాం వేసి, మరో పట్టణంలో దోపిడీ చేసి సరిహద్దులు దాటి పారిపోయే నేరస్తులను ఎలా అరికట్టగలమని ప్రశ్న వినిపిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తగ్గాలంటే ప్రభుత్వం రోడ్‌డేటా, సరిహద్దు నిఘా, సీసీటీవీ నెట్‌వర్క్, సమాచార మార్పిడి వ్యవస్థలను మరింత బలపరచాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ కు కొత్త ఊపిరి.. రాయుడు మార్చేస్తాడా..

Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒకప్పుడు బీసీసీఐకి కూడా తలమానికంగా ఉండేది. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో పనిచేసినవారు ఇక్కడి నుంచే భారత క్రికెట్ నియంత్రణ మండలి శాసించేవారు. హైదరాబాద్ క్రికెట్ స్టేడియం లో అంతర్జాతీయ నుంచి మొదలుపెడితే జాతీయ వరకు ఎన్నో మ్యాచ్ లు నిర్వహించేవారు. తద్వారా హైదరాబాద్ క్రికెట్ కు కొత్త సొబగులు అద్దే వారు.

ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ సంఘం పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆర్థికంగా అవకతవకలు.. సంఘంలో ఉన్న వ్యక్తుల ఇష్టారాజ్యం.. ఐపీఎల్ సమయంలో టికెట్ల కేటాయింపులో రాజకీయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చివరికి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో కనీస సౌకర్యాలను హైదరాబాద్ క్రికెట్ సంఘం ఏర్పాటు చేయలేకపోతోంది. ఈ క్రమంలో గాడి తప్పిన హైదరాబాద్ క్రికెట్ సంఘానికి సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జస్టిస్ నవీన్ రావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

నవీన్ రావు ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీ పర్యవేక్షణలో కీలక నిర్ణయం తీసుకుంది.. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో పాలనను మెరుగుపరచడంతో పాటు.. పారదర్శకత తీసుకొచ్చేందుకు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం పరిధిలో క్రికెట్ అభివృద్ధికి.. ఆటలో ప్రమాణాల పెంపునకు ప్రణాళిక రూపొందించింది.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ ఆపరేషన్ హెడ్ గా భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడిని నియమించింది. రాయుడి ద్వారా హైదరాబాద్ క్రికెట్ సంఘానికి పూర్వ వైభవం వస్తుందని అపెక్స్ కౌన్సిల్ భావిస్తోంది. మూడు సంవత్సరాల పాటు రాయుడు ఈ పదవిలో ఉంటారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం నుంచి ఆయనకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లభించవు. ఆ ఒప్పందం మీద ఆయన సంతకం చేశారు. మంగళవారం బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆటగాళ్లకు ట్రైనింగ్, సెలక్షన్, ప్లేయర్ల అన్వేషణ.. ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటారు. హైదరాబాద్ క్రికెట్ సంఘము అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి ఇప్పటికే ఆయనతో మాట్లాడారు.

హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతి నిరోధక యూనిట్, ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాయుడు ప్రకటించారు. ప్లేయర్లు లేదా ఇంకెవరైనా టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రాయుడు వెల్లడించారు. దోషిగా తేలిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని రాయుడు హెచ్చరించారు. ముంబై క్రికెట్ సంఘం ఇటీవల ఆటగాళ్ల కాంట్రాక్ట్ విధానాన్ని ప్రకటించింది. దీనిని హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అమలులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు రాయుడు. సరైన వ్యక్తులను సెలక్షన్ కమిటీలో నియమించి.. వారు సూచించిన ప్లేయర్లను మాత్రమే ఎంపిక చేస్తారు.

ఈ ఎంపిక ప్రతిభ ఆధారంగానే ఉంటుంది. లీగ్ మ్యాచ్లలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఇంతకుముందు ప్లేయర్లను ఎంపిక చేసేవారు. ఇప్పుడు ఓపెన్ ట్రయల్స్ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేస్తారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు జిల్లాల క్రికెటర్ల మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. మరోవైపు అవినీతి నిరోధక యూనిట్ కు మాజీ జడ్జీ విజేందర్ చైర్మన్ గా ఉంటారు. అదే కాదు మహిళా క్రికెటర్లు.. ఇతర సిబ్బందికి అనుకూలమైన వాతావరణం ముంచేందుకు ఏకంగా పోష్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు.

Chief Ministers Defeat: సీఎంలు ఓడిపోయారు.. ఏపీలో సాధ్యమేనా

Chief Ministers Defeat: ఇటీవల ఎన్నికల ఫలితాల్లో చాలా విచిత్రకర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రులు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. తమిళనాడులో సీఎం గా ఉన్న స్టాలిన్ ఓడిపోయారు. పశ్చిమ బెంగాల్ సీఎం గా ఉన్న మమతా బెనర్జీ కూడా ఓడిపోయారు. 2021 ఎన్నికల్లో కూడా మమత ఓడిపోయారు కానీ.. అప్పట్లో పార్టీ అధికారంలోకి రావడంతో ఉప ఎన్నికలకు వెళ్లి.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇక తమిళనాడులో స్టాలిన్ అయితే టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2029 ఎన్నికల్లో కుప్పం తో పాటు పులివెందుల నియోజకవర్గాలు కూడా ప్రతిష్టాత్మకంగా మారుతాయి. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి కూడా హాట్ టాపిక్ గా నిలవనున్నాయి. దానికి కారణం ఎన్నికల్లో ప్రముఖులు ఓడిపోతుండడమే. ఈ ట్రెండ్ ను అనుసరించి కచ్చితంగా ప్రత్యర్ధులు ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఏపీలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.

* ప్రత్యర్థులపై ఫోకస్..
తమ రాజకీయ ప్రత్యర్థులు చట్టసభలకు రాకూడదు అని పంతం పట్టే రోజులు ఇవి. అందులోనూ ఏపీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో అయితే చంద్రబాబు ఓడిపోయేసరికి.. కుప్పం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. అక్కడ టిడిపి నేతలను ప్రలోభ పెట్టి వైసిపిలో చేర్పించారు. ఓ యువ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఫుల్ పవర్స్ ఇచ్చారు. అసలు కుప్పంలో చంద్రబాబు పర్యటించకుండా కూడా అప్పట్లో అడ్డుకున్నారు. ఎలాగైనా చంద్రబాబును 2024లో ఓడించాలన్నది అప్పట్లో వ్యూహం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు పూర్తిగా మెజారిటీ తగ్గింది. అందుకే ఈసారి అక్కడ గెలిచి చంద్రబాబును అసెంబ్లీలోకి రానీయకుండా చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. కానీ అది వికటించింది. చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవడమే కాదు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా.

* పిఠాపురం పై రాయలసీమ నేతలు
మరోవైపు పిఠాపురం నియోజకవర్గం పై కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. అంతకుముందు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. మరోసారి అదే పరిస్థితి రాకుండా చేయాలని జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. చంద్రబాబు నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగిస్తే.. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో రాయలసీమ నుంచి తనను ఓడించేందుకు రౌడీలమూక వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వైసీపీ చేసిన ప్రయత్నం పిఠాపురం లో కూడా వికటించింది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. మంగళగిరిలో కూడా లోకేష్ ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు జగన్. అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్లో సీఎంలు ఓడిపోవడంతో.. ఏపీలో ఆ పరిస్థితి ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. అయితే గతంలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఎంత మాత్రం వర్కౌట్ కావు అనేది విశ్లేషకుల మాట.

Nara Lokesh: ఇక ప్రజల్లోకి లోకేష్..

Nara Lokesh: యువ నాయకుడు లోకేష్( Nara Lokesh) ప్రభావం ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. జాతీయస్థాయిలో కూడా ఆయన పేరు వినిపిస్తోంది. మొన్ననే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. పేరుకే టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. కానీ ఆయనకు మించి అన్నట్టు లోకేష్ వ్యవహారం నడుస్తోంది. ఆయన కనుసన్నల్లోనే పార్టీ ఉంది. పార్టీ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పార్టీపై పూర్తి పట్టు సాధించారు లోకేష్. ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో మాస్ లీడర్ గా ఎదగాలని గట్టి ప్రయత్నం లో ఉన్నారట నారా లోకేష్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్ర చేపట్టారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. ఇప్పుడు మంత్రిగా ఉండడంతో పాటు పార్టీ బాధ్యతలు తీసుకున్న దృష్ట్యా.. మరింత ప్రభావంతమైన నేతగా మారాలన్న ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది.

* ప్రారంభంలో ఇబ్బందులు..
లోకేష్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో ఆయన ఒక సాధారణ వ్యక్తి. చంద్రబాబు తనయుడు మాత్రమే. రాజకీయ వారసుడు అనిపించుకోలేకపోయారు. చాలా ఇబ్బందులు పడ్డారు కూడా. పైగా చంద్రబాబు లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి ఆపై మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా పరోక్షంగా ఆయనకు పదోన్నతి కల్పించారు. లోకేష్ కెరీర్ కు అది కూడా ఒక రకమైన ఇబ్బందికరమే. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులంతా లోకేష్ ను వ్యతిరేకించడం ప్రారంభించారు. ఆయన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేశారు. నిత్యం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అయితే అన్నింటిని మించి అన్నట్టు రాటు తేలారు నారా లోకేష్. రాజకీయంగా పూర్తిగా పట్టు సాధించారు. వ్యక్తిగతంగా తన శరీర ఆకృతిని మార్చుకున్నారు. పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారు. అయితే ఇది చాలదు అనేది టిడిపిలో ఉన్న ఒక భావన.

* మాస్ లీడర్ గా ఎదిగేందుకు..
రాజకీయాల్లో మాస్ లీడర్ గా ఎదిగితేనే నాలుగు కాలాలపాటు గుర్తిస్తారు. అయితే చంద్రబాబు పాలనా థక్షుడు. ఆయన మాస్ లీడర్ కాదు. ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న చంద్రబాబు ఇప్పుడు చివరి దశలో మాత్రం చాలా గౌరవాన్ని దక్కించుకున్నారు. అయితే చంద్రబాబు మాదిరిగా కాకుండా లోకేష్ ఒక మాస్ లీడర్ గా ఎదగాలి అంటే ప్రజలతో మమేకమై పని చేయాల్సి ఉంటుంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇప్పుడు లోకేష్ ప్రజల మధ్యకు వచ్చేందుకు పక్కాగా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. తరచూ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీని అభివృద్ధి చేయడమే కాదు ప్రజల్లో తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారట. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడతారట. చూడాలి మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో..

Prashant Kishor: పవన్ తో జగన్ పొత్తు.. బయట పెట్టిన ప్రశాంత్ కిషోర్

Prashant Kishor: పవన్ కళ్యాణ్ తో( AP deputy CM Pawan Kalyan ) జగన్ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలతో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కడ విజయ్ నేతృత్వంలో టీవీ కే ఒంటరిగా పోటీ చేసి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ ను పవన్ కళ్యాణ్ తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గతంలోనే పవన్ కళ్యాణ్ తో పొత్తుకు ప్రయత్నించారన్న విషయాన్ని బయట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఒంటరిగా గెలవడంతో ఈ ప్రచారాన్ని మరింత పదును పెట్టారు. దానికి విరుగుడుగా ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని చెప్పినట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

* అప్పట్లో బీజేపీ సహకారం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేయవచ్చు కానీ.. ఆ పార్టీ తెరవెనుక చాలా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. 2019లో ఆ పార్టీ గెలవడానికి బిజెపి పరోక్ష సహకారం ఉందన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఎన్ డి ఏ నుంచి చంద్రబాబు బయటకు వెళ్లిపోవడం.. మోడీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం వంటివి బిజెపి పెద్దల ఆగ్రహానికి కారణం అయ్యాయి. జగన్ పట్ల సానుకూలతలు వ్యక్తం కావడానికి దోహదపడ్డాయి. అంటే పొత్తు పెట్టుకోకుండా.. సీట్ల సర్దుబాటు లేకుండా జగన్మోహన్ రెడ్డికి బిజెపి సహకరించినట్టే కదా. కానీ ఈ విషయాన్ని మరిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదేపదే సింహం సింగిల్ గా వస్తుంది.. ఒంటరి పోరాటం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఒంటరి పోరాటానికి.. అక్కడ గెలుపునకు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తుండడం మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది.

* నంద్యాలలో ఓటమితో..
2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఆ పార్టీ ప్రతి వ్యూహంలోనూ ఆయన ఉన్నారు. అయితే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలివేషన్లు ఇస్తుండడంతో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. గతంలోనే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. అయినా సరే అక్కడ టిడిపి ఘనవిజయం సాధించింది. అయితే ఆ ఫలితంతో జగన్మోహన్ రెడ్డి నైరాస్యంలో పడిపోయారు. 2019లో గెలవాలంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన తో పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.. కానీ ఆ ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. అదే విషయాన్ని తాజాగా ప్రశాంత్ కిషోర్ బయట పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Stalin And YS Jagan: స్టాలిన్ సమక్షంలోనే జగన్ ప్రమాణస్వీకారం!

Stalin And YS Jagan: మనం సోషల్ మీడియా ( social media)యుగంలో ఉన్నాం. అయితే నిజం కంటే అబద్దం వేగంగా వెళ్ళవచ్చు కానీ.. కానీ అది అబద్ధం అని తెలిస్తే అబాసు పాలు కావడం ఖాయం. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే పరిస్థితి. తమిళనాడు విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తమిళనాడులో విజయ్ గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోంది. విజయ్ గెలుపు వెనక జగన్ ఉన్నారన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ప్రచార సారాంశం. కానీ నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు కాబట్టి.. ఈ ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు కూడా హర్షించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి స్టాలిన్ తో ఉన్న బంధం అందరికీ తెలిసిన విషయమే. గతంలో చాలా సందర్భాల్లో ఆ ఇద్దరు నేతలు కలవడం.. ఒకరి హితాన్ని మరొకరు కోరుకోవడం రాష్ట్ర ప్రజలు చూశారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం విజయ్ తమ వాడిగా చెప్పుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

* ఇట్టే ఫ్యాక్ట్ చెక్..
సోషల్ మీడియా వచ్చాక క్షణాల్లో ఫ్యాక్ట్ చెక్ జరిగిపోతోంది. 2019లో అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 సీట్లతో ఘన విజయం సాధించారు. దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూసింది ఆ సమయంలో. అటువంటి సమయంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దక్షిణాదిన ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ఆహ్వానం ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి. నాడు కెసిఆర్, స్టాలిన్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విజయ్ తమ వాడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతుండడంతో.. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ తో పాటు స్టాలిన్ వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* అనుకూల విశ్లేషకులు సైతం..
చాలామంది విశ్లేషకుల రూపంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వీర విధేయత, అనుకూల విశ్లేషణలు చేసిన వారు ఉన్నారు. అటువంటివారు సైతం ఇదేం రాజకీయం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు అని చెబుతున్నారు. అది తెలిసి కూడా ఇటువంటి ప్రచారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలిసినప్పుడు ఇటువంటి సోషల్ మీడియా ప్రచారాలు ఎందుకని నిలదీస్తున్నారు. పైగా తమ పార్టీ నాయకురాలు రోజాను డీఎంకేకు మద్దతుగా ప్రచారానికి పంపించడం ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటప్పుడు ఇటువంటి ప్రచారం అనేది ప్రతికూలతలు ఇస్తుందే తప్ప.. ఎటువంటి అనుకూలతలు ఇవ్వదనేది విశ్లేషకుల అభిప్రాయం.

Vijay Political Success: విజయ్, పవన్ సరే.. ఆ ముగ్గురు ఫెయిల్!

Vijay Political Success: తమిళనాడులో( Tamil Nadu) విజయ్ గెలుపు తర్వాత ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినీ పరిశ్రమ నుంచి కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చేది ఎవరు? పార్టీని ఏర్పాటు చేసేది ఎవరు అనే దానిపై ఒక చర్చ నడుస్తుండగా.. రాజకీయాల్లోకి వచ్చి అవకాశాలు దక్కని సినీ హీరోల పై చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఓ ముగ్గురు.. పొలిటికల్ స్క్రీన్ పై మెరవాలని చూశారు. కానీ అది సాధ్యపడలేదు. తిరిగి సినిమా స్క్రీన్ పైకి వెళ్ళిపోయారు. వారే మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమలహాసన్. ఈ ముగ్గురు ముగ్గురే. సినిమాల్లో విశేష ప్రభావం చూపి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ పొలిటికల్ స్క్రీన్ పై మాత్రం ప్రభావం చూపలేకపోయారు.

* మెగాస్టార్ సైతం..
తెలుగు నాట ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజారాజ్యం( Praja Rajyam) ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఉమ్మడి రాష్ట్రంలోనే పోటీ చేసి 2029 ఎన్నికల్లో 18 స్థానాలకు పరిమితం అయ్యారు. దాదాపు 70 లక్షల ఓట్లను సొంతం చేసుకున్నారు. కానీ పార్టీని పూర్తిస్థాయిలో నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే అప్పటికి ఉన్న రాజకీయ పరిస్థితుల్లో.. ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు సాధించుకోవడం గొప్ప విషయం అని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ప్రజారాజ్యం పార్టీని కొనసాగించి ఉంటే 2014లో ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వచ్చేదన్న అంచనాలు ఉన్నాయి. అయితే ప్రజారాజ్యం పార్టీకి కొనసాగింపుగా జనసేన వచ్చింది. అనుకున్నది సాధించింది కానీ పవన్ కళ్యాణ్ సోలోగా అధికారంలోకి రాలేకపోవడం అనేది లోటు.

* రాజకీయ నిష్క్రమణ..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చి.. తిరిగి సినిమా రంగంలోకి బ్యాకప్ అయ్యారు. నిలకడలేమి, మాట పడకపోవడం, సినిమాలపైనే ధ్యాస ఉండడంతో రజనీకాంత్ రాజకీయాల్లో ఇమడలేమన్న భావనకు వచ్చారు. తమిళనాడులో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. కానీ రాజకీయాల్లోకి వచ్చి ప్రభావం చూపడం కంటే మాట పడకపోవడం ఆయన నైజం. అందుకే రాజకీయాలు సూటు కావని భావించి పార్టీ ప్రారంభించిన కొద్ది రోజులకే నిష్క్రమించారు. మరో లోకనాయకుడు కమలహాసన్ సైతం అదే పరిస్థితి. పార్టీని ఏర్పాటు చేశారు కానీ.. ఆశించిన దూకుడుగా ముందుకు వెళ్లలేదు. కాంగ్రెస్ తో పాటు డీఎంకేకు సపోర్ట్ చేసి పక్కకు తప్పుకున్నారు.

* సినిమాయే వారి ప్రాణం..
అన్నింటికీ మించి ఈ ముగ్గురు సినిమాలను ఇష్టపడతారు. ప్రాణంగా ప్రేమిస్తారు. సినిమాలతో పోల్చుకుంటే రాజకీయాల పట్ల ప్రేమ చూపలేరు. అందుకే పొలిటికల్ స్క్రీన్ పై మరవలేకపోయారు. తిరిగి సినిమా స్క్రీన్ వైపే వెళ్ళిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు విజయ్ తో పాటు పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే దిగ్గజాలు. కానీ సినీ పరిశ్రమ వరకే. సినిమాలు చేయకుండా ఉండలేరు కూడా. విజయ్ రాజకీయాల కోసం సినిమాలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు. పవన్ కళ్యాణ్ సైతం అదే మాదిరిగా వ్యవహరిస్తుంటారు. కానీ ఈ ముగ్గురు సినిమాలను విడిచి పెట్టేందుకు అంగీకరించడం లేదు. అందుకే పొలిటికల్ స్క్రీన్ పై రాణించలేకపోయారు.

Vijay And Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఆప్షన్ లేకుండా చేసిన విజయ్.. ఐదేళ్లూ విజిల్ ఊదాల్సిందే..

Vijay And Rahul Gandhi: సాధారణంగా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ రానప్పుడు.. కొన్ని స్థానాలు సాధించిన చిన్న పార్టీలకు బంపర్ ఆఫర్ లభిస్తూ ఉంటుంది. తంతే గారెల బుట్టలో పడ్డట్టు.. చిన్న పార్టీలు ఆ సందర్భాన్ని పండగ చేసుకొంటాయి. కానీ దురదృష్టవశాత్తు మనదేశంలో కాంగ్రెస్ పార్టీ చిన్న సైజు పార్టీగా మారిపోయింది. ఒకప్పుడు దేశాన్ని అప్రతిహతంగా పరిపాలించిన ఆ పార్టీ.. ప్రాంతీయ పార్టీలకంటే దిగజారిపోయింది. ఆ పార్టీ అగ్ర నాయకత్వం లో సత్తా లేకపోవడంతో రోజురోజుకు దిగజారి పోతుంది.

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేతో జట్టు కట్టి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. కొన్ని స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు విజయ్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ లభించలేదు. కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వాలని విజయ్ పార్టీలోని ముఖ్య నాయకులు కోరారు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుకూల స్పందన ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ టీవీకేకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే తమిళనాడులో కొత్త రాజకీయ శకాన్ని చూడాల్సి ఉంటుంది. అంతేకాదు టీవీకే అధినేత విజయ్ బుధవారం గవర్నర్ ను కలుస్తారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చిస్తారు. గురువారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో.. విజయ్ కి రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. మరోవైపు సపోర్ట్ చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ రెండు మంత్రి పదవులను అడిగినట్లు తెలుస్తోంది.. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

విజయ్ కాంగ్రెస్ వైపు చూసేందుకు ప్రధాన కారణం.. డీఎంకే కూటమిలో ఆ పార్టీ ప్రధాన భాగస్వామి. డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటికి లాగితే.. ఇండియా కూటమిలో డీఎంకే ఉండదు. అప్పుడు డిఎంకె రాజకీయంగా ఒంటరి అయిపోతుంది. విజయ్ టార్గెట్ కూడా అదే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కేంద్రంతో గోక్కోవలసిన అవసరం విజయ్ కి లేదు. పైగా అన్నా డీఎంకే మెరుగైన సీట్లు సాధించినప్పటికీ.. ఒకప్పటితో పోల్చి చూస్తే అంత బలంగా లేదు. అందువల్లే ఆ పార్టీ నుంచి చాలామంది నాయకులు టీవీకేలో చేరిపోయారు. ఈ ఐదు సంవత్సరాలలో అన్నా డీఎంకే నుంచి టీవీ కేకు వలసలు ఉంటూనే ఉంటాయి. విజయ్ దాని గురించి దృష్టి పెట్టంది కూడా అందువల్లే.

డీఎంకేను ఎంత బలహీనపరిస్తే టీవీ కేకు తమిళనాడులో అంత బలం పెరుగుతుంది. అందువల్లే విజయ్ ఈ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరపడం మొదలుపెట్టారు. అవి విజయవంతం కావడంతో ఆయన మొదటి టార్గెట్ ఈజీగానే ఫినిష్ చేయగలిగారు. విజయ్ చెప్పినట్టుగానే రాహుల్ సమ్మతి ఇస్తున్న నేపథ్యంలో.. ఈ ఐదు సంవత్సరాలు రాహుల్ గాంధీ విజిల్ ఊదాల్సిందే.