Home Blog Page 315

BCCI bias on Uppal Stadium: ఉప్పల్ మీద బీసీసీఐ పెద్దలకు ఎందుకింత వివక్ష

BCCI bias on Uppal Stadium: ఐపీఎల్ నిర్వహించే ప్రతి సీజన్లోనూ దక్షిణాదిలో మైదానాలు కిటకిలాడిపోతుంటాయి. మ్యాచ్ ఏదైనా సరే అభిమానులు భారీగా హాజరవుతుంటారు. క్రికెట్ మీద తమకున్న అభిమానాన్ని బయటపెట్టుకుంటారు. సోషల్ మీడియాలో వారు చేసే రచ్చ ఇంక మామూలుగా ఉండదు. వాస్తవానికి ఈ స్థాయి అభిమాన గణం ఉత్తర భారత దేశంలో అంతగా కనిపించదు. ఇదేదో రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి రాస్తున్న కథనం కాదు. బిసిసిఐ పెద్దలు గీస్తున్న విభజన రేఖను దృష్టిలో పెట్టుకొని ఇలా బాధను వ్యక్తం చేయాల్సి వస్తోంది.

ఐపీఎల్ లో అన్ని జట్లు ఆడుతున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల పేరుతో బిసిసిఐ జట్లను ఏర్పాటు చేసింది. ఈ జట్లు ఐపీఎల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన బిసిసిఐ.. ఒక ప్రాంతం మీద విపరీతమైన ప్రేమ కనబరుస్తోంది. మిగతా ప్రాంతాల మీద దారుణమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. లీగ్ దశలో మ్యాచులు నిర్వహించి.. కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ల విషయంలో మాత్రం బీసీసీఐ ఏకపక్ష విధానాన్ని కొనసాగిస్తుంది.

దక్షిణ భారత దేశంలో చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, హైదరాబాదు లాంటి ప్రాంతాలలో విస్తారమైన క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. వీటిల్లో అద్భుతమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని పక్కన పెట్టారు. క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు ఉత్తర భారత దేశంలోని మైదానాలలో నిర్వహిస్తున్నారు. ఉత్తర భారత దేశంలో ఉన్న మైదానాలలో సౌకర్యాలు ఏమిటో.. దక్షిణ భారతంలో ఉన్న మైదానాలలో లేని సౌకర్యాలు ఏమిటో బీసీసీఐ పెద్దలు చెప్పాల్సి ఉంది. అసలు క్రికెట్ అంటేనే దక్షిణాది కదా. ఇక్కడ ప్రేక్షకులు ఏ స్థాయిలో క్రికెటర్లను.. క్రికెట్ ను ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విశాఖపట్నం వేదికగా మహిళల జట్టు ఆడుతున్న మ్యాచ్లను నిర్వహించినప్పుడు.. అభిమానులు భారీగా వచ్చారు. మహిళ క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. భారత మహిళా క్రికెటర్లు కూడా స్థానిక అభిమానుల ప్రేమ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం బీసీసీఐ పెద్దలకు కనిపించకపోవడం విశేషం.

ఉప్పల్, కొచ్చి, చేపాక్, విశాఖపట్నం మైదానంలో లోకల్ ఫాన్స్ సపోర్టు విపరీతంగా ఉంటుంది. అటువంటిది ఇంత గొప్ప మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకపోవడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు మైదానంలో సాంకేతిక సమస్యలను సాకుగా చూపించిన బీసీసీఐ పెద్దలు.. కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచుల విషయంలో మాత్రం పక్కన పెట్టడం విశేషం. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటికే అనేక రకాల సమస్యలను బీసీసీఐ పెద్దలు లేవనెత్తారు. వాటిని అక్కడి నిర్వాహకులు పరిష్కరించుకున్నారు. లీగ్ దశలో మ్యాచులను సమర్ధవంతంగా నిర్వహించారు. లీగ్ దశలో సక్రమంగా నిర్వహించినప్పుడు.. ప్లే ఆఫ్ విషయంలో అంతటి సమర్థత కరువైపోతుందా.. ఈ ప్రశ్నలకు బీసీసీఐ పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉందని అభిమానులు అంటున్నారు.

Vijay CM oath ceremony tomorrow: రేపే సీఎంగా విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం.. ఆంధ్రానుండి హాజరు కాబోతున్న ముఖ్య అతిధులు వీళ్ళే..

Vijay CM oath ceremony tomorrow: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్(Thalapathy Vijay) రేపు నెహ్రు స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అందుకోసం ఆయన తన పార్టీ నేతలతో కలిసి గవర్నర్ అనుమతి తీసుకోబోతున్నాడు. విజయ్ టీవీకే పార్టీ కి కేవలం 107 సీట్లు మాత్రమే వచ్చింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని దాటాలంటే 118 కి పైగా స్థానాలు రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తు అనివార్యం అవ్వడంతో , విజయ్ ఎవరితో చేతులు కలపబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ తో టీవీకే పొత్తు ఖరారు అయ్యింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కాసేపటి క్రితమే టీవీకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోపక్క విజయ్ DMDK,CPI , CPM పార్టీల మద్దత్తు కూడా కోరాడు. వీళ్లంతా కలిస్తే 118 సీట్లు అవుతాయి.

మరో పక్క అన్నా డీఎంకే పార్టీ తో కూడా విజయ్ సంప్రదింపులు జరుపుతున్నాడు. నేడు టీవీకే పార్టీ నేత ఆనంద్ అన్నా డీఎంకే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని ముఖ్య నాయకులలో కొందరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో కేంద్రం లో ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్న రాహుల్ గాంధీ కూడా ఉన్నాడట. రేపు ఆయన విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం లో తన స్వరం వినిపించబోతున్నాడు. అంతే కాకుండా సౌత్ లో లెఫ్ట్ భావజాలాలు ఉన్న పార్టీ నేతలందరికీ ఆయన ఆహ్వానం పంపించాడట. అలా ఆహ్వానం అందుకున్న వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ విపక్ష నేత , మాజీ సీఎం జగన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ కి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ఆయన విదేశాల్లో ఉండడం తో రాలేకపోతున్నాను అని విజయ్ తో చెప్పాడట.

తన పార్టీ వైపు నుండి ముఖ్య నాయకులను పంపిస్తానని చెప్పాడట. ఇక కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కావడం , రేపు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి రాబోతుండడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వంటి వారిని కూడా ఆహ్వానించాడట విజయ్. రేపు వీళ్ళందరూ ఒకే వేదిక పై కనిపించబోతున్నారు. ఇక మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Ram Charan Peddi movie business: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ బిజినెస్ ఎంత జరిగింది…

Ram Charan Peddi movie business: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ కాకపోవడంతో సినిమాని జూన్ 4వ తేదీకి పోస్ట్ పనిచేశారు. రిలీజ్ కి ఇంకా 28 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చాలా గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇక దానికి తోడుగా రామ్ చరణ్ సైతం గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే తన ఖాతాలో మరో భారీ సక్సెస్ వేసుకోవాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట కూడా ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా భారీగా జరిగిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ 300 కోట్ల వరకు జరిగిందట.

ఇక అలాగే ఓటిటి రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ వాళ్ళకి 120 కోట్లకి అమ్మేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అంటే మొత్తం 420 కోటా వరకు బిజినెస్ జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం డిస్ట్రిబ్యూటర్లు చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ సినిమాకి పాన్ ఇండియాలో ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇక ఈ మూవీ లాంగ్ రన్ ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబడుతోంది ఏ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది…

NTR Dragon movie update: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ బాధ్యతలను మరో దర్శకుడికి అప్పజెప్పిన ప్రశాంత్ నీల్…

NTR Dragon movie update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మూవీ స్టార్ట్ అయి సంవత్సరన్నర సమయం అయినప్పటికి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. ఇక ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమాకి మాటలు రాసే బాధ్యతని దేవకట్టా కి అప్పజెప్పాడు. ఇక ఇదంతా చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అంటే ఇప్పటి వరకు మూవీ కి సంబంధించిన టాకీ పార్టీ ఏం షూట్ చేయలేదా? ఎందుకని ఇప్పుడు అతనికి డైలాగులు రాసే బాధ్యతను అప్పజెప్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సైతం ప్రశాంత్ నీల్ మీద తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

కానీ వాస్తవానికి సినిమాలోని కొన్ని కోర్ సన్నివేశాలకు డైలాగులు అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదట. దాంతో ఆల్రెడీ రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్న దేవకట్టతో ఈ సినిమా డైలాగ్స్ రాయించాలని అనుకున్నారట. అందుకే రీసెంట్ గా దేవకట్టా ను కలిసి అతనికి పూర్తి కథను చెప్పి డైలాగ్స్ రాసే బాధ్యతను తన చేతిలో పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ అయితే రాలేదు. మరి ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్లు సినిమా మీద హైప్ ను పెంచుతాయా లేదంటే హైప్ ను తగ్గించే ప్రయత్నం చేస్తాయా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే దేవకట్టతో కొలబ్రేట్ అయిన ప్రశాంత్ నీల్ అతని నుంచి ఎలాంటి ఔట్ పుట్ ను రాబట్టుకుంటాడు. తన రాసే డైలాగులు సినిమాకి ఏ రకంగా హెల్ప్ అవుతాయి. యావత్ ప్రేక్షకలోకాన్ని మెప్పించగలిగే డైలాగ్స్ దేవకట్ట రాయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Sai Pallavi Kalki 2 remuneration: కల్కి 2′ మూవీలో చేయడానికి సాయి పల్లవి డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఎంతంటే…

Sai Pallavi Kalki 2 remuneration: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2’ సినిమా విషయంలో చాలా వరకు చర్చలైతే జరిగాయి. నిజానికి కల్కి మొదటి పార్ట్ లో కల్కి కి జన్మనిచ్చే క్యారెక్టర్ లో దీపికా పదుకొనే నటించింది… ఇక కల్కి మొదటి పార్టీ ఎండింగ్ వరకు కూడా తను ప్రెగ్నెంట్ లేడీ గానే కనిపించింది. అయితే రెండో పార్ట్ కోసం ఆమె భారీగా కండిషన్స్ పెట్టడం వర్కింగ్ అవర్స్ లోనే తను వర్క్ చేస్తానని చెప్పడం. రెమ్యునరేషన్ పెంచడం లాంటివి చేసింది. దాంతో సినిమా యూనిట్ తనను మూవీ నుంచి తప్పించారు. మొత్తానికైతే దీపికా పదుకొనే ప్లేస్ లో ఎవరు నటిస్తారు ఆ ప్లేస్ ను భర్తీ చేయగలిగే నటి ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వచ్చాయి. ఎట్టకేలకు సాయి పల్లవి ఆ క్యారెక్టర్లో నటిస్తుంది అంటూ సినిమా యూనిట్ నుంచి న్యూస్ బయటకు వచ్చింది.

దాంతో ఇప్పుడు సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి రన్బీర్ కపూర్ హీరోగా చేస్తున్న రామాయణంలో సాయి పల్లవి సీత క్యారెక్టర్ ను పోషిస్తుంది.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో కల్కి 2 కోసం కూడా తననే తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారట… అందుకే వాళ్లు కూడా ఈ క్యారెక్టర్ కోసం దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా కల్కి 2 సినిమాకి ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉంది.

కాబట్టి సాయిపల్లవి అయితేనే దీపిక ప్లేస్ ను రీప్లేస్ చేయగలుగుతుందనే ఉద్దేశ్యంతో తనను ఏరీ కోరి మరి పెట్టుకున్నారు. ఇక మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ ని సాధించడంతో రెండో పార్ట్ కోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు విపరీతంగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం ప్రభాస్ పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో అయిపోతాడు. అలాగే సాయి పల్లవి సైతం టాప్ హీరోయిన్ గా మారిపోతుంది…

Did Pawan Kalyan help Vijay win: విజయ్ గెలవడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యాడా…

Did Pawan Kalyan help Vijay win: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన సాధించిన అంతా ఇంతా కాదు అలాంటి రజినీకాంత్ తో చాలామంది దర్శకులు వరుస సినిమాలను చేశారు. ఇక రజినీకాంత్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో ఆ రెంజ్ సక్సెస్ ని సాధించిన హీరో విజయ్…ఆయన క్రేజ్ తారా స్థాయిలో ఉంది. నిజానికి విజయ్ టివికే అనే పొలిటికల్ పార్టీని పెట్టాడు. దాన్ని స్థాపించిన సంవత్సరంలోనే ఆయన అధికారంలోకి వచ్చాడు అంటే మామూలు విషయం కాదు. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 108 సీట్లను గెలుచుకొని తన జెండా ఎగరేశాడు. మొత్తానికైతే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత సీఎం అయిన మరో హీరో విజయ్ మాత్రమే అని తమిళ్ జనాలు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే విజయ్ గెలిచిన తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ ని కావాలనే ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా విజయ్ గెలుపుకి పరోక్షంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యాడనే విషయం మనలో చాలా మంది మర్చిపోతున్నారు. అది ఎలా అంటే నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ జనానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సినిమా ఇండస్ట్రీని వదులుకొని వచ్చాడు. అలాంటి అతను 2019 వ సంవత్సరంలో సోలోగా పోటీ చేస్తే జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి జనసేన పార్టీ అధ్యక్షుడిని సైతం ఓడించిన ఘనత ఏపీ ప్రజలకే దక్కుతుంది.

నిజానికి పవన్ కళ్యాణ్ 2024 వ సంవత్సరంలో ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ను ఫామ్ చేశాడు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఆయన పనితనం కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే తమిళ్ ప్రేక్షకులు సైతం పవన్ కళ్యాణ్ పనితనాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.

ఇక ఇప్పుడు విజయ్ కూడా జనానికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఓడించి తప్పు చేయకూడదు. పవన్ కళ్యాణ్ మాదిరిగానే విజయ్ కూడా గెలిస్తే జనానికి ఎంతో కొంత మేలు చేస్తాడని అనుకున్నారట. దాంతో తమిళ జనాలు పవన్ కళ్యాణ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని విజయ్ కి కొంత మంది ఓట్లేశారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా విజయ్ గెలుపుకి పవన్ కళ్యాణ్ కూడా కారణమయ్యారంటూ మరి కొంతమంది చెబుతుండడం విశేషం…

Rajinikanth regret Vijay success: విజయ్ ని చూసి రజినీకాంత్ రిగ్రెట్ అవుతున్నాడా…

Rajinikanth regret Vijay success: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం విజయ్ పెను సంచలనాలను సృష్టిస్తున్నాడు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనా సత్తా చాటుకున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా ఆయన తన మార్క్ చూపిస్తున్నాడు.రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో 108 సీట్లను గెలిచిన ఆయన సీఎంగా అవతరించబోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే గతంలో రజినీకాంత్ సైతం భారీ పాపులారిటిని సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. తను రాజకీయ రంగంలోకి వస్తాడు అంటే చాలామంది చాలా రకాల కామెంట్లు చేశారు. ఇక దానికి తోడుగా రజనీకాంత్ సైతం రాజకీయ పార్టీని అనౌన్స్ చేసి మళ్లీ రద్దు చేసుకున్నాడు. కారణం ఏదైనా కూడా ఇప్పుడు విజయ్ ని చూసిన రజినీకాంత్ కొత్తవరకూ రిగ్రేట్ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే తన పార్టీ ని కనక రద్దు చేయకుండా ఉంచి ఉంటే ఇప్పుడు విజయ్ ఉన్న పొజిషన్ లో రజనీకాంత్ ఉండేవాడని అనుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ అనూహ్యంగా సీఎం అవుతుండటం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి విజయ్ టివికే పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు మహా అయితే 10 నుంచి 20 సీట్ల మధ్య వస్తాయని అందరు ఎక్స్పెక్ట్ చేశారు.

కానీ జనాలు మాత్రం విజయ్ వెంటే ఉన్నారనేది ఎవరు గమనించలేకపోయారు. విజయ్ మాత్రం పూర్తి స్థానాల్లో పోటీ చేసి 108 సీట్లను గెలుచుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇతర పార్టీలకు గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా వాళ్ళందర్నీ డామినేట్ చేసి డీఎంకే, అన్న డీఎంకే రెండు పార్టీలకు కలిపి ఎన్ని సీట్లు వచ్చాయో విజయ్ ఒక్క పార్టీకే అన్ని సీట్లు రావడం అనేది నిజంగా ఒక పెను ప్రభంజనం అనే చెప్పాలి.

తమిళనాడు జనాలందరు విజయ్ వెంటే ఉన్నారనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది…మరి ఫ్యూచర్ లో కూడా విజయ్ మంచి పనులు చేసుకుంటూ వెళ్తే మరోసారి కూడా ఆయనే అధికారంలోకి వస్తారని రాజకీయ విశ్లేషకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

 

Jiiva Father RB Choudary passes away: తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడుస్తున్న హీరో జీవా.. వీడియో వైరల్..

Jiiva Father RB Choudary passes away: సౌత్ లో ఎన్నో సెన్సేషనల్ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను మనకు అందించిన నిర్మాత ఆర్బీ చౌదరి, నిన్న రాజస్థాన్ లోని కారు ప్రమాదం లో దుర్మరణం చెందడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ విచారం వ్యక్తం చేస్తూ ఆర్బీ చౌదరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రముఖ నటుడు జీవా ఆర్బీ చౌదరి కి కొడుకు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఎనో సూపర్ హిట్ సినిమాల్లో ఈయన నటించాడు. ముఖ్యంగా ఆయన హీరో గా నటించిన ‘రంగం’ అనే చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా పరంగా కల్ట్ క్లాసిక్ అని అనిపించుకుంది. అలా ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యాడు జీవా. అయితే నిన్నాకు ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

అప్పుడే తన తండ్రి చనిపోయాడు అనే విషయం తెలిసినట్టు ఉంది, ఫోన్ లో మాట్లాడుతూ జీవా వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు అభిమానుల హృదయాలను పిండేస్తోంది. వెండితెరపై అలరించే ఒక హీరో, ఇలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఎవరికైనా చూసేందుకు చాలా బాధగా ఉంటుంది. పైగా జీవా అంటే తమిళ స్టార్ హీరోలైన అజిత్ , విజయ్ అభిమానులకు చాలా స్పెషల్. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో ఈయన నటించాడు కాబట్టి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇక ఆర్బీ చౌదరి విషయానికి వస్తే ఈయన టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి చిత్రాలను అందించాడు. తెలుగు లో ఈయన నిర్మించిన మొదటి చిత్రం ‘సుస్వాగతం’.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటి భారీ సూపర్ హిట్, ఆయన్ని హీరోగా నిలదొక్కుకునేలా చేసింది. ఈ చిత్రం లోని ఎమోషనల్ సన్నివేశాలను ఇప్పుడు చూసినా కన్నీళ్లు ఆగవు. ఆ తర్వాత రెండవ సినిమా విక్టరీ వెంకటేష్ తో ‘సూర్య వంశం’ చేశాడు . ఇది కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత శీను, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా , ప్రియమైన నీకు, సింహరాశి, అదృష్టం, శివరామరాజు , లవ్ టుడే, విద్యార్థి , సంక్రాంతి , అందాల రాముడు, అన్నవరం , గోరింటాకు, భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ, మిస్టర్ పెళ్లి కొడుకు , గాడ్ ఫాదర్ వంటి తెలుగు చిత్రాలను నిర్మించాడు , వీటిల్లో ఒకటి రెండు మినహా, మిగిలినవన్నీ సూపర్ హిట్ అనొచ్చు.

AP Congress leader gets Rajya Sabha seat: ఏపీ కాంగ్రెస్ నేతకు రాజ్యసభ పదవి

AP Congress leader gets Rajya Sabha seat: ఏపీలో ( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. జూన్లో నలుగురు రాజ్యసభ సభ్యులు ఏపీ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆ నాలుగు పదవులు కూడా కూటమికి దక్కనున్నాయి. ఎందుకంటే ఏపీలో కూటమి ఏకపక్షంగా బలంగా ఉంది. అందుకే ఆ నాలుగు పదవులు కూటమి ఖాతాలో పడనున్నాయి. అయితే అనూహ్యంగా ఏపీకి చెందిన ఓ కాంగ్రెస్ నేతకు రాజ్యసభ పదవి దక్కనున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆ నేత ప్రస్తుతం.. ఏఐసీసీలో చోటు దక్కించుకున్నారు. ఆయనకు రాజ్యసభ పదవి దక్కడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. అయితే అది ఏపీ నుంచి కాదు. కర్ణాటక నుంచి ఆయన నామినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆయనే నీలకంఠాపురం రఘువీరారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా వ్యవహరించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏఐసీసీ మెంబర్ గా ఉన్న ఆయనకు ఈసారి రాజ్యసభ ఛాన్స్ తప్పదు అన్న టాక్ నడుస్తోంది.

కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం
ఉమ్మడి అనంతపురం( Ananthapuram district) జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు రఘువీరారెడ్డి. 1985లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆయన స్వల్పకాలంలోనే ఎమ్మెల్యే అయ్యారు. 1989లో తొలిసారిగా మడకశిర నియోజకవర్గం నుంచి గెలిచారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 1994 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 1999లో రెండోసారి గెలిచారు. 2004లో గెలిచి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. 2009లో సైతం కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు రఘువీరారెడ్డి. మూడోసారి మంత్రి పదవి చేపట్టారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కొనసాగుతూ వచ్చారు. రాష్ట్ర విభజనతో చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇతర పార్టీల్లో చేరిపోయారు. రఘువీరారెడ్డి మాత్రం ఆ పని చేయలేదు. పైగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ మెంబర్గా కొనసాగుతున్నారు.

కర్ణాటక నుంచి ఎంపిక..
అనంతపురం జిల్లా బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. కర్ణాటక రాజకీయాల్లో అక్కడ నేతలు యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇన్చార్జిగా కూడా కొన్ని నియోజకవర్గాలకు వ్యవహరించారు రఘువీరారెడ్డి. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పర్యటనలు చేసి ఎన్నికల ప్రచారం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. అందుకే ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు రఘువీరారెడ్డిని ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. ఆ రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. అందులో మూడు పదవులు కాంగ్రెస్ కూటమికి దక్కడం ఖాయం. అందుకే రఘువీరా పేరును కర్ణాటక కాంగ్రెస్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఆయన రాజ్యసభ పదవికి ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Religion based Politics in West Bengal Assam: బెంగాల్ అస్సాంలో రాజకీయ కేంద్ర బిందువు మత ప్రాతిపదిక

Religion based Politics in West Bengal Assam: అస్సాం, బెంగాల్ ఎన్నికల్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఓటు చోరీ.. ఓట్లు మతప్రాతిపదికన విభజించబడ్డాయి. జరిగింది ఇదే. అస్సాంలో, బెంగాల్ లో మతం ఆధారంగా ఓట్లు చీల్చేశారు. ముస్లింలు మత ప్రాతిపదికన ఓటు వేయడం ఎప్పటి నుంచో ఉంది.. అస్సాలో కాంగ్రెస్, యూడీఎఫ్ లకు ముస్లింలు ఓటు వేస్తారు. బెంగాల్ లోనూ ముస్లింలు టీఎంసీకి ఓటు వేస్తారు..

అయితే ఈసారి హిందువులు రెండు రాష్ట్రాల్లో ఏకమయ్యారు. ఒకసారి గణాంకాలు చూస్తే.. అస్సాంలో పైన బోడో గిరిజనులు ఉంటారు.. హిందువులే ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ 1 వచ్చింది.. లోయర్ అస్సాంలో ముస్లింల జనాభా ఎక్కువ. 33 కి కాంగ్రెస్ కు 10 వచ్చాయి. ఇక్కడ వాస్తవానికి ఎక్కువగా రావాల్సి ఉంది.

బ్రహ్మపుత్ర నదికి ఉత్తర భాగాన ఉన్న తేయాకు కూలీలు హిందువులు జార్ఖండ్ వాసులు వారు కాంగ్రెస్ కు 16కు 1 సీటే వచ్చింది.. సెంట్రల్ అస్సాంలో 13కి కాంగ్రెస్ కు 3 వచ్చాయి. అప్పర్ అస్సాంలో 27కి సున్నా సీట్లు వచ్చాయి. వీళ్లే అసలైన అస్సామీలు.. అస్సాంలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 18 సీట్లు ముస్లిం ఎమ్మెల్యేలే. దీంతో అస్సాంలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ గా మారింది.

బెంగాల్ అస్సాంలో రాజకీయ కేంద్ర బిందువు మత ప్రాతిపదికన చీలింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Chiranjeevi favorite music director: చిరంజీవికి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా…

Chiranjeevi favorite music director: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాలతో వరుస విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని సాధించగలిగే కెపాసిటి ఉన్న చిరంజీవి కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

అందుకే ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి పని చేశాడు. కాబట్టి వాళ్ళందరిలో చిరంజీవికి బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. చిరంజీవికి ఇళయ రాజా, మణిశర్మ అంటే చాలా ఇష్టమట.

వాళ్ళిద్దరి మ్యూజిక్ లో ఏదో ఒక తెలియని ఫీల్ ఉంటుందని అందుకే ఎక్కువ సినిమాలకి వాళ్లనే రిపీట్ చేశానని గతంలో కొన్ని సందర్భాల్లో తెలియజేశారు. కీరవాణి మ్యూజిక్ అద్భుతంగా ఉన్నప్పటికి ఆయన పాటలు కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే అలరిస్తాయని ఇళయరాజా మణిశర్మ మ్యూజిక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని ఆయన చెప్పడం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా మణిశర్మ కి మార్కెట్ లేకపోయిన ఆయన పూర్తి ఫేడ్ అవుట్ లో ఉన్నప్పటికి ఆచార్య సినిమాతో లైఫ్ ఇవ్వాలని చూశాడు. ఆ సినిమాలోని పాటలు బాగున్నప్పటికి సినిమా ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో ఆయనకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. అలా చిరంజీవి మొత్తానికైతే ఈ ఏజ్ లో కూడా సినిమాలు చేసుకుంటూ తన తోటి వారిని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…

Balakrishna Koratala Siva movie updates: బాలయ్య – కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా నుంచి తమన్ ఔట్ అయ్యాడా…

Balakrishna Koratala Siva movie updates: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. కొరటాల శివ గతంలో ‘దేవర’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. మొత్తానికైతే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేయడంతో కొరటాల శివ మరోసారి నందమూరి హీరోనే డైరెక్షన్ చేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకున్నారు. బాలయ్య బాబు సినిమాలు అంటే తమన్ సంగీత దర్శకుడిగా వ్యవరిస్తాడనే విషయం మనందరికీ తెలిసిందే. బాలయ్య బాబు చేసిన గత 5 సినిమాలకు అతనే మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు.

ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. కానీ ఇలాంటి క్రమంలో కొరటాల శివ మాత్రం అనిరుధ్ ను తీసుకోవడం వెనక పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు సైతం దీని మీద కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట.

ఎందుకంటే బాలయ్య బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు బిజియం తో తమన్ అదరగొడుతాడని బాలయ్య అభిమానులు నమ్ముతారు. అందువల్లే తమన్ ను పక్కన పెట్టి అనిరుధ్ ను తీసుకోవడం పట్ల వాళ్లు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం… ఇక మరికొందరైతే బాలయ్య సినిమాకి బండోడు(తమన్) పోయి బక్కోడు (అనిరుధ్) వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…

కొరటాల శివ ఇంతకుముందు ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అందులోని పాటలు బ్యా గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాకి కొరటాల శివ మరోసారి అనిరుధ్ నే రిపీట్ చేస్తుండడం విశేషం…ఇక ఈ సినిమా ను జూలై నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది…

El Nino impact India 2026: ఎల్‌నినో వచ్చేసింది.. 8 నెలలు కరువే!

El Nino impact India 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇటీవలే వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మే 17న రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకుతాయని వెల్లడించింది. దీంతో ఈసారి ముందస్తు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా ఐఎండీ మరో షాకింగ్‌ విషయం తెలిపింది. తూర్పు, మధ్య పసిఫిక్‌ ఉపరితల జల ఉష్ణోగ్రతల్లో కొంత సమయం తటస్థ స్థితిలో ఉన్న తర్వాత ఇప్పుడు అవి ఎల్‌నినో సూచక స్థాయి దిశలో కదలడంతో ప్రపంచ వాతావరణ సంస్థలు ఎల్‌నినో ప్రారంభం అయిందని అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పులు గత తటస్థ కాలంతో పోలిస్తే సముద్ర వాతావరణంలో శక్తి విడుదల, గాలుల నమూనాల్లో మార్పులకు దారి తీస్తాయి. ఇన్కాయిస్‌ ప్రక్రియలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వరకు సాధారణ పరిస్థితులు కొనసాగాయని, తాజా డేటా ఆధారంగా ఎల్‌నినో దశలోకి మారినట్లు ప్రకటించింది. ప్రస్తుత మే నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు స్థిరంగా కొనసాగొచ్చని బులిటెన్‌ విడుదల చేసింది.

కృత్రిమ మేధతో ముందస్తు అంచనాలు..
పసిఫిక్‌ జల ఉష్ణోగ్రతలను పరిశీలించేందుకు ఇన్కాయిస్‌ ప్రత్యేక డీప్‌ లెర్నింగ్‌ మోడల్‌ బేయేసియన్‌ కన్వల్యూషనల్‌ న్యూరల్‌ నెట్వర్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ మోడల్‌ గత ఎల్‌నినో, లా నినా నమూనాలతోపాటు ఇప్పటి డేటాను కలిపి భవిష్యత్‌ పరిస్థితులను విశ్లేషిస్తుంది. ఇది వచ్చే ఎల్‌నినో లేదా లా నినా ప్రక్రియలను సుమారు 24 నెలల ముందుగా అంచనా వేసే సామర్థ్యాన్ని అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇది దేశాలు, వ్యవసాయ, నీటి నిర్వహణ, విద్యుత్‌ విభాగాలకు ప్రణాళిక రూపకల్పనకు కీలక సాధనంగా మారుతుంది.

భారత రుతుపవనాలపై ప్రభావం..
భూమధ్యరేఖ వెంబడి పసిఫిక్‌లో ఎల్‌నినో స్థితి ఏర్పడితే, అది భారత నైరుతి రుతుపవనాల ప్రవేశం, బలం, వర్షపాత పంపిణీ మీద గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పలుమార్లు గుర్తించారు. ఈ సందర్భంలో సాధారణ కంటే తక్కువ లేదా అసమంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని అధ్యయనాలు ఈ ఏడాది భారత్‌లో వర్షపాతం సగటు కంటే తక్కువగా ఉండొచ్చని, రుతుపవన రాక కొంత ఆలస్యమవుతుందని సూచిస్తున్నాయి. ఇది వ్యవసాయం, నీటి లభ్యత, విద్యుత్‌ ఉత్పత్తి, ఆహార ధరల వంటి అనేక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

హిందూ మహాసముద్రంలో వేడి గాలులు..
ఎల్‌నినో ప్రభావం పసిఫిక్‌తో పరిమితం కాకుండా, ఉత్తర హిందూ మహాసముద్రంలో కూడా బలమైన, దీర్ఘకాలిక సముద్రపు వేడిగాలుల ఏర్పాటుకు దారి తీస్తోంది. ఈ వాతావరణ ప్రస్థానాలు స్థానిక ఉష్ణోగ్రతల్లో పెరుగుదలతో పాటు పవన వేగం, చక్రవాతాల నమూనాల్లో మార్పులు కలిగిస్తాయి. ఇవి సముద్ర జీవవైవిధ్యం, చేపబట్టు ప్రదేశాలు, ద్వీపు పర్యావరణాలు వంటి అనేక విభాగాలపై ఒత్తిడిని పెంచుతాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు, ఆహార భద్రత, మానవ ఆరోగ్యానికి పొడుగు సమయ ప్రభావాలు కొనసాగే అవకాశం ఉంది.

Teenage Phone Addiction: ఆ అమ్మాయి సెలబ్రిటీ కాదు.. సెక్యూరిటీగా బౌన్సర్లు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Teenage Phone Addiction: ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. తల్లిదండ్రులకు ఒకే ఒక్క కుమార్తె. స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతోంది.. మొదట్లో ఆ అమ్మాయి చదువులో చురుకుగా ఉండేది. తల్లిదండ్రులు కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఒక్క గానొక్క కుమార్తె కావడంతో తల్లిదండ్రులు కూడా ఆమెను గారాబం చేశారు. ఆర్థికంగా లోటు కూడా లేకపోవడంతో ఆమె అడిగినవన్నీ ఇచ్చేశారు. ఆ బాలిక స్నేహితులు ఖరీదైన ఫోన్ లు వాడేవారు. దీంతో ఆమె కూడా తన తల్లిదండ్రులను కొనివ్వాలని కోరింది. దానికి వారు సమ్మతం తెలిపారు.

ఎప్పుడైతే ఫోన్ ఆమెకు అందించారో.. అప్పటినుంచి ఆమె వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది.. నిత్యం ఫోన్లో తరచూడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులతో మాట్లాడేది కాదు. స్కూల్ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆమె ఫోన్ రెస్ట్ ఇచ్చేది. ఆ తర్వాత నిత్యం అందులోనే ఉండేది. మొదట్లో చెప్పి చూశారు.. తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. ఆ తర్వాత మరోసారి చెప్పారు.. ఈసారి వాళ్లతో మాట్లాడటం మానేసింది . దీంతో వారు ఫోన్ లాక్కున్నారు. అన్నం తినడం మానేసింది. కూతురు మీద ప్రేమతో మళ్ళీ ఫోన్ తిరిగి ఇచ్చేశారు.

ఈసారి కూతురి అలవాటు మొత్తం మార్చేయడానికి ఆ తల్లిదండ్రులు సరికొత్త ఉపాయం ఆలోచించారు. ఏకంగా బౌన్సర్లను పెట్టారు. ఆమె ఫోన్ చూస్తే చాలు వెంటనే లాక్కునే విధంగా ప్లాన్ రూపొందించారు. పడుకునేటప్పుడు ఆ బౌన్సర్లు అత్యంత నిష్కర్షగా ఫోన్ లాక్కునేవారు. ఆ బౌన్సర్ల కోసం ఆ తల్లిదండ్రులు ఏకంగా నెలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంతేకాదు ఆ బౌన్సర్లు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు..

ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.. అది కాస్త విస్తృతంగా సర్కులేట్లో ఉంది. ఒక ఫోన్ ఒక బాలిక జీవితాన్ని ఎలా మార్చింది.. ఆమె వల్ల కుటుంబం ఎంతగా ఇబ్బంది పడింది.. చివరికి ఆ అలవాటును మార్చడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది.. ఇవన్నీ కూడా సినిమాను మించి ఉన్నాయి. అందువల్లే అలవాటు వ్యసనం కాకూడదు అంటారు. ఆ వ్యసనాన్ని మార్చుకోవాలంటే ఇదిగో ఈ స్థాయిలో కష్టపడాలి. ఇది కేవలం ఆ తల్లిదండ్రుల సమస్య మాత్రమే కాదు.. ఈ ప్రపంచంలో ఉన్న అందరిదీ. అందువల్ల తమ పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి. అవసరమైతేనే ఇవ్వాలి.

Haji Khalil: 70 ఏళ్ల వయసులో 20 ఏళ్ల పడుచు యువతితో ఆ నేత…

Haji Khalil: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. ఆయనకు ఆ ముచ్చట్లు చాలానే జరిగాయి. కానీ అతడు మరిన్ని ముచ్చట్ల కోసం ఆరాటపడుతున్నాడు. పైన బట్ట.. కింద పొట్ట వచ్చినప్పటికీ.. ఆయన ఇంకా పాతిక సంవత్సరాల పడుచు యువకుడిననే అనుకుంటున్నాడు. చివరికి అన్నంత పని చేశాడు. అయితే ఇప్పుడు ఆయన వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది.

ఆయన పేరు హాజీ ఖలీల్. వయసు 70 సంవత్సరాలు . ఒక రకంగా పింఛన్ తీసుకునే వయసు కూడా దాటిపోయింది. ఈ వయసులో కనీసం నాలుగు అడుగులు గట్టిగా నడిస్తేనే కూలబడిపోయే స్థాయి వచ్చేసింది. అటువంటి వయసులో అతనికి పెళ్లి కావలసి వచ్చింది. పైగా ఆయనకు అప్పటికే మూడు వివాహాలు జరిగాయి. 11 మంది పిల్లలు. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. 11 మంది పిల్లలను కన్నప్పటికీ.. ఖలీల్ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ఖలీల్ పెళ్లి చేసుకోబోయే యువతి వయసు 20 సంవత్సరాలు. ఆ యువతి పేరు యాస్మిన్. తన పిల్లల వయసు కంటే ఈ యాస్మిన్ వయసు తక్కువ. మూడు పెళ్లిళ్లు జరిగి.. 11 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఖలీల్ నాలుగో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. ఖలీల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నాడు.. ఇతడికి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. యాస్మిన్ ది పేద కుటుంబం. వారికి డబ్బును ఆశగా చూపించి ఖలీల్ పెళ్లికి ఒప్పించినట్టు తెలుస్తోంది.

ఖలీల్ యాస్మిన్ ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని ఆయన రెండవ భార్య బయటపెట్టింది. రెండవ భార్య నజ్రీన్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘోరాన్ని మొత్తం ఆమె వివరించి చెప్పింది. అయితే ఈ విషయాన్ని బయట పెడుతున్న నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. అందువల్లే ఆమె పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్టు సమాచారం.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కెలకడం అవసరమా

Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. పోనీ ఈ మాట ఎవరైనా పడని వారు అంటే లెక్క చేయనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమైన, అనుకూలమైన, సలహా ఇచ్చే స్థాయిలో ఉన్న వారు కూడా చెబుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్నేహితుల గురించి అందరికీ తెలిసిన విషయమే. అక్కడ స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. తరచూ ఆ ఇద్దరు నేతలు మంచి చెడుల్లో పాలుపంచుకునేవారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓ పెళ్ళిలో కలిసిన విజయ్ ను జగన్మోహన్ రెడ్డి ప్రాణ స్నేహితుడని.. జగన్ స్ఫూర్తితోనే విజయ్ తమిళనాడులో గెలిచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అంతటితో ఆగకుండా సింహం సింగిల్ గా రావాలి అంటూ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇస్తున్నారు. అనవసరంగా పవన్ కళ్యాణ్ ను కెలుకుతున్నారు.

* జగన్ పై తీవ్ర వ్యతిరేకత..
అసలే పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒక భావనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే వ్యతిరేకతతో ఉన్నారు. అసలు రాజశేఖర్ రెడ్డి అన్న ఆయనకు పడదు. మెగాస్టార్ చిరంజీవికి భిన్నంగా కూడా.. పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై ఉంటారు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు అధికారంలోకి రాకూడదని బలమైన విశ్వాసంతో ఉన్నారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో బలంగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వను అంటూ తేల్చి చెప్పారు. అనంతపని చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. భాగస్వామ్య పార్టీతో చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవుతున్నా.. భరిస్తున్నారే తప్ప బయటపడడం లేదు. దానికి కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఉన్న వ్యతిరేకత. కానీ అవేవీ లెక్కచేయడం లేదు వైసిపి. ఇంకా పవన్ కళ్యాణ్ ను కెలుకుతూనే ఉంది.

* ప్రధాన ప్రతిపక్షానికే నష్టం..
ప్రజల నిర్ణయం స్థిరంగా ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తనకు దాదాపు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చింది కనుక.. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వస్తే … తనకు బలం పెరుగుతుందని అంచనా వేస్తోంది. కానీ తమిళనాడులో అన్న డీఎంకే పరిస్థితి.. 2009లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోక తప్పదు. ఏదైనా ప్రధాన రాజకీయ పక్షం కూటమి నుంచి బయటకు వస్తే.. దాని ప్రభావం ప్రధాన ప్రతిపక్ష పార్టీపై పడుతుంది. అది తెలిసి కూడా పవన్ కళ్యాణ్ విషయంలో అనవసరంగా కెలుకుతూనే ఉన్నారు. పైగా పక్క రాష్ట్రంలో వేరే పార్టీ విజయాన్ని అడ్డం పెట్టుకొని. ఇలా గుణపాఠాలు నేర్చుకోకుండా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే మాదిరిగా ముందుకు వెళితే మాత్రం ఆ పార్టీకే నష్టం.