Homeజాతీయ వార్తలుHaji Khalil: 70 ఏళ్ల వయసులో 20 ఏళ్ల పడుచు యువతితో ఆ నేత...

Haji Khalil: 70 ఏళ్ల వయసులో 20 ఏళ్ల పడుచు యువతితో ఆ నేత…

Haji Khalil: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. ఆయనకు ఆ ముచ్చట్లు చాలానే జరిగాయి. కానీ అతడు మరిన్ని ముచ్చట్ల కోసం ఆరాటపడుతున్నాడు. పైన బట్ట.. కింద పొట్ట వచ్చినప్పటికీ.. ఆయన ఇంకా పాతిక సంవత్సరాల పడుచు యువకుడిననే అనుకుంటున్నాడు. చివరికి అన్నంత పని చేశాడు. అయితే ఇప్పుడు ఆయన వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఆయన పేరు హాజీ ఖలీల్. వయసు 70 సంవత్సరాలు . ఒక రకంగా […]

Haji Khalil: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. ఆయనకు ఆ ముచ్చట్లు చాలానే జరిగాయి. కానీ అతడు మరిన్ని ముచ్చట్ల కోసం ఆరాటపడుతున్నాడు. పైన బట్ట.. కింద పొట్ట వచ్చినప్పటికీ.. ఆయన ఇంకా పాతిక సంవత్సరాల పడుచు యువకుడిననే అనుకుంటున్నాడు. చివరికి అన్నంత పని చేశాడు. అయితే ఇప్పుడు ఆయన వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది.

ఆయన పేరు హాజీ ఖలీల్. వయసు 70 సంవత్సరాలు . ఒక రకంగా పింఛన్ తీసుకునే వయసు కూడా దాటిపోయింది. ఈ వయసులో కనీసం నాలుగు అడుగులు గట్టిగా నడిస్తేనే కూలబడిపోయే స్థాయి వచ్చేసింది. అటువంటి వయసులో అతనికి పెళ్లి కావలసి వచ్చింది. పైగా ఆయనకు అప్పటికే మూడు వివాహాలు జరిగాయి. 11 మంది పిల్లలు. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. 11 మంది పిల్లలను కన్నప్పటికీ.. ఖలీల్ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ఖలీల్ పెళ్లి చేసుకోబోయే యువతి వయసు 20 సంవత్సరాలు. ఆ యువతి పేరు యాస్మిన్. తన పిల్లల వయసు కంటే ఈ యాస్మిన్ వయసు తక్కువ. మూడు పెళ్లిళ్లు జరిగి.. 11 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఖలీల్ నాలుగో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. ఖలీల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నాడు.. ఇతడికి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. యాస్మిన్ ది పేద కుటుంబం. వారికి డబ్బును ఆశగా చూపించి ఖలీల్ పెళ్లికి ఒప్పించినట్టు తెలుస్తోంది.

ఖలీల్ యాస్మిన్ ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని ఆయన రెండవ భార్య బయటపెట్టింది. రెండవ భార్య నజ్రీన్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘోరాన్ని మొత్తం ఆమె వివరించి చెప్పింది. అయితే ఈ విషయాన్ని బయట పెడుతున్న నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. అందువల్లే ఆమె పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్టు సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper