Balakrishna Koratala Siva movie updates: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. కొరటాల శివ గతంలో ‘దేవర’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. మొత్తానికైతే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేయడంతో కొరటాల శివ మరోసారి నందమూరి హీరోనే డైరెక్షన్ చేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను తీసుకున్నారు. బాలయ్య బాబు సినిమాలు అంటే తమన్ సంగీత దర్శకుడిగా వ్యవరిస్తాడనే విషయం మనందరికీ తెలిసిందే. బాలయ్య బాబు చేసిన గత 5 సినిమాలకు అతనే మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు.
ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. కానీ ఇలాంటి క్రమంలో కొరటాల శివ మాత్రం అనిరుధ్ ను తీసుకోవడం వెనక పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు సైతం దీని మీద కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట.
ఎందుకంటే బాలయ్య బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు బిజియం తో తమన్ అదరగొడుతాడని బాలయ్య అభిమానులు నమ్ముతారు. అందువల్లే తమన్ ను పక్కన పెట్టి అనిరుధ్ ను తీసుకోవడం పట్ల వాళ్లు కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం… ఇక మరికొందరైతే బాలయ్య సినిమాకి బండోడు(తమన్) పోయి బక్కోడు (అనిరుధ్) వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…
కొరటాల శివ ఇంతకుముందు ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అందులోని పాటలు బ్యా గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాకి కొరటాల శివ మరోసారి అనిరుధ్ నే రిపీట్ చేస్తుండడం విశేషం…ఇక ఈ సినిమా ను జూలై నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది…