Homeజాతీయ వార్తలుVijay CM oath ceremony tomorrow: రేపే సీఎంగా విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం.. ఆంధ్రానుండి హాజరు...

Vijay CM oath ceremony tomorrow: రేపే సీఎంగా విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం.. ఆంధ్రానుండి హాజరు కాబోతున్న ముఖ్య అతిధులు వీళ్ళే..

Vijay CM oath ceremony tomorrow: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్(Thalapathy Vijay) రేపు నెహ్రు స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అందుకోసం ఆయన తన పార్టీ నేతలతో కలిసి గవర్నర్ అనుమతి తీసుకోబోతున్నాడు. విజయ్ టీవీకే పార్టీ కి కేవలం 107 సీట్లు మాత్రమే వచ్చింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని దాటాలంటే 118 కి పైగా స్థానాలు రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తు అనివార్యం అవ్వడంతో , విజయ్ ఎవరితో చేతులు కలపబోతున్నాడు అనే […]

Vijay CM oath ceremony tomorrow: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్(Thalapathy Vijay) రేపు నెహ్రు స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అందుకోసం ఆయన తన పార్టీ నేతలతో కలిసి గవర్నర్ అనుమతి తీసుకోబోతున్నాడు. విజయ్ టీవీకే పార్టీ కి కేవలం 107 సీట్లు మాత్రమే వచ్చింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని దాటాలంటే 118 కి పైగా స్థానాలు రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తు అనివార్యం అవ్వడంతో , విజయ్ ఎవరితో చేతులు కలపబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ తో టీవీకే పొత్తు ఖరారు అయ్యింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కాసేపటి క్రితమే టీవీకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోపక్క విజయ్ DMDK,CPI , CPM పార్టీల మద్దత్తు కూడా కోరాడు. వీళ్లంతా కలిస్తే 118 సీట్లు అవుతాయి.

మరో పక్క అన్నా డీఎంకే పార్టీ తో కూడా విజయ్ సంప్రదింపులు జరుపుతున్నాడు. నేడు టీవీకే పార్టీ నేత ఆనంద్ అన్నా డీఎంకే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని ముఖ్య నాయకులలో కొందరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో కేంద్రం లో ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్న రాహుల్ గాంధీ కూడా ఉన్నాడట. రేపు ఆయన విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం లో తన స్వరం వినిపించబోతున్నాడు. అంతే కాకుండా సౌత్ లో లెఫ్ట్ భావజాలాలు ఉన్న పార్టీ నేతలందరికీ ఆయన ఆహ్వానం పంపించాడట. అలా ఆహ్వానం అందుకున్న వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ విపక్ష నేత , మాజీ సీఎం జగన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ కి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ఆయన విదేశాల్లో ఉండడం తో రాలేకపోతున్నాను అని విజయ్ తో చెప్పాడట.

తన పార్టీ వైపు నుండి ముఖ్య నాయకులను పంపిస్తానని చెప్పాడట. ఇక కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కావడం , రేపు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి రాబోతుండడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వంటి వారిని కూడా ఆహ్వానించాడట విజయ్. రేపు వీళ్ళందరూ ఒకే వేదిక పై కనిపించబోతున్నారు. ఇక మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper