Home Blog Page 314

Vijay Swearing In Cancelled: చివరి నిమిషం లో ట్విస్ట్.. విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు.. కారణం ఏంటంటే..

Vijay Swearing In Cancelled: తమిళనాడు లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయం లో విజయ్(Thalapathy Vijay) కి గవర్నర్ నుండి చుక్కెదురు అవ్వడం ఇప్పుడు మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. నేడు మధ్యాహ్నం ఆయన గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతిని కోరారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మేజిక్ ఫిగర్ టీవీకే కి లేదు. 107 స్థానాల్లో విజయ్ సాధించిన టీవీకే పార్టీ కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలు కి కేవలం 5 సీట్లు మాత్రమే ఎన్నికల్లో వచ్చాయి. ఆ 5 సీట్లు కలిపితే విజయ్ టీవీకే కి 112 సీట్లు అయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవాలంటే మరో 6 సీట్లు కావాలి, మొత్తం మీద 118 సీట్లు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారు. కానీ విజయ్ కేవలం 112 స్థానాలతో గవర్నర్ ముందుకు వెళ్లడంతో, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు.

దీంతో రేపు నెహ్రు స్టేడియం లో ఏర్పాటు చేసిన విజయ్ ప్రమాణస్వీకారణ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇప్పటికే 5 వేల మందికి పైగా అభిమానులకు పాసులు ఇచ్చేసారు. కానీ చివరి నిమిషం లో గవర్నర్ నుండి ఈ ట్విస్ట్ రావడంతో అందరూ ఒక్కసారి గా షాక్ కి గురయ్యారు. విజయ్ కాంగ్రెస్ పార్టీ తో సహా , సిపిఐ , సిపిఎం , పీఎంకే, ఏఐఏఎం పార్టీల మద్దతు కోరాడు. కాంగ్రెస్ పార్టీ విజయ్ తో కలవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, మిగిలిన నాలుగు పార్టీలు మాత్రం అనుమతిని నిరాకరించాయి. తాము డీఎంకే పొత్తులోనే ఉంటామని. తేల్చి చెప్పాయి. గవర్నర్ కి వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం విజయ్ చేయగా , అందుకు గవర్నర్ సంతృప్తి చెందలేదని , అందుకే ప్రభుత్వ ఏర్పాటు కి ఒప్పుకోలేదని అంటున్నారు.

మరి ఇప్పుడు విజయ్ తక్షణ కర్తవ్యం ఏంటి?, AIDMK తో పొత్తు పెట్టుకుంటాడా?, మరి ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా, AIDMK తో ప్రస్తుతం బీజేపీ ఉంది, కేంద్రం లో అధికారం ఉన్నటువంటి బీజేపీ ని వదిలి విజయ్ తో జతకట్టే సాహసం AIDMK చేస్తుందా అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న సందేహం. ఇప్పుడు విజయ్ ముందు ఉన్న ఛాయస్ ఒక్కటే , DMK మరియు AIDMK పార్టీల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆశ చూపించి టీవీకే లోకి ఆహ్వానిస్తే తప్ప, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులే కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశంలోనే ఎంతో ఆసక్తికరంగా మారాయి.

Karimnagar PMJ Jewellery Theft: కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీలో దొంగతనం.. ఐదుగురు కాదట.. వెలుగులోకి కీలక నిజాలు

0

Karimnagar PMJ Jewellery Theft: లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనంలో పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు. ఇప్పటికే దొంగల ముఖచిత్రాలను మీడియాకు విడుదల చేశారు. వారి ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు.. ఇది ఇలా ఉండగానే ఈ వ్యవహారంలో రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

కరీంనగర్ పి ఎం జె జ్యూవెలరీ షాప్ దోపిడీ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఐదుగురు వ్యక్తులు నిందితులు ఉన్నారని గుర్తించారు. ఈ వ్యవహారంలో ఉన్నది ఐదుగురు మాత్రమే కాదని.. ఏకంగా ఆరుగురు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్లో ప్రవేశించడానికి వీరు ధర్మపురి ప్రాంతంలో బస చేశారు. విజయలక్ష్మి ప్రైవేట్ లాడ్జిలో మూడు రోజులపాటు ఉన్నారు. ముందు నలుగురు వ్యక్తులు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరుగా అందులోకి ప్రవేశించారు.

మొదటి వచ్చిన వ్యక్తులు పల్సర్ బైక్ ద్వారా లాడ్జి లోకి చేరుకున్నారు. వారు ఇచ్చిన ఆధారాలను పరిశీలిస్తే అవన్నీ కూడా ఫేక్ అని తెలుస్తోంది. ఈ దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో వారు విజయలక్ష్మి లాడ్జిలో ఉన్నట్టు తెలిసింది. సీసీ కెమెరాలను పోలీసులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. మూడు రోజులపాటు ఆ దొంగలు ఆ లాడ్జిలో ఉన్నారని పోలీసులకు తెలిసింది. అక్కడ అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు.. కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచినట్లు సమాచారం.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ మధ్య రాయపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. కాకపోతే దుండగులు ఎటువంటి ఆధారాలు వదలకుండా దొంగతనం చేశారు. రాత్రి సమయం కావడంతో సిసి కెమెరాలలో తమ దృశ్యాలు రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఖాతాదారుల బంగారాన్ని దొంగలు తస్కరించిన నేపథ్యంలో.. పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి దర్యాప్తు మొదలు పెట్టారు. చివరికి ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు.

బ్యాంకు పరిసర ప్రాంతాలలో పోలీసులకు ఒక సిగరెట్ అట్టముక్క దొరికింది. ఆ అట్టముక్క మీద ఉత్తర ప్రదేశ్ అడ్రస్ ఉంది. దీంతో తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులను సంప్రదించారు. జరిగిన విషయం మొత్తం చెప్పారు. దీంతో అక్కడ ఉన్న దొంగల ముఠాల వివరాలను తెలంగాణ పోలీసులకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అందించారు. ఈ క్రమంలో అక్కడి పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈ దొంగతనానికి ఉత్తర ప్రదేశ్ దొంగల ముఠా పాల్పడినట్టు తేలింది. వారి దగ్గర నుంచి బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్లో జరిగిన దొంగతనం కూడా ఇదే తరహాలో ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురి ప్రాంతంలో విజయలక్ష్మి లాడ్జి పరిసర ప్రాంతాల్లో అనేక కీలక వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కరీంనగర్ జిల్లాలో జరిగిన దొంగతనం.. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే కొద్ది రోజుల్లోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

SRH vs Punjab: లడ్డూల లాంటి క్యాచ్ లు నేలపాలు.. డౌటే లేదు.. SRH ఫ్యాన్స్ మీకు గుడి కడతారు భయ్యా

SRH vs Punjab: ఐపీఎల్ లో పరుగుల కంటే.. వికెట్ల కంటే.. ఫీల్డింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఫీల్డర్లు చేసిన ఫీల్డింగ్ ఆధారంగానే జట్టు విజయాలు ఆధారపడి ఉంటాయి. అందువల్లే ఐపిఎల్ లో అన్ని జట్లు ఫీల్డింగ్ కు అత్యంత ప్రాధాన్యమిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఫీల్డింగ్ కోచ్ లను నియమిస్తాయి.

ఐపీఎల్ లో మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఒక మిస్ ఫీల్డ్ చోటు చేసుకుంటే.. ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది. అందువల్లే మ్యాచ్ జరుగుతున్నంత సేపు జట్ల కెప్టెన్లు సమర్థవంతమైన ప్లేయర్లను మైదానంలో ఉంచుకుంటారు. పాదరసం లాగా కదిలే ఆటగాళ్లకు ఫీల్డింగ్ బాధ్యతలు అప్పగిస్తారు. ఒక క్యాచ్ మిస్ అయినా.. ఒక రన్ అవుట్ మిస్ అయినా.. పరిస్థితి ఎలా ఉంటుందో కెప్టెన్ కు తెలుసు.

ప్రస్తుత ఐపీఎల్లో అత్యంత చెత్త ఫీల్డింగ్ చేస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది పంజాబ్ మాత్రమే. ఇప్పటివరకు పంజాబ్ ప్లేయర్లు 17 క్యాచ్ లను నేలపాలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టుతో బుధవారం జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్లు కూపర్ కనౌలి , ఫెర్గు సన్, శశాంక్ సింగ్ తలా ఒక క్యాచ్ మిస్ చేశారు. ఇవన్నీ కూడా ఎంతో విలువైనవిగా మారిపోయాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్న హైదరాబాద్ ప్లేయర్లు క్లాసెన్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. పంజాబ్ బౌలర్లను పూర్తిగా బెదరగొట్టారు. ఫలితంగా హైదరాబాద్ స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఓవర్ కు 12 కు మించిన రన్ రేట్ తో పరుగులు తీస్తోంది.

ఐపీఎల్ లో అత్యంత చెత్త ఫీల్డింగ్ జట్లలో పంజాబ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్ జట్టుకు మిగతా ప్లేయర్లు బీభత్సంగా పరుగులు జత చేస్తున్న నేపథ్యంలో ఫీల్డింగ్ లోపం అంతగా కనిపించడం లేదు. హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో మాత్రం పంజాబ్ ఫీల్డింగ్ లోపం స్పష్టంగా కనిపించింది..

ఇదే విషయాన్ని పంజాబ్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ ఎదుట ప్రస్తావిస్తే.. ఆయన కూడా జట్టు ఆటగాళ్ల తీరు పట్ల నిర్వేదం వ్యక్తం చేశాడు. ఇటువంటి ఆట తీరు ఏమాత్రం సరికాదని వాపోయాడు.. ఇప్పటికైనా ఆటగాళ్లు ఫీల్డింగ్ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. దీనిపై పరిశీలన చేసుకుంటామని.. మరోసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని పాంటింగ్ స్పష్టం చేశాడు.

Vijay CM Oath Ceremony: విజయ్ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహేష్ బాబు కలిసి థ్యాంక్స్ చెబుతాడా… కారణం ఏంటంటే…

Vijay CM Oath Ceremony: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటుడు విజయ్…ప్రస్తుతం సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తమిళనాడులో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయ్ పెట్టిన టివికే పార్టీ 108 సీట్లను గెలవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా ఆయన మీద జనాలకు విపరీతమైన నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆయన వేరే పార్టీ తో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే విజయ్ మహేష్ బాబును కలువబోతున్నాడు అంటూ ఒక న్యూస్ అయితే తమిళ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కారణం ఏంటంటే విజయ్, మహేష్ బాబు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్…వీళ్లిద్దరు ఎక్కడ పెద్దగా పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపించకపోయిన కూడా ఫోన్ చేసుకొని మరి సినిమాలతో పాటు వాళ్ళ పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారట. విజయ్ టీవీకే పార్టీ పెట్టినప్పుడు మహేష్ బాబు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావని విజయ్ తో చెప్పారట.

ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నాడట.ఇక విజయ్ కొంచెం డల్ అయినపుడు కూడా మహేష్ బాబు తనకి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా విజయ్ తన సన్నిహితుల దగ్గర చెప్పారట. ఇక అదే విషయాన్ని ఇప్పుడు తన సన్నిహితులు గుర్తు చేస్తు విజయ్ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే హైదరాబాద్ కు వెళ్లి మహేష్ బాబుని స్వయంగా కలువబోతున్నాడు అంటూ కొన్ని కామెంట్లు వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా విజయ్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు తమిళనాడు స్టేట్ కి సీఎం అవ్వడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయమనే చెప్పాలి…ఇక ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్లో ఉన్నాడు కాబట్టి విజయ్ గెలిచిన విషయం తెలిసి అతనికి కంగ్రాట్స్ చెప్పారట. ఇక ఇదంతా చూసిన మరికొంతమంది మాత్రం విజయ్ స్వయంగా మహేష్ బాబు ను కలవడానికి ఎప్పుడు వస్తాడు. విజయ్ – మహేష్ బాబు మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ ఉందా అంటూ కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

Vijay CM Convoy: ప్రమాణ స్వీకారం చేయకుండానే.. సీఎం సెక్యూరిటీ కాన్వాయ్ తో విజయ్ మాస్ ఎంట్రీ

Vijay CM Convoy: అప్పట్లో ఎన్.శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ఒకే ఒక్కడు సినిమా ఎంతటి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ సినిమా స్క్రిప్ట్ ముందుగానే విజయ్ దగ్గరికి వచ్చింది.. కానీ అనివార్య కారణాలవల్ల విజయ్ ఆ సినిమా చేయలేకపోయారు.. సినిమాల్లో ఒకరోజు గా సీఎం గా ఉండే అవకాశాన్ని ఆయన కోల్పోయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ముఖ్యమంత్రిగా వ్యవహరించే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.

విజయ్ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ నుంచి ఆమోదముద్ర లభించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పాటు.. కొన్ని పార్టీలు ఆయనకు సపోర్ట్ చేస్తాయని తెలుస్తోంది. అన్న డీఎంకే లోను మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకు జై కొడుతున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే తమిళనాడు రాజకీయాలలో ఆయన సమూల మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారంలో.. అంతకుముందు జరిగిన పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా కూడా నోరు జారలేదు. అప్పటి అధికార డిఎంకె మీద.. ప్రతిపక్ష అన్న డిఎంకె మీద విమర్శలు చేయలేదు. రాజకీయాలు అంటే హుందాగా ఉండాలి అనేది విజయ్ అభిప్రాయం. అందువల్లే ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా తాను ఏం చేస్తానో మాత్రమే చెప్పాడు. అంటే తప్ప విమర్శల జోలికి పోలేదు.

ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాలలో విజయ్ పార్టీ భారీగా స్థానాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ మూడు అంచల విధానంలో బందోబస్తు కొనసాగుతోంది.. ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు.

బుధవారం తమిళనాడు గవర్నర్ ను కలవడానికి విజయ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం సెక్యూరిటీ కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఈ స్థాయిలో కాన్వాయ్ ఏర్పాటు చేయడం విశేషం. అప్పట్లో సినిమాలలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా నటించే అవకాశాన్ని విజయ్ కోల్పోయారు. ఇప్పుడు నిజ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే ఆయన అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. సీఎం సెక్యూరిటీ కాన్వాయ్ తో విజయ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ సినిమాలను మించిపోయిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Rohit Sharma Practice Incident: ప్రాక్టీస్ చేస్తుండగా.. అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయిన రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma Practice Incident: రోహిత్ శర్మ ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మెరుపు హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. తద్వారా తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు.. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు అదరగొట్టాడు.. తద్వారా తాను ముంబై ఇండియన్స్ లో ఎంతటి కీలక ఆటగాడినో నిరూపించుకున్నాడు. లక్నో జుట్టుతో జరిగిన మ్యాచ్ కంటే ముందు రోహిత్ దాదాపు 5 మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. గాయం వల్ల అతడు మైదానంలో డగ్ అవుట్ కు పరిమితమయ్యాడు.

ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటముల తర్వాత.. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి టచ్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్లాలంటే కచ్చితంగా మిగతా మ్యాచ్లలో వరుసగా విజయాలు సాధించాలి. అంతేకాదు మిగతా జట్లు ఓడిపోవాలి. అప్పుడే ముంబై జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది. అందువల్ల ముంబై జట్టు భారీ విజయాల మీద కన్నేసింది. జట్టులో నాయకుడిగా ఉన్న హార్దిక్ పాండ్యా ను ఇటీవల జరిగిన మ్యాచ్ కు దూరం పెట్టింది. సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. ముంబై జట్టు బౌలింగ్లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం దుమ్మురేపింది.. ఫలితంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోనే ముంబై ఇండియన్స్ జట్టు ముందుకు వెళ్తుందని.. హార్దిక్ పాండ్యా అని పక్కన పెట్టాలని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు…

మరోవైపు తదుపరి మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.. ఈ క్రమంలో అతడు కొట్టిన బంతి నేరుగా గ్రౌండ్ మెన్ కు తగిలింది. ఆ దెబ్బతో తీవ్రంగా ఇబ్బంది పడిపోయాడు. వెంటనే పరిస్థితిని గమనించిన రోహిత్ శర్మ ప్రాక్టీస్ మానేశాడు. దెబ్బ తగిలిన గ్రౌండ్ మెన్ ను పరామర్శించాడు. అతడికి ప్రథమ చికిత్స అందించే ఏర్పాటు చేసి.. అనంతరం హాస్పిటల్ తరలించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. రోహిత్ ఇప్పుడే కాదు తన అభిమానుల విషయంలో అనేక సందర్భాల్లో ఇలానే స్పందిస్తూ ఉంటాడు..

Vijay Victory Tamil Nadu: విజయ్ విక్టరీ పై ఎన్టీఆర్, అల్లు అర్జున్ మౌనం వెనుక అసలు కారణం ఇదా..

Vijay Victory Tamil Nadu: తమిళనాడు లో విజయ్(Thalapathy Vijay) ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబోతున్నందుకు తమిళియన్స్ ఎంత సంతోషంగా ఉన్నారో తెలియదు కానీ , ఆంధ్ర ప్రదేశ్ యువత మాత్రం వేరే లెవెల్ సంతోషం లో మునిగి తేలుతున్నారు. అనేక ప్రాంతాల్లో విజయ్ కి బ్యానర్స్ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం గమనించాల్సిన విషయం. ఒక సినీ హీరో చాలా కాలం తర్వాత ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనే ఆనందం ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ఇదంతా పక్కన పెడితే తమిళ సినీ సెలబ్రిటీలకంటే , తెలుగు సినీ సెలబ్రిటీలు విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు వేశారు. సీనియర్ హీరోలైన చిరంజీవి , వెంకటేష్ , బాలకృష్ణ వంటి వారు గెలిచిన మరుక్షణమే విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు వేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ వంటి వారు కూడా విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

అదే విధంగా నేటి తరం స్టార్ హీరోలైనటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , నేచురల్ స్టార్ నాని , విజయ్ దేవరకొండ వంటి వారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు మాత్రం విజయ్ విక్టరీ పై నోరు మెదపలేదు. వీళ్లకు విజయ్ తో ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే అలాంటివేమీ లేవు. విజయ్ డ్యాన్స్ అనే తనకు చాలా ఇస్తామని ఎన్టీఆర్ ఒక సందర్భం లో చెప్పుకొచ్చాడు కూడా. అల్లు అర్జున్ ఇప్పటి వరకు విజయ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు , కలవలేదు , కానీ వాళ్ళ మధ్య వైరం వచ్చేంతలా ఏమి జరగలేదు. అయినప్పటికీ కూడా ఆయన విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేయకపోవడం గమనార్హం.

అల్లు అర్జున్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే బాగా ఇష్టమని, విజయ్ రాజకీయాలు మోడీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండడం వల్లే , అల్లు అర్జున్ టీవీకే కి సపోర్ట్ చేసి ఉండకపోవచ్చని అంటున్నారు పలువురు విశ్లేషకులు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే బిజీ గా ఉండడం వల్ల ట్వీట్ వేసి ఉండకపోవచ్చు, రేపు ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత శుభాకాంక్షలు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయొచ్చు అని అంటున్నారు. ఇక ప్రభాస్ సంగతి తెలిసిందే , ఈయన కేవలం ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే ఉంటాడు, యాక్టీవ్ గా ఉండదు , ఇప్పటి వరకు ఎవ్వరు గెలిచినా శుభాకాంక్షలు వంటివి తెలియజేయడం జరగలేదు , ఆయనకు అలవాటు లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోవడంలేదు ఫ్యాన్స్. మరి కనీసం ప్రమాణ స్వీకారం తర్వాత అయినా ఎన్టీఆర్ , అల్లు అర్జున్ విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతారో లేదో చూడాలి.

Sneha Reddy Visits Sritej House: శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి.. వీడియో వైరల్..

Sneha Reddy Visits Sritej House: 2024 వ సంవత్సరం లో విడుదలైన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోస్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రమైన గాయాల పాలై స్పృహ కోల్పోవడం, అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడని ఆయనపై కేసులు వేసి అరెస్ట్ చేయడం వంటివి నేషనల్ లెవెల్ లో ఎంతటి దుమారం రేపాయో మనమంతా చూశాము. దురదృష్టం కొద్దీ జరిగిన ఈ సంఘటనలను తల్చుకుంటే అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికీ బాగా ఎమోషనల్ అయిపోతుంటారు. ఈ సంఘటన వాళ్లకు ఒక పీడకల లాంటిది. అయితే అల్లు అర్జున్ ఆ కుర్రాడి కుటుంబానికి ఆర్థికసాయం చేయడమే కాకుండా, ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరించాడు. తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయం అందించింది. అయితే శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు అనే సంగతి తెలిసిందే.

మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడు , ఆహరం కూడా తీసుకోవడం అతనికి కష్టం గా ఉంది. అయితే అల్లు అర్జున్ కుటుంబం ఇప్పటికీ శ్రీతేజ్ ని , అతని కుటుంబాన్ని మర్చిపోలేదు. నేడు అల్లు స్నేహా రెడ్డి , అల్లు అరవింద్ శ్రీతేజ్ ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబం తో కాసేపు గడిపి వచ్చారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాలు తీసి , ఆర్థికసాయం అందించి, ఎలాంటి సమస్య వచ్చినా మీకు మేము అండగా ఉన్నాము అంటూ భరోసా అందించారు. అదే విధంగా శ్రీతేజ్ సోదరిని కూడా అల్లు అరవింద్ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. బాగా చదువుకోవాలని, మీ బిడ్డ చదువుకి అవసరమయ్యే డబ్బులు మొత్తం నేనే పెట్టుకుంటానని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అల్లు అరవింద్, అల్లు స్నేహా రెడ్డి ఇప్పటికీ ఆ బిడ్డని ఇంత గుర్తుపెట్టుకొని సహాయ సహకారాలు అందించడం నిజంగా గొప్ప విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్ శ్రీతేజ్ ని పట్టించుకోలేదని దురాభిమానుల వేరే లెవెల్ దుష్ప్రచారం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం నుండి అల్లు కుటుంబం ఎలాంటి ఒత్తిడి లేదు శ్రీతేజ్ ని కలవమని, అయినప్పటికీ కూడా శ్రీతేజ్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఎంత మంచి మనసు ఉంటే ఇలా చేస్తారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ని అప్పుడు చాలా మంది అపార్థం చేసుకున్నారని, ఆయన మనసు ఇంత గొప్పదని అంటున్నారు. రాబోయే రోజుల్లో శ్రీతేజ్ విషయంలో అల్లు అర్జున్ కుటుంబం అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Mangli controversy latest news: తప్పు చేయలేనప్పుడు.. మంగ్లీ తప్పించుకోవడం ఎందుకు..

Mangli controversy latest news: వాళ్లంతా పేదలు. వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలి. వారి తరఫున నేను పోరాడుతాను. అవసరమైతే హెల్ప్ చేస్తాను. ముందుగా వారిని పట్టుకోవాలి. ఈ కేసులో సంబంధం లేని వ్యక్తులపై విమర్శలు చేస్తున్నారు. నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. మీడియా నాకు అండగా ఉండాలి. నామీద అడ్డగోలుగా రాయవద్దు. నేను బాధపడుతున్నాను. ఇబ్బంది పడుతున్నాను.. ఇదిగో ఇలా సాగిపోయింది మంగ్లీ ఆ మధ్య రెండు సార్లు విలేకరులతో మాట్లాడినప్పుడు సాగించిన మాటల పరంపర.

ఆమె మాట్లాడిన మాటలకు.. క్షేత్రస్థాయిలో చేతులకు పొంతనలేదని పోలీసుల దర్యాప్తులో తేలిపోయింది. ఈ కేసులో ఇప్పటికి తెలంగాణ పోలీసులు అనేక రకాలుగా సమాచారాలను సేకరించినట్టు తెలుస్తోంది. మంగ్లీ సోదరుడి ఖాతాలోకి భారీగా జమైన డబ్బు.. ఆ డబ్బును డ్రా చేసిన తీరు.. ఇంకా అనేక అంశాలను గుర్తించారు. సాంకేతిక ఆధారాలు మాత్రమే కాకుండా.. ఇక అనేక రకాలైన కీలక ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత తదుపరి ఏం చేయాలనేది పోలీసులు నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఈ ఎపిసోడ్ ఇలా సాగుతుండగానే మంగ్లీ గురించి మరోసారి న్యాయవాది సుబ్బారావు సంచలన ఆరోపణలు చేశారు.. “మంగ్లీ మీద, ఆమె సోదరుడు శివ మీద గద్వాల, గచ్చిబౌలి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. దీనికి సంబంధించి వాళ్లు సమాధానం చెప్పాలి. మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో డిజిపి సివి ఆనంద్ ను కలిశాం. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తాను. బాధితులకు తిరిగి డబ్బులు చెల్లిస్తే ఖచ్చితంగా కేసులు వెనక్కి తీసుకుంటాం.. మైక్రో ఫైనాన్స్ స్కీం పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు , ఇంకా కొంతమంది కోట్లలో మోసం చేశారు. ఈ విషయాన్ని నాకు హిమ కాంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మంగ్లీని సంప్రదించాను. ఆమె నన్ను బెదిరించారు.. అందువల్లే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను.. నా ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు, మరో ముగ్గురు మీద కేసు నమోదు చేశారని” న్యాయవాది సుబ్బారావు తెలిపారు.

మరోవైపు సుబ్బారావు మీద కూడా మంగ్లీ ఫిర్యాదు చేశారు.. తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని.. ఓ సెలబ్రిటీ నటిమీద సుబ్బారావుకు క్రష్ ఉందని.. అందువల్లే ఇదంతా చేస్తున్నారని మంగ్లీ ఆరోపించారు. తన మీద ఫిర్యాదులు చేస్తూ సుబ్బారావు ప్రాచుర్యం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. కాగా, సుబ్బారావు బుధవారం కీలకమైన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తప్పు చేయనప్పుడు మంగ్లీ ఎందుకు తప్పించుకుంటున్నారని ఆరోపించారు.. సుబ్బారావు ఇన్ని రకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. మంగ్లీ ఏవిధంగా సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

Vijay govt formation support parties: ప్రభుత్వ ఏర్పాటుకు.. విజయ్ కి కాంగ్రెస్ తో పాటు ఇంకా ఎవరు సపోర్ట్ ఇచ్చారో తెలుసా..

Vijay govt formation support parties: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగి.. ఫలితాలు విడుదలైనప్పటికీ.. అందరి దృష్టి తమిళనాడు మీద ఉంది. కారణం ఇక్కడ ఏ పార్టీకి కూడా మెజారిటీ స్థానాలు రాలేదు. విజయ్ టీవీ కే పార్టీకి అధికంగా స్థానాలు వచ్చినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ కు పది స్థానాల దూరంలో ఉంది. ఒకవేళ టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ.. ఆ బలం సరిపోదు..

తమిళ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం విజయ్ పార్టీకి అన్నాడీఎంకే సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అన్నా డీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ విజయ్ కి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అన్నా డీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామితో టీవీకే నేత ఆనంద్ సమావేశమయ్యారు. ఇప్పటికే 35 మంది అన్నా డిఎంకె ఎమ్మెల్యేలు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ షణ్ముగం ను కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. చెన్నైలో అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరిగితే.. టీవీకేతో పొత్తు కచ్చితంగా కుదిరించాలని ఆయనను ఆ ఎమ్మెల్యేలు కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పేటి తర్వాత టీవీ కి నేత ఆనంద్.. పలని స్వామి కలిశారు. ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనేది ఇంతవరకు బయటికి రాలేదు.

తమిళనాడు రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 234. ఇందులో 108 స్థానాలలో విజయ్ పార్టీ గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ కి 118 ఎమ్మెల్యే స్థానాలు కావాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల విజయం సాధించింది. అన్న డీఎంకే 47 స్థానాల్లో గెలిచింది. హస్తం పార్టీ సపోర్ట్ చేసినప్పటికీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలలో చాలామంది విజయ్ కి సపోర్ట్ చేయాలని అంటున్న నేపథ్యంలో పరిణామాలు ఎలాగైనా మారచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లు, సిపిఐ, సిపిఎం, విసికె నుంచి ఆరుగురు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా విజయ్ పార్టీ బలం 118 సీట్లకు పెరుగుతుంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఎమ్మెల్యే కామరాజు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా విజయ్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య 119కు చేరుకుంటుంది. అందువల్లే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సహకరించాలని గవర్నర్ ను కోరారు దానికి ఆయన సమ్మతం తెలిపారు. ఇప్పటికే విజయ్ వీసీకే చీఫ్ కు ఒక లేఖ రాశారు. ఆ పార్టీకి ఎన్నికల్లో రెండు స్థానాలు వచ్చాయి. ప్రస్తుత అందుతున్న వార్తల ప్రకారం గురువారం విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బుధవారం ఆయన గవర్నర్ ను కలిశారు.

Caste corporations funds issue: కులాలకు కార్పొరేషన్లు.. మరి నిధుల సంగతేంటి

Caste corporations funds issue: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బదులు తీసుకొస్తే తప్ప బండి నడిచే పరిస్థితి లేదు. పైగా అప్పులను కూడా కాల వ్యవధి అధికంగా పెంచి తీసుకొస్తున్నారు.. ఓపెన్ మార్కెట్లో బాండ్లను కూడా విక్రయిస్తున్నారు.. ఇంత చేసినప్పటికీ ఆర్థికంగా ఒత్తిడి తప్పడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ మధ్య కొత్తగూడెం జిల్లా చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి స్టంట్ వేసుకోవడానికి డబ్బులు లేక చనిపోయాడు. చివరికి తన ఆవేదనను ఒక లేఖ రూపంలో రాసి తనువు చాలించాడు.. ఇలాంటి ఆర్థిక ఇబ్బందికరమైన స్థితి ఉన్న తెలంగాణలో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరికొత్త పాచిక వేశారు.

తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ప్రభుత్వం తరఫున 11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ ప్రకటిస్తూ సర్కులర్ విడుదల చేశారు. ఇందులో 11 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు..

బ్రాహ్మణ కార్పొరేషన్
చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్.

వాషర్ మెన్ కోపరేటివ్ కార్పొరేషన్..
చైర్మన్ గా డాక్టర్ దాసరాజు అజయ్ కుమార్, వైస్ చైర్మన్ బంగారు బాబు

కళ్ళు గీత కార్మికుల కార్పొరేషన్
చైర్మన్ మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్
వైస్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్

పెరిక కార్పొరేషన్
చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు
వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్

మేర కార్పొరేషన్
చైర్మన్ సంఘ వెంకట రాజం
వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ

వాల్మీకి బోయ కోపరేటివ్ కార్పొరేషన్
చైర్మన్ గట్టు తిమ్మప్ప
వైస్ చైర్మన్ బోయ నాగేష్

మున్నూరుకాపు కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్
చైర్మన్ బొమ్మ శ్రీరామ్
వైస్ చైర్మన్ అల్లం భాస్కర్

యాదవ కోపరేటివ్ కార్పొరేషన్
చైర్మన్ రఘునాథ్ యాదవ్
వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్

వడ్డెర కోపరేటివ్ కార్పొరేషన్
చైర్మన్ గుంజ రేణుక నారాయణ
వైస్ చైర్మన్ భక్తుల వెంకటేష్

తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
చైర్మన్ దూడెం వెంకటరమణ
వైస్ చైర్మన్ జక్కని అనిత

కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్
చైర్మన్ బండి రమేష్
వైస్ చైర్మన్ పరుచూరి మురళి

11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అయినప్పటికీ.. నిధుల కేటాయింపు ఎలా ఉంటుందనేది ఇక్కడ ప్రశ్నార్థకం. గతంలో కెసిఆర్ అనే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొచ్చారు. తద్వారా కార్పొరేషన్లు కేవలం అప్పులు తీసుకురావడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కనీసం వాటి ద్వారా జరిగిన ప్రగతి దాదాపు శూన్యం.

ఇప్పుడు తెలంగాణ ఆర్థిక రంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వాటికి నిధులను ఏ విధంగా ఇస్తుందనేది చూడాల్సి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను చెల్లిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన నేపథ్యంలో.. వారి డిమాండ్లను నెరవేర్చుతామని అన్నారు. పెండింగ్ బకాయిలు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే కొత్త కార్పొరేషన్లు తెలంగాణ ఆర్థిక రంగం మీద అదనపు భారం తప్ప.. ఉపయోగం లేని వ్యవహారం.. రాజకీయ నిరుద్యోగులకు పదవులు కల్పించడానికి తప్ప.. ఈ కార్పొరేషన్లు దేనికి పనికిరావునేది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.

TV actors Instagram income: విష్ణు ప్రియా ప్రభావం.. ఇన్ స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్స్ తో కోట్లు సంపాదిస్తున్న బుల్లితెర నటీనటులు వీళ్ళే..

TV actors Instagram income: రాబోయే రోజుల్లో బుల్లితెర సెలబ్రిటీలు సంపాదన లో సినీ నటులను దాటేసినా ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది. ఒకపక్క సీరియల్స్ , టీవీ షోస్ చేసి రోజుకి 25 వేల నుండి లక్ష రూపాయిల చెక్కులను తీసుకుంటూ, మరోపక్క ఇన్ స్టాగ్రామ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. సాధారణంగానే ఇన్ స్టాగ్రామ్ లో భారీ రీచ్ వస్తే సదరు సెలబ్రిటీకి డబ్బులు ఇవ్వడం అనే సంస్కృతి చాలా రోజుల నుండి సాగుతోంది. వీటి ద్వారా వాళ్ళు నెలకు లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మూడేళ్ళ క్రితం ఇన్ స్టాగ్రామ్ లో ప్రవేశ పెట్టిన సబ్ స్క్రిప్షన్ అనే ఫీచర్ ని ఉపయోగించుకొని సంవత్సరానికి కోట్లు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా యాంకర్/ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ విష్ణు ప్రియ గురించి మాట్లాడుకోవాలి. ఈమెకు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ సాధారమైనది కాదు.

తనని అనుసరించే వాళ్ళ కోసం సబ్ స్క్రిప్షన్ ఫీచర్ ని ఉపయోగించుకొని విష్ణు ప్రియ అర్థ నగ్న ఫోటోలు పెట్టడం మొదలు పెట్టింది. ఈ అంశం పై పలువురు కేసు పెట్టడం తో , బాగా పబ్లిసిటీ జరగడం వల్ల, విష్ణు ప్రియా కి షబ్ స్క్రిప్షన్స్ 10 వేలకు పైగా జరిగింది. ఒక్కో షబ్ స్క్రిప్షన్ కి ఆమె 390 రూపాయిలు తీసుకుంటుంది. అంటే నెలకు ఆమె 39 లక్షల రూపాయిలు సంపాదిస్తుంది మాట. ఇదే బాటలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటి సిరి హన్మంత్ కూడా చేరిపోయింది. ఈమెకు దాదాపుగా 423 సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. అంటే నెలకు 1 లక్షా 64 వేల రూపాయిలు సంపాదిస్తుంది అన్నమాట. ఇలా సినీ నటి అనన్య నాగేళ్ల కూడా చేస్తోంది. అదే విధంగా బుల్లితెర హీరోయిన్ లాస్య, యష్మీ గౌడ, రష్మీ, ఇలా ఎంతో మంది బుల్లితెర సెలబ్రిటీలు, ఎక్సక్లూసివ్ కంటెంట్ తో యువత నుండి నెలకు లక్షల్లో , సంవత్సరానికి కోట్లలో సంపాదిస్తున్నారు.

Prabhas Spirit movie action scenes: ‘స్పిరిట్’ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కి అంత రెడీ…ప్రభాస్ చేస్తాడా…డూప్ చేస్తాడా…

Prabhas Spirit movie action scenes: అర్జున్ రెడ్డి సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. అనిమల్ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో చేస్తున్న సినిమా విషయంలోను చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. స్పిరిట్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఒక భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట. నిజానికి సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా కొత్తగా చూపించబోతున్నాడట. ఈ మధ్యకాలంలో ప్రభాస్. సలార్ ను మినహాయిస్తే ఏ సినిమాలో కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనలేదు. తన నుంచి అలాంటి సినిమాలి వస్తె చూడాలని చాలా మంది. అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికైతే సందీప్ ప్రభాస్ అభిమానుల కోరిక తీర్చే విధంగా కనిపిస్తున్నాడు…ఈనెల 7వ తేదీ నుంచి ఈ ఫైట్ కి సంబంధించిన రిహార్సల్స్ ను చేయబోతున్నారట.

అలాగే ఈనెల చివరి వారంలో ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. సందీప్ రెడ్డి వంగ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి చాలా పెద్ద పీట వేస్తూ ఉంటాడు. ఇంతకుముందు ఆయన చేసిన అనిమల్ సినిమా విషయంలో కూడా యాక్షన్స్ చాలా వరకు సూపర్ గా తీర్చిదిద్దాడు…

ఇప్పుడు అలాగే స్పిరిట్ సినిమాలో కూడా అదే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ పాల్గొంటాడా? లేదంటే డూప్ తో చేయిస్తారా అంటూ కొంతమంది అభిమానులు సైతం సోషల్ మీడియాలో కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సలార్ సినిమాలో చాలావరకు డూప్ ను వాడుకున్నారు. ఇక స్పిరిట్ సినిమా విషయంలో కూడా అలానే చేస్తారా? లేదంటే డైరెక్ట్ గా ప్రభాస్ పాల్గొంటాడా అనేది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఆరోగ్యం అంత బాగుండడం లేదు. దానికి తోడుగా ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటే ఆయనకి ఏదైనా గాయమైతే షూటింగ్ మరింత లేటవ్వచ్చు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది… మొత్తానికైతే రిస్క్ లేని షాట్స్ ప్రభాస్ చేస్తే రిస్కీ తో కూడిన షాట్స్ లో డూప్ చేయబోతున్నాడట….

BCCI playoff venue controversy: ప్లే ఆఫ్ లు అక్కడే.. ఊహించని వేదికపై ఫైనల్.. దక్షిణాదికి బీసీసీఐ అన్యాయం

BCCI playoff venue controversy: ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది.. ఇప్పటికే చాలా వరకు జట్లు లీగ్ మ్యాచ్లు ఆడేశాయి. ఇంకా కొన్ని ఆడితే లీగ్ సమరం ముగుస్తుంది. ఆ తర్వాత ప్లే ఆఫ్ యుద్ధం ప్రారంభమవుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి బీసీసీఐ క్లారిటీ చేసింది.

ఈసారి ప్లే ఆఫ్ మ్యాచ్ ల నిర్వహణ వేదికలను బిసిసిఐ ప్రకటించింది. ప్లే ఆఫ్ మ్యాచ్ల విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం దక్షిణాదికి అన్యాయం చేసే విధంగా ఉంది. దక్షిణ భారత దేశంలో ఒక్క నాకౌట్ మ్యాచ్ నిర్వహణకు వేదికను ఖరారు చేయలేదు. ప్లే ఆఫ్ మ్యాచ్ లు నిర్వహించేందుకు రెండు వేదికలను మాత్రమే బిసిసిఐ ఖరారు చేసింది. మే 24 న లీగ్ మ్యాచ్లో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ తో నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.

మొదట్లో బెంగళూరులో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారని అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే 31న నిర్వహిస్తారు.. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ను మే 26న ధర్మశాల వేదికగా నిర్వహిస్తారు.. ఎలిమినేటర్ మ్యాచ్ ను చండీగఢ్ వేదికగా మే 27న నిర్వహిస్తారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ను 29న నిర్వహిస్తారు.

పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్ సమరంలో పోటీ పడతాయి. మొదటి రెండు స్థానాలలో ఉన్న జట్లు మొదటి క్వాలిఫైయర్ లో పోటీ పడతాయి. అందులో విజయం సాధించిన జట్టు ఫైనల్ గెలుస్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది. మూడు నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ లో పోటీ పడతాయి. అందులో విజయం సాధించిన జట్టు రెండవ క్వాలిఫైయర్ కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫైయర్ 1 లో ఓటమి పాలైన జట్టుతో ఎలిమినేటర్ విజేత పోటీ పడుతుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్ వెళ్తుంది. అక్కడ గెలిచిన జట్టు ట్రోఫీ అందుకుంటుంది.

BCCI bias on Uppal Stadium: ఉప్పల్ మీద బీసీసీఐ పెద్దలకు ఎందుకింత వివక్ష

BCCI bias on Uppal Stadium: ఐపీఎల్ నిర్వహించే ప్రతి సీజన్లోనూ దక్షిణాదిలో మైదానాలు కిటకిలాడిపోతుంటాయి. మ్యాచ్ ఏదైనా సరే అభిమానులు భారీగా హాజరవుతుంటారు. క్రికెట్ మీద తమకున్న అభిమానాన్ని బయటపెట్టుకుంటారు. సోషల్ మీడియాలో వారు చేసే రచ్చ ఇంక మామూలుగా ఉండదు. వాస్తవానికి ఈ స్థాయి అభిమాన గణం ఉత్తర భారత దేశంలో అంతగా కనిపించదు. ఇదేదో రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి రాస్తున్న కథనం కాదు. బిసిసిఐ పెద్దలు గీస్తున్న విభజన రేఖను దృష్టిలో పెట్టుకొని ఇలా బాధను వ్యక్తం చేయాల్సి వస్తోంది.

ఐపీఎల్ లో అన్ని జట్లు ఆడుతున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాల పేరుతో బిసిసిఐ జట్లను ఏర్పాటు చేసింది. ఈ జట్లు ఐపీఎల్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన బిసిసిఐ.. ఒక ప్రాంతం మీద విపరీతమైన ప్రేమ కనబరుస్తోంది. మిగతా ప్రాంతాల మీద దారుణమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. లీగ్ దశలో మ్యాచులు నిర్వహించి.. కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ల విషయంలో మాత్రం బీసీసీఐ ఏకపక్ష విధానాన్ని కొనసాగిస్తుంది.

దక్షిణ భారత దేశంలో చెన్నై, కొచ్చి, విశాఖపట్నం, హైదరాబాదు లాంటి ప్రాంతాలలో విస్తారమైన క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. వీటిల్లో అద్భుతమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని పక్కన పెట్టారు. క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు ఉత్తర భారత దేశంలోని మైదానాలలో నిర్వహిస్తున్నారు. ఉత్తర భారత దేశంలో ఉన్న మైదానాలలో సౌకర్యాలు ఏమిటో.. దక్షిణ భారతంలో ఉన్న మైదానాలలో లేని సౌకర్యాలు ఏమిటో బీసీసీఐ పెద్దలు చెప్పాల్సి ఉంది. అసలు క్రికెట్ అంటేనే దక్షిణాది కదా. ఇక్కడ ప్రేక్షకులు ఏ స్థాయిలో క్రికెటర్లను.. క్రికెట్ ను ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విశాఖపట్నం వేదికగా మహిళల జట్టు ఆడుతున్న మ్యాచ్లను నిర్వహించినప్పుడు.. అభిమానులు భారీగా వచ్చారు. మహిళ క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. భారత మహిళా క్రికెటర్లు కూడా స్థానిక అభిమానుల ప్రేమ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం బీసీసీఐ పెద్దలకు కనిపించకపోవడం విశేషం.

ఉప్పల్, కొచ్చి, చేపాక్, విశాఖపట్నం మైదానంలో లోకల్ ఫాన్స్ సపోర్టు విపరీతంగా ఉంటుంది. అటువంటిది ఇంత గొప్ప మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకపోవడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు మైదానంలో సాంకేతిక సమస్యలను సాకుగా చూపించిన బీసీసీఐ పెద్దలు.. కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచుల విషయంలో మాత్రం పక్కన పెట్టడం విశేషం. చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటికే అనేక రకాల సమస్యలను బీసీసీఐ పెద్దలు లేవనెత్తారు. వాటిని అక్కడి నిర్వాహకులు పరిష్కరించుకున్నారు. లీగ్ దశలో మ్యాచులను సమర్ధవంతంగా నిర్వహించారు. లీగ్ దశలో సక్రమంగా నిర్వహించినప్పుడు.. ప్లే ఆఫ్ విషయంలో అంతటి సమర్థత కరువైపోతుందా.. ఈ ప్రశ్నలకు బీసీసీఐ పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉందని అభిమానులు అంటున్నారు.

Vijay CM oath ceremony tomorrow: రేపే సీఎంగా విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం.. ఆంధ్రానుండి హాజరు కాబోతున్న ముఖ్య అతిధులు వీళ్ళే..

Vijay CM oath ceremony tomorrow: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్(Thalapathy Vijay) రేపు నెహ్రు స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అందుకోసం ఆయన తన పార్టీ నేతలతో కలిసి గవర్నర్ అనుమతి తీసుకోబోతున్నాడు. విజయ్ టీవీకే పార్టీ కి కేవలం 107 సీట్లు మాత్రమే వచ్చింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని దాటాలంటే 118 కి పైగా స్థానాలు రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు పొత్తు అనివార్యం అవ్వడంతో , విజయ్ ఎవరితో చేతులు కలపబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ తో టీవీకే పొత్తు ఖరారు అయ్యింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కాసేపటి క్రితమే టీవీకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోపక్క విజయ్ DMDK,CPI , CPM పార్టీల మద్దత్తు కూడా కోరాడు. వీళ్లంతా కలిస్తే 118 సీట్లు అవుతాయి.

మరో పక్క అన్నా డీఎంకే పార్టీ తో కూడా విజయ్ సంప్రదింపులు జరుపుతున్నాడు. నేడు టీవీకే పార్టీ నేత ఆనంద్ అన్నా డీఎంకే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని ముఖ్య నాయకులలో కొందరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో కేంద్రం లో ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్న రాహుల్ గాంధీ కూడా ఉన్నాడట. రేపు ఆయన విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం లో తన స్వరం వినిపించబోతున్నాడు. అంతే కాకుండా సౌత్ లో లెఫ్ట్ భావజాలాలు ఉన్న పార్టీ నేతలందరికీ ఆయన ఆహ్వానం పంపించాడట. అలా ఆహ్వానం అందుకున్న వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ విపక్ష నేత , మాజీ సీఎం జగన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ కి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ఆయన విదేశాల్లో ఉండడం తో రాలేకపోతున్నాను అని విజయ్ తో చెప్పాడట.

తన పార్టీ వైపు నుండి ముఖ్య నాయకులను పంపిస్తానని చెప్పాడట. ఇక కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కావడం , రేపు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి రాబోతుండడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వంటి వారిని కూడా ఆహ్వానించాడట విజయ్. రేపు వీళ్ళందరూ ఒకే వేదిక పై కనిపించబోతున్నారు. ఇక మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.