Home Blog Page 299

India Ethanol Blending Strategy: గల్ఫ్‌ దేశాలకు మోదీ ఝలక్‌.. ఇథనాల్‌తో ఇండియా రాక్

India Ethanol Blending Strategy: పశ్చిమాసియా సంఘర్షణలు అంతర్జాతీయ చమురు సరఫరాను దెబ్బతీస్తుండగా, భారత్ ఇథనాల్ బ్లెండింగ్ వ్యూహంతో లక్షల కోట్ల ఆదా సాధించింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపడం ద్వారా విదేశీ చమురు ఆధారాన్ని తగ్గించారు. ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తూ 25 శాతం కలిపే అంశంపై కసరత్తు చేస్తోంది. దీంతో గల్‌‍్ఫ దేశాల చమురు దిగుతులు తగ్గే అవకాశం ఉంది.

అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యం
పశ్చిమాసియాలో ఉద్రిక్తులు ముడి చమురు ధరలు పెరిగాయి. సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీశాయి. భారత్ వంటి దిగుమతి ఆధార దేశాలకు ఇది హెచ్చరిక సంకేతంగా మారింది. పరాయి ఇంధనాలపై అత్యధిక ఆధారం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని గుర్తించిన కేంద్రం పునరుత్పాదక ఇంధనాల వైపు మలుపు తిప్పింది.

ఇథనాల్ బ్లెండింగ్..
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలవడంతో దేశానికి సంవత్సరానికి 4.5 కోట్ల బ్యారెళ్ల చమురు ఆదా అవుతుంది. రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టం తగ్గింది. ఈ విజయంతో ప్రభుత్వం 25 శాతం లక్ష్యంగా పెట్టుకుంది, వాహన ఇంజిన్ సామర్థ్యం, పర్యావరణ ప్రభావాలను పరీక్షించి ముందుకు సాగుతోంది. ఈ వ్యూహం దేశీయ ఆధారాలను బలపరచడమే కాక, రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతోంది.

రిఫైనరీల విస్తరణపై దృష్టి..
దేశీయ శుద్ధీకరణ సామర్థ్యాన్ని పెంచేందుకు రాజస్థాన్ బార్మర్, అస్సాం నుమాలిగఢ్ రిఫైనరీలు వేగంగా పూర్తవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లో కొత్త మెగా ప్లాంట్లు రానున్నాయి, పశ్చిమ తీరంపై దృష్టి సారించారు. 100 శాతం సామర్థ్యం లేని యాజమాన్య యూనిట్ల బదులు కొత్త మౌలిక సదుపాయాలు దీర్ఘకాల భద్రత ఇస్తాయి.

పునరుత్పాదక ఇంధనం..
స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులను బలోపేతం చేస్తూ, గ్రీన్ హైడ్రోజన్, సౌర-పవన శక్తి వంటి శుభ్ర ఇంధనాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇవి పర్యావరణ రక్షణకు సహాయపడుతూ, జాతీయ భద్రతను మరింత రక్షిస్తాయి. అత్యవసర కాలంలో స్వల్పకాలిక అంతరాయాలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతోంది.

పశ్చిమాసియా ఘర్షణలు శిలాజ ఇంధన ఆధారాల ప్రమాదాన్ని బహిర్గతం చేశాయి. ప్రపంచ దేశాలను స్వావలంబన వైపు మళ్లించాయి. భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గ్రీన్ ఎనర్జీ విస్తరణ, ఇథనాల్ పెంపు, చమురు నిల్వల పెరుగుదల ద్వారా ఆర్థిక వ్యవస్థను కుదుపులకు తట్టుకునేలా తయారుచేస్తోంది.

Samantha Latest Video: నాగ చైతన్య ని చూసి పరుగులు తీసిన సమంత.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ వీడియో..

Samantha Latest Video: సమంత , నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు వాళ్లిద్దరూ ఒకరిని ఒకరు ఎదురుపడిన సందర్భాలు లేవు. అయితే సమంత కొన్ని ఇంటర్వ్యూస్ లో తన మాజీ భర్త గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు చాలా ఘాటుగా సమాదానాలు ఇవ్వడం మనమంతా చూశాం . నేను , అతను ఒక రూమ్ లో ఉంటే, మారణాయుధాలు ఆ రూమ్ లో ఉండకుండా చూస్తే బెటర్ అంటూ ఆమె అప్పట్లో చేసిన సంచలన కామెంట్స్ ని ఎంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే నాగ చైతన్య మాత్రం సమంత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా మంచిగా మాట్లాడేవాడు , ఆమెతో కలిసి సినిమా చేయడానికి కూడా సిద్దమే అంటూ ఒక ఇంటర్వ్యూ లో అప్పట్లో చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య వ్యాఖ్యలను అప్పట్లో నెటిజెన్స్ సమర్ధించారు. ఇకపోతే రీసెంట్ గా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే మూడు రోజుల క్రితం ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి నాగ చైతన్య తన సతీమణి శోభిత తో హాజరు అవ్వగా, సమంత తన భర్త రాజ్ నిడిమోరు తో కలిసి హాజరయ్యాడు. అయితే ముందుగా సమంత , రాజ్ లు కలిసి వధూవరుల వద్దకు వెళ్లి ఆశీర్వదించారు. ఇంతలోపే స్టేజి మీదకు నాగ చైతన్య రావడం మొదలు పెట్టాడు. ఆయన్ని దూరం నుండి చూసిన సమంత వెంటనే స్టేజి నుండి వెళ్ళిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజెన్స్ సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్స్ వేయడం మొదలు పెట్టారు. సమంత ఫ్యాన్స్ నాగ చైతన్య ని ట్రోల్ చేయగా, నాగ చైతన్య ఫ్యాన్స్ సమంత ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇరువురి ఫ్యాన్స్ మధ్య ఇప్పట్లో ఫ్యాన్ వార్స్ ఆగేలా లేవు.

ఇక వీళ్లిద్దరి కెరీర్ విషయానికి వస్తే , సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో నటించింది. జూన్ 19 న ఈ చిత్రం విడుదల కాబోతుంది . ‘ఓ బేబీ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. ముందుగా మే 14 న విడుదల చేద్దామని అనుకున్నారు కానీ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో జూన్ 19 కి వాయిదా వేశారు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే , ‘తండేల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ‘వృష కర్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం పేక్షకుల ముందుకు రాబోతుంది .

OG 2 Movie Update: కొత్త నిర్మాత..కొత్త క్యారెక్టర్లు.. ‘ఓజీ 2’ నుండి సెన్సేషనల్ అప్డేట్..

OG 2 Movie Update: పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిపోయిన చిత్రాల్లో ఒకటి ఓజీ. ఈ ‘ఓజీ’ అనే రెండు అక్షరాలను విన్నప్పుడల్లా అభిమానుల శరీరంలోకి వెయ్యి వోల్టుల కరెంటు పాస్ అవుతుంది. అలాంటి బలమైన ఎమోషన్ ని అభిమానుల్లో నింపింది ఈ చిత్రం. విడుదలకు ముందు ఈ సినిమా జెన్ జీ ఆడియన్స్ లో క్రియేట్ చేసిన క్రేజ్ , విడుదల తర్వాత సృష్టించిన ప్రభంజనాన్ని అంత తేలికగా అభిమానులు మర్చిపోలేరు. మొదటి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం , నార్త్ అమెరికా లో ఏకంగా 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఒక చరిత్ర. నార్త్ ఇండియా లో లిమిటెడ్ రిలీజ్ వల్ల , ఈ చిత్రం కేవలం 320 కోట్ల గ్రాస్ కి మాత్రమే పరిమితం అయ్యింది కానీ , నిర్మాత సరైన ప్లానింగ్ తో నార్త్ ఇండియా లో విడుదల చేసుంటే 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి ఉండేదని అభిమానులు చెప్పే మాట.

ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తదుపరి చేయబోయే చిత్రం ‘ఓజీ 2’. దీనికి సంబంధించిన కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా పని మొదలు పెట్టాడు, ఇక డైరెక్టర్ సుజీత్ అయితే స్క్రిప్ట్ వర్క్ ని ముగించే దశలో ఉన్నాడు. సాధారణంగా ఆయన నాని తో ‘బ్లడీ రోమియో’ చిత్రం చెయ్యాలి. కానీ ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతుండడం తో ముందుగా ఓజీ ని చేయడానికి ఆయన రెడీ అయ్యాడు. జపాన్ లో ఓజాస్ గంభీర చేసిన విద్వంసం పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు సుజిత్. అయితే మొదటి భాగాన్ని తెరకెక్కించిన DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థ , రెండవ భాగం నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో పాటు , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కనుంది.

అంతే కాదు , మొదటి భాగం లో మనకి కనిపించిన క్యారెక్టర్స్ తో పాటు , రెండవ భాగం లో సరికొత్త క్యారెక్టర్స్ ని పరిచయం చేయబోతున్నాడట డైరెక్టర్ సుజిత్. ఈ చిత్రం లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ gaa కనిపించబోతున్నాడని , రెబల్ స్టార్ ప్రభాస్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. అభిమానులు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ మలచబోతున్నాడని , ఓజీ చిత్రం లో స్టోరీ లేదు , కంటెంట్ లేదు , కేవలం పవన్ కళ్యాణ్ స్టైల్ మీదనే ఆడింది , కానీ ఓజీ 2 లో కంటెంట్ , స్టోరీ నే హైలైట్ గా నిలవబోతున్నాయని, ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో చాలా భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అంటున్నారు.

Vijay CM Oath Ceremony: రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం.. ముఖ్య అతిథిగా రజినీకాంత్..

Vijay CM Oath Ceremony: గంట గంటకు ట్విస్టులు, గడిచిన ఆరు రోజుల నుండి తమిళనాడు రాజకీయాలు ఎంత ఉత్కంఠ భరితంగా సాగాయో అందరికీ తెలిసిందే. ఈ ఆరు రోజుల్లో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమా తీస్తే బంపర్ హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. సినిమాల్లో కూడా సాధ్యపడని అరుదైన సంఘటనలు తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే ఎట్టకేలకు విజయ్ సీఎం అయ్యేందుకు మార్గం మొత్తం క్లియర్ అయ్యింది. నిన్నటితో 116 ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్ వద్దకు వెళ్లిన విజయ్ కి , మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల లెటర్స్ చేరలేదని ప్రశ్నించగా, విజయ్ వద్ద సమాధానం రాలేదని , దాంతో ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ అనుమతిని ఇవ్వలేదని మీడియా లో ప్రచారం జరిగింది. అయితే నేడు VCK , IUML పార్టీలు టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతు ఇవ్వడంతో, ఇన్ని రోజులు నడిచిన రాజకీయ హై డ్రామాకు తెరపడింది.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ చెన్నై లోని నెహ్రు స్టేడియం లో గవర్నర్ సమక్షంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ కార్యక్రమానికి ఇండియా పార్టీ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులంతా హాజరు అవ్వబోతున్నారని టాక్. విజయ్ తో పాటుగా , ఆయన మంత్రివర్గం కూడా రేపే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కి రెండు మంత్రి పదవులు ఇవ్వగా, VCK పార్టీ లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కానీ సీపీఐ , సీపీఎం పార్టీలు మాత్రం ప్రభుత్వం లో భాగం అవ్వడం లేదని , కేవలం ప్రభుత్వ ఏర్పాటుకి మాత్రమే అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. నిన్న విజయ్ సీపీఎం పార్టీ ఆఫీస్ కి వెళ్లి , అక్కడి నాయకులకు కృతఙ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే రేపు ఉదయం విజయ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి వెళ్లి, తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలం నుండి విజయ్ , రజిని మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనేది కోలీవుడ్ లో ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అలాంటిది రజినీకాంత్ ని విజయ్ స్వయంగా తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించబోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. మరి రజినీకాంత్ వస్తాడో లేదో చూడాలి. ఏది ఏమైనా కోట్లాది మంది అభిమానుల ఆకాంక్ష ని నెరవేరుస్తూ , రేపు విజయ్ ప్రమాణస్వీకారం చేయబోయే ఘట్టం, ఆయన అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Kalki 2 Movie Updates: అప్పుడే 60 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ‘కల్కి 2’.. టీజర్ విడుదల తేదీ ఎప్పుడంటే..

Kalki 2 Movie Updates: ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2’. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు , ప్రస్తుతం మూడవ షెడ్యూల్ కూడా సాగుతోంది. అయితే అత్యధిక శాతం ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ లపైనే అత్యధిక షాట్స్ ని తెరకెక్కించారు. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే , ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అప్పుడే 60 శాతానికి పైగా పూర్తి అయ్యిందట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. నిన్న గాక మొన్న మొదలైందని అంటున్నారు , ప్రభాస్ ఇంకా సెట్స్ లోకి అడుగుపెట్టలేదని అంటున్నారు , కానీ అప్పుడే 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని అంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు.

కానీ అసలు విషయం లోకి వెళ్తే, ఈ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ మొదటి భాగాన్ని తెరకెక్కిస్తున్న సమయంలోనే షూట్ చేశారట. చాలా వరకు సన్నివేశాలు ప్రభాస్ పైనే అప్పట్లో పూర్తి చేశారట. అందుకే 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందనే సమాచారం బయటకు వచ్చిందని అంటున్నారు. మరి దీపికా పదుకొనే ఈ చిత్రం నుండి తప్పుకుంది కదా, ఇప్పుడు ప్రభాస్ తో ఆమె కాంబినేషన్ సన్నివేశాలను వేరే హీరోయిన్ తో రీ షూట్ చేస్తారా ?, లేదంటే సినిమా నుండే ఆ సన్నివేశాలను శాశ్వతంగా తొలగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రభాస్ విదేశీ పర్యటన లో ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ‘స్పిరిట్’ మూవీ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. డెహ్రాడూన్ లో ఈ షెడ్యూల్ జరగబోతుంది. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక , ప్రభాస్ ‘కల్కి 2’ సరికొత్త షెడ్యూల్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.

ఈ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకున్న తర్వాత , సాయి పల్లవి ని ఎంచుకున్నారంటూ వార్తలు ప్రచారం లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే , సాయి పల్లవి కి బదులుగా అలియా భట్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అలియా తో చర్చలు చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ సరికొత్త షెడ్యూల్ లో పాల్గొనే లోపు అలియా భట్ తో డీల్ ముగిస్తారని అంటున్నారు. ఈ చిత్రం లో నటించడం కోసం ఆమె ఏకంగా 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఈ ఏడాది ప్రభాస్ పుట్టినరోజు సంద్రాభంగా అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.

Sobhita Dhulipala: ఎవరి మాట వినాల్సిన అవసరం నాకు లేదు అంటూ శోభిత ధూళిపాళ్ల హాట్ కామెంట్స్..

Sobhita Dhulipala: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటల్లో ఒకటి నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ల జంట. సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళకు నాగ చైతన్య ఈమెని కాఫీ షాప్ లో కలవడం , అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య మొదలైన స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారడం, ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి ఏడాది దాటింది. అయితే పెళ్లి తర్వాత శోభిత సినిమాలను మానేస్తుందేమో అని అంతా అనుకున్నారు కానీ , అలాంటిదేమి జరగలేదు. రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఎక్సక్లూసివ్ మూవీ చీకటి అనే చిత్రం లో హీరోయిన్ గా నటించిన ఈమె , ఇప్పుడు తమిళం లో ‘వెట్టువన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సోషల్ మీడియా లో ఈమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘నేను ఎవరి మాట ని అంత తేలికగా నమ్మి , ఫాలో అయ్యే మనిషిని కాదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే , మన మనసు చెప్పే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి అనే సత్యాన్ని బలంగా అనుసరించే మనిషిని. అలా నా మనసు చెప్పిన మాటల్ని వినడం వల్లే, నా జీవితం లో ఎన్నో అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాను. కొన్ని కొన్ని సార్లు మనసు చెప్పే మాటలు పాటించడం కష్టం అవ్వొచ్చు , అయినప్పటికీ కూడా నేను నా అంతరాత్మ చెప్పే మాటలనే బలంగా నమ్ముతాను. మనసు చెప్పిన మాట ని వినకుండా చేసిన పని ఏది కూడా నా జీవితం లో సఫలం అవ్వలేదు. ఎల్లప్పుడూ మనల్ని మనం గౌరవించుకుంటూ ముందుకు పోవాలి , జీవితం అనేది ఒక చిన్న నదిపై సాగే నావ లాంటిది. ప్రతీ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి’ అంటూ చెప్పుకొచ్చింది శోభిత.

Stalin Strategy On Vijay Government: మాజీ సీఎం స్టాలిన్ చేతుల్లోకి విజయ్ ప్రభుత్వం.. ఇది మామూలు స్ట్రాటజీ కాదు బాబోయ్..

Stalin Strategy On Vijay Government: తమిళనాడు రాజకీయాలు గంటగంటకు మారిపోతున్నాయి. ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు చూసి ఉందాము. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 107 స్థానాలతో ఘనవిజయం సాధించి , రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ గా అవతరించింది. సాధారణంగా సింగల్ లార్జెస్ట్ పార్టీ గా టీవీకే ఉంది కాబట్టి , గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 118 స్థానాలు ఉంటేనే అనుమతి ఇస్తానని ఆయన తెగేసి చెప్పడంతో విజయ్ చిన్న పార్టీల మద్దతు కోసం ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చింది. నిన్న ఆయన గవర్నర్ ని కలవగానే , మ్యాజిక్ ఫిగర్ కి అవసరమయ్యే 118 సీట్లను సమకూర్చాడని , నేడు నెహ్రు స్టేడియం లో ఘనంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతుందని ప్రచారం జరిగింది.

కానీ గవర్నర్ కి కేవలం విజయ్ 116 ఎమ్మెల్యేలకు సంబంధించిన మద్దతు లెటర్స్ ని మాత్రమే ఇచ్చాడట. VCK , IUML పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల లెటర్స్ ని ఇవ్వలేదట. దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి అంగీకరించలేదు. అయితే కాసేపటి క్రితమే ఈ రెండు పార్టీలు విజయ్ టీవీకే కి మద్దతు ఇస్తున్నట్టు అధికారికంగా మీడియా ముందుకొచ్చి చెప్పాయి. దీంతో 120 ఎమ్మెల్యే మద్దతుతో కూడిన ఫైల్ ని గవర్నర్ కి ఇచ్చేందుకు విజయ్ రాజ్ భవన్ కి వెళ్లగా, గవర్నర్ లేడు అనే సమాచారాన్ని తెలుసుకొని వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే గవర్నర్ కేరళ టూర్ ని క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు విజయ్ కి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కనీసం ఇప్పుడైనా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి తీసుకుంటాడో లేదో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే ఈ కూటమి లో కీలక పాత్ర పోషించింది కమ్యూనిస్ట్ పార్టీలు. ఈ రెండు పార్టీలకు చెరో రెండు స్థానాలు , అనగా నాలుగు స్థానాలు ఉన్నాయి. వీళ్ళు ప్రస్తుతం డీఎంకే తో పొత్తులో ఉన్నారు. మేము మీ ప్రభుత్వం లో భాగం అయ్యేందుకు సిద్ధంగా లేమని , కానీ బయట నుండి ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతు ఇస్తామని విజయ్ తో చెప్పారట. అంటే వీళ్ళు ఏ క్షణం లో అయితే భవిష్యత్తులో తమ మద్దతుని ఉపసంహరించుకోవచ్చు అన్నమాట. డీఎంకే అధినేత స్టాలిన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాతే వీళ్ళు విజయ్ కి మద్దతు ఇచ్చారని, స్టాలిన్ సరైన సమయాన్ని చూసుకొని , ఈ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుని ఉపసంహరించుకునేలా చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని , విజయ్ ప్రభుత్వానికి రిమోట్ స్టాలిన్ చేతుల్లో ఉందని , ఆయన ఎలా చెప్తే , అలా ఆడాలి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Meher Ramesh Daughter Engagement: గ్రాండ్ గా జరిగిన మెహర్ రమేష్ కూతురు నిశ్చితార్థం.. వీడియో వైరల్..

Meher Ramesh Daughter Engagement: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మెహన కి నిన్న అనిరుద్ అనే వ్యక్తితో హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా నిశ్చితార్ధ వేడుక జరిగింది. అందుకు సంబంధించిన ఫోట్లోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ వార్త బయటకు వచ్చేంత వరకు మెహర్ రమేష్ కి ఇంత పెద్ద కూతురు ఉందనే విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. ఈ నిశ్చితార్ధ వేడుకకు టాలీవుడ్ కి చెందిన కొందరు సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా, రాజకీయ నాయకులూ , వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. ఇక మెహర్ రమేష్ కూతురు మెహన ఫోటోలను చూడగానే , అచ్చు గుద్దినట్టు నాన్న పోలికలతో ఉందని, సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఇక మెహర్ రమేష్ సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేసేందుకు ఏ హీరో ముందుకు రావడం లేదు. నిర్మాతలు అయితే మెహర్ రమేష్ పేరు చెప్తేనే పరుగులు తీసే పరిస్థితి. అలాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందించాడు మరి. ఆయన గత చిత్రం ‘భోళా శంకర్’. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సినిమా , ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి రోజే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న చిరంజీవి, ఈ సినిమాతో క్లోజింగ్ లో కూడా అంతటి కలెక్షన్స్ ని రాబట్టలేకపోయాడు. ఈ చిత్రానికి ముందు మెహర్ రమేష్ తీసిన శక్తి , షాడో, కంత్రి వంటి సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఎంతటి డిజాస్టర్స్ గా నిలిచాయో మన అందరికీ తెలిసిందే. కెరీర్ మొత్తం ఈయన తీసిన సినిమాల్లో పర్వాలేదు అనిపించుకుంది బిల్లా మాత్రమే. ప్రభాస్ హీరో గా నటించిన ఈ సినిమా ఆరోజల్లో యావరేజ్ గా ఆడింది.

మెగా ఫ్యామిలీ తో బంధుత్వం ఉండడంతో , ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోతోనే సినిమా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ బాధ పడాల్సిన విషయం ఏమిటంటే , మెగా హీరోలు కనీసం స్టోరీ వినేందుకు కూడా ఈయనకు సమయం ఇవ్వడం లేదట. మరి ఆ రేంజ్ లో బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న మెహర్ రమేష్ భవిష్యత్తులో సినిమాలు చేస్తాడా ?, లేదంటే సినిమాలు మానేసి వేరే ఏదైనా వ్యాపారం చూసుకుంటాడా అనేది చూడాలి . కానీ ఏది ఏమైనా ఒక డైరెక్టర్ గా ఆయన కెరీర్ లో ఫెయిల్ అయ్యుండొచ్చు కానీ, వ్యక్తిగా , ఒక తండ్రిగా మాత్రం సక్సెస్ అయ్యాడు. తన కూతురికి గొప్ప సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తున్నాడు. ఇంతకు మించి ఒక మనిషి జీవితం లో సాధించాల్సింది ఏముంది చెప్పండి.

Narendra Modi Political Dominance: 12 ఏళ్లు.. 9 రాష్ట్రాలు.. భారత రాజకీయ ముఖచిత్రంపై మోడీ ’కాషాయ‘ ముద్ర!

Narendra Modi Political Dominance: భారత రాజకీయ ముఖచిత్రం చాలా దశాబ్దాల తర్వాత కొత్తగా కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పారీ‍్ట అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. 1975 వరకు కాంగ్రెస్‌ ఆధిపత‍్యం కొనసాగింది. రాష్ట్రాలు, కేంద్రంలో వరుసగా ఎన్నికవుతూ వచ్చింది. నాడు దేశ ముఖచిత్రం మొత్తం మూడురంగుల జెండానే కనిపించేంది. 1980వ దశకం నుంచి ప్రాంతీయ పార్టీలు బలపడడం, రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ అధిపత్యానికి గండిపడింది. ఇదే సమయంలో భారతీయ జనతాపార్టీ కూడా పురడు పోసుకుంది. తొలి ఎన్నికల్లో కేవలం రెండు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ప్రస్తుతం 12 ఏళ్లుగా అధికారంలో ఉంది. వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. మోదీ మానియా బీజేపీని మూడోసారి అధికారంలోకి తెచ్చింది.

రాష్ట్రాల్లోనూ అధికారం..
ఇక మోదీ ప్రధాని అయ్యాక చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నమో మంత్రం, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన బీజేపీ సునాయాసంగా అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ద్వారా, ప్రాంతీయ రాజకీయ సమతుల్యతను గణనీయంగా మార్చివేసింది.

వ్యూహాత్మక విస్తరణ..
మోదీ ప్రధాని అయ్యాక హరియాణాలో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అప్పటి వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో బీజేపీ ఘనవిజం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది. 2016లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఆవిర్భవించింది. మహాయుతి కూటమి మద్దతుతో అధికార పగ్గాలు చేపట్టింది. దేవేంద్ర ఫడణవీస్ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

ఈశాన్య భారతంపై పట్టు..
ఈశాన్య భారతంలోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడింది. అస్సాంలో సర్బానంద సోనోవాల్ సారథ్యంలో తొలి విజయాన్ని అందుకోగా, అరుణాచల్‌లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెమా ఖండూ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఇక 2017లో మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌ మద్దతుతో మణిపుర్‌లో బీరెన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 2018లో త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అక్కడి సుదీర్ఘ వామపక్ష పాలనకు బీజేపీ చరమగీతం పాడింది. బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

పెద్ద రాష్ట్రాల్లో…
ఇక 2024లో ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో దశాబ్దాల బిజు జనతా దళ్ పాలనకు బీజేపీ తెరదించింది. మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా తూర్పు భారతదేశంలో పార్టీ ముందడుగు వేసింది. 2025లో బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యంతో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ.. ఇటీవలే నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో సమ్రాట్ చౌదరీని ముఖ్యమంత్రిని చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. తొలిసారిగా బెంగాల్‌లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. సువేంది అధికారి నేతృ‍త్వంలో ప్రభుత్వం కొలువుదీరింది.

గత పన్నెండేళ్ల కాలంలో బీజేపీ కేవలం ఎన్నికల విజయాన్నే కాకుండా, ప్రాంతీయ కూటములను సమన్వయం చేసుకుంటూ జాతీయ స్థాయి విస్తరణను సాధించింది. సంప్రదాయ రాజకీయ కంచుకోటలను బద్దలు కొట్టడంలో మరియు నాయకత్వ మార్పులను సుస్థిరంగా అమలు చేయడంలో పార్టీ అనుసరించిన వ్యూహాలు అద్వితీయం.

Modi Visits Pawan Kalyan House: బిగ్ బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని నరేంద్ర మోడీ.. కారణం ఏంటంటే..

Modi Visits Pawan Kalyan House:  రేపు పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలం క్రితం తీవ్రమైన అనారోగ్య సమస్య కారణంగా , నాజల్ సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ , ప్రస్తుతం తన నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ముక్కు నుండి బ్లీడింగ్ జరుగుతూనే ఉందట. రీసెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించగా, ఆయనకు ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. మరో వారం రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా పక్కన పెడితే రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కి విచేస్తున్నాడు. హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే మీటింగ్ లో మోడీ పాల్గొనబోతున్నారు .

అయితే అంతకంటే ముందే ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి , ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీయనున్నాడని టాక్. ప్రధాన మంత్రి నరేద్ర మోడీ కి పవన్ కళ్యాణ్ అత్యంత ఆప్త మిత్రుడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఇచ్చేంత విలువ , నరేంద్ర మోడీ దేశంలో ఏ నాయకుడికి కూడా ఇవ్వదు. పార్లమెంట్ లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు , మంత్రులు ఉన్న సమయంలో , ఇతను పవన్ కాదు , తుఫాన్ అంటూ సంబోధించడం అప్పట్లో ఒక సంచలనం. దీనిని బట్టీ చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ మోడీ కి ఎంత ముఖ్యమైన వ్యక్తి అనేది. రేపు పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా మోడీ రావడం , ఆయనకు పవన్ మీద ఎంత ఆప్యాయత ఉందో చెప్పడానికి నిదర్శనం అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్.

ఇకపోతే నేడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గా సువెందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇండియా లో NDA కూటమి కి చెందిన ముఖ్యమంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఆయనతో మోడీ సరదాగా జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నేడు బాగా ఉండుంటే, ఆయన కూడా ఈ వేడుకలో పాల్గొనేవాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ , నరేంద్ర మోడీ మధ్య జరిగే సరదా సంబాషలను చూసి అభిమానులు సంబరాలు చేసుకునేవారు అని అంటున్నారు విశ్లేషకులు.

Poonam Kaur Comments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు నమ్మకండి అంటూ పూనమ్ కౌర్ హాట్ కామెంట్స్.. ట్వీట్ వైరల్..

Poonam Kaur Comments On Pawan Kalyan: ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివా పై , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అప్పుడప్పుడు పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ తనకు అన్యాయం చేసాడని , అతని చేసిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదని , ఇలా ఎన్నో సార్లు ఆమె ట్వీట్లు వేస్తూ వచ్చింది. ఈమె చేసే కామెంట్స్ ని వైసీపీ పార్టీ అభిమానులు బాగా ప్రోత్సహిస్తారు , అదే సమయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. అయితే ఒకప్పుడు ఈమె పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఉండేది , కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గానే కౌంటర్ అటాక్ చేస్తోంది. నిన్న ఆమె ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ సెన్సేషనల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ.

పూర్తి వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లాకు చెందిన షానవాజ్ అనే ముస్లిం యువతీ ఒమాన్ దేశం లో చిక్కుకొని, అక్కడ తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటోంది. అక్కడ కొంతమంది ఆమెని హింసలు పెడుతూ వేధిస్తున్నారని , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు , దయచేసి నన్ను వెనక్కి తీసుకొని వచ్చేలా చేయండి , ఇక్కడ నేను బ్రతకలేకపోతున్నాను అంటూ ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో ని విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది , పవన్ కళ్యాణ్ వరకు విషయం చేరింది. దీంతో పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం సహాయం కోరి , నరేంద్ర మోడీ మరియు రక్షణ శాఖా మంత్రి సహకారంతో ఆ ముస్లిం యువతీ ని సురక్షితంగా తన ఇంటికి చేర్చారు. అందుకు ఆ యువతీ కృతజ్ఞతా చెప్తూ ఒక వీడియో ని షేర్ చేసింది. ఈ వీడియో ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతఙ్ఞతలు తెలియజేశారు.

ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం తో పూనమ్ కౌర్ దీనిపై స్పందించింది . ఆమె మాట్లాడుతూ ‘ విజువల్ హంగుల కోసం సోషల్ మీడియా లో చేసే ప్రచారాలను నమ్మి మోసపోకండి. సుగాలి ప్రీతీ తల్లికి ఇచ్చిన మాటని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఆమెకు న్యాయం చెయ్యాలి. ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి విజువల్ హంగులు కేవలం జనాల దృష్టిని మరల్చడానికే. ఒకవేళ ఆయన నిజంగా సహాయం చేసుంటే మంచిదే’ అంటూ కామెంట్ చేసింది. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూ , ఒక ఫక్తు వైసీపీ కార్యకర్త ఎలా మాట్లాడుతాడో, అలాగే మాట్లాడుతున్నావు అంటూ పూనమ్ కౌర్ పై మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.

Vijay Deverakonda horse fall video: గుర్రం నుండి పడిపోయిన విజయ్ దేవరకొండ.. ‘రణబలి’ కష్టాలు..సంచలనం రేపుతున్న వీడియో..

Vijay Deverakonda horse fall video: ‘గీతా గోవిందం’ తర్వాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ , ప్రస్తుతం ‘రణబలి’ మూవీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆయన గత చిత్రం ‘కింగ్డమ్’ భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిల్చింది. అందుకు కారణం విజయ్ దేవరకొండ గత చిత్రాల ప్రభావం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ‘రణబలి’ తో కచ్చితంగా రీ సౌండ్ వచ్చే రేంజ్ లో కం బ్యాక్ ఇస్తాననే బలమైన నమ్మకం తో ఉన్నాడు విజయ్ దేవరకొండ. పైగా రష్మిక తో పెళ్లి జరిగిన తర్వాత , వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక గ్లింప్స్ వీడియో , ఒక పాట బయటకు వచ్చింది. ఈ రెండిటికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు, ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ని ఒకటి విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ కోసం ఎంత కష్టపడున్నాడో చూపించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ కోసం ఆయన తన ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు. ఒకసారి కాదు , అనేక సార్లు ఆయన గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు అదుపు తప్పి క్రింద పడిపోయాడు. సాధారణంగా ఇలాంటివి హీరోలతో కాకుండా, డూప్స్ తో చేయిస్తారు మేకర్స్. ఎందుకంటే హీరోలకు చిన్న గాయమైన నెలల తరబడి షూటింగ్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి. కానీ విజయ్ దేవరకొండ ధైర్యం చేసి , ఈ చిత్రం లో ప్రతీ షాట్ లోనూ తానే నటించే ప్రయత్నం చేశాడు.

ఇదంతా చూస్తుంటే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని , కం బ్యాక్ ఇవ్వాలనే కసి ఆయనలో విపరీతంగా ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కి వరుసగా ఫ్లాప్స్ వచ్చినప్పటికీ , యూత్ ఆడియన్స్ లో క్రేజ్ ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు. అందుకే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఆయనకు ఫ్లాప్స్ ఉన్నప్పటికి ఒక్క సరైన సినిమా పడితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే బ్లాక్ బస్టర్ కొడుతుడానే నమ్మకం మేకర్స్ లో ఉంది. అందుకే ఆయన పై ఎంత బడ్జెట్ ని ఖర్చు చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. ఇక సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న నేడు విడుదల చేసిన మేకింగ్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Peddi trailer launch event: భోపాల్ లో ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ముఖ్య అతిథి ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Peddi trailer launch event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మేనియా మొదలైంది. జూన్ 4 న ప్రపాంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా చికిరి చికిరి పాట గ్లోబల్ వైడ్ గా సృష్టించిన సెన్సేషన్ వేరే లెవెల్ అనే చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడిన పాట ఇది. యూట్యూబ్ లో కేవలం తెలుగు వెర్షన్ నుండి 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈమధ్య కాలంలో ఒక స్టార్ హీరో సినిమా పాటకు ఈ రేంజ్ వ్యూస్ రావడం అనేది గతంలో ఎక్కడా జరగలేదు. దీనిని బట్టీ ఈ చిత్రానికి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు పట్టుమని 26 రోజులు కూడా లేవు , కానీ మేకర్స్ అప్డేట్స్ ఇవ్వడం లేదనే బాధ అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 16 న విడుదల చేయబోతున్నారట. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కాదు , భోపాల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి మహేంద్ర సింగ్ ధోని ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశం ఉందట. రామ్ చరణ్ కి ధోని తో ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు కలిసి చాలా ఏళ్ళ క్రితం పెప్సీ యాడ్ లో కూడా కనిపించారు. ఈమధ్య కాలం లో రెండు మూడు సార్లు కలిశారు కూడా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమా ప్రొమోషన్స్ కోసం ధోని వస్తున్నాడు అనే న్యూస్ రావడంతో సోషల్ మీడియా అంతటా పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం IPL లో కూడా పాల్గొనని ధోని , రామ్ చరణ్ ఈవెంట్ కోసం వస్తున్నాడంటే , వీళ్ళ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్థం చేసుకోండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు , ఈ ఈవెంట్ లో AR రెహమాన్ లైవ్ గా ఒక పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వబోతున్నాడు అట. ఇప్పటి వరకు రెహమాన్ ఒక సినిమాకు ఇలా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆయన ప్రత్యేకంగా లైవ్ కన్సర్ట్స్ జరిపిన సందర్భాలు ఉన్నాయి కానీ , సినిమాల ఈవెంట్స్ లో మాత్రం చాలా తక్కువ. నార్త్ ఇండియా లో కచ్చితంగా ఈ ఈవెంట్ మంచి హైప్ ని క్రియేట్ చేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

Vivo X300 Ultra camera features: ఈ ఫోన్లు ఉంటే.. కెమెరాలు కొనక్కర్లేదు.. ఫొటోగ్రఫీ వారికి బెస్ట్ మోడల్స్..

0

Vivo X300 Ultra camera features: భారతదేశంలో Vivo మొబైల్స్ కు విపరీతమైన ఆదరణ ఉంది. ఫొటోగ్రఫీ కావాలని కోరుకునేవారికి ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ బాగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా వీటిల్లో డిస్ ప్లే కూడా యూత్ కు అనుగుణంగా ఉండడంతో చాలా మంది వీటిని కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా వివో కంపెనీ కొత్తగా X300 సిరీస్‌లో భాగంగా X300 Ultra, X300 FE (Fan Edition) అనే రెండు పవర్‌ఫుల్ మోడళ్లను పరిచయం చేసింది. వీటిల్లో అల్ట్రా మోడల్‌లో ఉన్న కెమెరా ఫీచర్లు ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ వారిని కట్టిపడేస్తున్నాయి. ఇందులో కెమెరాతో పాటు ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం..

Vivo X300 Ultra:
వివో X300 అల్ట్రా ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం ఫోన్ ఇది. ఇందులో ప్రధాన ఆకర్షణ డ్యూయల్ 200MP కెమెరా. ఇందులో 200MP మెయిన్ కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. ఇది 3.7x ఆప్టికల్ జూమ్ ను అందిస్తుంది. అలాగే అద్భుతమైన క్లారిటీతో 100x వరకు డిజిటల్ జూమ్ చేయగలదు. వీటితో పాటు 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంది. ఈ కెమెరాలన్నీ ZEISS ఆప్టిక్స్‌తో వస్తాయి. ఇవి 4K 120fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఈ మొబైల్ లో సరికొత్త Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అలాగే ఇందులో 6.82 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే అమర్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ ఫోన్‌లో 6,600mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 100W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర సుమారు రూ. 1,59,999 (16GB+512GB) నుండి ప్రారంభమవుతుంది.

Vivo X300 FE:
తక్కువ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కోరుకునే వారి కోసం Vivo X300 FE అందుబాటులోకి వచ్చింది. ఇది 6.31 అంగుళాల కాంపాక్ట్ LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఉంది. ఇది 90W వేగవంతమైన ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 79,999 గా ఉంది. ఐఫోన్ లాంటి కాంపాక్ట్ డిజైన్ తో పాటు శక్తివంతమైన కెమెరా కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

ఈ రెండు ఫోన్లు కూడా Android 16 పై పనిచేస్తున్నాయి. అంతేకాకుండా వీటికి 5 సంవత్సరాల మేజర్ Operating System అప్‌డేట్స్ లభిస్తాయి. ఈమొబైల్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి బాగా ఉపయోగపడుతాయి. వీరు ప్రత్యేకంగా కెమెరా కొనుగోలు చేసే బుదులు వీటికి ఉన్న కెమెరాలను ఉపయోగించుకోవచ్చు.

iQOO 15 5G OnePlus 15 5G: గేమింగ్ లవర్స్.. ప్రీమియం ఫీచర్స్ వారికి బెస్ట్ 2 మోడల్ష్ ఇవే..

0

iQOO 15 5G OnePlus 15 5G: మొబైల్స కోనేవారిలో రకరకాల అభిరుచులను కలిగి ఉంటారు. కొందరు బడ్జెట్ లోనే మొబైల్స్ కొనాలని చూస్తే..మరికొందరు ప్రీమియం మొబైల్స్ కోసం ఎదురుచూస్తారు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రస్తుతం iQOO 15 5G, OnePlus 15 5G మోడల్స్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వీటిల్లో ఉండే భారీ బ్యాటరీ, అల్ట్రా-ఫాస్ట్ పెర్ఫార్మెన్స్‌ నేటితరం వారిని ఆకట్టుకుంటున్నాయి.

iQOO 15 5G:
iQOO 15 5G స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా గేమర్లను, పవర్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. వీరిని దృష్టిలో పెట్టుకునే ఈ కంపెనీ ఈ మొబైల్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite ప్రాసెసర్‌ను అమర్చారు. దీని డిస్‌ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.85 అంగుళాలు ఉండగా.. 2K Samsung M14 OLED ప్యానెల్‌తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండనుంది.

ఈ ఫోన్‌లోని అతిపెద్ద హైలైట్ ఇందులో ఉండే బ్యాటరీ. ఈ మొబైల్ లో 7000mAh భారీ బ్యాటరీ ఉండగా.. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఇంతపెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 8.1mm మందంతో స్లిమ్‌గా ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే… బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఇందులో 3x ఆప్టికల్ జూమ్ ఇచ్చే పెరిస్కోప్ లెన్స్ కూడా ఉంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర సుమారు రూ. 72,998 గా ఉంది.

OnePlus 15 5G:
ఆల్ రౌండర్ ఫ్లాగ్‌షిప్OnePlus 15 5G కూడా అదే Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో ఉంటుంది. ఈ మొబైల్ లో 6.78 అంగుళాల 1.5K లేదా 2K LTPO AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో కొత్తగా ‘యాక్షన్ బటన్’ను కూడా ప్రవేశపెట్టారు.

బ్యాటరీ విభాగంలో OnePlus ఒక అడుగు ముందుకు వేసి 7300mAh ‘గ్లేసియర్ బ్యాటరీ’ని అందించింది. దీనికి 120W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉండగా.. 50MP అల్ట్రావైడ్, 3.5x ఆప్టికల్ జూమ్ కలిగిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ కనిపిస్తుంది. దీని ధర కూడా దాదాపు రూ.72,999 నుండి ప్రారంభమవుతుంది.