Homeఎంటర్టైన్మెంట్Peddi trailer launch event: భోపాల్ లో 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ముఖ్య అతిథి...

Peddi trailer launch event: భోపాల్ లో ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ముఖ్య అతిథి ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Peddi trailer launch event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మేనియా మొదలైంది. జూన్ 4 న ప్రపాంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా చికిరి చికిరి పాట గ్లోబల్ వైడ్ గా సృష్టించిన సెన్సేషన్ వేరే లెవెల్ అనే చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడిన […]

Peddi trailer launch event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మేనియా మొదలైంది. జూన్ 4 న ప్రపాంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా చికిరి చికిరి పాట గ్లోబల్ వైడ్ గా సృష్టించిన సెన్సేషన్ వేరే లెవెల్ అనే చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడిన పాట ఇది. యూట్యూబ్ లో కేవలం తెలుగు వెర్షన్ నుండి 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈమధ్య కాలంలో ఒక స్టార్ హీరో సినిమా పాటకు ఈ రేంజ్ వ్యూస్ రావడం అనేది గతంలో ఎక్కడా జరగలేదు. దీనిని బట్టీ ఈ చిత్రానికి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు పట్టుమని 26 రోజులు కూడా లేవు , కానీ మేకర్స్ అప్డేట్స్ ఇవ్వడం లేదనే బాధ అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 16 న విడుదల చేయబోతున్నారట. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కాదు , భోపాల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి మహేంద్ర సింగ్ ధోని ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశం ఉందట. రామ్ చరణ్ కి ధోని తో ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు కలిసి చాలా ఏళ్ళ క్రితం పెప్సీ యాడ్ లో కూడా కనిపించారు. ఈమధ్య కాలం లో రెండు మూడు సార్లు కలిశారు కూడా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమా ప్రొమోషన్స్ కోసం ధోని వస్తున్నాడు అనే న్యూస్ రావడంతో సోషల్ మీడియా అంతటా పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం IPL లో కూడా పాల్గొనని ధోని , రామ్ చరణ్ ఈవెంట్ కోసం వస్తున్నాడంటే , వీళ్ళ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్థం చేసుకోండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు , ఈ ఈవెంట్ లో AR రెహమాన్ లైవ్ గా ఒక పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వబోతున్నాడు అట. ఇప్పటి వరకు రెహమాన్ ఒక సినిమాకు ఇలా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆయన ప్రత్యేకంగా లైవ్ కన్సర్ట్స్ జరిపిన సందర్భాలు ఉన్నాయి కానీ , సినిమాల ఈవెంట్స్ లో మాత్రం చాలా తక్కువ. నార్త్ ఇండియా లో కచ్చితంగా ఈ ఈవెంట్ మంచి హైప్ ని క్రియేట్ చేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper