Homeఎంటర్టైన్మెంట్Samantha Latest Video: నాగ చైతన్య ని చూసి పరుగులు తీసిన సమంత.. సంచలనం రేపుతున్న...

Samantha Latest Video: నాగ చైతన్య ని చూసి పరుగులు తీసిన సమంత.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ వీడియో..

Samantha Latest Video: సమంత , నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు వాళ్లిద్దరూ ఒకరిని ఒకరు ఎదురుపడిన సందర్భాలు లేవు. అయితే సమంత కొన్ని ఇంటర్వ్యూస్ లో తన మాజీ భర్త గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు చాలా ఘాటుగా సమాదానాలు ఇవ్వడం మనమంతా చూశాం . నేను , అతను ఒక రూమ్ లో ఉంటే, మారణాయుధాలు ఆ రూమ్ లో ఉండకుండా చూస్తే బెటర్ అంటూ ఆమె అప్పట్లో చేసిన సంచలన […]

Samantha Latest Video: సమంత , నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు వాళ్లిద్దరూ ఒకరిని ఒకరు ఎదురుపడిన సందర్భాలు లేవు. అయితే సమంత కొన్ని ఇంటర్వ్యూస్ లో తన మాజీ భర్త గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు చాలా ఘాటుగా సమాదానాలు ఇవ్వడం మనమంతా చూశాం . నేను , అతను ఒక రూమ్ లో ఉంటే, మారణాయుధాలు ఆ రూమ్ లో ఉండకుండా చూస్తే బెటర్ అంటూ ఆమె అప్పట్లో చేసిన సంచలన కామెంట్స్ ని ఎంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే నాగ చైతన్య మాత్రం సమంత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా మంచిగా మాట్లాడేవాడు , ఆమెతో కలిసి సినిమా చేయడానికి కూడా సిద్దమే అంటూ ఒక ఇంటర్వ్యూ లో అప్పట్లో చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య వ్యాఖ్యలను అప్పట్లో నెటిజెన్స్ సమర్ధించారు. ఇకపోతే రీసెంట్ గా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే మూడు రోజుల క్రితం ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి నాగ చైతన్య తన సతీమణి శోభిత తో హాజరు అవ్వగా, సమంత తన భర్త రాజ్ నిడిమోరు తో కలిసి హాజరయ్యాడు. అయితే ముందుగా సమంత , రాజ్ లు కలిసి వధూవరుల వద్దకు వెళ్లి ఆశీర్వదించారు. ఇంతలోపే స్టేజి మీదకు నాగ చైతన్య రావడం మొదలు పెట్టాడు. ఆయన్ని దూరం నుండి చూసిన సమంత వెంటనే స్టేజి నుండి వెళ్ళిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజెన్స్ సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్స్ వేయడం మొదలు పెట్టారు. సమంత ఫ్యాన్స్ నాగ చైతన్య ని ట్రోల్ చేయగా, నాగ చైతన్య ఫ్యాన్స్ సమంత ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇరువురి ఫ్యాన్స్ మధ్య ఇప్పట్లో ఫ్యాన్ వార్స్ ఆగేలా లేవు.

ఇక వీళ్లిద్దరి కెరీర్ విషయానికి వస్తే , సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో నటించింది. జూన్ 19 న ఈ చిత్రం విడుదల కాబోతుంది . ‘ఓ బేబీ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. ముందుగా మే 14 న విడుదల చేద్దామని అనుకున్నారు కానీ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో జూన్ 19 కి వాయిదా వేశారు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే , ‘తండేల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ‘వృష కర్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం పేక్షకుల ముందుకు రాబోతుంది .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper