Home Blog Page 300

TVS iQube new scooter: TVS నుంచి కొత్త స్కూటర్.. దీని అప్గ్రేడ్ తెలిస్తే కొనడానికి రెడీ అవుతారు..

0

TVS iQube new scooter: కాలం మారుతున్న కొద్ది వినియోగదారుల అవసరాలు, అభిరుచులు మారిపోతున్నాయి. ముఖ్యంగా వాహనాల కొనుగోలు విషయంలో కస్టమర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త వాహనాలు ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) కొత్త స్కూటర్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ ‘ఐక్యూబ్’ (iQube)లో సరికొత్త TVS iQube S 4.7 kWh వేరియంట్‌ను మే 2026లో భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పాత 3.5 kWh బ్యాటరీ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ రేంజ్ ఇచ్చేలా ఈ ప్రీమియం మోడల్‌ను కంపెనీ రూపొందించింది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కిందికి వెళ్ళండి..

TVS iQube కొత్త స్కూటర్ లో ఉండే ప్రధాన ఆకర్షణ కొత్త బ్యాటరీ. ఇందులో 4.7 kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఐడీసీ (IDC) సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ బ్యాటరీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ ఏకంగా 175 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీంతో రోజువారీ సిటీ ప్రయాణాలకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఇందులోని బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి పోర్టబుల్ ఛార్జర్‌తో కేవలం 4 గంటల సమయం పడుతుంది.ఈ స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 5.9 bhp పవర్, 140 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

గరిష్టంగా ఈ స్కూటర్ గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అలాగే 4.3 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఈ మోటార్, బ్యాటరీకి IP67 రేటింగ్ ఉండటం వల్ల నీరు, దుమ్ము నుండి వీటికి రక్షణ లభిస్తుంది.

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐక్యుబ్ స్కూటర్ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో 7 అంగుళాల TFT డిస్ప్లే ఉండగా.. ఇది జోయ్‌స్టిక్ కంట్రోల్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. అలాగే 118కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. అలెక్సా వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/SMS అలర్ట్లు, డిస్టెన్స్ టు ఎంప్టీ (DTE) వంటివి రైడర్లను ఆకర్షిస్తున్నాయి. సీటు కింద 32 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ ఉండడంతో ఇందులో రెండు హెల్మెట్లను సులభంగా ఉంచుకోవచ్చు. రివర్స్ మోడ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, క్రాష్ అలర్ట్ మరియు ఫాల్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7 kWh వేరియంట్ ధరను సుమారు రూ.1.37 లక్షలు గా నిర్ణయించారు. ఇది టైటానియం గ్రే మాట్టేతో పాటు కొత్తగా ‘మాగ్నిఫిసెన్స్ పర్పుల్ బీజ్’, ‘హార్లెకిన్ బ్లూ బీజ్’ వంటి ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 3,300 కంటే ఎక్కువ టీవీఎస్ డీలర్‌షిప్‌లలో ఇది అందుబాటులో ఉంది. ఎక్కువ రేంజ్, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఈ TVS iQube S 4.7 kWh ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

Peddi overseas bookings: ‘ఓజీ’ కి దరిదాపుల్లో రాలేకపోయిన ‘పెద్ది’ ఓవర్సీస్ బుకింగ్స్..మొదటి 24 గంటల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Peddi overseas bookings: గత ఏడాది దసరా కానుకగా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఓపెనింగ్స్ లో అయితే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా #RRR తో సమానంగా రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని చూసి ట్రేడ్ విశ్లేషకులు నోరెళ్లబెట్టారు. కేవలం నార్త్ అమెరికా నుండే ప్రీమియర్ షోస్ ద్వారా 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది. కేవలం ప్రీ సేల్స్ ద్వారానే 2.6 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతుందని అందరూ భావించారు కానీ , ఓవర్సీస్ కి ప్రింట్స్ సరైన సమయానికి చేరకపోవడం వల్ల కుదర్లేదు. లేదంటే ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చేదని విశ్లేషకులు చెప్తున్నారు.

అయితే ఈ రికార్డు ని ‘పెద్ది’ చిత్రం కచ్చితంగా బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే మార్కెట్ లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు, పైగా చాలా రోజుల నుండి ఆడియన్స్ సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. దాదాపుగా వెయ్యి షోస్ తో అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించగా, 5 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 1 లక్షా 45 వేల వరకు వచ్చింది. ఇది మొదటి 24 గంటల్లో వచ్చిన గ్రాస్ వసూళ్లు. అయితే ఓజీ చిత్రానికి మొదటి 24 గంటల్లో వచ్చిన గ్రాస్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం , ఓజీ చిత్రానికి మొదటి 24 గంటల్లో 2 లక్షల 67 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఆ తర్వాతి స్థానం లో పెద్ది చిత్రం 1 లక్షా 45 వేల తో రెండవ స్థానం లో కొనసాగుతుంది. మూడవ స్థానంలో కల్కి చిత్రం 1 లక్షా 34 వేలతో కొనసాగుతుండగా, దేవర చిత్రం 1 లక్షా 22 వేల డాలర్లతో నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం 85 వేల గ్రాస్ తో 5 వ స్థానంలో కొనసాగుతుంది. పెద్ది కి 24 గంటల్లో మంచి గ్రాస్ వచ్చింది కదా, కాని అనుకున్నంత గ్రాస్ రాలేదని ఎలా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. పైన చెప్పిన సినిమాల్లో షోస్ పెంచే కొద్దీ వేరే లెవెల్ గ్రాస్ నమోదు అయ్యింది. కానీ ‘పెద్ది’ కి ఏకంగా వెయ్యి షోస్ తో బుకింగ్స్ ని మొదలు పెట్టారు , హైప్ ప్రకారం 3 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి , కానీ అంత రేంజ్ లో రాలేదు , రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.

Bangladesh anti India moves: భారత్ కు వ్యతిరేకంగా బంగ్లా అడుగులు.. చైనా తో కలిసి పెద్ద స్కెచ్

Bangladesh anti India moves: భారత్‌కు చుట్టూ ఉన్న పొరుగు దేశాలు ఇప్పుడు రెండు ప్రధాన విభాగాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి భారత్‌కు అనుకూలంగా, మరొకటి చైనా వైపు లాక్కొనే దేశాలు. నేపాల్, భూటాన్, శ్రీలంక వంటివి చాలా కాలంగా చైనాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ చైనా‑పరిధిలోకి జారుతున్నట్లు కనిపిస్తోంది.

గతంలో భారత్ కు అనుకూలంగా..
షేక్ హసీనా ప్రధానిగా ఉన్న కాలంలో బంగ్లాదేశ్ భారత్‌కు అనుకూలంగా ఉండేది. దశాబ్దాలపాటు సత్సంబంధాలు కొనసాగాయి. కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన బిఎన్ పీ పార్టీ చైనాకు ఎక్కువగా అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీస్తా నది ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ద్వారా భారత్‌కు స్పష్టమైన సందేశం పంపింది. ఇది కేవలం జలీయ ప్రాజెక్టు కాదు, ఒక వ్యూహాత్మక మలుపు.

జలం పేరుతో రాజకీయం..
తీస్తా నది తూర్పు హిమాలయాల్లో ఉద్భవించి సిక్కిం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ నది బంగ్లాదేశ్‌లో కోట్లాది ప్రజలకు వ్యవసాయం, ఉపాధి, జల సరఫరా అందిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీస్తా నది పునరుద్ధరణ, నిర్వహణ ప్రాజెక్టు (Teesta River Comprehensive Management & Restoration Project – TRCMRP) కోసం చైనా సహకారం కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహ్మాన్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యి, తీస్తా ప్రాజెక్టుపై చర్చించి, చైనా అంగీకారం పొందినట్లు సమాచారం.

భారత్‌కు షాక్?
భారత్‌కు ఈ నిర్ణయం షాక్ అని చెప్పాలి. నాలుగు ముఖ్య ప్రభావాలు చూపుతుంది. తీస్తా ప్రాజెక్టు భారత్‌లోని నీటి పారుదల విధానాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. చైనా పాల్గొంటే, నీటి ప్రణాళికలు, స్టార్చ్ ఫ్లో, డ్రై సీజన్ నిర్వహణపై భారత్ నియంత్రణ కోల్పోతుంది. చైనా‑పాకిస్తాన్‑బంగ్లాదేశ్ మధ్య త్రయస్వభావపు సమావేశాలు, ఒప్పందాలు పెరుగుతున్నాయి. ఈ కూటమి భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాన్ని బలపరుస్తూ ప్రాంతీయ భద్రతా సమతుల్యతకు భంగం కలిగించే ప్రమాదం ఉంది.

పరోక్ష ఆర్థిక ఒత్తిడి..
బంగ్లాదేశ్‌కు చైనా నుంచి వచ్చే సబ్‌సిడీలు, రుణాలు, పెట్టుబడులు భారత్‌కు స్పర్ధను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తీస్తా ప్రాజెక్టు కేవలం “పునరుద్ధరణ” కాకుండా, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక ప్రభావం కలిగించే ప్రాజెక్టుగా మారుతుంది. భౌగోళిక రాజకీయ సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

Health Tips Reality Check: ఈ ఆరోగ్య చిట్కాలు నిజంగా పనిచేస్తాయా..

0

Health Tips Reality Check: ఒకప్పుడు కొన్ని మంచి మాటలను పెద్దలు మాత్రమే చెప్పేవారు. వీటిలో ఆరోగ్య ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఎన్నో ఇంటి చిట్కాలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అవగాహన లేకుండా కొందరు సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను వినిపిస్తూ ఉంటున్నారు. అయితే వీటిలో కొన్ని నిజం కూడా కావచ్చు. కానీ వాటిని పాటించే ముందు సరైన వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. వీటిలో కొన్నిటి గురించి ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి ఆ చిట్కాలు..? వీటివల్ల నిజంగానే ఆరోగ్యం బాగుపడుతుందా..?

కిడ్నీ స్టోన్‌కు యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగమా?

యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్ కొన్ని రకాల చిన్న కిడ్నీ రాళ్లను క్రమంగా మృదువుగా చేయడంలో సహాయపడొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది శరీరంలో pH సమతుల్యాన్ని మెరుగుపరచి మూత్ర ప్రవాహాన్ని పెంచడంలో సహకరించవచ్చు. అయితే పెద్ద స్టోన్లు లేదా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు కేవలం దీనిపై ఆధారపడటం ప్రమాదకరం. అధికంగా తీసుకుంటే కడుపు మంట, దంతాల దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వైద్యుల సలహాతో మాత్రమే వినియోగించడం మంచిది.

వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ బ్లాకేజ్ తొలగిపోతుందా?

వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయులను కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడొచ్చు. అయితే ఇప్పటికే గుండె రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాకేజీలను పూర్తిగా కరిగించే శక్తి వెల్లుల్లికి లేదు. క్రమమైన వ్యాయామం, తక్కువ నూనె ఆహారం, అవసరమైతే మందులు కూడా వాడితేనే సమస్యను నియంత్రించగలవు.

నిమ్మరసం ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుందా?

నిమ్మరసంలో విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్ పనితీరుకు కొంత మేలు చేయవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, బరువు నియంత్రణలో ఉండటం వంటి ప్రయోజనాలు కలగొచ్చు. అయితే ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గాలంటే ముఖ్యంగా బరువు తగ్గడం, చక్కెర-నూనె పదార్థాలు తగ్గించడం, వ్యాయామం చేయడం అవసరం. నిమ్మరసం ఒక్కటే దీనికి పూర్తి పరిష్కారం కాదు.

మలబద్ధకం పోవాలంటే గోరువెచ్చని నీరు ఎందుకు మంచిది?

మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం చాలా ఉపయోగకరం. పండ్లు, కూరగాయలు, ఓట్స్, గింజలు వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు గోరువెచ్చని నీరు తాగడం వల్ల ప్రేగుల కదలికలు చురుకుగా మారి మలం సాఫీగా బయటకు రావడానికి సహాయపడుతుంది. అయితే నీరు తక్కువగా తాగుతూ ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత పెరగొచ్చు. కాబట్టి రెండూ సమతుల్యంగా అవసరం.

యూరిక్ యాసిడ్ తగ్గడానికి పసుపు నీరు ఉపయోగమా?

పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కీళ్ల నొప్పులు, వాపు తగ్గించడంలో సహాయపడొచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారిలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను కొంత తగ్గించే అవకాశం ఉంది. అయితే శరీరంలో ఏర్పడిన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పూర్తిగా కరిగిపోవడానికి కేవలం పసుపు నీరు సరిపోదు. నీరు ఎక్కువగా తాగడం, మాంసాహారం తగ్గించడం, వైద్యులు సూచించే మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇంటి చిట్కాలు కొన్ని సందర్భాల్లో ఉపశమనం ఇవ్వొచ్చు. కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఇవి పూర్తి చికిత్సగా భావించడం సరైంది కాదు. ఆరోగ్య సమస్యలు ఎక్కువ రోజులు కొనసాగితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

Gajakesari Yoga 2026 dates: ఈ ఏడాది ఏ తేదీల్లో గజకేసరి యోగం.. ఏ రాశుల వారికి అనుకూలం..

Gajakesari Yoga 2026 dates: జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన యోగాల్లో ‘గజకేసరి యోగం’ ఒకటి. చంద్రుడు, గురువుతో కలిసి కేంద్రం ఏర్పడినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. దాదాపు ప్రతి నెలలో ఒకసారి గజకేసరి ప్రభావం కనిపిస్తుంది. ‘గజ’ అంటే ఏనుగు, ‘కేసరి’ అంటే సింహం. ఏనుగు లాంటి జ్ఞానం, సింహం లాంటి ధైర్యం కలిగిన వ్యక్తిత్వాన్ని ఈ యోగం సూచిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం ఉన్నవారికి తెలివితేటలు, గౌరవం, సంపద, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని విశ్వసిస్తారు.

గజకేసరి యోగం ప్రభావంతో వ్యక్తికి ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారాభివృద్ధి, సమాజంలో గౌరవం లభిస్తాయని భావిస్తారు. అలాగే మానసిక ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతాయని చెబుతారు. అయితే గురుడు, చంద్రుడు బలంగా ఉన్నప్పుడే ఈ యోగం పూర్తి ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్య గ్రంథాలు పేర్కొంటున్నాయి.

2026లో గజకేసరి యోగం ఎప్పుడు ఏర్పడుతుంది?

2026లో గురుడు-చంద్రుడు సంయోగం దాదాపు 13 సార్లు ఏర్పడనుందని జ్యోతిష్య గణనలు చెబుతున్నాయి. జనవరి 4, 31.. ఫిబ్రవరి 27.. మార్చి 26, ఏప్రిల్ 23, మే 20, జూన్ 17, జూలై 29, సెప్టెంబర్ 8, అక్టోబర్ 6, నవంబర్ 3, 30.. డిసెంబర్ 27 తేదీల్లో గజకేసరి యోగం ఏర్పడనుంది.

వృషభ:
2026లో గజకేసరి యోగం ప్రభావంతో వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు లాభాలను ఇవ్వవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు.

మిథున:
మిథున రాశి వారికి ఈ యోగం కెరీర్ పరంగా ఎంతో అనుకూలంగా ఉండొచ్చు. ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్ అవకాశాలు పెరగవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కన్య:
కన్య రాశి వారికి ఈ కాలం విజయాలను అందించే సమయంగా భావిస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో పురోగతి ఉండవచ్చు. గతంలో ఎదురైన సమస్యలు తగ్గి కొత్త ఆరంభాలకు మార్గం సుగమం కావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం కూడా పెరుగుతుంది.

తుల:
తులా రాశి వారికి వ్యాపార లాభాలు పెరిగే అవకాశం ఉంది. గృహసంబంధ విషయాల్లో శుభవార్తలు వినిపించవచ్చు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మానసిక ప్రశాంతత లభించవచ్చు. దాంపత్య జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపించవచ్చు.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి ఈ యోగం ఎంతో శుభప్రదంగా ఉండొచ్చని చెబుతున్నారు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు. వివాహితుల జీవితంలో సంతోషం పెరుగుతుంది. విదేశీ అవకాశాలు, ప్రయాణాలు కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ధైర్యం పెరిగి ముఖ్య నిర్ణయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడు, చంద్రుడు బలమైన స్థితిలో ఉన్నప్పుడే గజకేసరి యోగం ఏర్పడుతుంది. రాహు, కేతు, శని వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటే ఈ యోగం మరింత శుభఫలితాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మంచి ఆలోచనలు, దానం, గురువుల ఆశీర్వాదం వల్ల ఈ యోగ ప్రభావం పెరుగుతుందని విశ్వసిస్తారు.

Former Union Minister to Join YCP: వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి?!

Former Union Minister to Join YCP: రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు జగన్. ఈనెల 15 తర్వాత ఏపీకి రానున్నారు. వచ్చిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పర్యటనల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటన మొదలుపెట్టనున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి ప్రారంభం కానుంది జగన్ పర్యటన. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో నేరుగా మాట్లాడతారు. వారి అభిప్రాయాలను తీసుకుంటారు. నేతల విషయంలో ఫీడ్ బ్యాక్ సైతం ఉంటుంది. పనిలో పనిగా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల ఖరారు కూడా జరుపుతారని ప్రచారం సాగుతోంది. మూడేళ్ల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తే గెలుపు గుర్రాలు అవుతారని భావిస్తున్నారు అట. ఈ క్రమంలో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు ఖరారు చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం కాంగ్రెస్లో..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కిల్లి కృపారాణి. మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె వైసీపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో కృపారాణిది ఒక చరిత్ర. ఒక సాధారణ వైద్యురాలిగా ఉన్న ఆమె 2003లో రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా 2004 ఎన్నికల్లో పోటీ చేశారు. ఎర్రం నాయుడు చేతిలో ఓడిపోయారు. 2009లో అదే ఎర్రం నాయుడు పై గెలిచి జైంట్ కిల్లర్ గా నిలిచారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం కూడా దక్కించుకున్నారు. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ నేతలంతా వెళ్లిపోయారు. కానీ కృపారాణి మాత్రం అదే కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు.

ఎన్నో రకాల ప్రయోగాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం పార్లమెంటు సీటు ఆ పార్టీకి చిక్కలేదు. 2014 ఎన్నికల్లో అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత రెడ్డి శాంతిని ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అయితే తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ను ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా వర్కౌట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచింది.. కానీ ఇక్కడ మాత్రం రామ్మోహన్ నాయుడు రెండోసారి గెలిచారు. 2024 ఎన్నికల్లో పేరాడ తిలక్ ను ప్రయోగించారు జగన్. ఈ నిర్ణయం అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. రామ్మోహన్ నాయుడు ఘన విజయం సాధించడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కీలకమైన పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయనను ఓడించాలి అంటే ఒక సీనియర్ నేత అవసరం. అందుకే కిల్లి కృపారాణిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసమే కృపారాణి వైసీపీలో చేరారు. కానీ జగన్ మొండి చేయి చూపడంతో ఆవేదనతో బయటకు వెళ్లిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు జగన్ పిలిచినా ఆమె వస్తారా? రారా? అన్నది తెలియాల్సి ఉంది.

Mithun Chakraborty respects Chandrababu: చంద్రబాబు కాలికి నమస్కరించిన ఆ భారతీయ దిగ్గజ నటుడు!

Mithun Chakraborty respects Chandrababu: పశ్చిమ బెంగాల్లో( West Bengal) కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బిజెపి తొలి ముఖ్యమంత్రిగా సువేందూ అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పక్ష సీఎంలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకాగా ఆయనకు కేంద్ర పెద్దలనుంచి ఆత్మీయ గౌరవం అందింది. ప్రస్తుతం ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. అందుకే ప్రత్యేక ఆహ్వానం అందింది. కార్యక్రమానికి హాజరయ్యారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా పలకరించారు చంద్రబాబును. సహచర ముఖ్యమంత్రులు సైతం చంద్రబాబును పలకరించారు. ఆత్మీయ నమస్కారాలతో సాగింది కార్యక్రమం. చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. అయితే ఉన్నట్టుండి ఓ వ్యక్తి వచ్చి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారీ భద్రత నడుమ..
సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) పాల్గొన్న కార్యక్రమం.. అతిరథ మహారధులైన కేంద్రమంత్రులు.. దాదాపు 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావడంతో.. ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. భారీ నిఘా ఉంది. ఈ తరుణంలో ఓ వ్యక్తి తలపాగా ధరించి, కుర్తా జమాతో వచ్చారు. అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కాళ్లకు దండం పెట్టారు. చంద్రబాబు సైతం ఆయనను పైకి ఏపీ సముదాయించారు. ఆత్మీయంగా హత్తుకున్నారు. అయితే ఆయన ఎవరు అనే దానిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ కాగా.. చంద్రబాబు కాలికి నమస్కరించిన వ్యక్తి మిధున్ చక్రవర్తిగా తేలింది.

ప్రస్తుతం బిజెపిలో..
ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు మిథున్ చక్రవర్తి( Mithun Chakravarti ). బాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్. అక్కడి బెంగాలీ చిత్రాల్లో రాణించి తర్వాత బాలీవుడ్ లో ప్రవేశించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎన్నెన్నో ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే రాజకీయ ఎంట్రీ మాత్రం తృణముల్ కాంగ్రెస్ ద్వారా జరిగింది. 2014లో తృణమూల్ కాంగ్రెస్ ద్వారా రాజ్యసభకు ఎంపికయ్యారు మిధున్ చక్రవర్తి. అయితే 2016లో రాజ్యసభ పదవితో పాటు తృణమూల్ కాంగ్రెస్కు రాజీనామా చేశారు. 2021 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. అలా చేరిన మిథున్ చక్రవర్తిని ఆ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. కానీ అప్పట్లో బీజేపీకి గెలుపు తట్టలేదు. ఈ ఎన్నికల్లో సైతం బిజెపికి మద్దతుగా ప్రచారం చేశారు. బిజెపి అధికారంలోకి రావడంతో సంతోషించారు. అందుకే సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మిధున్ చక్రవర్తి. వేదికపై అంతమంది ఉండగా చంద్రబాబు కాలికి నమస్కరిస్తూ మిధున్ చక్రవర్తి ఆశీర్వాదం తీసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక దిగ్గజ నటుడు టిడిపి అధినేత చంద్రబాబును ఇలా కాలికి నమస్కరించడం అనేది జాతీయస్థాయిలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.

Dubai investment tips: దుబాయ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. కాస్త ఆలోచించండి!

Dubai investment tips: ఇరాన్-అమెరికా ఘర్షణలు, ఇజ్రాయిల్‌తో అబ్రహం అకార్డ్స్ ఒప్పందాలు మధ్యప్రాచ్య రాజకీయాలను తీవ్రతరం చేశాయి. దుబాయ్, యూఏఈ ఆర్థిక హబ్‌గా గతంలో స్థిరత్వానికి చిహ్నంగా నిలిచినప్పటికీ, ఇప్పుడు భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఇరాన్ దాడులు, ప్రాంతీయ శత్రుత్వాలు దుబాయ్‌ను పొటెన్షియల్ లక్ష్యంగా మార్చాయి. అరబ్ అలయన్స్‌లో కూడా ఏకాభిప్రాయం లేకపోవడం పరిస్థితిని సంక్లిష్టం చేస్తోంది.

గతంలో స్వేచ్ఛ, భద్రత..
గత దశాబ్దాల్లో దుబాయ్ మహిళలకు, విదేశీయులకు అసలైన స్వేచ్ఛా ఊపిరి అందించింది. అర్ధరాత్రి ఒంటరి సంచారం కూడా సాధారణం. ముస్లిం దేశంగా ఉంటూ రక్షణా వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయి. కానీ ఇప్పుడు భౌగోళిక ఉద్రిక్తతలు ఈ భావనను దెబ్బతీశాయి. ఇజ్రాయిల్‌తో డిఫెన్స్ డీల్ ఇరాన్ కోపాన్ని మరింత పెంచింది. దుబాయ్‌పై దాడి ప్రమాదాలను పెంచాయి. ఫలితంగా, జీవన శైలి స్వేచ్ఛలు, భద్రతా భరోసా క్షీణించాయి.

పెట్టుబడితో ప్రయోజనాలు తక్కువే..
ప్రస్తుతం దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్కీగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్, టూరిజం, ఫైనాన్షియల్ హబ్‌లు గతంలో భారీ రాబడి ఇచ్చాయి, కానీ ఇప్పుడు భద్రతా అనిశ్చితులు వాటిని ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే ఆస్తి విలువలు పడిపోవచ్చు, టూరిస్ట్ రద్దులు ఆదాయాలను తగ్గించవచ్చు. అయితే, యూఏఈ ప్రభుత్వం డైవర్సిఫైడ్ ఎకానమీ, బలమైన డిఫెన్స్ ఒప్పందాలతో పునరుద్ధరణ అవకాశం ఉంది. గత రాబడుల స్థాయి పునరావృతం కాకపోయినా, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇంకా పొటెన్షియల్ ఉంది.

దుబాయ్ పెట్టుబడులు పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు, కానీ వైవిధ్యీకరణ తప్పనిసరి. షార్జా, అబుదాబి వంటి ప్రాంతాలు మార్గాలుగా పరిగణించండి. ప్రస్తుత ఉద్రిక్తతలు తాత్కాలికమేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు, కానీ షార్ట్-టర్మ్ రిస్క్‌లు ఉన్నాయి.

Bandi Sanjay Son Sai Bhagirath: ‘బండి’కి తనయుడి తలపోటు.. మొన్న దాడి.. నేడు పోక్సో?

Bandi Sanjay Son Sai Bhagirath: బండి సంజయ్‌ కరుడుగట్టిన హిదుత్వవాది. బీజేపీ కోసం, హిందుత్వం కోసం ఎంతకైనా తెగించే నేత. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న బండి సంజయ్‌ కార్పొరేటర్‌గా కరీంనగర్‌లో రాజకీయం మొదలు పెట్టాడు. అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పార్టీకి తెలంగాణలో మంచి ఊపు తెచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా వద్ద బండికి మంచి గుర్తింపు ఉంది. అయితే కష్టపడి ఎదిగిన బండికి పుత్రుడు తలనొప్పిగా మారాడు. గతంలో హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో సహచర విద్యార్థులపై దాడిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.

హనీట్రాప్‌ అని ఫిర్యాదు..
కొంపల్లి కుటుంబం తన కూతురును అడ్డు పెట్టుకుని బండి సంజయ్‌ కొడుకు సాయి భగీరథ్‌ను హనీట్రాప్‌లోకి లాగి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఈ కుటుంబం భగీరథ్‌తో సంబంధం ఉన్న వీడియోలు ఉపయోగించి రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తోందని, డిసెంబర్‌ నుంచి ఇది కొనసాగుతోందని పేర్కొంటున్నాడు. ఇలాంటి కేసుల్లో మొదట్లో బాధితుడు భయం, సామాజిక సమస్యల కారణంగా ఫిర్యాదు చేయలేదు. కానీ నిందితుడు ఇక్కడ రాజకీయ నేత కొడుకు కావడం ఈ అంశాన్ని మరింత కాంప్లికేటెడ్‌గా మారుస్తోంది.

మైనర్‌ను అడ్డం ఫెట్టుకుని..
ఓ మహిళ మైనర్‌ అయిన తన కూతరును అడ్డం పెట్టుకుని హనీట్రాప్‌కు యత్నించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకే భగీరత్‌ ఇప్పుడు కేసు పెట్టారని పేర్కొంటున్నారు. ఇది హనీట్రాప్‌‑సైబర్‌ ఎక్సా్టర్షన్‌ కేసు కావచ్చు, లేదా యువ ప్రేమకథను వాడుకుని చేసిన పెద్ద కుట్ర కావచ్చు.

ఇప్పుడే ఎందుకు ఫిర్యాదు?
డిసెంబర్‌ నుంచి బ్లాక్‌మెయిల్‌ జరుగుతోందని చెప్పినా ఫిర్యాదు మాత్రం ఇప్పుడు ఎందుకు చేశాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తాజాగా కరీంనగర్‌ టూటౌన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

రాజకీయ డ్యామేజ్‌ కుట్ర..
బండి సంజయ్‌ అనుచరవర్గం ఈ హనీట్రాప్‌ కేసును స్పష్టమైన రాజకీయ కుట్రగా చిత్రిస్తోంది. బండి సంజయ్‌ను ఎదుర్కొనలేకనే వారి కుటుంబ ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలు వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హనీట్రాప్, బ్లాక్‌మెయిల్, సైబర్‌ క్రై మ్‌ లాంటి పదాలతో సాధారణ ప్రజల మనస్సుల్లో కుటుంబం మీద ప్రతికూల ఇమేజ్‌ పెంచడం లక్ష్యమని వారు చెబుతున్నారు.

లైంగికదాడి చేసినట్లు ఆరోపణ..
బరోవైపు బాధితురాలిగా చెబుతున్న బాలిక బగీరథ్‌ తనపై రెండుసార్లు లైంగికదాడి చేసినట్లు ఆరోపస్తోంది. ఈమేరకు హైదరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం వల్ల ఆమె రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, ఇప్పుడు అస్వస్థత, మానసిక ఆందోళనతో బాధ పడుతున్నట్లు బాలిక తల్లితండ్రులు చెబుతున్నారు.

పేట్‌ బషీరాబాద్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌..
బాలిక తల్లితండ్రులు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే బండి సంజయ్‌ ఒత్తిడికి పోలీసులు తలొగ్గే ప్రమాదం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లే ఆరోచనలో బాధితులు ఉన్నట్లు సమాచారం.

బండి సంజయ్‌ తనయుడు సాయి భగీరథ్‌పై ఇది మొదటి వివాదం కాదు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో, మహీంద్ర యూనివర్సిటీలో గొడవలు జరిగిన కేసులు ఉన్నాయి. తాజాగా పోక్సో కేసు ఘటన, హనీట్రాప్‌ అంశాలు సంచలనంగా మారాయి. మరి ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Vijay CM seat news: పాపం విజయ్.. సీఎం సీటు అందని ద్రాక్ష..

Vijay CM seat news: అందరిని ద్రాక్షపుల్లన అనే పాఠాన్ని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా.. ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ నిత్యం చదివాలేమో. ఎందుకంటే తమిళనాడులో పరిస్థితులు అలా మారిపోతున్నాయి మరి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నిన్న సాయంత్రం తమిళనాడు రాజకీయాలలో పరిణామాలు వేరే విధంగా మారిపోయాయి. టీవీకే అధినేత విజయ్ కి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, విసికె, ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. వారు మద్దతు ఇచ్చిన లేఖలను కూడా విజయ్ గవర్నర్ ముందు ఉంచినట్టు ప్రచారం జరిగింది. దీంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. చెన్నైలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని.. విజయ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారని.. కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారని వార్తలు వచ్చాయి.

రాత్రిలోగా పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు మినహా.. మిగతా పార్టీలు విజయ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఐయూఎంఎల్ మద్దతును ఉపసంహరించుకుంది. విసికె లేఖ ఇవ్వలేదు.. దీనిపై కూడా రాద్ధాంతం జరిగింది. ఫలితంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. దీంతో విజయ్ అనే నేను అనే మాట పలకకుండా ఆ పార్టీలు టీవీకే అధినేతకు బ్రేక్ వేస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది.. అనే ప్రశ్నను పక్కనపెడితే తమిళనాడులో రాజకీయాలు త్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ముగిసిపోతాయి.. విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఇప్పుడు అంతు పట్టకుండా ఉంది.

విజయ్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ మహాబలిపురంలోని రిసార్ట్ లో ఉంటున్నారు. కాంగ్రెస్ నేతలు అల్టిమేట్ గా సపోర్ట్ ఇచ్చారు. కమ్యూనిస్టులు కూడా ప్రభుత్వానికి బయటికి సపోర్ట్ ఇస్తామని.. తమకు మంత్రి పదవులు అవసరం లేదని చెప్పేశారు. కానీ ఇంతలోనే ఐయూఎంఎల్ మద్దతును ఉపసంహరించుకుంది. విసికె లేఖ ఇవ్వలేదు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. ప్రమాణస్వీకారం లేకపోవడంతో టీవీకే కార్యకర్తలు గందరగోళం లో పడిపోయారు.. విజయ్ లో కూడా నైరాశ్యం పెరిగిపోతుంది..

ఈ పరిణమాలతో టీవీకే కార్యకర్తలు రకరకాల చర్చలు జరుపుతున్నారు. అసలు విజయ్ ముఖ్య మంత్రి అవుతారా.. ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీలు ఊరుకుంటాయా.. ఇప్పటికే డిఎంకె, అన్నా డీఎంకే నేతలు కలిసిపోయారని అనుకుంటున్నారు. అలాంటప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీలు ఉద్యమాన్ని మొదలుపెడతాయి. అప్పుడు విజయ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని టీవీకే కార్యకర్తలు చర్చించుకుంటున్నారు..

Amit Shah Bengal master plan: అమిత్‌ షా బెంగాల్‌ మాస్టర్‌ ప్లాన్‌.. మమత కోటను ఎలా బద్దలు కొట్టాడంటే

Amit Shah Bengal master plan: అమిత్‌ షా పంతం పడితే ఏదైనా చేస్తాడనే ప్రచారం కేవలం భజన కాదు.. రాజకీయ వ్యూహం. మోదీ షా ద్వయం కలిస్తే రాజకీయాలను మార్చేస్తారని ఇప్పటికే నిరూపణ అయింది. తాజాగా బెంగాల్‌లో మమత బెనర్జీని గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్న అమిత్‌షా ఈసారి టార్గెట్‌ చేరుకున్నారు. 2021 ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌లో పోటీ చేసినప్పటికీ, బీజేపీకి ఫలితం అంతగా లభించలేదు. మమత సువేందు అధికారిని చాలేంజ్‌ చేసి ఆయన రాష్ట్రంలో ప్రచారం చేయకుండా బ్రేక్‌వేశారు. అయితే సువేందు చేతిలో మమత ఓడినా.. పార్టీని గెలిపించారు.

ఈసారిమమతను డిఫెన్స్‌లో పడేసి..
ఈసారి అమిత్‌ షా పథకం స్పష్టంగా రూపొందింది. సువేందుతో మమతను చాలెంజ్‌ చేయించారు. నందిగ్రామ్‌తోపాటు మమత కంచుకోట అయిన భవానీపూర్‌లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి మమత చాలెంజ్‌ స్వీకరించలేదు. ఈ నిర్ణయం వల్ల మమత ఎక్కువ ప్రచార శక్తిని ఒక్క చోటే సముపార్జించలేకపోయారు. రెండు పోటీ కేంద్రాల్లోనూ వారి శక్తి పక్షీకరణ జరిగింది.

సువేందు అధికారి ప్రచారం ఫలితం..
మమత ఓటుబ్యాంకులో బాగా కలిగిన మహిళా ఓట్లు, బెంగాల్‌ యువత మధ్య బీజేపీ ప్రభావం పెరిగింది. మమత అధికారంలో కొనసాగిన 15 ఏళ్ల అనుభవం ఇప్పుడు అభియోగాలకు మారిపోయింది. మమత కంచుకోటగా పేరు తెచ్చుకున్న భవానీపూర్‌ నుంచి ఆమె ఓడిపోయారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటు బ్యాంకులో బలంగా నిలబడిన ప్రాంతాల్లోనే ఇప్పుడు ఓటర్లు మార్పు చేసిన ఘటన చెప్పుకోవాలి.

అమిత్‌ షా మైక్రో ప్లానింగ్‌..
భవానీపూర్‌లో అమిత్‌ షా స్వయంగా ప్రచారంలో పాల్గొనడం కీలకంగా మారింది. కోల్‌కతాలోని ఈ ప్రాంతంలో దాదాపు 25 వేల గుజరాతీ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకున్న బీజేపీ ప్రచారం వల్ల వారు మమత కంటే బీజేపీవైపు మొగ్గారు. అమిత్‌ షా ప్రత్యేకంగా వీధుల్లో స్థానిక సమస్యలు, సురక్షిత ప్రదేశాలను గుర్తుచేసుకుని స్థానిక ఓటర్లతో సంభాషించాడు. ఓటింగ్‌ రోజు దాడులు, అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కేంద్ర బలగాలను మోహరించడం వల్ల పోలింగ్‌ సజావుగా జరిగింది. దీంతో మమత ముఖ్యంగా మహిళా ఓట్లు కోల్పోయారు. మమత ఓటుబ్యాంకు ఇప్పుడు బీజేపీ ఓటుబ్యాంకుగా మారింది.

మమత భవానీపూర్‌లో ఓడిపోవడం కేవలం ఒక స్థానిక పరాజయం కాదు.. అధికార పతనానికి ప్రారంభం. ముఖ్యంగా ఈ నియోజకవర్గం మమత కుటుంబంతో బాగా సంబంధం కలిగి ఉండేది. ఈ నియోజకవర్గంలో ఓడిపోవడం వల్ల మమత ఓటర్లకు ఆమె అధికార బలం దెబ్బతిందన్న భావన వచ్చింది. ఇదే సమయంలో బీజేపీ ప్రచారం వల్ల మరిన్ని ప్రాంతాల్లో మమత ఓటుబ్యాంకు బలం దెబ్బతింది.

Jagan shock to Duvvada: దువ్వాడకు జగన్ మార్క్ షాక్

Jagan shock to Duvvada: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సెలబ్రిటీ అంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి ఒక మహిళ కోసం జరిగిన కుటుంబ వివాదంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఇది తాత్కాలికమేనని.. తిరిగి తాను వైసీపీలో యాక్టివ్ అవుతానని దువ్వాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఫ్లేవరు, ఫేవర్ కనిపిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సైతం మొన్న ఆ మధ్యన ఏంటి శ్రీనివాస్ అని పలకరించే సరికి పులకించుకుపోయారు దువ్వాడ. ఇక తాను అడిగిందే తరువాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్ మోహన్ రెడ్డి తిరిగి ఆహ్వానిస్తారు అని భావించారు. కానీ ఇటీవల జగన్ వద్దకు వెళ్లిన దువ్వాడకు షాక్ కొట్టే విషయాన్ని చెప్పారు అధినేత. పార్టీలో చేరిక విషయంలో తానేం చేయలేనంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

దూకుడు కలిగిన నేత..
శ్రీకాకుళం జిల్లాలో దూకుడు కలిగిన నేతగా దువ్వాడ శ్రీనివాస్ కు పేరు ఉంది. దశాబ్దాల కిందట నుంచి కాంగ్రెస్లో రాజకీయాలు నడుపుతూ వచ్చారు. కానీ ఎందుకో చట్టసభలకు మాత్రం వెళ్లలేకపోయారు. కానీ ఆ ముచ్చట తీర్చారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడంతో శాసనమండలిలో అడుగుపెట్టారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా మూడుసార్లు ఛాన్స్ ఇచ్చారు. ఒక్కసారి కూడా నెగ్గుకు రాలేకపోయారు దువ్వాడ శ్రీనివాస్. కానీ కింజరాపు ఫ్యామిలీ పై దూకుడుగా అడుగులు వేయాలంటే దువ్వాడ ఉండాల్సిందేనని చెప్పి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోత్సహించారు. కానీ వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో పార్టీకి చేటు తెచ్చారు. అందుకే సస్పెన్షన్ వేటు పడింది.

ధర్మాన సోదరుల ప్రమేయంతో..
అయితే ప్రారంభంలో వైసిపి నేతల నుంచి ఏం హామీ వచ్చిందో తెలియదు కానీ.. ఆ పార్టీలో సీనియర్ నేతలైన ధర్మాన బ్రదర్స్ పై ఒంటికాలితో లేచారు దువ్వాడ. దానికి కాస్త కులం రంగు పులిమారు. వైసీపీలోకి వస్తే కాచుకోండి అంటూ తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా వైసీపీ లేకపోతే ఇండిపెండెంట్ ప్యానల్స్ తో ఓడిస్తాను అంటూ శపథం కూడా చేశారు. అయితే పార్టీలోకి వస్తానని చెప్పి ఇటీవల జగన్మోహన్ రెడ్డిని దువ్వాడ శ్రీనివాస్ కలిశారట. అయితే ధర్మాన సోదరులు పావులు కాదపడంతో జగన్మోహన్ రెడ్డి నో అని చెప్పారట. అయితే మొన్నటికి మొన్న తన వెనుక నిలిచిన వైసిపి పెద్దలు సైతం ఇప్పుడు ముఖం చాటేసారట. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల రాజకీయ ప్రకటనలు చేయలేదు. మరి జగన్ నో చెప్పిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Central leaders opinion on Chandrababu: చంద్రబాబు పై మారిన కేంద్ర పెద్దల అభిప్రాయం

Central leaders opinion on Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అక్కడ కొత్త సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ లో బిజెపి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 15 సంవత్సరాల మమతా బెనర్జీ పాలనకు తెరదించుతూ… అక్కడ కాషాయ పార్టీ జెండా ఎగురవేసింది. రాష్ట్రానికి బిజెపి తొలి సీఎం గా సువేందూ అధికారి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బిజెపి పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ పక్ష సీఎంలు కూడా హాజరయ్యారు. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం రావడంతో ఆయన ఈరోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ఇటీవల బీజేపీ పరంగా, ఎన్డీఏ పరంగా కార్యక్రమాలకు చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతూ వస్తున్నాయి. చంద్రబాబు సైతం పాల్గొంటున్నారు.

కీలక భాగస్వామి..
కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి పదవి చేపట్టేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందించింది ఏపీ. అందుకే రాష్ట్రానికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. రాజకీయంగాను ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నారు కేంద్ర పెద్దలు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రాజెక్ట్లు కేటాయిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీని బలమైన రాజకీయ మిత్రుడిగా మార్చుకున్నారు. 2014 నుంచి 2024 కంటే.. 2024 తరువాత కేంద్రంలో చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం పెరగడం విశేషం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పెద్దలు ప్రాధాన్యం ఇస్తుండగా.. చంద్రబాబు సైతం కేంద్ర పెద్దలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు.

అలా విడిపోయి..
2014లో తొలిసారిగా నవ్యాంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధాని కూడా అయ్యారు. ఆ సమయంలో కూడా తెలుగుదేశం కీలక భాగస్వామి ఎన్డీఏలో. కానీ జాతీయస్థాయిలో ఆ ఎన్నికల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఉంది. అందుకే టిడిపి పట్ల అప్పట్లో బీజేపీ నిర్లక్ష్యం చేసింది. ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యర్థుల ట్రాప్ లో పడి 2018లో ఎన్డీఏకు దూరమయ్యారు చంద్రబాబు. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా అడుగులు వేశారు. అందుకు 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను చవిచూశారు. రాజకీయంగాను ఇబ్బంది పడ్డారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని… కేంద్ర పెద్దలతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. తమ మధ్య వచ్చిన గ్యాప్ పూర్తిగా పోయేలా చేసుకున్నారు. అందుకే కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. అయితే ఈ పరిస్థితి వస్తుందని సగటు టిడిపి శ్రేణులకు నమ్మకం ఉండేది కాదు. అంతలా ఉండేది చంద్రబాబు విషయంలో కేంద్ర పెద్దల వైఖరి. కానీ ఇప్పుడు చంద్రబాబుకు ప్రాధాన్యం పెరుగుతుండడం.. ఎన్డీఏ తో పాటు బిజెపికి మంచి ఫలితాలు వస్తుండడంతో.. 2029 ఎన్నికల్లో కూడా డోకా ఉండదు అనే అభిప్రాయానికి వస్తున్నారు టిడిపి శ్రేణులు.

Chiranjeevi serious on Buchi Babu: పెద్ది’ సినిమా ఫస్ట్ కాపీ చూసి బూచి బాబు మీద సీరియస్ అయిన చిరంజీవి..

Chiranjeevi serious on Buchi Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్ కి తీసుకెళ్లిన వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం… కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన చిరంజీవి బీ, సీ సెంటర్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ మొత్తం అతని సినిమాలకు ఫిదా అయిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు ప్రతి ఒక్క అభిమాని పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే స్క్రీన్ మీద చిరంజీవిని చూసిన ప్రతి వ్యక్తి తనను తాను ఊహించుకుంటాడు. అంతలా ప్రేక్షకుడిని మైమరిపింప చేయగలిగే నటనని ప్రదర్శించగలిగే కెపాసిటి కూడా చిరంజీవికే సొంతమని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ సైతం ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు.

చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం పెద్ది సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. జూన్ 4వ తేదీన రిలీజ్ అవ్వనున్న పెద్ది సినిమా ఆర్ ఆర్ అయితే పూర్తయిందట. అయితే రీ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా మొత్తాన్ని ఒకసారి చిరంజీవి చూశారట…

ఇందులో చిన్న చిన్న కరెక్షన్స్ చిరంజీవి చెప్పారట. బుచ్చిబాబు కొన్ని విషయాల్లో లాజిక్స్ మర్చిపోతే వాటిని చిరంజీవి డైలాగ్స్ తో ఆ లాజిక్స్ ని కవర్ చేయొచ్చని చెప్పి మరి బుచ్చిబాబు తో చెప్పాడట. దానికి బుచ్చిబాబు కూడా ఓకే అన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా పెద్ది సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది. ఏ రేంజ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది అనేది చెప్పాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక రామ్ చరణ్ గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ మూవీతో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్నాడు. కాబట్టి ఈ మూవీ సక్సెస్ ఆయనకి చాప కీలకమనే చెప్పాలి…

Janasena solo battle: జనసేన ఒంటరి పోరు.. స్పష్టంగా చెప్పినా అర్థం కాకపోతే ఎలా!

Janasena solo battle: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒకటే ఆరాటం. కూటమి పార్టీల మధ్య గొడవలు రావాలి. వారు విడిపోవాలి. అచ్చంగా కుటుంబ బంధాలను విడగొట్టాలనే విలన్ మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిపై ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు జనసేన తన పార్టీ కార్యవర్గాల ఏర్పాటు పై దృష్టి పెడితే అటువంటి ప్రచారమే చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఒంటరిగా సిద్ధం అవుతుందంటూ అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తోంది. అయితే ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఇప్పుడు కూడా విఫల ప్రయత్నంగానే మిగలనుంది. ఎందుకంటే కూటమి మరో 15 ఏళ్ల పాటు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అటువంటి నేత ఒంటరి పోరాటానికి వెళ్తారా? అది నమ్మశక్యం కాని వార్త కూడా.

వైసీపీకి రానివ్వను అంటూ ప్రతిజ్ఞ
పవన్ కళ్యాణ్ ఒక ఆశయంతో పని చేస్తున్నారు. అధికారం కోసం కానే కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనతో ఏపీ 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిపోయిందని బలంగా భావిస్తున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. అందుకే పదే పదే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. తాను రాజకీయ ప్రయోజనాలకు కాదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్న విషయాన్ని పదేపదే గుర్తు చేస్తున్నారు. కచ్చితంగా సర్దుబాటు చేసుకోవాల్సిందేనని సొంత పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. జనసేన సైతం ఈ విషయంలో సెట్ రైట్ అయింది. జనసైనికులు సైతం తమ అధినేత అభిప్రాయాన్ని గుర్తించుకుంటున్నారు.

తేల్చి చెప్పిన చంద్రబాబు..
అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. చంద్రబాబు సైతం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల పార్టీ కార్యవర్గాల ప్రమాణస్వీకారంలో సీనియర్ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. కొంతమంది సీనియర్లకు వేరే అభిప్రాయం ఉందని.. కానీ తన అభిప్రాయం జనసేనతో పొత్తు అనేది ఉండాలన్నదే అంటూ తేల్చి చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అంటూ సంకేతాలు ఇచ్చారు. పొత్తు కోసం పిఠాపురంలో వర్మ నాయకత్వాన్ని తప్పించారు అంటే.. ఈ స్థాయిలో జనసేన కోసం ఆలోచిస్తున్నారో అర్థం అవుతుంది. ఇటువంటి సమయంలో కూడా జనసేన ఒంటరి పోరాటం, పొత్తు పెటాకులు, కూటమి విచ్ఛిన్నం వంటి మాటలతో వైసిపి చేసేదేమీ లేదు. ఒక్క కంఠ శ్వాస తప్ప..

Chiranjeevi: చిరంజీవి – నాగార్జున ఆ మూవీని రీమేక్ చేసి ఉంటే బాగుండేదా…

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన నుంచి వచ్చిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఎనలేని సేవలను అందిస్తున్న నటులు కూడా వాళ్లే కావడం విశేషం…70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక నాగార్జున లాంటి నటుడు సైతం అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను నిలబెడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాని చేస్తున్నాడు. ఇక చిరంజీవి – నాగార్జున కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుండేదని ఎప్పటినుంచో తమ అభిమానులైతే కోరుకుంటున్నారు కానీ అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు… తమిళంలో వచ్చిన ‘విక్రమ్ వేద’ సినిమాని తెలుగులో వీళ్ళిద్దరితో రీమేక్ చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు.

కారణమేంటంటే ఆ సినిమాని తెలుగులో కూడా చాలామంది చూసేసారు. దానివల్ల వీళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా కథను మార్పులు చేర్పులు చేసినా కూడా ఆ సినిమాకి అనుకున్న ఆదరణ దక్కకపోవచ్చనే ఉద్దేశ్యంతోనే వీళ్ళిద్దరు ఆ సినిమాకి నో చెప్పారు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో వెంకటేష్ కీలకపాత్రలో నటించాడు. కాబట్టి ఇటు చిరంజీవి అభిమానులు, అటు వెంకటేష్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి నాగార్జునతో కలిసి నటిస్తే కూడా అతని అభిమానులు పండుగ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది…ఒకవేళ ఈ కాంబో వర్కౌట్ అయితే మాత్రం ఇండియాలోనే ఈ మూవీ భారీ బజ్ క్రియేట్ చేసుకుంటుంది…ఇక ఇప్పుడు వీళ్లిద్దరు ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్లు చాలా బిజిగా ఉన్నారు…