Home Blog Page 298

Vijay CM Oath Ceremony: విజయ్ రేంజ్ అర్థమైంది.. ఎన్డీటీవీ నుంచి టీవీ9 వరకు.. రికార్డు స్థాయి వ్యూస్

Vijay CM Oath Ceremony: నేషనల్ మీడియా సౌత్ వార్తలకు అంతగా స్కోప్ ఇవ్వదు. ఏవైనా సంచలన వార్తలు ఉంటే తప్పా.. మిగతా విషయాలను అంతగా పట్టించుకోదు. దక్షిణ భారతదేశం మీద జాతీయ మీడియాకు మొదటి నుంచి కూడా చిన్న చూపే. నేషనల్ మీడియా సౌత్ ఇండియాకి సంబంధించిన వార్తలకు అంతగా ప్రయారిటీ ఇవ్వదు. కానీ తమిళనాడు రాజకీయాలలో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత నేషనల్ మీడియా మనసు మార్చుకుంది.

కొద్దిరోజులుగా తమిళ రాజకీయాలకు నేషనల్ మీడియా విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. ఆద్యంతం తమిళ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపించాయి. విజయ్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మిగతా పార్టీలు సపోర్ట్ ఇస్తామని చెప్పి లైట్ తీసుకున్నాయి. ఆ తర్వాత అనేక సందర్భాలలో ప్రభుత్వం ఏర్పడుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మద్దతు లేకపోవడంతో విజయ్ వెనుకడుగు వేయాల్సి వచ్చింది. రెండుసార్లు గవర్నర్ ను కలవాల్సి వచ్చింది. అయినప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోలేదు. మద్దతు లేఖలు ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటామని గవర్నర్ పేర్కొన్నారు.

శనివారం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఒప్పుకున్నారు. ఆదివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి నేషనల్ మీడియా నుంచి మొదలుపెడితే స్థానిక మీడియా వరకు ఆసక్తిని చూపించింది. ఫలితంగా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఎన్డి టీవీ నుంచి మొదలు పెడితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరకు చానల్స్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాయి. ప్రతి ఛానల్ లో కూడా విపరీతమైన వ్యూయర్షిప్ నమోదయింది
. విజయ్ మాట్లాడుతున్నంత సేపు వ్యూస్ అమౌంట్ అని పెరిగిపోయాయి. దీంతో విజయ్ కేవలం తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే కాకుండా.. దేశ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

విజయ్ తొలి ప్రసంగంలోని ఆకట్టుకున్నారు. కీలకమైన మూడు నిర్ణయాల మీద తొలి సంతకం పెట్టారు. తమిళనాడు భవిష్యత్ కోసం తన వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశం కృషి చేస్తానని విజయ్ వెల్లడించారు. అంతేకాదు, తాను రాజకీయాలకు వచ్చింది ప్రజల సేవ చేయడానికి.. డబ్బు సంపాదించుకోవడానికి కాదని విజయ్ స్పష్టం చేశారు. తనను ఒక ముఖ్యమంత్రి కాకుండా.. కుటుంబ సభ్యుడిగా చూడాలని విజయ్ ప్రజలకు సూచించారు. తద్వారా తాను చీఫ్ మినిస్టర్ రూపంలో ఉన్న కామన్ మ్యాన్ అని నిరూపించుకున్నారు విజయ్. ఇదే తీరు పరిపాలనలో సాగితే తమిళనాడులో కొత్త రాజకీయాలు చూస్తారని విశ్లేషకులు అంటున్నారు.

CM Vijay First Signatures: విజయ్ సంచలనం.. తొలి మూడు సంతకాలు వాటిపైనే..

CM Vijay First Signatures: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారంలోనే తను ఏం చేయాలనుకుంటున్నాడు.. ఏం చేయబోతున్నాడు అనే విషయాలను స్పష్టంగా చెప్పేశాడు. ఇన్నాళ్లపాటు రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టిన అనేక అంశాలను సైతం పరోక్షంగా ప్రస్తావించాడు. ఫలితంగా విజయ్ ప్రసంగంలో ఆ విషయాలను మొత్తం చెప్పి.. ఇన్ని రోజులపాటు తాను అనుభవించిన వేదన మొత్తం తగ్గించుకున్నాడు.

విజయ్ ప్రమాణస్వీకారం మాత్రమే కాకుండా.. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ముఖ్యమంత్రిగా తాను చేసిన తొలి ప్రసంగంలోనే విజయ్ ఆకట్టుకున్నాడు. ” రా తంబీ అని పిలిస్తేనే నేను పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చాను. మీరు నన్ను హీరోగా ఉన్నత స్థానంలో నిలబెట్టారు. దానిని మరింత సుస్థిరం చేశారు. నా పిలుపును అనేక సందర్భాల్లో స్వీకరించారు. గట్టిగా స్వాగతించారు. రాజకీయాల్లో కూడా నా తొలి అడుగును బలోపేతం చేశారు. నా స్థానాన్ని మరింత పదిలం చేశారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అవమానాలు ఎదుర్కొన్నాను. ఇబ్బందులు కూడా పడ్డాను. అయినప్పటికీ మీరు నన్ను నిలబెట్టారని” విజయ్ పేర్కొన్నాడు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించే ఫైల్ మీద తొలి సంతకం చేసాడు. మహిళా భద్రతకు షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయ్ ప్రకటించారు. అలాగే సమాజానికి అత్యంత చీడపీడగా మారిన మాదకద్రవ్యాల వ్యవహారాన్ని తుడిచిపెట్టేందుకు విజయ్ నిర్ణయం తీసుకున్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తొలి సంతకం చేశారు. ఫలితంగా ముఖ్యమంత్రిగా తన ఉద్దేశాలు ఏమిటి.. తన లక్ష్యాలు ఏమిటి అనే విషయాలను విజయ్ పరోక్షంగా చెప్పేశారు. ఫలితంగా తమిళనాడులో సువర్ణ పరిపాలనకు బీజం పడుతుందని విజయ్ సంకేతాలు ఇచ్చారు.

పార్టీల పేరు చెప్పకుండా
… వ్యక్తుల పేరు చెప్పకుండా.. కేవలం తమిళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విజయ్ మాట్లాడారు. ఎక్కడ కూడా స్క్రిప్ట్ చూడలేదు. కనీసం గవర్నర్ వైపు కూడా చూడలేదు. విజయ్ మాట్లాడుతున్నంతసేపు ఒక్క మాట కూడా తడబడలేదు. పైగా ఒక సినిమా ఆడియో విడుదల సందర్భంగా మాట్లాడినట్టుగానే విజయ్ మాట్లాడారు. దీంతో విజయ్ రాజకీయ లక్ష్యం స్పష్టంగా ఉందని.. ఇప్పటికిప్పుడు అతడిని ఏమైనా చేయాలనుకుంటే.. డీఎంకే, అన్న డీఎంకే రాజకీయంగా ఇబ్బంది పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

VIjay CM Oath Ceremony: భార్య, పిల్లలు రాలేదు.. త్రిష వచ్చింది.. సీఎంగా విజయ్ ప్రమాణంలో ట్విస్ట్

VIjay CM Oath Ceremony: ఊహించినట్టుగానే భార్య రాలేదు. పిల్లలు కూడా కనిపించలేదు. విజయ్ తండ్రి, తల్లి మాత్రమే వచ్చారు. అనేక రకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ.. త్రిష వచ్చారు. త్రిష రావడం మాత్రమే కాదు.. విజయ్ తల్లిని ఆలింగనం చేసుకుంది. అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేసింది. దీంతో అభిమానులు గట్టిగా కేకలు వేశారు.

కొంతకాలంగా త్రిష, విజయ్ సంబంధం మధ్య రకరకాల విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ విజయ్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. పైగా తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం అలానే సాగిపోతున్నారు. ఎన్నికల ముందు విజయ్ మీద ఆయన భార్య సంగీత విడాకుల కేసు పెట్టింది. న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది. విజయ్ సంగీతకు భారీగానే భరణం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.

సంగీత ఇటీవల విజయ్ మొదటి భార్యగా ఉండటానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కూడా నిరాధారమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభ హాజరయ్యారు. వారితోపాటు త్రిష కూడా వచ్చింది. ప్రమాణ స్వీకారానికి సంగీతకు ఆహ్వానం పంపారా.. పిల్లలు దివ్య, జేషన్ సంజయ్ కి కబురు ఏమైనా చేశారా.. అనే విషయాలపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన త్రిష సందడి చేశారు. విజయ్ అభిమానులకు.. టివికే కార్యకర్తలకు అభివాదం చేశారు.

తమిళనాడులో ఎన్నికలకు ముందు విజయ్, త్రిష కలిసి ఒక వివాహానికి హాజరయ్యారు. ఆ సమయంలోనే ఉత్తమ బంధాన్ని వారిద్దరు బహిర్గతం చేశారు. ఇప్పుడు త్రిష ఈ కార్యక్రమానికి హాజరై తమ మీద వస్తున్న ఆరోపణలు.. విమర్శలకు సమాధానం పరోక్షంగా చెప్పారు. ఫలితంగా బంధాన్ని బహిర్గతం చేశారు. ఒకవేళ విడాకులు గనక మంజూరు అయితే త్రిష, విజయ్ పెళ్లి చేసుకుంటారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.

VIjay CM Oath Ceremony: విజయ్‌ ప్రమాణస్వీకారం.. త్రిష హైలెట్‌.. వచ్చిన సినీ ప్రముఖులు ఎవరంటే?

VIjay CM Oath Ceremony: తమిళనాడులో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీవీకే అధినేత విజయ్‌ అన్ని అవరోధాలను అధిరోహించి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దళపతి విజయ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీనటి త్రిష సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అయ్యారు. అనేక సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సినిమా–రాజకీయ దోహదపడిన ఘట్టంగా మారింది.

ప్రమాణస్వీకార వివరాలు
చెన్నై నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణం చేశారు. రాహుల్‌ గాంధీ, మాజీ సీఎం స్టాలిన్‌కు ఆహ్వానాలు పంపారు.

తారల సందడి..
విజయ్‌ ప్రమాణ స్వీకార కర్యాక్రమానికి తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ స్నేహితుడు సూర్య హాజరయ్యారు. ప్రముఖ నటుడు అజిత్‌కుమార్‌ కూడా వచ్చారు. త్రిష ప్రమాణస్వీకారానికి హాజరై, ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ఆమె వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. విజయ్‌–త్రిష జంట చర్చలకు ఇది తీగ ఇంధనం అయింది.

విజయ్‌ విడాకుల నేపథ్యంలో..
విజయ్‌ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. 2021 నుంచి మరో నటితో సంబంధం ఆరోపణలు చేశారు. త్రిషనే కారణమని ఊహాగానాలు బలపడ్డాయి; వివాహ వేడుకల్లో కలిసి కనిపించడం చర్చకు దారితీసింది.

మంత్రులకు శాఖల కేటాయింపు
విజయ్‌తోపాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరికి శాఖలు కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. సీఎం విజయ్‌ హోం, ప్రజాపాలన శాఖలు తనవద్దే ఉంచుకున్నారు. అధవ్‌ అర్జున్‌కు ఎక్సైజ్, క్రీడలు, సెంగొట్టయాన్‌కు పబ్లిక్‌ వర్క్స్, వెకట్రామన్‌కు పాళశాల విద్య, ఎన్‌.ఆనంద్‌కు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, నిర్మల్‌ కుమార్‌కు విద్యుత్, రాజమోహన్‌కు ఆది ద్రవిడ సంక్షేమం, అరుణ్‌రాజ్‌కు కమర్షికల్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్స్‌ కేటాయించారు. మహిళా మంత్రి ఎన్‌.కీర్తనకు ఇంకా శాఖ కేటాయించలేదు.

టీవీకే పార్టీ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకేలను ఓడించి అధికారంలోకి వచ్చింది. విజయ్‌ నటుడి నుంచి నాయకుడిగా మార్పు తమిళనాడు రాజకీయాల్లో కొత్త ధోరణి. త్రిష హాజరు వ్యక్తిగత–రాజకీయ దృష్టిని మలుపు తిప్పింది.

Tamil Nadu CM Vijay: పేపర్ చూడలేదు.. గవర్నర్ ను లెక్కపెట్టలేదు.. విజయ్ ప్రమాణస్వీకారం బాహుబలిని మించిపోయింది

Tamil Nadu CM Vijay: జోసెఫ్ విజయ్ అనే నేను.. అనే పదంతో మొదలుపెట్టిన విజయ్.. ప్రమాణ స్వీకారంలో ఆద్యంతం గంభీరంగా మాట్లాడాడు. ఇన్ని రోజులపాటు తనలో ఉన్న ఒత్తిడి మొత్తాన్ని అధిగమించి.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎదురైన ఇబ్బందులను తట్టుకొని.. అతడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. డీఎంకే, అన్నా డిఎంకె సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ద్వారా విజయ్ ద్రావిడ విధానం లేకుండానే తొలిసారిగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఐఎంయూల్, వీసీకే ను ఒప్పించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం అంటే మామూలు విషయం కాదు. విజయ్ కి ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ.. తనవెంట కాకలు తీరిన రాజకీయ పండితులు లేకపోయినప్పటికీ విజయ్ బలమైన అడుగులు వేశారు. గవర్నర్ పదేపదే ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. నిబంధనల పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించకుండా అడ్డుపడుతున్నప్పటికీ విజయ్ ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. పైగా మహాబలిపురంలో ఉన్న తన ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పుకుంటూ వచ్చారు. ఫలితంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు.

ప్రమాణస్వీకారంలో జోసెఫ్ విజయ్ అనునాన్ (అనే నేను) తో మొదలు పెట్టిన విజయ్.. ఆ తర్వాత ప్రమాణస్వీకారంలో పేపర్ చూడలేదు.. గవర్నర్ వైపు కన్నెత్తి చూడలేదు. “తమిళనాడు అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నాను. నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు కచ్చితంగా గొప్ప పరిపాలన అందిస్తాను. తమిళనాడు రాష్ట్రాన్ని గొప్పగా నిలబెడతాను. ఈ పదవిని అందించిన మీకు జన్మజన్మలా కృతజ్ఞుడిగా ఉంటాను.. విజయ్ మీకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. మీ సేవలో నిత్యం తరిస్తూ ఉంటాడని” విజయ్ భావోద్వేగంగా మాట్లాడాడు. విజయ్ మాట్లాడుతున్నంతసేపు అక్కడ వాతావరణం బాహుబలి 2 సినిమాను గుర్తు చేసింది.

అందులో ప్రభాస్ ప్రమాణస్వీకారం విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడు. పైగా ప్రమాణ పత్రం చూడకుండానే ప్రసంగిస్తుంటాడు. అతడు ప్రమాణం చేస్తున్నంత సేపు ఏనుగులు.. సైనికులు గట్టిగా నినాదాలు చేస్తూ ఉంటారు. దీంతో రాజమాత శివగామి దేవి ఆశ్చర్య పోతుంది. అంతేకాదు రాజు భల్లాలదేవ నెత్తి మీద ఉన్న చత్రం కింద పడుతుంది. దానిని పట్టుకున్న బాహుబలి.. రాజును రక్షిస్తాడు. అటువంటి సన్నివేశమే విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటుచేసుకుంది.

Nandamuri Vs Ghattamaneni: నందమూరి కుర్ర హీరోలా? ఘట్టమనేని వారసులా… పోటీలో గెలిచేది ఎవరు…

Nandamuri Vs Ghattamaneni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఘట్టమనేని ఫ్యామిలీకి మధ్య పోటీ ఉంది. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉండేవి. కానీ సినిమాల మధ్య మాత్రం పోటీ విపరీతంగా ఉండేది. ఎవరు పై చేయి సాధిస్తారు. ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు అనే విధంగా వీళ్ళ మధ్య పోటీ నడిచింది. నిజానికి ఎన్టీఆర్ కంటే కృష్ణ చాలా జూనియర్ అయినప్పటికి వీళ్లిద్దరి మధ్య పర్సనల్ విషయాల్లో కూడా కొన్ని విభేదాలు రావడంతో సినిమాల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది… ఇక ప్రస్తుత తరానికి కూడా ఈ రెండు ఫ్యామిలీ మధ్య పోటీ ఉంది.

మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ సొంత బ్రదర్స్ లా కలిసిమెలిసి ఉన్నప్పటికి సినిమాల విషయంలో మాత్రం ఎవరు పై చేయి సాధిస్తారు అనే ధోరణిలో ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఇక వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయకృష్ణ ఇప్పుడు హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

అలాగే మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ సైతం తొందర్లోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక జానకిరామ్ కొడుకు అయిన చిన్న ఎన్టీఆర్ అలాగే బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీకి తమ బలాన్ని చేకూర్చోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

ఇక ప్రేక్షకులను సైతం మెప్పించడానికి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సిచువేషన్ లో ఉన్నా కూడా భారీ విజయాలను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు…ఈ రెండు ఫ్యామిలీలకు ఉన్న పేరు ప్రతిష్టలను కాపాడుతూ నెక్స్ట్ జనరేషన్ కూడా సత్తా చాటితే చూడాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు…

Vijay CM Oath Ceremony: సీఎంగా విజయ్ ప్రమాణం.. కేబినెట్ లో ఎవరెవరంటే?

Vijay CM Oath Ceremony: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. దాదాపు వారం రోజులపాటు సాగిన ఉత్కంఠ శనివారం రాత్రికి తెర పడింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే, ఐ ఎం యు ఎల్ పార్టీలు సపోర్ట్ ఇవ్వడంతో విజయ్ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడింది. నిన్న కేరళ వెళ్తున్న గవర్నర్ విజయ్ అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదు. ఆ తర్వాత చివర క్షణంలో ఇచ్చారు. దీంతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు లేఖలను గవర్నర్ కు విజయ్ సమర్పించారు. దీంతో టి వి కే ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని పరిస్థితులు అనుకూలించాయి.

ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణస్వీకారం ప్రారంభమైంది. “విజయ్ అనే నేను” అనే పదంతో మొదలుపెట్టిన దళపతి.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ కేవలం ముఖ్యమంత్రి అనే కాకుండా.. హోం శాఖ, ప్రజా పాలన, మంత్రులకు కేటాయించిన శాఖలు మొత్తం తన వద్ద పెట్టుకున్నారు. అత్యంత ముఖ్యమైన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు సెంగొట్టయన్ ను మంత్రిగా నియమించారు. పాఠశాల విద్యాశాఖను వెంకట రామన్ కు కేటాయించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను ఎన్ ఆనంద్ కు కేటాయించారు. కీలకమైన విద్యుత్ శాఖ సిటిఆర్ నిర్మల్ కుమార్ కు దక్కింది. ఆది ద్రావిడ సంక్షేమ శాఖ రాజమోహన్ కు కేటాయించారు. కమర్షియల్ టాక్సెస్, రిజిస్ట్రేషన్ల శాఖను అరుణ్ రాజ్ కు కేటాయించారు.

మంత్రివర్గ ప్రమాణస్వీకారం మలివిడత కూడా ఉంటుందని ఇప్పటికే టీవీకే వర్గాలు ప్రకటించాయి. ప్రథమ దశలో భాగంగా కొన్ని కీలక శాఖలకు మంత్రులను కేటాయించిన విజయ్.. ఆ తర్వాత మిగతా శాఖలకు కూడా కేటాయిస్తారని తెలుస్తోంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో చెన్నై లోని ప్రమాణ స్వీకార ప్రాంతం మొత్తం సందడిగా మారింది.. విజయ్ అభిమానులు టీవీకే జెండాలతో ఆ ప్రాంతాన్ని మొత్తం పసుపు, ఎరుపు రంగు మయం చేశారు. విజయ్ విజయ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా “విజయ్ అనే నేను” అని విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ ప్రాంతంలో బాహుబలి సీన్ రిపీట్ అయింది.

 

 

Akkineni Heroes: అక్కినేని హీరోలకి సక్సెస్ రాకపోవడానికి కారణాలు ఇవేనా…

Akkineni Heroes: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నంత మాత్రాన సక్సెస్ లు వస్తాయనుకోవడం సరైన విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి స్టార్ డమ్ లేని వాళ్ళు సైతం టాప్ హీరోలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఇక భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో బరిలోకి దిగిన వాళ్ళు సైతం వీలైనంత తొందరగా ఫేడౌట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ టాలెంట్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ లు ఉన్నవాళ్ళు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటారు…యావత్ తెలుగు సినిమా హీరోలందరు భారీ విజయాలను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నాలను చేస్తున్నారు… అక్కినేని ఫ్యామిలీ హీరోలను మినహాయిస్తే మిగిలిన ఫ్యామిలీ హీరోలు అందరు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

నాగేశ్వరరావు తర్వాత నాగార్జున ఆ స్టార్ డమ్ ను అందుకున్నాడు. కానీ అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోలైన బాగా చైతన్య అఖిల్ మాత్రం ఆశించిన మేరకు విజయాలను సాధించడంలో తడబడుతున్నారు. అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు సరైన సక్సెస్ సాధించడం లేదు.

కారణం ఏంటి అంటే అఖిల్ తనతో సినిక చేసే దర్శకులను డైరెక్షన్ చేయకుండా చేస్తారట. తనే డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయి డైరెక్షన్ కూడా తనే చేయాలనే ప్రయత్నం చేస్తుంటాడట. అందువల్లే అతనికి సరైన సక్సెస్ లు రావడం లేదని కొంతమంది అతన్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తను ఏదైతే అనుకున్నాడో దానిని తీయడానికి అతన్ని ప్రోత్సహించేలా ఉండాలి. అలాంటప్పుడే ఆయన పూర్తి ఫ్రీడంతో సినిమాని చేయగలుగుతాడు అంతే తప్ప మధ్యలో చేతులు కాళ్లు పెడితే మాత్రం సినిమా కిచిడి అయిపోతుంది.

దాని వల్ల ఆ మూవీ ప్రేక్షకుడిని మెప్పించకపోవడమే కాకుండా భారీ డిజాస్టర్లుగా మారే అవకాశాలు కూడా ఉంటాయని పలువురు సినిమా మేధావులు సైతం చెబుతున్నారు. లెనిన్ మూవీ విషయంలో ఏం జరుగుతుంది…ఆ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించి అఖిల్ కి భారీ విజయాన్ని అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక నెలరోజుల పాటు వేచి చూడాల్సిందే…

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో అమెరికా, చైనా, టర్కీని కొట్టిన భారత్… ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్న డ్రాగన్

Operation Sindoor: 2026, మే 9 నాటికి ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించి ఏడాది. ఈ తరుణంలో చైనా అధికారికంగా తమ పాలుపంచుకోల్పోవడం భారత సైనిక సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా నిరూపించింది. పాకిస్తాన్‌ మాత్రమే కాకుండా చైనా, అమెరికా, టర్కీ ఆయుధాలు, సైనిక సహకారాలు దెబ్బతిన్నాయి. భారత్‌ ఒక్కొక్కటి చేతిలో యుద్ధాన్ని నిర్వహించి, ముగింపు కూడా తన ఆధీనంలో ఉంచుకుంది.

బయటపడిన గుట్టు..
ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌కు చైనా తమ అత్యాధునిక జే–10 సీఈ ఫైటర్‌ జెట్‌లు, రాడార్‌ వ్యవస్థలు, ఆయుధాలు సరఫరా చేసింది. చైనా సైనిక నిపుణులు పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌లలో ఉండి పనితీరును పరిశీలించారు. టర్కీ డ్రోన్‌లు, అమెరికా సాంకేతిక సహకారం పాకిస్తాన్‌ దాడులకు బలం చేకూర్చాయి. ఈ విషయాలు ఇప్పుడు చైనా మీడియా ఇంటర్వ్యూల ద్వారా బహిర్గతమయ్యాయి.

భారత దాడులకు భయపడిన పాకిస్తాన్‌
పాకిస్తాన్‌ భారత దాడులను తట్టుకోలేకపోయి, బహుదేశాల సహాయం పట్టుకుంది. చైనా జే–10సీఈ విమానాలు, ఆప్టర్‌ రాడార్‌లు, అమెరికా ఆయుధాలు, టర్కీ డ్రోన్‌లు అన్నీ భారత సైనిక చర్యలకు ఓటమి పాలయ్యాయి. టర్కీ సైనికులు కూడా పాకిస్తాన్‌లో ఉండి దాడులకు పాల్గొన్నారు, ఇద్దరు చనిపోయారు. భారత్‌ ఈ బహుముఖ ఆధారాలను అధిగమించి విజయం సాధించింది.

చైనా ఆయుధాలు ఘెనంగా విషలం..
చైనా తమ అత్యాధునిక జే–10సీఈ ఫైటర్‌లు భారత్‌పై దాడిలో విఫలమయ్యాయి. ఈ విమానాల్లో ఆప్టర్‌ ఎలక్ట్రానిక్‌ రాడార్, అధునాతన ఆయుధాలు ఉన్నా భారత దాడులకు దెబ్బతిన్నాయి. 2026 మేలో చైనా సైనికులు పాకిస్తాన్‌ బేస్‌లలో ఉండి పనితీరును పరీక్షించారు. ఈ ఓటమి చైనా ఆయుధ పరిశ్రమకు, అంతర్జాతీయ ఇమేజ్‌కు తీవ్ర దెబ్బ తీసింది.

ట్రంప్‌ ఒత్తిడి..
యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. పాకిస్తాన్‌ ద్వారా తెల్ల జెండా ఎగురవేసి, డీజీఎంవో స్థాయిలో చర్చలు జరిపించారు. భారత్‌ తన లక్ష్యాలు సాధించిన తర్వాత సీజ్‌ఫైర్‌కు అంగీకరించింది. యుద్ధం ప్రారంభం నుంచి ముగింపు వరకు భారతం పూర్తి నియంత్రణలో ఉంచుకుంది.

భారత సైనిక శక్తి ప్రపంచ గుర్తింపు
ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైనిక సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది. బహుదేశాల సహకారాలను ఎదుర్కొని విజయం సాధించడం దేశ ఆయుధ వ్యవస్థల బలాన్ని నిరూపించింది. చైనా ప్రాణ నష్టాలను వెల్లడించకపోయినా, పాల్గొన్నట్టు అంగీకరించడం భారత విజయాన్ని ధృవీకరించింది. గల్వాన్‌లా భారత్‌ తన నష్టాలు బహిర్గతం చేయకపోవడం వ్యూహాత్మక ధోరణి.

చైనా అధికారిక ఇంటర్వ్యూలు ఆపరేషన్‌ సిందూర్‌ వార్షికోత్సవంలో యుద్ధ రహస్యాలను చైనా బయటపెట్టింది. భారత్‌ నాలుగు శత్రుదేశాలను ఒకేసారి ఎదుర్కొని విజయవంతమవడం సైనిక చరిత్రలో రికార్డు. ఇది భవిష్యత్‌ యుద్ధ వ్యూహాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ మధ్య చిన్నతనం లో మాటలు లేవా…వాళ్ళను కలిపింది ఆయనేనా…

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ సత్తా చాటుకున్న వారే కావడం విశేషం…ఇక సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేశాడో అప్పుడు బాలయ్య బాబు ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తన దైన రీతిలో సత్తా చాటడమే కాకుండా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అలాంటి బాలయ్య బాబు ఈరోజుకి వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు. వాళ్ళు సైతం వరుస సినిమాలను చేస్తూ నందమూరి ఫ్యామిలీ ప్రస్టేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ మధ్య చిన్నతనంలో పెద్దగా మాటలు ఉండేవి కాదని కొంతమంది తన ఫ్యామిలీ కి దగ్గరగా ఉన్న వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. కారణం ఏంటంటే జానకిరామ్, సుహాసిని, కళ్యాణ్ రామ్ హరికృష్ణ మొదటి భార్య బిడ్డలు…

జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హరికృష్ణ సెకండ్ భార్య కొడుకు కావడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా ఈ ఫ్యామిలీతో కలిసే అవకాశం లేకుండా పోయింది. చిన్నతనంలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి పెద్దగా కనెక్టివిటి కూడా ఉండేది కాదట. ఇక వీళ్లిద్దరి మధ్య అలాంటి ఉద్దేశ్యంతో హరికృష్ణ పెద్ద అయిన తర్వాత ఇద్దరు హీరోలుగా మారినప్పుడు వీళ్లిద్దరిని కలిపే ప్రయత్నం చేశాడు. దాంతో ఇద్దరు అన్నదమ్ములుగా చాలా బాగా కలిసిపోయారు. ఇప్పటికైతే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకే తాటిపైన ముందుకు సాగుతున్నారు.

ఇక వీళ్లిద్దరు కలిసి పోతే బాలయ్య బాబు మాత్రం వీళ్లకు బిన్నంగా దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు బాలయ్య బాబుది ఒక వర్గం, జూనియర్ ఎన్టీఆర్ ది మరొక వర్గం అనేలా నందమూరి ఫ్యామిలీ రెండు భాగాలుగా విడిపోయిందనే చెప్పాలి. మరి వీళ్ళు కలిస్తే చూడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది ఈ మధ్యకాలంలో జరిగే అవకాశం కనిపించడం లేదనే చెప్పాలి…

Mahesh Babu: కృష్ణ చేసిన పనికి ఆ డైరెక్టర్ కి సారీ చెప్పిన మహేష్ బాబు…

Mahesh Babu: ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ… తనదైన రీతిలో సత్తా చాటుకొని యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… అయితే తన నట వారసుడిగా మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం మహేష్ బాబు సూపర్ స్టార్ రేంజ్ ను టచ్ చేస్తు ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ప్రస్తుతం ఆయన ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయం ఆయన చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న మహేష్ బాబు మొత్తానికైతే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి తనకి ఉందని ఆయన నమ్ముతున్నాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు తో తమిళ దర్శకుడు అయిన కె ఎస్ రవికుమార్ ఒక సినిమా చేయాల్సి ఉంది.

కానీ కె ఎస్ రవికుమార్ చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చింది, కృష్ణ కి నచ్చలేదు. దాంతో కె ఎస్ రవికుమార్ తో మహేష్ బాబు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూడా కృష్ణ వద్దని చెప్పడంతో మహేష్ బాబు ఆ దర్శకుడికి సారీ చెప్పి ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా కృష్ణ జడ్జిమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని మహేష్ బాబు నమ్ముతుంటాడు. కానీ కొన్ని సినిమాల విషయంలో ఆయన జడ్జ్ మెంట్ కూడా తేడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తన తండ్రిని రోల్ మోడల్ గా తీసుకున్న మహేష్ బాబు సూపర్ స్టార్ రేంజ్ ను టచ్ చేసే హీరోగా మారడం అనేది మామూలు విషయం కాదు…

Rajinikanth: రజినీకాంత్ చేయలేని పని చేసి సక్సెస్ సాధించిన స్టార్ హీరో…

Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్ ఆయన పేరు చెబితే చాలు పడి చచ్చిపోయే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. అలాంటి రజనీకాంత్ 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ సత్తా చాటుతూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…అయితే ఆయన వరుస సినిమాలను చేసి భారీ విజయాలను సాధించాడు. ఇక అతని తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడిగా విజయ్ గొప్ప పేరు ప్రఖ్యాతలను క్రియేట్ చేసుకున్నాడు.

అయితే విజయ్ ప్రస్తుతం సీఎంగా మారిన విషయం మనకు తెలిసిందే. మొత్తానికైతే రజినీకాంత్ సీఎం అవ్వాల్సింది. అతని ప్లేస్ లో విజయ్ సీఎం అవ్వడం అనేది ప్రతి ఒక్క రజనీకాంత్ అభిమానిని కలవరపెడుతుందనే చెప్పాలి. ఎందుకంటే మొదట్లో రజినీకాంత్ పార్టీని పెట్టి దానిని తీసివేయడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేకపోయాడు. దానివల్ల ఆయన సీఎం అవుతాడని అనుకున్న ప్రతి ఒక్కరు నిరాశ చెందారు.

రజనీకాంత్ హెల్త్ బాగుండకపోవడం వల్ల ఆయన ఈ ఏజ్ లో టెన్షన్స్ తీసుకునే కంటే రెస్ట్ తీసుకోవడం బెటర్ అని డాక్టర్లు చెప్పడంతో ఆయన డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ విజయ్ మాత్రం చాలా తక్కువ సమయంలోనే పార్టీని పెట్టి సీఎంగా అవతరించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రజినీకాంత్ ఉండాల్సిన స్థాయిలో విజయ్ ఉన్నాడు అంటూ చాలామంది సినిమా విమర్శకులు రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇది రజనీకాంత్ ను అతని అభిమానులను కొంతవరకు ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తమిళ నాడు రాజకీయంలో ఒక నవశకమైతే మొదలైంది. ఇక విజయ్ దానిని సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటి వరకు సినిమా రంగంలో విజయ్ సాధించిన విజయాలు ఒకెత్తయితే రాజకీయ రంగంలో ఆయన ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అనేది మరొకెత్తుగా మారబోతోంది…

Undavalli Arun Kumar: రాజశేఖర్ రెడ్డి వినే రకం.. మరి జగన్.. ఉండవల్లి సంచలన కామెంట్స్

Undavalli Arun Kumar:  వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ఎవరి మాట వినరు. ఎవరి సలహాను స్వీకరించరు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి అలా కాదు. మంచి విషయాలను చెబితే ఆయన కచ్చితంగా స్వీకరిస్తారు. పాటించడంతోపాటు అమలు చేస్తారు కూడా. ఇదే విషయాన్ని తాజాగా చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వైయస్ రాజశేఖర్ రెడ్డి తాను ఇచ్చిన సలహా పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయం కెవిపి రామచంద్రరావు కూడా తెలుసునని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకు క్షమాపణ చెప్పడం వెనుక తాను ఉన్నానన్న విషయాన్ని బయటపెట్టారు. రాజశేఖర్ రెడ్డిలో ఉన్న గొప్పతనాన్ని వివరించారు. తద్వారా జగన్మోహన్ రెడ్డికి అదే మైనస్ అని సంకేతాలు పంపించారు.

* లోతుగా విశ్లేషణ..
సమకాలీన రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. చాలా విషయాలపై లోతుగా ఆయనకు అవగాహన ఉంది. 2023 సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. చంద్రబాబు అరెస్టు తప్పుడు సంకేతమని అప్పటినుండి చెబుతూ వచ్చారు. ఇప్పటికీ అదే స్టాండ్ తో మాట్లాడుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైందని చాలా సందర్భాల్లో చెప్పారు ఉండవల్లి. జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు స్వీకరించే పరిస్థితి ఉండదని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి.. ఆయన గొప్పతనం గురించి వివరించే ప్రయత్నం చేశారు.

* చంద్రబాబుకు క్షమాపణలు..
2007లో ఓబులాపురం మైనింగ్ కేసు పై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆరోపణలు చేశారు. అయితే దానిని తిప్పికొట్టే క్రమంలో రాజశేఖర్ రెడ్డి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తల్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే రాజశేఖర్ రెడ్డి దూషించాలని కాదు.. విమర్శలు చేసే క్రమంలో ఆ ఫ్లోలో వచ్చింది ఆ మాట. పెను దుమారానికి దారి తీసింది. జాతీయస్థాయిలో కూడా చర్చ జరిగింది. మీడియాలో ప్రధాన అంశంగా మారిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డికి ఇది డ్యామేజ్ కలిగించే అంశమని.. దీనిపై క్షమాపణలు చెబితేనే మంచిది అని కెవిపి రామచంద్రరావుకు చెప్పారట ఉండవల్లి అరుణ్ కుమార్. అదేదో నేరుగా రాజశేఖర్ రెడ్డికి మీరే చెప్పొచ్చు కదా అని కెవిపి అన్నారట. వెంటనే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి చెప్పారట. క్షమాపణలు చెప్పాలని సూచించారట. అందుకు కాస్త అసహనానికి గురైన రాజశేఖర్ రెడ్డి ఫోన్ కట్ చేశారట. కానీ ఆ తరువాత రోజు అసెంబ్లీ ప్రారంభ సమయంలోనే చంద్రబాబుకు రాజశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అంతటితో ఆ వివాదం ముగిసింది అని యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే జగన్మోహన్ రెడ్డి వినే రకం కాదని.. రాజశేఖర్ రెడ్డి మాత్రం వింటారని చెప్పే ప్రయత్నం గా తెలుస్తోంది ఉండవెల్లి వ్యాఖ్యలు.

Roja Comments: జగన్ తో మొన్న స్టాలిన్ కు.. నేడు విజయ్ కు పోలిక పెడుతున్న రోజా!

Roja Comments: కొన్ని విషయాలను కొందరే చెప్పాలి. కొన్ని రకాల ప్రకటనలు కొందరే చేయాలి. అందులోనూ రాజకీయంలో ఉన్నవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ప్రకటనలు చేయాలి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. సీనియర్లు సైలెన్స్ పాటిస్తున్నారు. జూనియర్ లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇది కచ్చితంగా తటస్థ ఓట్లపై ప్రభావం చూపిస్తుంది. ఎంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రుచించే మాటలు వాడే నేతలకు పార్టీలో ప్రోత్సహిస్తున్నారు. తటస్థులతోపాటు కొత్త ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నాలు జరగడం లేదు. పార్టీలో పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి విజయం పై జాతీయస్థాయిలో సైతం ఆశ్చర్యపడేవారు. కానీ ఇప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో వేరే పార్టీ విజయంలో క్రెడిట్ వెతుక్కునే పరిస్థితి దాపురించింది.

* క్రెడిట్ ఆరాటం అవసరమా?
తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే దశాబ్దాలుగా వైరి వర్గాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో జాతీయస్థాయిలో ఆ రెండు పార్టీలు చాలా ప్రాంతీయ పార్టీలతో స్నేహం చేశాయి. అయితే వారి స్నేహమూ శాశ్వతం కాదు.. శత్రుత్వము ఉండదు. కరుణానిధితో చంద్రబాబు బాగానే ఉండేవారు. చంద్రబాబును జయలలిత గౌరవించేవారు. రాజశేఖర్ రెడ్డి తో సైతం వారికి సంబంధాలు ఉండేవి. కానీ అవి రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చేవి కావు. ఏ రాష్ట్ర రాజకీయం ఆ రాష్ట్రానికి ఉండేది. కానీ ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలుపు లో కూడా వైసిపి క్రెడిట్ వెతుక్కునే పరిస్థితికి వచ్చింది. 2019లో 151 సీట్లతో దేశం తన వైపు చూసుకునేలా విజయం సాధించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్. అటువంటి పార్టీ విజయ్ గెలుపులో క్రెడిట్ వెతుక్కోవడం ఏంటి. కచ్చితంగా ఏపీ ప్రజల్లో ఇదో నెగిటివ్ ఫీడ్ బ్యాక్.

* రోజా అడ్డగోలు వాదన..
గత రెండు రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియా చూస్తుంటే మాజీ మంత్రి రోజా ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఆమె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. స్టాలిన్ పాలనను జగన్ పాలనతో పోల్చారు. పనిలో పనిగా చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేశారు తమిళనాడులో. ఇప్పుడు అదే రోజా విజయ్ కోసం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో విజయ్ కు చాలా రకాల పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్ల విజయ్ గెలిచారని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. పది రోజుల కిందట ఇదే రోజా స్టాలిన్ ను ఆకాశానికి ఎత్తేసి జగన్మోహన్ రెడ్డితో పోల్చారు. ఇప్పుడు అదే ఆమె జగన్మోహన్ రెడ్డితో విజయ్ కు పోలిక పెట్టి మాట్లాడుతున్నారు. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. తటస్తులు యావగించుకుంటున్నారు.

APSRTC Bus Viral Video: బస్టాండ్ లో ఆగని బస్సు.. వెంటాడిన యువకుడు.. వీడియో వైరల్

APSRTC Bus Viral Video: ఆర్టీసీ ఉద్యోగుల తీరుతో ఏపీ ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. ప్రజల్లో ప్రభుత్వం పలుచన అవుతోంది. ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు చేయి ఎత్తిన చోట ఆపాలన్న నినాదం ఉంది. పల్లె వెలుగు సర్వీసులకు ఇది తప్పకుండా వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో చాలాచోట్ల ఆర్టీసీ బస్సులు బస్టాండ్లలో ఆపడం లేదు. ప్రయాణికులు ఎదురుగా కనిపిస్తున్నా కనికరించడం లేదు. ముఖ్యంగా ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దీనిపైన ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలదీతలు ఎదురవుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో చోట ఇటువంటి ఘటన జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఓ యువకుడు ఇలానే బస్టాండ్ లో ఆపకుండా వెళ్లిపోయిన ఆర్టీసీ బస్సును వెంబడించి మరి సిబ్బందిని నిలదీశారు.

* ఇటీవల ఓ ఎమ్మెల్యే సైతం..
ఇటీవల కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సైతం ఇదే మాదిరిగా జరిగింది. బస్టాండ్ లో ప్రయాణికులు వేచి చూస్తుండగా బస్సు ఆపకుండా వెళ్లిపోయింది. ఆ వెనుక వాహనంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆర్టీసీ బస్సును వెంబడించారు. బస్సు ఎదురుగా వాహనాన్ని నిలిపారు. దీంతో బస్సు నిలిచింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సులో ఎక్కిన ఎమ్మెల్యే ప్రసాద్ సిబ్బంది తీరును తప్పు పట్టారు. ఎందుకు బస్సు బస్టాండ్ లో ఆపలేదని ప్రశ్నించారు. మీరు చేస్తున్న పనికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని.. ప్రతి బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులను ఎక్కించుకోవాలని సూచించారు. అయితే ఆ ఘటన సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్టీసీ సిబ్బంది తీరుపై విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.

* శ్రీకాకుళం జిల్లాలో..
తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఓ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. అయితే సమీపంలోని ఓ బస్టాండ్ వద్ద పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు ఒకటి వచ్చింది. కానీ ఆపకుండా వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న యువకుడు బైక్ పై బస్సును వెంటాడాడు. బస్సును ఆపి డ్రైవర్ తో పాటు కండక్టర్ ను నిలదీశాడు. ఇలాంటి వారితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకం కల్పించిన నాటి నుంచి ఆర్టీసీ సిబ్బంది వైఖరిలో మార్పు వచ్చింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ యువకుడు నిలదీసినంత పని చేశాడు. ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RK Kothapaluku: ఆర్కే కొత్తపలుకు: బెంగాల్, అస్సాం లో బిజెపి గెలుపు.. వేమూరి రాధాకృష్ణ స్వరం మారింది..

RK Kothapaluku: తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో అనేకమంది బిజెపి నాయకులను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలలో బిజెపి నాయకులను ఆయన అనేక రకాలుగా ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా వ్యవస్థల ధ్వంసం.. మతతత్వ రాజకీయాల గురించి పదేపదే మాట్లాడారు. ఒక దశలో బిజెపి పరిపాలన మీద.. నరేంద్ర మోడీ వ్యవహార శైలి మీద వ్యంగ్యంగా విమర్శలు చేశారు.. అంతేకాదు సర్ ఎక్స్ ఎల్ మాటను పదేపదే వ్యాఖ్యానించేవారు.. దీంతో బీజేపీ నాయకులకు మాట్లాడే అవకాశం లేకుండా పోయేది.

అటువంటి రాధాకృష్ణ ఆదివారం రాసిన కొత్త పలుకులో తన స్వరాన్ని మార్చారు. తన పెన్ను పవర్ వేరే వైపు మళ్ళించారు. నిప్పులు చెరిగే విధంగా ఉండే తన రాతలను నరేంద్ర మోడీకి జై కొట్టడానికి ప్రయోగించారు. తద్వారా ఈ ఆదివారం నాటి కొత్త పలుకు రుచి శుచి లేని వంటకంలాగా మారిపోయింది.

తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ ఏమంటాడంటే..”నరేంద్ర మోడీ, షా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇతర పార్టీలు.. అలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పార్టీ కోసం ఏం చేస్తే బాగుంటుంది అని బిజెపి నాయకులు ఆలోచిస్తారు. పార్టీ వల్ల నాకు ఏం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తారు. ఈ రెండు పార్టీల మధ్య తేడా ఇలా ఉంది కాబట్టి ఫలితాలు అలానే వస్తుంటాయి. యుద్ధానికి దిగేటప్పుడు ప్రత్యర్థుల బలాల గురించి.. బలహీనతల గురించి అంచనా వేయాలి. ఈ విషయంలో నరేంద్ర మోడీని మించిన వారు ఇప్పటి కాలంలో ఎవరూ ఉండకపోవచ్చు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతల గురించి, ప్రజల సైకాలజీ గురించి అధ్యయనం చేయాలి. దానికి అనుగుణంగా వ్యూహాలు రచించాలి. అందులో నరేంద్ర మోడీ దిట్ట. ఎన్నికలకు ముందు రచించే వ్యూహాలు మాత్రమే కాకుండా.. ఫలితాల అనంతరం కూడా వ్యూహాలు రచించడం లో నరేంద్ర మోడీ సాటి. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం లో బెంగాల్ ప్రజలకు ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. రాజకీయాలలో ఇది అతి పెద్ద స్ట్రోక్ అని చెప్పుకోవాలి” ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు.

నరేంద్ర మోడీ కొత్తగా ఇలా రాజకీయాలు చేయడం లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి మొదలు పెడితే ఇప్పటి ప్రధానమంత్రిగా ఉన్నప్పటివరకు నరేంద్ర మోడీకి ఇటువంటి రాజకీయాలే ఆయనను ఈ స్థాయి దాకా తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఇందులో ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇదే నిజం. కాకపోతే రాధాకృష్ణ నరేంద్ర మోడీ విషయంలో ఇలా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ బిజెపి మీద మతం అనే ముద్ర వేసే రాధాకృష్ణ.. కొత్తగా నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ మీద గొప్పగా రాయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇక ఈ కొత్త పరుగులు హైలెట్ ఏంటంటే మొత్తానికి కమ్యూనిస్టుల పరిపాలనను భయానకమైన అనుభవమని రాధాకృష్ణ చెప్పుకున్నారు. మమతా బెనర్జీ వ్యవహార శైలిని సైతం తప్పు పట్టారు. తమిళనాడులో అడ్డగోలు సంక్షేమ పథకాలకు, ఎన్నికల్లో డబ్బు పంచడం వంటి వాటికి ప్రజలు లొంగక పోవడం మంచిదని రాధాకృష్ణ పేర్కొన్నారు. అలాంటప్పుడు సూపర్ సిక్స్ పథకాలను కూడా అదే విధంగా విమర్శించాలి కదా.. ఇక్కడ గొప్పగా చెప్పి.. తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు పంచుడు పథకాలకు లొంగలేదని చెప్పడం.. ఏ తరహా జర్నలిజమో రాధాకృష్ణ చెప్పాలి..

Today 10 May 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అన్ని శుభవార్తలే..

Today 10 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఉద్యోగులు ఈరోజు అన్ని శుభవార్తలే వింటారు. వ్యాపారులు కొన్ని ఖర్చుల విషయంలో సమస్యలను ఎదుర్కొంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. గతంలో చేపట్టిన పనులను ఈరోజు పూర్తి చేయడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులతో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యంగా ఉండకూడదు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనుల్లో మీమాగ్నమవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగం కోసం వెళ్లే వారికి సరైన ఫలితాలు ఉంటాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తిచేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అధిక ప్రయోజనాలు కలగనున్నాయి. కొన్ని ముఖ్యమైన వస్తువు చేతికి అందుతాయి. ఇదే సమయంలో ఖర్చుల ఎక్కువగా ఉంటాయి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో దుబారా ఖర్చులను నివారించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టేవారు ఉద్యోగుల సపోర్ట్ తీసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి ఈ రోజు ఆశించిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులు పదోన్నతి విషయంలో సమాచారం అందుకుంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు తగ్గే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఓ ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. అనవసరపు ఖర్చులను నియంత్రిస్తారు. అనుకోకుండా శుభ కార్యక్రమాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ధాన్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే సమయంలో వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనువైన వాతావరణం ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలతో వ్యాపార అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కార్యాలయాల్లో సంతోషంగా గడుపుతారు. కొన్ని పనుల నిమిత్తం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో బిజీగా మారిపోతారు. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో సంతృప్తిగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.