Home Blog Page 297

Trisha Golden Hand: త్రిష గోల్డెన్ హ్యాండ్ నే నమ్ముకున్న చిరంజీవి, సూర్య.. ఆసక్తికరంగా మారిన పరిణామాలు..

Trisha Golden Hand: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో విజయ్ పేరు మీడియా, సోషల్ మీడియా లో ఎలా అయితే వినిపిస్తుందో, ఆయనతో పాటు హీరోయిన్ త్రిష పేరు కూడా అలాగే వినిపిస్తోంది. ఎందుకంటే వీళ్లిద్దరు చాలా కాలం నుండి సహజీవనం చేస్తున్నారు కాబట్టి, అదే సమయంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి గా నేడు ప్రమాణస్వీకారం చేసాడు కాబట్టి. నేటి కార్యక్రమానికి త్రిష చక్కగా చీర కట్టుకొని రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే త్రిష విజయ్ జీవితం లోకి వచ్చినప్పటి నుండి, ఆయనకు అన్నీ విజయాలే దక్కుతున్నాయని , విజయ్ కెరీర్ కి త్రిష ఒక గోల్డెన్ లక్ లాగా తయారైందని , ఆయనకు టీవీకే పార్టీ ని పెట్టే ఆలోచన కూడా త్రిష నే ఇచ్చిందని , ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి.

ఇదంతా పక్కన పెడితే త్రిష గోల్డెన్ లక్ కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి, తమిళ హీరో సూర్య లకు కూడా కలిసొస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే త్రిష మెగాస్టార్ చిరంజీవి తో ‘విశ్వంభర’ అనే చిత్రం చేసింది , అదే విధంగా సూర్య తో ‘కరప్పు’ అనే చిత్రం చేసింది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుండగా , ‘కరప్పు’ చిత్రం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే పేరు తో విడుదల కాబోతుంది. తమిళనాడు ఎన్నికల కారణంగా త్రిష కి వచ్చిన ఫ్రెష్ క్రేజ్ తో ఈ సినిమా విడుదల అవ్వబోతుండడంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు విశ్లేషకులు. అదే విధంగా త్రిష గోల్డెన్ లక్ ఫ్యాక్టర్ కూడా కలిసొస్తుందని అంటున్నారు.

చాలా కాలం నుండి సూర్య సరైన హిట్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ త్రిష ఫ్యాక్టర్ ఆయనకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఇక త్రిష హీరోయిన్ గా నటించిన మరో చిత్రం ‘విశ్వంభర’ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకొని, సినిమాని పూర్తి చేసుకున్నప్పటికీ కూడా , గ్రాఫిక్స్ క్వాలిటీ కారణంగా ఇన్ని రోజులు ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. దీంతో అసలు ఈ సినిమా ఉందనే విషయాన్నే మర్చిపోయారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రానికి బజ్ రావాలంటే కచ్చితంగా త్రిష ఫ్యాక్టర్ కలిసి వస్తుందని అంటున్నారు. మరి అభిమానుల నమ్మకాలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

Operation Sindoor: ప్రతీకార దినోత్సవం.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ కాళ్లబేరానికి వచ్చింది ఈ రోజే!

Operation Sindoor: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో 2025, ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మతం అడిగి మరీ హిందువులను చంపేశారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్‌ఐఏ విచారణ జరిపి ఈ దాడి జరిపించి పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులని గుర్తించింది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వంద మంది ఉగ్రవాదులను చంపేసింది.

పాకిస్తాన్‌ ప్రతిదాడి..
భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ ప్రతిదాడులు మొదలు పెట్టింది. దీంతో భారత సైన్యం ఈ దాడులను తిప్పి కొట్టింది. ఇదే సమయంలో పాకిస్తాన్‌లోని కీలక స్థావరాలపై దాడిచేసింది. భారత్‌ దాడులకు పాకిస్తాన్‌ వణికిపోయింది. అమెరికా, చైనా, టర్కీ సహకారం అందించినా పాకిస్తాన్‌ భారత్‌ దాడులను ఎదుర్కొనలేకపోయింది.

చివరకు కాళ్లబేరానికి..
భారత్‌ దాడులు తట్టుకోలేక అమెరికా వద్ద పాకిస్తాన్‌ మోకరిల్లింది. చివరకు అమెరికా సూచనతో పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ సయ్యద్‌ అసీమ్‌ మునీర్‌ కాళ్లబేరానికి వచ్చారు.
మే 10, 2025న పాకిస్తాన్‌ డీజీఎంవో భారత డీజీఎంవోతో చర్చలు జరిపారు. యుద్ధం ఆపమని వేడుకున్నారు. అప్పటికే భారత లక్ష్యం నెరవేరడంతో భారత్‌ కూడా దాడులు ఆపేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో మే 10ని ప్రతీకార దినంగా జరుపుకుంటున్నాం. ఇదే సమయంలో భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను హోల్డ్‌లో ఉంచుతున్నట్లు తెలిపింది. ఎప్పుడైనా దాడులకు తెగబడితే ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 మొదలు పెడతామని స్పష్టం చేసింది.

పహల్గాంలో మారణహోమం..
2025 ఏప్రిల్‌ 22న జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌ సమీపంలో ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) ఉగ్రవాదులు హిందూ పర్యాటకులపై కాల్పులు జరిపారు. 26 మంది మరణించి, 20 మంది గాయపడ్డారు. పాక్‌ ప్రేరేపిత ఈ దాడి దేశవ్యాప్త ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనికి 14 రోజుల్లో స్పందనగా మే 7 తెల్లవారుజామున 1:44 గంటలకు ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభమైంది. భారత వాయుసేన అర్ధరాత్రి మెరుపు దాడులతో పీవోకేలోని ముజఫ్ఫరాబాద్, కోట్లి, పాక్‌ పంజాబ్‌లోని బహావల్పూర్‌లోని 9 ఉగ్ర శిబిరాలు, శిక్షణా కేంద్రాలను క్షిపణులతో ధ్వంసం చేసింది. 1:45కి 24 దాడులు పూర్తయ్యాయి. 100+ ఉగ్రవాదులు మొత్తం ధ్వంసం అయ్యారు.

4 రోజుల ఆపరేషన్‌..
మే 7 నుంచి 10 వరకు 4 రోజులు సాగిన ఈ ఆపరేషన్‌లో భారత్‌ 50 కంటే తక్కువ ఆయుధాలతో క్షిపణి, వైమానిక దాడులు చేసింది. పాక్‌ 11 ఎయిర్‌బేస్‌లు, ఎఫ్‌–16లు, ఏడబ్ల్యూఏసీ విమానాలు, 5 ఫైటర్‌ జెట్‌లు కూల్చివేయబడ్డాయి. పాక్‌ సీజ్‌ఫైర్‌కు ఒత్తిడి చేసి దాడులు ఆపించింది. భారత్‌ 25 గగనతల మార్గాలు మూసివేసి పాక్‌ను ఇబ్బంది పెట్టింది.

ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ ప్రొపోర్షనల్‌ రెస్పాన్స్‌ వ్యూహాన్ని బలపరిచింది.ఉగ్ర స్థావరాలపై మాత్రమే దాడి, పౌరులకు నష్టం లేకుండా. ఉరి, పుల్వామా తర్వాత ఇది మరో మైలురాయి. పాక్‌ పాఠ్యపుస్తకాల్లో ’విక్టరీ’గా చిత్రీకరించడం దాని డీనయల్‌ మానసికతను చూపిస్తుంది. కాళ్లబేరా ‘దేవుడే రక్షించాడు‘ అని చెప్పినా, భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది.

Pakistan Cricket Team: భారత ప్లేయర్లను నమ్ముకున్నప్పటికీ.. పరువు దక్కలేదు.. పాపం పాకిస్తాన్

Pakistan Cricket Team: మన దగ్గర సత్తా లేనప్పుడు.. ఎదుటి వాళ్ళ పేరు నమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ల పేరు వాడుకున్నప్పటికీ ఆ సత్తాను చూపించకపోతే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి ఇలానే ఉంది.

ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్ మూడు రోజుల క్రితం మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అతిపెద్ద తప్పు చేశారు.

పాకిస్తాన్ ప్లేయర్లుగా భారత ఆటగాళ్లను స్క్రీన్ మీద చూపించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీసింది.. పాకిస్తాన్ ప్లేయర్ల టెస్ట్ కెరియర్ అంటూ డిస్ప్లే చేసిన వాళ్లలో రోహిత్, గిల్, తిలక్, రింకు, సర్ మల్టీ ప్లేయర్లు ఉన్నారు. పాకిస్తాన్ ప్లేయర్లకు బదులుగా ఇండియన్ ఆటగాళ్ల పేర్లు కనిపించడం ఒకరకంగా చర్చకు దారి తీసింది. దీనిపై ఇండియన్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ స్థాయిలో ఇండియన్ ప్లేయర్లను వాడుకున్నప్పటికీ పాకిస్తాన్ జట్టుకు ఏమాత్రం లాభం లేకుండా పోయింది. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం భారత ప్లేయర్ల ముఖాలను వాడుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు కు ఒక లాభం చేకూరింది. అదేంటంటే బ్రాడ్కాస్టర్లు మళ్ళీ ఏదైనా తప్పు చేస్తారో చూద్దామని ఇండియన్ ఫ్యాన్స్ ఆ మ్యాచ్ వీక్షించడం మొదలుపెట్టారు. ఫలితంగా ఈ మ్యాచ్ ను ఆన్లైన్లో 11.1 కోట్ల మంది వీక్షించారు. వాస్తవానికి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఆ స్థాయిలో వీక్షణలు నమోదు కావు. ఇండియన్ ఫ్యాన్స్ వల్ల పాకిస్తాన్ జట్టుకు ఈ లాభం జరిగింది.

ఆట తీరులో మాత్రం పాకిస్తాన్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఓపెనర్ అజాన్ సెంచరీ చేశాడు. అబ్దుల్ ఫజల్, సల్మాన్ ఆగా హాప్ సెంచరీలు చేశారు. మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 410 పరుగులు చేసింది. ఇప్పటికే 39 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. పాకిస్తాన్ జట్టుతో పోల్చి చూస్తే బంగ్లాదేశ్ కు టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం తక్కువే. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ను సవాల్ చేసి బంగ్లాదేశ్ ఆడుతోంది.

Narendra Modi: 15 ఏళ్ళలో మమతకు చేతకాలేదు.. మోడీ సాష్టాంగ పడింది అందుకే

Narendra Modi: నేటి కాలంలో రాజకీయాలు జనాలకు రీచ్ కావాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ఆ మ్యాజిక్ కూడా నటన మాదిరిగా అనిపించకూడదు. సహజత్వం నిండాలి. జనాలు మై మరిచిపోవాలి. సరిగా ఇదే పని చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

బెంగాల్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బిజెపిలో ఇది ఎప్పటినుంచో కొనసాగుతున్న సంప్రదాయం. అయితే ఈసారి నరేంద్ర మోడీ కొత్తగా ట్రై చేశారు. మరోసారి మమత బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందో అదే చేశారు. ఫలితంగా ఇన్నాళ్లపాటు మత తత్వ పార్టీ అని ముద్ర వేసుకున్న బీజేపీ.. బెంగాల్ ప్రజల మనసులో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఇటీవల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు బిజెపికి గ్రాండ్ విక్టరీ అందించారు. 15 సంవత్సరాల మమత పరిపాలనకు చరమగీతం పాడారు. ఈ దేశానికి.. రాష్ట్రానికి సుస్థిరమైన పరిపాలన అందించాలంటే అది బిజెపి వల్ల సాధ్యమవుతుందని ప్రజలు స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్ ప్రజలకు సాష్టాంగ పడి నమస్కారం చేశారు.

సాధారణంగా ఇలాంటి పని 15 సంవత్సరాల కాలంలో మమత ఒక్కరోజు కూడా చేయలేదు. కనీసం ఆమె బెంగాల్ ప్రజల గురించి సరిగా పట్టించుకోలేదు. ఈ ప్యాక్ లాంటి సంస్థలు తన విజయానికి దోహదం చేస్తాయని నమ్మారు. చివరికి ప్రజలకు అనుకూలంగా ఉండలేక.. కొంతమంది వ్యక్తుల వల్ల బద్ద విరోధిగా మారిపోయి.. చివరికి తన స్థానాన్ని కూడా కోల్పోయారు. 15 సంవత్సరాల పాటు పాలించిన ముఖ్యమంత్రి తన స్థానాన్ని వరుసగా రెండుసార్లు (వేరువేరు నియోజకవర్గాలు)కోల్పోయి పరువు తీసుకున్నారు .

నరేంద్ర మోడీ సాష్టాంగ పడి నమస్కారం చేసిన తీరు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి విపరీతంగా సర్కులేట్ అవుతోంది.. అయితే నరేంద్ర మోడీ అలా పడింది ఏదో యాదృచ్ఛికంగా కాదు. దాని వెనుక బలమైన కారణం ఉంది. ఆ కారణం పేరు స్వామి వివేకానంద. బెంగాల్ రాష్ట్రంలో పుట్టిన ఆయన.. భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు. తనకు ఎవరైనా సాష్టాంగ పడి నమస్కారం చేస్తే.. ఆయన కూడా అదే విధంగా చేసేవారు. ఫలితంగా పరస్పర గౌరవం అంటే ఎలా ఉంటుందో ఆయన చూపించేవారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అలానే చేయడంతో అందరూ ఫిదా అయిపోయారు. ఈ దెబ్బతో బెంగాల్ ప్రజల మనసును మరింత గొప్పగా చూరగొన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Pawan Kalyan And Vijay: ఆ పని పవన్ కళ్యాణ్ చేస్తే ట్రోల్ చేశారు… విజయ్ చేస్తే సిఎం అయ్యాడు… ఇదేం లాజిక్ సామి…

Pawan Kalyan And Vijay: తమిళంలో స్టార్ హీరోగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీని పెట్టి తమిళనాడులో అధికారాన్ని దక్కించుకోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజకీయ రంగంలో ఆయనకు పెద్దగా అనుభవం లేదు. అయినప్పటికి జనం అతనిని నమ్మడం ఏంటి అంటూ అక్కడున్న రాజకీయ నాయకులతో పాటు దేశం మొత్తం మీద ఉన్న ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీ పెట్టిన రెండు సంవత్సరాల్లోనే విజయ్ అధికారంలోకి రావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. ఇక తమిళనాడు జనాలందరు అతన్ని ముద్దుగా తళపతి విజయ్ అని పిలుస్తుంటారు. ఎలక్షన్స్ కి ముందే అతని భార్య సంగీత విజయ్ తన ఇంటికి రావడం లేదని త్రిషతో ఉంటున్నాడు అంటూ ఆమె కొన్ని కామెంట్లు చేస్తూ విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది. ఇక మొత్తానికైతే విడాకుల విషయంలో ఆమెను డబ్బులిచ్చి సెటిల్ చేసిన విజయ్ ఆ తర్వాత ఎలక్షన్స్ లో పాల్గొని భారీ విజయాన్ని సాధించాడు. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి నటుడు జనసేన అనే పార్టీని స్థాపించి 2019 సంవత్సరంలో సోలోగా పోటీ చేసినప్పటికి అతను విజయం సాధించలేకపోయాడు.

కారణమేంటి అంటే అతను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ ప్రతిపక్ష పార్టీ వాళ్లు అస్తమానం అతని పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు. దానివల్ల చాలామందికి పవన్ కళ్యాణ్ మీద నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. తద్వారా ఆయన ఓడిపోయి వైసీపీ పార్టీ భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లను గెలుచుకొని గవర్న మెంట్ ను ఫామ్ చేసింది.

ఇప్పుడు మాత్రం విజయ్ వేరే అమ్మాయితో ఉంటున్నాడు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడని తన భార్య కామెంట్ చేసిన కూడా తమిళనాడు జనాలైతే అతన్ని గెలిపించారు. నిజానికి ఆంధ్ర కంటే తమిళనాడు ప్రజలు నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు నాయకుడి పర్సనల్ విషయాల గురించి పట్టించుకోలేదు. తను వస్తే సేవ చేస్తాడు అనుకున్నారు. కాబట్టి అతన్ని గెలిపించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో ఆంధ్ర ప్రజలు ఫెయిల్ అయితే తమిళనాడు ప్రజలు సక్సెస్ అయ్యారు.

ఎప్పుడైనా రాజకీయ నాయకుడి యొక్క పర్సనల్ విషయాలను చూడకూడదు. అతను జనానికి సేవ చేస్తున్నాడా లేదా అనేది మాత్రమే చూడాలి. ఎట్టకేలకు 2024వ సంవత్సరంలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 21 సీట్లకు పోటీ చేస్తే 21 సీట్లు గెలిచాడు. ఇక దానికి తోడుగా ఎన్డీయే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తను కీలక పాత్ర వహించాడనే చెప్పాలి…

Modi Railway Line Inauguration: మోడీ ప్రారంభించింది మామూలు రైల్వే లైన్ కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకం

Modi Railway Line Inauguration: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇందులో ప్రధానమైనది సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ కాజీపేట రైల్వే మార్గంలోని మూడవ లైను. ఈ లైన్ కు సంబంధించి ఎలక్ట్రిసిటీ పనులు దాదాపు పూర్తయ్యాయి.

1952 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. 219 కిలోమీటర్ల దూరమున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 194 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. డోర్నకల్, మహబూబాబాద్ మధ్యలో ఉన్న 25 కిలోమీటర్ల సంబంధించిన పనులు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చాయి. మరో రెండు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయి.. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్, కాజీపేట, వరంగల్ ప్రాంతాల నుంచి విజయవాడకు వెళుతున్న రైలు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ మార్గం మీదుగానే దక్షిణాది రాష్ట్రాలకు సరకు రవాణా చేస్తుంటారు. అటు ప్రయాణికులు.. ఇటు సరుకు రవాణా మొత్తం ఈ మార్గం మీదుగా సాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది.

నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ పనులు దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకంగా ఉన్నాయి. గ్రాండ్ ట్రంక్ ట్రైన్ అనే ట్రైన్ ఈ రూట్ మీదుగానే వెళుతూ ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఒత్తిడి తగ్గించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది.. విష్ణుపురం, జాన్ పహాడ్ వంటి ప్రాంతాల్లో ఏర్పాటైన పరిశ్రమల నుంచి సిమెంట్ ను సులభంగా ఈ మార్గం నుంచి రవాణా చేయడానికి అవకాశం ఉంటుంది.

విజయవాడతోపాటు కాజీపేట మధ్యలో బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్ లు, సిమెంట్ పరిశ్రమలకు అనుసంధాన వ్యవస్థను పెంచుతూ ఉంటుంది.

కాజీపేట నుంచి మొదలుపెడితే బళ్లార్ షా వైపు వచ్చే అత్యంత భారీ సరుకు రైళ్లను.. అదనపు మార్గం ద్వారా ఇటువంటి ఇబ్బందులు లేకుండా నడపవచ్చు. దీనివల్ల ప్రయాణికుల రైళ్లు ఒత్తిడి లేకుండానే సాగిపోతూ ఉంటాయి.

ఈ మార్గం మీదుగా తెలంగాణ, విజయవాడ, చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్ కతా వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు జర్నీ టైం తగ్గుతుంది. తిరుపతి, చెన్నై వెళ్లే ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అదనపు రైళ్లు నడపడానికి అవకాశం ఉంటుంది.

విజయవాడ తో పాటు కాజీపేట మార్గంలో 118 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మూడవ లైను అనేక దశల్లో నిర్మాణమైంది. ఈ ట్రాక్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో జాతికి అంకితం ఇచ్చారు.

DMK Support To Vijay: స్టాలిన్‌ ‘మ్యాజిక్‌’ వెనుక డీఎంకే.. ప్రమాణ స్వీకారానికి పరోక్ష సహకారం!

DMK Support To Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు రోజులపాటు రాజకీయ నాటకీయత కొనసాగింది. మ్యాజిక్‌ ఫిగర్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్‌ అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధిపతి విజయ్‌కు తెలిపారు. ఈమేరకు విజయ్‌ మద్దతు కూడగట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ భేషరతుగా మద్దతు తెలిపింది. తర్వాత సీపీఐ కూడా మద్దతుకు ఇచ్చింది. దీంతో విజయ్‌ బలం 116కు చేరింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరమైన తరుణంలో వీసీకే మద్దతుపై ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో కాస్త ఆలస్యంగా వీసీకే కూడా విజయ్‌ పార్టీకి మద్దతుగా లేఖ ఇచ్చింది. దీంత విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయింది.

స్టాలిన్‌ చొరవతోనే..
మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ చొరవే ముఖ్య కారణమని పార్టీ నాయకులు ప్రకటించారు. టీవీకే అధినేత విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు సమకూర్చడంలో స్టాలిన్‌ మిత్రపక్షాలపై ప్రభావం వ్యాపించడం గమనార్హం. టీవీకే పార్టీ 107 స్థానాలు సాధించి అతిపెద్ద శక్తిగా నిలిచినప్పటికీ, 118 మెజారిటీ గుర్తు దాటడానికి మిత్రపక్షాల సహాయం తప్పనిసరి అయింది. మూడు రోజుల సస్పెన్స్‌లో కాంగ్రెస్‌ (5 సీట్లు), సీపీఐ, సీపీఎం (ఇద్దరుగా) మద్దతు ప్రకటించి సంఖ్యాబలం 116కు చేరింది. తర్వాత వీసీకే, ఐయూఎంఎల్‌ (ఇద్దరుగా) చేరడంతో 120కి చేరి గండం తప్పింది.

మిత్రపక్షాలకు ఫ్రీహ్యాండ్‌..
ఈ ప్రక్రియలో స్టాలిన్‌ మిత్రపక్షాలకు ’ఫ్రీ హ్యాండ్‌’ ఇచ్చి, విజయ్‌కు మార్గం సుగమం చేశారు. డీఎంకే ప్రతినిధి ఎ.శరవణన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాఉ. ‘రాజ్యాంగ సంక్షోభం నివారించాలనే స్టాలిన్‌ కోరికపైనే ఈ మద్దతు‘ వచ్చింది. ఇది తమిళ రాజకీయాల్లో స్థిరత్వానికి స్ట్రాటజిక్‌ చర్యగా కనిపిస్తోంది.

స్టాలిన్‌ వ్యూహం..
స్టాలిన్‌ చొరవ డీఎంకే మిత్రపక్షాలను ఏకకాలంలో విజయ్‌ వైపు మళ్లించింది. వీసీకే, వామపక్షాలు మద్దతు ప్రకటించడం వెనుక ఆయన సమావేశాలు కీలకం. అయితే, కాంగ్రెస్‌పై డీఎంకే నేతలు గుర్రుగా ఉన్నారు. ‘మా కార్యకర్తల శ్రమతోనే వారికి 5 సీట్లు దక్కాయి, కానీ కృతజ్ఞతలు లేవు‘ అని శరవణన్‌ ఆరోపించారు. అయితే ఈ డెవలప్‌మెంట్‌ స్టాలిన్‌ రాజకీయ ఎత్తుగడను చూపిస్తుంది. ఓటమి ఎదుర్కొన్న డీఎంకే, విజయ్‌ ప్రభుత్వాన్ని స్థిరపరచి భవిష్యత్‌ కూటములకు మార్గం తీర్చుకుంది.

విజయ్‌ టీవీకే అధికారంలోకి రావడం తమిళనాడులో నూతన యుగానికి సూచిక. స్టాలిన్‌ చొరవ రాష్ట్రంలో స్థిరత్వాన్ని నెలకొల్పుతూ, డీఎంకే భవిష్యత్‌ ఎన్నికల్లో పునరుద్ధరణకు ఆధారం వేస్తోంది. ఇది పార్టీల మధ్య అనుకూల సంబంధాలు, ప్రత్యర్థులపై రాజకీయ ఒత్తిడి ఎలా పనిచేస్తాయో చూపుతుంది.

Balakrishna: బాలకృష్ణ విషయంలో క్లారిటి మిస్ అవుతున్న దర్శకులు…

Balakrishna: ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ చాలా తక్కువ సమయం లోనే మాస్ హీరోగా అవతరించాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేశాడు. అందుకే ఆయన టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరచలేదు. అందుకే ఆయన సినిమాల వచ్చిన, ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రేక్షకులందరికి పూనకాలు వస్తాయి.

బాలయ్య చేస్తున్న ప్రతి సినిమాలో ఇంటెన్స్ యాక్టింగ్ అయితే కనిపిస్తుంది. నటన విషయంలోనే కాకుండా సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని పరిశీలించి మరి ఒక సినిమాను చేస్తాడు. అయితే దర్శకులు అతన్ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేయడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

ఒకప్పుడు రాఘవేంద్ర రావు, సింగితం శ్రీనివాస్ రావు, కోడి రామకృష్ణ, బి.గోపాల్ లాంటి దర్శకులు అతన్ని చాలా వైల్డ్ గా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేసి వాళ్ళు సఫలమయ్యారు. కానీ ఇప్పుడున్న దర్శకులు బాలయ్య బాబును చాలా రొటీన్ వే ప్రజెంట్ చేస్తున్నారు. దీనివల్ల అటు బాలయ్య బాబుకే కాకుండా ఆయన అభిమానులు కూడా కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ఎప్పుడు మాస్ ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలనే చేస్తున్నాడు తప్ప ఆయనని సరిగ్గా వాడుకోవడం లేదంటూ మరికొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు దర్శకుల హీరో కాబట్టి డైరెక్టర్ ఏం చెబితే అది చేయడానికి తను సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఒక మంచి కథతో ఆయనతో సినిమా చేస్తే సినిమా ఎక్కువ రోజులు పాటు గుర్తుండిపోతుందని అలాగే అతని అభిమానులు కూడా ఆనందించడానికి ఆస్కారం ఉంటుందని పలువురు సినిమా మేధావులు చెబుతుండడం విశేషం…ఇక ఇప్పటి వరకు ఎవ్వరికి లేని గుర్తింపును సంపాదించుకోవడంలో బాలయ్య సఫలం అయ్యాడు…

Ram Charan Peddi: పెద్ది తో లెక్కలు మారబోతున్నాయా… ఈ మూవీ ద్వారా సుకుమార్ కి ఏంటి లాభం…

Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా చేసిన సినిమాలన్నీ సక్సెస్ ఫుల్ గా నిలిచాయి. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందట. వచ్చేనెల నాలుగో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లెక్కలు కూడా మారబోతున్నాయి అంటూ సినిమా యూనిట్లో కొన్ని చర్చలైతే జరుగుతున్నాయి. ఇక దీని మీద దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. మొత్తానికైతే రామ్ చరణ్ కి తను ఒక భారీ సక్సెస్ ఇవ్వబోతున్నాననే ఒక కాన్ఫిడెంట్ లో బుచ్చిబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన చాలా వరకు డిలా పడిపోయాడు. ప్రస్తుతం ఉన్న టైర్ వన్ హీరోలతో పోటీ పడే స్థాయిలో అతను కొంతవరకు వెనకబడిపోయాడనే చెప్పాలి. ఇక పెద్ది సినిమా తనకు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టే సినిమా అవుతుందా? లేదంటే మరోసారి తను డీలా పడిపోయే విధంగానే ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సుకుమార్ ఈ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

తన సొంత సినిమాని సైతం పక్కనపెట్టి ఈ సినిమా మీద అంత కేర్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే బుచ్చిబాబు అంటే తనకు చాలా ఇష్టమని చిన్నప్పుడు తను లెక్కల మాస్టర్ గా ఉన్నప్పుడు బుచ్చిబాబు తన స్టూడెంట్ గా ఉండేవాడు. ఇక సుకుమార్ సినిమాలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బుచ్చిబాబు సైతం ఇండస్ట్రీకి వచ్చి సుకుమార్ దగ్గరే డైరెక్షన్ టీమ్ లో పనిచేసి ప్రస్తుతం డైరెక్టర్ గా రాణించే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు.

కాబట్టి అతను అంటే తనకు చాలా ఇష్టమని తన స్టూడెంట్ ఎక్కడా కూడా తప్పు చేయకూడదనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ దగ్గరుండి మరి పెద్ది సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తను క్షుణ్ణంగా చూసుకుంటున్నాడట. ఈ సినిమా ద్వారా సుకుమార్ కి వచ్చే లాభమేంటి అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ని కూడా సుకుమారే అందించినట్టుగా తెలుస్తుంది. ఈ మూవీకి అతను రైటర్ గా వ్యవహరించారు. కాబట్టి దానికి రెమ్యునరేషన్ ని కూడా పొందుతున్నాడు. దాదాపు ఈ సినిమాకి తన అప్పీరియన్స్ ఉన్నందుకు తన సినిమాలో ఇన్వాల్వ్ అయినందుకు దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…

Hetero Parthasaradhi Reddy: హెటిరో పార్థసారధి రెడ్డి సింధు హాస్పిటల్.. ఇంత కథ నడిచింది

Hetero Parthasaradhi Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో నేడు పర్యటనకు వస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతున్నారు. ఇందులో ఒక ప్రైవేట్ కార్యక్రమం కూడా ఉంది. సాధారణంగా మోడీ ప్రైవేట్ కార్యక్రమాలకు అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఆయన తెలంగాణలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నారు. అది కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఓ రాజ్యసభ సభ్యుడిది. వాస్తవానికి బిజెపి, బీఆర్ఎస్ తెలంగాణలో బద్ధ శత్రువులుగా ఉన్నాయి. అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ హాస్పిటల్ ను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం ఇక్కడ చర్చనీయాంశం.

ప్రధానమంత్రి హైదరాబాదులో సింధు అనే ఆసుపత్రిని ప్రారంభించబోతున్నారు. ఈ ఆసుపత్రిని నిర్మించింది హెటిరో చైర్మన్, భారత రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డి. తన కుమార్తె కృష్ణ సింధూరి జ్ఞాపకార్థం హైటెక్ సిటీలో పార్థసారధి రెడ్డి అద్భుతమైన క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. ఈ ఆసుపత్రి వెనుక ఒక ఆసక్తికరమైన రాజకీయ కథ ఉంది. 2018లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ప్రభుత్వం ఖానా మెట్ ప్రాంతంలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని.. దీని విలువ దాదాపు 500 కోట్ల వరకు ఉంటుంది.. కేవలం 1.47 లక్షల వార్షిక అద్దెకు సాయి సింధు ఫౌండేషన్ కు కేటాయించింది. ఈ నేపథ్యంలో హెటిరో గ్రూప్ భారత రాష్ట్ర సమితికి 120 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది. ఇది జరిగిన కొద్దీ రోజులకే పార్థసారధి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే దీనిపై 2023లో హైకోర్టు జోక్యం చేసుకుంది. భూమి లీజు పూర్తిగా చట్ట విరుద్ధమని.. దీనిని ఒకసారి పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ భూమి కేటాయింపును తీవ్రంగా తప్పు పట్టారు. అధికారంలోకి వస్తే ఈ భూ కేటాయింపులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

సరిగా 2024 మార్చిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ భవనంలో అప్పటికే ఆసుపత్రి నిర్మాణం సగం వరకు పూర్తయింది. దీంతో జీవో 37 ను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. నాడు జైలుకు పంపిస్తానన్న రేవంత్ సైలెంట్ అయిపోయారు. ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకే వేదిక మీద ఉంటారు. ఈ ఆస్పత్రి స్టోరీలో భూమి ఇచ్చింది భారత రాష్ట్ర సమితి.. తదుపరి నిర్మాణం పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో.. బాధ్యత పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. మొత్తంగా మూడు పార్టీల వల్ల లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి పార్థసారధి రెడ్డి. ఇలాంటి రాజకీయాలు తెలంగాణ రాష్ట్రానికి కొత్త కాదు. గతంలో చాలా జరిగాయి. ఇకముందు కూడా జరుగుతాయి.

PM Modi Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు.. ప్రాంగణం మొత్తం హై టెన్షన్..

PM Modi Meets Pawan Kalyan: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన జరగనున్న సంగతి తెలిసిందే . పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభని సాయంత్రం నిర్వహించబోతున్నారు. ఈ సభకు లక్ష మందికి పైగా జనాలు హాజరయ్యే అవకాశాలు ఉండడం తో పోలీసులు భారీ బందోబస్తు ని ఏర్పాటు చేశారు. అదే సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి , సహజంగానే భారీ ఎత్తున బందోబస్తు ఉంటుంది కదా, స్పెషల్ గా ఎందుకు చెప్తున్నారు అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఒక ప్రధాని కి ఉండాల్సిన ప్రోటోకాల్ నేడు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉంది. అందుకు కారణం నేడు సాయంత్రం ఆయన పవన్ కళ్యాణ్ ని కలవబోతుండడమే.

రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి నాజల్ సర్జరీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కారణం చేత ఆయన గత రెండు వారాల నుండి హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నాడు కానీ , పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఫోన్ లో పవన్ కళ్యాణ్ ని పరామర్శిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్న ప్రధాన మంత్రి మోడీ, ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నాడు. ప్రధాని వస్తున్నాడు కాబట్టే, ఆ స్థాయి బందోబస్తు ని హైదరాబాద్ లోని పవన్ నివాసం వద్ద ఏర్పాటు చేశారు. ఆ ఇంటి సమీపం లో రోడ్లను కూడా బ్లాక్ చేశారు. అటు వైపు సామాన్యులను పోనివ్వడం లేదట. కేవలం పవన్ కళ్యాణ్ ఇంటికి మాత్రమే కాదు , సీఎం నారా చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళబోతున్నారట ప్రధాని నరేంద్ర మోడీ.

భారత దేశ ప్రధాని మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లడం అనేది చిన్న విషయం కాదు. దీనిని బట్టీ ప్రధాని మోడీ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి అభిమానమో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ భేటీ లో కేవలం పరామర్శ మాత్రమే ఉంటుందా?, లేదంటే రాజకీయ పరమైన చర్చలు కూడా జరుగుతాయా అనేది తెలియాల్సి ఉంది. ఒకపక్క తమిళనాడు రాహుల్ గాంధీ సమక్షం లో విజయ్ సీఎం గా ప్రమాణస్వీకారం చేయగా, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ తో పవన్ భేటీ అవ్వడం పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా లో నేడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి కనిపిస్తున్నారు.

CM Vijay Speech: వాటిని సినిమా డైలాగులు చేయకపోతే.. విజయ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం ఖాయం

CM Vijay Speech: మన దేశాన్ని సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పరిపాలించిన వారిలో నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ వంటి వారు ముఖ్యులు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏకంగా ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టారు. మన్మోహన్ సింగ్ రికార్డును కూడా గతంలోనే ఆయన చెరిపివేశారు. దేశ రాజకీయాలలో నరేంద్ర మోడీ చూపిస్తున్న మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశ రాజకీయాలను నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు, ప్రధాని అయిన తర్వాత అన్నట్టుగా వర్గీకరించుకోవచ్చు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు.. పాలనపరంగా అనేక రకాల సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కలిగే విధంగా చేశారు. ప్రభుత్వం ఏదైనా చేస్తుందని భరోసా కల్పించారు. పారిశ్రామికంగా.. వ్యవసాయపరంగా.. రకరకాల మార్పులు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. ఫలితంగా దేశ ప్రధానిగా ఆయనను ఈ ప్రజలు మొత్తం నమ్మారు. వరుసగా మూడవ పర్యాయం ప్రధానమంత్రిగా ఎన్నికై.. దేశ ప్రజలకు ఆయన సుపరిపాలన అందిస్తున్నారు.

ఇప్పుడు విజయ్ కూడా అదే దారిలో ఉన్నట్టు కనిపిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. అనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు తమిళ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా మీడియా ఆయన మాటలకు విపరీతమైన కవరేజ్ ఇచ్చింది. విజయ్ మాట్లాడిన మాటలు సినిమా డైలాగుల మాదిరిగా ఉండకుండా.. వాస్తవ రూపం దాల్చితే మాత్రం ఆయన పొలిటికల్ లైఫ్ మరోవైపు టర్న్ తీసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

విజయ్ డైలాగులు ఇవి

“ప్రభుత్వంలో ఒకే అధికార కేంద్రం ఉంటుంది. నేను మాత్రమే. అన్ని వైపులుగా అధికార కేంద్రాలు ఉండవు.

ఇది కొత్త చరిత్రకు నాంది. కొత్త శకానికి ప్రారంభం. పూర్తి సెక్యులర్, సోషల్ జస్టిస్ ఇవాల్టి నుంచి ఇక్కడ షురూ అవుతుంది.

నేను మీ వాడిని. తప్పు చేయను. తప్పు చేయడానికి ఆస్కారం ఇవ్వను. ఆ తప్పు చేసేవారు ఎవరైనా సరే కోదిరిపెట్టను.

నాకు డబ్బు అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన ఒక పైస కూడా తినాల్సిన అవసరం నాకు లేదు.

నేను చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉంటుంది. అందులో ధైర్యం ఉంటుంది. ముక్కుసూటితనం అంతకంటే ఉంటుంది

నేను తప్పుడు హామీలు ఇచ్చే వ్యక్తిని కాదు. చేసే స్థాయి ఉంటే మాత్రమే వాటిని ఇవ్వగలుగుతాను.

ఇక ఇప్పటినుంచి మాదకద్రవ్యాల నియంత్రణ మొదలవుతుంది. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైంది.

మహిళలు మన గౌరవానికి ప్రతీక. వారి భద్రత అనేది మనకు అత్యంత ముఖ్యం. అందువల్లే వారికి సేఫ్టీ అందిస్తాం. సెక్యూరిటీ కూడా కల్పిస్తాం.

నన్ను విమర్శిస్తారు. ఇందులో నా స్నేహితులు ఉండవచ్చు. శత్రువులు కూడా ఉండవచ్చు. తమిళనాడులో ఉన్న 8 కోట్ల మంది కూడా నా వాళ్లే

నేను దైవదూత అని చెప్పడం లేదు. ప్రవక్త లాగా పూజించండి అని చెప్పడం లేదు. నేను కేవలం మనిషిని మాత్రమే

నేను గొప్ప కుటుంబాన్ని నుంచి రాలేదు. మాది రాజవంశం కాదు. నేను సామాన్యుడిని. కంటే ముందు మీలో ఒకడిని.

కోట్ల మంది ప్రజలు నా పక్కన నిలబడితే నేను దేన్నైనా స్వీకరించగలను. సాధించగలను. అధిగమించగలను. ఆ నమ్మకం నాకు పూర్తిస్థాయిలో ఉంది.

మీరందరూ కలిసి నాతో రండి. తమిళనాడు రాష్ట్రానికి కొత్త తరహాలో ఒక ప్రభుత్వాన్ని కల్పించి.. ప్రజలకు సేవ చేద్దాం.

ఈ పది మాటలు విజయ్ నోటి వెంట నుంచి వచ్చాయి. ఆయన మాట్లాడుతున్నంత సేపు ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఒకవేళ ఈ పది మాటలను వచ్చే ఐదు సంవత్సరాలలో విజయ్ కనక తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయగలిగితే.. ఈ దేశ ప్రజానీకం ఇటువంటి నాయకుడిని కోరుకుంటుంది. అది విజయ్ ద్వారానే జరగాలని భావిస్తే.. ఆయన ప్రధానమంత్రి అవడం కచ్చితంగా తథ్యం.

Vijay Cabinet Minister Keerthana: టిడిపి సోషల్ మీడియాలో కీలకం.. ఇప్పుడేమో విజయ్ కేబినెట్లో మంత్రి.. ఈ తెలుగు మహిళ గురించి తెలుసా..

Vijay Cabinet Minister Keerthana: ఒకప్పుడు టిడిపి సోషల్ మీడియా విభాగంలో కీలకంగా పని చేసింది. టిడిపికి సోషల్ మీడియాలో తిరుగులేని స్థాయిని అందించింది. ఆ తర్వాత ఆమె జీవితం మరోవైపు టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.

విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ మహిళ పేరు కీర్తన. ఆమెది సామాన్య కుటుంబం. రాజకీయం మూలాలు లేవు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విజయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..

కీర్తనది తెలుగు మూలాలు ఉన్న కుటుంబం. ఈమె విరుద్ నగర్ జిల్లాలోని చిత్ర రెడ్డియ పట్టి ప్రాంతానికి చెందినవారు. ఈమె డిగ్రీ వరకు ఇక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకున్నారు. ప్రశాంత్ కిషోర్ బృందంలో కొంతకాలం పని చేశారు. గోవా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. 2021 ఎన్నికల్లో తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం కూడా ఆమె పని చేశారు. హైదరాబాదులో టిడిపి సోషల్ మీడియా లో కీలక పర్యవేక్షకురాలుగా పనిచేశారు. అప్పుడే ఆమె తెలుగు మీద విపరీతమైన పట్టును సాధించారు.

సోషల్ మీడియాలో శివకాశి నియోజకవర్గంలో సమస్యల మీద ఒక వీడియో రూపొందించిన ఆమె.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఆమె పొలిటికల్ లైఫ్ ను మార్చేసింది.. ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత విజయ్ బృందం ఆమెను సంప్రదించింది.. ఆమెకు టికెట్ కూడా కేటాయించింది. కీర్తన వినూత్న శైలిలో ప్రచార చేసే ఆకట్టుకుంది. ప్రచార సమయంలో తెలుగులో మాట్లాడి చాలామంది ఓటర్లను ఆకర్షించారు. శివకాశి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ మీద 11 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో గెలిచిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. విజయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త చరిత్ర తన పేరు మీద రాసుకున్నారు.

Vijay CM Oath Ceremony: త్రిష ఆశల మీద నీళ్లు చల్లిన తమిళనాడు సీఎం విజయ్

Vijay CM Oath Ceremony: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారానికి విజయ్ తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ ఉచిత విద్యుత్, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిరోధం వంటి వాటి బిల్లుల మీద కీలకమైన సంతకాలు చేశారు. తద్వారా ప్రజాక్షేమమే తన ప్రధాన కర్తవ్యమని వ్యాఖ్యానించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైనది పవర్ సెంటర్ గురించి. తమిళనాడు ప్రభుత్వంలో తాను ఒక్కడినే పవర్ సెంటర్ గా ఉంటానని.. నా పార్టీలో, ప్రభుత్వంలో మరొక పవర్ సెంటర్ ఉండబోదని విజయ్ వ్యాఖ్యానించాడు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు త్రిష ఆశల మీద నీళ్లు చల్లాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇటీవల త్రిష విజయ్ తో తాను సాగిస్తున్న బంధాన్ని ఓపెన్ గానే బయటపెట్టారు. విజయ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విజయ్ కి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, విజయ్ కి తిరుమల ప్రసాదం కూడా అందించారు. విజయ్ తల్లిదండ్రులతో చాలాసేపు మాట్లాడారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరయ్యారు. అతడు తల్లిదండ్రులతో చాలా సేపు ముచ్చటించారు. త్రిషను విజయ్ తల్లి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు..

ప్రమాణస్వీకారం తర్వాత పవర్ సెంటర్ గురించి విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్య మంత్రి అయిన నేపథ్యంలో.. త్రిష పవర్ సెంటర్ పాత్ర పోషిస్తారని అందరు అనుకున్నారు. కానీ విజయ్ ఆ వ్యాఖ్యలకు ప్రారంభంలోనే చెక్ పెట్టారు. ఫలితంగా త్రిష పాత్ర ఒక స్థాయి వరకే పరిమితం అవుతుందని.. ప్రభుత్వాన్ని, పార్టీని ఆమె ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. విజయ్ ఆదిలోనే ఇలా మాట్లాడటంతో ఇక త్రిష ఎమ్మెల్యే కాదని.. ఆమె చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి కూడా కాలేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Peddi Overseas Bookings: అంచనాలను అందుకోలేకపోతున్న ‘పెద్ది’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్.. 48 గంటల్లో వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Peddi Overseas Bookings: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత మన టాలీవుడ్ లో విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. పైగా డిజాస్టర్లు ఎక్కువ, యావరేజ్ గా ఆడిన సినిమాలు పట్టుమని రెండు మూడు కూడా లేవు. బయ్యర్స్ చేతుల్లో డబ్బులు లేవు , థియేటర్స్ మూతలు పడుతున్నాయి. ఇంతటి ఘోరమైన కరువు ‘పెద్ది’ తర్వాత మాయం అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు. జూన్ 4 ఎప్పుడెప్పుడు వస్తుందా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ కంటే ట్రేడ్ వర్గాలే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టారు మేకర్స్ .

అభిమానుల్లో ఈ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి. ఓజీ, దేవర , పుష్ప 2 , కల్కి రేంజ్ బుకింగ్స్ కచ్చితంగా జరుగుతాయని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు , చాలా భిన్నంగా ఉంది. ముఖ్యంగా నార్త్ అమెరికా విషయానికి వస్తే , బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. ఇలా ఉంటుందని అసలు ఎవ్వరూ ఊహించలేదు. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందించిన లెక్కల ప్రకారం ఈ చిత్రానికి బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లో 1 లక్షా 47 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షోస్ దాదాపుగా వెయ్యికి పైగానే షెడ్యూల్ చేశారు. ఈ రేంజ్ షోస్ షెడ్యూల్ చేసిన తర్వాత , పెద్ది స్థాయి భారీ హైప్ ఉన్న సినిమాలకు ఈపాటికే 5 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి.

‘ఓజీ’ , ‘సలార్’, ‘దేవర’, ‘కల్కి’ వంటి చిత్రాలకు అలాగే వచ్చాయి. కానీ ‘పెద్ది’ కి ఎందుకు ఇంత తక్కువ గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఇక 48 గంటలు గడిచిన తర్వాత ‘పెద్ది’ చిత్రానికి కేవలం 1 లక్షా 72 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే ముందు రోజుతో పోలిస్తే కేవలం 28 వేల డాలర్లు మాత్రమే పెరిగాయి అన్నమాట. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఓజీ చిత్రానికి 48 గంటల్లో 5 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు ఏకంగా 2 లక్షల 47 వేల డాలర్ల గ్రాస్ పెరిగింది. ఈ రేంజ్ లో కనీసం పావు శాతం కూడా లేకపోవడం బాధాకరం. అయితే ప్రస్తుత బుకింగ్స్ ఎలా ఉన్నా, థియేట్రికల్ ట్రైలర్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి , చూడాలి మరి ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుంది అనేది .

Vijay CM Oath: విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాహుల్ గాంధీ కి అవమానం.. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు..

Vijay CM Oath: ఎట్టకేలకు భారీ పొలిటికల్ హై డ్రామా అనంతరం తమిళ హీరో విజయ్ కాస్త ఇప్పుడు సీఎం విజయ్ గా మారాడు. నేడు గవర్నర్ సమక్షం లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన మొత్తం విజయ్ ఫ్యాన్స్ కి తిరుగులేని జ్ఞాపకం గా మారనుంది. ఒక సినిమా హీరో రాజకీయాల్లోకి వచ్చి, మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. తమిళనాడు లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే, విజయ్ సృష్టించింది ఒక హిస్టరీ. కానీ ఆయన ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాడు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు , శత్రువులు ఉండరు అని అందరూ అంటుంటారు. ఎన్నికల ప్రచారం సమయం లో కాంగ్రెస్ ని అవినీతి పార్టీ అని దూషించి, ఇప్పుడు సీఎం అవ్వడం కోసం ఆ పార్టీ మద్దతు కోరడం విజయ్ చేసిన మొదటి పొరపాటు.

దశాబ్దాల నుండి డీఎంకే తో కూటమిలో కొనసాగుతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ.. ఎన్నో కష్టపమైన సమయాల్లో డీఎంకే పార్టీ కాంగ్రెస్ కి అండగా నిల్చింది. నేడు కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా దక్కిందంటే , అందుకు కారణం కూడా డీఎంకే పార్టీ నే. అలాంటి పార్టీ కి కూటమి సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ , నీతి నియమాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అవకాశం చూసుకొని నేడు విజయ్ టీవీకే తో జత కట్టింది. ఇది కచ్చితంగా ద్రోహం చేయడమే, విజయ్ అందుకు ప్రోత్సాహం కూడా అందించినట్టే లెక్క. అవకాశం చూసుకొని డీఎంకే పార్టీ కి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్, రేపు విజయ్ టీవీకే పార్టీకి వెన్నుపోటు పొడవదు అని ఎలా అనుకుంటున్నారు?, కచ్చితంగా సమయం అనుకూలించకపోతే జరిగేది అదే.

ఇకపోతే నేడు విజయ్ ప్రమాణస్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ ని టీవీకే పార్టీ నాయకులూ పట్టించుకోకపోవడం గమనార్హం. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేరుగా విజయ్ వద్దకు వెళ్లి కృతఙ్ఞతలు తెలిపారు. కానీ విజయ్ నేడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి కారణమైన రాహుల్ గాంధీ ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీన్ని అన్ని ఇతర పార్టీల నాయకులూ ఒక రేంజ్ లో వైరల్ చేస్తూ రాహుల్ గాంధీ ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భవిష్యత్తులో ఈ అతుకుల బొంత లాంటి ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Bandi Sanjay Son Case: ఆరోపణలు ప్రత్యారోపణలు.. కొడుకు కేసుపై బండి సంజయ్‌ సంచలన ప్రకటన

Bandi Sanjay Son Case: తెలంగాణ బీజేపీలో కీలక నేత.. కరుడుగట్టిన హిందుత్వ వాది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తనయుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. అదే సమయలో కరీంనగర్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సాయి భగీరథ్‌ కూడా హనీట్రాప్‌ కేసు పెట్టారు. ఓ బాలికను అడ్డం పెట్టుకుని ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈమేరకు మైనర్‌ బాలిక తల్లిదండ్రులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

పొలిటికల్‌ టర్న్‌..
రాజకీయ నేతల పిల్లలు చేసే కొన్ని పనులు.. నేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. రాజకీయంగా ఇబ్బందులు తెస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విషయంలో కూడా ఆయన కుమారుడు సాయి భగీరథ్‌ చేసే పనులు ఇబ్బందిగా మారుతున్నాయి. కష్టపడి సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు సంజయ్‌ ఎదిగారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మహేంద్ర కాలేజీలో సహచర విద్యార్థిపై దాడి ఘటన సంచలనంగా మారింది. అప్పుడు సంజయ్‌ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్‌ తనయుడిపై పోక్సో కేసు నమోదు కావడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఇది క్రమంగా రాజకీయం రంగు పులుముకుంది. సంజయ్‌ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు కుట్ర చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు.. సంజయ్‌ తనయుడికి సంబంధించిన పాత ఘటనల ఫొటోలతోపాటు తాజా ఘటనల ఫొటోలు వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. సంజయ్‌ తనయుడి కొడుకు అంటూ సంజయ్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కీలక ప్రకటన చేసిన సంజయ్‌..
సంజయ్‌ తనయుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి తాజాగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు చేశారు.
‘నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పహలకు అద్దం పడుతుంది’ అని పేర్కొన్నారు.

‘అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్‌ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి’ అని వెల్లడించారు.

ప్రధాని పర్యటనవేళ కావాలనే..
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్నవేళ తన ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయాలని, తనను అప్రతిష్టపాలు చేయాలని కొందరు కుట్ర చేశారని సంజయ్‌ ఆరోపించారు. కానీ తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందని తెలిపారు. కాలమే ఆరోపణలకు సమాధానం ఇస్తుందని, కుట్రలను బయట పెడుతుందని స్పష్టం చేశారు.

మొత్తంగా ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి సంజయ్‌ తనయుడిపై పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మోదీ సభకు సంజయ్‌ వెళ్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.