Homeఎంటర్టైన్మెంట్PM Modi Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు.....

PM Modi Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు.. ప్రాంగణం మొత్తం హై టెన్షన్..

PM Modi Meets Pawan Kalyan: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన జరగనున్న సంగతి తెలిసిందే . పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభని సాయంత్రం నిర్వహించబోతున్నారు. ఈ సభకు లక్ష మందికి పైగా జనాలు హాజరయ్యే అవకాశాలు ఉండడం తో పోలీసులు భారీ బందోబస్తు ని ఏర్పాటు చేశారు. అదే సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ […]

PM Modi Meets Pawan Kalyan: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన జరగనున్న సంగతి తెలిసిందే . పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభని సాయంత్రం నిర్వహించబోతున్నారు. ఈ సభకు లక్ష మందికి పైగా జనాలు హాజరయ్యే అవకాశాలు ఉండడం తో పోలీసులు భారీ బందోబస్తు ని ఏర్పాటు చేశారు. అదే సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి , సహజంగానే భారీ ఎత్తున బందోబస్తు ఉంటుంది కదా, స్పెషల్ గా ఎందుకు చెప్తున్నారు అని మీరంతా అనుకోవచ్చు. కానీ ఒక ప్రధాని కి ఉండాల్సిన ప్రోటోకాల్ నేడు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉంది. అందుకు కారణం నేడు సాయంత్రం ఆయన పవన్ కళ్యాణ్ ని కలవబోతుండడమే.

రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి నాజల్ సర్జరీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కారణం చేత ఆయన గత రెండు వారాల నుండి హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నాడు కానీ , పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఫోన్ లో పవన్ కళ్యాణ్ ని పరామర్శిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్న ప్రధాన మంత్రి మోడీ, ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నాడు. ప్రధాని వస్తున్నాడు కాబట్టే, ఆ స్థాయి బందోబస్తు ని హైదరాబాద్ లోని పవన్ నివాసం వద్ద ఏర్పాటు చేశారు. ఆ ఇంటి సమీపం లో రోడ్లను కూడా బ్లాక్ చేశారు. అటు వైపు సామాన్యులను పోనివ్వడం లేదట. కేవలం పవన్ కళ్యాణ్ ఇంటికి మాత్రమే కాదు , సీఎం నారా చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళబోతున్నారట ప్రధాని నరేంద్ర మోడీ.

భారత దేశ ప్రధాని మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లడం అనేది చిన్న విషయం కాదు. దీనిని బట్టీ ప్రధాని మోడీ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి అభిమానమో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ భేటీ లో కేవలం పరామర్శ మాత్రమే ఉంటుందా?, లేదంటే రాజకీయ పరమైన చర్చలు కూడా జరుగుతాయా అనేది తెలియాల్సి ఉంది. ఒకపక్క తమిళనాడు రాహుల్ గాంధీ సమక్షం లో విజయ్ సీఎం గా ప్రమాణస్వీకారం చేయగా, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ తో పవన్ భేటీ అవ్వడం పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా లో నేడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి కనిపిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper