Home Blog Page 296

Thalapathy Vijay mother : ఆమె లేకపోతే విజయ్ లేడు… అతడి ఎదుగుదలలో ఈమె పాత్ర అనంతం

Thalapathy Vijay mother : చాలామంది సంగీత అంటుంటారు. ఇప్పటికాలం వారు త్రిష అంటుంటారు. కానీ విజయ్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే వారిద్దరు కొంతమేర కారణం కావచ్చు. కానీ అతని జీవితంలో ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెంట ఉన్నది తనే. తను అతని కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎన్నో ఇబ్బందులు పడింది. చివరికి ఈ స్థాయిలో చూస్తూ ఆనంద పడుతోంది.

నేడు మాతృ దినోత్సవం. ఇంతటి గొప్ప రోజున తన మాతృమూర్తి శోభ కు విజయ్ విలువైన కానుక ఇచ్చాడు. బహుశా ఒక తల్లిగా ఆమెకు ఇంతకంటే గొప్ప బహుమతి ఉంటుందని అనుకోదు. విజయ్ తల్లిగా అంటే కూడా శోభ తమిళనాడులో ప్లే బ్యాక్ సింగర్ గా సుపరిచితురాలు. ఆమె ఇండస్ట్రీలోకి రాకముందే లలిత సంగీత బృందంలో చేరారు. అక్కడ పాటలను ఆలపించేవారు. ఆమె పాడే గుణమే విజయ్ కి వచ్చింది. అందువల్లే విజయ్ తన సినిమాలో అనేక పాటలు పాడారు.. విజయ్ పుట్టిన తర్వాత అతడిని చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేకపోతే.. శోభ ఆయనను తనతో పాటు షూటింగ్ తీసుకెళ్లారు. చెట్టుకు చీర కట్టి.. అందులోనే విజయ్ ని పడుకోబెట్టేవారు. కొడుకు కెరియర్ కోసం ఇవన్నీ కూడా ఆమె త్యాగం చేశారు.

చిన్నప్పుడు విజయ్ విపరీతంగా అల్లరి చేసేవాడు. ప్రతిరోజు దెబ్బలు తగిలించుకొని వచ్చేవాడు. ఎప్పుడైతే తన చెల్లెలు చనిపోయిందో.. ఇప్పుడే విజయ్ పూర్తిగా మారిపోయేవాడు. గదిలోనే కూర్చునేవాడు. పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఆ సమయంలో అతడికి తల్లి శోభ అండగా ఉన్నారు. యోగ, ధ్యానాన్ని అతడి జీవితంలో ఒక భాగం చేశారు. చెల్లి గుర్తుకొచ్చిన ప్రతి సందర్భంలో విజయ్ విపరీతంగా ఏడ్చేవారట. శోభ చేసిన చక్కెర పొంగలి అంటే విజయ్ కి చాలా ఇష్టం. అందువల్లే శోభ విజయ్ కి దానిని వండి పంపించేవారు.

కెరియర్ ప్రారంభంలో విజయ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో శోభ అతడికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో కెరియర్ గొప్పగా సాగుతున్న క్రమంలో విజయ్ మక్కల్ ఇయక్కం అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానిని విజయ తండ్రి రాజకీయ పార్టీగా నమోదు చేశారు. దీంతో విజయ్ పాలిటిక్స్ లోకి ప్రవేశిస్తున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఎక్కువైపోయాయి. దీంతో విజయ్ సివిల్ కోర్టులో దావా కూడా వేశారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను శోభ పూడ్చారు. తండ్రి మీద కోపం ఉన్నప్పటికీ తల్లి విషయంలో విజయ్ ఒక గొప్ప కొడుకు గానే ఉన్నారు. శోభకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. అందువల్లే ఆమె కోసం చెన్నైలో ఒక గుడి కూడా కట్టించారు విజయ్.

చాలామంది సంగీత అనుకుంటారు. ఇంకొంతమంది త్రిష కూడా అనుకుంటారు. అని వీళ్ళిద్దరి కంటే విజయ్ జీవితంలో శోభ ది పరిపూర్ణమైన పాత్ర. ఒక తల్లిగా.. స్నేహితురాలిగా.. శ్రేయోభిలాషిగా శోభ పోషించిన పాత్ర విజయ్ జీవితంలో నూటికి నూరు శాతం.

retired IPS officer wife Case : ఈ కల్పన మామూలు లేడీ కాదు.. అంతా పథకం ప్రకారమే.. 

retired IPS officer wife Case :  తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రశాసన్ నగర్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇంతటి భద్రత ఉండే ప్రాంతంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ (60) ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఆమెను దారుణంగా అంతం చేశారు. ఈ ఘటనలో నిందితుల కోసం పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాన్ని పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకొచ్చారు. ఆమె అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ప్రాణం కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం నివేదికలో కూడా ఇదే తేలింది.
కట్టుదిట్టంగా భద్రత ఉండే ప్రాంతంలో..
ప్రశాసన్ నగర్ లో భద్రత చాలా కట్టు దిట్టంగా ఉంటుంది. పోలీసులు కూడా నిత్యం గస్తీ కాస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఈ ఘటన ఎందుకు జరిగిందనేది అర్థం కావడం లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు దాదాపు 200కు పైగా సిసి టీవీల కేమెరాల ఫుటేజీ పరిశీలించారు. అంతేకాదు కొంతమంది పోలీసులు శుక్రవారం సాయంత్రం నేపాల్ వెళ్లినట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కారు..
ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్పన, మరో ఇద్దరు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆటోలో ఎక్కారని.. వారు నాంపల్లి ప్రాంతంలో దిగినట్టు ఆధారాలు లభించాయి.. వారు నాగ్ పూర్ ప్రాంతానికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లడానికి వారు తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్టు తెలుస్తోంది. వి నేపథ్యంలో పోలీసులు ముందుగానే అక్కడికి వెళ్లారు. రైలు భోగిలలో విస్తృతంగా తనిఖీలు చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ఈ ఘటనకు పాల్పడిన వారు మధ్యలోనే దిగి ఉంటారని తెలుస్తోంది.
ఇదంతా ఎందుకు చేసిందంటే 
కల్పన నేపాల్ దేశానికి చెందిన యువతి. ఈమెకు డబ్బు పిచ్చి చాలా ఎక్కువ. పైగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో డబ్బు బాగా ఉంటుందని ఒక అంచనాకొచ్చింది. పైగా ఈమె వెనుక ఒక ముఠా కూడా ఉంది. కొద్దిరోజుల క్రితం విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ ఇంట్లో పని మనుషులు కావాలని తెలిసింది. దీంతో ఆ ముఠా మనుషులు రంగంలోకి దిగారు. విశ్రాంత ఐపీఎస్ అధికారితో మాట్లాడారు. కల్పన మీ ఇంట్లో పని చేసేందుకు వస్తుందని చెప్పారు. దానికి ఆయన ఒప్పుకున్నారు. అప్పటినుంచి కల్పన వినయ్ ఇంట్లో పని చేస్తోంది. వినయ్ ఈమెను ఇంట్లో మనిషి లాగా నమ్మారు. పైగా ఆయన భార్యకు ఆరోగ్యం అంతంత మాత్రమే. పిల్లలు వేరే ప్రాంతాలలో స్థిరపడ్డారు.. ఇటీవల వినయ్ ఆరోగ్యం సరిగా లేకపోతే బెంగళూరు వెళ్లారు. దానికంటే ముందు కల్పన ఇంట్లో మనిషిలాగా మెదిలిపోయింది. వినయ్ డబ్బులు పెట్టేది.. బంగారం దాచేది చూసింది. వినయ్ బెంగళూరు వెళ్ళిపోగానే ఆ ముఠా సభ్యులు ప్రణాళికను కల్పన చెప్పారు. కల్పన వారు చెప్పినట్టుగానే రంగంలోకి దిగింది. కొంతమంది వ్యక్తులతో కలిసి వినయ్ భార్యను అంతం చేసింది. ఇంతటి దారుణానికి పాల్పడేందుకు ప్రధాన కారణం డబ్బు, బంగారమే.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు చాలా వరకు ఆధారాలు సేకరించారు. త్వరలోనే కల్పన, ఆమె వెనుక ఉన్న ముఠా సభ్యులను పట్టుకుంటామని చెబుతున్నారు.
కల్పనతో చనువుగా ఉన్న వారిని..
కల్పనతో అత్యంత చనువుగా ఉన్న మహిళలను పోలీసులు విచారించారు.. వినయ్ కి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం బెంగళూరు వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత కల్పన ఈ దారుణానికి పాల్పడింది. దానికంటే ముందు ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడింది. సిసి కెమెరాలు మొత్తం రికార్డు అయ్యాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులకు ఒక ఫోన్ లభించింది. అందులో ఉన్న నంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడింది ముగ్గురా లేదా నలుగురా అనేది తెలసి ఉంది. కల్పన మామూలు లేడీ కాదని.. ముందుగానే ఒక పథకం ప్రకారం ఇంట్లో పనిమనిషిగా చేరిందని.. ఆ తర్వాత మొత్తం దోచుకుని పోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమెకు ఈ ఆదేశాలు మొత్తం బయట నుంచి వచ్చాయని.. ఆమె వెనుక ఉన్న ఆ వ్యక్తులు ఎవరో త్వరలోనే బయట పెడతామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

Bandi Sanjay son case : బండి సంజయ్ కొడుక్కి.. ఇది కొత్తేమీ కాదు..

Bandi Sanjay son case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ చుట్టూ వివాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. బండి సంజయ్ కుమారుడు ఒక బాలిక మీద లైంగికంగా దాడి చేశాడని ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదు అయింది. ఫోక్సో చట్టం కింద ఈ కేసు నమోదు కావడంతో రాజకీయంగా కలకలం చెలరేగుతుంది.

దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రి కుమారుడు స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు మొత్తం నిజం కావని.. అవన్నీ బెదిరించడానికి చేస్తున్నవని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇది కోట్ల కోసం తనను ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారని ఆయన కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరంలోని కొంపల్లి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఐదు కోట్ల కోసం తనను ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతోందని అతడు ఆ ఫిర్యాదులో స్పష్టం చేశాడు. ఆ అమ్మాయి తనకు స్నేహితుల ద్వారా పరిచయమైందని.. పార్టీలతోపాటు ఆలయాలకు కూడా ఆమెతో కలిసి వెళ్లినట్టు బండి సంజయ్ కుమారుడు స్పష్టం చేశారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి కుమారుడు చెబుతున్నారు. ఇప్పటికే ఆమెకు 50,000 ఇచ్చానని.. తనను డబ్బుల కోసం ఇంకా ఇబ్బంది పెడుతున్నారని.. తనను కాపాడాలని కేంద్ర మంత్రి కుమారుడు ఇప్పటికే చెప్పారు.

కేంద్ర మంత్రి కుమారుడి మీద ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అతడు మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక వ్యక్తిపై దాడి చేశాడని.. కేంద్ర మంత్రి కుమారుడు వల్ల అతడు తీవ్రంగా గాయపడ్డాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. నాడు గులాబీ పెద్దలు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు. అంతే కాదు కేంద్ర మంత్రి కుమారుడి మీద నాడు అధికార పార్టీకి కరపత్రం గా ఉన్న పత్రికలో ఇష్టానుసారంగా కథనాలు ప్రసారమయ్యాయి. తర్వాత ఈ కేసు సంగతి ఏమైందో తెలియదు.

ఇప్పుడు కేంద్రమంత్రి కుమారుడ మీద మరో ఆరోపణలు రావడం.. ప్రధానమంత్రి తెలంగాణకు వస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాజకీయంగా బండి సంజయ్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో బండి సంజయ్ కుమారుడు తప్పు చేశాడా? లేదా? అనే విషయాలను పక్కన పెడితే.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ కచ్చితంగా ఈ కేసును తీవ్రంగా తీసుకోవాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత మాత్రాన ప్రజల్లో నిర్దోషులు కాలేరు. సోషల్ మీడియా జస్టిస్ పాత్ర పోషించలేదు. అలాంటప్పుడు బండి సంజయ్ కచ్చితంగా తన కుమారుడి విషయంలో నిజాయితీని నిరూపించుకోవాలి.

ఇప్పటికే గులాబీ పార్టీ కౌంటర్ మొదలుపెట్టింది. తన పార్టీ అధినేత కుమారుడు కేటీఆర్ మీద పదేపదే బండి సంజయ్ ఆరోపణలు చేసేవారని.. ఇప్పుడు ఆ బాధ అర్థం అవుతుందా అంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ కుమారుడి మీద కచ్చితంగా విచారణ జరగాలని.. అప్పుడే నిజాలు బయటికి వస్తాయని గులాబీ నేతలు అంటున్నారు.

tamil parties : తమిళ పార్టీల వెనుక ‘కజగం’.. ఎందుకు ఉంటుందో తెలుసా?

tamil parties : తమిళనాడులోని దాదాపు అన్ని పార్టీల పేర్లను గమనిస్తే.. చాలా పార్టీల వెనుక కజగం కామన్‌గా ఉంటుంది. కజగం అంటే తమిళంలో అసోసియేషన్, ఆర్గనైజేషన్, ఫెడరేషన్‌. కామన్‌ పర్పస్‌ కోసం ఏకం కావడం అని అర్థం. ద్రవిడియన్‌ సిద్ధాంతం ప్రకారం తమిళంలో ఈ పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి రాష్ట్ర రాజకీయ చరిత్రలో లోతైన సందర్భాన్ని సూచిస్తాయి. ద్రావిడ ఉద్యమం నుంచి పుట్టిన ఈ సంప్రదాయం, తమిళ గుర్తింపును బలపరచడానికి ప్రతీ పార్టీ దీన్ని స్వంచేసుకుంటోంది.

‘కజగం’ అంటే ఏమిటి?
తమిళంలో ’కజగం’ అంటే సంఘం, సంస్థ, కూటమి లేదా ఫెడరేషన్‌ను సూచిస్తుంది. ఇది సామాన్య పర్పస్‌ కోసం ప్రజలు ఏకం కావడాన్ని సూచిస్తుంది. ద్రావిడ సిద్ధాంతాల్లో ఈ పదం సామాజిక న్యాయం, తమిళ గౌరవం, ప్రాంతీయ ఐక్యతకు చిహ్నంగా మారింది. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజగం), ఏఐఏడీఎంకే(ఆల్‌ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం) నుంచి లేటెస్ట్‌గా విజయ్‌ టీవీకే(తమిళగ వెట్రి కజగం) వరకు ఈ ఫార్ములా కొనసాగుతోంది. ఈ పేర్లు తమిళ ప్రజల్లో భావోద్వేగ బంధాన్ని రేకెత్తిస్తాయి. ద్రావిడ ఉద్యమకారులు దీన్ని ఉపయోగించి కాంగ్రెస్‌ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు.

ద్రావిడ ఉద్యమం నుంచి రాజకీయ ’కే’ ఫ్యాక్టర్‌
1944లో ఈవీ.రామస్వామి నాయకర్‌ స్థాపించిన ద్రావిడ కజగం(డీకే) మొదటి మైలురాయి. 1949లో సీఎం.అన్నాదురై డీఎంకేను విభజించి ప్రారంభించారు, ఇది 1967లో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మగన్‌ ఎమ్జీరామచంద్రన్‌ ఏఐఏడీఎంకేను 1972లో స్థాపించారు. ఈ పార్టీలు సామాజిక సమానత్వం, తమిళ భాషా గౌరవం, హిందీ వ్యతిరేకతపై ఆధారపడి ’కజగం’ను బ్రాండ్‌గా మార్చాయి. విజయ్‌ టీవీకే పేరు ’తమిళగ వెట్రి’ (తమిళనాడు విజయం)తో కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించింది. 2026 ఎన్నికల్లో టీవీకే విజయం ఈ ట్రెడిషన్‌ను కొనసాగించి, ద్రావిడ గుర్తింపును మోడరన్‌ రాజకీయాల్లోకి తీసుకువచ్చింది.

‘కజగం’ తమిళ రాజకీయాల్లో భాషా గుర్తింపు, ఐక్యత చిహ్నంగా మారింది. ఇది ఓటర్లలో భావోద్వేగ ఆకర్షణ కలిగిస్తుంది. డీఎంకే, ఏఐఏడీఎంకే దీనితో అధికారాన్ని పాల్గొన్నాయి, టీవీకే దీనితోనే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటింది. ఇది ద్రావిడ ఉద్యమం యొక్క ఆనవాలను చూపిస్తుంది. ప్రాంతీయ ఐడెంటిటీ జాతీయ పార్టీలకు (కాంగ్రెస్, బీజేపీ) సవాల్‌గా నిలుస్తోంది.

Workplace Relationships: ఆఫీసుల్లో పని పక్కన పెట్టి.. ఆ పనులు చేస్తున్నారు.. 40 శాతం మంది ఆ బాపతే

Workplace Relationships: ఒకప్పుడు వర్క్ కల్చర్ ఈ స్థాయిలో ఉండేది కాదు. కార్పొరేట్ వ్యవహారాలు కూడా ఈ స్థాయిలో సాగుతూ ఉండేవి కాదు. వెస్ట్రన్ కంపెనీలు మనదేశంలోకి వచ్చిన తర్వాత.. పనిచేసే విధానాలలో రకరకాల మార్పులు వచ్చాయి. ఇది కాస్త వర్క్ కల్చర్ మొత్తాన్ని మార్చేస్తున్నాయి. అవి అంతిమంగా రకరకాల వ్యవహారాలకు కారణమవుతున్నాయి.

ఆఫీసుల్లో ఆడ , మగ కలిసి పని చేయడం అనేది నేటి కాలంలో కామన్ గా మారిపోయింది. కొన్ని వెస్ట్రన్ కంపెనీలో అయితే లేడీస్ రాత్రి పూట కూడా పనిచేయాల్సి వస్తోంది. వర్క్ డిమాండ్ పెరిగిపోవడం.. జెండర్ ఈక్వాలిటీ .. ఇలా రకరకాల కారణాలవల్ల లేడీస్ కూడా రాత్రిపూట పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు ఉద్యోగుల మధ్య ఎఫైర్స్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

రోజులో చాలా గంటల పాటు పనిచేయాల్సి వస్తున్న నేపథ్యంలో కార్యాలయాలలో సహ ఉద్యోగుల మధ్య ప్రేమ అనేది కామన్ అయిపోయింది. కొందరు పెళ్లయిన వారు కూడా తమ కొలీగ్స్ తో వ్యవహారం కొనసాగిస్తున్నారు. అమెరికాలో ఇలా 40 శాతం మంది తమ భాగస్వామ్యలను మోసం చేస్తున్నారని ఫోర్బ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఇలాంటి రిలేషన్ ల వల్ల ఉద్యోగుల పనితీరు కూడా ప్రభావితమవుతోంది. ఇంకా కొంతమంది ఉద్యోగులు అయితే తమ తోటి ఉద్యోగులను ఆకట్టుకోవడానికి రకరకాల పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇలాంటి పనుల వల్ల పెళ్లయిన ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలలో చాలా మార్పులు వస్తున్నాయని ఈ సర్వేలో తేలింది. అ కా రణంగా సెలవులు పెట్టడం.. తోటి ఉద్యోగులతో వెకేషన్ వెళ్లడం వల్ల వారి వైవాహిక జీవితాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల కార్యాలయాలలో పని తీవ్రంగా మందగిస్తున్నది. వారి వ్యక్తిగత జీవితాలపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. కొంతమంది ఉద్యోగులు తమ రహస్య బంధాలను ఓపెన్ గానే చెప్పేశారు. ఇటువంటివి తప్పు అయినప్పటికీ.. తప్పడం లేదని వారు చెప్పడం ఆందోళన కలిగిస్తున్నది.

Vijay Rahul Gandhi friendship : విజయ్ ఫోన్ చేయగానే.. రాహుల్ గాంధీ ఎలా ఒప్పుకున్నారు.. ఇంత కథ నడిచిందా..

Vijay Rahul Gandhi friendship : విజయ్ ఎక్కువ సీట్లు సాధించారు. అలాగని టీవీకే అధినేతగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఆయనకు లేదు. ఈ లోగానే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఆయన ఫోన్ చేశారు. మద్దతు ఇవ్వాలని కోరారు. దానికి రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు. కమ్యూనిస్టులు ఇబ్బంది పెట్టినప్పటికీ.. మిగతా పార్టీలు గోడ మీది పిల్లుల మాదిరిగా వ్యవహరించినప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. డీఎంకేతో ఇబ్బందికరమైన వాతావరణం వస్తుందని తెలిసినప్పటికీ.. ఇండియా కూటమిలో రకరకాల సమస్యలు వస్తాయని అంచనా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బేషరతు గా మద్దతు ప్రకటించింది.

వాస్తవానికి విజయ్ ఫోన్ చేయగానే రాహుల్ గాంధీ ఎలా ఒప్పుకున్నారు.. పైగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో రాహుల్ గాంధీ విజయ్ పక్కన కూర్చున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు.. తొలి ఫైల్ మీద సంతకం పెడుతున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత విజయ్ తో కలసి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. స్వల్ప కాలంలో ఇద్దరి మధ్య ఈ స్థాయిలో స్నేహం ఎలా కుదిరింది.. ఇది ఎలా సాధ్యమైందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాహుల్ గాంధీకి, విజయ్ కి ఏర్పడిన స్నేహం ఈనాటిది కాదు. 2009 నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని విజయ్ అనుకున్నారు. అప్పట్లో విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. నాటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు యువజన కాంగ్రెస్ బాధ్యతలను రాహుల్ చూస్తున్నారు. విజయ్ కి తమిళనాడులో యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా ఇస్తామని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు అది కార్యరూపం దాల్చలేదు.

సరిగ్గా 17 సంవత్సరాల తర్వాత తమిళనాడు రాజకీయాలలో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. నాడు కాంగ్రెస్లో చేరాలనుకున్న విజయ్ టీవీకే పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటుచేసిన స్వల్ప కాలంలోనే అధికారంలోకి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో కూడా డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కేవలం ఐదు స్థానాలు మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం పూర్తిగా తగ్గుతున్న నేపథ్యంలో.. విజయ్ పార్టీతో ఏర్పరచుకున్న పొత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.

రాహుల్ గాంధీకి ప్రత్యేకమైన భావజాలం ఉంటుంది. దానికి విజయ్ సరిగ్గా సరిపోతాడని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నిర్వహించిన అనేక సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ఇవన్నీ కూడా విజయ్ తో ఉన్న స్నేహానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి బ్రదర్ అని వ్యాఖ్యానించారు.. దానికంటే ముందు రాహుల్ గాంధీకి విజయ్ తన ప్రమాణ స్వీకారానికి రావాలని కోరితే.. తప్పకుండా వస్తానని రాహుల్ బదులిచ్చారు. ఇచ్చిన మాటను రాహుల్ గాంధీ నిలబెట్టుకున్నారు. ఫలితంగా విసికె, ఐయూఎంఎల్, వామపక్ష పార్టీల సపోర్ట్ తో విజయ్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

65 Inch Smart TVs: 65 అంగుళాల స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. బడ్జెట్ లోనే ఈ 5 టీవీలు..

0

65 Inch Smart TVs:  ఒకప్పుడు చిన్న టీవీకి పెద్ద ధర ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. పెద్ద స్క్రీన్లు కలిగిన టీవీలు బడ్జెట్ లోనే ఉంటున్నాయి. వీటీల్లో లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు, ఇతర ఆప్షన్లు ఉన్నాయి. అలాంటి వాటీల్లో బెస్ట్ 5 టీవీలు మీకోసం. అయితే ఇందులో ఏదీ కొనాలో డిసైడ్ చేసుకోండి..

TCL 65P635 Pro (65 Inches)
తక్కువ బడ్జెట్‌లో భారీ స్క్రీన్ అనుభవాన్ని కోరుకునే వారికి TCL 65P635 Pro ఒక గొప్ప ఎంపిక. ఇది 4K HDR 10 కంటెంట్‌ను సపోర్ట్ చేస్తుంది. ‘డైనమిక్ కలర్ ఎన్హాన్స్‌మెంట్’ టెక్నాలజీతో రంగులను సహజంగా చూపిస్తుంది. ఇందులో Google TV ఓఎస్ ఉండటం వల్ల వేలకొద్దీ యాప్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. 65 ఇంచుల పెద్ద స్క్రీన్ వల్ల ఇంట్లోనే థియేటర్ అనుభూతి కలుగుతుంది. బడ్జెట్ ధరలో లార్జ్ స్క్రీన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. దీని ధర రూ.49,000 నుంచి ప్రారంభం అవుతుంది.

Samsung 55 Inches UHD LED (Crystal 4K)
శామ్‌సంగ్ బ్రాండ్ నమ్మకం. దీని ధర రూ.49,750గా ఉంది. డిస్‌ప్లే క్వాలిటీ కోసం చూసే వారికి ఈ మోడల్ సరిపోతుంది. ఇందులోని Crystal Processor 4K సాధారణ కంటెంట్‌ను కూడా హై-డెఫినిషన్ క్వాలిటీలోకి అప్‌స్కేల్ చేస్తుంది. ఇది చాలా సన్నని (AirSlim) డిజైన్‌తో వస్తుంది. ఇది గదిలో ప్రీమియం లుక్ ను ఇస్తుంది. ప్యూర్ కలర్, HDR ఫీచర్లు ఉండటం వల్ల సినిమా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. శామ్‌సంగ్ సొంత Tizen OS ద్వారా స్మూత్ ఇంటర్‌ఫేస్‌ను పొందవచ్చు.

Toshiba 65 Inches UHD Smart QLED
తోషిబాకు చెందిన ఈ టీవీ QLED (Quantum Dot) టెక్నాలజీతో వస్తుంది. సాధారణ LED టీవీల కంటే ఇవి మెరుగైన బ్రైట్‌నెస్, రంగులను అందిస్తుంది. 65 ఇంచుల స్క్రీన్ సైజుతో పాటు Dolby Vision HDR మరియు Dolby Atmos ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల విజువల్స్ మరియు సౌండ్ క్వాలిటీ రెండూ అద్భుతంగా ఉంటాయి. ఈ టీవీని రూ.48,999తో విక్రయిస్తున్నారు. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ‘గేమ్ మోడ్’ కూడా ఉంది, ఇది లాగ్ లేకుండా స్మూత్ గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

Sony Bravia 43 Inches UHD Smart LED (X74L/X75L)
స్క్రీన్ సైజ్ కంటే పిక్చర్ క్వాలిటీ , బ్రాండ్ వాల్యూ ముఖ్యమనుకునే వారికి సోనీ బ్రావియా మేటి ఎంపిక. 43 ఇంచుల చిన్న స్క్రీన్ అయినప్పటికీ ఇందులోని X1 4K Processor రంగులను చాలా షార్ప్‌గా, స్పష్టంగా చూపిస్తుంది. సోనీ టీవీలలో ఉండే ‘లైవ్ కలర్’ ఫీచర్ రియలిస్టిక్ విజువల్స్‌ను అందిస్తుంది. దీని ఆడియో క్వాలిటీ కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. బెడ్‌రూమ్ లేదా చిన్న గదులకు ఇది అత్యుత్తమ ప్రీమియం టీవీ. దీనిని రూ.44,900 చెల్లించి తెచ్చుకోవచ్చు.

Panasonic 55 Inches UHD LED
పానాసోనిక్ టీవీలు వాటి మన్నిక, సహజమైన రంగులకు ప్రసిద్ధి. ఈ 55 ఇంచుల మోడల్ 4K కలర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది చిత్రాలలోని నాయిస్‌ను తగ్గించి క్లారిటీని పెంచుతుంది. ఇందులో కూడా Google TV ప్లాట్‌ఫారమ్ ఉండటం వల్ల వాయిస్ కంట్రోల్, గూగుల్ అసిస్టెంట్ ఫీచర్లు సులభంగా వాడుకోవచ్చు. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటం వల్ల గదిలో ఏ మూల కూర్చుని చూసినా పిక్చర్ క్వాలిటీ మారదు. అతి తక్కువగా రూ.41,490గా ఉంది.

మీకు ఏది సరిపోతుంది?
మీకు పెద్ద స్క్రీన్ (65 Inches) కావాలంటే TCL లేదా Toshiba ఎంచుకోండి. బెస్ట్ పిక్చర్ క్వాలిటీ కావాలంటే Sony ని ఎంచుకోండి. డిజైన్, బ్రాండ్ ప్రాధాన్యత అయితే: Samsung లేదా Panasonic మంచి ఎంపికలు.

Karimnagar jewellery robbery : కరీంనగర్ దోపిడీ కేసులో కీలక పురోగతి.. బెంగాల్ లో ఇలా చిక్కిన దొంగ

Karimnagar jewellery robbery : కరీంనగర్‌ నడిబొడ్డు జ్యోతినగర్‌లోని పీఎంజే జువెలరీలో ఐదుగురు దుండగులు కస్టమర్ల ముసుగులో దూసుకువచ్చారు. ధర్మపురి లాడ్జీలో రెండు రోజులు ఉండి రెక్కీ చేసిన ఈ గ్యాంగ్, తుపాకులతో సిబ్బందిని బెదిరించి కోట్లాది బంగారు, వజ్రాలు దోచుకున్నారు. ప్రతిఘటించిన నలుగురు సిబ్బందిపై నలుగురు నిందితులు 4 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్‌లో బైకులపై పరారైన దొంగలు గుర్తించబడ్డాయి. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ప్రకారం, ఈ దాడి ప్రొఫెషనల్‌గా జరిగింది. బీహార్‌ లేదా ఇతర రాష్ట్రాల గ్యాంగ్‌ లింక్‌ అనుమానం నెలకొంది.

బెంగాల్‌ బ్రేక్‌ త్రూ..
చోరీ చేసిన బంగారును విక్రయిస్తుండగా పశ్చిమ బెంగాల్‌లో ఒక కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద భారీ మొత్తం బంగారు స్వాధీనం చేసుకుని, నగలు కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా పట్టుకున్నారు. మిగిలిన ఐదుగురు పరారీదారులకు 12 ప్రత్యేక బృందాలు, మూడు రాష్ట్రాల్లో వేట పెట్టాయి. లక్ష రూపాయల రివార్డ్‌ ప్రకటించి ప్రజల సహకారం కోరారు. అయితే తాజా అరెస్టులు దర్యాప్తుకు బలమైన ఆధారాలు అందించాయి. దుండగుల మధ్య లింకులు తెలిస్తున్నాయి.

టెక్, ఇంటర్‌స్టేట్‌ కోఆర్డినేషన్‌..
కేసు నమోదైన వెంటనే సీపీటీ టీమ్, టెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. సీసీటీవీలు, బుల్లెట్‌ కార్ర్‌టిడ్జెస్, బైకు నంబర్లు విశ్లేషణలో బెంగాల్‌ లీడ్‌ వచ్చింది. ఇంటర్‌స్టేట్‌ పోలీస్‌ సహకారంతో వేట వేగవంతమైంది.

తెలంగాణలో జువెలరీ దోపిడీలు రోజువారీలా పెరుగుతున్నాయి – ఆయుధాలు, పక్వ ప్లానింగ్‌ రాష్ట్రీయ నెట్‌వర్క్‌లను సూచిస్తున్నాయి. ఈ కేసు వేగ రికవరీతో పోలీస్‌ సామర్థ్యాన్ని చూపింది, కానీ పరారీలో ఉన్న దొంగలను పట్టుకోవడమే పూర్తి విజయం. ఇలాంటి ఘటనలు వ్యాపారులు, ప్రజల ఆర్థిక భద్రతకు ముప్పు.

 

RCB vs MI: ఈ మ్యాచ్ తోనే ముంబై ఇండియన్స్ భవితవ్యం తేలేది?

RCB vs MI: ఐపీఎల్ లో ప్రస్తుతం కీలక సమరాలు జరుగుతున్నాయి. ప్లే ఆఫ్ బెర్త్ ను నిర్దేశించే మ్యాచ్ లు ఊహకందని విధంగా సాగుతూ ఉన్నాయి. దీంతో క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టి20 మజా లభిస్తోంది. ఇప్పటికే గుజరాత్ జట్టు వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్ దగ్గరికి వెళ్ళింది. ముంబై ఇండియన్స్ కూడా సాంకేతికంగా ప్లే ఆఫ్ జాబితాలో ఉంది. మరోవైపు బెంగళూరు వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది.

ఐపీఎల్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా బెంగళూరు, ముంబై పోటీ పడుతున్నాయి. గడిచిన రెండు మ్యాచ్లలో ముంబై జట్టు వరుసగా ఓడిపోయింది. దీంతో పాయింట్లు పట్టికలో వెనక్కి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ ఆ జట్టుకు చాలా అవసరం. ఈ మ్యాచ్లో గెలిచి ముందుకు వెళ్లాలని బెంగళూరు ప్లేయర్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ముంబై జట్టు సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్ జాబితాలో ఉంది. అందువల్ల ఆ జట్టుకు ఈ మ్యాచ్లో గెలవడం అత్యంత అవసరం. వేల గనుక ఓడిపోతే అధికారికంగా టోర్నీ నుంచి వెళ్లి పోవాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. అదే గనుక జరిగితే ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోరమైన దెబ్బ తగిలినట్టే. వర్షం కురవకూడదని ముంబై ఇండియన్స్ అభిమానులు భావిస్తున్నారు. శనివారం రాత్రి ఇక్కడ విపరీతంగా వర్షం కురిసింది. దీంతో రెండు జట్లు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం లభించలేదు. ఫలితంగా ప్లేయర్లు హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. ఆదివారం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. మ్యాచ్ ప్రారంభమయ్యే నాటికి చిన్న చిన్న జల్లులు కురుస్తాయని వార్తలు వస్తున్నాయి.

వర్షం అంతరాయం వల్ల మ్యాచ్ గనక రద్దు అయితే.. రెండు జట్లకు ఒక పాయింట్ చొప్పున లభిస్తుంది. అప్పుడు మిగతా మూడు మ్యాచ్లో కనుక ముంబై జట్టు విజయం సాధిస్తే.. కేవలం 13 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పది జట్లు పోటీలో ఉన్నప్పుడు.. కేవలం 13 పాయింట్లు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్ దాకా వెళ్ళిన ఉదంతాలు ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. ఇక బెంగళూరు, ముంబై ఇప్పటివరకు 35 సార్లు పోటీ పడ్డాయి. బెంగళూరు 16 సార్లు, ముంబై 19సార్లు విజయం సాధించింది. ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో ముంబైలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు గెలిచింది. బెంగళూరు ఇప్పటివరకు ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడింది. ఆరింట్లో గెలిచింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Honda ZR-V India Launch: భారత్ లోకి రావడానికి రెడీ అయిన హోండా ZR-V.. ఎప్పుడంటే..

0

Honda ZR-V India Launch:  ప్రీమికం కార్ల కోసం ఎదురుచూసేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు చిన్న కారు ఉంటే చాలనుకున్నవారు.. ఇప్పుడు లగ్జరీ కార్లలో తిరగాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలో ప్రత్యేకంగా మార్కెట్లోకి కొత్త మోడల్స్ తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా Honda సంస్థ నుంచి భారత ఆటోమోబైల్ మార్కెట్లోకి ‘హోండా ZR-V’అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ కారు, ఇప్పుడు ఇండియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఈ కారుకు సంబంధించిన ఇంజిన్, ఫీచర్లు లాంచింగ్ తేదీ తెలుసుకోవాలంటే ఈ కిందికి వెళ్లండి..

హైబ్రిడ్ ఇంజిన్:
హోండా ZR-V ప్రధానంగా పవర్‌ట్రెయిన్ ద్వారా ఆకట్టుకోనుంది. ఇందులో 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ సుమారు 181 hp శక్తిని, 315 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ సాంకేతికతతో ఇది అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని అంచనా.

అత్యాధునిక ఫీచర్లు:
ఈ SUV ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 9 అంగుళాల ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 12-స్పీకర్ల బోస్ (Bose) ప్రీమియం ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి హంగులు దీని సొంతం. భద్రత పరంగా హోండా సెన్సింగ్ (ADAS) టెక్నాలజీతో పాటు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి.

డిజైన్:
డిజైన్ పరంగా ఇది సాంప్రదాయ SUVల వలె కాకుండా, స్పోర్టీ క్రాస్‌ఓవర్ లుక్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో హనీకోంబ్ గ్రిల్, స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్ కనిపిస్తాయి. వాలుగా ఉండే రూఫ్‌లైన్ దీనికి ఆధునిక రూపాన్ని ఇస్తాయి. ఇది హోండా సివిక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందించబడటంతో, రోడ్డుపై చాలా స్థిరంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది.

భారత్‌లో విడుదల ఎప్పుడు?
తాజా సమాచారం ప్రకారం.. హోండా ZR-Vని 2026 మే 22న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇది విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకునే (CBU) మోడల్‌గా రానుంది. దీని ధర సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇది మార్కెట్లోకి వస్తే వోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కొడియాక్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Vehicle Caste Stickers Fine: వాహనాలపై ఇక ఆ స్టిక్కర్లు ఉంటే భారీ జరిమానా..

Vehicle Caste Stickers Fine: కొన్ని వాహనాలపై నెంబర్ ప్లేట్లతో రకరకాల స్టిక్లరు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టిక్కర్లలో కులం పేర్లు కూడా ఉంటాయి. అయితే ఇక నుంచి వాహనాలపై కులం పేర్లు కనిపిస్తే చర్యలు ఉండే అవకాశం ఉంది. బీహార్ రాష్ట్ర రవాణా శాఖ ఇలాంటి స్టిక్కర్లపై వాహనదారులకు షాకింగ్ ఆదేశాలు జారీ చేసింది. వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు, గుర్తులు లేదా స్టిక్కర్లు ఇకపై అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ స్టిక్కర్లను తొలగించాలని ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఒకవేళ ఈ స్టిక్కర్లు ఉంటే ఎలాంటి జరిమానాలు వేస్తారు?

వాహన నంబర్ ప్లేట్లు, బాడీలు, బంపర్లు, విండోలు లేదా ఇతర చోట్ల కుల పేర్లు కనిపించకుండా చూడాలని రవాణా శాఖ ఆదేశించింది. ఇప్పటికే రాసుకున్నవారు జూన్ మొదటి వారంలోగా తొలగించాలని తెలిపింది. గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు ప్రారంభిస్తామని, ఇలాంటి ఉల్లంఘనలపై మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫైన్ విషయంలోనూ రవాణా శాఖ స్పష్టత ఇచ్చింది. కులం పేర్లు తొలగించకపోతే మొదట సెక్షన్ 177 కింద రూ.500 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధిస్తారు. తీవ్రమైన కేసుల్లో సెక్షన్ 179 కింద రూ.2,000 వరకు ఫైన్, అవసరమైతే లైసెన్స్ సస్పెన్షన్ కూడా చేసే అవకాశం ఉంది. జిల్లా రవాణా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, అమలును నిర్ధారించారు.

చట్టపరమైన సమస్యలు, రోడ్డు ఉద్రిక్తతలను నివారించడానికే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాహన యజమానులు వెంటనే కుల పేర్లను తొలగించి, నిబంధనలు పాటించాలని సూచించారు. బిహార్‌లో సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే ఈ చర్య ప్రభుత్వ లక్ష్యంతో సమానంగా ఉందని వారు అంచనా వేస్తున్నారు. వాహనదారులు గ్రేస్ పీరియడ్‌ను అవకాశంగా పట్టుకుని, తమ వాహనాలను క్లీన్ చేసుకోవాలని రవాణా శాఖ పిలుపునిచ్చింది. ఈ నియమం అమలు తర్వాత రోడ్లు మరింత శాంతియుతంగా, సమానత్వ భావంతో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Paradise Movie Budget Failure: ‘ప్యారడైజ్ ‘ బడ్జెట్ ఫెయిల్యూర్ గా మిగలబోతుందా…

Paradise Movie Budget Failure: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఎప్పుడైతే గ్లింప్స్ రిలీజ్ అయిందో అప్పటినుంచి సినిమా ఒక సపరేట్ క్యాటగిరిలో చేరిపోయింది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్నప్పటికి ఈ సినిమాలో చాలా మంచి విషయం ఉందని దర్శకుడు ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ రూపంలో చెబుతూనే వస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ దర్శకుడు టాప్ రేంజ్ కి వెళ్ళిపోతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. అయితే మొదట ఈ సినిమాని 100 కోట్లతో చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ 200 కోట్లు దాటింది. దాంతో ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను తెచ్చుకున్న కూడా ప్రస్తుతం నానికి ఉన్న మార్కెట్ ని బట్టి చూస్తే ఈ సినిమా బడ్జెట్ ఫెయిల్యూర్ గా మిగిలే అవకాశాలైతే ఉన్నాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

కుర్ర హీరోలు సైతం 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొడుతుంటే నాని ఇప్పటివరకు 200 కోట్ల క్లబ్లో చేరింది అయితే లేదు. నాని సినిమాలు బాగుంటాయి, అని ప్రేక్షకులు చెబుతూ సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకున్నప్పటికి అవి కలెక్షన్స్ రూపంలో మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి.

దానివల్లే ప్రస్తుతం ఉన్న క్యాలిక్యులేషన్స్ ను బట్టి ఈ సినిమా బడ్జెట్ ఫెయిల్యూర్ గా మారబోతుందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా నాని చేసే సినిమాలకు ఒక సపరేట్ స్టైల్ అయితే ఉంది.

మొన్నటి వరకు ఆయన పక్కింటి కుర్రాడులా కనిపించాడు. కానీ ఇప్పుడు మాస్ అవతారం ఎత్తి ప్రేక్షకులతో విజిల్స్ వేయించాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? ప్రేక్షకులందరికి ఒక హై ఫీల్ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Royal Enfield Global Ranking: శక్తివంతమైన కంపెనీగా Royan Enfield..ర్యాంక్ ఎంతంటే..

0

Royal Enfield Global Ranking: Royan Enfield మరోసారి భారత ఆటోమోబైల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చింది. బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ 2026 నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ఆటోమోబైల్ బ్రాండ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టయోటా, BMW తర్వాత నిలిచిన ఈ భారతీయ బ్రాండ్, ఆడీ, ఫెరారీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను వెనక్కి నెట్టడం విశేషం. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ 2026 నివేదిక వివరాల ప్రకారం.. టయోటా (92.5) మొదటి స్థానంలో నిలవగా.. BMW(88.9) రెండో స్థానంలో నిలిచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 100లో 88.9 బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్కోరు సాధించి AAA రేటింగ్ పొందింది. అదే సమయంలో బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీకి ఉన్న ప్రత్యేకమైన మోటార్‌సైకిల్ గుర్తింపు, ప్రీమియం లైఫ్‌స్టైల్ బ్రాండ్ ఇమేజ్, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎదుగుదల వెనుక గ్లోబల్ విస్తరణ కూడా కీలక పాత్ర పోషించింది. కొత్త మోడళ్లు, క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక టెక్నాలజీ జోడించడం, దేశీయంగానే కాక విదేశీ మార్కెట్లలోనూ అమ్మకాలు పెరగడం బ్రాండ్ బలం పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు పెరుగుతున్న గుర్తింపు, వినియోగదారుల్లో ఏర్పడిన నమ్మకం దీనిని సాధారణ ద్విచక్ర వాహన కంపెనీ స్థాయిని దాటి గ్లోబల్ ఆటో బ్రాండ్‌గా నిలిపాయి.

ఈ నివేదికలో ఇతర భారతీయ ఆటో బ్రాండ్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి. టాటా మోటార్స్ ప్రపంచంలో ఐదో అత్యంత శక్తిమంతమైన ఆటో బ్రాండ్‌గా నిలిచి 88.1 BSI స్కోరు నమోదు చేసింది. మారుతీ సుజుకీ 87.2 స్కోరుతో ప్రపంచంలో ఆరవ అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా నిలిచింది. మహీంద్రా కూడా గ్లోబల్ స్థాయిలో బలమైన స్థానం సంపాదించింది. మహీంద్రా బ్రాండ్ విలువ 17 శాతం పెరిగి 3.8 బిలియన్ డాలర్లకు చేరగా, ప్రపంచ అత్యంత విలువైన ఆటో బ్రాండ్లలో 25వ స్థానాన్ని దక్కించుకుంది. దీని ద్వారా భారత ఆటో రంగం కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, ప్రపంచ బ్రాండ్ పోటీలో గట్టిగా నిలుస్తోందని స్పష్టమైంది.

Venkatesh Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ లో వెంకటేష్ రా ఏజెంట్ గా కనిపిస్తాడా…ఆ సూపర్ హిట్ మూవీని కాపీ చేస్తున్నారా…

Venkatesh Adarsha Kutumbam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ ఫ్యామిలీ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోగా వెంకటేష్ చాలా అరుదైన రికార్డును కూడా తన పేరుతో నమోదు చేసుకున్నాడు. ఇక అలాంటి వెంకటేష్ నుంచి ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆ సినిమాను చూడడానికి అమితంగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా అంటే ప్రతి ఒక్కరికి పండగనే చెప్పాలి. ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న సినిమా మరో మెట్టు పైకి ఎక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకొని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ నవ్వులు పూయిస్తూనే రా ఎజెంట్ గా ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటిని రేకెత్తించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే తన నటనలో సైతం వేరియేషన్స్ చూపించడానికి తనకు ఒక మంచి పాత్ర దొరికిందని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు.

అయితే రా ఏజెంట్ తరహా సినిమా అవ్వడంతో అడవి శేషు చేసిన గూఢచారి సినిమాలో తను కూడా రా ఏజెంట్ గానే పనిచేస్తాడు. అయితే గురూజీ అందులో నుంచి కొన్ని సన్నివేశాలను తీసుకొని ఈ సినిమాను రెడీ చేశాడా లేదంటే మొదటి నుంచే త్రివిక్రమ్ దగ్గర ఈ సినిమా కథ ఉందా అనేది తెలియాల్సి ఉంది…

కొంతమంది అయితే గూడచారి సినిమానే ఆడియన్స్ కి అర్థం కాకుండా రిలేటెడ్ గా ఒక వెర్షన్ రాసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే స్టోరీ ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమా ఏదైనా కథకు కాపీనా లేదంటే ఫ్రెష్ కత్తితోనే సినిమా చేశారా అనే విషయం మీద క్లారిటి అయితే రాదు…

Vijay Favorite Telugu Hero: తలపతి విజయ్ కి ఇష్టమైన తెలుగు హీరో, పొలిటీషియన్స్ వాళ్లేనా…

Vijay Favorite Telugu Hero: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు తమిళ తో పాటు ఇతర భాషల్లో కూడా చాలా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు తెలుగులో మంచి పాపులారిటిని సంపాదించుకున్నారు. విజయ్ లాంటి నటుడు సైతం తుపాకీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అప్పటినుంచి ఆయన ఏ సినిమాలు చేసిన కూడా అవి తెలుగులో డబ్బావుతూ రిలీజ్ అవుతూ గొప్ప ఆదరణ ను సంపాదించుకుంటున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన టీవీకే పార్టీని స్థాపించాడు. ఆయన పార్టీ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఇక తెలుగులో తనకి ఇష్టమైన హీరో ఎవరు? తనకి తెలుగు రాష్ట్రాల్లోనే నాయకుల్లో ఇష్టమైన పొలిటిషన్ ఎవరు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గతంలో విజయ్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే తెలుగు హీరోల్లో ఆయనకి చిరంజీవి అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు.

ఇక తనకి ఇష్టమైన పొలిటిషన్ ఎవరంటే ఆయన పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం విశేషం… ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క భావజాలం చాలా బాగుందని అతను రాజకీయం చేయడంలేదు.
జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్ లోకి వచ్చానని ఆయన పలు సందర్భాల్లో చెప్పాడు.

ఇక ఈ విషయాన్ని అప్పట్లో కోలీవుడ్ మీడియా సైతం అతన్ని హైలెట్ చేసింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ బాటలోనే విజయ్ సైతం రాజకీయాల్లోకి వచ్చి చాలా గొప్ప విషయం సాధించడమనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… అతని పాలన ఎలా ఉంటుందిదో దాన్ని బేస్ చేసుకొని తను నెక్స్ట్ టైం సక్సెస్ ని సాధిస్తాడా లేదంటే ఫెయిల్యూర్ ను చవి చూడాల్సిన పరిస్థితి వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది…

మొత్తానికైతే ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా సత్తా చాటిన విజయ్ రాజకీయ రంగంలోనూ విజయానాన్ని సాధించాలని కోరుకుందాం…అలాగే తమిళ నాడు లో ఎంజీఆర్ తర్వాత అంతటి పాపులారిటిని సంపాదించుకున్న నాయకుడు కూడా తనే కావడం విశేషం…

Peddi Movie: ‘పెద్ది’ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఎన్ని వందల కోట్లు గ్రాస్ రావాలో తెలుసా..

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సందర్భంగా, మేకర్స్ ఈ సినిమా కోసం వేరే లెవెల్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేశారు. ఈ నెల 16 న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ని భోపాల్ లో భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మహేంద్ర సింగ్ ధోని వస్తాడనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రొమోషన్స్ సంగతి పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ భారీ లెవెల్ లో జరుగుతోంది. గడిచిన సంవత్సర కాలం లో ఈ సినిమాకు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న బిజినెస్ ఏ సినిమాకు కూడా జరగలేదు అట.

రూరల్ మాస్ సినిమా అవ్వడం , పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అవ్వడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి కోస్తాంధ్ర ప్రాంతం లో , రాయలసీమ ని మినహాయించి 81 కోట్ల రూపాయిల బిజినెస్ చేసిందని అంటున్నారు. #RRR , పుష్ప 2, ఓజీ చిత్రాలకు తప్ప, ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా జరగలేదనే చెప్పాలి. అదే విధంగా రాయలసీమ ప్రాంతం హక్కులు ఏకంగా 31 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయట. రామ్ చరణ్ కి కంచుకోట లాంటి సీమ ప్రాంతం లో ఆ మాత్రం జరగకపోతే ఎలా అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక నైజాం ప్రాంతం హక్కులు అయితే దాదాపుగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 172 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది అన్నమాట. అదే విధంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల బిజినెస్ జరగ్గా, కర్ణాటక ప్రాంతం నుండి 12 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఓవరాల్ గా 224 కోట్ల రూపాయిల బిజినెస్ కేవలం తెలుగు వెర్షన్ కి మాత్రమే జరిగింది. హిందీ వెర్షన్ మరో 50 కోట్లు , ఇతర వెర్షన్స్ కలిపి మరో 10 కోట్లు , ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ 280 కోట్ల రూపాయలకు జరిగిందని , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ పొందాలంటే కచ్చితంగా ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ కి చేరుకుంటుందో లేదో చూడాలి.

Team India T20 Captaincy: సూర్య , అయ్యర్ అవుట్.. ఇప్పుడు ఈయన.. ఎంతమంది కెప్టెన్లను మార్చుతారో..

Team India T20 Captaincy: అదిగో పులి.. ఇదిగో తోక.. ఇలానే సాగిపోతుంది టీమిండియాలో.. టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేదు. ఆ విభాగంలో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. పైగా ఇటీవల టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. దీంతో టీమిండియా మీద అందరి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

సాధారణంగా ఒక జట్టు మీద అంచనాలు పెరిగిపోతే.. ఆ తర్వాత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన మీద చర్చ మొదలవుతుంది. ఆటగాళ్లు బాగా ఆడితే పెద్దగా ఇబ్బంది ఉండదు. తేడాగా ఆడితేనే మొత్తం తేడా కొట్టేస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని టీమిండియా వైల్డ్ ఫైర్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఎదుర్కొంటున్నాడు. అతడు టి20 జట్టుకు నాయకత్వం వహించిన నాటి నుంచి ఇప్పటివరకు టీమిండియా ఒక సిరీస్ కూడా కోల్పోలేదు. ఆటగాడిగా విఫలమైనప్పటికీ నాయకుడిగా జట్టును అద్భుతమైన దిశలో నడిపించాడు.

సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోవడంతో ఆయనను పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్టు ఆ మధ్య జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా మొదలైంది. జాతీయ మీడియాలో కూడా ఈ తరహా వార్తలు రావడంతో అందరూ దాదాపు నిజమే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అయ్యర్ కూడా కాదని తెలిసిపోయింది.

పంజాబ్ జట్టును అయ్యర్ ఐపిఎల్ లో అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఎక్కడో మూలన ఉండే పంజాబ్ జట్టును గత సీజన్లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఈ సీజన్లో కూడా దాదాపు ఫైనల్ దాకా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి వ్యక్తిగత ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. నేపథ్యంలో అయ్యర్ చేతిలో టి20 జట్టును పెడితే బాగుంటుంది అని భారత క్రికెట్ పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు అయ్యర్ కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ లో అదరగొడుతున్న సంజు శాంసన్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు సంజు. ప్రస్తుతం చెన్నై జట్టులో దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే అతని ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి. పైగా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి టి20 జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ ను పక్కనపెట్టారు. చివరికి అయ్యర్ ను కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు సంజూను తీసుకొచ్చారు. ఆ తర్వాత వంతు ఎవరిదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.