Homeఎంటర్టైన్మెంట్Ram Charan farmer role in Sukumar Movie: సుకుమార్ మూవీ లో రామ్ చరణ్...

Ram Charan farmer role in Sukumar Movie: సుకుమార్ మూవీ లో రామ్ చరణ్ రైతుగా కనిపించబోతున్నాడా..

Ram Charan farmer role in Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఆయన నుంచి రాబోయే సినిమాల విషయంలో సైతం ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. […]

Ram Charan farmer role in Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఆయన నుంచి రాబోయే సినిమాల విషయంలో సైతం ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… రామ్ చరణ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే సుకుమార్ తో చేయబోయే సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందే రంగస్థలం సినిమా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ కాంబినేషన్ కి అయితే మంచి క్రేజ్ దక్కింది. ఇక వీళ్ళిద్దరు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తారు. ప్రేక్షకులను విశేషంగా అలరిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

సుకుమార్ తో చేయబోయే సినిమాలో రామ్ చరణ్ రైతుగా కనిపించబోతున్నాడట. రంగస్థలం సినిమాలో ఆల్మోస్ట్ పల్లెటూరు పాత్రను పోషించిన ఆయన ఈ సినిమాలో సైతం అలాంటి ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడట.

చిట్టిబాబు క్యారెక్టర్ ఎంత పాపులారిటిని క్రియేట్ చేసుకుందో ఇప్పుడు చేయబోయే క్యారెక్టర్ సైతం అదే రేంజ్ ఇంపాక్ట్ ను ఇవ్వబోతుందట. సుకుమార్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పర్చదనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రేక్షకుడు ఆయన సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు.

కాబట్టి ఈ సినిమా కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు…ఈ సినిమా విషయానికి వస్తే సుకుమార్ ఈ సినిమా విషయంలో కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడట. బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడంతో ఈ ప్రాజెక్టును సెట్ చేసింది కూడా సుకుమార్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper