Home Blog Page 286

సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలి అంటూ మరోసారి నోరుజారిన ఉదయనిధి స్టాలిన్.. ఖండించని సీఎం విజయ్..

Udhayanidhi Stalin Sanatana Dharma remarks
Udhayanidhi Stalin Sanatana Dharma remarks

Udhayanidhi Stalin Sanatana Dharma remarks: అన్ని మతాలు కలిసి ఉండే ఈ దేశంలో , ఈమధ్య సెక్యులర్ వాదనతో కొంతమంది మతకల్లోలాలు సృష్టించడం సర్వ సాధారణం అయిపోయింది. పవిత్రమైన హిందూ సనాతన ధర్మాన్ని పదే పదే కొంతమంది రాజకీయ నాయకులు అవమానిస్తూ , అవహేళన చేస్తుంటే, వాటిని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు ఎవరైనా ముందుకొస్తే , మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అంటూ మతోన్మాదిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎంత ధైర్యం లేకుంటే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు పబ్లిక్ ఈవెంట్ లో శ్రీ రాముడి పై అత్యంత నీచమైన, హేయమైన కామెంట్స్ చేస్తాడు చెప్పండి?, ఇలా ఇతర మతాల మీద , ఇతర మతాలకు చెందిన దేవుళ్ళ మీద మాట్లాడే సాహసం చేస్తాడా?, ఇలాంటి వ్యక్తులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ఇకపోతే నేడు తమిళనాడు అసెంబ్లీ లో కూడా సనాతన ధర్మం అవమానానికి గురైంది.

శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయ్ నిధి స్టాలిన్ మాట్లాడుతూ ‘సనాతన ధర్మం మనుషులను వేరు చేస్తోంది , దీనిని సమూలంగా నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనిని ఆ సభాపతి , తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఖండించాడా అంటే , అది జరగలేదు , ఉదయ్ నిధి స్టాలిన్ మాటలను స్వాగతిస్తూ , ఆయనకు నమస్కరించాడు. ఇది అత్యంత నీచమైన చర్యగా పరిగణించొచ్చు. తాను ఒక సెక్యులర్ వాథాని అని , అన్ని మతాలను , కులాలను సమానంగా చూస్తానని చెప్పుకొని అధికారం లోకి వచ్చిన విజయ్ , హిందువులు పవిత్రమైన సనాతన ధర్మాన్ని ఎలా గౌరవిస్తారో తెలియదా?, అలా కోట్ల మంది పాటించే సనాతన ధర్మం పై నోటికి వచ్చినట్టు మాట్లాడే ఇలాంటోళ్ళ వ్యాఖ్యలను ఆయన ఖండించడా ?, ఇదేనా విజయ్ సెక్యులర్ వాదం అంటూ సోషల్ మీడియా లో విజయ్ పై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇలా ఉదయ్ నిధి స్టాలిన్ సనాతన ధర్మం పై నోరు పారేసుకోవడం కొత్తేమి కాదు, అధికారం లో ఉన్నప్పుడు కూడా ఆయన సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది అని , దీనిని నిర్మూలిస్తే తప్ప దేశం బాగు పడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అతని తీరు ఏ మాత్రం మారలేదు, సనాతన ధర్మాన్ని ఇప్పటికీ అవహేళన చేస్తూనే ఉన్నాడు , అందుకు సీఎం విజయ్ కూడా మద్దతు తెలపడం అతనికి ఓట్లు వేసిన హిందువులు , ముఖ్యంగా బ్రాహ్మణులు చేసుకున్న దురదృష్టం. ఉదయ్ నిధి స్టాలిన్ పొగరుతో సనాతన ధర్మం పై చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఇవి నాటి జయ రోజులు కావు.. అన్నా డీఎంకే చీలికలు.. పీలికలు

AIADMK internal conflicts
AIADMK internal conflicts

AIADMK internal conflicts: చుక్కాని లేని నావ.. ఎటు ప్రయాణిస్తుందో తెలియదు. ఎక్కడ మునిగిపోతుందో కూడా తెలియదు. అందుకే దారి, దిశ లేని గమ్యం ఎప్పటికీ ప్రమాదకరమే. ఇప్పుడు తమిళనాడులోని అన్నాడీఎంకెలో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయారు. పార్టీని నిర్దేశించేవారు లేకుండా పోయారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎవరు ఉంటారో అర్థం కావడం లేదు. పరిస్థితులు ఇలానే ఉంటే.. అన్నా డీఎంకే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం .

జయలలిత బతికి ఉన్నప్పుడు అన్నా డీఎంకే లో క్రమశిక్షణ అద్భుతంగా ఉండేది. నాయకులు మాట దాటేవారు కాదు. పైగా అసంతృప్తికి అవకాశం ఇచ్చేవారు కాదు. జయలలిత కన్ను మూసిన తర్వాత పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎవరు పార్టీని నిర్దేశిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికే అధికారానికి దూరమై అన్న డిఎంకె పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇప్పుడు తమిళనాడులో టీ వీకే అధికారంలోకి రావడంతో అన్నాడీఎంకె పరిస్థితి దారుణంగా మారింది.

ఇటీవల ఎన్నికల ఫలితాలలో ప్రతిపక్ష హోదాను అన్నాడీఎంకే కోల్పోయింది. దీనికి తోడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎదప్పాడి పలని స్వామి ని శాసనసభ నేతగా ఎన్నుకుంటూ 17 మంది ఎమ్మెల్యేలు ప్రోటెమ్ స్పీకర్ కు లెటర్ రాశారు. జరుగుతుండగానే సీనియర్ నాయకుడు వేలుమని ని శాసనసభ నాయకుడిగా, శన్ముగం ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకొని, 30 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇది అన్నాడీఎంకెలో చీలిక ఏర్పడిన కారణమైంది. ఎన్నికల్లో చాలామంది నాయకులు బిజెపితో పొత్తును వ్యతిరేకించారు. టీవీకే తో పొత్తు కుదుర్చుకోవాలని సూచించారు. అయితే పలని స్వామికి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన బిజెపితో జత కట్టడానికి ఆసక్తి చూపించారు. విజయ్ పార్టీ అధికారంలోకి రావడంతో.. అసమ్మతి నాయకులు వేరే కుంపటి పెట్టారు. అన్న డీఎంకే ఎమ్మెల్యేలతో కాకుండా.. వారు వేరుగా కూర్చుంటున్నారు. కనీసం ఫలని స్వామితో మాట్లాడేందుకు కూడా వారు ఆసక్తిని చూపించడం లేదు. అదే కాదు ఆ నాయకులు మొత్తం విజయ్ కి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతే కాదు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విజయ్ కి నమస్కరించడం విశేషం.

మమత తెరిచిన ద్వారాలను ముళ్ళకంచెలతో బిగిస్తున్నాడు సువేందు అధికారి..

Suvendu Adhikari Bangladesh border fencing
Suvendu Adhikari Bangladesh border fencing

Suvendu Adhikari Bangladesh border fencing: బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బిజెపి ఏం చేస్తుందనే ప్రశ్నకు తొలి సమాధానం చెప్పేశాడు బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. తన రాజకీయ గురువు మమతా బెనర్జీకి ఇప్పటికే షాక్ ల మీద షాక్ లు ఇచ్చిన సువేందు అధికారి.. తాజాగా మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసాడు.

ఇప్పటికే ఎమ్మెల్యేగా ఓడిపోయి మమత దీనంగా ఇంట్లో కూర్చుని ఉన్నారు. భవిష్యత్తును తలుచుకుంటూ భయభయంగా గడుపుతున్నారు. ఇప్పటికే చాలామంది టీఎంసీ నేతలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అధిష్టానం నుంచి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. 15 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న టీఎంసీ.. కార్యకర్తలను కాపాడుకోవడం ఇకపై కష్టమేమో. ఎందుకంటే అధికారాన్ని కోల్పోయిన మరుక్షణమే టీఎంసీ నేతలు కండువాను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే బిజెపి అంత ఈజీగా వారిని పార్టీలోకి తీసుకొని అవకాశం కనిపించడం లేదు.

వెస్ట్ బెంగాల్లో తొలిసారి గవర్నమెంట్ ని ఏర్పాటు చేసిన బిజెపి.. తన మార్క్ ను చూపించేందుకు సిద్ధమవుతోంది. తొలి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానమైనది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం.. దీనికి సంబంధించి భారత సెక్యూరిటీ ఫోర్స్ కు అవసరమైన భూమిని బదిలీ చేయడానికి బెంగాల్ ప్రభుత్వం ఓకే చెప్పింది.. సరిహద్దుల్లో భద్రత.. బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి చోరబాట్లను అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. భూమి బదిలీ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన మొదలు పెడుతున్నారు. 45 రోజుల్లోనే ఇది పూర్తి చేస్తారు.

భూమి బదిలీ జరిగిన వెంటనే భారత సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దిగుతుంది. వెంటనే ఫెన్సింగ్ నిర్మాణం ప్రారంభిస్తుంది. దీనివల్ల అక్రమ చొర బాట్లు ఆగిపోతాయని బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లాదేశ్ విమర్శించింది. భూ కేటాయింపును బంగ్లాదేశ్ తీవ్రంగా తప్పు పట్టింది. ముళ్ళ తీగలకు భయపడేది లేదని స్పష్టం చేసింది. భద్రత విషయంలో భారత్ మానవత దృక్పథంతో ఆలోచించాలని సూచించింది. అయితే భారత్ అంతర్గత రాజకీయాలలో తాము వేలు పెట్టబోమని.. కేంద్రంతో సంబంధాలే తమకు ముఖ్యమని బంగ్లాదేశ్ ప్రకటించింది.. మరోవైపు చొరబాట్లను మాత్రమే తాము అడ్డుకుంటామని ఇప్పటికే కేంద్రం పదేపదే స్పష్టం చేసింది.

పళనిస్వామికి వ్యతిరేకంగా మెజారిటీ AIADMK MLAలు

AIADMK MLAs revolt

AIADMK MLAs revolt : అనుకున్నట్టే జరిగింది. తమిళనాట అన్నాడీఎంకే చీలుతుందని అంతకుముందే చెప్పుకున్నాం అదే జరిగింది.. ఎన్నికలకు ముందు ఈ ఫళని స్వామికి తిరుగులేదని అనుకున్నారు. 234 సీట్లలో రెండు సార్లు ఫళని స్వామి చుట్టేశారు. ఎన్నికల్లో తన సొంత జిల్లా సేలంలో 11 సీట్లకు 7 సీట్లను ఫళని స్వామి గెలుచుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో మెజార్టీ లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. మొత్తం కలిపి సీట్లు 47 మాత్రమే వచ్చాయి. వీరికి బలమైన బెల్ట్ అనుకున్న కొంగ్డు బెల్ట్ లోనూ దెబ్బ తిన్నది. కోయంబత్తూరులో 10కి ఒక్కటే వచ్చింది.

కోయం బత్తూరు , తిరుప్పూర్, ఈరోడ్, నీలగిరిలలో 29కి కేవలం 7 సీట్లు వచ్చాయి. పోయినసారి కంటే తగ్గింది.ఎన్నికలయ్యాక జరిగిన నాటకీయ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.107 సీట్లు వచ్చిన విజయ్ ను పక్కనపెట్టి..70 సీట్లు వచ్చిన డీఎంకేను కాదని.. 47 సీట్లు వచ్చిన ఫళని స్వామి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నాలు చేశారు. ఎవరు దీని వెనుక అంటే..

డీఎంకే.. ఉదయనిధి స్టాలిన్ ఏకంగా విజయ్ సీఎం కావద్దని.. ఫళని స్వామి, ఉదయనిధి స్టాలిన్ లు కలిసి రెండూ కలిపి అధికారం సాధించాలని.. పొత్తు పెట్టుకోవాలని స్కెచ్ గీశాయి. డీఎంకే ప్రపోజల్ ఏంటంటే? రెండు సీట్లు గెలిచిన వీసీకే అధినేత తిరుమళపల్వన్ ను సీఎం చేయాలని స్టాలిన్ డిసైడ్ చేయగా.. తానే సీఎం అవుతానని ఫళని స్వామి పట్టుబట్టాడు. తిరుమల పల్వన్ ను డిప్యూటీ సీఎం చేస్తానని ఫళనిస్వామి భీష్మించుకు కూర్చున్నారు. అది చర్చలు బ్రేక్ అయ్యాయి. ఆ తరవాత వీసీకే టీవీకే విజయ్ కు సపోర్టు చేయడం జరిగింది. ఇది అన్నాడీఎంకేలో సంచలనమైంది. డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని చూసిన అన్నాడీఎంకే నేతలు భగ్గుమని ఫళనిస్వామికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. 47 మంది లో 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు షణ్ముగం ఆధ్వర్యంలో ఫళనిస్వామి తిరుగుబాటు చేశారు.

పళనిస్వామికి వ్యతిరేకంగా మెజారిటీ AIADMK MLAలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఇరాన్ పై యూఏఈ సీక్రెట్ ఆపరేషన్.. ప్రపంచం షాక్

UAE secret operation on Iran
UAE secret operation on Iran

UAE secret operation on Iran: మధ్య ఆసియా ప్రాంతంలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గలేదన్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు అమెరికా,ఇరాన్ మధ్య శాంతి చర్చలు అంటూ వార్తలు వస్తున్నా.. ఇరాన్ పై కొన్ని దేశాలు ప్రతికారం తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు కొనసాగించిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్… అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడింది. అయితే దీనికి బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కూడా ఇరాన్ చమురు క్షేత్రాలపై రహస్య దాడులు చేసిందని తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా పత్రికల్లో ఒకటైన ‘వాల్ స్ట్రీట్ జర్నల్’సంచలన కథనాన్ని వెల్లడించింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్‌ దేశానికి చెందిన కీలక ఆయిల్ రిఫైనరీపై UAE పలుమార్లు దాడులు చేసినట్లు సమాచారం. ఇరాన్ లోని ఈ రిఫైనరీ రోజుకు సుమారు 60,000 బ్యారెల్స్ ముడి చమురును శుద్ధి చేస్తుంది. ఇది ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలలో చాలా ముఖ్యమైనది. దాడి ఫలితంగా రిఫైనరీ వద్ద భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఫలితంగా చమురు శుద్ధి కేంద్రం కొన్ని నెలల పాటు పనిచేయలేని స్థితికి చేరినట్లు సమాచారం. ఈ దాడి ఏప్రిల్ రెండో వారంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

ఇరాన్ దేశం తన కీలకమైన రిఫైనరీ దెబ్బతిందని గత నెలలోనే అంగీకరించింది. కానీ ఈ దాడిని ఎవరు చేశారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ ఈ దాడులకు పాల్పడింది UAE అని అమెరికా చెబుతోంది. ఈ దాడి తరువాత ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు అనూహ్యంగా పెరిగాయి.

ఇదిలా ఉండగా లావన్ ద్వీపం ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో UAE,కువైట్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అదే రోజు తమ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసినట్లు UAE, కువైట్ కూడా ధృవీకరించాయి. ఒకే సమయంలో చోటుచేసుకున్న ఈ పరస్పర దాడుల వ్యవహారం ఆ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.

గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ సాగుతోంది. దీంతో పైకి యుద్ధ పోరు కనిపించకపోయినా.. తీవ్రత మాత్రం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ వైపు ఇరాన్ తో చర్చలంటూనే అమెరికా తెరవెనుక గల్ఫ్ దేశాల దాడులకు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. ఈ పరస్పర దాడులు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.

విజయ్ కి అన్ని మంచి శకునములే..

Vijay
Vijay

Vijay good signs ahead: రాజకీయాలను విజయ్ ఒంట పట్టించుకున్నారు. రాజకీయంగా అనుభవం లేకపోయినప్పటికీ విజయ్ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ఇబ్బంది పడిన టీవీకే అధినేత.. ఆ తర్వాత వరుసగా తన చాకచక్యంతో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు.

ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన కమ్యూనిస్టులు, మిగతా పార్టీల నాయకులు ప్రారంభంలో కొంత ఇబ్బంది పెట్టారు. దీంతో విజయ్ ప్రభుత్వం కొనసాగుతుందా.. కనీసం కొద్దిరోజులైనా తమిళనాడు ప్రజలకు పరిపాలన అందించగలుగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలను పటా పంచలు చేస్తున్నారు విజయ్.

అన్నా డిఎంకెలో చీలిక వచ్చేసింది. అన్నా డీఎంకే నేత షన్ముగం మరో మాటకు తావు లేకుండా విజయ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, విజయ్ పార్టీకి బుధవారం జరగబోయే ఫ్లోర్ టెస్టులో మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో విజయ్ పార్టీకి అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి. ఇదే కనుక కొనసాగితే విజయ్ పార్టీ ఐదు సంవత్సరాల పాటు తమిళనాడు రాష్ట్రాన్ని విజయవంతంగా పరిపాలించగలుగుతుంది.

ప్లోర్ టెస్ట్ కంటే ముందు విజయ్ మంగళవారం అసెంబ్లీలో ఒక పరీక్షను ఎదుర్కొన్నారు. పాపి సీనియర్ లీడర్ జె సి డి ప్రభాకర్ ను స్పీకర్ గా ఎన్నుకున్నారు. అయితే దీనికి ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభించింది. డిప్యూటీ స్పీకర్ కూడా టీవీకేను వరించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు రవిశంకర్ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.. మరోవైపు బల నిరూపణ విషయంలో కూడా విజయ్ కి ఇప్పటికే అన్నాడిఎంకె మద్దతు ఇస్తోంది. ఇందులోని చీలిక వర్గం ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి జై కొడుతున్నారు. నీతో ఫ్లోర్ టెస్ట్ లో కూడా విజయ్ నెగ్గడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖంలో తొలిరోజు కాస్త ఆందోళన కనిపించింది. ఆ తర్వాత అతడు మెల్లగా తమిళ రాజకీయాలకు అలవాటు పడుతున్నాడు. గొప్పగా పాలిస్తానని చెప్పిన ఆయన.. ముందుగా తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలోపడ్డాడు. తన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అర్ధమైన తర్వాత గట్టిగా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే సపోర్ట్ ఇచ్చిన తర్వాత విజయ్ ఇకపై తన ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు అడుగులు వేస్తాడని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎకనామిక్స్ అంటేనే బ్రహ్మ పదార్థం.. అందులోనూ ఫారెక్స్ నిల్వలు అర్థం కాని సబ్జెక్టు.. దీని కథ ఏంటంటే..

India forex reserves
India forex reserves

India forex reserves: ఒక దేశానికి సంబంధించి ఆర్థికంగా స్థాయి లెక్కించాలంటే ఫారెక్స్ నిల్వలను ప్రామాణికంగా తీసుకుంటారు.. అవి ఆ దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఎకనామిక్స్ నిపుణులు చెబుతుంటారు. ఫారెక్స్ నిల్వలు అధికంగా ఉన్న దేశం ఆర్థికంగా బలోపేతంగా ఉంటుంది. ఆ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా లభించే గౌరవం వేరే విధంగా ఉంటుంది. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక నిలువలను సుస్థిరం చేసుకోవాలని భావిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనదేశానికి సంబంధించి ఫారెక్స్ విలువలను కాపాడుకోవడం దేశ పౌరులుగా మన ప్రధాన కర్తవ్యమని ఇటీవల చెప్పారు.

ఒక దేశం వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం, బంగారం, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ వద్ద ఆదేశానికి సంబంధించిన కరెన్సీ హక్కులు (SDR), ఐఎంఎఫ్ లో సభ్యత్వం తీసుకున్నప్పుడు.. ఆ దేశం రిజర్వ్ చేసిన సొమ్ములో 25 శాతం6(RTP) .. ఇలా ఈ నాలుగింటిని కలిపి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అని పిలుస్తుంటారు.. ఇవి ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటిని అంచనా వేసి ఆ దేశం ఆర్థికంగా ఏ స్థాయిలో ఉందో అన్ని పనులు అంచనా వేస్తారు..

మూడీస్, ఎస్ అండ్ పీ, ఫిచ్ వంటి సంస్థలు ఫారెక్స్ రిజర్వ్ అధికంగా ఉన్న దేశాలకు అద్భుతమైన రేటింగ్ ఇస్తాయి. ఈ రేటింగ్ గనక అధికంగా ఉంటే.. ఆదేశాలకు తక్కువ వడ్డీకి అప్పులు లభిస్తుంటాయి. ఉదాహరణకు మనం లోన్ కోసం బ్యాంకు దగ్గరికి వెళ్తే.. మన సిబిల్ స్కోర్ చూస్తుంటారు. అది బాగుంటే బ్యాంక్ అధికారులు లోన్ వెంటనే మంజూరు చేస్తుంటారు. ఇదే విధానాన్ని దేశాలకు కూడా అప్పులు ఇచ్చే సంస్థ పాటిస్తుంటాయి.

ఒక దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయంటే.. విదేశీ పెట్టుబడిదారులు తాము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు లెక్క. ఒక దేశానికి సంబంధించి ఏడు నుంచి పది నెలల వరకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి డబ్బులు ఉంటే.. ఆ దేశానికి సంబంధించిన పరపతి బాగున్నట్టు లెక్క. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనదేశ విదేశీ మారకద్ర నిల్వలు బాగానే ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధాలు ముగిసే పరిస్థితి కనిపించకపోవడంతో క్రుడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎరువుల ధరలు కూడా భారీగా పెరుగుతాయని సమాచారం. దీనివల్ల ఫారెక్స్ నిల్వలు మరింత దారుణంగా కరిగిపోయే ప్రమాదం ఉంది.

మన దేశానికి విదేశాల నుంచి వచ్చే డబ్బులో గల్ఫ్ ప్రాంతం నుంచి అధికంగా వస్తుంది. అక్కడ యుద్ధం వల్ల పరిస్థితులు మారిపోయాయి. మనవాళ్లు పంపే డబ్బు పూర్తిగా తగ్గిపోయింది. పైగా మన ఎగుమతుల వల రావాల్సిన డాలర్ల ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల మనకు రావలసిన డబ్బు రాకపోగా.. ఉన్న డబ్బు ఖర్చు అవుతుంది. అందువల్లే ప్రధానమంత్రి ఆ స్థాయిలో హెచ్చరికలు చేశారు.

వెంకటేష్ , అనిల్ రావిపూడి చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యేది అప్పటి నుండే..

Venkatesh Anil Ravipudi movie update
Venkatesh Anil Ravipudi movie update

Venkatesh Anil Ravipudi movie update: సంక్రాంతికి వస్తున్నాం , మన శంకర వరప్రసాద్ గారు వంటి చిత్రాలతో వరుసగా రెండు సార్లు రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్న అనిల్ రావిపూడి , ఇప్పుడు మరోసారి విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరో గా నటించబోతున్నాడు. వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్ , కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గానే అనిల్ రావిపూడి ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లకు వినిపించాడట, వాళ్ళిద్దరికీ స్క్రిప్ట్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.

ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని , జూన్ మొదటి వారం లోపు పూర్తి చేసి , ప్రీ ప్రొడక్షన్ పనులు చక చకా పూర్తి చేసి , జులై నెల నుండి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అప్పటికీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి ఈ రెండు చిత్రాలను సమాంతరంగా చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ని జూన్ లోపు పూర్తి చేసి , ఆగస్టు నెలలో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇంకా కొన్ని నెలలు అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో , రెండు చిత్రాలను సమాంతరంగా చెయ్యాలని వెంకటేష్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతికి తీసుకొని రావాలని చూస్తున్నాడు. మరోపక్క త్రివిక్రమ్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కాబట్టి అనిల్ రావిపూడి చిత్రం సంక్రాంతి నుండి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యిందని సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని మూవీ టీం తన పీఆర్ టీం తో కొట్టిపారేసింది. ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, నారా రోహిత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

సొంత ఊరుకి రైలు కోసం రామ్ చరణ్ పోరాటం.. ఇలాంటి ఎమోషనల్ జర్నీ ఎవరికీ ఉండదేమో..

Peddi Movie
Peddi Movie

Peddi Movie Story: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలం లో ఏ సినిమాకు రానటువంటి అద్భుతమైన బిజినెస్ ఆఫర్స్ ఈ చిత్రానికి వస్తున్నాయి. సినిమా కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ట్రేడ్ లో ఆ రేంజ్ లో ఉంది మరి. కానీ రీసెంట్ గానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా , ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 2 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లను దాటేందుకు నాలుగు రోజులకు పైగా సమయం పట్టింది , ఇది ఆరోగ్యకరమైన ట్రెండ్ కాదనే చెప్పాలి.

ఇదంతా పక్కన పెడితే , ‘పెద్ది’ చిత్రం గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ‘పెద్ది’ అంటే కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే అని మీరంతా అనుకోని ఉంటారు. ఎందుకంటే మేకర్స్ ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని ఒక స్పోర్ట్స్ డ్రామా గా మాత్రమే ఆడియన్స్ కి ప్రొజెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా కోర్ పాయింట్ స్పోర్ట్స్ కాదు , ఆధునిక యుగం లో అభివృద్ధికి ఆమడదూరం లో ఉన్న ఒక గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక యువకుడు చేసే ప్రయత్నమే ఈ కథ. తన గ్రామానికి రైలుని రప్పించడానికి ఈ యువకుడు స్పోర్ట్ ని ఒక ఆయుధం గా చేసుకొని , అంతర్జాతీయ స్థాయిలో తన గ్రామానికి గుర్తింపు రప్పించి , అభివృద్ధి అయ్యేలా చేస్తాడట.

ఈ ప్రయాణం లో హీరో కి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి అనేదే ఈ చిత్రం. సినిమా మొత్తం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుందట . ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని ఈ చిత్రం లో మనం చూడొచ్చని అంటున్నారు. ఆ రేంజ్ లో ఔట్పుట్ వచ్చిందట. థియేట్రికల్ ట్రైలర్ తో సినిమా కథ ఎటు నుండి ఎటు వైపు వెళ్తుంది అనే దానిపై డైరెక్టర్ బుచ్చి బాబు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఈ నెల 18 న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో జరగబోతుంది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేలా చేస్తుందా?, లేదా తగ్గిస్తుందా అనేది చూడాలి.

Motorola Razr Fold ఫోన్ కొనొచ్చా.. దీనితో ఎలాంటి ఉపయోగం..

Motorola Razr Fold phone review
Motorola Razr Fold phone review

Motorola Razr Fold phone review: Motorola కంపెనీ నుంచి మొదటిసారిగా ఫోల్డబుల్ మొబైల్ రిలీజ్ అయింది. దీని నుంచి Razr Fold 2024లో జూలై 4 న మార్కెట్లోకి వచ్చింది. ప్రారంభంలో దీని 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 99,999 ఉండేది. ఆ తరువాత బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉపయోగించుకుంటే రూ. 89,999కి లభించింది. అయితే ఈ ఫోన్ గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ మొబైల్ గురించి వినియోగదారులు ఏమంటున్నారు? ఫోల్డింగ్ ఫోన్ తో అనుభవం ఎలా ఉంటుంది? అనే వివరాల్లోకి వెళితె..

Motorola Razr Fold ప్రధాన ఆకర్షణ అద్భుతమైన డిస్ ప్లే. ఇందులో 2K రిలజ్యూషన్ తో 8.1-అంగుళాల LTPO POLED ఇన్నర్ డిస్‌ప్లే ఉంది. ఇది టాబ్లెట్ లాంటి అనుభూతిని ఇస్తుంది. బయటి వైపు 6.6 అంగుళాల కవర్ స్క్రీన్ ఉండనుంది. ఈ ఫోన్‌ను మడవకపోయినా ఒక సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఫోన్ సుమారు 6,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల ఎటువంటి వాతావరణంలోనైన స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఫోన్‌లో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గేమింగ్ ప్రియులకు, మల్టీ-టాస్కింగ్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. 16GB వరకు RAM ఉండటంతో యాప్స్ అన్నీ చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో స్మార్ట్‌గా పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ ఎక్కువగా కోరుకునేవారికి ఈ కొత్త ఫోన్ వెరీ స్పెషల్ అనుకోవచ్చు. ఈ మొబైల్ వెనుక వైపు మూడు 50 మెగాపిక్సెల్ (50MP) కెమెరాలను అమర్చారు. ఇందులో ప్రైమరీ, అల్ట్రా-వైడ్ తో పాటు టెలీఫోటో లెన్స్‌లు ఉన్నాయి, ఇవి నాణ్యమైన ఫోటోలను, వీడియోలను అందిస్తాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరా, మరో 20MP అండర్ డిస్‌ప్లే కెమెరా ఉండటం దీని ప్రత్యేకత.

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది, కానీ Motorola Razr Fold లో 6,000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటోంది. ఇది కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

ఫోల్డబుల్ ఫోన్ల మన్నికపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ దీనికి IP48 లేదా 49 రేటింగ్ ఉండడంతో ధుమ్ము, ధూళి నుంచి రక్షణ ఇవ్వనుంది. అలాగే పటిష్టమైన గొరిల్లా గ్లాస్, వినూత్నమైన హింజ్ (Hinge) టెక్నాలజీ వల్ల ఫోన్ మడతపెట్టడం చాలా స్మూత్‌గా ఉంటుంది. ప్రీమియం లుక్, అద్భుతమైన డిస్‌ప్లే అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే Motorola Razr Fold ఒక అద్భుతమైన ఎంపిక.

Realme 16T 5G అధికారిక లాంచ్.. ఎప్పుడు.. ఇది ఎవరికి ఉపయోగం అంటే..

Realme 16T 5G official launch
Realme 16T 5G official launch

Realme 16T 5G official launch: Realme కంపెనీ నుంచి అప్డేట్ న్యూస్ మొబైల్ వినియోగదారులను అలరిస్తోంది. దీని నుంచి 16T 5G అనే మొబైల్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మే 22న మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి రానుంది. లాంచ్ అయిన తరువాత దీనిన Flipkart, Realmeindia అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

మార్కెట్లోకి రాబోయే రియల్మీ 16T 5G మొబైల్ 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. Full HD+ రెజల్యూషన్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో పనిచేసే అవకాశం ఉంది. దీని డిజైన్ రియల్మీ 16 ప్రో మోడల్స్ లాగా రెయిర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది. మొత్తం స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్, బ్లూ షేడ్ అనే కలర్లలలో ఉండే ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో గణనీయమైన ప్రభావాన్ని చూపించే సామర్థ్యం కలిగి ఉంటుందన్న చర్చ సాగుతోంది.

Realme 16T 5G 8,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే చాలా పెద్దది ఉండనుంది. బ్యాటరీ 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, దీనివల్ల త్వరగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ సామర్థ్యం కారణంగా వినియోగదారులు ఎక్కువ గంటల పాటు ఫోన్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ లో Portrait Star కెమెరా ఫీచర్ ఉంది, ఇది పోర్ట్రెయిట్ ఫోటోలకు ప్రత్యేకంగా రూపొందించబడింది. తాజా AI ఫీచర్లను కూడా ఈ ఫోన్లో చేర్చారు.

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. రియల్మీ 16T సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 784 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 2,007 పాయింట్లు సాధించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా 6400 టర్బో చిప్‌ సెట్ పై నడుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాసెసర్ గేమింగ్ మరియు మల్టీ-టాస్కింగ్‌ కోసం పనిచేసేవారికి బాగా పనిచేస్తుంది. భారతీయ మార్కెట్లో రియల్మీ 16T 5G ప్రారంభ ధర రూ. 18,999 (8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్) కావచ్చు. ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్లు కొంచెం ఎక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలో అధిక బ్యాటరీ బ్యాక్‌అప్, AI ఫీచర్లు, మంచి పర్ఫార్మన్స్‌ను కోరుకునేవారు ఈ స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసుకోవచ్చు.

విడాకులు తీసుకున్న యంగ్ హీరోయిన్..నాలుగేళ్ల వైవాహిక బంధానికి టాటా చెప్పేసిన యంగ్ జంట

Mouni Roy divorce news
Mouni Roy divorce news

Mouni Roy divorce news: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లిళ్లు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయం లో ఇప్పుడు యంగ్ జంట విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ జంట మరెవరో కాదు , మౌనీ రాయ్ – సూరజ్ నంబియార్. మౌని రాయ్ అనే పేరు మన తెలుగు ఆడియన్స్ లో అందరికీ తెలియకపోయి ఉండొచ్చు కానీ, యూత్ ఆడియన్స్ కి మాత్రం బాగా తెలుసు. ఈమె నాగిని అనే చిత్రం ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సీరియల్ హిందీ లోనే కాదు, తెలుగు లో కూడా పెద్ద హిట్. అలా సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సోషల్ మీడియా లో కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. యూత్ ఆడియన్స్ ఈమె పేరు చెప్తే పిచ్చెక్కిపోతుంటారు.

తన అందచందాలతో అలాంటి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ. అంతే కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో విలన్ గా నటించి , పాన్ ఇండియా లెవెల్ లో మూవీ లవర్స్ కి ఇంకా బాగా దగ్గరైంది. అయితే ఈమె తన భర్త సూరజ్ నంబియార్ తో గత కొంతకాలంగా దూరంగా ఉందని, వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇలా ప్రచారం జరగడానికి ముఖ్య కారణం ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరు ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడమే. ఒకప్పుడు మౌని రాయ్ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా ఉండేది. ముఖ్యంగా తన భర్త సూరజ్ తో కలిసి దిగిన ఫోటోలు , వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉండేది. కానీ ఈమధ్య కాలం లో అలాంటిది జరగడం లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూరజ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలను కూడా తొలగించాడు.

ఇవన్నీ చూసిన తర్వాత వీళ్లిద్దరు కచ్చితంగా విడిపోయారు అని అంటున్నారు నెటిజెన్స్. గతం లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేసేవారు. అయితే సోషల్ మీడియా లో ఇంతలా ప్రచారం అవుతున్నప్పటికీ వీళ్లిద్దరు ఈ విడాకుల వార్తలపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీని అర్థం , ఈ ప్రచారాలు అన్నీ నిజమే కదా అని నిరూపించినట్టు అవుతోంది. మరోపక్క మౌని రాయ్ కెరీర్ పరంగా ఫుల్ ఫోకస్ తో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘విశ్వంభర’ చిత్రం లో ఈమె ఐటెం సాంగ్ చేసింది. మరోపక్క బాలీవుడ్ మూవీస్ లో వరుసగా విలన్ రోల్స్ , క్యారక్టర్ రోల్స్ తో ఫుల్ బిజీ గా గడుపుతోంది.

అమెరికాను దొంగదెబ్బ తీసిన పాకిస్తాన్.. వెలుగులోకి పెద్ద కుట్ర

Pakistan conspiracy against America
Pakistan conspiracy against America

Pakistan conspiracy against America: మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని ప్రపంచ జనం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సైతం యుద్ధం నష్టంతో తీవ్రతను తగ్గించాలని ఆలోచిస్తోంది. కానీ ఇదే సమయంలో పాకిస్తాన్ దేశం మరోసారి అమెరికాకు ఆగ్రహం తెప్పించే పనిచేసింది. ఇరాన్ కు చెందిన కొన్ని సైనిక విమానాలు పాకిస్తాన్ భూభాగంలో రహస్యంగా నిలిపివేశారనే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇరాన్ దేశంపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన సైనిక విమానాలను పాకిస్తాన్ తమ ఎయిర్ ఫీల్డ్ లో ఉంచేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా మీడియా కోడై కూస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

అమెరికా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. పాకిస్తాన్ లోని రావల్పిండి ప్రాంతంలో ఇరాన్ దేశానికి చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో లాక్ హీడ్ సి -130, హెర్క్యులస్ రవాణా విమానం, ఆర్ సీ -130 తో పాటు మరికొన్ని విమానాలు ఇక్కడ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ పై ఓ వైపు ఇజ్రాయిల్, మరోవైపు అమెరికా విరుచుకుపడుతుండడంతో ఇరాన్ తన విమానాలకు సురక్షిత ప్రాంతం పాకిస్తాన్ గా భావిస్తోంది. యుద్ధ విమానాలు మాత్రమే కాకుండా ప్యాసింజర్ విమానాలను కూడా ఇక్కడ రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వార్తలపై పాకిస్తాన్ దేశం మండిపడుతోంది. ఈ దేశానికి చెందిన ఓ అధికారి ఇవి తప్పుడు వార్తలు అని అన్నారు. రావల్పిండి లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉంటారని అన్నారు. అయితే ఇరాన్ ఘర్షణకు ముందే ఇక్కడ ఒక ఇరాన్ పౌర విమానం నిలిచిందని పేర్కొన్నారు. ఆ తరువాత గగనతలం మూసివేయడంతో ఆ విమానం అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయిందని తెలిపారు.

మరోవైపు ఇరాన్ కు చెందిన పౌర విమానం అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో ఉందని పాకిస్తాన్ అధికారి తెలపగా.. అప్ఘనిస్తాన్ దేశానికి చెందిన తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ఖండించారు. విమానాలను తమ వద్ద నిలిపివేయాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్, అమెరికా మధ్య ఓ వైపు పాకిస్తాన్ రాయభారిగా వ్యవహరిస్తూ.. తమ దేశంపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని తాలిబాన్ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏదీ ఏమైనా ఇరాన్ కు సంబంధించిన విమానాలు ఇక్కడ ఉండడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి చర్చ మొదలైంది. అందులోనూ తమ శత్రు దేశానికి సంబంధించిన విమానాలు పాకిస్తాన్ లో ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓవైపు అమెరికాతో స్నేహం హస్తం ఇస్తూనే.. మరోవైపు దొంగ దెబ్బ తీస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నరేంద్ర మోడీ చెప్పినట్టు చేస్తే.. మన దేశం అమెరికాను మించిపోతుంది.. ఎలాగంటే

Narendra Modi vision for India
Narendra Modi vision for India

Narendra Modi vision for India: మన ఇంట్లో బియ్యం, పప్పులు మాత్రమే ఉన్నాయి. అవి వండుకోవడానికి నూనె, ఇతర పదార్థాలు కావాలి. అవి కావాలంటే కొనుగోలు చేయాలి. ఒక స్థాయి వరకు కొనుగోలు చేయవచ్చు. వాడకం స్థాయి దాటిపోతే బియ్యం, పప్పులలో కొంతమేర అమ్ముకొని వాటిని కొనుగోలు చేయాలి. ఇలా అమ్ముకుంటూ పోతే తినడానికి బియ్యం, పప్పులు మిగలవు. ఇప్పుడు అర్థమైంది కదా.. నరేంద్ర మోడీ భాగ్యనగరంలో పర్యటనకు వచ్చినప్పుడు ఎందుకు బంగారం కొనుగోలు చేయవద్దని చెప్పారో..

ప్రధాని మాటలను నెగిటివ్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేశానికి సంబంధించి దిగుమతులు ప్రతి ఏడాది పెరిగిపోతున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. భారత ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం మన దేశం ప్రతి ఏడాది 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నది. గత ఏడాది ఇంధనం, బంగారం, వంట నూనెలు, ఎరువుల కోసం ఏకంగా 23 లక్షల కోట్లను ఖర్చు పెట్టింది. మన దేశానికి సంబంధించి దిగుమతుల బిల్లు ఏకంగా 74 లక్షల కోట్ల వరకు ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మనం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా కొనసాగుతున్నాం. మన దేశ జనాభాకు.. ఉన్న నిలువలను కాస్త అంచనా వేసుకుంటే తొమ్మిది నుంచి 11 నెలల వరకే సరిపోతాయి. ఒకవేళ అవి గనక కరిగిపోతే ఆర్థిక సంక్షోభానికి దారి తీయవచ్చు. అందువల్లే దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తరహాలో సూచనలు చేశారు.

మన దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 728 బిలియన్ డాలర్లు గా ఉన్నాయి. ఇది ఇరాన్ మీద అమెరికా యుద్ధం మొదలు పెట్టక ముందు. దీనిని మన కరెన్సీలో కనుక చెప్పగలిగితే 69.4 లక్షల కోట్లు. కేవలం రెండు నెలల్లోనే యుద్ధం వల్ల ఫారెక్స్ నిల్వలు 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ముఖ్యంగా దిగుమతుల బిల్లు 775 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో ముడి చమురు, బంగారం, ఔషధాలు, సెమీ కండక్టర్లు, ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ఇందులో ఎరువులు, వంట నూనెలు, బంగారం బిల్లు అధికంగా ఉండడం విశేషం. దిగుమతుల మీద విపరీతంగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఫారెక్స్ నిలువలు ఘోరంగా కరిగిపోతున్నాయి. దీనికి తోడు డాలర్ విలువ మరింత పెరిగిపోతోంది. రూపాయి విలువ తగ్గిపోతుంది. దీనివల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు రావడం లేదు. ఫలితంగా దేశం లో ఆర్థికంగా అత్యవసర పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్లే నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ఈ మాటలు చెప్పారు. దీన్ని ప్రతిపక్షాలు వేరే విధంగా అన్వయించుకున్నప్పటికీ.. అసలు విషయం మాత్రం ఇదే. విదేశీ మారక ద్రవ్య నిలువలు అధికంగా ఉంటే.. మనం అమెరికాను కూడా సులభంగా దాటిపోవచ్చు. దానికి కావాల్సింది మనలో పొదుపు మాత్రమే. దానిని కొనసాగిస్తే ఇక తిరుగుండదు.

పోలవరం ప్రాజెక్టుపై బిగ్ అప్డేట్!

Polavaram project latest update
Polavaram project latest update

Polavaram project latest update: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కీలక అప్డేట్ వచ్చింది. మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని.. అదే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన తరువాత మంత్రి రామానాయుడు ప్రకటన చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా పోలవరం ప్రాజెక్టును భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నత్తనడకన పనులు సాగాయి. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయి. ఏడాది కాలంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది పోలవరం. ఎప్పటికప్పుడు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం నిత్య పరిశీలనలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేయిస్తున్నారు. ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది అని తెలుస్తుండడం మాత్రం శుభ పరిణామం.

నదులను అనుసంధానిస్తూ..
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అయితే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ప్రారంభంలో రామ పాద సాగర్ గా పిలవబడిన ఈ పథకాన్ని పోలవరం ప్రాజెక్టు గా మార్చారు. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నదీ ప్రవాహానికి కుడివైపున ఒక స్పిల్ వే నిర్మించారు. ఈ స్టిల్ వేకు అడ్డంగా 48 గేట్లతో ఒక బ్యారేజీ నిర్మాణం చేపడుతున్నారు. నదీ ప్రధాన ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మించి.. ఆ ప్రవాహాన్ని కుడివైపున ఉన్న స్కిల్ వేలోకి మళ్ళిస్తారు. ఈ ప్రాజెక్టుకు గేట్లు ఉండవు. కేవలం రాక్ ఫీల్డ్ డ్యామ్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టులో 1118 మీటర్ల పొడవు ఉండే స్పిల్ వే ప్రత్యేకమైనది.

రెండు దశాబ్దాల కిందట..
దాదాపు 22 సంవత్సరాల కిందట పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టుకు గుర్తింపు లభించింది. 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. పోలవరం జాప్యం జరగడంతో పట్టిసీమను తెరపైకి తెచ్చారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. 2015 లోనే దాదాపు 1300 కోట్లు ఖర్చు పెట్టి తొలి విడతగా పూర్తి చేశారు. అయితే మరో ఏడాది కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసి… ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు చేయిస్తున్నారు. మరో ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుండడం మాత్రం నిజంగా శుభ పరిణామం.

లోకేష్ పై జగన్ బ్రహ్మాస్త్రం

Jagan strategy against Lokesh
Jagan strategy against Lokesh

Jagan strategy against Lokesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్యలాంటివి. కచ్చితంగా ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ప్రస్తుతం కూటమి అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాదిరిగా ప్రభుత్వంపై అయితే అంత వ్యతిరేకత లేదు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి కలవరపాటుకు గురి చేసే అంశమే. అందుకే వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోదించడం ద్వారా అధికారంలోకి రావచ్చు అని అంచనా వేస్తున్నారు. కనీసం ఎంపిక చేసిన వంద నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించి గెలిపించుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా ఈసారి మంగళగిరి పై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క మంగళగిరి మాత్రమే కాదు కూటమి ఎలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.

నియోజకవర్గంలో సర్వే..
ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ పనితీరు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పురోగతి వంటి అంశాలతో కూడిన ఈ సర్వే చాలా గోప్యంగా సాగినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో 90000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు లోకేష్. అంతకుముందు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు. కానీ ఐదేళ్లు తిరిగిన తరువాత అదే లోకేష్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పాలన అందిస్తున్నారు. దీంతో తిరుగులేని నాయకుడిగా మారిపోయారు. అయితే ఆదిలోనే లోకేష్ కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని, కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త అభ్యర్థులకు..
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత నేతలను రంగంలోకి దించితే వారిపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది ప్రజలకు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించనున్నారు జగన్. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తన కుటుంబం నుంచి ఒకరిని పోటీ చేయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ప్రారంభం అయింది. చాలా రహస్యంగా నియోజకవర్గంలో ఒక సర్వే పూర్తి కూడా చేసినట్లు తెలుస్తోంది.

వైయస్ ఫ్యామిలీ నుంచి..
వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ అంతంత మాత్రమే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే గెలిచింది. చాలాసార్లు ఓడిపోయింది ఆ పార్టీ. అటువంటి నియోజకవర్గం చేశారు. 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ పోటీ చేశారు లోకేష్. 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం 90 వేల కోట్ల మెజారిటీతో గెలిచారు. ఆ మెజారిటీని తగ్గించి లోకేష్ ను ఓడించడం అంత సులువు కాదు. అందుకే వైయస్ ఫ్యామిలీ నుంచి ఒకరిని ఇక్కడ పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి మానసికంగా సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.

చచ్చింది ఐఎస్ఐ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ కు ఇది తగిన శాస్తి

Bannu police station terrorist attack
Bannu police station terrorist attack

Bannu police station terrorist attack: పాముకు పాలు పోసి పెంచితే.. అదేమీ అమృతాన్ని ఇవ్వదు. విషాన్ని ఇస్తుంది. పైగా కాటు వేసి చంపేస్తుంది. ఈ అనుభవం ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ దేశానికి అనేక సందర్భాల్లో అనుభవంలోకి వచ్చినప్పటికీ మారదు. మారే ప్రయత్నాన్ని కూడా పాకిస్తాన్ చేయదు. ఎందుకంటే అది పాకిస్తాన్ దేశం కాబట్టి.

పాకిస్తాన్ దేశంలో లష్కరే ఏ తోయిబా, జేషే మహమ్మద్.. వంటి ఉగ్ర వాద సంస్థలు చాలా ఉన్నాయి. ఈ సంస్థలు వాటిలో అవే పోటీపడి భారత్ మీద దాడులు చేస్తుంటాయి. తమలో తామే అప్పుడప్పుడు దాడులు చేసుకుంటాయి. ఈ ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఉంటుంది. ఆ మధ్య భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కేంద్ర కార్యాలయాల మీద భారత్ దాడులు చేసింది. ఆ సమయంలో ఈ సంస్థల కార్యాలయాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. భారీగా నష్టం వాటిల్లింది. అయితే పాకిస్తాన్ ఆ ఉగ్రవాద సంస్థలకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు చెల్లించడం విశేషం.

ఇప్పటివరకు ఉగ్రవాద సంస్థలు చేసిన పనులతో లాభాలు పొందిన పాకిస్తాన్.. తొలిసారి నష్టాలను మూట కట్టుకుంది. ప్రజలను సక్రమంగా పాలించాల్సిన పరిపాలకులు ఉగ్రవాదులతో కలిసిపోతే ఎంతటి నష్టమో ఈ ఘటన నిరూపించింది. గత ఏడాది పాకిస్తాన్ దేశంలో ఇత్తేహదుల్ ముజాహిదిన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ ఏర్పాటయింది. ఇటీవల ఈ సంస్థ బన్ను అనే ప్రాంతంలో పతైకేల్ పోలీస్ స్టేషన్ పై మూడంచల విధానంలో దాడి చేసింది. 30 మంది పోలీసులను హత మార్చింది. ఆయుధాలు ఎత్తుకెళ్లింది.

ఈ ఘటనతో ఆ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ.. పాకిస్తాన్ ఆర్మీ.. ఇతర ఉగ్రవాద సంస్థలకు ప్రమాదకరమైన సంకేతాలను పంపించింది. తమ జోలికి వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు పాకిస్తాన్ లో అనేక ఉగ్రవాద సంస్థలు దేశంలో భయానక సంఘటనలు సృష్టించిన దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా ఐఎంపీ సంస్థ ఈ తరహా దాడులకు పాల్పడటం పాకిస్థాన్ పరిపాలకులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ సంస్థకు వేరే ప్రాంతాల నుంచి నిధులు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఏదైనా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.