Homeజాతీయ వార్తలుVijay good signs ahead: విజయ్ కి అన్ని మంచి శకునములే..

Vijay good signs ahead: విజయ్ కి అన్ని మంచి శకునములే..

Vijay good signs ahead: రాజకీయాలను విజయ్ ఒంట పట్టించుకున్నారు. రాజకీయంగా అనుభవం లేకపోయినప్పటికీ విజయ్ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ఇబ్బంది పడిన టీవీకే అధినేత.. ఆ తర్వాత వరుసగా తన చాకచక్యంతో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన కమ్యూనిస్టులు, మిగతా పార్టీల నాయకులు ప్రారంభంలో కొంత ఇబ్బంది పెట్టారు. దీంతో విజయ్ ప్రభుత్వం కొనసాగుతుందా.. కనీసం కొద్దిరోజులైనా తమిళనాడు ప్రజలకు పరిపాలన అందించగలుగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ […]

Vijay good signs ahead: రాజకీయాలను విజయ్ ఒంట పట్టించుకున్నారు. రాజకీయంగా అనుభవం లేకపోయినప్పటికీ విజయ్ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ఇబ్బంది పడిన టీవీకే అధినేత.. ఆ తర్వాత వరుసగా తన చాకచక్యంతో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు.

ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన కమ్యూనిస్టులు, మిగతా పార్టీల నాయకులు ప్రారంభంలో కొంత ఇబ్బంది పెట్టారు. దీంతో విజయ్ ప్రభుత్వం కొనసాగుతుందా.. కనీసం కొద్దిరోజులైనా తమిళనాడు ప్రజలకు పరిపాలన అందించగలుగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలను పటా పంచలు చేస్తున్నారు విజయ్.

అన్నా డిఎంకెలో చీలిక వచ్చేసింది. అన్నా డీఎంకే నేత షన్ముగం మరో మాటకు తావు లేకుండా విజయ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, విజయ్ పార్టీకి బుధవారం జరగబోయే ఫ్లోర్ టెస్టులో మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో విజయ్ పార్టీకి అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి. ఇదే కనుక కొనసాగితే విజయ్ పార్టీ ఐదు సంవత్సరాల పాటు తమిళనాడు రాష్ట్రాన్ని విజయవంతంగా పరిపాలించగలుగుతుంది.

ప్లోర్ టెస్ట్ కంటే ముందు విజయ్ మంగళవారం అసెంబ్లీలో ఒక పరీక్షను ఎదుర్కొన్నారు. పాపి సీనియర్ లీడర్ జె సి డి ప్రభాకర్ ను స్పీకర్ గా ఎన్నుకున్నారు. అయితే దీనికి ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభించింది. డిప్యూటీ స్పీకర్ కూడా టీవీకేను వరించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు రవిశంకర్ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.. మరోవైపు బల నిరూపణ విషయంలో కూడా విజయ్ కి ఇప్పటికే అన్నాడిఎంకె మద్దతు ఇస్తోంది. ఇందులోని చీలిక వర్గం ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి జై కొడుతున్నారు. నీతో ఫ్లోర్ టెస్ట్ లో కూడా విజయ్ నెగ్గడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖంలో తొలిరోజు కాస్త ఆందోళన కనిపించింది. ఆ తర్వాత అతడు మెల్లగా తమిళ రాజకీయాలకు అలవాటు పడుతున్నాడు. గొప్పగా పాలిస్తానని చెప్పిన ఆయన.. ముందుగా తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలోపడ్డాడు. తన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అర్ధమైన తర్వాత గట్టిగా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే సపోర్ట్ ఇచ్చిన తర్వాత విజయ్ ఇకపై తన ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు అడుగులు వేస్తాడని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper