Homeఎంటర్టైన్మెంట్Venkatesh Anil Ravipudi movie update: వెంకటేష్ , అనిల్ రావిపూడి చిత్రం రెగ్యులర్ షూటింగ్...

Venkatesh Anil Ravipudi movie update: వెంకటేష్ , అనిల్ రావిపూడి చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యేది అప్పటి నుండే..

Venkatesh Anil Ravipudi movie update: సంక్రాంతికి వస్తున్నాం , మన శంకర వరప్రసాద్ గారు వంటి చిత్రాలతో వరుసగా రెండు సార్లు రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్న అనిల్ రావిపూడి , ఇప్పుడు మరోసారి విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరో గా నటించబోతున్నాడు. వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్ , కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గానే అనిల్ రావిపూడి ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లకు వినిపించాడట, వాళ్ళిద్దరికీ స్క్రిప్ట్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.

ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని , జూన్ మొదటి వారం లోపు పూర్తి చేసి , ప్రీ ప్రొడక్షన్ పనులు చక చకా పూర్తి చేసి , జులై నెల నుండి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అప్పటికీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి ఈ రెండు చిత్రాలను సమాంతరంగా చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ని జూన్ లోపు పూర్తి చేసి , ఆగస్టు నెలలో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇంకా కొన్ని నెలలు అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో , రెండు చిత్రాలను సమాంతరంగా చెయ్యాలని వెంకటేష్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతికి తీసుకొని రావాలని చూస్తున్నాడు. మరోపక్క త్రివిక్రమ్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కాబట్టి అనిల్ రావిపూడి చిత్రం సంక్రాంతి నుండి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యిందని సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని మూవీ టీం తన పీఆర్ టీం తో కొట్టిపారేసింది. ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, నారా రోహిత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular