Realme 16T 5G official launch: Realme కంపెనీ నుంచి అప్డేట్ న్యూస్ మొబైల్ వినియోగదారులను అలరిస్తోంది. దీని నుంచి 16T 5G అనే మొబైల్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మే 22న మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి రానుంది. లాంచ్ అయిన తరువాత దీనిన Flipkart, Realmeindia అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
మార్కెట్లోకి రాబోయే రియల్మీ 16T 5G మొబైల్ 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. Full HD+ రెజల్యూషన్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో పనిచేసే అవకాశం ఉంది. దీని డిజైన్ రియల్మీ 16 ప్రో మోడల్స్ లాగా రెయిర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది. మొత్తం స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్, బ్లూ షేడ్ అనే కలర్లలలో ఉండే ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో గణనీయమైన ప్రభావాన్ని చూపించే సామర్థ్యం కలిగి ఉంటుందన్న చర్చ సాగుతోంది.
Realme 16T 5G 8,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే చాలా పెద్దది ఉండనుంది. బ్యాటరీ 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, దీనివల్ల త్వరగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ సామర్థ్యం కారణంగా వినియోగదారులు ఎక్కువ గంటల పాటు ఫోన్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ లో Portrait Star కెమెరా ఫీచర్ ఉంది, ఇది పోర్ట్రెయిట్ ఫోటోలకు ప్రత్యేకంగా రూపొందించబడింది. తాజా AI ఫీచర్లను కూడా ఈ ఫోన్లో చేర్చారు.
గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. రియల్మీ 16T సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 784 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 2,007 పాయింట్లు సాధించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా 6400 టర్బో చిప్ సెట్ పై నడుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాసెసర్ గేమింగ్ మరియు మల్టీ-టాస్కింగ్ కోసం పనిచేసేవారికి బాగా పనిచేస్తుంది. భారతీయ మార్కెట్లో రియల్మీ 16T 5G ప్రారంభ ధర రూ. 18,999 (8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్) కావచ్చు. ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్లు కొంచెం ఎక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలో అధిక బ్యాటరీ బ్యాక్‌అప్, AI ఫీచర్లు, మంచి పర్ఫార్మన్స్‌ను కోరుకునేవారు ఈ స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసుకోవచ్చు.