Home Blog Page 27

మంత్రివర్గంలోకి జనసేన సీనియర్!

Konathala Ramakrishna
Konathala Ramakrishna

Konathala Ramakrishna: ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. వచ్చే నెలలో ముహూర్తాలు అధికంగా ఉండడంతో.. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈసారి జనసేనకు ప్రాతినిధ్యం పెరుగుతుంది అన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి సైతం మరో మంత్రి పదవి ఇస్తారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అయితే చేర్పులు మార్పులతో కొత్తవారిని తీసుకుంటారు అన్న టాక్ ఉంది. ఈసారి సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. అయితే జనసేన నుంచి సీనియర్ గా ఉన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. ఆయనకు ఈసారి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. జనసేన లో ఉన్న సీనియర్ నేత ఆయన ఒక్కరే. అందుకే ఆయనకు అమాత్య పదవి దక్కుతుందని నాకు నడుస్తోంది.

* సుదీర్ఘ నేపథ్యం..
1980 లోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు కొణతాల రామకృష్ణ. 1989లో తొలిసారిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 9 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. 1991లో మళ్లీ ఎంపీగా గెలిచారు రామకృష్ణ. 1996లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచేసరికి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 2009లో మాత్రం ఓడిపోయారు త్రిముఖ పోటీలో. అక్కడి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున అనకాపల్లి నుంచి గెలిచారు. ఈసారి కొణతాలకు తప్పకుండా క్యాబినెట్లో తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది.

* సౌమ్యుడిగా గుర్తింపు..
సీనియర్ రాజకీయ నేతగా మంచి గుర్తింపు ఉంది. సౌమ్యుడిగా పేరు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేయించడంలో రామకృష్ణ పాత్ర ఉంది. కానీ క్రమేపి కొణతాల రామకృష్ణను నిర్లక్ష్యం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. కానీ అనూహ్యంగా జనసేనలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం జనసేనలో సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఆయనే. అందుకే పవన్ కళ్యాణ్ కొణతాల రామకృష్ణను తప్పనిసరిగా మంత్రివర్గంలోకి తీసుకునేలా చేస్తారని తెలుస్తోంది. వచ్చే నెలలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అందులో ఆయనకు పదవి దక్కడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

పనికిమాలినోడికి బౌలింగ్ ఇస్తే.. ఫలితం ఇలాగే ఉంటుంది..టీమిండియా పాలిట శని ఇతడు

India vs England T20
India vs England T20

India vs England T20: పనిగల్లోడికి పెత్తనమిస్తే నడి ఇంట్లోకి వచ్చి ఏదో చూపించాడట. ఇప్పుడు ఈ సామెత ఆటగాడికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది.. పైగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక.. టీమిండియా పతనాన్ని అతడు శాసించాడు. అతడి బౌలింగ్ ప్రదర్శన చూసిన తర్వాత.. ఇంకెప్పుడు జాతీయ జట్టులో అవకాశం ఇవ్వకూడదని.. ఒకవేళ అవకాశం ఇచ్చిన సరే అతడికి ఆడే ఆపర్చునిటీ ఇవ్వకూడదని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి నిన్నటి మ్యాచ్లో ఇంగ్లాండ్ మీద భారత్ గెలవాల్సిందే. ఎందుకంటే ప్రారంభం నుంచి 17వ ఓవర్ వరకు టీమిండియా మ్యాచ్ మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించింది. గెలిచే అవకాశాన్ని చేతులారా చేజార్చుకుంది. దీనికి ప్రధాన కారణం ఆ బౌలర్. అతడు వేసిన ఓవర్. ఒక దశలో ఇంగ్లాండ్ జట్టు 4 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో అప్పటికే ఐదు వికెట్లు కోల్పోయింది. బెతల్ ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టుకు గెలుపు మీద పెద్దగా ఆశలు లేవు. ఈ దశలో కెప్టెన్ అయ్యర్ రవి బిష్ణోయ్ కి బంతి చేతికి అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని సంపాదించాల్సిన అతడు అత్యంత నిర్లక్ష్యంగా బౌలింగ్ వేశాడు.

రవి బౌలింగ్లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 29 పరుగులు సాధించింది. ఇందులో రెండు నో బాల్స్ ఉన్నాయి.. ఈ ఓవర్ లో ఇంగ్లాండ్ జట్టు వీరవిహారం చేయడం తో ఒత్తిడి పూర్తిగా తగ్గింది. మరొక ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని సాధించింది.. 17 ఓవర్ లోనే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా ఇంగ్లాండ్ ఓటమి అంచులో ఉంటే.. భారత జట్టు బౌలర్ రవి బిష్ణోయ్ చేతులారా ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు ఒక్కసారిగా నిరాశ పడిపోయారు… ఇటీవల ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడం.. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు చేతిలో మ్యాచ్ ఓడిపోవడం.. ఇవన్నీ చూస్తుంటే టీమిండియా కు గ్రహచారం బాగోలేదు అన్నట్టుగా ఉంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఇలా ఒత్తిడి ఎదుర్కోవడం అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు.

కేవలం ఐపిఎల్ ను మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉండగా.. కేవలం రవి బిష్ణోయ్ కి అవకాశం ఎందుకు ఇచ్చారని గౌతమ్ గంభీర్ ను సోషల్ మీడియా వేదికగా టీం ఇండియా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పనికిమాలిన బౌలర్ కు అవకాశం ఇస్తే ఫలితం ఇలానే ఉంటుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జట్టుకూర్పులో గౌతమ్ గంభీర్ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.

రష్యా దగ్గర బొచ్చెడు క్రూడ్ ఆయిల్.. మనం ఎందుకు పెట్రోల్ ఇస్తున్నామో తెలుసా..

India stop buying oil from Russia
India stop buying oil from Russia

Russia crude oil : క్రూడ్ ఆయిల్ .. దీనికి ప్రపంచ ఆర్థిక శక్తిని మార్చే దమ్ము ఉంది. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు.. క్రూడ్ ఆయిల్ గురించే ప్రధానంగా చర్చ జరిగింది. పైగా హార్మోజ్ జల సంధి మీదుగా క్రూడ్ ఆయిల్ రవాణా చేయాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేశాయి. అమెరికా కూడా ఇదే డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చింది.. అంతటి క్రూడ్ ఆయిల్ ఉన్న దేశాలలో రష్యా కూడా ఒకటి. వాస్తవానికి రష్యా ఈ స్థాయిలో సంపన్నంగా ఉండడానికి క్రూడ్ ఆయిల్ కూడా ఒక కారణం.

మన దేశానికి సంబంధించి క్రూడ్ ఆయిల్ రవాణా చేసే దేశాలలో రష్యా ముందు వరుసలో ఉంటుంది. పైగా అప్పట్లో రష్యా మనకు అత్యంత తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ అందించింది. రష్యా మన దేశానికి ఎప్పటినుంచో వ్యూహాత్మక వ్యాపార భాగస్వామిగా కొనసాగుతోంది. ఇటీవల యుద్ధం కాలంలో కూడా రష్యా మనకు క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసింది. అయితే అంతటి రష్యాకు ఇప్పుడు భారత్ గ్యాసోలిన్(పెట్రోల్) చేస్తోంది. వాస్తవానికి రష్యానే మనకు క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తుంది. అటువంటి ఆదేశం మన దగ్గర పెట్రోల్ కొనుక్కోవడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది.

రష్యాలో క్రూడ్ ఆయిల్ విస్తారంగా లభిస్తూ ఉంటుంది. ఇది ఆ దేశానికి భారీగా ఆదాయాన్ని ఆర్జించి పెడుతుంది. అయితే ఇటీవల కాలంలో ఉక్రెయిన్ రష్యా ప్రధాన ఆయిల్ రిఫైనరీల మీద డ్రోన్ల ద్వారా దాడి చేసింది. వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో అవి ఇప్పటికిప్పుడు వాడకంలోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో రష్యా దగ్గర భారీగా క్రూడ్ ఆయిల్ ఉన్నప్పటికీ రిఫైన్ చేసి.. పెట్రోల్.. డీజిల్ తయారు చేసే అవకాశం లేకుండా పోయింది. అందువల్లే రష్యా కు మనం పెట్రోల్ అమ్మాల్సి వస్తోంది. ఉక్రెయిన్ ఇటీవల చేసిన దాడుల వల్ల రష్యా చాలావరకు ఆయిల్ రిఫైనరీలను కోల్పోయింది. ఇప్పటికిప్పుడు వాటి ద్వారా ముడి చమురు శుద్ధి చేసే అవకాశం లేకుండా పోయింది. అందువల్లే రష్యా మన దగ్గర పెట్రోల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది.

రష్యాతో భారతదేశానికి సంవత్సరాల నాటి స్నేహం ఉంది. పైగా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం అత్యంత బలంగా ఉంది. అందువల్లే రష్యా అడిగిన వెంటనే భారత్ పెట్రోల్ సరఫరా చేస్తోంది. కష్టకాలంలో రష్యా దేశానికి అండగా నిలబడుతుంది. చైనా.. ఇతర దేశాలు కూడా రష్యాకు సాయం చేసే విషయంలో నిశ్శబ్దంగా ఉంటే.. భారత్ మాత్రం ఆపనహస్తం అందిస్తోంది. కష్ట కాలంలో రష్యాకు నిజమైన స్నేహితుడి లాగా నిలబడుతోంది.

ఆర్కే కొత్త పలుకు.. జగన్ రాజకీయాలు ఊహాతీతం

RK kotha paluku

RK Kotha Paluku : వారం గ్యాప్ వచ్చిన తర్వాత.. ఈసారి రాధాకృష్ణ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా.. ముందుకు వచ్చారు. తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకులో జగన్ మీద పడిపోయారు. ఇదేమీ కొత్త కాదు.. కాకపోతే టిడిపి నాయకులకు.. జనసేన నాయకులకు.. భారతీయ జనతా పార్టీ నాయకులకు చేతకానిది.. చేయలేనిది రాధాకృష్ణ చేసి చూపించారు. తన పెన్ పవర్ ఎలా ఉంటుందో.. తాను లోతుల్లోకి వెళ్లి రాస్తే ఎలా ఉంటుందో వాస్తవంలో చూపించారు.

జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఏర్పాటు వెనుక కుట్ర ఉంది. గతంలో ఆయన శాసనసభలో అమరావతి రాజధానికి ఓకే చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు రాజధాని మార్పు విషయాన్ని ఆమోదించబోమని.. రాజధాని నిర్మాణానికి ఒప్పుకుంటామని చెప్పారు. అధికారులకు వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ చెప్పారు. 2024 ఎన్నికల చివర్లో విశాఖపట్నం రాజధాని అన్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడేమో మావిగన్ అంటూ చెబుతున్నారు. దీనికి తోడు సో కాల్డ్ విజయవాడ.. సో కాల్డ్ అమరావతి అంటూ మాట్లాడుతున్నారు. వాస్తవానికి జగన్ మావిగన్ పేరు పదేపదే ప్రస్తావించడం వెనక భారీ కుట్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి దానిని మాత్రమే పట్టుకుని వేలాడుతున్నారు అంటే కారణం బలంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో మావిగన్ వ్యవహారం మీద రకరకాలుగా విమర్శలు వస్తున్నప్పటికీ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదంటే.. దాని వెనుక కుట్రపూరితమైన ఆలోచన ఉంది.. మావిగన్ ఆలోచనను మెజారిటీ ప్రజలు తప్పుపడుతుంటే.. కొంతమంది స్వాగతిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో వివిధ రూపాల్లో ఆయనకు మద్దతిస్తున్న వారు.. మావిగన్ ఏర్పాటును ఎందుకు వ్యతిరేకించడం లేదో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజధాని కంటే.. కులం, మతం మాత్రమే ముఖ్యమని జగన్ రెడ్డి గుర్తించారు. అందువల్లే ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు.. రాజధాని లో 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయల ఖర్చులతో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇలాంటప్పుడు మావిగన్ పేరు ప్రకటించడం హాస్యాస్పదం.. ఇదిగో ఇలా రాసుకుంటూ పోయారు రాధాకృష్ణ.

వాస్తవానికి కులం.. మతం అనేది ఏపీలో మాత్రమే లేవు. ఈ విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోయారు. ఆ మధ్య రాధాకృష్ణ మీద వైసిపి నేతలు.. ఇతర నాయకులు విమర్శలు చేసినప్పుడు కమ్మ సామాజిక వర్గం వాళ్లు నిలబడ్డారు. ఆయనకు అనుకూలంగా ప్రకటనలు చేశారు. నాడు కమ్మ సామాజిక వర్గం వారు తనకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలను ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించారు. అలాంటప్పుడు రాధాకృష్ణ కులం గురించి, మతం గురించి ఎలా మాట్లాడుతారు.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు.. నాడు కమ్మ సామాజిక వర్గం మొత్తం సీనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ చేసింది. నాడు తెలుగుజాతి అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి.. ఇప్పటికీ టిడిపికి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం టిడిపిని తమ సొంత పార్టీగా భావిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని సాక్షి మినహా మిగతా మీడియా సంస్థలు రాయవు.

అక్కడిదాకా ఎందుకు ఇప్పుడున్న మీడియా సంస్థల్లో మెజారిటీ సంస్థలు కమ్మ సామాజిక వర్గం వరకే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి.. ఆ కులానికి చెందినవారు కచ్చితంగా ఆయనను అభిమానిస్తారు. ఆదరిస్తారు. ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి.. ఏదో విధంగా దానిని దక్కించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దానిని తప్ప పటాల్సిన అవసరం ఏముంది.. అన్నట్టు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ లేదు. ఒక విధానం అంటూ లేదు. కులాలతో ఆయన రాజకీయాలు చేస్తూనే ఉంటారు. మతాలతో కూడా రాజకీయాలు చేస్తూనే ఉంటారు. జనం వీక్నెస్ ఆయనకు తెలుసు కాబట్టి పావులు కదుపుతూనే ఉంటారు. రాజకీయాలు అంటేనే అలా మారిపోయాయి. కులాలతో.. మతాలతో రాజకీయాలు చేయడం కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు.. అందరికీ అది అలవాటైన విద్యగా మారింది.. కాకపోతే జగన్ అంటే రాధాకృష్ణకు కోపం కాబట్టి.. రాధాకృష్ణ ఇలా రాస్తున్నారు.

బంగారు కుప్పం.. ఇదీ బాబు విజినరీ ఆలోచన..

Chandrababu

Kuppam development : చేపల దుకాణాలు కావు. మటన్ కొట్లు అంతకంటే కావు. బొబ్బట్లు.. అప్పడాల తయారీ కేంద్రాలు కావు. జాతి భవిష్యత్తు మొత్తాన్ని మార్చే కేంద్రాలు అవి. ఆ కేంద్రాలు పెద్దపెద్ద నగరాలలో నిర్మితమవుతూ ఉంటాయి. కానీ అవి ఏపీని వెతుక్కుంటూ వచ్చాయి. అక్కడితో ఆగిపోలేదు ఒక మారుమూల చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతానికి చేరుకున్నాయి. చేరుకోవడంతోనే సరిపోలేదు.. అక్కడ వేలకోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి.

ఇలాంటి ఆలోచన ఒక దార్శనికుడికి వచ్చింది . ఆయన పేరు చంద్రబాబు.. ఎన్నో సంవత్సరాల రాజకీయ జీవితం.. ఐటీని హైదరాబాద్ నగరానికి పరిచయం చేసిన నాయకత్వం.. అభివృద్ధిని.. సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేసిన దీర్ఘ దృష్టి ఆయన సొంతం. అందువల్లే ఏపీ ప్రజలు 2024లో ఆయన నాయకత్వాన్ని కావాలని కోరుకున్నారు. ఆయన అయితేనే ఏపీ రాష్ట్రం బాగుపడుతుందని భావించారు. ఫలితంగా చంద్రబాబు 2024 లో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి 3.0 చూపిస్తున్నారు. సరికొత్త రూపంలో ఏపీ ప్రజలకు కనిపిస్తున్నారు.

ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చిన చంద్రబాబు.. కేంద్రంలో చక్రం తిప్పుతూ.. ఏపీలో అద్భుతమైన పారిశ్రామిక అభివృద్ధికి నాంది పలుకుతున్నారు. ఏపీ రాష్ట్రానికి సరికొత్త దిశను దశను పరిచయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ మొదలైంది. ఏపీ బ్రాండ్ పేరుతో గోల్డ్ బిస్కెట్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అంతేకాదు అవి ఏపీ చరిత్రను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. జొన్నగిరిని కేజీఎఫ్ లాగా మార్చిన చరిత్ర చంద్రబాబుకుంది. అంతేకాదు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని కూడా జొన్నగిరి కంటే ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో ఏకంగా 932 కోట్ల విలువైన పెట్టుబడులతో 30 పరిశ్రమలు రాబోతున్నాయి. జొన్నగిరి మాదిరిగానే కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

వీటి ద్వారా ఏకంగా 87 వేల ఉద్యోగాలు లభించబోతున్నాయి. త్వరలో కుప్పం ప్రాంతంలో విమానాశ్రయం కూడా ఏర్పాటు కాబోతోంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్న కుప్పం.. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ గా మారిపోతుంది. త్వరలోనే బంగారు కుప్పంగా రూపాంతరం చెందనుంది. ఫ్లెక్సీలు.. కటౌట్ లకు మాత్రమే పరిమితమైన వైసీపీ హయాంలో కుప్పం నిర్లక్ష్యానికి గురైంది. చంద్రబాబు నాయకత్వంలో కుప్పం బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. ఒక విజినరీ పాలనకు.. బటన్ నొక్కే నాయకుడికి ఇదే తేడా అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం.. విజయాలకు దారులు పడతాయి..

Today 26 February 2026 Horoscope
Today 26 February 2026 Horoscope

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని రంగాల్లో ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడానికి ఇదే మంచి సమయం. వ్యాపారాలకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈరోజు వారికి ఈరోజు అన్నీ కలిసి వస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అవసరమైన వారికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. ఆగిపోయిన డబ్బు విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అవసరమైన డబ్బు అందుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందే అవకాశం ఉంటుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో కొత్త వస్తువుల కొరుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉండడంతో సంతోషంగా గడుపుతారు. గతంలో ఆగిపోయిన పనులు ఎప్పుడు పూర్తవుతాయి. అప్పుల నుంచి బయటపడేందుకు మార్గం ఏర్పడుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కలిసి వస్తుంది. దీంతో అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేయాలి. కొందరు మనసును నొప్పించే మాటలు అనే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. గతంలో మొదలు పెట్టిన పనులను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తారు..

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పొదుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరు కొత్త ఒప్పందాలు చేసుకునే విషయంలో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. బంధువుల సహాయంతో అప్పుల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రత్యర్థుల విషయంలో వ్యాపారలు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

ఈ లెక్కన మన హైదరాబాద్ కోటిరెట్లు నయం.. ఎందుకంటే ఈ వీడియో ఒకసారి చూడండి..

Mumbai Rains, Mumbai Floods

Mumbai Floods : ఎండాకాలంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వర్షాలు కురిస్తే మాత్రం ఆ నరకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ వర్షాకాలంలో సగటు హైదరాబాద్ వాసి కష్టం. వర్షం కురిస్తే చాలు.. హైదరాబాద్ ప్రాంతం మొత్తం నీట మునిగిపోతుంది. రోడ్లన్నీ జలమయం అవుతాయి. మ్యాన్ హోల్ మూతలు ఎక్కడున్నాయో తెలియదు. వాహనం ఎటువైపుకు వెళ్తుందో అర్థం కాదు. రోడ్లమీద ట్రాఫిక్ భారీగా ఏర్పడుతుంది. ఆ సమయంలో అడుగు తీసి అడుగు వేయాలంటేనే నరకం కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం బయలుదేరితే ఏ రాత్రికో గాని ఇంటికి చేరే పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాలలో వరదనీరు ముంచెత్తినప్పుడు వాహనాలు నీట మునిగిపోతాయి. ఇక అప్పుడు ప్రజల కష్టాలు మామూలుగా ఉండవు.

వర్షాకాలంలో హైదరాబాద్ నగర వాసులు చూసే నరకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబై విపరీతమైన వర్షాలతో వణికి పోతోంది. గత కొద్దిరోజులుగా అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి గడచిన సంవత్సరాలతో పూర్తి చూస్తే ముంబై నగరంలో అత్యంత భారీ వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది జూన్ నెల ప్రారంభంలో ముంబై నగరంలో విపరీతంగా ఎండలు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా అక్కడ వాతావరణంలో మార్పు వచ్చింది. వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల తాకిడికి ముంబై నగరం ఆగమాగం అయిపోతోంది. ముంబై నగరంలో మధుబన్ ప్రాంతం వరద నీరు వల్ల దాదాపు మునిగిపోయింది. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్లలో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చాయి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వరద వల్ల కార్లు నీట మునిగాయి. జనజీవనం దాదాపుగా స్తంభించింది. కానీ ఇక్కడే హైదరాబాద్ నగరం ముంబై తో పోల్చి చూస్తే లక్ష రెట్లు ఉత్తమం అనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వరద నీరు రోడ్లమీదకి వస్తుంది. కానీ ఈ స్థాయిలో కాదు. ముంబై నగరానికి హైదరాబాద్ కంటే ఎక్కువ చరిత్ర ఉంది. పైగా ముంబై నగరం హైదరాబాద్ కంటే పెద్దది. మెరుగైన మురికి నీటి పారుదల వ్యవస్థ ఉంది. అయినప్పటికీ వర్షం భారీగా పడితే ముంబై నగరం నీట మునిగిపోతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ముంబై నగరంలో విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

నన్ను చంపేయండి.. లేదంటే నేనే నిరాహార దీక్ష చేసి చనిపోతా : ప్రశ్న రావణ్

Prashna Ravana Bail
Prashna Ravana Bail

Prashna Ravan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పై , అదే విధంగా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అతనికి 4 సార్లు బెయిల్ వచ్చింది , ఇక కేసులు లేవు , ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్న సమయం లో ఏలూరు చెక్ పోస్ట్ వద్ద మరోసారి ఆయన్ని మరో కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై అరెస్ట్ అయ్యే ముందు రావణ్ మీడియా కి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై ఆయన ఆరోపణలు చేస్తూ మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ అభిమానులు ఒక రేంజ్ లో వ్యాప్తి చేస్తూ కూటమి ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.

రావణ్ మాట్లాడుతూ ‘నాలుగు రోజుల నుండి అన్నం తినడం లేదు , నిరాహారా దీక్ష చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే చెప్తున్నాను , మీరు నన్ను చంపాలని అనుకుంటే లాకప్ లోనే చంపేయండి , లేదంటే నేనే నిరాహార దీక్ష కొనసాగించి చనిపోతాను. నేను చనిపోవచ్చు, కానీ ప్రశ్న చనిపోదు , ప్రశ్నించేవాళ్ళు చనిపోరు. నాలుగు సార్లు బెయిల్ వచ్చి , ఐదవ సారి కూడా అరెస్ట్ అయిన ఏకైక వ్యక్తిని బహుశా ఈ ప్రపంచం లోనే నేను మొదటి వ్యక్తిని అయ్యి ఉంటాను. నా ఒక్కడి కోసం పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని వాడుతున్నారు. జనసేన పార్టీ నియోజగవర్గాల్లో నన్ను తిప్పుతూ, అక్కడ గుండాలతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం పోలీసులు నాకోసం సెక్యూరిటీ ని మైంటైన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్క మనిషి కోసం వ్యవస్థ మొత్తాన్ని ఉపయోగించుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’.

‘రాష్ట్రము లో ఎన్నో సమస్యలు ఉంటే వాటిని వదిలేసి , నన్ను టార్గెట్ చేయడం న్యాయమా?, నేను ఏమైనా మర్దర్లు చేశానా ?, మానభంగాలు చేశానా ?, సుగాలి ప్రీతీ చనిపోతే ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం ఎప్పుడైనా ఇలా వ్యవస్థని వాడుకున్నారా?, జనాలు అన్నీ చూస్తున్నారు అండీ. మీరు నన్ను జైళ్ల చుట్టూ తిప్పినన్ని రోజులు , నేను నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాను , దీక్ష చేయడం నా హక్కు ‘ అంటూ ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు అంశం ఇంకా ఎన్ని మలుపులు తిప్పుకుంటుందో చూడాలి.

బ్రూక్ విధ్వంసం.. ఒకే ఓవర్ లో 4,4,6,6,6.. బిత్తర పోయిన టీమిండియా బౌలర్..

India vs England

Harry Brook : అది మామూలు కొట్టుడు కాదు.. విధ్వంసం అనే మాట కూడా సరిపోదు. వీర విహారం చేశాడు. మరొకసారి బంతిని పట్టుకోవాలంటేనే బౌలర్ కు వెన్నులో వణుకు పుట్టేలా చేశాడు. రెండు వికెట్లు సాధించిన ఆనందాన్ని జస్ట్ ఐదు బంతుల వ్యవధిలో ఆవిరి చేశాడు. ఫలితంగా టీమ్ ఇండియా బౌలర్ కు కన్నీరు మిగిల్చాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

ముందుగా ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కిషన్ 49, అభిషేక్ శర్మ 43, అయ్యర్ 37 పరుగులతో ఆకట్టుకున్నారు. చివర్లో తిలక్ వర్మ 24 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కరణ్ 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆర్చర్, జాక్స్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు.. 0 పరుగుల వద్ద ఓపెనర్ సాల్టికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. వీరిద్దరూ సున్నా పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడం విశేషం. ఈ ఇద్దరి వికెట్లను అర్ష్ దీప్ సింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక్కడితో టీమ్ ఇండియా గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ వన్ డౌన్ ఆటగాడు బ్రూక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. అతడు కేవలం 13 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు.. మూడు సిక్సర్లు ఉన్నాయి.

ముఖ్యంగా అర్ష్ దీప్ సింగ్ వేసిన ఓవర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు..అర్ష్ దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి బెతల్ బ్రూక్ కు స్ట్రైక్ ఇచ్చాడు. అంతే బ్రూక్ శివతాండవం చేశాడు. రెండో బంతి కి ఫోర్ కొట్టాడు. మూడో బంతిని కూడా ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత మూడు బంతులను వరుసగా సిక్సర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 27 పరుగులు వచ్చాయి. ఫలితంగా మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. రెండు వికెట్లు పడగొట్టి కాలర్ ఎగరేసిన అర్ష్ దీప్ సింగ్ ఈ ఓవర్ తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అసలు బ్రూక్ అలా ఆడుతుంటే వైవిధ్యవంతమైన బంతులు వేయాల్సిన అర్ష్ దీప్ సింగ్ లూజ్ డెలివరీలు వేశాడు. దీంతో బ్రూక్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు..

ఫోన్ లో పైరసీ సినిమాలు చూసే వారికి షాక్...

Movie Shooting
Movie Shooting

Movie Piracy : టెలిగ్రామ్ అనే యాప్ ద్వారా సినిమాలో ఓటిటి కంటెంట్ మొత్తం పైరసీ అవుతుందంటూ గతంలో పెను సంచలనాలను క్రియేట్ చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దాంతో అందరు దానిమీద విరుచుకుపడ్డారు. టెలిగ్రామ్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవడమే ఆలస్యం అందులో కొంతమంది కొన్ని సినిమాల లింకులను పంపించడం దానిని ఓపెన్ చేసి అందరు విచ్చలవిడిగా చూస్తూ ఉండడం జరిగిపోయాయి. ఇక దాంతో NEET రీ ఎగ్జామ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేసింది. ప్రస్తుతం ఆ కంపెనీకి పెద్ద ప్రభుత్వం నోటీసులైతే జారీ చేసింది. అక్రమంగా ఆ యాప్ ద్వారా ఓటిటి కంటెంట్ పైరసీ అవుతుందని దానికి సంబంధించిన వివరణ 15 రోజుల్లో ఇవ్వాలని కోరింది. ఓటిటి సంస్థలను అలాగే సినిమాలను కాపాడుకోవడమే తన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఇక మొత్తానికైతే ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల సినిమా కంటెంట్ పైరసీ చేస్తే ప్రొడ్యూసర్ల పొట్ట కొట్టిన వాళ్ళు అవుతారు అలాగే వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పైరసీలను ఎంకరేజ్ చేసే యాప్ లను క్లోజ్ చేస్తేనే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా అద్భుతం అని చాలామంది సినిమా మేధావులు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు.

మరి ఈ రకంగానే టెలిగ్రామ్ యాప్ లో ఓటిటి యాప్ కి సంబంధించిన సినిమాలను పైరసీ చేయనియకుండా ఆపగలుగుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… కేంద్ర ప్రభుత్వం పైరసీలను సక్సెస్ ఫుల్ గా నిలపగలిగితే మాత్రం సినిమాలకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

అలాగే ప్రతి ప్రొడ్యూసర్ కూడా విపరీతంగా లాభాలను ఆర్జించవచ్చు. మంచి కంటెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…ఇక దీని మీద కొంతమంది ఇండస్రీ పెద్దలు సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు…

తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతుందా..? వాళ్లకి ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయి...

Dual Role Trend In Tollywood
Dual Role Trend In Tollywood

Telugu Cinema : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ని సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం కొత్త జానర్ లో సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను కాకుండా డిఫరెంట్ గా అటెంప్ట్ చేసే సినిమాల వైపే వాళ్లు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు ఆదరణ దక్కుతుంది. ఒక రకంగా ఇది శుభపరిణామం అనే చెప్పాలి.

రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కథలతో సినిమాలు వస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే మాత్రం వాళ్ళు చేసే సినిమాలకు కాలం చెల్లిపోతుందనే చెప్పాలి. స్టార్ హీరోలైతే కమర్షియల్ జానర్ లోనే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతున్నారు..కానీ యంగ్ హీరోలు డిఫరెంట్ గా సినిమాలను చేయాలి…ఇప్పటివరకు కుర్ర హీరోలు వాళ్ళు చేసిన సినిమాలతో భారీ విజయాలను సాధిస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారు. ప్రేక్షకులందరిలో ఎలాంటి మన్ననలు దక్కించుకోబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ మధ్యకాలంలో ఓటిటి లో మలయాళం సినిమాలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో తెలుగు ప్రేక్షకులు సైతం మలయాళం సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెమ్మదిగా వల్ల మూవీస్ కి మన ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన మేకర్స్ డిఫరెంట్ ప్రయత్నాలు చేయాలి.

మనవాళ్లు కూడా మరికొన్ని బెస్ట్ కథలతో ప్రేక్షకులను అలరించాల్సిన సమయమైతే ఆసన్నమైంది… ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు బెస్ట్ కంటెంట్ తో సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. యంగ్ డైరెక్టర్స్ సైతం డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

'మా ఇంటి బంగారం' 15 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా తగ్గని జోరు..

Maa Inti Bangaram Box Office
Maa Inti Bangaram Box Office

Maa Inti Bangaram 15 Days Collections : సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని , కేవలం రెండవ రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న కొత్తగా రెండు సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా జోరు తగ్గకపోవడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 15 వ రోజున 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 15 రోజుల్లో ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి , ఎంత లాభాలు వచ్చాయి , ఇంకా ఎంత లాభాలు రావొచ్చు అనేది ఒకసారి చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి దాదాపుగా 13 కోట్ల 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి 10 కోట్ల 56 లక్షలు రాగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 24 కోట్ల 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 47 కోట్ల 25 లక్షల వరకు వచ్చింది. అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 86 లక్షలు రాగా , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్లు , ఓవర్సీస్ నుండి 10 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 41 కోట్ల 69 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 84 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

లాభాలు దాదాపుగా 29 కోట్ల 69 లక్షల రూపాయిలు రాగా, మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా లాంగ్ రన్ లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ రన్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించకపోవడం తో , ఈ సినిమా ఓటీటీ లో కూడా ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి థియేట్రికల్ రన్ ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతిష్టాత్మక వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఈ చిత్రం చేరుతుందో లేదో చూడాలి.

'నాగబంధం' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇది మామూలు షాక్ కాదు.. పాపం నిర్మాత..

Nagabandham Movie
Nagabandham Movie

Nagabandham Day 1 Collections : విడుదలకు ముందు ఈ మధ్యకాలం లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తించిన చిత్రాల్లో ఒకటి ‘నాగబంధం’. కొత్త హీరో పై వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయడం తో , కచ్చితంగా ఈ సినిమాలో ఎదో విషయం ఉండే ఉంటుందని ఆశించారు జనాలు. పైగా అనంత పద్మనాభ స్వామి గుడిపై తీస్తున్న సినిమా కావడంతో , ఫాంటసీ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఆడియన్స్ నుండి ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. అనేక మంది ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి నిద్రపోయాము అంటూ సోషల్ మీడియా లో వీడియోలు సైతం అప్లోడ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయినప్పటికీ కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉండడం వల్ల, ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

కానీ ఈ ఓపెనింగ్స్ నిర్మాతకు బడ్జెట్ రీకవరీ కి ఏ మాత్రం సరిపోవు అనేది వాస్తవం. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో , బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా ఎంత వసూళ్లు రావాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు నైజాం ప్రాంతం నుండి 1 కోటి 73 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 1 కోటి 32 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 1 కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక నుండి 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 55 లక్షలు, ఓవర్సీస్ నుండి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 4 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా మినిమం రేంజ్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమే కాబట్టి , ఈ చిత్రాన్ని ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా చూడొచ్చు. ఈ చిత్రానికి అడ్వాన్స్ కట్టిన బయ్యర్స్ కి ఒక్క పైసా కూడా మిగిలే పరిస్థితి లేదు , ఇక నిర్మాత పరిస్థితి ఊహిస్తేనే ఏడుపొస్తోంది అంటూ నెటిజెన్స్ బాధపడుతున్నారు.

'రావు బహదూర్' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. అప్పుడే 50 శాతం బ్రేక్ ఈవెన్..

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

Rao Bahadur Box Office : సత్యదేవ్ హీరో గా , సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ‘రావు బహదూర్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ, సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండడం తో , అలాంటి జానర్ సినిమాలను ఇష్టపడే వారికి , షోస్ గడిచే కొద్దీ , ఆడియన్స్ పెరిగే కొద్దీ బాగా నచ్చేసింది. దీంతో పాజిటివ్ టాక్ జనాల్లో స్థిరపడింది. దీంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఓపెనింగ్స్ కంటే , ఓవర్సీస్ లో వచ్చిన ఓపెనింగ్స్ ఎక్కువ ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 75 లక్షల వరకు ఉండొచ్చు. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఏకంగా 1 లక్షా 97 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సత్యదేవ్ చిత్రానికి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం గతం లో ఎప్పుడూ చూడలేదు. అలాంటి ఓపెనింగ్స్ రావడానికి ఓవర్సీస్ లో మహేష్ బాబు బ్రాండ్ బాగా కలిసి వచ్చి ఉండొచ్చని అంటున్నారు నెటిజెన్స్. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 17 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

మొత్తం మీద ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 59 లక్షలు గ్రాస్ , 1 కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అంత వసూళ్లు రావడానికి ఈ ఓపెనింగ్ ఏ మాత్రం సరిపోదు. కానీ వీకెండ్ లో మొదటి రోజు కంటే రెండవ రోజు , రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి , వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం 50 శాతం రీకవరీ ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

నిరీక్షణ ముగిసింది.. బుడ్డ బెబ్బులి ఎంట్రీ ఇచ్చింది.. టీమిండియా క్యాప్ అందుకున్న వైభవ్.. వైరల్ వీడియో

vaibhav-suryavanshi

Vaibhav debut : వరల్డ్ కప్ హీరో అన్నారు.. బీభత్సంగా పరుగులు చేశాడు అన్నారు. మ్యాచ్ విన్నర్ కాబట్టి అవకాశాలు ఇస్తున్నామని చెప్పారు. కానీ అతడు ఏ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం లేదు. గల్లి స్థాయిలో ఆడుతూ టీమ్ ఇండియా పరువు తీస్తున్నాడు. దీంతో అతడి సేవలు చాలనుకుని మేనేజ్మెంట్ భావించింది. అంతేకాదు మొహమాటం లేకుండా పక్కన పెట్టింది. ఇదీ టీమిండియాలో సంజు శాంసన్ పరిస్థితి.

రకరకాల ఒత్తిళ్లు.. అనేక రకాల విమర్శలు.. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ను పునరాలోచనలో పడేశాయి. ఫలితంగా రెండవ టి20 మ్యాచ్ కు సంజుకు విశ్రాంతి లభించింది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో బుడ్డబెబ్బులి అలియాస్ వైభవ్ సూర్య వంశీ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. సూర్యవంశీ జట్టులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అమాంతం మారిపోయింది. ఎంతలా అది మారిపోయింది అంటే.. గడిచిన మూడు మ్యాచ్లలో తొలి వికెట్ భాగస్వామ్యం కనీసం 10 పరుగులు కూడా రాలేదు. అలాంటిది ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా ఈ కథనం రాసే సమయం వరకు తొలి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ మ్యాచ్లో కేవలం సూర్య వంశీ 14 పరుగులు మాత్రమే చేసి ఉండవచ్చు. కానీ అతడు ఇచ్చిన సపోర్ట్ టీమిడియాకు ఎంతగానో లాభించింది. పది బంతులు ఎదుర్కొన్న అతడు రెండు సిక్సర్లు కొట్టాడు. ఇది అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్.

సూర్య వంశీకి స్థానం కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ ప్లేయర్ల నుంచి మొదలు పెడితే మాజీ ప్లేయర్ల వరకు అందరూ సూర్య వంశీ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అతడికి అవకాశం ఇవ్వాలని కోరారు. మేనేజ్మెంట్ మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో చోటు కల్పించింది. వచ్చిన అవకాశాన్ని అతడు దాదాపుగా సద్వినియోగం చేసుకున్నాడు. సంజు శాంసన్ దారుణంగా విఫలమవుతున్నచోట. అతడు తొలి వికెట్ కు అభిషేక్ శర్మతో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సూర్యవంశీ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ ప్రమాదకరమైన ఇంగ్లాండ్ బౌలింగ్ మొత్తాన్ని ఎదుర్కొన్నాడు. ఉన్నంతసేపు ఇంగ్లాండు ఫీల్డర్లకు.. బౌలర్లకు చెమట పట్టించాడు. అందువల్లే అభిషేక్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాడు.

అభిషేక్ శర్మ ఇప్పటివరకు 22 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక శిక్ష సహాయంతో 43 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతడు కరణ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇప్పటికే టీమిండియా 6ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోంది. ఇండియా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని టీమిండియా ఓపెనర్లు నిరూపించారు. బుడ్డ బెబ్బులి అలియాస్ సూర్య వంశీ జాతీయ జట్టులో అడుగుపెట్టి.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా మొత్తం అతడి పేరును కలవరిస్తోంది. సూర్య వంశీ నామస్మరణతో మారు మోగిపోతుంది.

116 ఏళ్ల వయసు.. మెట్ల మార్గంలో తిరుమలేశుని దర్శనానికి.. ఈ వృద్ధురాలికి మొక్కాలి..

TTD tirumala

Tirumala Tirupati Devasthanams : భక్తి శక్తికి వయసు అడ్డంకి కాదు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం పొందాలనే గాఢమైన కోరికతో 116 ఏళ్ల వయసులో ఓ వయోవృద్ధురాలు తిరుమలకు కాలినడకన బయలుదేరింది. కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన ఆమె, ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ వాహనం లేదా ఎయిర్‌లిఫ్ట్ వంటి సౌకర్యాలను వద్దని చెప్పి, సంప్రదాయ కాలినడక మార్గాన్ని ఎంచుకుంది. ఆధునిక కాలంలో చాలామంది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలతో జీవితం ముగించుకుంటున్న తరుణంలో.. ఈ వృద్ధురాలి వంటివారు పాతకాలపు జీవన విధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమను అనుసరించి దీర్ఘాయుష్షును సాధిస్తున్నారు.

యాత్ర ప్రారంభం..
ఈ వృద్ధురాలు తన మనుమలు, మనుమరాళ్లతో కలిసి అలిపిరి నుంచి తిరుమల వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఈ మార్గం సుమారు 11 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వేలకొద్దీ మెట్లు, కొండల మధ్య ఇరుకైన దారులు, కొన్ని చోట్ల చాలా ఏటవాలు ఉంటాయి. ఆమెకు నడవడంలో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ, భక్తి బలంతో ఆమె ముందుకు సాగింది. కుటుంబ సభ్యులు ఆమె పక్కనే నడుస్తూ, అప్పుడప్పుడు నీరు, విశ్రాంతి ఇస్తూ సహకరించారు.

కష్టతరమైన మార్గంలో అద్భుతం..
తిరుమల మార్గంలో అత్యంత కష్టతరమైన ప్రాంతం మోకాళ్ల పర్వతం. ఇక్కడ ఎత్తైన, ఏటవాలు మెట్లు ఉంటాయి. యువకులకు కూడా ఇక్కడ కొంత శ్రమ అవుతుంది. కానీ 116 ఏళ్ల ఆమె ఆ మెట్లను కూడా సులభంగా, తడబడకుండా ఎక్కేసింది. నడవడంలో వణుకు కనిపించినా, మెట్లపై ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, స్థిరంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. చుట్టూ ఉన్న భక్తులు, యాత్రికులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమెలో ఏదో ప్రత్యేక శక్తి ఉంది అని చాలామంది అనుకున్నారు.

కుటుంబం మద్దతు..
ఆమె మనవడు ఒకరు అమ్మమ్మ కోరిక మేరకే మేము ఈ కాలినడక చేస్తున్నాం. ఆమె ఇష్టం లేకపోతే వాహనంలోనే తీసుకెళ్లేవాళ్లం అని చెప్పాడు. కుటుంబం మొత్తం ఆమెను ప్రోత్సహిస్తూ, ఆమె భద్రతను జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లింది. ఆమెకు ఏదైనా అలసటగా అనిపిస్తే వెంటనే విశ్రాంతి ఇచ్చారు. ఈ కుటుంబ బంధం, భక్తి కలయిక ఈ యాత్రను మరింత స్ఫూర్తిదాయకంగా మార్చింది.

సోషల్ మీడియాలో వైరల్..
116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎక్కుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీడియో వైరల్ అవడంతో లక్షలాది మంది ఆమె భక్తి, ఓర్పు, శారీరక సామర్థ్యాన్ని మెచ్చుకుంటున్నారు. చాలామంది వయసు కేవలం సంఖ్య మాత్రమే… భక్తి ఉంటే ఏదైనా సాధ్యం అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన తిరుమలలో వృద్ధుల భక్తిని మరోసారి గుర్తు చేస్తోంది. వయసు పెరిగినా, హృదయంలో భక్తి ఉంటే ఏ పని అయినా సాధ్యమవుతుందని ఈ 116 ఏళ్ల బామ్మ నిరూపించింది.

సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్ ఫోన్ కాల్ సంభాషణ.. వీడియో వైరల్..

prashna ravan, prakash raj

prashna ravan, prakash raj : మత విద్వేషాలను రెచ్చగొట్టడమే భావస్వేచ్ఛ అని ఫీల్ అయ్యే ‘ప్రశ్న జోసెఫ్’ ని అరెస్ట్ చేయడం పట్ల జనాలు సంతోషిస్తుంటే , మరో పక్క ఒక పార్టీ కి చెందిన కార్యకర్తలు , ప్రకాష్ రాజ్ వంటి కుహానా మేధావులు రావణ్ కి మద్దతుగా నిలబడుతున్నారు. ఇక్కడ రావణ్ ని అరెస్ట్ చేస్తే ట్విట్టర్ లో , ఇన్ స్టాగ్రామ్ లో కూర్చొని అతనికి సపోర్టుగా , చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లను తిడుతూ , నాన్ స్టాప్ గా వీడియోలు , ట్వీట్లు వేస్తున్న ప్రకాష్ రాజ్, ఇదే తరహా సందర్భాలు తమిళనాడు , తెలంగాణ లో ఎదురైనప్పుడు నోరు మెదపడానికి కూడా సాహసం చేయడం లేదు. తమిళనాడు లో ఈయన సపోర్టు చేసిన DMK ఎమ్మెల్యే ని TVK ప్రభుత్వం అరెస్ట్ చేస్తే చప్పుడు లేదు.

మరోపక్క తెలంగాణ లో కవిత ని , కేసీఆర్ లను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే , ‘ఏమో సార్..నాకు కనపడదు’ రేంజ్ లో ప్రవర్తిస్తున్నారు. కానీ కేవలం ఒక యూట్యూబర్ , మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు , అతన్ని అరెస్ట్ చేస్తే , ప్రకాష్ రాజ్ కి ప్రాణం పోయినంత పని అవుతోంది. పాపం అసలు తట్టుకోలేకపోతున్నారు . ఎందుకు ప్రకాష్ రాజ్ అతని కోసం ఇంతలా పరితపిస్తున్నారు?, అసలు ఏంటి ఈయన బాధ? అని ఆరాలు తీస్తే , ప్రశ్న రావణ్ తో , ప్రకాష్ రాజ్ జరిపిన ఫోన్ కాల్ సంభాషణలు , వాట్సాప్ వాయిస్ మెసేజిలు బయటపడ్డాయి. వీళ్లిద్దరు ఒక ట్వీట్ వేసే ముందు , ఒక వీడియో చేసే ముందు , ఏ విధంగా మాట్లాడుకుంటారో, ఈ ఒక్క ఆడియో రికార్డింగ్ వింటే సరిపోతుంది. మీకోసం ఆ వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.

వీళ్లకంటూ ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఏమి ఉండదు , ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటే తప్ప , ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేరని ఈ ఆడియో రికార్డింగ్ తో స్పష్టమైంది. ఒకవేళ రావణ్ రిమాండ్ లోకి వెళ్తే, ప్రకాష్ రాజ్ తో పాటు, మాత విద్వేషాలను రెచ్చగొట్టే కుహనా మేధావుల కుట్రలు మొత్తం బయటపడే అవకాశాలు ఉన్నాయి. కేవలం రావణ్ మొబైల్ ని పోలీసులు తీసుకొని చెక్ చేస్తే చాలు , బండారాలు మొత్తం బయటపడుతాయి , ప్రకాష్ రాజ్ కి అలాంటి బండారాలు ఇతని వద్ద ఎన్ని దాగున్నాయో ఏంటో , అందుకే రావణ్ మీద ఇంత ప్రేమని చూపిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.