Home Blog Page 28

భర్తను ఖతం చేసింది.. స్నానాల గదిలో పూడ్చింది.. పోలీసులకు దృశ్యం సినిమా కళ్లకు కట్టింది..

Uttar Pradesh crime

Uttar Pradesh crime : ఒకప్పుడు అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని మనలోకం అనుకునేది. ఇప్పుడు భార్య లేని వాడు గొప్పవాడు అనుకునే రోజులు కచ్చితంగా వస్తాయేమో. ఈ భూమ్మీద మనుషులందరిలోనూ చెడ్డవాళ్ళు లేనట్టు.. భార్యలందరిలోనూ చెడ్డ భార్యలు లేరు. అయితే ఈ భార్య మాత్రం మహా చెడ్డది. ఎంత చెడ్డది అంటే.. పోలీసులకు చుక్కలు చూపించింది. 45 రోజులపాటు దృశ్యం సినిమాను లైవ్ లో చూపించింది.

అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా ప్రాంతం. ఆ ఏరియాలో 44 సంవత్సరాల సురేంద్ర కుమార్ శర్మ అనే వ్యక్తి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేశారు. ఉపయోగం లేకుండా పోయింది. చివరికి అతడి ఇంట్లో స్నానాల గది లో ఒక కీలక నిజం బయటపడింది. ఆ తర్వాత పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ వ్యవహారంలో సురేంద్ర భర్త రూబీ శర్మ వ్యవహరించిన తీరు పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విధంగా చేసింది. ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రేణుక దాం కాలనీ.. సికంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

మే 18 నుంచి సురేంద్ర కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు అడిగితే రూబీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. రోజులు గడిచినప్పటికీ అతడు ఇంటికి రాకపోవడంతో బంధువులు రూబీ మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. చివరికి మే 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసుల ముందుగా కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.. సురేంద్ర ఏదో ఊరు వెళ్ళాడని.. త్వరలోనే వస్తాడని పోలీసులకు చెప్పింది. అయితే పోలీసులు ఆమె మాట మీద నమ్మకం లేక వెతకడం మొదలుపెట్టారు..

సురేంద్రకు అనిల్ శర్మ అనే ఓ తమ్ముడు ఉన్నాడు. అన్నయ్య కోసం అనేక విధాలుగా వెతికాడు. ఎక్కడ కూడా సురేంద్ర జాడ కనిపించలేదు. పైగా సురేంద్రకు శత్రువులు లేరు. అలాంటప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడు.. ఎందుకు వెళ్ళాడు.. అనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. ఎన్ని విధాలుగా వెతికినప్పటికీ అతడి జాడ లభించకపోవడంతో పోలీసులు 45 రోజుల తర్వాత సురేంద్ర ఇంటికి వచ్చారు. రూబిని ఈసారి అనేక విధాలుగా ప్రశ్నించారు. అయితే ఈసారి రూబీ వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. అంతేకాదు పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు కట్టు కథలు చెప్పింది. ఇంట్లో తనిఖీలు చేయాలని పోలీసులు అడిగితే.. మొహమాట లేకుండా చేసుకోండి అని చెప్పింది.

పోలీసులు తనిఖీలలో భాగంగా స్నానాల గతి ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ కొత్త టైల్స్ కనిపించాయి. ఇల్లు మొత్తం పాత టైల్స్ ఉంటే.. అక్కడ మాత్రం కొత్త టైల్స్ ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి ఆ టైల్స్ తవ్వారు. అందులో కుళ్ళిపోయిన వాసన వచ్చింది. సురేంద్ర శవం అక్కడే పోలీసులు కనిపించింది. రూబీ ఇక ఎంత మాత్రం నిజాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. తన భర్తను చంపి అందులోనే గొయ్యి తీసి పాతిపెట్టింది. మట్టి పోసి.. సిమెంట్ వేసి టైల్స్ ఏర్పాటు చేయించింది. సురేంద్రకు మద్యం తాగే అలవాటు ఉండటం వల్ల.. రూబీ తో నిత్యం గొడవపడేవాడు. ఈ విషయం అతడి సోదరుడు అనిల్ కు కూడా తెలుసు. అందువల్లే అతడు పోలీసులతో తన వదిన మీదనే అనుమానం వ్యక్తం చేశాడు. కేవలం మద్యం మాత్రమేనా.. ఇంకా మరి ఏదైనా కోణం ఉందా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బలాబలాలు ఎలా ఉన్నాయి.. ఎవరు గెలుస్తారు..

Australia Women vs England Women
Australia Women vs England Women

Australia Women vs England Women: మహిళల టి20 ప్రపంచ కప్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మహిళల జట్లు ఫైనల్ మ్యాచ్లో పోటీ పడబోతున్నాయి. సమకాలీన క్రికెట్లో ఈ రెండు జట్లు అత్యంత బలమైనవి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.. అయితే ఇంతవరకు మహిళ టి20 ప్రపంచ కప్ లో ఫైనల్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలపడలేదు.

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తమ చివరి 10 t20 మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శన చేశాయి. ఆస్ట్రేలియా పది మ్యాచ్లలో 9, ఇంగ్లాండ్ పది మ్యాచ్లలో 8 విజయాలు సాధించింది. ఇందులో ఆస్ట్రేలియా సగటు విజయం మార్జిన్ 63 పరుగులు లేదా ఎనిమిది వికెట్ల తేడాతో లేదా 37 బంతులు మిగిలి ఉండగానే నమోదయింది. ఇంగ్లాండ్ విషయంలో ఇది 46 పరుగులు లేదా ఏడు వికెట్ల తేడాతో లేదా 19 బంతులు మిగిలి ఉండగానే నమోదయింది. ఇప్పటివరకు 9సార్లు మహిళల t20 ప్రపంచ కప్ జరిగింది. ఆరుసార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2016 లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇక స్వదేశంలో జరిగిన టి20 ప్రపంచ కప్ యాత్రలో ఇంగ్లాండ్ 11-0 తేడాతో విజయాల పరంపరను కొనసాగిస్తోంది. 2009 ఎడిషన్ లో ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.

2020 నుంచి జరిగిన ముఖాముఖి పోటీలలో ఆస్ట్రేలియా 6-3 తేడాతో ఇంగ్లాండ్ మీద లీడ్ కొనసాగిస్తుంది. టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు 5-2 తేడాతో ఇంగ్లాండ్ మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.. 2012, 2014, 2018 ఫైనల్స్ లో ఇంగ్లాండ్ మీద ఆస్ట్రేలియా అద్వితీయమైన విజయాలను సాధించింది.

స్వదేశంలో ప్రత్యర్ధులతో జరిగిన టి20 లలో ఇంగ్లాండ్ 11-6 లీడ్ లో ఉంది.. అయితే ఈ గణాంకాలు రెండు జట్ల బలాలను సూచిస్తున్నాయి. అయితే ఎప్పటి మాదిరిగానే ఆస్ట్రేలియానే ముందు వరుసలో ఉంది. 2018 నుంచి జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా 29 మ్యాచ్లకు 26 గెలిచింది. ఇక ఇటీవల 3 t20 ప్రపంచ కప్ లలో ఆస్ట్రేలియా అమ్మాయిలు 17 మ్యాచ్ లు ఆడారు.. ఇందులో 2024లో జరిగిన ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్లో ఓడిపోయారు. అది మాత్రమే వారికి ఏకైక ఓటమి.

వేదిక ఎలా ఉందంటే

ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ లో జరుగుతుంది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు అత్యుత్తమ ఎకానమీ రేట్లు కలిగి ఉన్నారు. తొలి ఆరు ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లు బ్యాటర్ల మీద మరింత ఒత్తిడి తీసుకు రాగలరు. తొలి ఇన్నింగ్స్ తో పోల్చి చూస్తే రెండవ ఇన్నింగ్స్ లో బంతి టర్న్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఇక్కడ జరిగిన ఐదు మహిళా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లలో.. మూడు మ్యాచ్లలో చేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇటీవల మ్యాచ్లో భారత్ పై 171 పరుగుల చేజింగ్లో.. ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది.

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. కుట్టుమిషన్, ఎలక్ట్రిక్‌ బైక్, ఈ–స్కూటీ సహాయం.. దరఖాస్తు ఎలా చేయాలి?

Minority Finance Corporation Telangana
Minority Finance Corporation Telangana

Minority Finance Corporation Telangana: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వివిధ రకాల మద్దతు అందిస్తోంది. ఈ నేపథ్యంలో క్రై స్తవ మైనారిటీలకు 2026–27 ఆర్థిక సంవత్సరం కోసం ఆర్థిక సహాయ కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందే అవకాశం, చిన్న వ్యాపారాలు మొదలుపెట్టే సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించే వాహనాలు అందుబాటులోకి వస్తాయి.

పథకం వివరాలు..
తెలంగాణ క్రై స్తవ మైనారిటీల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో మహిళలకు కుట్టుమిషన్‌ సహాయం, చిన్న వ్యాపార యూనిట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్‌ బైక్, ఈ–స్కూటీ, మోటార్‌ బైక్‌ వంటి వాహనాల కొనుగోలుకు ఆర్థిక సాయం లేదా సబ్సిడీ అందుతుంది. ఈ సహాయం ద్వారా యువతీయువకులు డెలివరీ సర్వీసులు, సొంత వ్యాపారాలు ప్రారంభించి ఆదాయం సాధించవచ్చు. బ్యాంకు లింక్‌ ఉన్నా లేకున్నా ఈ పథకం అమలవుతుంది.

అర్హత ప్రమాణాలు…
ఈ సహాయం పొందాలంటే కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి. కుట్టుమిషన్, చిన్న వ్యాపార యూనిట్ల కోసం వయసు 21 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలి. ఎలక్ట్రిక్‌ బైక్, ఈ–స్కూటీ, మోటార్‌ బైక్‌ కోసం 21 నుంచి 50 సంవత్సరాల వరకు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం నగరాలు, పట్టణాల్లో రూ.2 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కన్నా తక్కువగా ఉండాలి. తెలంగాణలో నివసిస్తున్న క్రై స్తవ మైనారిటీ సమాజ సభ్యులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

అవసరమైన సర్టిఫికెట్లు…
దరఖాస్తు సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్‌ కార్డు, కుటుంబ ఆదాయ సర్టిఫికెట్, క్రై స్తవ మతం ధృవీకరణ పత్రం (చర్చి లేదా పాస్టర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌), ఇటీవలి ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలు అవసరం. ఈ పత్రాలు సరిగ్గా ఉంటే దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం..
దరఖాస్తు చేయడం చాలా సులభం. అధికారిక వెబ్‌సైట్‌ tsobmms.cgg.gov.in లేదా tgcmfc.in లోకి వెళ్లి, కుట్టుమిషన్‌ లేదా వాహనాలు/వ్యాపార యూనిట్‌ సంబంధిత ఫారం ఎంచుకోండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేసి, ఫారం పూర్తి చేసి సమర్పించండి. సమర్పణ తర్వాత అప్లికేషన్‌ నంబర్‌ను జాగ్రత్తగా నోట్‌ చేసుకోండి. ఇంటర్నెట్‌ ఉన్న చోట నుంచి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు జూలై 3 నుంచి జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గడువు ముగిసేలోపు త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది. అప్లికేషన్‌ సమర్పించే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో తాజా మార్గదర్శకాలు చదవండి.

పోసాని కి 3 నెలలు జైలు.. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే 'ప్రశ్న రావణ్' కి బెయిల్ మీద బెయిల్..

Prashna Ravana Bail
Prashna Ravana Bail

Prashna Ravana Bail: కొన్ని సందర్భాల్లో మన దేశంలోని న్యాయ వ్యవస్థని చూస్తే కోపం రాక తప్పదు. ఒకరికి ఒక న్యాయం , మరొకరికి మరో న్యాయం అన్నట్టుగా తయారు అయ్యింది పరిస్థితి. ఉదాహరణకి మన ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులనే తీసుకుందాం. వైసీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులూ హద్దులు దాటి మరీ తమ నోటికి పని చెప్పారు. కొడాలి నాని , గుడివాడ అమర్ నాధ్ , పోసాని కృష్ణ మురళి , బోరుగడ్డ అనిల్ , వల్లభనేని వంశీ ఇలా ఒక్కరా ఇద్దరా , పెద్ద లిస్తే ఉంది. వీరిలో పోసాని కృష్ణ మురళి , బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ లకు జైలు శిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. వీళ్ళు కేవలం సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను మాత్రమే దూషించారు.

దానికే పోసాని కృష్ణ మురళి 3 నెలలు , వల్లభనేని వంశి దాదాపుగా 9 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. వాళ్లకు బెయిల్ అంత సులువుగా అయితే రాలేదు. కానీ ప్రశ్న రావణ్ కి మాత్రం మంచి నీళ్లు తాగినంత తేలికగా బెయిల్ వస్తోంది. ఇదే అందరికీ అంతు చిక్కని ప్రశ్న. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే , ఏ దళిత క్రైస్తవ సభలో చంద్రబాబు ని దూషించిన జర్నలిస్ట్ కేవీఆర్ ని అరెస్ట్ చేసి , కోర్టు ద్వారా 14 రోజులు రిమాండ్ వచ్చేలా చేశారో, అదే సభలో పవన్ కళ్యాణ్ ని , హిందువులను , సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసిన రావణ్ కి మాత్రం రిమాండ్ వచ్చేలా చేయలేకపోయారు. చాలా తేలికగా అతని మీద నమోదైన కేసులకు బెయిల్ మంజూరు అవుతూ వస్తోంది. ఇది దేనికి సంకేతం?, కావాలనే చంద్రబాబు కి సంబంధించిన వర్గం రావణ్ ని కాపాడుతూ , పవన్ కళ్యాణ్ పై నెగెటివిటీ పెరిగేలా చేస్తున్నారా అనే అనుమానం కూడా జనాల్లో కలుగుతోంది.

తన ప్రతీ విడియోలోను హిందువుల పై రావణ్ కి ఉన్న అక్కసు తెలుస్తూనే ఉంది , వాళ్లపై ఆయన పగతో రగిలిపోతూ చేసే కామెంట్స్ ని చూస్తే చీము నెత్తురు ఉన్న ఏ హిందువుకి అయినా రక్తం మరిగిపోయే పరిస్థితి ఉంటుంది. అలా విద్వేషాలను రెచ్చగొట్టే మనిషికి బెయిల్ ఎలా లభిస్తోంది?, ఇప్పటికే మూడు ప్రాంతాల్లో అతనికి బెయిల్ లభించింది. ఇప్పుడు అనకాపల్లి కి తీసుకెళ్లారు , అక్కడ కూడా బెయిల్ వచ్చేలా చేస్తారు ఇలా న్యాయవ్యవస్థలే ఇలాంటోళ్లని కాపాడడం మొదలు పెడితే , బయటకి వచ్చిన తర్వాత ఇక ఇతగాడు ఇంకా ఎన్ని మాత విద్వేషాలను రెచ్చగొడుతాడు?, కాస్త అయినా కోర్టులు వీటిని పరిగణలోకి తీసుకోవా?, పైగా ఇలాంటి వ్యక్తులకు ప్రకాష్ రాజ్ లాంటోళ్ళు సపోర్టు ఇవ్వడం దురదృష్టకరం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ అంశం ఇంకా ఎన్ని మలుపులను తీసుకుంటుందో అనేది.

బండ్ల గణేష్ వల్ల పవన్ కళ్యాణ్ ఆస్తులు 10 రెట్లు పెరిగాయా..? ప్రస్తుతం పవర్ స్టార్ ఆస్తుల విలువ ఎంతంటే..?

Pawan Kalyan Assets
Pawan Kalyan Assets

Pawan Kalyan Assets: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్… మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడు. 2014వ సంవత్సరంలో జనసేన అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి అడపదడప సినిమాలు మాత్రమే చేస్తున్నాడు… రాజకీయరంగం పైనే ఆయన పూర్తి ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. దాంతో ఆయన రాబోయే సినిమాల మీద భారీ ఎఫెక్ట్ పడుతున్నట్టుగా తెలుస్తుంది.

మిగతా హీరోలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ ఆస్తులు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎక్కువగా సేవ కార్యక్రమాలను చేపడుతూ ఉంటాడు. కెరియర్ మొదటి నుంచి కూడా తనకు వచ్చిన రెమ్యునరేషన్ లో చాలా బాగం పేదలకు సహాయంగా ఇస్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఆయనకి ఉన్న ఆస్తులను బట్టి చూస్తే ఆయనకి 1000 కోట్ల వరకు ఆస్తులైతే ఉంటాయట.

అది కూడా లాండ్స్, సైట్స్ మీదనే ఉండటం విశేషం… ఇక తనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా తక్కువగానే ఉంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో ఇంతకుముందు బండ్ల గణేష్ బాగా క్లోజ్ గా ఉండేవాడు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను తనే చూసుకునేవాడు.

అలా ఆయన క్లోజ్ గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక సినిమా రెమ్యునరేషన్ వచ్చిందట. ఆ డబ్బులు తీసుకెళ్లి హైదరాబాద్ సిటీ ఔట్ కట్స్ లో కొని ల్యాండ్స్ అయితే ఇన్వెస్ట్ చేశాడట. దాంతో ఇప్పుడు ఆ లాండ్స్ విలువ విపరీతంగా పెరగడంతో బండ్ల గణేష్ వల్ల పవన్ కళ్యాణ్ ఆస్తులు అమాంతం పదిరెట్లు పెరిగాయంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…

అనకాపల్లిలో కట్టలు తెంచుకున్న పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..రావణ్ నాలుక కోస్తామంటూ వార్నింగ్.. వీడియో వైరల్

Pawan Kalyan Fans Protest
Pawan Kalyan Fans Protest

Pawan Kalyan Fans Protest: సీతయ్య సినిమా గుర్తుందా..? అందులో విలన్ ని హీరో హరికృష్ణ పూటకి ఒక పోలీస్ స్టేషన్ మార్పించి , సిటీ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ తిప్పి పోలీసులతో చితకబాదిస్తాడు. సరిగ్గా అలాంటి సంఘటన ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్న రావణ్ విషయం లో లైవ్ గా చూపిస్తున్నారు. హిందూ దేవుళ్లపై , హైందవ మతం పై నోటికొచ్చినట్టు మాట్లాడడం, అవసరం లేకపోయినా పవన్ కళ్యాణ్ పై భూతులతో రెచ్చిపోవడం, చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవకు కూడా కుల వివక్ష తీసుకొచ్చి గొడవలు పెట్టాలని అనుకోవడం. ఇలా ఒక్కటా రెండా?, విద్వేషాలు రెచ్చగొట్టేలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీంతో జనసైనికుల ఫిర్యాదు మేరకు , పోలీసులు రావణ్ ని అరెస్ట్ చేసి పిఠాపురం కి తీసుకెళ్లారు.

అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత సర్పవరం కి తీసుకెళ్లారు, అక్కడ కూడా బెయిల్ వచ్చిన తర్వాత మచిలీపట్టణం కి తీసుకెళ్లారు. నిన్న రాత్రి అక్కడ కూడా బెయిల్ రావడం తో ఇప్పుడు అనకాపల్లి లోని నక్కపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. అయితే ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడిని రావణ్ ఎదురుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పోలీసులు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. రావణ్ ని ఎట్టి పరిస్థితిలో కఠినంగా శిక్షించాల్సిందే. లేదంటే మాకు వదిలేయాలి, మేము చూసుకుంటాం అంటూ రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారు. రావణ్ వెళ్లే పోలీస్ జీపుపై చెప్పులతో , గుడ్లతో దాడులు చేస్తున్నారు. ఇప్పుడు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. రావణ్ నాలుక కోస్తామని , అతన్ని వెంటనే మాకు విడిచిపెట్టాలని పోలీసుల మీదకు దూసుకొచ్చారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

రావణ్ కి సపోర్టుగా అతని అనుచరులు నేడు నక్కపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. జనసైనికులు వాళ్లకు కూడా చుక్కలు చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళ చేత ‘జై జనసేన’ నినాదాలు పలికించి పంపారు. అంతే కాకుండా జడ శ్రవణ్ అనుచరులను కూడా పోలీస్ స్టేషన్ బయట పరుగులు తీయించారు. వీళ్ళ ఆగ్రహావేశాలను చూస్తుంటే , రావణ్ అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉండడమే మంచిదని అనిపిస్తోంది. ఒకవేళ రావణ్ ని బయటకు వదిలితే సెక్యూరిటీ ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే హిందూ సంఘాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతని వదిలిపెట్టేలా లేరు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ ను బెదిరించిన ఆర్జీవీ... అందుకే వాళ్లిద్దరి మధ్య మాటలు లేవు...

Trivikram Srinivas
Trivikram Srinivas

Trivikram Srinivas: శివ సినిమాతో ఒక్కసారిగా పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… మొదటి సినిమా తోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తదుపరి సినిమాలతో ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్నాడు. ఒకానొక సమయంలో అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలందరు ఆసక్తి చూపించేవారు. ఇక అలాంటి వర్మ ఆ తర్వాత స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి రైటర్ పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పని చేస్తున్నప్పుడు రాంగోపాల్ వర్మ సినిమాకి డైలాగులు రాసే అవకాశమైతే త్రివిక్రమ్ కి వచ్చిందట. ఆ సమయంలోనే త్రివిక్రమ్ కలిసినప్పుడు ఆర్జీవి గురూజీకి కథను వినిపించి అందులో డైలాగులు ఎలా ఉండాలి అనేది కూడా తనే డిసైడ్ చేసి చెప్పేవాడట. దాంతో వర్మ చెప్పిన వైలెంట్ డైలాగులను చూసిన త్రివిక్రమ్ కొంతవరకు భయపడ్డారట.

ఇక ఏది ఏమైనా కూడా ఆ కథకి అలాంటి డైలాగులు అంత ఎఫెక్టివ్ గా ఉండవనే ఉద్దేశ్యంతోనే త్రివిక్రమ్ ఉన్నారట. కానీ వర్మ మాత్రం తనకు ఇష్టం వచ్చినట్టుగా డైలాగులను రాయించుకుంటూ ఉంటాడు కాబట్టి తనకు నచ్చిన కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చి అలాంటి డైలాగులు కావాలని చెప్పడంతో త్రివిక్రమ్ భయపడిపోయి ఆ మూవీ నుంచి తప్పుకున్నారట.

ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే ఆర్జీవితో వర్క్ చేసే అవకాశం వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్పించుకోవడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. నిజానికి త్రివిక్రమ్ తన కెరీర్ మొదట్లో నిన్నే ప్రేమిస్తా,నువ్వే కావాలి, స్వయంవరం, చిరునవ్వుతో లాంటి డీసెంట్ సినిమాలకి వర్క్ చేశాడు. ఇక వర్మ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

కొంచెం బోల్డ్ సీన్స్, అలాగే వైలెన్స్ ఎక్కువగా ఉన్న సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో వర్మ తో సినిమా చేయడం కంటే కామ్ గా ఉన్నదే బెటర్ అని త్రివిక్రమ్ అతని నుంచి తప్పించుకొని వచ్చారట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య మాటలైతే లేవని చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు…

నాగార్జున తినే డైట్ ఎవ్వరు తినలేరా..? అందుకే ఆయన అలా ఉన్నారా..? ఇంతకీ ఏం తింటారంటే..?

Nagarjuna
Nagarjuna

Nagarjuna Diet: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను తీయగలిగే హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికి నాగార్జునకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సీనియర్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్న నాగార్జున ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు. తను రూటు మార్చి విలన్ గా కూడా నటించే ప్రయత్నం చేశాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పూరి సినిమాలో నాగార్జున నెగెటివ్ క్యారెక్టర్ లో నటించాడు… ఇక నాగార్జున సినిమాలపరంగానే కాకుండా తన లుక్కు పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికి ఆయన చాలా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తుంటారట. కారణమేంటి అంటే ఆయన 70 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నప్పటికి యంగ్ హీరోగా కనిపిస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఆయన అలా కనిపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఒక డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడట.

పొద్దు పొద్దున్నే డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయలతో కూడిన ఒక మిక్సుడు జ్యూస్ ని ఒక పెద్ద గ్లాసులో తాగుతుంటారట. దానివల్ల అతని హెయిర్ బాగా గ్రోత్ అయిందని అలాగే తన మొహం మీద కూడా ముడతలు లేకుండా చాలా క్లీన్ గా ఉండడానికి కూడా అదొక కారణం అని చాలా మంది చెబుతున్నారు.

ఇక తను అన్ని కూరల్ని టేస్ట్ చేస్తారట. కానీ ఏది ఎక్కువ మొత్తంలో తినడు. జస్ట్ శాంపిల్ గా తిని టేస్ట్ చేసి వదిలేస్తాడు. నైట్ టైం లో 7:00కి ముందే తన డిన్నర్ ని పూర్తి చేసి ఒక 30 మినిట్స్ వాకింగ్ చేస్తారట. రోజు ఐదు లీటర్ల వరకు వాటరైతే తాగుతూ ఉంటారట… అలాగే రోజు పొద్దున గంటసేపు వర్కౌట్ట్లైతే చేస్తారట. మొత్తానికైతే నాగార్జున ఇప్పటికి వాటన్నింటిని పాటిస్తూ ఉండడం వల్లే చాలా యంగ్ గా కనిపిస్తున్నాడని చాలా మంచి చెబుతున్నారు.

ఆయన పాటించే డైట్ చాలా మంది పాటించాలని అనుకుంటున్నారు కానీ ఎవరి వల్ల కావడం లేదు. ఎందుకంటే ఒకరోజు రెండు రోజులైతే చేయొచ్చు. కానీ సంవత్సరాల తరబడి అలాంటి డైట్ ని ఎవరు మెయింటైన్ చేయలేరు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలామంది అసలు డైట్ పాటించరు. వాళ్లకి ఇష్టమైనవి తింటూ ఉంటారు. నాగార్జున మాత్రం ఏది ఎంత తినాలో అంతే తింటున్నాడు కాబట్టి ఆయన ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తున్నాడు…

వాహనం నడిపేటప్పుడు ఇది తప్పనిసరిగా పాటించండి

Vehicle Safety Tips
Vehicle Safety Tips

Vehicle Safety Tips: వాహనం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా.. దానికంటే వేగంగా మన మెదడు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ప్రధాన కారణం వాహనంలోని సాంకేతిక లోపాలు, డ్రైవర్‌ నిర్లక్ష్యం, అలసట, వాహనం నిర్వహణలో లోపాలు. కొన్ని చిన్న సంకేతాలను ముందుగానే గుర్తిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని రోడ్డు భద్రత నిపుణులు సూచిస్తున్నారు.

బ్రేక్ ఆయిల్ లీకేజీ లేదా బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతే..
వాహన భద్రతలో అత్యంత కీలకమైన భాగం బ్రేకింగ్ వ్యవస్థ. బ్రేక్ ఆయిల్ లీక్ అవుతున్నా, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినా వాహనం సరైన సమయంలో ఆగదు. బ్రేక్ నొక్కినప్పుడు అసాధారణ శబ్దం రావడం, పెడల్ బాగా లోపలికి వెళ్లడం లేదా బ్రేకింగ్ దూరం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మెకానిక్‌తో తనిఖీ చేయించాలి. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే అధిక వేగంలో ప్రమాదం తప్పదు.

వరుసగా రెండు, మూడు సార్లు ఆవలింతలు వస్తే..
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వరుసగా ఆవలింతలు రావడం శరీరం అలసిపోయిందని, మెదడు ఏకాగ్రత తగ్గుతోందని సూచించే సంకేతం. అలాంటి సమయంలో డ్రైవింగ్ కొనసాగిస్తే క్షణిక నిద్ర (మైక్రో స్లీప్) వచ్చే ప్రమాదం ఉంటుంది. కేవలం రెండు లేదా మూడు సెకన్ల పాటు కళ్లుమూసుకున్నా అధిక వేగంతో ప్రయాణిస్తున్న వాహనం వందల మీటర్లు ముందుకు వెళ్లిపోతుంది. కాబట్టి అలసట అనిపించిన వెంటనే సురక్షిత ప్రదేశంలో వాహనం ఆపి కొంత విశ్రాంతి తీసుకోవాలి.

టైర్ల పరిస్థితిని నిర్లక్ష్యం చేయొద్దు
చాలా మంది వాహనదారులు మెకానిక్ చెప్పేవరకు టైర్ల పరిస్థితిని పట్టించుకోరు. కానీ టైర్ల ట్రెడ్ అరిగిపోవడం, గాలి ఒత్తిడి తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం వల్ల వాహనం రోడ్డు పట్టును కోల్పోతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పాత టైర్లతో ప్రయాణిస్తే స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రతి ప్రయాణానికి ముందు టైర్ల గాలి ఒత్తిడి, ట్రెడ్ లోతు, ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.

వాహనం సామర్థ్యానికి మించి బరువు మోస్తే..
వాహనం కంటే అందులోని సామగ్రి లేదా లోడ్ ఎక్కువైతే బ్రేకింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. స్టీరింగ్ నియంత్రణ కూడా దెబ్బతింటుంది. మలుపులు తిరిగేటప్పుడు లేదా ఆకస్మికంగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు వాహనం అదుపు తప్పే అవకాశం ఉంటుంది. తయారీ సంస్థ సూచించిన లోడ్ పరిమితిని ఎప్పుడూ మించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

స్టీరింగ్ అకస్మాత్తుగా వణికితే..
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్‌లో అసాధారణంగా కంపనలు రావడం ప్రమాద సంకేతం. వీల్ అలైన్‌మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ సమస్యలు, సస్పెన్షన్ లోపాలు లేదా టైర్ల దెబ్బతినడం వల్ల ఇలా జరగొచ్చు. ఈ పరిస్థితిలో అధిక వేగంతో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. వెంటనే వేగం తగ్గించి, సమీపంలోని సర్వీస్ సెంటర్‌లో వాహనాన్ని తనిఖీ చేయించాలి.

ప్రమాదాలు ఒక్కసారిగా జరగవు. వాటికి ముందు వాహనం లేదా డ్రైవర్ కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంటారు. వాటిని సకాలంలో గుర్తించి చర్యలు తీసుకుంటే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. క్రమం తప్పకుండా వాహనాన్ని సర్వీస్ చేయించడం, అలసటతో డ్రైవింగ్ చేయకపోవడం, టైర్లు, బ్రేకులు, స్టీరింగ్ వంటి కీలక భాగాలను తరచూ తనిఖీ చేయడం ద్వారా మీ ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు.

ఈ చిన్న అలవాట్లతో పిల్లలు తెలివైన వారవుతారు.. అవేంటేంటే..

Kids Intelligence
Kids Intelligence

Kids Intelligence: పిల్లల్లో తెలివితేటలు, ఆలోచనా శక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం ఒక్కరోజులో పెరగవు. చిన్నప్పటి నుంచే వారికి మంచి అలవాట్లు నేర్పించడం, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కల్పించడం ద్వారా మెదడు చురుకుగా అభివృద్ధి చెందుతుంది. పిల్లల మానసిక వికాసానికి పుస్తకాలు, ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలు, ఇంటి పనుల్లో భాగస్వామ్యం వంటి అంశాలు ఎంతో ఉపయోగపడతాయని బాలల అభివృద్ధి నిపుణులు చెబుతున్నారు.

పుస్తకాలు చదవడం:
పిల్లలకు చిన్న వయసులోనే పుస్తకాలు చదివే అలవాటు చేయించడం ఎంతో అవసరం. కథలు, విజ్ఞాన సంబంధిత పుస్తకాలు చదవడం వల్ల కొత్త పదాలు నేర్చుకోవడంతో పాటు ఊహాశక్తి, భాషా నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. చదివిన విషయాల గురించి వారితో చర్చించడం వల్ల ఆలోచించే తీరు మరింత అభివృద్ధి చెందుతుంది.

బొమ్మలు గీయడం:
డ్రాయింగ్, పెయింటింగ్ వంటి కళాత్మక కార్యకలాపాలు పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయి. రంగులను గుర్తించడం, కొత్త ఆకృతులు రూపొందించడం ద్వారా మెదడులోని వివిధ భాగాలు చురుకుగా పనిచేస్తాయి. దీంతో ఏకాగ్రత, పరిశీలన శక్తి, ఊహాశక్తి పెరుగుతాయి.

పజిల్స్, బ్రెయిన్ గేమ్స్:
జిగ్సా పజిల్స్, సుడోకు, బ్లాక్స్ అమర్చే ఆటలు, మెమరీ గేమ్స్ వంటి కార్యకలాపాలు పిల్లలలో తార్కిక ఆలోచన, జ్ఞాపకశక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ తరహా ఆటలు పిల్లలకు సరదాతో పాటు మానసిక వ్యాయామాన్ని కూడా అందిస్తాయి.

ఇంటి పనులు అవసరమే:
పిల్లలతో చిన్న చిన్న ఇంటి పనులు చేయించడం కూడా వారి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుంది. బొమ్మలను సర్దడం, పుస్తకాలను అమర్చడం, మొక్కలకు నీళ్లు పోయడం, భోజన పాత్రలు టేబుల్‌పై పెట్టడం వంటి పనులు బాధ్యతను నేర్పుతాయి. అలాగే ప్రణాళికాబద్ధంగా పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి:
పిల్లలు ప్రశ్నలు అడిగితే విసుక్కోకుండా సమాధానాలు చెప్పాలి. “ఎందుకు?”, “ఎలా?” అనే ప్రశ్నలను ప్రోత్సహించడం ద్వారా వారిలో పరిశోధనా దృక్పథం పెరుగుతుంది. కొత్త భాషలు, సంగీతం, సైన్స్ ప్రయోగాలు, ప్రకృతి పరిశీలన వంటి కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తే వారి జ్ఞాన పరిధి విస్తరిస్తుంది.

ఆటలు కూడా మెదడుకు వ్యాయామం:
బయట ఆడే ఆటలు, జట్టు క్రీడలు, ఇండోర్ గేమ్స్ పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయి. ఆటల ద్వారా నాయకత్వ లక్షణాలు, టీమ్‌వర్క్, ఓర్పు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే గుణం కూడా అలవడుతుంది.

మారుతి సుజుకి కార్లకు చెక్.. టాప్ లోకి ఈ బలమైన కార్లు.. జూన్లో టాప్ అమ్మకాలు ఇవే...

Top 10 Car Sales June 2026
Top 10 Car Sales June 2026

Top 10 Car Sales In June 2026: భారత ఆటోమోబైల్ మార్కెట్లో జూన్ నెలలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్ తన కార్లతో మార్కెట్‌లో ఆధిపత్యం చాటింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో తొలి రెండు స్థానాలను టాటా పంచ్, టాటా నెక్సాన్ దక్కించుకోవడం విశేషం. మరోవైపు మారుతి సుజుకీకి చెందిన ఆరు మోడళ్లు టాప్-10లో చోటు దక్కించుకోగా, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ వెన్యూ కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. అమ్మకాలతో పాటు ఈ కార్ల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

టాటా ఆధిపత్యం.. మారుతి బలమైన పోటీ
జూన్ నెల అమ్మకాల గణాంకాలు చూస్తే టాటా మోటార్స్ తొలి రెండు స్థానాలను దక్కించుకుని తన మార్కెట్ బలాన్ని మరోసారి నిరూపించింది. అయితే టాప్-10లో ఏకంగా ఆరు మోడళ్లతో మారుతి సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. భద్రత, మైలేజీ, ఆధునిక ఫీచర్లు, సరసమైన ధరలు కలిగిన మోడళ్లవైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తాజా అమ్మకాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

1. టాటా పంచ్ (Tata Punch):
జూన్ నెలలో ఈ కారు 21,006 యూనిట్లు అమ్ముడైంది. దీంతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మైక్రో SUV విభాగంలో భద్రత, ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజీ కారణంగా ఈ కారు మంచి ఆదరణ పొందుతోంది.
దీని ప్రారంభ ధర సుమారు రూ.6.20 లక్షలు.

2. టాటా నెక్సాన్ (Tata Nexon):
18,335 యూనిట్ల అమ్మకాలతో టాటా నెక్సాన్ కారు రెండో స్థానాన్ని దక్కించుకుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తున్న ఈ కారు 5 స్టార్ భద్రతా రేటింగ్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.8 లక్షలుగా ఉంది.

3. మారుతి సుజుకీ డిజైర్ (Maruti Suzuki Dzire):
మారుతి సుజుకీ కంపెనీకి చెందిన డిజైర్ 17,899 యూనిట్ల విక్రయమై మూడో స్థానంలో నిలిచింది. కుటుంబ వినియోగానికి అనువైన సెడాన్‌గా డిజైర్‌కు మంచి డిమాండ్ ఉంది. దీనిని రూ.6.84 లక్షలతో కొనుగోలు చేయొచ్చు.

4. మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ (Maruti Suzuki WagonR):
మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ ఈ సారి16,952 యూనిట్లు అమ్ముడై నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈ కారుకు ఇప్పటికే డిమాండ్ ఉన్నప్పటికీ ఈసారి మాత్రం నాలుగో స్థానంలోకి వచ్చింది. విశాలమైన క్యాబిన్, మంచి మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఈ కారు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతోంది. ఈ కారు ధర రూ.5.79 లక్షలుగా ఉంది.

5. మారుతి సుజుకీ ఎర్టిగా (Maruti Suzuki Ertiga):
MPVగా కుటుంబాలకు ఇది అత్యంత అనుకూలమైన కారుగా గుర్తింపు పొందింది మారుతి సుజుకీ ఎర్టిగ. ఈ కారు జూన్ నెలలో 16,111 యూనిట్లు అమ్ముడై ఐదో స్థానంలో నిలిచింది. 7-సీటర్ విభాగంలో డిమాండ్ ఉన్న ఈ కారు ధర రూ. 8.96 లక్షలు.

6. మారుతి సుజుకీ స్విఫ్ట్ (Maruti Suzuki Swift):
మారుతి సుజుకీ స్విఫ్ట్ 15,215 యూనిట్ల విక్రయాలతో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. గతంలో ఈ కారు ఎప్పటికీ టాప్ 5 లోపే ఉండేది. కానీ ఇప్పుడు ఆరోస్థానానికి పడిపోయింది. అయినా స్పోర్టీ లుక్, మంచి పనితీరు, అధిక మైలేజీ కారణంగా యువతలో ఈ కారు ప్రత్యేక ఆదరణ పొందుతోంది. దీనిని రూ.6.49 లక్షలతో విక్రయిస్తున్నారు.

7. మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio):
SUV గా ఆదరణ పొందుతున్న ఈ కారు 14,097 యూనిట్లు అమ్ముడై ఏడో స్థానంలో నిలిచింది. స్కార్పియో-N, స్కార్పియో క్లాసిక్ మోడళ్లతో ఈ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా ఆదరణ పొందుతోంది. దీని ధర సుమారు రూ.13.99 లక్షలు.

8. మారుతి సుజుకీ ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx):
స్టైలిష్ క్రాస్‌ఓవర్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో ఆదరణ పొందుతున్న మారుతి సుజుకీ ఫ్రాంక్స్ 13,135 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మంచి మైలేజీతో ఈ కారు యువతను ఆకర్షిస్తోంది. దీనిని రూ.7.54 లక్షలతో విక్రయిస్తున్నారు.

వర్షం పడిందా.. తొలి 10 నిమిషాలు జాగ్రత్త.. ఎందుకంటే...

Rain Driving Safety
Rain Driving Safety

Rain Driving Safety: వర్షాకాలం ప్రారంభం కావడంతో రోడ్డు ప్రమాదాల ప్రమాదం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా తొలి వర్షం పడిన సమయంలో రోడ్లపై పేరుకుపోయిన దుమ్ము, ఆయిల్, మట్టి నీటితో కలిసిపోవడం వల్ల రోడ్డు ఉపరితలం జిగురుగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే వర్షాకాలంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ముఖ్యమైన భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

పోలీసుల సూచనల ప్రకారం, వర్షం ప్రారంభమైన తొలి 10 నిమిషాలు అత్యంత ప్రమాదకరమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రోడ్డు జారుడుగా ఉండటంతో వాహనాల నియంత్రణ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేగాన్ని గణనీయంగా తగ్గించి, ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటిస్తూ ప్రయాణించాలి. హఠాత్తుగా ఓవర్‌టేక్ చేయడం లేదా లేన్లు మార్చడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.

హైవేలపై ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షం లేదా తడి రోడ్లపై గంటకు 55 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకపోవడం సురక్షితమని చెబుతున్నారు. అధిక వేగంతో ప్రయాణిస్తే టైర్లు రోడ్డు పట్టును కోల్పోయే ప్రమాదం ఉండటంతో పాటు బ్రేకింగ్ దూరం కూడా పెరుగుతుంది.

ప్రయాణానికి ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా టైర్లలో గాలి సరైన ఒత్తిడిలో ఉందా, ట్రెడ్ సరిగా ఉందా అనే విషయాన్ని పరిశీలించాలి. అలాగే వైపర్లు సరిగా పనిచేస్తున్నాయా, హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, ఇండికేటర్లు సక్రమంగా వెలుగుతున్నాయా అనేది కూడా నిర్ధారించుకోవాలి. ఇవి వర్షంలో స్పష్టమైన దృశ్యమానతను కల్పించి ప్రమాదాలను తగ్గిస్తాయి.

వర్షంలో వాహనం నడిపేటప్పుడు ఒక్కసారిగా బ్రేకులు వేయడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సడన్ బ్రేక్ వేస్తే వాహనం స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ, మెల్లగా బ్రేక్‌ను ఉపయోగించాలి. అలాగే నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వేగంగా వెళ్లకుండా, లోతు అంచనా వేసిన తర్వాత మాత్రమే ముందుకు సాగాలి.

రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి. రైన్‌కోట్ కారణంగా చూపు లేదా వినికిడి తగ్గకుండా చూసుకోవాలి. నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ ధరించడం, పిల్లలను సురక్షితంగా కూర్చోబెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం తీవ్రంగా ఉంటే వీలైనంత వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వాహనదారుల అప్రమత్తతే రోడ్డు ప్రమాదాలను నివారించడంలో కీలకమని పోలీసులు చెబుతున్నారు. చిన్నచిన్న భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, వర్షాకాలంలో వేగం కంటే భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

iPhone 18 Series పై సర్ ఫ్రైజ్ లీక్..

IPhone 18 Series
IPhone 18 Series

iPhone 18 Series: Apple కంపెనీ ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో కొత్త ఫోన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది 18 సిరీస్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అయితే iPhone 18 Series కు సంబంధించి ఒక లీక్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సిరీస్‌లో టాప్ మోడల్ అయిన ‘ఐఫోన్ 18 ప్రో మాక్స్’ లో ఆపిల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అతిపెద్ద బ్యాటరీని అమర్చబోతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఇందులో ఎలాంటి బ్యాటరీని ఏర్పాటు చేస్తున్నారంటే?

సాధారణంగా ఆపిల్ సంస్థ తన ఐఫోన్లలో ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే తక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను వాడుతుంది. కానీ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. అయితే, ఈసారి భారీ అప్‌గ్రేడ్ ఇస్తూ ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో మొదటిసారిగా 5,000mAh మార్కును దాటి బ్యాటరీని ఇవ్వబోతున్నారట. ఫిజికల్ సిమ్ స్లాట్ కలిగిన మోడల్‌లో 5,235mAh బ్యాటరీని, అలాగే సిమ్ స్లాట్ లేకుండా కేవలం ఈ-సిమ్ మాత్రమే ఉండే యూఎస్ వెర్షన్‌లో ఏకంగా 5,425mAh భారీ బ్యాటరీని అందించనున్నారు.గత ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే ఇది చాలా పెద్దది. దీంతో ఐఫోన్ 18 ప్రో మాక్స్ బ్యాటరీ దాదాపు 6.6 నుంచి 8.5శాతం వరకు పెరిగే అవకాశం ఉంది

ఈ ఫోన్ లో పెద్ద బ్యాటరీ మాత్రమే కాకుండా సరికొత్త A20 ప్రో చిప్‌సెట్ ను కూడా అమర్చుతున్నారు. ఇది అత్యంత అధునాతనమైన 2nm (నానోమీటర్) ప్రాసెస్ పై తయారు చేయబోతున్నారు. ఇది పవర్‌ను చాలా తక్కువగా వినియోగించుకుంటూ, అత్యుత్తమ పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. దీనివల్ల ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘వెయిబో’ (Weibo) ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా, ఇటీవల భారతదేశంలోని టాటా ఎలక్ట్రానిక్స్ పై జరిగిన ఒక సైబర్ దాడి కారణంగా కొన్ని కాన్ఫిడెన్షియల్ సప్లై చైన్ డాక్యుమెంట్లు లీక్ అయ్యాయని, ఈ బ్యాటరీ వివరాలు కూడా అందులో నుండే వచ్చి ఉండవచ్చని సమాచారం. అయితే ఆపిల్ అధికారికంగా ప్రకటించే వరకు ఇవి అంచనాలే అని కొందరు అంటున్నారు.

సుజిత్ తో 'బ్లడీ రోమియో' క్యాన్సిల్.. మరో క్రేజీ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన నాని..

Bloody Romeo
Bloody Romeo

Bloody Romeo: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఎప్పుడు విడుదల అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అంత నత్త నడకన ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత జూన్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఇక రీసెంట్ గా ఆగస్టు 21 న విడుదల చేస్తామని అధికారికంగా చెప్పారు, కానీ ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ చిత్రం విడుదల అవ్వడం లేదు. లేటెస్ట్ గా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ తేదీన కూడా వస్తుందా లేదా అనేది ప్రస్నార్ధకంగా మారింది.

దీంతో డైరెక్టర్ సుజిత్ తో ఆయన చెయ్యాలని అనుకున్న ‘బ్లడీ రోమియో’ చిత్రం కూడా అట్టకెక్కింది . భవిష్యత్తులో ఈ చిత్రం ఉండుందో లేదో తెలియదు కానీ , ప్రస్తుతానికి సుజిత్ ద్రుష్టి మొత్తం ‘ఓజీ 2’ మూవీ పై మరలించారు. ఈ ఏడాది నవంబర్ నెల నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నాని ‘ది ప్యారడైజ్ ‘ తర్వాత చేసే సినిమాని కూడా రీసెంట్ గానే లాక్ చేసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ ఏడాది సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన ‘బ్లాస్ట్ జోన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుభాష్ రాజ్, నాని ని కలిసి ఒక స్టోరీ ని వివరించారట. ఆ లైన్ నాని కి అద్భుతంగా నచ్చడంతో , వెంటనే ఓకే చెప్పారని , ఈ ఏడాది లోనే ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది.

రీసెంట్ గానే బ్లాస్ట్ చిత్రం ఓటీటీ లో విడుదల అవ్వగా , ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో సుభాష్ రాజ్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాని సినిమా హిట్ అయితే , రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో ఈయనకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

త్రయంబకేశ్వర ఆలయంలో అద్భుతం.. పురాతన శివలింగం వెలుగులోకి..

Trimbakeshwar Temple
Trimbakeshwar Temple

Trimbakeshwar Temple: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఎంత ప్రాచీనమైందో చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఈ ఆలయంలో పురావస్తు శాఖ (ASI) ఇటీవల చేపట్టిన పునరుద్ధరణ పనుల్లో అరుదైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని చారిత్రక ‘అమృత కుండ్’ లో పూడికతీత పనులు నిర్వహిస్తుండగా అడుగుభాగంలో పురాతన శివలింగం బయటపడింది. ఈ శివలింగం కనిపించడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితె..

పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుతం ఆలయంలోని చారిత్రక నిర్మాణాలను సంరక్షించే కార్యక్రమంలో భాగంగా అమృత కుండ్‌ను శుభ్రపరుస్తున్నారు. ఈ క్రమంలో కుంట అడుగున దాగి ఉన్న శివలింగం వెలుగులోకి రావడం విశేషంగా మారింది. శివలింగం చాలా కాలంగా పూడికలో కూరుకుపోయి ఉండటంతో ఇప్పటివరకు ఎవరికీ కనిపించలేదని అధికారులు భావిస్తున్నారు.

ఈ విషయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ (ASI) తమ అధికారిక సోషల్ మీడియా వేదికలో వెల్లడించింది. అమృత కుండ్‌లో పూడికతీత సందర్భంగా పురాతన శివలింగం బయటపడిన ఫోటోలను పంచుకుంటూ, ఇది భారతదేశ ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. ఆలయాల పరిరక్షణతో పాటు వాటి చారిత్రక విలువలను వెలికితీయడం తమ బాధ్యత అని ASI తెలిపింది.

త్రయంబకేశ్వర ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత పవిత్రమైన క్షేత్రంగా గుర్తింపు పొందింది. గోదావరి నది ఉద్భవించే బ్రహ్మగిరి పర్వత ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఇక్కడి అమృత కుండ్‌కు కూడా ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.

శివలింగం వెలుగులోకి రావడాన్ని భక్తులు దైవ సంకేతంగా భావిస్తున్నారు. చాలా మంది దీనిని శుభ పరిణామంగా అభివర్ణిస్తూ, శివుని కృపకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా శివభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పురావస్తు నిపుణులు ఈ శివలింగం కాలం, నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యంపై అధ్యయనం ప్రారంభించనున్నారు. పరిశోధన అనంతరం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఆవిష్కరణతో త్రయంబకేశ్వర ఆలయ చారిత్రక విశిష్టతకు మరో కొత్త అధ్యాయం చేరిందని భావిస్తున్నారు.

త్రివిక్రమ్ లో ఏంటీ మార్పు.. ఇలాగైతే సక్సెస్ కష్టమే...

Trivikram Srinivas
Trivikram Srinivas

Trivikram Srinivas: మాటల మాంత్రికుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…. ఆయన చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉన్నాయి. ఇక రొటీన్ కథలకు తన స్టైల్ లో ట్రీట్మెంట్ ని ఇచ్చి డిఫరెంట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో త్రివిక్రమ్ ను మించిన వాళ్లు మరెవరు లేరనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిలబెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు… ఇంతకు ముందు ఆయన చేసిన గుంటూరు కారం సినిమాతో ఆయన భారీ డిజాస్టర్ ని ముట్టగట్టుకున్నాడు.

కారణం ఏంటంటే ఇంతకు ముందు ఆయన ఫ్యామిలీ నేపథ్యంలో ఉండే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడని ఒకసారి అత్త కథ ఒకసారి అమ్మానాన్న లను కలిపే కథ లను మించి ఆయన బయటికి రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దానికి తోడుగా ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో కుటుంబ కథ నేపథ్యంలోనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ జోనర్ లోనే ఆయన ఎందుకు సినిమాలు చేస్తున్నాడు.

ఈ జానర్ ను దాటి బయటికి రాలేదా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాలో తన జానర్ ని పూర్తిగా మార్చేశాడు. పురాణాల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తుండడం విశేషం…

ఇక ఈ జానర్ లో ఆయన పర్ఫెక్ట్ గా సక్సెస్ ని సాధించగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే డిఫరెంట్ జానర్ లో సినిమాలను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ ఎంతటి సక్సెస్ ను సాధిస్తాడు. ప్రేక్షకులందరిలో గొప్ప ఇమేజ్ ను పొందగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

అమెరికా @ 250.. 50 స్టార్స్ కథ.. స్వాతంత్య్ర ప్రయాణం ఓ చరిత్ర!

America 250 Years Of Independence
America 250 Years Of Independence

America 250 Years Of Independence: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం.. అగ్రరాజ్యం అమెరికా. ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా, సాంకేతికంగా, ఉపాధి పరంగా విద్య, వైద్య రంఆల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికాకు స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు. 1776 జూలై 4న బ్రిటన్‌ నుంచి∙విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఈ రాజ్యం నేడు అనేకులకు అవకాశాలు, ఆశలు కలిగించే స్థానంగా మారింది. ఆదర్శాలు, సంఘర్షణలు, ఏకత్వం వంటి అంశాలతో నిండిన ఒక పరిణామం.

స్వాతంత్య్ర ప్రారంభం..
1776లో జరిగిన స్వాతంత్య్ర ప్రకటన సమయంలో అమెరికాలో కేవలం 13 బ్రిటిష్‌ వలస ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన స్వేచ్ఛా కాంక్ష ఒక కొత్త రాజ్యానికి పునాది వేసింది. ఆ సమయంలోని నాయకులు ప్రజల హక్కులు, సమానత్వం వంటి విలువలను ముందుకు తెచ్చి, భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శ వ్యవస్థను నిర్మించాలని కోరుకున్నారు. ఇది కేవలం రాజకీయ విముక్తి కాకుండా, సామాజిక, రాజకీయ మార్పులకు దారితీసిన చారిత్రక మలుపు.

మూలాలను గుర్తుచేసే చిహ్నం.. జాతీయ జెండా..
అమెరికా జాతీయ జెండాలో ఎరుపు, తెలుపు రంగుల్లోని 13 క్షితిజ గీతలు ఆ ప్రారంభ 13 వలస ప్రాంతాలను సూచిస్తాయి. ఈ గీతలు దేశం యొక్క మూలాలను, ఏకత్వాన్ని శాశ్వతంగా గుర్తుచేస్తాయి. కాలం గడిచే కొద్దీ జెండా రూపం మారినప్పటికీ, ఈ గీతలు ఎప్పటికీ ఆ ప్రారంభ దశను స్మరణీయం చేస్తాయి. దేశం చరిత్రను ఒక చిన్న చిహ్నంలో సంగ్రహించి, ప్రజలలో గర్వం, ఐక్యతను పెంపొందిస్తుంది.

రాష్ట్రాల విస్తరణ..
13 రాష్ట్రాలతో ఏర్పడిన అమెరికా ఆ తర్వాతి దశలో వివిధ ఒప్పందాలు, సంఘర్షణల ద్వారా దేశం తన సరిహద్దులను విస్తరించుకుంది. 1959 నాటికి రాష్ట్రాల సంఖ్య 50కి చేరుకుంది. ఈ వృద్ధి ప్రక్రియ ద్వారా అమెరికా భౌగోళిక వైశాల్యం, వనరులు, జనాభా పరంగా బలపడింది. ఒక్కొక్క రాష్ట్రం జోడించబడినప్పుడు, దేశం మొత్తం సామర్థ్యం, ప్రభావం మరింత పెరిగింది. ఈ విస్తరణ దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా శక్తివంతమైన స్థాయికి తీసుకెళ్లింది.

వైవిధ్యం, ఐక్యతను చూపే నక్షత్రాలు..
అమెరికా జెండాలోని 50 నక్షత్రాలు ప్రస్తుత రాష్ట్రాల సంఖ్యను సూచిస్తాయి. ప్రతీ నక్షత్రం ఒక రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం చేస్తూ, దేశం యొక్క వైవిధ్యమైన ప్రాంతాలు, సంస్కృతుల ఏకత్వాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ చిహ్నం ద్వారా అమెరికా తన చరిత్రలో జరిగిన మార్పులను, వృద్ధిని స్పష్టంగా చూపుతుంది. అభివృద్ధి ప్రక్రియను ప్రతిబింబిస్తుంది.

250 సంవత్సరాల ఈ ప్రయాణం..
అమెరికాను ఒక చిన్న దేశం నుంచి ప్రపంచ అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ఈ విజయం వెనుక ఉన్న స్వేచ్ఛా ఆదర్శాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, నిరంతర అభివృద్ధి కృషి కీలక పాత్ర పోషించాయి. అనేకులకు ఈ దేశం అవకాశాల భూమిగా, కలలను నెరవేర్చే స్థానంగా మిగిలింది. ఈ విస్తరణలో ఎదురైన సవాళ్లు దేశాన్ని మరింత బలోపేతం చేశాయి. నేటి ఉత్సవం సందర్భంగా, గత చరిత్ర నుంచి నేర్చుకుని, సమానత్వం, న్యాయం వంటి విలువలను కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో కూడా అభివృద్ధి సాధించవచ్చు.

250 సంవత్సరాలు స్వతంత్ర అమెరికా గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకే చోటికి తీసుకువచ్చి, దేశం శక్తి, స్థిరత్వం, ప్రభావాన్ని స్పష్టం చేస్తాయి.