Home Blog Page 26

రావణ్ మీద రాజద్రోహం.. తర్వాతి వంతు ప్రకాష్ రాజ్ దేనా

Prakash Raj And Prashna Ravana
Prakash Raj And Prashna Ravana

Prashna Ravan : నోరు ఉందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగకూడదు. రాజ్యాంగం హక్కులు ఇచ్చింది కదా అని వాటిని వేరే వాటికోసం వాడకూడదు. ఎందుకంటే స్వేచ్ఛకు ఒక హద్దు ఉంటుంది. మాటకు ఒక పరిమితి ఉంటుంది. ఎదుటి వ్యక్తిని విమర్శించడానికి ఒక గీత ఉంటుంది. ఇవన్నీ దాటి.. కోట్ల మంది నమ్మకాలను తిట్టి.. గొప్పగా ఎదిగిపోతామంటే ఈ దేశంలో కుదరదు. ఎందుకంటే మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతింటే అప్పుడు.. పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే స్థితిని ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలి కూర జోసెఫ్ అనుభవిస్తున్నాడు.

ప్రశ్నించే రావణ్ మీద ఉపా చట్టం కింద రాజాద్రోహం సెక్షన్ నమోదయింది. వాస్తవానికి ఈ పరిణామాన్ని ఏపీలో ఎవరూ ఊహించలేదు. రావణ్ తన యూట్యూబ్లో చేసిన వీడియోలను చూస్తే అతడు ఏ స్థాయిలో ఉన్మాదంతో ఉన్నాడో అర్థమవుతుంది. రాముడిని తిట్టాడు. సీతను తిట్టాడు. రామాయణాన్ని అడ్డగోలుగా దూషించాడు. మహాభారతాన్ని మరో విధంగా వెల్లడించాడు. అందులో ఉన్న దేవతామూర్తులను కూడా తీవ్రంగా కించపరిచాడు. అక్కడితోనే ఆగలేదు మరింత దారుణంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.. భారతీయ జనతా పార్టీ.. రాధా మనోహర్.. వంటి వారిని రాయడానికి వీలు లేని భాషలో దూషించాడు. ఇక పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నైతే ఘోరంగా దూషించాడు.

రావణ్ మీద రాజ ద్రోహం కేసు నమోదు అయిన తర్వాత తర్వాతి టార్గెట్ ఎవరు.. తర్వాత ఆ కేసు నమోదు ఎవరిమీద అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు లభిస్తున్న ఒకే ఒక సమాధానం ప్రకాష్ రాజ్. ఎందుకంటే అతను సనాతన ధర్మానికి పూర్తిగా వ్యతిరేకి. ధర్మస్థల కుట్ర వెనుక కూడా అతని పేరు వినిపించింది. ఇప్పుడు యూట్యూబ్ రావణ్ వెనుక కూడా తనే ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. చివరికి ఈమధ్య కాక్రోచ్ జనతా పార్టీ కి తెర వెనుక కూడా ప్రకాష్ రాజ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటికీ అతడు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. యాంటీ నేషనల్ గా ఎక్స్పోజ్ అవుతున్నాడు. రావణ్ ను అరెస్ట్ చేసినట్టుగానే.. ప్రకాష్ రాజ్ ను కూడా అరెస్ట్ చేస్తారా.. ఏపీ ప్రభుత్వానికి ఆస్థాయి ఉందా.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఆల్ రేంజ్ లో స్వేచ్ఛ ఇవ్వగలుగుతాడా.. ఇప్పుడు ఇదే ప్రశ్న వ్యక్తం అవుతుంది.

జనసేన ఎమ్మెల్యే, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా రంగంలోకి దిగి రావణ్ మీద.. అప్పటి వెనుక ఉన్న ప్రకాష్ రాజ్ మీద ఆరోపణలు చేశారు. కందుల దుర్గేష్ సౌమ్యుడు. అటువంటి వ్యక్తి ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనక జనసేన పెద్ద పవన్ కళ్యాణ్ లేడు అనుకోవడానికి లేదు..” ప్రకాష్ రాజ్ రావణ్ వెనుక ఉన్నాడు. వీరి వెనక కుట్ర దారులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో భారీగా కులాల మధ్య.. మతాల మధ్య ఘర్షణలు రేపడానికి కుట్ర చేస్తున్నారు.. ఈ మంటల్లో వెచ్చదనాన్ని పొందడానికి తాడేపల్లి సిద్ధంగా ఉంది. అసలు ఆ ఆలోచనలను.. ఆ ప్రయత్నాలను మొత్తం బయటపెడతామని..” దుర్గేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఒక కీలకమైన ఆడియోను కూడా విలేకరుల ముందు ఉంచారు.. ఈ వ్యవహారంలో వైసిపికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాత్ర ఉందని దుర్గేష్ ఆరోపిస్తున్నారు..

జోసెఫ్ మీద వరుసగా కేసు నమోదు అవుతూనే ఉన్నాయి.. బెయిళ్లు వస్తూనే ఉన్నాయి. అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి.. ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలియదు. కానీ తనను అనవసరంగా గెలికితే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది.. వాస్తవానికి రావణ్ మీద మామూలు సెక్షన్లు పెడితే బెయిల్ వస్తోంది. అందువల్లే పోలీసులు ఏకంగా 152 సెక్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ సెక్షన్ గనుక నమోదు చేస్తే బెయిల్ రావడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఆ కేసు నిరూపణ గనక జరిగితే శిక్ష ఒక రేంజ్ లో ఉంటుంది.. గతంలో 124a సెక్షన్ అమల్లో ఉండేది. దాని ప్లేస్ లో కొత్త సెక్షన్ నమోదు కాకపోయినప్పటికీ.. విధించే శిక్ష అదే స్థాయిలో ఉంటుంది. దీని ప్రకారం వారెంట్ లేకపోయినప్పటికీ అరెస్టు చేయవచ్చు. ఒకవేళ నేరం నిరూపణ జరిగితే లైఫ్ టైం జైల్లో ఉండాలి. లేదా ఏడు సంవత్సరాల పాటు జైల్లో ఉండాలి. ఇప్పటికే రావణ్ మీద గన్నవరం పోలీసులు ఉపా 13, 19 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 152 సెక్షన్ గురించి తెలియాల్సి ఉంది.

ఈ వ్యవహారంలో ప్రధానంగా తెరపైకి వస్తున్న ప్రశ్న.. ప్రకాష్ రాజ్, జోసెఫ్ కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారని ఏపీ మంత్రి ఆరోపిస్తున్నారు. వీళ్ళ వెనక ఉన్న వ్యక్తులను.. శక్తులను బయటపెడతామని ఆయన అంటున్నారు. మరి జోసెఫ్ మీద ఉపా సెక్షన్లను ప్రయోగిస్తారా.. ప్రకాష్ రాజ్ కు కూడా ఇదే వర్తిస్తుందా.. పవన్ ఆ ధైర్యం చేస్తాడా.. చంద్రబాబు స్వేచ్ఛ ఇస్తాడా.. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ప్రశ్న రావణ్' పై రాజద్రోహం కేసు నమోదు.. ఈసారి తప్పించుకోవడం కష్టమే..

Prashna Ravana Bail
Prashna Ravana Bail

Prashna Ravan arrest కులాలు , మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం , హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లపై విషం కక్కడం, నిద్ర లేస్తే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నోటికి వాచినట్టు బూతులతో రెచ్చిపోవడం వంటివి చేస్తూ వచ్చిన ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ ని రీసెంట్ గానే ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇతన్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా కోర్టు నాలుగు కేసుల్లో బెయిల్ ఇచ్చింది. దీంతో నిన్న ఏలూరు చెక్ పోస్టు వద్ద మరోసారి ప్రశ్న రావణ్ ని మరో కేసు లో అదుపు తీసుకున్నారు. నేడు ఉదయం ఆయన్ని మరోసారి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి , రాజద్రోహం కేసుని నమోదు చేశారు.

UPA యాక్ట్ సెక్షన్ 13, సెక్షన్ 39 క్రింద రావణ్ పై FIR నమోదైంది. ఇది సాధారమైన కేసు కాదు , కోర్టు దీన్ని సీరియస్ గా తీసుకుంటే రావని 7 నుండి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. టెర్రరిస్టులకు సంఘీభావం తెలుపుతూ గతంలో రావణ్ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో చేసాడు. ఈ వీడియో లో ఆయన ముంబై తాజ్ హోటల్ లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను నిర్దాక్షణంగా పొట్టపెట్టుకున్న కసబ్ లాంటోళ్లను కూడా ‘పాపం కుర్రోళ్ళు’ అంటూ సంబోధిస్తూ కూడా ఆయన మాట్లాడాడు. ఈ సెక్షన్ క్రింద కూడా రేపు ఆయనకు బెయిల్ వస్తే మాత్రం , ఆంధ్ర ప్రదేశ్ లో లా & ఆర్డర్ సరిగ్గా లేదు అనే అనుకోవాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క రావణ్ తనకు నాలుగు సార్లు బెయిల్ ఇచ్చినప్పటికీ, అదే కేసు లో మరో స్టేషన్ నుండి వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని , ఇది కచ్చితంగా కక్ష్య సాధింపు చర్య అని , తనపై వేసిన కేసులను కొట్టివేయాలంటూ హై కోర్టులో పిటీషన్ వేసాడు.

దీనిపై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఈ అంశం పై ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. మరోపక్క రావణ్ నిన్న అరెస్ట్ అయ్యే ముందు మీడియా ముందుకొచ్చి , తనని అక్రమం గా అరెస్ట్ చేస్తున్నారని, నన్ను చంపాలని అనుకుంటే చంపేయండి అని, లేదంటే నేనే నిరాహారదీక్ష చేసి చనిపోతాను , ఇప్పటికే నేను అన్నం తిని , నీళ్లు తాగి 5 రోజులు అయ్యింది అంటూ పెద్ద డ్రామా చేసాడు. అయినప్పటికీ ఇతనిపై జనాల్లో ఇసుమంత కూడా సానుభూతి రావడం లేదు, ఒక్క వైసీపీ పార్టీ అభిమానుల్లో తప్ప. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వైసీపీ అధినాయకుడు , విపక్ష నేత , మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రావణ్ కి మద్దతు పలకడం గమనార్హం.

కేతన్ అగర్వాల్ ఇంట్లో మరో ఘోరం.. విధి ఇలా పగబట్టిందేంటి..

Ketan Agarwal case

Ketan Agarwal case : నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు చేసుకున్నాడు. దానికోసం భారీగా ఖర్చు పెట్టాడు. ఏకంగా 17 కోట్లు పెట్టి రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ ప్రాంతంలో ఒక అత్యంత విలాసవంతమైన హోటల్ బుక్ చేసుకున్నాడు. తన పెళ్లికి వచ్చే అతిధులను తీసుకురావడానికి హెలికాప్టర్లను బాడుగకు మాట్లాడుకున్నాడు.. అప్పట్లో ఎంగేజ్మెంట్ కూడా చాలా గట్టిగా చేసుకున్నాడు. బిజినెస్ సర్కిల్స్ మొత్తం తన గురించి మాట్లాడుకునేలాగా చేశాడు.

చిన్న వయసులోనే స్థిరాస్తి వ్యాపారం లోకి వచ్చి భారీగా సంపాదించాడు. తన జీవితంలోకి వచ్చే అమ్మాయి గురించి గొప్ప గొప్ప కలలు కన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత అతడి జీవితం మరో విధంగా మారింది. విధి పగబట్టింది. కాబోయే భార్య అతడిని చంపేసింది. పైగా ఆమెకు మరొక వ్యక్తితో సంబంధం ఉంది. తన ప్రేమికుడితో కలిసి తనకు కాబోయే భార్య తనను చంపేస్తుందని అతడు ఊహించలేదు. రెండుసార్లు తనను చంపే ప్రయత్నం విఫలమైందని అతడు చనిపోయిన తర్వాత తెలుసుకున్నాడు. అయినప్పటికీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

ఇదంతా కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్న.. చదువుతున్న కేతన్ అనే స్థిరాస్తి వ్యాపారికి సంబంధించిన దీనగాధ. అతడు పోయిన బాధ నుంచి ఇంకా కుటుంబం తేరుకోలేదు. ఆ కేసు ఇంకా విచారణ దశలో ఉంది. రకరకాల మలుపులు తిరుగుతోంది. అతడు చనిపోయిన విషాదం గుండెను మెలి తిప్పుతుండగానే.. కేతన్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది.

కేతన్ తాత దేవిచంద్ అగర్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. కేతన్ చనిపోయిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారిపోయింది. శనివారం రాత్రి అతనికి గుండెపోటు రావడంతో చనిపోయారు.. దీంతో కేతన్ కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయింది. కొడుకు మరణం.. తండ్రి మరణం.. ఇవన్నీ కూడా కేతన్ అగర్వాల్ తండ్రికి నరకం చూపిస్తున్నాయి. ఆయన విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

Hospital Scam : పేపర్ మీద హాస్పిటల్ కట్టారు.. కోట్లు బొక్కేశారు.. భారీ కుంభకోణం ఎలా వెలుగులోకి

Madhya Pradesh, Indore, Hospital Scam, Fake Hospital

Hospital Scam : శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూశారా. అందులో చిరంజీవి అప్పటికప్పుడు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాడు. కృత్రిమంగా రోగులను తీసుకొస్తాడు. తనను తాను ఒక డాక్టర్ గా పరిచయం చేసుకుంటాడు. తన తల్లిదండ్రులను తెలివిగా బురిడీ కొట్టిస్తుంటాడు. ఇదంతా చూసే ప్రేక్షకులకు వినోదంలాగా ఉంటుంది. కానీ ఇదే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది.. అచ్చం మధ్యప్రదేశ్ లో ఇలా జరిగింది. దీని వెనుక కోట్ల వ్యవహారం ఉంది. చివరికి వెలుగులోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోవడం ప్రభుత్వం వంతయింది.

మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే నగరం ఉంది. ఇక్కడ కజ్రానా అనే ప్రాంతంలో ఒక హాస్పటల్ ఉంది. ఏకంగా 87 మంది సిబ్బంది పని చేస్తున్నారు. రోగుల కోసం వంద పడకలు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రి బాగా నడుస్తోంది.. రోగులకు అద్భుతంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం కూడా భావించింది. ప్రతి ఏడాది ఈ హాస్పిటల్ కు బడ్జెట్లో కేటాయింపులు జరుపుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సంగతి తెలియడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. గుడ్లు తేలేసి వింతగా చూసింది.

ఇండోర్ లో కజ్రానా ప్రాంతంలో అసలు హాస్పిటల్ లేదు. గడచిన ఆరు సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ కేవలం పేపర్ మీద మాత్రమే ఉంది. ఇప్పటివరకు అక్కడ ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొత్తం వేరువేరు లోకేషన్ లలో ఉన్నారు. ఆ ప్రాంతాలలోనే వారు పని చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం వైద్య ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో అధికారులకు ఈ వ్యవహారం తెలిసింది. ప్రభుత్వానికి సంబంధించి జవాబుదారీతనం లేకపోవడం.. అసమర్ధత.. అవినీతి వల్ల ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయని అక్కడి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. గడచిన ఆరు సంవత్సరాలుగా వైద్య సిబ్బంది వేరువేరు లోకేషన్లో పనిచేస్తూ.. దర్జాగా జీతాలు తీసుకుంటూ.. కోట్లకు కోట్లు వెనకేసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని అక్కడి ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

కేవలం పేపర్ల మీద హాస్పిటల్ ఉంది. రోగులకు సేవలు కూడా అందలేదు. హాస్పిటల్ నిర్మించాల్సిన ప్రాంతం ముళ్ళ పొదలతో కనిపిస్తోంది. ఇంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఏమంటుంది. వాస్తవానికి ఇలాంటి వ్యవహారాలు ఆలస్యంగా వెలుగులోకి రావడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అక్కడి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది

మూడు దేశాలు.. ఆరు రోజులు.. మోదీ మళ్లీ విదేశీ పర్యటనకు ఎందుకెళుతున్నారు?

PM Modi Five Nation Tour
PM Modi Five Nation Tour

Modi Foreign Tour భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 6 నుంచి ఆరు రోజులపాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించబోతున్నారు. ఇటీవల సీషెల్స్‌లో మూడు రోజులు గడిపిన తర్వాత ఈ మూడు దేశాలో ఆరు రోజులు పర్యటించనున్నారు. ఈ పర్యటన భారత విదేశాంగ విధానంలో కొత్త దశను సూచిస్తోంది. హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్‌ వరకు భారత ప్రయోజనాలను రక్షించడం, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడం, చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడం ఈ పర్యటన వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు.

ఇండోనేషియా కీలకం..
హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ సముద్రాల మధ్య ఉన్న ఇండోనేషియా భౌగోళికంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉంది. మలక్కా, సుండా, లుంబోక్‌ జలసంధులు రెండు మహాసముద్రాలను కలిపే మార్గాలు. ముఖ్యంగా మలక్కా సంధి చైనా శక్తి సరఫరాకు ప్రధాన మార్గం కావడంతో ఇక్కడ భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఏర్పడింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టు ద్వారా భారత్‌ ఈ ప్రాంతంపై నిఘా పెంచుతోంది.ఇండోనేషియాతో రక్షణ సహకారం బలపడుతోంది. బ్రహ్మోస్‌ క్షిపణి సరఫరాపై చర్చలు జరుగుతున్నాయి. నికెల్‌ వనరులు, పామాయిల్‌ దిగుమతి వంటి ఆర్థిక అవసరాలు కూడా ఈ సంబంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఇండోనేషియాతో సంబంధాలు బలపడితే హిందూ–పసిఫిక్‌లో భారత స్థానం గణనీయంగా మెరుగుపడుతుంది.

ఆస్ట్రేలియాతో రక్షణ, వ్యాపారం..
ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ భారత–ఆస్ట్రేలియా వార్షిక సమావేశంలో పాల్గొంటారు. సీఈవోల సమావేశం, విద్యార్థుల సంబంధిత చర్చలు కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రిటికల్‌ మినరల్స్‌ సరఫరా, సముద్ర భద్రత, ఉమ్మడి రక్షణ చర్యలపై లోతైన చర్చలు జరుగుతాయి.ఆస్ట్రేలియా భారత్‌కు విశ్వసనీయ భాగస్వామి. క్వాడ్‌లో భాగంగా రెండు దేశాలు ఇప్పటికే సన్నిహితంగా పని చేస్తున్నాయి. చైనా ప్రభావం పెరుగుతున్న పసిఫిక్‌ ప్రాంతంలో ఆస్ట్రేలియాతో సంబంధాలు బలపడడం భారత్‌కు అవసరం. వాణిజ్యం, విద్య, రక్షణ రంగాల్లో సహకారం పెంచడం ఈ పర్యటనలో ప్రధాన లక్ష్యం.

న్యూజిలాండ్‌కు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని..
న్యూజిలాండ్‌కు ప్రధాని మోదీ సందర్శన ఇందిరా గాంధీ తర్వాత 40 ఏళ్లకు మొదటిసారి జరగనుంది. ఇక్కడ భారతీయ సమాజం పెద్ద సంఖ్యలో ఉండటం, క్రిటికల్‌ మినరల్స్‌ వనరులు, సముద్ర జలాల రక్షణ వంటి అంశాలు చర్చకు రానున్నాయి.న్యూజిలాండ్‌తో సంబంధాలు ఎక్కువగా వాణిజ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ఉన్నాయి. ఈ సందర్శన ద్వారా రెండు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను మరింతగా బలపరచడం సాధ్యమవుతుంది. పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ప్రభావాన్ని విస్తరించడంలో న్యూజిలాండ్‌ కూడా ముఖ్యమైన భాగస్వామి కావచ్చు.

విదేశాంగ విధానంలో కీలక పరిణామం..
లుక్‌ ఈస్ట్‌ నుంచి ఇండో–పసిఫిక్‌ వరకుగతంలో భారత్‌ చుట్టుపక్కల దేశాలపై ఎక్కువ దృష్టి పెట్టేది. పీవీ నరసింహారావు లుక్‌ ఈస్ట్‌ పాలసీ తీసుకురాగా, మోదీ ప్రభుత్వం ఆగ్నేయాసియా, పసిఫిక్‌ ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చింది. లుక్‌ ఈస్ట్, ఆ తర్వాత యాక్ట్‌ ఈస్ట్‌ విధానాలు ఇప్పుడు దక్షిణ ఇండో–పసిఫిక్‌ వరకు విస్తరించాయి. ఇటీవల సీషెల్స్‌ పర్యటన హిందూ మహాసముద్రంలో భారత ప్రయోజనాలను కాపాడడానికి సహాయపడింది. ఇప్పుడు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటన ద్వారా పసిఫిక్‌ వైపు కూడా భారత్‌ తన స్థానాన్ని బలపరుస్తోంది. చైనా ప్రభావం పెరుగుతున్న ప్రాంతంలో భారత్‌ స్వతంత్ర విధానం అనుసరిస్తూ, విశ్వసనీయ భాగస్వాములతో సంబంధాలు బలపరచుకుంటోంది.

ఈ మూడు దేశాల పర్యటన కేవలం దౌత్య సందర్శన కాదు. ఇది భారత్‌ హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్‌ వరకు తన వ్యూహాత్మక పరిధిని విస్తరించడానికి చేస్తున్న కృషి. రక్షణ సహకారం, వాణిజ్య విస్తరణ, సముద్ర భద్రత, క్రిటికల్‌ మినరల్స్‌ సరఫరా వంటి అంశాలు ఈ పర్యటనలో కీలకంగా ఉంటాయి. భారత్‌ ఇప్పుడు ప్రపంచ వ్యవహారాల్లో మరింత చురుకుగా పాల్గొంటూ, తన భద్రతా, ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

గ్రాండ్ గా ౩వ పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్.. వధువు ఎవరంటే.. ఫోటోలు వైరల్..

Aamir Khan third marriage

Aamir Khan third marriage : గత కొంతకాలంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 3 వ పెళ్లి పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో చర్చ జరుగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక మూవీ ఈవెంట్ కి అమీర్ ఖాన్ తన కాబోయే భార్య , అదే విధంగా తన ఇద్దరి మాజీ భార్యలతో కలిసి ఒకే కారులో వెళ్లిన వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. రీసెంట్ గానే ఆయన తన ప్రేయసి గౌరీ స్ప్రాట్ ని పెళ్ళబోతున్నట్టు అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు కూడా. అయితే నేడు బాంద్రా లోని తన సొంత నివాసం లో , మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్ పెళ్ళాడి, మ్యారేజ్ పేపర్స్ మీద సంతకాలు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఈ వివాహ వేడుకకు అమీర్ ఖాన్ , గౌరీ కుటుంబ సభ్యులతో పాటు , అతి కొద్దిమంది సన్నిహితులు కూడా హాజరయ్యారు. అయితే అమీర్ ఖాన్ కి సంబంధించిన సినీ స్నేహితులు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఆయనకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మంచి చిరకాల మిత్రుడు అనే సంగతి అందరికీ తెలిసిందే , ఆయన కూడా వివాహ వేడుకకు హాజరు కాకపోవడం గమనార్హం. ఈ పెళ్ళికి సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సంప్రదాయం ప్రకారం , వీళ్ళు కూడా రిసెప్షన్ కి ఏర్పాటు చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ రిసెప్షన్ ఏర్పాటు చేస్తే మాత్రం బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ 1986 వ సంవత్సరం , ఏప్రిల్ 18 న రీనా దత్త అనే హీరోయిన్ ని పెళ్లాడాడు.

వీళ్ళ దాంపత్య జీవితం 15 ఏళ్ళు సాఫీగానే సాగింది , ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ 2002 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005 వ సంవత్సరం లో కిరణ్ రావ్ ని పెళ్లాడిన అమీర్ ఖాన్ 2021 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ ని పెళ్లాడారు , ఈమెతో అయినా జీవితాంతం కలిసి ఉంటారో లేదో చూడాలి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతానికి ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఒప్పుకోలేదు. త్వరలోనే రీసెంట్ గానే ‘3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్ స్క్రిప్ట్ ని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్ ని కలిసి వివరించారు , దీనికి అమీర్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి కానీ , ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.

ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బ.. పాకిస్తాన్‌లో బయటపడుతున్న బొందల గడ్డలు!

Oparation sindhoor

Operation Sindoor : దాయాది దేశం పాకిస్తాన్‌లోని బావల్‌పూర్‌ ప్రాంతంలో ఒక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారి సమాధుల కోసం కేటాయించిన స్థలం. ఈ స్థలాన్ని బరేల్‌ గ్రౌండ్‌ అని పిలుస్తున్నారు. ఇక్కడ లష్కర్‌ ఎ తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులకు కూడా వేర్వేరు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశారు. ఇది ఈ సంస్థలు తమ మరణించిన సభ్యులను గౌరవంగా సమాధి చేసేందుకు వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు సూచిస్తోంది.

ఐదెఎకరాల స్థలం కేటాయింపు..
జైష్‌ ఎ మహ్మద్‌కు కేటాయించిన భూమి సుమారు 5 ఎకరాలు. ఒక ఎకరం సుమారు 4,800 గజాలకు సమానం కాబట్టి మొత్తం స్థలం 24,000 గజాలు అవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తిని సమాధి చేయడానికి 6 గజాలు సరిపోతాయని పరిగణిస్తే, ఈ భూమిలో సుమారు 4 వేల మంది వరకు సమాధి చేయవచ్చు. ఇంత పెద్ద ప్రాంతాన్ని కేటాయించడం సాధారణం కాదు. ఇది భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో మరణాలను ఊహించి లేదా ఇప్పటికే జరిగిన పెద్ద నష్టాలను సూచిస్తోంది.

ఆపరేషన్‌ సిందూర్‌ దాడులు…
ఈ సమాధి స్థలాలు ఆపరేషన్‌ సిందూర్‌ అనే సైనిక చర్యతో నేరుగా ముడిపడి ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం లష్కర్‌ ఎ తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్, జైష్‌ ఎ మహ్మద్‌తోపాటు మరో రెండు ఉగ్రవాద సంస్థలకు చెందిన మొత్తం 11 స్థావరాలపై దాడి చేసింది. బ్రహ్మోస్‌ క్షిపణులు ఉపయోగించి ఈ దాడులు నిర్వహించారు. నివేదికల ప్రకారం వందల మంది ఉగ్రవాదులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఉమర్‌ అనే ఒక్క వ్యక్తి మాత్రమే బతికి ఉన్నట్లు సమాచారం.

దాడి ప్రభావం తీవ్రంగా..
ఈ వైరల్‌ ఫొటోలు, స్థల కేటాయింపులను పరిశీలిస్తే ఆపరేషన్‌ సిందూర్‌ ఉగ్రవాద సంస్థలపై ఎంత బలమైన దెబ్బ తగిలించిందో అర్థమవుతుంది. ఒక్క జైష్‌ ఎ మహ్మద్‌కే 5 ఎకరాలు కేటాయించడం, మిగతా సంస్థలకు ప్రత్యేక స్థలాలు ఇవ్వడం. ఇవి అన్నీ ఒకేసారి జరిగిన పెద్ద మరణాలను సూచిస్తున్నాయి. 4 వేల మంది వరకు సమాధి చేయగల స్థలం కేటాయించడం అంటే ఆ సంస్థలు తమ సభ్యులను కోల్పోయిన స్థాయి చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. బ్రహ్మోస్‌ వంటి అధునాతన క్షిపణులతో ఏకకాలంలో బహుళ స్థావరాలపై దాడి చేయడం భారత సైన్యం యొక్క ఖచ్చితత్వం, సామర్థ్యం, ఉగ్రవాద వ్యతిరేక నిబద్ధతను చూపిస్తోంది. ఒక్క ఉమర్‌ మాత్రమే బతికి ఉండటం మిగతా వారందరూ ఆ దాడిలో చనిపోయినట్లు స్పష్టం చేస్తోంది. ఇది పాకిస్తాన్‌ భూభాగం నుంచి నడిచే ఉగ్రవాద కార్యకలాపాలకు తీవ్రమైన ఎదురుదెబ్బగా మారింది.

అవి ఆపరేషన్‌ సిందూర్‌ విజయం, ఉగ్రవాద సంస్థలకు కలిగిన భారీ నష్టానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇలాంటి చర్యలు సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్‌ తీసుకుంటున్న చర్యల ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపుతాయి.

బోయపాటి శ్రీను కి రవితేజ కి మధ్య జరిగిన గొడవేంటి..? అందుకే భద్ర తర్వాత వీళ్ళ కాంబోలో మరో మూవీ రాలేదా..?

Boyapati Ravi Teja

Boyapati Ravi Teja : మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన రవితేజతో చేసిన భద్ర సినిమా ఆల్ టైం హిట్ గా నిలువడమే కాకుండా ఇప్పటికి బోయపాటి సినిమాలన్నింటిలో భద్ర సినిమాకి ఉండే గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…ఈ సినిమా ఇటు బోయపాటికి, అటు రవితేజకు ఇద్దరికి మంచి గుర్తింపు ను తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎందుకు రాలేదు అనే డౌట్ అందరిలో మెదులుతుంది. నిజానికి బోయపాటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగాడు. రవితేజను మాత్రం పట్టించుకోలేదు.

ఇక ఇదిలా ఉంటే రవితేజ సైతం బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే భద్ర సినిమా చేసే సమయంలో వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు అయితే వచ్చాయట. యాక్టింగ్ విషయంలో రవితేజ ఒక విధంగా యాక్టింగ్ చేస్తే బోయపాటి మాత్రం సపరేట్ గా ఇదే కావాలి అని పట్టు పట్టుకొని కూర్చున్నారట.

కొన్ని సందర్భాల్లో రవితేజ కాంప్రమైజ్ అయి బోయపాటి కోసం తను కావాలి అన్నట్టుగా యాక్టింగ్ చేయాల్సి వచ్చిందట. రవితేజ అతని విషయంలో కొంతవరకు అప్సెట్ అయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ విషయం కారణంగానే వీళ్ళిద్దరి మధ్య కాంబోలో మరో సినిమా అయితే రాలేదని వాళ్ళిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపు ఉన్నప్పటికి దానిని స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని కూడా చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా బోయపాటి శ్రీను – రవితేజ కాంబినేషన్లో భద్ర లాంటి ఒమరో మంచి సినిమా వస్తే చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. మరి వాళ్ల అభిమానుల కోరిక మేరకు మరోసారి వీళ్ళ కంబోనీ రిపీట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

మహేష్ బాబు చేసిన ఈ రెండు తప్పులు ఆయన్ని నెంబర్ వన్ కాకుండా ఆపేశాయా...

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ఒక్కడు సినిమాతో మొదటి మాస్ హిట్ ను సంపాదించుకున్న ఆయన పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడ. ఇకు అదే సమయంలో ఆయన యంగ్ హీరోలందరిలో నెంబర్ వన్ హీరోగా మారిపోతాడు అంటూ చాలా రకాల వార్తలైతే వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ మిగతా హీరోలు సైతం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలు చేసుకుంటూ వచ్చారు. దానివల్ల ఆయన కొంతవరకు డౌన్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది… నిజానికి మహేష్ బాబు నెంబర్ వన్ హీరో అయ్యేవాడు. కానీ ఆయన చేసిన రెండు తప్పుల వల్లే ఆయన ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా నిలబడలేక పోతున్నాడు అని చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ రెండు కారణాలు ఏంటి అంటే ఆయన స్టోరీ సెలక్షన్స్ లో అంత పెద్దగా ఎఫెక్టివ్ గా పాల్గొనలేదు.

ఎప్పుడూ ఒకే తరహా సినిమాలను చేస్తూ సేఫ్ జోన్ లో ఉండడానికి ప్రయత్నం చేశాడు తప్ప డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. సుకుమార్ దర్శకత్వంలో ‘వన్ నేనొక్కడినే’ సినిమా చేసినప్పటికి అది ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన మరోసారి ఎక్స్పరిమెంట్ జోలికి అయితే వెళ్లలేదు…

ఇక అలాగే ఆయన ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు తప్ప తన తోటి హీరోలందరు పాన్ బాట పడుతుంటే ఆయన మాత్రం పాన్ ఇండియా సినిమాలను చేసే అవకాశం లేకుండా కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమయ్యాడు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ పాన్ ఇండియా సినిమా చేసినట్లయితే ఆయన ఇప్పటివరకు నెంబర్ వన్ హీరోగానే కొనసాగుతూ ఉండేవాడు.

ఈ రెండు కారణాలవల్లే ఆయన ఇప్పటివరకు నెంబర్ వన్ హీరోగా మారలేకపోయాడు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫ్యూచర్లో అయినా ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రి లో నెంబర్ వన్ హీరోగా మారుతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

అనిల్ రావిపూడి - సప్తగిరి రూమ్మేట్స్... అయినా అనిల్ అతనికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే...

Anil Ravipudi And Saptagiri
Anil Ravipudi And Saptagiri

Anil Ravipudi And Saptagiri: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి… ఆయన చేసిన సినిమాలన్ని ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి చేస్తున్న సినిమాలు అతనికి భారీ లాభాలను తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. ఇక వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. అనిల్ రావిపూడి కమెడియన్ సప్తగిరి ఇద్దరు కూడా కెరియర్ స్టార్టింగ్ లో రూమ్మేట్స్ అనే విషయం పలు సందర్భాల్లో అనిల్ రావిపూడి స్వయంగా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

మరి అనిల్ రావిపూడి సినిమాలో సప్తగిరి కి ఎందుకని ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇవ్వడం లేదనే డౌట్ ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. నిజానికి వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిన కూడా ఇద్దరిలో ఏదో ఒక చిన్న మనస్పర్థలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. అందువల్లే అనిల్ రావిపూడి అతని కోసం ఒక సపరేట్ క్యారెక్టర్ రాయలేకపోతున్నాడు.

సప్తగిరి సైతం అతని సినిమాల్లో పేరుకు నేను నటిస్తాను అని చెబుతున్నప్పటికి అనిల్ సినిమాలో చేయడం అతనికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంది. అందువల్లే వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయడం లేదు లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ లాంటి ఫ్రెండ్స్ ఎంత బాగా కలిసిపోయి ఉంటారు.

ఇప్పటికీ త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో సునీల్ కి మంచి క్యారెక్టర్ ని ఇస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో అతని కెరియర్ ను నిలబెట్టింది కూడా త్రివిక్రమే కావడం విశేషం. ఇక ప్రస్తుతం సునీల్ డౌన్ లో ఉన్నప్పటికి తన సినిమాలలో మంచి క్యారెక్టర్లు ఇస్తు ఎంకరేజ్ చేస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి. కానీ అనిల్ రావిపూడి – సప్తగిరి లా ఉండకూడదు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

చైనా నే కాదు..చైనా ఉప్పూ ప్రమాదమే

China Salt
China Salt

China Salt: ఆ ఉత్పత్తులకు గ్యారెంటీ ఉండదు. వాటి పనితీరుకు వారంటీ ఉండదు.. చైనా తయారు చేసే ప్రొడక్ట్స్ మీద సోషల్ మీడియాలో కనిపించే జోక్ ఇది. నిజంగానే చైనా ఉత్పత్తిలో చూపించే దూకుడు తనాన్ని నాణ్యతలో చూపించదు. పనితీరులో ప్రదర్శించదు. దానికి కేవలం మార్కెట్ మొత్తాన్ని హస్తగతం చేసుకోవడం.. అత్యంత తక్కువ ధరలో ఉత్పత్తులను అందించడం.. అందువల్లే చైనా ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో అందిస్తుంది కాబట్టి అన్ని దేశాలు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటాయి.

చైనాలో తయారయ్యే ఉత్పత్తులు మాత్రమే కాదు.. చివరికి ఆహారానికి సంబంధించిన పదార్థాలు కూడా అత్యంత డేంజర్ గా ఉంటాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించి వాడే సాల్ట్ దీనిని అజీనోమోటో అని పిలుస్తుంటారు. దీనిని ఫాస్ట్ ఫుడ్లలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇది రోజుకు అయిదు గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే శరీరానికి కీడు చేస్తుంది. చైనా ఉప్పులో గ్లూటామిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనిని వాడితే నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. ఒబెసిటీ.. మైగ్రేన్.. హై బీపీ వంటి రుగ్మతలకు ఇది దారితీస్తుంది. సాధ్యమైనంత వరకు గర్భిణీలు దీనిని వాడకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

చైనాలో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. గతంలో ఇటువంటి ఆహారం మనదేశంలో అంతగా ఉండేది కాదు. కానీ కొన్ని సంవత్సరాలుగా చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనదేశంలో కూడా విరివిగా ఏర్పాటయ్యాయి. చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా ఫ్రైడ్ రైస్.. నూడుల్స్ తయారు చేస్తూ ఉంటారు. వీటిల్లో రుచి కోసం చైనా సాల్ట్ వాడుతూ ఉంటారు. ఇది తాత్కాలికంగా రుచి కలిగించినప్పటికీ.. దీర్ఘకాలంలో శరీరం మీద అనేక రకాలుగా దుష్పరిణామాలను చూపిస్తూ ఉంటుంది. మెదడు.. హృదయం.. జీర్ణాశాయానికి సంబంధించిన అనేక వ్యాధులను ఇది కలిగిస్తూ ఉంటుంది. అందువల్లే చైనా సాల్ట్ ను చాలావరకు దేశాలు నిషేధించాయి. మనదేశంలో మాత్రం ఇది యధావిధిగా అమ్ముడుపోతోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దీనిని విపరీతంగా వాడుతున్నారు. దీని వాడకాన్ని నిరోధిస్తేనే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని వైద్యులు చెబుతున్నారు.

చైనా సాల్ట్ లో కృత్రిమ పదార్థాలను అధికంగా వాడుతారు. దీనివల్ల అది కొంచెం నోట్లో వేసుకోగానే ఒక రకమైన రుచి కలుగుతూ ఉంటుంది. పైగా చైనా సాల్ట్ లో రకరకాల రసాయనాలు ఉంటాయి. అవి చూసేందుకు స్పటికాల మాదిరిగా ఉంటాయి. దీనివల్ల శరీరం మీద ముఖ్యంగా అంతర్గత అవయవాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. పరిమితికి మించి వీటిని తీసుకుంటే శరీరం అనేక రకాల రుగ్మతలకు గురవుతుంది.

సర్పంచ్ సాబ్ కాదు.. టీమిండియా పాలిట దరిద్రం.. సూర్యకు కెప్టెన్సీ అప్పగించాల్సిందేనా..

Shreyas Iyer
Shreyas Iyer

Shreyas Iyer: ఐపీఎల్ సాగుతున్నప్పుడు.. ముఖ్యంగా పంజాబ్ జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ గురించి విపరీతమైన చర్చ నడిచేది. సర్పంచ్ సాబ్ కు జట్టులో అవకాశాలు కల్పించాలని.. సారధ్య బాధ్యతలు అప్పగించాలని ప్రచారం జరిగింది. దీనికి తోడు కొన్ని మీడియా సంస్థలు అయ్యర్ ను జాకీలు పెట్టి లేపాయి. అదే సమయంలో సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన కూడా సరిగా లేకపోవడంతో మేనేజ్మెంట్ ఆలోచనలో పడింది. అయ్యర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది.

అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టి20 విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఇప్పటికి టీమిండియా అతడి నాయకత్వంలో మూడు మ్యాచ్లు ఆడింది. ఈ మూడిట్లో కూడా ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. ఒక సిరీస్ అది కూడా ఐర్లాండ్ వంటి అనామక జట్టు చేతిలో టీమ్ ఇండియా కోల్పోయింది. ఇంతకంటే దారుణం మరొకటి ఏముంటుంది. ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఏముంటుంది. టీమిండియా స్థాయికి ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం సగటు అభిమానికి ఏమాత్రం జీర్ణం కావడం లేదు.

అయ్యర్ అట్టర్ ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో.. సూర్యకుమార్ యాదవ్ గురించి చర్చ మొదలైంది. సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన గొప్పగా లేకపోయినప్పటికీ జట్టును మాత్రం అతడు అద్భుతంగా నడిపించేవాడని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. 2024 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ పగ్గాలు అందుకున్నాడు. అతడి నాయకత్వంలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. అంతటి దక్షిణాఫ్రికా గడ్డమీద.. ఆస్ట్రేలియా గడ్డమీద టీమిండియా సిరీస్ విజయాలు సొంతం చేసుకుంది. చివరికి 2026 లో జరిగిన టి20 వరల్డ్ కప్ కూడా టీమ్ ఇండియా సాధించింది. అయితే మేనేజ్మెంట్ అతని వ్యక్తిగత ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని కెప్టెన్సీ నుంచి పక్కకు పెట్టింది.

సూర్య నాయకత్వంలో టీమిండియా ఎన్నడు కూడా ఇటువంటి దారుణ ప్రదర్శన చేయలేదు. విదేశీ గడ్డల మీద కూడా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. సూర్యకుమార్ నాయకత్వంలో టీమిండియా 52 మ్యాచ్లు ఆడితే.. కేవలం 8 మ్యాచులలో మాత్రమే ఓడిపోయింది. రెండు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడితే.. మూడు ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. అయ్యర్ నాయకత్వం పట్ల అభిమానులు ఏమాత్రం సంతృప్తి కాలేదు. ఇటువంటి శని గాడిని టీమిండియా మీద ఎందుకు రుద్దుతున్నారని.. గౌతమ్ గంభీర్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయ్యర్ సర్పంచ్ సాబ్ కాదని.. సూర్య కుమార్ యాదవ్ ను తిరిగి జట్టులోకి తీసుకొని.. కెప్టెన్సీ అప్పగించాలని అభిమానులు కోరుతున్నారు.

వారం రోజులపాటు విదేశాల్లో లోకేష్!

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన తన చతురతను ప్రదర్శించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే పారిశ్రామిక సదస్సులో ఏపీ ప్రాధాన్యత వివరిస్తూ.. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరసలో నిలిచారు నారా లోకేష్. తాజాగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియా ప్రయాణమయ్యారు. పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు ఆయన ఈరోజు అక్కడకు చేరుకోనున్నారు. ఈరోజు నుంచి 11వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. కొరియా రాజధాని సియోల్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు, ఆటోమొబైల్, సెమీ కండక్టర్ రంగాల ప్రతినిధులతో లోకేష్ వరుసగా భేటీ కానున్నారు. ఇటీవల ఢిల్లీలో దక్షిణ కొరియా రాయబారి లీ సీయోంగ్-హోతో జరిగిన ప్రాథమిక చర్చల కొనసాగింపుగానే లోకేష్ పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది.

* బిజీ షెడ్యూల్..
వారం రోజులపాటు దక్షిణ కొరియాలో బిజీగా గడపనున్నారు లోకేష్. ఈరోజు ముందుగా సీయోల్ చేరుకుంటారు. అక్కడ నివసిస్తున్న తెలుగు వారితో ఆత్మీయ సమావేశం కానున్నారు. రేపు కొరియాకు చెందిన టాప్ టెక్ స్టార్టాప్స్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరిస్తారు. అదేరోజు అక్కడి భారీ పరిశ్రమల సంఘం ప్రతినిధులతో సమావేశం అయ్యి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారినే ఆహ్వానిస్తారు.

* దిగ్గజ పారిశ్రామికవేత్తలతో..
లోకేష్ పర్యటనలో 7, 8 తేదీలు అత్యంత కీలకం. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జి ప్రధాన కార్యాలయం ఎల్జి టవర్స్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎల్జి కెం గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు లోకేష్. ఏపీలో ఎల్జి అనుబంధ సంస్థల ఏర్పాటు విషయమై చర్చిస్తారు. జూలై 8, 9 తేదీల్లో కొరియన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇంటర్నేషనల్ ట్రీట్, ఇన్వెస్ట్మెంట్స్ విభాగాల డిప్యూటీ మంత్రులతో ద్వైపాక్షిక పారిశ్రామిక సంబంధాలపై లోకేష్ భేటీ అవుతారు. పర్యటన ముగింపు నాడు అంటే జూలై 10 కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో కూడా ఉంటుంది. అయితే లోకేష్ పర్యటన ప్రధాన ఉద్దేశం విశాఖ సిఐఐ సదస్సు. దానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూనే కొరియన్ ప్రతినిధులతో కీలక చర్చలు జరుపుతారు లోకేష్.

ప్రకాష్ రాజ్.. ప్రశ్న రావణ్.. ఈ కనెక్షన్ ఏంటి?

Prakash Raj And Prashna Ravana
Prakash Raj And Prashna Ravana

Prakash Raj And Prashna Ravana: ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్టు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ పై ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం మాటున, మతం మాటున ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఒక విధంగా దీని వెనుక కుల కుట్ర ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఏపీలో కుల చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే రావణ్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలతో లైవ్ పెడతానని జోసెఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే జోసెఫ్ రావణ్ వెనుక ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రావణ్ అరెస్టు వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

* ఉద్దేశపూర్వక కుట్ర..
జోసెఫ్ రావణ్ హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం దగ్గర నుంచి.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై బురద చల్లడం వరకు.. అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ రావణ్ సవాల్ వెనుక ఉన్నది ప్రకాష్ రాజ్ అని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు ప్రచారం జరుగుతోంది. రావణును అరెస్టు చూపించలేదు. పోలీస్ స్టేషన్లకు తిప్పడం వెనుక లోతైన దర్యాప్తు అంశం ఉందని తెలుస్తోంది. అసలు కుట్ర దారులను బయటకు లాగడమే దీని ఉద్దేశ్యంగా భావిస్తున్నట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తులో జోసెఫ్ రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన ఓ రహస్య ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా కూటమిపాలన కొనసాగుతుండగా.. కుల చిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయడానికి ప్రకాష్ రాజ్ కేంద్రంగా సోషల్ మీడియా వ్యూహాలు సిద్ధమయ్యాయని ఆధారాలు లభిస్తున్నాయి.

* అంతా స్క్రిప్ట్ ప్రకారమే..
ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పైనే ప్రకాష్ రాజ్ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి జోసఫ్ రావణ్ ను పావుగా వాడుకోవాలని భావించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేయాలి? అరెస్టు చేస్తే ఎలా స్పందించాలి? అనే విషయాలపై ప్రకాష్ రాజ్ టీం జోసెఫ్ రావణ్ కు వెనుక ఉండి స్క్రిప్ట్ అందించిందని లీకులు పొలిటికల్ వర్గాలను షేక్ చేస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదం ఇవ్వడాన్ని ప్రకాష్రాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దానిని వ్యతిరేకిస్తూ మనసులో పగను పెంచుకున్నారు ప్రకాష్ రాజ్. అందుకే జోసెఫ్ రావణ్ లాంటి వారితో పావులు కలిపినట్లు అర్థం అవుతుంది. ఒకవైపు ఆడియో కాల్స్ లీక్ కావడం, డిజిటల్ సాక్షాలు దొరకడంతో ప్రకాష్ రాజ్ ఈ వివాదంలో దాదాపు దొరికిపోయినట్లేనని తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ముద్ర ఇటీవల బయటపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పెను ప్రభావం చూపాలన్న ప్రయత్నంలో ప్రత్యర్థులతో చేయి కలిపి ప్రకాష్ రాజ్ అడ్డంగా బుక్ అయినట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే ఎందుకు స్పెషల్..

Hyderabadi Biryani
Hyderabadi Biryani

Hyderabad Biryani : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు.. ఎంతో మందికి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్. స్నేహితులు కలిసినా, కుటుంబంతో వేడుక జరిగినా, ఆదివారం వచ్చిందంటే చాలామంది మొదట గుర్తు చేసుకునేది బిర్యానీనే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారంను వరల్డ్ బిర్యానీ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా బిర్యానీ చరిత్ర, ప్రత్యేకత, రకాల గురించి తెలుసుకుందాం.

బిర్యానీ మూలాలు పర్షియన్ సంస్కృతిలో ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు. పర్షియన్ భాషలో ‘బిరియాన్’ అంటే వేయించిన లేదా కాల్చిన అని అర్థం. మొఘల్ పాలకుల కాలంలో ఈ వంటకం భారతదేశానికి చేరింది. రాజ కుటుంబాల వంటగదుల్లో ప్రత్యేకంగా తయారయ్యే ఈ వంటకం క్రమంగా దేశవ్యాప్తంగా ప్రజల్లోకి చేరింది. కాలక్రమేణా ప్రతి ప్రాంతం తమ రుచులకు తగ్గట్టుగా కొత్త కొత్త బిర్యానీలను రూపొందించుకుంది.

భారత్‌లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ. నిజాం పాలనలో అభివృద్ధి చెందిన ఈ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బాస్మతి బియ్యం, మసాలాలు, కుంకుమపువ్వు, నెయ్యి, చికెన్ లేదా మటన్‌తో ‘దమ్’ పద్ధతిలో వండటం దీని ప్రత్యేకత. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా రుచి చూసే వంటకాల్లో ఇది ఒకటి.

భారత్‌లో ఒక్క హైదరాబాద్ బిర్యానీ మాత్రమే కాదు.. లక్నో అవధీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ, అంబూర్ బిర్యానీ, డిండిగల్ బిర్యానీ, తలస్సేరి బిర్యానీ వంటి ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నాయి. ప్రతి బిర్యానీ తయారీ విధానం, మసాలాల వినియోగం, రుచి ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని చోట్ల బంగాళాదుంపతో, మరికొన్ని చోట్ల సీఫుడ్‌తో కూడా బిర్యానీ తయారు చేస్తారు.

ఒకప్పుడు బిర్యానీ అంటే చికెన్ లేదా మటన్‌తోనే చేసేవారు. ఇప్పుడు పనీర్, వెజిటబుల్స్, మష్రూమ్, సోయా, ఎగ్, ప్రాన్స్, ఫిష్ వంటి ఎన్నో రకాల బిర్యానీలు అందుబాటులోకి వచ్చాయి. శాకాహారులు, మాంసాహారులు అనే తేడా లేకుండా అందరూ తమకు నచ్చిన రుచిని ఆస్వాదిస్తున్నారు.

భారతీయులే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా బిర్యానీకి మంచి డిమాండ్ ఉంది. మధ్యప్రాచ్యం, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని భారతీయ రెస్టారెంట్లలో అత్యధికంగా ఆర్డర్ చేసే వంటకాల్లో బిర్యానీ ఒకటి. ఫుడ్ డెలివరీ యాప్‌లలో కూడా ఎక్కువగా బుక్ అయ్యే ఐటమ్‌లలో బిర్యానీ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది.

బిర్యానీని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని సువాసన, మసాలాల సమతుల్యం, దమ్ పద్ధతిలో ఉడికించే విధానం. ప్రతి బియ్యపు గింజకు మసాలా రుచి పట్టడం, మాంసం లేదా కూరగాయలు మెత్తగా ఉడకడం వల్ల ప్రతి ముద్ద ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. రాయితా, సలాన్, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే ఆ రుచి మరింత రెట్టింపవుతుంది.

ఈ ప్రత్యేక రోజున చాలామంది తమకు ఇష్టమైన బిర్యానీని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆస్వాదిస్తారు. సోషల్ మీడియాలో కూడా బిర్యానీ ఫొటోలు, వీడియోలు, జ్ఞాపకాలు పంచుకుంటూ ఈ రోజును సెలబ్రేట్ చేస్తారు. రుచి, సంప్రదాయం, సంస్కృతి, ఆనందాన్ని కలిపిన వంటకంగా బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసులను గెలుచుకుంటూనే ఉంది.

'ఆదర్శ కుటుంబం' లో వెంకటేష్ కొడుకు కనిపించబోతున్నాడా..?

Venkatesh Son Arjun
Venkatesh Son Arjun

Venkatesh son Arjun : త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం ‘ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ చాలా వైలెంట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా మొత్తం వెంకటేష్ యాక్షన్ ఎపిసోడ్స్ లో విపరీతంగా పాల్గొంటారట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా త్రివిక్రమ్ మార్కును మించి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆయన మొత్తం ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను తీశాడు. కానీ ఈ సినిమాలో ఫ్యామిలీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా పెద్ద పీట వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ కూడా ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. చివరి 5 నిమిషాల్లో తను కనిపిస్తారట.

ఎలాగైనా సరే తన కొడుకును హీరోగా మార్చాలనే ప్రయత్నంలో వెంకటేష్ అతనికి యాక్టింగ్ సంబంధించిన మెలకువలు నేర్పిస్తున్నాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్ కోరిక మేరకు వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ ను ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో చూపించబోతున్నారట. మనం సినిమాలో ఎలాగైతే అఖిల్ వచ్చి చివర్లో వాళ్లందర్నీ కాపాడుతాడో అలాగే ఈ సినిమాలో కూడా అర్జున్ వచ్చి వీళ్ళందర్నీ సేవ్ చేస్తారట.

ఇక విక్టరీ వెంకటేష్ కొడుకు అరంగేట్రం సినిమా ఇదే అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అర్జున్ గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చినా కూడా అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది అనేది చూడడానికి వెంకటేష్ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

ఎందుకంటే స్టార్ హీరో అయిన వెంకటేష్ కొడుకు అంటే ఇండస్ట్రీ లో చాలా మంచి అంచనాలైతే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఆయన రాణిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ క్యారెక్టర్ ఉందా? లేదంటే కావాలనే కొన్ని రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారా? అనేది కూడా తెలియాల్సి ఉంది…

చివరకు వైసీపీకి డ్యామేజ్!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: ఇటీవల జరుగుతున్న పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. మతపరంగా, కులపరంగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయి. కొన్ని వర్గాలను ఆ పార్టీకి దూరం చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒక మీడియా ఉంది. సోషల్ మీడియా సైన్యం ఉంది. ఇటీవల మతపరంగా, కుల పరంగా కొందరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అటువంటి వ్యక్తులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సాయం అందిస్తుంది అన్నది ఒక ప్రధాన ఆరోపణ. ఆపై ఆ సెక్షన్ మీడియాలో సైతం ఆ వ్యక్తులకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తుంది. అయితే ఇక్కడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్ అవుతుంది.

* హిందుత్వ వ్యతిరేక ముద్ర..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హిందుత్వవాదం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారు ఉన్నారు. అటువంటి వారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తోంది, ప్రోత్సహిస్తోంది అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో హిందూ వ్యతిరేక ముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విపరీతంగా పెరిగిపోతోంది. కుల పరంగా కూడా చేస్తున్న ఆరోపణలు వికటిస్తున్నాయి. ముఖ్యంగా కాపుల విషయంలో ఆ పార్టీ అతిగా స్పందిస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు కొందరు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాపులు.. ఆ సామాజిక వర్గానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈ క్రమంలో చేస్తున్న ప్రయత్నాలు మాత్రం వికటిస్తున్నాయి.

* ఆ అవసరం ఎవరికీ..
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరిణామాల క్రమం వెనుక శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న కుట్ర దాగి ఉంది. అయితే ఒక ప్రభుత్వం పై బురద జల్లాలన్నా.. వ్యతిరేకత పెంచాలన్న.. దాని వెనుక కచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం పాత్ర ఉంటుంది. ఇటీవల వరుస ఘటనలు జరగడం.. అవి ఉద్దేశ పూర్వకంగా చేసే కుట్రల్లా ఉండడంతో ఇందులో వైసీపీ పాత్ర ఉందనేది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పక్కకు వెళ్లిపోగా.. ప్రభుత్వ పాలనను అడ్డగించే క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకత బలంగా పెరుగుతోంది. ఈ మొత్తం పరిణామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ అవుతోంది.