Samsung Galaxy M47 specifications: Samsung కంపెనీ నుంచి కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వస్తుందంటే కొందరు ఉత్సాహంగా ఉంటారు. ఈ కంపెనీ తన పాపులర్ మిడ్ రేంజ్ ‘M’ సిరీస్‌లో భాగంగా సరికొత్త Samsung Galaxy M47 5G మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల లీకైన గీక్‌బెంచ్ (Geekbench) రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ఫోన్ శక్తివంతమైన Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో రానున్నట్లు స్పష్టమైంది. ఈ సరికొత్త చిప్‌సెట్ కారణంగా మొబైల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. ఈ ప్రాసెసర్ ఎలాంటి పనితీరును చూపిస్తుంది? ఈ మొబైల్ లో ఇంకా ఏమేం ఫీచర్స్ ఉంటాయి?
శామ్‌సంగ్ గెలాక్సీ M47 లో ఉపయోగించబోయే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ 4nm (నానోమీటర్) ఆర్కిటెక్చర్‌పై తయారైంది. అంటే ఇది తక్కువ బ్యాటరీని వాడుకుంటూ ఎక్కువ పవర్‌ను ఇస్తుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో హై-పర్ఫార్మెన్స్ కోసం 2.40 GHz స్పీడ్ గల 4 కోర్లు, సాధారణ పనుల కోసం 1.80 GHz స్పీడ్ గల 4 ఎఫిషియన్సీ కోర్లు ఉన్నాయి. దీనివల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవుతుంది.
ఈ చిప్‌సెట్‌తో పాటు ఇందులో Adreno 710 GPU గ్రాఫిక్స్ కార్డ్‌ను అందించారు. గీక్‌బెంచ్ ఓపెన్ సిఎల్ టెస్టుల్లో ఇది 2,256 స్కోర్‌ను సాధించింది. దీనివల్ల BGMI ఫ్రీ ఫైర్ వంటి హెవీ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా ఎలాంటి లాగ్స్ లేకుండా, హై ఫ్రేమ్ రేట్స్‌తో ఆడుకోవచ్చు. మల్టీటాస్కింగ్ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ చాలా వేగంగా స్పందిస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M47 మొబైల్ సరికొత్త Android 16 ఆధారిత One UI సాఫ్ట్‌వేర్‌తో రానుంది. అంతేకాకుండా, ఇందులో బేస్ వేరియంట్ లోనే 8GB RAM, 128GB స్టోరేజ్ అందించే అవకాశం ఉంది. ఈ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ భారీ ర్యామ్ కలయిక వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని యాప్స్ రన్ అవుతున్నా ఫోన్ ఎక్కడా స్లో అవ్వదు.
కొన్ని లీక్స్ ప్రకారం ఈ ఫోన్ కేవలం ప్రాసెసర్ పరంగానే కాకుండా మిగిలిన ఫీచర్లలోనూ అదరగొట్టనుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడినAMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, ఫ్రంట్ వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, శామ్‌సంగ్ ‘M’ సిరీస్ మార్కుకు తగ్గట్టుగా ఇందులో 6000mAh భారీ బ్యాటరీ ఉండగా.. దీనికి 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా శామ్ సంగ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో రాబోతున్న శామ్‌సంగ్ గెలాక్సీ M47 మొబైల్.. బడ్జెట్ ధరలో (సుమారు రూ. 20,000 నుంచి రూ.23,000 లోపు) బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆశించే గేమర్స్‌కు మరియు యూజర్స్‌కు ఒక అద్భుతమైన ఆప్షన్ కానుంది.
















ఈ వారం 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' నుండి ఎలిమినేట్ అయ్యే 2 జంటలు ఇవే.. ఇంత అన్యాయమా..
Mad For Each Other elimination : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో ఇప్పుడు చివరి లెవెల్ కి చేరింది. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే తో ఈ షో ముగియబోతుంది. ఈ షో లో ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ ఏది కూడా ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. బాగా ఆడే జంటలు చాలానే ఎలిమినేట్ అయ్యాయి. ఈ కారణం చేత , ఆడియన్స్ లో ఈ షో తీవ్రమైన నెగెటివిటీ ని ఏర్పాటు చేసుకుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కి వచ్చిన ప్రతీ వారం ఎలిమినేషన్ ని రద్దు చేయడం , అతని ఎన్ని మాటలు మాట్లాడినా బాండ్ క్రెడిట్స్ ఇవ్వడం వంటివి చేస్తూ వచ్చారు జడ్జీలు. ముఖ్యంగా షో ఫార్మటు పై ఇతను చేసినన్ని కామెంట్స్ ఇప్పటి వరకు ఏ జంట కూడా చేయలేదు.
ఏ షో ద్వారా అయితే పాపులారిటీ ని సంపాదించుకున్నాడో , అదే షో పై పదే పదే విమర్శలు చేస్తున్నా కూడా ఆయన్ని సింహం అంటూ పిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత వారం ఎలిమినేషన్ ని రద్దు చేయడం వల్ల, ఈ వారం బాగా జంటలు ఎలిమినేట్ అవ్వబోతున్నాయి. అందులో మొదటి జంట సిద్దు – సోనియా. ఈ జంటకు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఉంది , వాళ్ళ ఆట తీరుని కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ వీళ్ళు ఈ వారం ఆటల్లో డేంజర్ జోన్ లోకి వచ్చారు , ఆ కారణం చేత ఎలిమినేట్ అవ్వబోతున్నారు. వీళ్ళు ఈ వారం గేమ్స్ ఓడిపోయింది నటరాజ్ మాస్టర్ -నీతూ జంట చేతుల్లోనే. వీళ్ళు గత వారమే ప్రక్రియ ప్రకారం ఎలిమినేట్ అయ్యుంటే , నేడు సిద్దు – సోనియా లాంటి టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యేవాళ్ళు కాదు కదా.
అదే విధంగా వీళ్ళతో పాటు ఎలిమినేట్ అవ్వబోయే మరో జంట ఆమీర్ – అభిమానికా . వీళ్ళు ఈ వారం టాస్కులు గెలిచారు , అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇలా అన్యాయమైన ఎలిమినేషన్స్ చేస్తూ , షో ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ కూడా , తీవ్రమైన నెగెటివిటీ ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. మేకర్స్ తీరు చూస్తుంటే నటరాజ్ మాస్టర్ చేతుల్లోనే కప్ పెట్టెలాగా ఉన్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు, చూడాలి మరి వచ్చే వారం ఏమి జరగబోతుంది అనేది.