Pawan Kalyan on YCP Kapu politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాపులపై దృష్టి పెట్టింది. కాపులను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది. ఆ మధ్యన అంబటి రాంబాబు అరెస్టు సమయంలో సైతం కాపు నేతలను రంగంలోకి రాజకీయాలు మొదలుపెట్టింది. మొన్నటి ఎన్నికల్లో కాపులు దూరం కావడంతోనే ఓటమి ఎదురైందని గుర్తించింది. అందుకే ఇలా కాపు రాజకీయం మొదలుపెట్టింది. తాజాగా ఈ అంశంపై మాట్లాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన ను ఒక కులానికి ఆపాదించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాపుల అంశంపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు.. ఆ సామాజిక వర్గం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని గుర్తు చేశారు. తద్వారా కాపుల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్.
ఐదేళ్ల కాలంలో అంతులేని నిర్లక్ష్యం
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కాపు సామాజిక వర్గం పై నిర్లక్ష్యం కొనసాగింది. ఆ సామాజిక వర్గాన్ని పెద్దగా లెక్క చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కాపులు మొన్నటి ఎన్నికలకు ముందు నుంచి పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. అయితే కాపులను వదులుకోవడం ద్వారా వేరే సామాజిక వర్గాలతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చేవి అప్పట్లో. దీంతో జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు కాపులు. దాని పర్యవసానాలే మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం. అయితే ఈ సత్యాన్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి కాపు రాజకీయానికి తెర తీశారు. దానికి ఆదిలోనే చెక్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
కాపులకు పరోక్ష సంకేతాలు..
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులను దారుణంగా అవమానించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో కాపుల పట్ల నిర్లక్ష్యం కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. తద్వారా కాపులకు స్పష్టమైన సంకేతాలు పంపారు పవన్ కళ్యాణ్. జనసేనపై కాపు కుల ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేశారని.. కొన్ని వర్గాలను దూరం చేసేందుకు ఎత్తుగడవేశారని.. తనది అన్ని వర్గాల పార్టీగా అభివర్ణించారు. అదే సమయంలో వైసీపీ కాపు రాజకీయాన్ని ప్రస్తావిస్తూ దానిని తప్పుపట్టారు. ఇది సత్యం గ్రహించండి అంటూ పరోక్షంగా కాపులకు సంకేతాలు పంపగలిగారు పవన్ కళ్యాణ్. అయితే కాపుల ద్వారా మళ్లీ రాజకీయ పూర్వవైభవం కోసం తహతహలాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బందికర పరిస్థితి. మరి ఆ పార్టీ కాపు రాజకీయాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తుందా? పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇవ్వగలదా? అన్నది చూడాలి.
