Home Blog Page 270

దీనమైన స్థితిలో పాపులర్ నటి.. అర్థ రాత్రి నడి రోడ్డు మీద వదిలేశారు..

Pavala Shyamala
Pavala Shyamala

Pavala Shyamala latest news: ఎన్నో వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యినటువంటి పావలా శ్యామల గత కొంతకాలం నుండి ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు నటిగా రోజుకు వేలరూపాయిలు సంపాదించే ఈమె , ఇప్పుడు కనీసం పూట గడవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఈమెకు మొదట్లో మన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం చేసి ఈమె సమస్యని అందరి దృష్టికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత చిరంజీవి , రామ్ చరణ్ వంటి వారు కూడా ఆర్ధిక సాయం చేశారు. రీసెంట్ గా అల్లు అర్జున్ ఈమెకు నెలకు పది వేల రూపాయిలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చాడు. అయినప్పటికీ కూడా ఈమెకు కష్టాలు తీరలేదు.

రీసెంట్ గానే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె, చికిత్స కోసం కూకట్ పల్లి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. కానీ దురదృష్టం కొద్దీ ఆమె వద్ద డబ్బులు లేకపోవడం తో క్యాబ్ లో వెనక్కి పంపించేశారు. అర్థ రాత్రి ఆ క్యాబ్ డ్రైవర్ శ్యామల ని వైజంక్షన్ రోడ్డు పై వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో ఎటు వెళ్లాలో అర్థం అవ్వని శ్యామలా , ఫుట్ పాత్ పై కూర్చొని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. పాపులర్ నటి కాబట్టి , అక్కడే ఉన్నటువంటి స్థానికులు ఆమెని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఆర్కీ ఫౌండేషన్ కి తరలించారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమాల్లో , సీరియల్స్ లో నటించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న పావలా శ్యామలా పరిస్థితి ఇంతటి దయనీయంగా మారడం అందరూ శోచించాల్సిన విషయం. ఆమె పరిస్థితి పై సినీ ప్రముఖులు మరోసారి స్పందించి సహాయం చేస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.

అయితే ఒక పాపులర్ నటి ఇంత ఇబ్బందులు పడుతుంటే, మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ ఏమి చేస్తుంది?, మనకి తెలిసి కేవలం పావలా శ్యామల ఒక్కటే ఉంది , కానీ ఇలాంటి నటీనటులు ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉండే ఉంటారు, వీళ్లందరి కోసం ఒక ఫౌండేషన్ లాంటిది నడుపుతూ , ఆశ్రయం ఎందుకు కలిపించడం లేదు?, ఇలాంటి మంచి పనులకు ఉపయోగపడని మా అస్సోసియేషన్ ఎందుకు ?, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒకవేళ ఇలాంటి వాళ్ళను చేరదీసి , వాళ్ళ బాగోగులు చూసుకునే కార్యక్రమం తలపెడితే చిరంజీవి , బాలకృష్ణ లాంటి వాళ్ళు ముందుకొచ్చి విరాళాలు ఇస్తారు కదా?, ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయడం లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.

మహేష్ బాబు ట్రిప్స్ వెనకున్న రహస్యం ఇదేనా..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu foreign trips: ప్రస్తుతం మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో అడపదడప సక్సెస్ లను సాధించిన ఆయన ఆ తర్వాత వరుస సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ఒకానొక సమయంలో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారిపోతాడు అని అందరి చేత ప్రశంసలను అందుకున్నాడు. అలాంటి మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో సైతం పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు… ఇక మహేష్ బాబు తను షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో గడపాల్సిన టైమ్ ను వాళ్ళకి కేటాయిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అతను ఇలా చేస్తాడట. అలాగే మహేష్ బాబు తన ఫ్యామిలీతో సంవత్సరానికి ఒక నాలుగైదు ట్రిప్పుల కైనా వెళుతూ ఉంటాడు.

వెళ్లిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన పిల్లలకి ప్రపంచాన్ని పరిచయం చేయాలని అలాగే తను చేస్తున్న వర్క్ పట్ల రిలాక్సేషన్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు అలాంటి ట్రిప్స్ ని ప్లాన్ చేస్తూ ఉంటారట… మొత్తానికైతే ఆయన దేశం నలుమూలాల ట్రిప్పులు వేస్తూ తన ఫ్యామిలీతో బీభత్సమైన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

నిజానికి సినిమా హీరోలు చాలామంది హీరోయిన్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళలో మహేష్ బాబు నమ్రత లు మాత్రమే కలిసి మెలిసి ఉంటున్నారు. రోజు రోజుకి వల్ల మధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక వాళ్ళలా లైఫ్ ను ఎంజాయ్ చేసేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీ లో ఇంకెవరూ ఉండరనుకుంటా…

ఇక వీళ్లిద్దరు ఇలాంటి రూమర్లు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా చాలా ప్రశాంతంగా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక నమ్రత మహేష్ బాబు ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ అతనికి సరిపడా కథలను సెలెక్ట్ చేస్తుంటుంది. అందువల్లే మహేష్ బాబుకి నమ్రత అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఏది ఏమైనా కూడా వీళ్లిద్దరు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు…

కొడాలి నానికి క్లాస్ పీకిన జగన్!

Jagan Warns Kodali Nani
Jagan Warns Kodali Nani

Jagan Warns Kodali Nani: విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. తాడేపల్లి కార్యాలయంలో పార్టీ ముఖ్య లతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలను అప్రమత్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు నిర్వహించాలని భావిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిలు అందుబాటులో ఉండాలని తేల్చి చెబుతున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి కొడాలి నానిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. చాలాసేపు కొడాలి నానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదు కొడాలి నాని. ఇకనుంచి యాక్టివ్ కావాల్సిందేనని కొడాలి నాని కి జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కాస్త గట్టిగానే చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో..

నిలిచిన వైసిపి కార్యక్రమాలు..
మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఐదోసారి పోటీ చేశారు కొడాలి నాని. కానీ రావి వెంకటేశ్వరరావు చేతిలో ఆయన ఓడిపోయారు. భారీ మెజారిటీతో గెలిచారు వెంకటేశ్వరరావు. గెలిచిన నాటి నుంచి వెంకటేశ్వరరావు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో టిడిపి గ్రాఫ్ కూడా పెరుగుతుంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఏవి జరగడం లేదు. కనీసం పర్యవేక్షణ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండేళ్ల పాటు కాలం గడిచిపోయింది. కానీ ఇక అలానే విడిచి పెడితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే కొడాలి నాని ని పిలిపించి మాట్లాడారు. యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొడాలి నానికి జగన్ క్లాస్ పీకినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరం..
గుడివాడ నుంచి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున.. రెండుసార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కొడాలి నాని. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇంతలోనే అనారోగ్యానికి గురయ్యారు. అయితే కోలుకున్నాక తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారని అంతా భావించారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు. త్వరలో కొడాలి నాని రాబోతున్నారని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు. కానీ ఎప్పటికీ రావడం లేదు కొడాలి నాని. కేసులకు భయపడి రావడం లేదన్న విమర్శ ఉంది.. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. పార్టీలో యాక్టివ్ అవుతావా? లేకుంటే తప్పుకుంటావా? అని అడిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే పార్టీలో దూకుడుగా ఉంటూ చాలా రకాల ఇబ్బందులు పడుతున్న వైనాన్ని కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పార్టీకి చావోరేవో లాంటివని.. కచ్చితంగా యాక్టివ్ కావాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

రాజమౌళి - అల్లు అర్జున్ కాంబోలో భారీ బడ్జెట్ తో సినిమా..

Rajamouli-Allu Arjun Combo Film
Rajamouli-Allu Arjun Combo Film

Rajamouli-Allu Arjun Combo Film: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన దర్శకుడు రాజమౌళి మూస ధోరణిలో వెళ్తున్న సినిమా ఇండస్ట్రీ ని కొత్త పుంతలు తొక్కించాడు. అలాగే వరుసగా సక్సస్ లను సాధించి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను పెంచాడు. 12 సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించి తనకంటు సెపరేట్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సక్సెస్ లను సాధించినప్పటికి రాజమౌళికి వచ్చిన గుర్తింపు వేరే ఏ దర్శకుడికి రాలేదు.

పాన్ ఇండియాలో 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటి వరకు ఆయన తెలుగులో ఉన్న టైర్ వన్ హీరోలతో సినిమాలు చేశాడు. ఒక్క పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లను మినహాయిస్తే మిగిలిన అందరితో మూవీస్ చేశాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోయాడు.

కాబట్టి అతనితో సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి అల్లు అర్జున్ తో ఎలాగైనా సినిమా చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ సైతం రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తే బాగుంటుందని అతని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ సైతం తన ఇమేజ్ పెరగాలి అంటే రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాల్సిందే అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు…

ఇక రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి మరొక సంవత్సర సమయం పట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ సైతం ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత రాజమౌళితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద అటు రాజమౌళి, ఇటు అల్లు అర్జున్ ఎలాంటి స్పందనను తెలియజేయలేదు…

రంగస్థలం, అనిమల్ సినిమా తరహాలోనే పెద్ది మూవీ తెరకెక్కిందా...

Peddi Ticket Price Hike
Peddi Ticket Price Hike

Peddi movie inspired by blockbuster films: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి భారీ ఇమేజ్ ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన పెద్ది సినిమా వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని రామ్ చరణ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించిన వాళ్ళలో రామ్ చరణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇక తను అనుకున్నట్టుగానే పెద్ది సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. పెద్ది సినిమా నిడివి మూడు గంటల రెండు నిమిషాలు వచ్చినట్టుగా తెలుస్తుంది.

గతంలో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా కూడా మూడు గంటలకు పైన రన్ టైమ్ ఉండడంతో ఆ సినిమా మీద అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. అయినప్పటికి సినిమాలోని ఎమోషన్ పర్ఫెక్ట్ గా కుదరడంతో ప్రేక్షకులందరు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇక రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా కూడా మూడు గంటలకు పైన నిడివి తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా కూడా బీభత్సమైన హైప్ తో వచ్చి ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో సినిమా సూపర్ సక్సెస్ సంపాదించుకోవడమే కాకుండా ఒక కల్ట్ క్లాసికల్ మూవీగా నిలిచిపోయింది…ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల మాదిరిగానే పెద్ది సినిమా కూడా పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఇప్పుడు పెద్ది సినిమా ఏ మేరకు విజయాన్ని సాధిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది…

మోదీ పిలుపునిచ్చాడు.. రేవంత్ పాటించాడు.. ఇది అనూహ్యం

Modi Calls Revanth Follows
Modi Calls Revanth Follows

Modi Calls Revanth Follows: పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్‌ జల సంధి మూసివేత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో చాలా దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు ఇప్పటికే ఇంధన ధరలు భారీగా పెంచాయి. క్యూబాలో అయితే లాక్‌డౌన్‌ ప్రకటించారు. భారత నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇవ్వడంతో తరచుగా నౌకలు వస్తున్నాయి. అయితే చమురు ధరలు పెరగడం, నిల్వలు తగ్గడంతో ప్రధారి మోదీ కూడా ఇంధన పొదుపు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఇంధన ధరలు పెంచారు. మోదీ పిలుపు మేరకు చాలా రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్‌ తగ్గించుకున్నారు. పొందుపు మంత్రం పాటిస్తున్నారు.

తెలంగాణ సీఎం కూడా..
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయినా ప్రధాని పిలుపు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్‌రెడ్డి కూడా తన అధికారిక కాన్వాయ్‌లో ముఖ్యమైన మార్పు చేశారు. ఇకపై నాలుగు వాహనాలతో మాత్రమే కాన్వాయ్‌ కదులుతుందని ప్రకటించారు. ఇంధన పొదుపు: ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, మంత్రులు తమ వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే సందేశం స్పష్టంగా ఉంది. సీఎం రేవంత్‌ ఈ సందేశానికి ఆచరణాత్మక రూపం ఇచ్చారు. కాన్వాయ్‌లో అధిక వాహనాలు ఉండటం వల్ల ట్రాఫిక్‌ జామ్, ప్రజల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను గుర్తించి సీఎం సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించాలని నిర్ణయించారు.

సీఎం నిర్ణయం వెనుక ప్రాధాన్యతలు…
ముఖ్యమంత్రి స్వయంగా ఉదాహరణగా నిలవడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మీద ప్రభావం చూపవచ్చు. ఇది ‘పైనుంచి కిందికి‘ మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. ప్రభుత్వ ఖజానాకు అదనపు భారం తగ్గడం, ఇంధన ఖర్చు తగ్గడం దీర్ఘకాలికంగా మంచి ఫలితాలనిస్తుంది. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద మొత్తంలో పొదుపు తెస్తాయి. ట్రాఫిక్‌ మధ్యనే ప్రయాణించడం ద్వారా సాధారణ ప్రజల జీవన విధానాన్ని ముఖ్యమంత్రి అనుభవించే అవకాశం ఏర్పడుతుంది. ఇది రాజకీయ నాయకులు – ప్రజల మధ్య దూరాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలులో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. ముఖ్యంగా భద్రతా పరమైన అంశాలు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన కదలిక, ట్రాఫిక్‌ నిర్వహణలో పోలీసు బాధ్యతలు

నాయకత్వం నిజమైన పరీక్షకేవలం ప్రకటనలు కాకుండా వ్యక్తిగత స్థాయిలో మార్పు తీసుకురావడం రేవంత్‌ రెడ్డి నాయకత్వ శైలిలో భాగమని చెప్పవచ్చు. ఈ చిన్న అనుసరణ ఇతర రాష్ట్రాలు, అధికారులకు కూడా స్ఫూర్తినివ్వాలి. ఇంధన పొదుపు, ప్రజా సౌకర్యం, ప్రభుత్వ ఖర్చు తగ్గింపు వంటి అంశాల్లో ఈ నిర్ణయం సానుకూల ముద్ర వేస్తుందని ఆశించవచ్చు.

వైయస్సార్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?

YSRCP popularity graph
YSRCP popularity graph

YSRCP popularity graph: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. వచ్చే నెల 12 నాటికి రెండేళ్లు పూర్తికానుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన ఈ రెండు సంవత్సరాల్లో.. ఆ పార్టీకి గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా? అంటే సరైన సమాధానం దొరకని పరిస్థితి. అయితే ఒక్క మాట మాత్రం చెప్పగలం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేక పోతున్నారు.. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడులతో పాటు అభివృద్ధి పనులను చేసి ప్రజల దృష్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లకుండా చూస్తోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుణ పాఠాలు నేర్చుకోలేదు. ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయలేదు. వారితో మమేకం కాలేకపోతోంది కూడా.

నిత్యం నీడలా అమరావతి..
అమరావతి రాజధాని అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నీడలా వెంటాడుతూనే ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రతిపాదన చేసిన మావిగన్ పై ప్రజల్లో ప్రతికూలత తెచ్చింది. ఆయన మాటలను ప్రజలు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అదేదో కొత్త ప్రతిపాదన కంటే అమరావతిపై విషం చిమ్మడమే అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. గతసారి టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిలో గ్రాఫిక్స్ చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. ఇప్పుడు కూడా అమరావతిపై పదే పదే ఆ తరహా ప్రచారం చేయడానికి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అమరావతి రాజధాని అనేది ఒక అజెండాగా తీసుకున్నారు ప్రజలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయినా పదేపదే దాని జోలికి వెళ్లి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

శాసనసభకు హాజరు కాకపోవడం..
జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కాకపోవడం సైతం ఆ పార్టీకి మైనస్. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల గురించి సభకు వచ్చి మాట్లాడతానని జగన్ చెప్పడాన్ని ఎవరు హర్షించడం లేదు. పైగా ప్రజల మధ్యకు జగన్మోహన్ రెడ్డి వచ్చింది చాలా తక్కువ. ప్రస్తుతం ఆయన తన సొంత పార్టీ నేతల అరెస్టు సమయంలోను.. వారి ఇళ్లల్లో పరామర్శలకు.. వివాహాలకు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనల సమయంలో సైతం ఆయన హాజరుకావడం లేదు. అదికూడా ఆ పార్టీ గ్రాఫ్ తగ్గించింది. పైగా స్థానికంగా కూడా ఉండడం లేదు. ఇతర రాష్ట్రంలో నాలుగు రోజులు పాటు ఉంటే.. తాడేపల్లి లో మూడు రోజులు గడుపుతున్నారు. వీకెండ్ సర్వీసులు బెంగళూరు నుంచి ఉండడంతో ప్రజలు పెద్దగా నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డిని. అన్నింటికీ మించి వైఫల్యాలను అధిగమించడం లేదు ఆ పార్టీ.

ఎన్నెన్నో అభ్యంతరాలతో..
టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తెస్తోంది. దీనిని ఆహ్వానించడం లేదు జగన్మోహన్ రెడ్డి. విశాఖకు ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అనుబంధా ఐటీ పరిశ్రమలు వచ్చాయి. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. అమరావతిలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. వీటికి ఆహ్వానించక పోగా.. భూ సమీకరణ, భూ సేకరణ పేరుతో అడ్డు తగులుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇలాంటి కారణాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది తప్ప.. ఎంత మాత్రం పెరగడం లేదన్నది విశ్లేషకుల మాట. చూడాలి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో..

చిన్న నేతలకు ఎలివేషన్ ఇస్తున్న జగన్!

Jagan Press Meet
Jagan Press Meet

Jagan leadership strategy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం తహతహలాడుతోంది. 2029 ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. ముఖ్యంగా పార్టీలో చేరికలను ప్రోత్సహించి.. బలోపేతం చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. అందులో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి శ్రీనివాసరావు అనే నేతను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పేరులో మోపిదేవి ఉండడంతో.. ఒకప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు సమీప బంధువు అని అంతా భావించారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేశారని.. ఆయనకు అక్షరాల 2800 ఓట్లు వచ్చాయని.. నోటాకు కంటే కాస్త ఎక్కువ ఓట్లు అని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

చేరికలు తక్కువే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరికల విషయంలో ఇప్పుడు భిన్న ప్రచారం నడుస్తోంది. ఆ పార్టీలో చేరేందుకు హేమా హేమీలు ముందుకు వచ్చేవారు. అటువంటిది ఓ రెండు వేల ఓట్లు వచ్చిన నాయకుడిని చేర్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి చూపించిన శ్రద్ధ ఇప్పుడు హైలెట్ అవుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సాకే శైలజానాథ్ చేరిన తర్వాత.. పెద్ద పెద్ద తలకాయలు వస్తాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు చిన్న నాయకులను సైతం చేర్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అంత ఆసక్తి చూపిస్తుండడం మాత్రం విశేషం. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి సన్నిహితులకు కనీస స్థానం లేదు ఆ పార్టీలో. ఇప్పుడు వారిని రమ్మంటూ పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. కానీ చిన్న నాయకులను సైతం పార్టీలో చేర్చుకునే క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అతి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

ఎంతోమంది నేతలకు అవకాశాలు..
కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఎంతోమంది నేతలకు అవకాశాలు కల్పించారు. 151 మందికి ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇచ్చారు. ఓ 40 మంది వరకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఓ 40 మంది వరకు ఎంపీలుగా అవకాశం ఇచ్చారు. ఓ 50 మంది వరకు మంత్రులుగా ఛాన్స్ కల్పించారు. వందలాది మందికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓ చిన్న నేతను పార్టీలో చేర్చుకునే క్రమంలో ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఒకప్పుడు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ లభించేది కాదు. అటువంటిది ఇప్పుడు ఒక చిన్న నాయకుడు కూడా పెద్ద నేతగా పరిగణిస్తుండడం మాత్రం గొప్ప విషయం..

ఒక్క నవ్వుతో.. వైసీపీని లాగి కొట్టిన పవన్!

Pawan Kalyan YSRCP criticism
Pawan Kalyan YSRCP criticism

Pawan Kalyan YSRCP criticism: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపులో తమ క్రెడిట్ వెతుక్కుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు కూడా చేసుకుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేయగలిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ ఫోటోతో ప్రచారం చేసుకోవడం వల్లే విజయ్ గెలిచారని ఒకవైపు.. విజయ్ మాదిరిగా పవన్ కళ్యాణ్ సైతం ఒంటరి పోరాటం చేయాలని మరోవైపు.. ఇలా చాలావరకు ప్రచారం చేసింది వైయస్సార్ కాంగ్రెస్. చివరకు ఆ పార్టీ నేతలు సైతం ఇదే మాదిరిగా మాట్లాడారు. దానిపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్క నవ్వుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువును తీసేసారు.

గతంలో కూడా ఇదే మాదిరిగా..
గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే మాదిరిగా వ్యవహరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తన ముఖ కవళికలతోనే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మాజీ మంత్రి రోజాపై విమర్శలు చేసే క్రమంలో.. నువ్వు కూడానా అంటూ చేసిన కామెంట్ సప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా పవన్ ఒక్క నవ్వుతో.. 11 సీట్లు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా జనసేన ను విమర్శించడమా? అని బదులిచ్చారు పవన్. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క నవ్వుతో తేల్చేశారు బాసు అంటూ జనసైనికులు పోస్టులు పెడుతున్నారు.

ఇచ్చి పడేసారుగా..
సాధారణంగా విమర్శలపై పెద్దగా స్పందించరు పవన్ కళ్యాణ్. స్పందిస్తే మాత్రం ఇచ్చి పడేస్తారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఒక్క నవ్వు నవ్వడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేశారు. విజయ్ గెలుపుతో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో లేచి తన్నించుకున్నారన్న రోజా మాటలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అనవసరంగా తమిళనాడు విజయ్ ఫలితంతో పవన్ కళ్యాణ్ ను పోల్చడంతో.. అదే పవన్ లాగి తన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని. ఎంతలా అంటే 11 సీట్లు వచ్చిన మీరు కూడా మా కోసం మాట్లాడుతారా? అంటూ ప్రశ్నించడం ద్వారా ధీటైన జవాబు ఇచ్చారు. చిన్నపాటి కామెంట్ తో పెద్ద సమాధానమే ఇచ్చారు.

మోదీ మాట లెక్క చేయని మధ్యప్రదేశ్‌ నేత.. బీజేపీ సంచలన నిర్ణయం

Sanjan Kumar Yadav BJP controversy
Sanjan Kumar Yadav BJP controversy

Sanjan Kumar Yadav BJP controversy: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ.. ఇటీవల దేశ ప్రలకు కీలక సూచనలు చేశారు. ఇంధనం పొదుపు చేయాలని, బంగారం కొనొద్దని, డబ్బులు వృథా చేయొద్దని, వర్క్‌ఫ్రం హోం చేయాలని సూచించారు. అంతేకాదు మరుసటి రోజు నుంచే మోదీ ఇంధన పొందుపు ఆచరించడం మొదలు పెట్టారు. తన కాన్వాయ్‌ని సగానికి తగ్గించుకున్నారు. ఈ తరుణంలో బీజేపీ పాలక రాష్ట్రాల్లో కూడా మోదీ సూచనల అమలుకు చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామం చర్చనీయాంశమైంది.

అక్కడా బీజేపీ ప్రభుత్వమే..
మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. తాజాగా బింగ్‌ జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడిగా సంజన్‌కుమార్‌ యాదవ్‌ను పార్టీ రాష్ట్ర శాఖ నియమించింది. దీంతో అత్యుత్సాహానికి పోయిన యాదవ్‌.. ఘటనంగా సంబురాలు చేశారు. ప్రభుత్వ నేతలు, పార్టీ ప్రతినిధులు ఇచ్చే సందేశాలు సామాజానికి మార్గదర్శకంగా నిలవాల్సినప్పటికీ, ఈ నియమాన్ని పట్టించుకోకుండా భారీ కాన్వాయ్‌తో రాలీ తీశారు. 150 కార్ల కాన్వాయ్‌తో ట్రాఫిక్‌ సమస్య సృష్టించాడు. ప్రజలకు ఇబ్బంది కలిగించాడు. దీనికి సబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. అవి రాష్ట్ర పార్టీ దృష్టికి వెళ్లాయి.

పార్టీ నుంచి సస్పెండ్‌..
సంజన్‌కుమార్‌ యాదవ్‌ చేసిన పనికి షాక్‌ అయిన పార్టీ రాష్ట్ర నేతలు వెంటనే ఆయనపై చర్య చేపట్టారు. పదవి నుంచి తొలగించడమే కాకుండా అతడిని పార్టీ నుంచి కూడా సస్పెండ్‌ చేశారు. ప్రధాని మోదీ స్వయంగా సంబురాలు చేసుకోవద్దని, ఇంధన పొదుపు పాటించాలని సూచించినా సంజన్‌కుమార్‌ యాదవ్‌ లెక్క చేయలేదు. దీంతో పదవి పోయింది.. పార్టీ సభ్యత్వం పోయింది.

దేశం కోసమే మోదీ కీలక సూచనలు చేశారు. కానీ ఆ పార్టీ నేతలే పాటించకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మరెవరూ మోదీ సూచనలు ఉల్లంఘించకుండా మొదట్లోనే కట్టడి చేయడానికి బీజేపీ చర్యలు చేపట్టింది. ప్రజలు కూడా పొదుపు పాటిస్తే మేలని విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు.

రాహుల్ గాంధీ విదేశాలకు.. ఆ డబ్బుల సంగతేంటి..

Rahul Gandhi foreign visit
Rahul Gandhi foreign visit

Rahul Gandhi foreign visit: రాహుల్ గాంధీ మీద బిజెపి ఎంపీ సందీప్ పాత్ర కీలక విమర్శలు చేశారు. ఏకంగా ఆయన ఒక విలేకరుల సమావేశం నిర్వహించి సంచలన విషయాలను బయటపెట్టారు. దీనిపై ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వలేదు.. రాహుల్ గాంధీ కార్యాలయం కూడా స్పందించలేదు.

2014- 15 సంవత్సరంలో రాహుల్ గాంధీ ఆదాయం 86 లక్షలు ఉంది. ఆ ఏడాది విదేశీ పర్యటనలకు రాహుల్ గాంధీ నాలుగున్నర కోట్లు ఖర్చుపెట్టారు.

2017 -18 కాలంలో 1.20 కోట్ల ఆదాయం సంపాదిస్తే.. విదేశీ పర్యటనలకు ఏకంగా ఆరు కోట్లు ఖర్చుపెట్టారు.

2018-19 కాలంలో 1.22 కోట్ల ఆదాయాన్ని సంపాదించిన రాహుల్ గాంధీ విదేశీ ప్రకటనలకు 3.9 కోట్లు ఖర్చుపెట్టారు.

2019 -20 సంవత్సరంలో రాహుల్ గాంధీ 1.29 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తే.. విదేశీ పర్యటనలకు 4.60 కోట్లు ఖర్చుపెట్టారు.

2021 -22 సంవత్సరంలో రాహుల్ గాంధీ 1.3 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తే.. 2.60 కోట్లను విదేశీ పర్యటనలకు ఖర్చుపెట్టారు.

ఆదాయానికి మించి ఆరు రేట్లు ఖర్చుపెట్టారు రాహుల్ గాంధీ.. దీనికి టాక్స్ ఎందుకు కట్టలేదని సందీప్ విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఉజ్బెకిస్తాన్ వెళ్లారు. ఆ సమయంలో అమెరికాకు సంబంధించిన రేజిన్ చేంజ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ దీనిని కనీసం ఖండించలేదు. ఇక అప్పట్లో నేపాల్ లో చైనా రాయబార సిబ్బందిని రాహుల్ గాంధీ కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.

రాహుల్ గాంధీ ఈ స్థాయిలో మలేషియా, వియత్నం, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఎలా వెళ్లారు.. ఆ ఖర్చు మొత్తం ఎవరు పెట్టుకున్నారు.. అనే ప్రశ్నలు సందీప్ వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వద్ద ఒకటికి మించిన పాస్పోర్ట్ లు ఉన్నాయని.. అలహాబాద్ కోర్టులో ఈ కేసు నడుస్తుందని.. అసలు రాహుల్ గాంధీ ఈ స్థాయిలో పర్యటనలు చేస్తుంటే డబ్బులు వివరిస్తున్నారని సందీప్ పాత్ర విమర్శించారు. 22సార్లు రాహుల్ గాంధీ 59 వ్యక్తిగత విదేశీ పర్యటనలు చేశారని.. 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని.. రాహుల్ గాంధీ ఆదాయం పది నుంచి 11 కోట్ల వరకు మాత్రమే ఉంటే.. ఇంత ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎవరిచ్చారని.. సందీప్ ప్రశ్నించారు.. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారు.. రాహుల్ గాంధీ కార్యాలయం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

పాక్ లోనే కాదు..అజ్ఞాత సాయుధులు భారత్ లోనూ ఉండాల్సిందే

Unknown Armed Groups
Unknown Armed Groups

Unknown Armed Groups: పాకిస్తాన్లో అజ్ఞాత సాయుధులు ఇటీవల కాలంలో దాడులు చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే బుల్లెట్ల శబ్దాన్ని చేస్తూ.. టార్గెట్లను ఈజీగా ఫినిష్ చేస్తున్నారు. అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోయిన వారంతా కరుడుగట్టిన ఉగ్రవాదులు. లష్కరే ఏ తోయిబా, జై షే మహమ్మద్, హిజుబుల్ ముజాహిదిన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన వారంతా అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోతున్నారు.

ఇటీవల పాకిస్తాన్లో 10 రోజుల పండుగ నిర్వహిస్తున్నారు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదుల స్థావరాలు నేల కూలిపోయాయి. దీంతో పాకిస్థాన్లో మర్కాయే హక్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఉగ్రవాద గ్రూపుల ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇటీవల బలూచిస్తాన్ రాష్ట్రంలోని క్వెట్ట ప్రాంతంలో మర్కాయే హక్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా కమాండర్లు హఫీజ్, రైసానీ ని అజ్ఞాత సాయుధులు చంపేశారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో మరోసారి అజ్ఞాత సాయుధుల గురించి చర్చ నడుస్తోంది.

పాకిస్తాన్ లోనే కాకుండా భారత్ లో కూడా అజ్ఞాత సాయుధులు ఉండాలని ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇండియాలో ఉంటూ.. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి కూడా అజ్ఞాత సాయుధులు పనిష్మెంట్ ఇవ్వాలని జాతీయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా మన దేశంలో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలు తీవ్ర హింసకు దారితీసాయి. కొన్ని మత చాందస వాద గ్రూపులు ఆ ఉద్యమాలలో పాలుపంచుకున్నాయి. అప్పట్లో కేంద్ర నిఘా వర్గాలు ప్రభుత్వానికి కీలక సమాచారాన్ని అందించాయి. దీంతో ప్రభుత్వం వారి మీద దృష్టి పెట్టింది.. అయితే ఆ తరహా వ్యక్తులకు కొన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించడంతో దేశంలో అప్పుడప్పుడు శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయి.

అటువంటి వారికి సాయుధ అజ్ఞాత వాసులు సరైన సమాధానం చెప్పాలని.. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడాలని జాతీయవాదులు కోరుతున్నారు.. ఎందుకంటే దేశంలో అశాంతి చెలరేగితే మిగతా జనం మీద ఆ ప్రభావం పడుతుందని.. అందువల్లే అజ్ఞాత సాయుధులు మన దేశం మీద కూడా దృష్టి పెట్టాలని జాతీయవాదుల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Samsung Galaxy M47.. దీని ప్రాసెసర్ గురించి తెలిస్తే WOW అంటారు..

Samsung Galaxy M47 specifications
Samsung Galaxy M47 specifications

Samsung Galaxy M47 specifications: Samsung కంపెనీ నుంచి కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వస్తుందంటే కొందరు ఉత్సాహంగా ఉంటారు. ఈ కంపెనీ తన పాపులర్ మిడ్ రేంజ్ ‘M’ సిరీస్‌లో భాగంగా సరికొత్త Samsung Galaxy M47 5G మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల లీకైన గీక్‌బెంచ్ (Geekbench) రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ఫోన్ శక్తివంతమైన Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో రానున్నట్లు స్పష్టమైంది. ఈ సరికొత్త చిప్‌సెట్ కారణంగా మొబైల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. ఈ ప్రాసెసర్ ఎలాంటి పనితీరును చూపిస్తుంది? ఈ మొబైల్ లో ఇంకా ఏమేం ఫీచర్స్ ఉంటాయి?

శామ్‌సంగ్ గెలాక్సీ M47 లో ఉపయోగించబోయే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ 4nm (నానోమీటర్) ఆర్కిటెక్చర్‌పై తయారైంది. అంటే ఇది తక్కువ బ్యాటరీని వాడుకుంటూ ఎక్కువ పవర్‌ను ఇస్తుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో హై-పర్ఫార్మెన్స్ కోసం 2.40 GHz స్పీడ్ గల 4 కోర్లు, సాధారణ పనుల కోసం 1.80 GHz స్పీడ్ గల 4 ఎఫిషియన్సీ కోర్లు ఉన్నాయి. దీనివల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవుతుంది.

ఈ చిప్‌సెట్‌తో పాటు ఇందులో Adreno 710 GPU గ్రాఫిక్స్ కార్డ్‌ను అందించారు. గీక్‌బెంచ్ ఓపెన్ సిఎల్ టెస్టుల్లో ఇది 2,256 స్కోర్‌ను సాధించింది. దీనివల్ల BGMI ఫ్రీ ఫైర్ వంటి హెవీ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా ఎలాంటి లాగ్స్ లేకుండా, హై ఫ్రేమ్ రేట్స్‌తో ఆడుకోవచ్చు. మల్టీటాస్కింగ్ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ చాలా వేగంగా స్పందిస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M47 మొబైల్ సరికొత్త Android 16 ఆధారిత One UI సాఫ్ట్‌వేర్‌తో రానుంది. అంతేకాకుండా, ఇందులో బేస్ వేరియంట్ లోనే 8GB RAM, 128GB స్టోరేజ్ అందించే అవకాశం ఉంది. ఈ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ భారీ ర్యామ్ కలయిక వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని యాప్స్ రన్ అవుతున్నా ఫోన్ ఎక్కడా స్లో అవ్వదు.

కొన్ని లీక్స్ ప్రకారం ఈ ఫోన్ కేవలం ప్రాసెసర్ పరంగానే కాకుండా మిగిలిన ఫీచర్లలోనూ అదరగొట్టనుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడినAMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, ఫ్రంట్ వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, శామ్‌సంగ్ ‘M’ సిరీస్ మార్కుకు తగ్గట్టుగా ఇందులో 6000mAh భారీ బ్యాటరీ ఉండగా.. దీనికి 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా శామ్ సంగ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో రాబోతున్న శామ్‌సంగ్ గెలాక్సీ M47 మొబైల్.. బడ్జెట్ ధరలో (సుమారు రూ. 20,000 నుంచి రూ.23,000 లోపు) బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆశించే గేమర్స్‌కు మరియు యూజర్స్‌కు ఒక అద్భుతమైన ఆప్షన్ కానుంది.

లష్కర్‌ కీలక కమాండర్‌ను లేపేసిన అజ్ఞాత సాయుధులు.. తర్వాత ఎవరు?

Mir Shukr Khan Raisani
Mir Shukr Khan Raisani

Mir Shukr Khan Raisani: పాకిస్తాన్‌లో అన్నీ అధోగతికి వెళ్తున్నాయి. రెండు విషయాలు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మొదటిది ఆర్థిక సంక్షోభం. ఎన్ని ప్రయత్నాలు చేసిన పాకిస్తాన్‌ రోజు రోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. రెండోది అజ్ఞాత సాయుధలు కడతేర్చే భారత వ్యతిరేక, జిహాదీ మతోన్మాదన ఉగ్రవాదులను లేపేస్తున్నారు. పాకిస్తాన్‌ ఆర్థిక సమస్యలను పరిష్కరించడం లేదు. ఇదే సమయంలో అజ్ఞాత సాయుధులను కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా మరో దాడి జరిగింది.

సంబురాల వేళ కీలక కమాండర్‌..
తాజాగా పాకిస్తాన్‌ పది రోజుల పండుగ చేసుకుంటోంది. గతేడాది భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో విజయం సాధించామని చెప్పుకుంటూ ఈ పండుగ చేసుకుంటోంది. భారత దాడుల్లో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్తాన్‌ ప్రతిదాడులను కూడా భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదే సమయంలో ఆ దేశంలోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఎయిర్‌ బేస్‌లు తుక్కుతుక్కు అయ్యాయి. ప్యాచ్‌లు వేసుకుని కవర్‌ చేసింది. కానీ పాక్‌ ప్రజలను ఏమార్చేందుకు తామే విజయం సాధించినట్లు పండుగ చేస్తోంది.

బలూచ్‌ వేడుకల్లో..
పాకిస్తాన్‌లోని అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్‌ రాజధాని ఖ్వెట్టాలో తాజాగా మర్కయా హఖ్‌ పేరుతో సంబురాలు నిర్వహించింది. ఇందులో లష్కర్‌ ఎ తోయిబా కీలక నేత బలూచిస్తాన్‌ ఇన్‌చార్జి హఫీజ్‌ ఇంద్రిస్‌ మోహల్‌తోపాటు భారత దేశంలో అనేక దాడులు నిర్వహించిన కరుడుగట్టిన జిహాదీ ఉగ్రవాది మీర్‌ షుకర్‌ఖాన్‌ రైసా ఉన్నాడు. వేడుకలు ఘనంగా జరిగాయి. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. పటాకులు కాల్చారు. రాత్రి సమావేశం ముగిసింది. కుర్చీలు తీస్తుండగా మీర్‌ షుకర్‌ఖాన్‌ రైసా శవమై కనిపించాడు. ఎవరు చంపారో తెలియదు. కానీ లేపేశారు.

పాక్‌ సైనికులు కూడా..
ఇదిలా ఉంటే బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన సాయుధలు పాకిస్తాన్‌ సైనికులను కూడా ఇదే సమయంలో లేపేశారు. ఒకవైపు ఉగ్రవాది మతమవ్వగా మరోవైపు మర్కయా హఖ్‌ బలూచిస్తాన్‌ పేరుతో బీఎల్‌ఏ సైనికులను చంపేసింది.

అజ్ఞాత సాయుధులకు భయపడి ఇప్పటికే ఉగ్రవాద సంస్థల కీలక నాయకులు అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాత సాయుధులకు భయపడుతున్నారు. ఇప్పటికే వందకుపైగా భారత వ్యతిరేక, ఉగ్రవాదులు అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోయారు. మరోవైపు హఫీజ్‌ ఇంద్రిస్‌ మోహల్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తానికి అజ్ఞాత సాయుధులు పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులతో ఉ*చ్చ పోయిస్తున్నారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ని అలా వాడేస్తున్న జగన్!

Byreddy Siddharth Reddy
Byreddy Siddharth Reddy

Byreddy Siddharth Reddy YSRCP role: కర్నూలు జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇటీవల కర్నూలు నగరంలో పర్యటించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంత్రిగా ఉన్న టీజీ భరత్ పైనే ఆరోపణలు చేశారు. అనేక రకాల విమర్శలు చేశారు. అదే స్థాయిలో టిడిపి నుంచి ఆయనపై కౌంటర్ అటాక్ ప్రారంభం అయింది. ఏదైనా వివాదం సృష్టించాలి అనుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రంగంలోకి దిగుతారు అనేది టిడిపి నేతలు వాదన. జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్న మనిషిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై ఒక విమర్శ ఉంది. దానినే గుర్తు చేస్తున్నారు టిడిపి నేతలు. ఆయన కంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సోదరి, అంటే పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం చట్టసభలకు ఇంతవరకు ఎన్నిక కాలేకపోయారు.

రాజకీయంగా ప్రత్యేక ప్రస్థానం..
కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఉంది. ఆ ఫ్యామిలీ ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తండ్రి కూడా ఎమ్మెల్యేగా వ్యవహరించారు. మంత్రి పదవి చేపట్టారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం టిడిపి ద్వారా ఎన్నో పదవులు పొందారు. చట్టసభలకు ఎన్నికయ్యారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కుమారుడే సిద్ధార్థ రెడ్డి. ఆయనపై పలుమార్లు కేసులు నమోదయ్యాయి. ఫ్యాక్షన్ తరహాలో కామెంట్స్ చేస్తుంటారు. తనకు జైలు జీవితం కొత్త కాదు అన్నట్టు మాట్లాడుతుంటారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలోనే సిద్ధార్థ రెడ్డి సైతం వైసీపీలో చేరారు. అయితే రాజశేఖర్ రెడ్డి తిరిగి బిజెపిలోకి వచ్చి అక్కడి నుంచి.. టిడిపిలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన కుమార్తె ఎంపీగా ఉన్నారు.

మూడు ఎన్నికల్లోను అవకాశం లే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. పిట్ట కథలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. అయితే చట్టసభలకు ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. పక్క జిల్లాల్లో సైతం చాలామంది నేతలకు అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఉద్దేశపూర్వకంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. మరి అటువంటిప్పుడు సిద్ధార్థ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వచ్చు కదా. లేకుంటే వేరే అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించవచ్చు కదా? అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. 2014లో ఛాన్స్ దక్కలేదు. 2019లో అవకాశం ఇవ్వలేదు. 2024లో పరిగణలోకి తీసుకోలేదు. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగానే తపన పడుతున్నారు. ఎక్కడైనా వివాదాస్పద అంశాలను హైలెట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ప్రయోగిస్తారన్న టాక్ ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

ఓటరు జాబితా ప్రక్షాళన.. వైసీపీకి షాక్

YSR Congress Party
YSR Congress Party

Shock to YCP: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం కానుంది. గతంలో తప్పుడుగా నమోదు చేసిన ఓట్లు, బినామీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు తొలగించనున్నారు. ఎటువంటి లోపాలకు తావివ్వకుండా పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనిని అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దొంగ ఓట్ల తొలగింపు అనేది ఆహ్వానించ దగ్గది అయినా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకో భయపడుతోంది. అయితే గతంలో తమ హయాంలో నమోదైన ఓట్లు తొలగిస్తారు అన్న భయం ఆ పార్టీని వెంటాడినట్టు ఉంది. అయితే కచ్చితంగా అవి పారదర్శకమైన ఓట్లు అయితే ఎవరూ తొలగించలేరు. ఇప్పుడు వైసీపీ భయం చూస్తుంటే మాత్రం.. ఆ ఓట్లపై అనుమానం కలుగుతోంది.

ప్రత్యర్థి ఓట్ల తొలగింపు..
అప్పట్లో ఐపాక్ ద్వారా ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరుల ఓట్లను తొలగించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫారం 7 సమర్పించి చాలా తప్పిదాలకు పాల్పడ్డారు. అదే సమయంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. కానీ ఇప్పుడు అటువంటి ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఓటర్ల తొలగింపు ప్రక్రియపై కోర్టుల్లో పిటిషన్లు వేయించేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే తమ ఓట్లు పోతాయి అనేదానికంటే.. ఎందుకో భయపడుతున్నట్టు అర్థం అవుతోంది. అప్పట్లో నమోదు చేసిన ఓట్లు తొలగిస్తారు అన్న ఆందోళన స్పష్టమవుతోంది.

ఆ 40 శాతం లో గల్లంతయితే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు 40 శాతం ఓట్లు వచ్చినట్లు సగర్వంగా చెబుతోంది. అవే ఓట్లు తమకు ఈసారి స్థిరంగా ఉండి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు చిక్కి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. అయితే ఇప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళనతో ప్రతి నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించే అవకాశం ఉంది. అందులో వైసిపి హయాంలో నమోదు చేసినవి రద్దు అయితే మాత్రం వైసీపీకి ఇబ్బందికరమే. పైగా ఈ ఓటర్ జాబితా ప్రక్షాళన అనేది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఆపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామి. ఈ కారణాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది. అందుకే ఈ ప్రక్రియ పై కోర్టుకు వెళ్లేందుకు ఆ పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

జగన్ కోసం చండీగఢ్ జ్యోతిష్యుడు!

YS Jagan astrologer consultation
YS Jagan astrologer consultation

YS Jagan astrologer consultation: తమిళనాడులో విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడం వల్ల అక్కడ విజయ్ అధికారంలోకి వచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే డ్రెస్ సెన్స్ విజయ్ ది అని మాజీ మంత్రి రోజా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక్క గెలుపు లోనే కాదు.. ఆ గెలుపు వెనుక ఉన్న వ్యూహాలను ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు వల్ల.. ఆయన ఇచ్చిన సూచనలు పాటించడం వల్ల తక్కువ వ్యవధిలోనే అధికారంలోకి వచ్చారు అని జగన్మోహన్ రెడ్డికి తెలిసిందట. అందుకే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి జ్యోతిష్యుడిని రప్పించి తన భవిష్యత్తును తెలుసుకునే పనిలో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి కి వచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు ఒకరు జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తప్పకుండా అధికారం వరిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

విజయ్ గెలుపుతో..
విజయ్ గెలుపు వెనుక ఒక జ్యోతిష్యుడు ఉన్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చండీగఢ్ నుంచి రుద్ర కరణ్ ప్రతాప్ అనే జ్యోతిష్యుని ప్రత్యేకంగా తాడేపల్లి కి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆ జ్యోతిష్యుడు జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలను మరిచి.. జ్యోతిష్యులను జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నట్టు కనిపిస్తున్నారు ఈ వ్యవహారంతో. అయితే గతంలోనూ ఈ జ్యోతిష్యుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో.. కచ్చితంగా సీఎం అవుతారని.. అధికారంలోకి వస్తారని తేల్చి చెప్పారు. కానీ అది జరగలేదు. అయినా సరే ఇప్పుడు పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గతంలో ప్రత్యేకంగా..
గతంలో జగన్మోహన్ రెడ్డికి విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద పూజలు చేయించేవారు. అటు తరువాత చాలామంది జ్యోతిష్యులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జ్యోతిష్యం చెప్పేవారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తరచూ జగన్మోహన్ రెడ్డి కోసమే అన్నట్టు మాట్లాడేవారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. దారుణ ఓటమికి గురికావడంతో ట్రోల్స్ కు గురయ్యారు. ఒకటి రెండుసార్లు వేణు స్వామి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటే వాహనాల్లో ప్రయాణం చేశారు. అంతలా ప్రాధాన్యం ఉండేది జ్యోతిష్యులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే ఇప్పుడు ఏకంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి జ్యోతిష్యుని దించారు. గెలుపు అందుకోవాలని చూస్తున్నారు. అన్నింటికీ మించి తన వ్యక్తిగత కేసుల విషయంలో సైతం ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. అందుకు సంబంధించి దోష నివారణపై కూడా ఆయన నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్నారట. మొత్తానికి అయితే పొలిటికల్ స్ట్రాటజిస్టులు పోయి ఆస్ట్రాలజిస్టులు వచ్చారన్నమాట.