Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు శని జయంతి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాజు వారికి ఈరోజు ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగి అవకాశం ఉంటుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అయితే కొన్ని విషయాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖర్చులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. శని దేవుడి అనుగ్రహం ఉండడంతో కొత్త పనులను ప్రారంభిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అధికారుల నుంచి వేధింపులు తగ్గిపోతాయి. అన్ని పనులు పూర్తికావడంతో మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు కొన్ని విషయాల్లో ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. అయితే శని దేవుడు ఒక్కోసారి సహనం పరీక్షించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుకోవడమే మంచిది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి కొన్ని సమస్యలు బాధపెడతాయి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రశాంతమైన జీవితం కోసం ప్రయత్నించాలి. ఎటువంటి విషయాల్లో కూడా ఆందోళన చెందవద్దు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు చెక్కబడతాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి శని దేవుడి ఆశీస్సులు ఉంటాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయపాలన సందర్భంగా తొందరగా పూర్తి చేయడం అవసరం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వ్యవహరించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని శుభవార్తలో విని అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అన్ని శుభ ఫలితాలే ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దేవుడి ఆశీస్సులు ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని ప్రయోజనాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యంగా ఉండకూడదు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రశాంతమైన వాతావరణం లో గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. శని దేవుడి అమావాస్య సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు చేసే కొన్ని పనులకు అధికారుల మద్దతు ఉండడంతో వెంటనే పూర్తవుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : శని దేవుడి జయంతి సందర్భంగా ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా శుభాలే జరుగుతాయి . అయితే తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగులు తోటి వారి సహాయంతో అన్ని పనులను పూర్తి చేస్తారు.
