Mamata Banerjee: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి సొంత రాష్ట్రం మీద విపరీతమైన ప్రేమ ఉండాలి. ఓటు వేసి గెలిపించిన ప్రజల మీద అపారమైన గౌరవం ఉండాలి. మాతృభూమి అభివృద్ధి కోసం రకరకాల పనులు చేయాలి. అలాంటివారు జనాల్లో ఉండిపోతారు. జనాల మదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. కానీ కొంతమంది అధికారంలోకి రాకముందు మాతృ భూమిని ప్రేమిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వేషాన్ని పెంచుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. చివరికి జనాలు వద్దని ఓడిస్తే.. తలవంచుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వచ్చింది.
బెంగాల్ రాష్ట్రాన్ని 15 సంవత్సరాల పాటు మమత బెనర్జీ పరిపాలించారు.. 15 సంవత్సరాల కాలంలో మమత ఎంత చేయాలో అంత చేశారు. మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర లేపారు. చివరికి తాను ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఔన్నత్యాన్ని కూడా దెబ్బతీశారు. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఆ మూలాలను తొలగిస్తోంది. శుభ్రమైన బెంగాల్ రాష్ట్రాన్ని నిర్మిస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే బెంగాల్ రాష్ట్రంలో స్వచ్ఛభారత్ చేస్తోంది.
మమత బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిస్వా బంగ్లా అనే లోగోను ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర చిహ్నంగా ప్రకటించారు. 2013 సెప్టెంబర్ 16న బిస్వా బంగ్లా బ్రాండ్ లోగోను మమత మొదలుపెట్టారు. బి అనే బెంగాలీ అక్షరం చుట్టూ సంస్కృతి.. సంప్రదాయాలు.. చేతి వృత్తులకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఈ లోగో రూపొందించారు. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ లోగో అధికారిక బ్రాండింగ్ చిహ్నంగా ఉండేది.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లోగో స్థానంలో కొత్త లోగోను తెచ్చారు.. మన దేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఆ లోగో స్థానంలో ఏర్పాటు చేస్తున్నారు. బెంగాల్ రాష్ట్రంలో ఉన్న సాల్ట్ లేక్ స్టేడియంలో బిస్వా బంగ్లా లోగోను తొలగించి దాని స్థానంలో జాతీయ చిహ్నాన్ని అమర్చారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. బెంగాల్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిజిటల్ వేదికలలో కూడా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిజెపి ప్రభుత్వం ఈ లోగోలో తెలుపు, నీలం రంగుల స్థానంలో కాషాయం రంగును జత చేసింది.
The ‘Biswa Bangla’ logo has been removed from the Salt Lake stadium in Kolkata. Its been replaced by India’s national emblem – the Ashok Stambh
Biswa Bangla logo was introduced by former CM Mamata Banerjee as the state emblem for Bengal pic.twitter.com/dSGg4ViC9Q
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) May 16, 2026
















విజయ్ సీఎం అవ్వడం పై నాకు నిజంగా ఎలాంటి అసూయ లేదు - రజినీకాంత్
Rajinikanth: తమిళనాడు మీడియా లో ఎప్పటి నుండో జోరుగా సాగుతున్న చర్చ, రజినీకాంత్ , విజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని. నాలుగు దశాబ్దాల పాటు , పోటీ అనేదే లేకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ ని శాసించిన రజినీకాంత్ కి , 2004 లో విజయ్ స్టార్ గా రైజ్ అవ్వడం అసలు నచ్చలేదని , ఇతను ఎప్పటికైనా తనను దాటేస్తాడేమో అనే భయం రజిని లో ఉండేదని, 2017 తర్వాత విజయ్ ఏకంగా తనని దాటేయడం రజినీకాంత్ కి నిద్ర లేకుండా చేసిందని , అప్పటి నుండి విజయ్ పై ఆయన అసూయ తో రగిలిపోతున్నాడని , ఎన్నికల్లో విజయ్ పార్టీ గెలిచినా తర్వాత , రజినీకాంత్ స్టాలిన్ వద్దకు వెళ్లి అన్నా డీఎంకే తో పొత్తు పెట్టుకొని మీరే ప్రభుత్వాన్ని స్థాపించండి అని చెప్పాడని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.
వీటిపై రజినీకాంత్ ఇన్ని రోజులు స్పందించలేదు కానీ , నేడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ అంశంపై ఆయన స్పందించడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ ‘విజయ్ కి నాకు పాతికేళ్ల వయస్సు తేడా ఉంది. అంటే రెండు తరాల తేడా ఉంది మా ఇద్దరి మధ్య. మీడియా లో విజయ్ సీఎం అవ్వడం పై నేను అసూయ తో ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. ఇది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేనెందుకు విజయ్ పై అసూయ పడుతాను?, కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడుతా , ఎందుకంటే అతను నా తరానికి చెందిన వాడు కాబట్టి. విజయ ఎంజీఆర్, ఎన్టీఆర్ కూడా సాధించలేనిది అతి తక్కువ సమయంలో సాధించి చూపించాడు. కేంద్రం లో బీజేపీ ని, తమిళనాడు లో రెండు పెద్ద తమిళ ద్రవిడ పార్టీలను ఎదురుకొని సీఎం అవ్వడం అనేది ఆశా మాషీ విషయం కాదు’.
‘నేను స్టాలిన్ ని కలిసి , మీ డీఎంకే అన్నా డీఎంకే తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని, నేను ఈ రెండు పార్టీలకు ఉమ్మడి సీఎం గా ఉంటానని చెప్పినట్టు గా కూడా మీడియా లో వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు సృష్టించడం చాలా పెద్ద తప్పు. స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు , అతను కొళత్తూర్ లో ఓడిపోవడం నాకు చాలా బాధని కలిగించింది , కేవలం స్నేహ భావం తోనే అతన్ని కలిసాను కానీ , విజయ్ ని తొక్కేయాలని నేను రాజకీయాల్లోకి రావాలని కాదు, దయచేసి ఇది అర్థం చేసుకోగలరు’ అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.