Home Blog Page 265

ట్రంప్‌ స్టాక్‌ ట్రేడ్స్‌.. అక్రమ ఆదాయం కోసం అధికార దుర్వినియోగం!

Trump Stock Trades
Trump Stock Trades

Trump Stock Trades: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లోనూ ట్రంప్‌ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అధ్యక్షుడి కన్నా ముందు వ్యాపార వేత్తగా ఉన్న ట్రంప్‌ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా ట్రంప్‌ అధ్యక్ష హోదాలో అక్రమ ఆదాయం కోసం యత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.2026 జనవరి–మార్చి మధ్య ట్రంప్‌ తరపున సుమారు 3,700 లావాదేవీలు జరిగాయని యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎథిక్స్‌ బహిర్గతం చేసింది. ఈ ట్రాన్సాక్షన్ల మొత్తం 220 మిలియన్‌ డాలర్ల నుంచి 750 మిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. టెక్‌ షేర్లు, కాంట్రాక్టర్‌ కంపెనీలు, బోయింగ్‌ వంటి సంస్థల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు–అమ్మకాలు జరిగాయి.

ట్రంప్‌పై విమర్శల వెల్లువ..
ఈ అక్రమాల వెల్లడి తర్వాత ప్రతిపక్ష డెమోక్రాట్లు, సెనేటర్‌ ఎలిజబెత్‌ వారెన్‌ వంటి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్రంప్‌ అధికారపు నిర్ణయాలు తన స్టాక్‌ లాభాలకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని ఆరోపణలు చేశారు. జనవరి 6న ఒక మిలియన వరకు ఎన్‌విడా షేర్లు కొన్నారని ఫైలింగ్స్‌ చూపిస్తున్నాయి. దాదాపు ఒక వారం తర్వాత అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఎన్‌విడా ఏ200 ఏఐ చిప్స్‌ చైనాకు అమ్మకాలను అనుమతించింది. ఫిబ్రవరి 10న మరో పెద్ద కొనుగోలు జరిగి, తర్వాత మెటాతో ఎన్‌విడా పెద్ద డీల్‌ ప్రకటన వచ్చింది.

చైనా పర్యటన అందుకోసమేనా?
ట్రంప్‌ చైనా సందర్శనలో ఎన్‌విడా సీవో జెన్సెన్‌ హువాంగ్‌ను తీసుకెళ్లడం, స్టాక్‌ హోల్డింగ్‌తో కలిసి రాజకీయ లాభం కోసం చేసిన చర్యగా విమర్శలు వచ్చాయి. పాలంటిర్‌ వంటి కాంట్రాక్ట్‌ సంస్థల షేర్లు ప్రభుత్వ డీల్స్‌ సమయంలో కొనడం కూడా సందేహాలు రేకెత్తించింది. అయితే ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం, ఈ ఇన్వెస్ట్‌మెంట్లు మూడవ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. బ్లైండ్‌ ట్రస్ట్‌ లాంటి వ్యవస్థలో అధ్యక్షుడు నేరుగా నిర్ణయాలు తీసుకోరు. ఎరిక్‌ ట్రంప్‌ వంటి కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను రాజకీయ ప్రచారంగా కొట్టిపారేశారు. అధికారిక నిర్ణయాలు జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి ఆధారంగా తీసుకుంటారని వాదన.

ఎంతవరకు అవినీతి?
అధ్యక్షుడి స్థాయిలో ఇంత పెద్ద స్టాక్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్‌ (రోజుకు 40+ ట్రేడ్లు) సంఘర్షణల అవకాశాలను పెంచుతుంది. టైమింగ్‌ సందేహాలు రేకెత్తించడం సహజం.
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సెక్టర్ల (టెక్‌ ఎక్స్‌పోర్ట్స్, డిఫెన్స్‌ కాంట్రాక్ట్స్‌)లో ఇన్వెస్ట్‌ చేయడం ఎలైట్‌లకు ప్రయోజనం కల్పించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకున్నారు. ట్రంప్‌ ముందు బాండ్లలో ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు స్టాక్స్‌కు మారడం మార్కెట్‌ ట్రెండ్‌తో సమానంగా ఉండవచ్చు.

ఈ ఘటన యాజమాన్య పారదర్శకత, ఎథిక్స్‌ నియమాల గురించి మళ్లీ చర్చనీయాంశం చేసింది. ఆరోపణలు రాజకీయంగా ఉన్నప్పటికీ, అధికారుల ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రవర్తనపై కఠినమైన నియమాల అవసరాన్ని హైలైట్‌ చేస్తున్నాయి. ఇది నిజమైన అవినీతి కాదా లేదా సాధారణ మార్కెట్‌ యాక్టివిటీ కాదా అనేది ఇంకా స్వతంత్ర దర్యాప్తు అవసరమైన విషయం. ఈ సంఘటన అమెరికా రాజకీయాల్లో ఉద్రిక్తతను మరింత పెంచుతుంది.

అమెరికా అక్కసు.. మన వీసా దేవుడికి అంతర్జాతీయ గుర్తింపు..!

Chilkur Balaji Temple
Chilkur Balaji Temple

Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉన్న ఆలయం. విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఉద్యోగాలు రావాలని మొక్కుకునేవారు ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా మొక్కుకున్నవారిలో 80 శాతం మంది కోరికలు నెరవేరినట్లు ఆలయం అధికారులు, భక్తులు తెలిపారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే చిలుకూరు బాలాజీ వీసా దేవుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు మన దేవుడికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికా సెనేటర్‌ ‘వీసా కార్టెల్‌’ ఇందుకు కారణం. హెదరాబాద్‌ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయం భారతీయులకు కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ఎంతోమంది యువకులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ అమెరికా వీసా కలలను సాకారం చేసుకోవడానికి ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయం గురించి ఫ్రాన్స్‌ 24 అధికారిక చానల్‌ విశేష రిపోర్ట్‌ చేసింది. దీనిని ‘Visa Temple’గా పిలిచి, విశ్వాసం ఆధారంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి వీసా కోసం, 108 ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతలు తెలిపే సంప్రదాయాన్ని వివరించింది.

అమెరికా సెనేటర్‌ అక్కసు..
అయితే, ఇదే ఆలయాన్ని అమెరికా సెనేటర్‌ ఎరిక్‌ ష్మిట్‌ తీవ్రంగా విమర్శించారు. హెచ్‌–1బీ వీసాలు, భారతీయ ఐటీ వృత్తులపై తన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఈ ఆలయాన్ని ‘Visa Cartel’గా అభివర్ణించాడు. భక్తుల ప్రార్థనలను ఎగతాళి చేశారు. ఇది కేవలం ఒక ఆలయం గురించి మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతి, విశ్వాసాలు, వలస విధానాలపై జరుగుతున్న వివాదాన్ని ప్రతిబింబిస్తోంది.

చిలుకూరు బాలాజీ వెనుక చిన్న కథ.
చిలుకూరు బాలాజీ ఆలయం సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయం. ఇక్కడ హుండీ లేదు, డబ్బు స్వీకరణ లేదు, వీఐపీలకు ప్రత్యేకత లేదు. అందరూ ఒకే సామాన్య భక్తులుగా ప్రదక్షిణలు చేస్తారు. 1980–90లలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు వీసా వైఫల్యాల తర్వాత ఇక్కడ ప్రార్థన చేసి విజయం సాధించడంతో ’వీసా బాలాజీ’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు రోజుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఫ్రాన్స్‌ 24 రిపోర్ట్‌లో ఈ విశ్వాసాన్ని గౌరవంగా చిత్రీకరించారు. ఇది భారతీయుల ’అమెరికన్‌ డ్రీమ్‌’ను సూచిస్తుందని, కష్టాలు, నమ్మకం మధ్య జరిగే ప్రయాణాన్ని హైలైట్‌ చేశారు.సెనేటర్‌ వ్యాఖ్యల వెనుక రాజకీయాలుఎరిక్‌ ష్మిట్‌ వ్యాఖ్యలు హెచ్‌–1బీ వీసా వ్యవస్థపై జరుగుతున్న అమెరికా రాజకీయ చర్చలో భాగం.

అమెరికా ఉద్యోగాల్లో ఆధిపత్యం..
అమెరికాలో ఉద్యోగాలు, టెక్‌ సెక్టర్‌లో భారతీయుల ఆధిపత్యం, వీసా దుర్వినియోగం అనే అంశాలపై రిపబ్లికన్‌ సెనేటర్లు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంలో చిలుకూరు ఆలయ ఫోటోను పోస్ట్‌ చేసి ‘వీసా కార్టెల్‌కు సొంత వీసా ఆలయం ఉంది‘ అని వ్యాఖ్యానించడం భారతీయులను కలచివేసింది. ఇది భారతీయ విశ్వాసాలను ఎగతాళి చేయడమే. సాంస్కృతిక అసహనాన్ని ప్రదర్శించడం.
వీసా సమస్యలను మతపరమైన దృక్పథంతో చూడడం అని చెప్పవచ్చు.

భారతీయ సమాజంలో ఆలయాలు, దేవుళ్లు కేవలం మతపరమైనవి కాకుండా, సామాజిక, మానసిక మద్దతు అందించే కేంద్రాలు. వీసా, ఉద్యోగం, వివాహం వంటి జీవిత సమస్యల్లో విశ్వాసం బలాన్నిస్తుంది. ఫ్రాన్స్‌ రిపోర్ట్‌ ఈ మానవీయ కోణాన్ని అర్థం చేసుకుంది. కానీ సెనేటర్‌ వ్యాఖ్యలు దీన్ని రాజకీయ ఆయుధంగా మార్చాయి. ఈ సంఘటన రెండు వైపులా ఆలోచింపజేస్తుంది.

సుకుమార్ ను అవమానించిన ప్రొడ్యూసర్... ఆయనతో మళ్ళీ సినిమా చేయలేదుగా...

Sukumar
Sukumar

Sukumar: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో సుకుమార్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను చేసిన సుకుమార్ ప్రస్తుతం మరోసారి రామ్ చరణ్ తో జతకట్టబోతున్నాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా డిఫరెంట్ గా ఉంటుందని కథ ను సైతం ఫైనల్ చేసి పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ని ఒక ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించాడు అంటూ అతని అభిమానులైతే చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి అది అవమానం కంటే కూడా సినిమా సక్సెస్ అవ్వడానికి తనకి తానే అవమానించుకున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజుగా తెలుస్తుంది. సుకుమార్ అల్లు అర్జున్ తో చేసిన ఆర్య సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడం విశేషం…

ఆర్య సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివర్లో ఒక మాంటేజ్ సన్నివేశం కోసం దిల్ రాజు ను బతిమిలాడాడట. కానీ అప్పటికే ఆ సినిమా మీద అనుకున్న డబ్బులు పెట్టేసాము అని ఇక పెట్టడం చాలా కష్టమని చెప్పడంతో ఏం చేయాలో తెలియని సుకుమార్ దిల్ రాజు కాళ్లు పట్టుకొని మరి ఆ మాంటేజ్ కి డబ్బులు పెట్టించుకొని సినిమాని చేసి సక్సెస్ ఫుల్ గా నిలిపాడు.

అయితే ఇప్పటికి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న సుకుమార్ ఆర్య సినిమా తర్వాత దిల్ రాజు తో మరో సినిమా చేయలేదు. వీళ్ల కాంబోలో సినిమా వస్తుందంటూ గతంలో చాలా వరకు ప్రచారం జరిగినా కూడా అది కార్యరూపం దాల్చలేదు. ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర వహిస్తున్నాడు. కాబట్టే అతనితో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం…

పెద్ది మూవీ ట్రైలర్ లో హైలెట్ అయ్యేది ఆ నటుడేనా..?

Peddi Ticket Price Hike
Peddi Ticket Price Hike

Peddi Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల కంటెంట్ మారిపోయింది. ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాలు చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ తో పాటు మరొక నటుడు కూడా హైలెట్ అవ్వబోతున్నారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ ని హైలెట్ చేస్తూ వచ్చారు. అంటే రామ్ చరణ్ ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు. అసలు సినిమా థీమ్ ఏంటి ఈ మూవీ ఎక్కడ జరుగుతుంది. ఏ సంవత్సరం కాలంలో ఈ సినిమా నడుస్తుంది అనే ఒక సెటప్ అంతా ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేశారు.

కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ క్యారెక్టర్ లోని కెపాబిలిటిని చూపిస్తూనే మీర్జాపూర్ లో మున్నాభాయ్ గా నటించి మెప్పించిన దివ్యాంద శర్మ ఈ సినిమాలో రామ్ బుజ్జి అనే ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఆ పాత్ర సినిమాకి చాలా హైలైట్ గా నిలువబోతుందట. సినిమా మొత్తానికి ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెబుతున్నారు.దానికి తగ్గట్టుగానే ట్రైలర్ లో సైతం దివ్యాంద శర్మ ను హైలెట్ చేస్తూ ట్రైలర్ కట్ అయితే చేశారట.

ఇక ఏది ఏమైనా కూడా అతని పాత్ర ఏంటి అతనికి రామ్ చరణ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ సినిమా స్టోరీకి తను ఎలాంటి కనెక్ట్ అవుతాడు అనే విషయాలన్నిటిని ట్రైలర్లో ప్రస్ఫుటంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారట… మొత్తానికైతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

సమ్మర్ లో EVలు వేడెక్కితే ఏం జరుగుతుందో తెలుసా..

Electric Vehicles Summer Heat
Electric Vehicles Summer Heat

Electric Vehicles Summer Heat: వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) భద్రతపై చాలా మందిలో రకరకాల సందేహాలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల లాగే ఈవీల్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించడం వల్ల అధిక వేడికి ఇవి ప్రమాదాలకు గురవుతాయా అనే భయం ఉంటుంది. అయితే సరైన అవగాహన, జాగ్రత్తలు ఉంటే వేసవిలో కూడా ఈవీలను పూర్తి సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఎండల తీవ్రత పెరిగినప్పుడు ఈవీల పనితీరు ఎలా ఉంటుంది, ఏయే వాహనాలు సురక్షితంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

సాధారణంగా పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. అయితే వేసవిలో 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఎండలు ఉన్నప్పుడు, బ్యాటరీలపై అదనపు ఒత్తిడి పడుతుంది. నాణ్యత లేని లోకల్ బ్యాటరీలు, మోడిఫైడ్ వైరింగ్ లేదా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) లోపాలు ఉన్నప్పుడు మాత్రమే వేడి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. బ్రాండెడ్ , గుర్తింపు పొందిన కంపెనీల వాహనాల్లో ఇవి చాలా అరుదుగా జరుగుతాయి.

ఎండ తీవ్రతకు తోడు కారును లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో బ్యాటరీ వేడిని నియంత్రించలేకపోతే ‘థర్మల్ రన్‌అవే’ (Thermal Runaway) అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే ఒక బ్యాటరీ సెల్ వేడెక్కి పక్కన ఉన్న సెల్స్‌కు ఆ వేడిని వేగంగా బదిలీ చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ ఉబ్బిపోవడం, దట్టమైన పొగ రావడం లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే, ఆధునిక కార్లలోని సిస్టమ్ బ్యాటరీ వేడెక్కగానే కారు పవర్‌ను తగ్గించడం లేదా ఛార్జింగ్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేయడం చేస్తుంది.

భారతదేశంలో విక్రయించే ఎలక్ట్రిక్ కార్లకు ప్రభుత్వం ‘AIS-156’ అనే కఠినమైన భద్రతా ప్రమాణాలను తప్పనిసరి చేసింది. దీని ప్రకారం కంపెనీలు అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీని వాడుతున్నాయి.

లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ : టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon ev), పంచ్ ఈవీ, మహీంద్రా XUV400, మరియు BYD అటో 3 వంటి ప్రముఖ కార్లలో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో బ్యాటరీ చుట్టూ ప్రత్యేకమైన కూలెంట్ ద్రవం ప్రవహిస్తూ బ్యాటరీని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుతుంది.

LFP బ్యాటరీ సాంకేతికత: టాటా, ఇతరులు వాడుతున్న LFP (Lithium Iron Phosphate) బ్యాటరీలు భారతీయ వేసవి వాతావరణానికి బాగా తట్టుకుంటాయి. ఇవి ఇతర NMC బ్యాటరీల కంటే ఎక్కువ వేడిని (సురక్షితంగా) భరించగలవు.

వేసవిలో ఈవీలు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
లాంగ్ డ్రైవ్ లేదా ఎండలో ప్రయాణించి వచ్చిన వెంటనే కారును ఛార్జింగ్‌కు కనెక్ట్ చేయవద్దు. కారును కనీసం 45 నుండి 60 నిమిషాల పాటు నీడలో పార్క్ చేసి, బ్యాటరీ చల్లబడిన తర్వాతే ఛార్జ్ చేయాలి. కారును వీలైనంత వరకు నేరుగా ఎండ తగలకుండా చెట్ల కిందనో లేదా ఇండోర్ పార్కింగ్‌లోనే ఉంచాలి. ఛార్జింగ్ పాయింట్ కూడా మంచి గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో ఉండాలి. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య తీవ్రమైన ఎండలు ఉంటాయి. ఈ సమయంలో ‘డీసీ ఫాస్ట్ ఛార్జింగ్’ (DC Fast Charging) వాడటం తగ్గించాలి. రాత్రి వేళల్లో లేదా ఉదయాన్నే హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవడం బ్యాటరీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవి కాలంలో రోజువారీ వాడకం కోసం బ్యాటరీని 80% వరకు ఛార్జ్ చేయడం ఉత్తమం. నిరంతరం 100% ఛార్జ్ చేసి ఎండలో ఉంచితే బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది.

ఈ ఏడాది చివరి నాటికి Tata నుంచి కొత్త తరహా కారు..

Tata Motors
Tata Motors

Tata Motors: భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 (పెట్రోల్ 80శాతం, ఇథనాల్ 20 శాతం)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో దీనిని E85 లేదా పూర్తి స్థాయిలో E100కు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ఇలాంటి కార్లనే తయారు చేస్తున్నాయి. అలాంటి వాటిలో TATA ఒకటి. దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ నుంచి E20 కార్లు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే…

టాటా మోటార్స్ 2023 నుంచే తమ అన్ని వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా మార్చేసింది. కేవలం ఇథనాల్‌తోనే ఆగకుండా ఎలక్ట్రిక్ (EV), సీఎన్‌జీ (CNG), హైడ్రోజన్ వంటి బహుళ పర్యావరణహిత ఇంధన వనరులపై సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో టాటా ప్రదర్శించిన ‘పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్’ (Tata Punch Flex-Fuel) వాహన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.

సాధారణ టాటా పంచ్ కారులో ఉండే 1.2 లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ నే ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌లోనూ ఉపయోగించారు. అయితే, ఇథనాల్‌ స్వభావం పెట్రోల్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంజిన్ దెబ్బతినకుండా టాటా ఇంజనీర్లు కీలక మార్పులు చేశారు. ఇంధనంలో ఇథనాల్ శాతం ఎంత ఉందో ఆటోమేటిక్‌గా గుర్తించి, దానికి తగినట్లుగా ఇంజిన్ పనితీరును ఇది మారుస్తుంది. ఇథనాల్ వల్ల తుప్పు పట్టకుండా ఉండేందుకు ఫ్యూయల్ లైన్లు, పంపులు, ఇంజెక్టర్లను ప్రత్యేక మెటీరియల్‌తో తయారు చేశారు. ఇథనాల్ దహన ప్రక్రియ తర్వాత వచ్చే ఉద్గారాలను సమర్థంగా నియంత్రించేలా ఎగ్జాస్ట్ (సైలెన్సర్) వ్యవస్థను రీ-డిజైన్ చేశారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex-Fuel)వాహనాల వల్ల ఒకే వాహనం 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ లేదా పెట్రోల్-ఇథనాల్‌ కలిసిన ఏ ఏ నిష్పత్తి మిశ్రమంతోనైనా (ఉదాహరణకు E85 లేదా E100) ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్తుంది. ఇథనాల్ అనేది చెరకు రసం, మొలాసిస్, పాడైపోయిన ధాన్యాలు (మొక్కజొన్న, విరిగిన బియ్యం) వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారయ్యే ఒక రకమైన బయో-ఫ్యూయల్ (జీవ ఇంధనం). పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మండటం వల్ల కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.మరోవైపు ఇథనాల్ తయారీకి వ్యవసాయ వ్యర్థాలు, పంటలు అవసరం కాబట్టి దేశీయ రైతులకు అదనపు ఆదాయ వనరు లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. టాటా మోటార్స్ ప్రదర్శించిన పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్.. భారతదేశం స్వయంసమృద్ధి, హరిత భవిష్యత్తు వైపు వేగంగా అడుగులు వేస్తోందనడానికి ఒక బలమైన నిదర్శనం.

విజయ్ కి త్రిష.. మాళవికకు ఎవరు? ఓరేయ్ మీరు జర్నలిస్టులా? ఏంట్రా ఇదీ

Malavika Mohanan And Vijay
Malavika Mohanan And Vijay

Malavika Mohanan And Vijay: బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టే వాళ్లను ఏమంటారు.. అసలు లేని సంబంధాన్ని అంటగట్టే వాళ్లను ఏమంటారు.. ఇప్పటి కాలంలో అయితే జర్నలిస్టులు సారీ సారీ సో కాల్డ్ సన్నాసులు అనాలేమో.. పైగా తాము పాత్రికేయాన్ని ఉద్దరిస్తున్నట్టు.. తాము ఉద్దండులం అన్నట్టు వీళ్ళ బిల్డప్ లు కొనసాగుతుంటాయి.. అసలు ఒక్కడికైనా సక్కగా చదువు వస్తుందా.. కనీసం డిగ్రీ వరకైనా చదువుకున్నారా.. జర్నలిజం పాఠాలు తెలుసా.. ఎలాంటి ప్రశ్నలు వేయాలి.. ఎలా సమాధానాలు తెలుసుకోవాలి.. ఎలాంటి ప్రమాణాలు పాటించాలి.. ఇవేవీ తెలియదు. గొట్టం పట్టుకోగానే ప్రతి ఒక్కడు సర్వంతర్యామి లాగా.. సర్వశక్తి సంపన్నుడిలాగా బిల్డ్అప్ ఇస్తుంటారు.

ఈ తరహా పాత్రికేయంలో తమిళనాడుకు చెందిన పాత్రికేయులు పీహెచ్డీ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలు.. అడుగుతున్న ప్రశ్నలు బి గ్రేడ్ స్థాయి కంటే దారుణంగా ఉన్నాయి. అసలు ఎవరితో మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నామనే సోయి లేకుండా పోతోంది. ఆడవాళ్లను అడగకూడని ప్రశ్నలు అడుగుతున్నారు. వారు ఇబ్బంది పడుతున్నా సరే రాక్షస ఆనందం పొందుతున్నారు. అటువంటిదే ఈ సంఘటన కూడా.

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా విజయ్ కొనసాగుతున్నారు. ఆయనకు మరొక నటికి సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ సంబంధాన్ని బలపరిచే విధంగా వారిద్దరు వివరిస్తున్నారు. అది వారిద్దరి వ్యక్తిగత ఇష్టం. అలా ఉండదు అని చెప్పడానికి ఎవరికీ ఎటువంటి అధికారం లేదు. కానీ కొంతమంది తమిళ పాత్రికేయులకు విజయ్, ఆ నటి వ్యవహారంలో ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. కాకపోతే ఇటువంటి ఆలోచన పాత్రికేయులకు రావడం దుర్మార్గం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరి ప్రైవసీ వారికి ఉంటుంది. దానిని గౌరవించాలి. అలా కాకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది.

మాళవిక మోహనన్ అనే నటి విజయ్ తో కలిసి మాస్టర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ సినిమా తర్వాత మాళవికకు అవకాశాలు వచ్చాయి. మాస్టర్ సినిమాలో విజయ్ తో స్క్రీన్ పంచుకునే అవకాశం కూడా మాళవికకు ఎక్కువ లభించింది. మాళవిక ఇప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కు సంబంధించి తమిళనాడు వచ్చింది. అక్కడ ఆమెకు విలేకరుల నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి..”విజయ్ త్రిషతో వెళ్ళినట్టుగానే.. మీతో కూడా వెళ్తుంటారా.. లేదా మీరు కూడా ఆయనతో వెళ్తుంటారా.. మీరు ఆయనతో వెళ్లినట్టు వార్తలు వచ్చాయి కదా.. దీనిపై మీ స్పందన ఏంటి” ఈ ప్రశ్నను ఓ విలేఖరి మాళవికను అడగగానే ఆమె ముఖం మాడిపోయింది. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ విలేకరి ముఖం ఒకసారి చూసింది.

అక్కడ జనం ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే చెప్పుతో కొట్టేదేమో. తప్పులేదు.. అటువంటి ప్రశ్నలు అడిగే సన్నాసులకు జర్నలిస్టులం అని చెప్పుకునే కనీస అర్హత లేదు. ఇటువంటి వారి వల్లే కదా పాత్రికేయాన్ని ఎవడూ నమ్మనిది.. అసలు ఆ ప్రశ్న ఎలా ఉందంటే.. మీరు కూడా విజయ్ తో సంబంధం కలిగి ఉన్నారు కదా.. అన్నట్టుగా ఉంది. మాళవికకు ఎంతో భవిష్యత్తు ఉంది. రేపట్నాడు ఆమెన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది.. అందువల్లే ఇటువంటి లేకి సన్నాసులు పాత్రికేయంలోకి రాకూడదు. పాత్రికేయులమని చెప్పుకోకూడదు.

ఇంట్లో చికెన్ ను కడుగుతున్నారా..

Chicken Washing Safety
Chicken Washing Safety

Chicken Washing Safety: చికెన్ వండే ముందు దానిని నీటితో బాగా కడగడం చాలా మంది ఇళ్లలో సాధారణ అలవాటు. ముఖ్యంగా ట్యాప్ కింద పెట్టి శుభ్రం చేస్తే మలినాలు పోతాయని భావిస్తుంటారు. అయితే ఆహార భద్రత నిపుణులు మాత్రం ఇది సురక్షితమైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. చికెన్‌ను కడిగే సమయంలో నీటి చిమ్ముర్లు సింక్, కిచెన్ ప్లాట్‌ఫామ్, పాత్రలు, కూరగాయలు వంటి వాటిపై పడుతూ ప్రమాదకరమైన బాక్టీరియాను వ్యాపింపజేస్తాయని చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలుసా?

పచ్చి చికెన్‌పై సాధారణంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మన కంటికి కనిపించవు. ట్యాప్ నీటితో కడిగితే అవి పూర్తిగా పోవు. పైగా నీటి చుక్కల ద్వారా ఇతర ఆహార పదార్థాలకు చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. కడిగిన చికెన్‌ను తాకిన చేతులతో ఇతర వస్తువులను ముట్టుకుంటే కూడా బాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం.. చికెన్‌ను కడగడం కంటే సరైన ఉష్ణోగ్రతలో బాగా వండడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి వల్లే బాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. చికెన్ లోపల భాగం కూడా బాగా ఉడికేలా చూసుకోవాలి. పూర్తిగా ఉడకని చికెన్ తింటే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

చికెన్‌ను కూరగాయలు, పండ్లు, రెడీ టు ఈట్ ఫుడ్‌కు దూరంగా ఉంచడం చాలా అవసరం. పచ్చి మాంసం నుంచి వచ్చే ద్రవాలు ఇతర ఆహారాలపై పడితే క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది. అందుకే ఫ్రిజ్‌లో కూడా చికెన్‌ను మూత ఉన్న డబ్బాలో లేదా కింద షెల్ఫ్‌లో ప్రత్యేకంగా నిల్వ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

కిచెన్‌లో వాడే కట్టింగ్ బోర్డులు కూడా ప్రత్యేకంగా ఉండాలి. చికెన్ కట్ చేసే బోర్డు, కూరగాయలు కట్ చేసే బోర్డు వేర్వేరుగా వాడితే బాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. అలాగే చికెన్ కట్ చేసిన కత్తులను వెంటనే వేడి నీటితో శుభ్రం చేయడం మంచిది. ఒకే బోర్డు, ఒకే కత్తిని శుభ్రం చేయకుండా మళ్లీ వాడటం ప్రమాదకరం.

చికెన్ హ్యాండిల్ చేసిన తర్వాత చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో బాగా కడుక్కోవాలి. అలాగే సింక్, కిచెన్ టాప్, ట్యాప్ హ్యాండిల్స్ వంటి ప్రాంతాలను కూడా శుభ్రపరచాలి. చాలామంది చేతులు కడిగినా కిచెన్ ఉపరితలాలను మర్చిపోతారు. దీంతో అక్కడ ఉన్న బాక్టీరియా మళ్లీ ఇతర ఆహారాలకు చేరే అవకాశం ఉంటుంది.

కొంతమంది చికెన్‌పై నిమ్మరసం, వెనిగర్ లేదా పసుపు వేసి కడిగితే బాక్టీరియా పోతుందని అనుకుంటారు. అయితే ఇవి వాసన తగ్గించడంలో సహాయపడినా ప్రమాదకర సూక్ష్మక్రిములను పూర్తిగా తొలగించలేవని నిపుణులు చెబుతున్నారు. సరైన హైజీన్ పాటించడం, బాగా ఉడికించడం మాత్రమే భద్రమైన మార్గమని స్పష్టం చేస్తున్నారు.

60 తులాల బంగారం కొట్టేశారు.. అక్కడే నేపాలీ గ్యాంగ్ దొరికిపోయింది..

60 Tolas Gold Theft
60 Tolas Gold Theft

60 Tolas Gold Theft: ఈ రోజుల్లో బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా పెరుగుతూనే ఉంది. బంగారం ధర విలువ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు. అటువంటిదే ఈ సంఘటన.

ఇటీవల హైదరాబాద్ నగరంలో నేపాలి గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. వరుసగా నేపాల్ ముఠా సభ్యులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో పని మనుషులుగా చేరి ఘోరాలు చేస్తున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోతున్నారు.. ముఖ్యంగా నేపాల్ ముఠా ఇలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కౌకూర్ లో ఓ దారుణం జరిగింది. ఏకంగా 60 తులాల బంగారం చోరీ అయింది. ఈ ఘటనలో నేపాలి గ్యాంగ్ హస్తము ఉన్నట్టు తేలింది. చివరికి పోలీసులు అనేక రకాలుగా ఆధారాలు సేకరించి.. నేపాలి గ్యాంగ్ ను పట్టుకున్నారు.

కౌకూర్ లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరి పిల్లలు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మురళీమోహన్, విజయలక్ష్మి మాత్రమే వారి ఇంట్లో ఉంటున్నారు. వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు నేపాల్ దేశానికి చెందిన మీనా, రాజేష్.

ఈనెల తన పుట్టినరోజు అని మమత చెప్పింది. తమ కుటుంబ సభ్యులను పిలిచి వేడుక జరుపుకుంటామని మురళీమోహన్ దంపతులకు చెప్పింది. దానికి వారు ఓకే చెప్పారు. మమత తమ దేశానికి చెందిన రాజేష్, సబీనా, సామ్రాట్, బిస్వాల్, చాంగ్, కమల్, శంకర్ ను తను పని చేస్తున్న ఇంటికి పిలిపించుకుంది. దొంగతనానికి వారితో కలిసి స్కెచ్ వేసింది. 11వ తేదీన మమతా గ్యాంగ్ మురళీమోహన్ ఇంటికి వచ్చింది. ఆరోజు రాత్రి మమత పుట్టినరోజు వేడుకలు జరిపారు. అనంతరం మురళీమోహన్, విజయలక్ష్మి దంపతులను తాళ్లతో కట్టివేశారు. ఇంట్లో ఉన్న అరవై తులాల బంగారం, 15 కిలోల వెండి, మూడు వేల డాలర్ల నగదు దోపిడీ చేశారు. అనంతరం ఆటలో కొంతమంది.. స్కూటర్లో కొంతమంది పరారై యాప్రాల్ వెళ్ళిపోయారు. అక్కడ ఆ వాహనాలను వదిలిపెట్టి.. నేరుగా సికింద్రాబాద్ వెళ్ళిపోయారు. దేశం దాటి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వి నేపథ్యంలో గతంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం జరిగింది. ఆ కేసులో మమతకు, రాజేష్ కు ప్రళయం ఉన్నట్టు తేరింది. మురళీమోహన్ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు పోలీసులు సేకరించిన వేలిముద్రలు.. గతంలో మొయినాబాద్ కేసులో పోలీసులు సేకరించిన వేలిముద్రలు సరిపోయాయి. దీంతో పోలీసులు మమత గ్యాంగ్ మీద పోలీసులు తీవ్రంగా నిఘా పెట్టారు. వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగులో కొంతమంది పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొంటున్నారు.

భారత్‌–చైనా చేతులు కలిపితే అతిపెద్ద ఆర్థిక శక్తి.. అమెరికా ఔట్‌..!

India China Economy
India China Economy

India China Economy: ప్రపంచ పెద్దన్నగా అమెరికా కొనసాగుతోంది. స్థిరమైన ఆర్థిక వృద్ధి కారణంగా డాలర్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. దీంతో అన్ని దేశాలు అమెరికా కరెన్సీలోనే వ్యాపారం చేస్తున్నాయి. అయితే నంబర్‌ 2, నంబర్‌ 5లో ఆసియా దేశాలు అయిన చైనా, భారత్‌ ఉన్నాయి. అమెరికాను భయపెడుతున్నవి ఈ రెండు దేశాలే. అమెరికా స్థానాన్ని ఆక్రమించాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆర్థికంగా, సైనిక పరంగా వేగంగా వృద్ధి సాధిస్తోంది. ఇక భారత్‌ కూడా గడిచిన పదేళ్లలో మెరుగైన పురోగతి సాధించింది. ఇటీవల ట్రంప్‌ చైనాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆసియా ఆర్థిక శక్తులు అయిన చైనా, భారత్‌ కలిస్తే ప్రపంచ ఆర్థిక మ్యాప్‌ మారిపోవడం ఖాయం. తాజా అంతర్జాతీయ ప్రాజెక్షన్లు ఐఎంఎఫ్, వరల్డ్‌ బ్యాంక్, Cebr, Goldman Sachs, PwC వంటి సంస్థల నివేదికలు సూచిస్తున్నట్లే, చైనా మరియు భారత్‌ కలిపి దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ వృద్ధిలో కీలక భాగస్వాములు అవుతున్నట్లు కనిపిస్తోంది.

2026–2030 వరకు గణనీయమైన పురోగతి..
తాజా నివేదికల ప్రకారం.. 2026–2030 మధ్య చైనా సుమారు 5.7 ట్రిలియన్‌ డాలర్లు, భారత్‌ సుమారు 2.1 ట్రిలియన్‌ డాలర్ల కొత్త జీడీపీని జోడిస్తాయని అంచనా. ఇది మొత్తం ప్రపంచ వృద్ధిలో సగం. ఈ పరిమాణాన్ని ఇతర వ్యక్తిగత దేశాలు సమానంగా అందించలేవు. ఫలితంగా చైనా–భారత్‌ జంటే ప్రధాన బ్రిడ్జ్‌గా మారే అవకాశం ఉంది.

వృద్ధి రేట్లు ఇలా..
ఐఎంఎఫ్‌/వరల్డ్‌ బ్యాంక్‌ 2026 అంచనాలు ప్రకారం వృద్ధి రేట్లు భారత్‌ ్ణ 6.5%, చైనా 4.4%, అమెరికా 2.3%. శాతం. సగటు వృద్ధి దీనిని భారీ ఆదాయపు ఇంపాక్టుగా మార్చుతుంది. భారతీయ వృద్ధి వేగం, ముఖ్యంగా సేవలు, డిజిటల్‌ ఉత్పత్తి, వినియోగదారుల డొమెస్టిక్‌ డిమాండ్‌ బలపడతాయి. చైనా మాత్రం ఉత్పత్తి సామర్థ్యం, పెట్టుబడుల పునర్నిర్మాణం, ఆర్‌–డీ ద్వారా స్థిరత్వాన్ని బలపరిచే అవకాశాలు ఉన్నాయి.

దీర్ఘకాలిక స్థానాలు..
Cebr వంటి సంస్థలు ప్రకారం చైనా 2045 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానం చేరే అవకాశం ఉంది. భారత్‌ 2029 నాటికి 3 స్థానం దక్కించుకునే గమనంలో ఉంది. 2050 ప్రాజెక్షన్లు కూడా చైనా–భారత్‌ ప్రశస్త స్థాయిలను సూచిస్తాయి. ఇతర మార్పులు పాలసీలు, సాంకేతిక విప్లవాలు ఈ సమీకరణాన్ని ప్రభావితం చేస్తాయి. అంచనాలు తరచుగా మధ్యంతర రహదారులపై ఆధారపడి ఉంటాయి.

ద్వంద్వ బలం..
ప్రపంచ స్థాయికి లాజిస్టిక్స్, భారీ మాన్యుఫ్యాక్చరింగ్, ఒకే చోటే సరఫరా గొలుసులు, పెద్ద మొత్తంలో ఆర్‌–డీ ఖర్చుల కారణంగా చైనా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. యు జనాభా, సాఫ్ట్‌వేర్‌/డిజిటల్‌ సేవల విప్లవం, కంపెనీల సర్వీస్‌ ఎక్స్‌పోర్ట్స్, అంతరిక్షంలోనే భారీ వినియోగదారుల డొమెస్టిక్‌ మార్కెట్‌ విస్తరణతో భారత ఆర్థిక వృద్ధి దీర్ఘకాలంలో సంక్షేమానికి త్రీ–డైమెన్షనల్‌ అడ్డగా మారొచ్చు.

చైనా–భారత్‌ ఆర్ధిక ప్రభావం వృద్ధి చేయగలిగితే, గ్లోబల్‌ వాణిజ్య సరళి, పెట్టుబడి ప్రవాహాలు, ఆంక్షల రాజకీయతత్వం మారే అవకాశం ఉంది. అమెరికా ప్రభావం ఇటీవలి శతాబ్దాలుగా ప్రబలంగా ఉండొచ్చు కానీ విజయవంతమైన ఆర్ధిక బదిలీ అనగా ప్రత్యామ్నాయ ప్రపంచ సాధనాల ఏర్పాటుకావచ్చు.

ఈ కార్లు ఉద్యోగులకు, వ్యాపారులకు బెస్ట్.. ఎందుకంటే..

Hybrid Cars India
Hybrid Cars India

Hybrid Cars India: ప్రస్తుత రోజుల్లో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. సమయానికి ఆఫీసుకు వెళ్లడం.. ఇతర అవసరాల కోసం ఫొర్ వెహికల్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే నిత్యం వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే వారు మైలేజీ భారానికి ప్రత్యామ్నాయంగా ‘హైబ్రిడ్’ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ ధరలు మండిపోతుండటం, పూర్తిగా ఎలక్ట్రిక్ కార్ల (EV) విషయంలో చార్జింగ్ మౌలిక వసతుల కొరత ఉండటంతో, మధ్యేమార్గంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీకి ఆదరణ విపరీతంగా పెరిగింది. ఈ కార్లలో ఉండే ఇంజిన్, ప్రయాణంలో దానంతట అదే బ్యాటరీని చార్జ్ చేసుకుంటూ లీటరుకు 23 నుండి 28 కిలోమీటర్ల వరకు అత్యుత్తమ మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ప్రముఖ హైబ్రిడ్ కార్ల వివరాలు మీకోసం…

మారుతి సుజుకి గ్రాండ్ విటారా:
మధ్యతరహా ఎస్‌యూవీ (SUV) విభాగంలో మారుతి సుజుకి తీసుకొచ్చిన గ్రాండ్ విటారా అత్యంత ప్రజాదరణ పొందింది. ఆఫీస్ అవసరాలకు, సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించడానికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు సుమారు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. విశాలమైన క్యాబిన్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లతో పాటు సిటీ డ్రైవింగ్‌కు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్:
మారుతి గ్రాండ్ విటారా ప్లాట్‌ఫామ్‌పైనే టొయోటా భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న మోడల్ ఈ ‘హైరైడర్’. టొయోటా నమ్మకమైన బ్రాండ్ వాల్యూ, పవర్‌ట్రెయిన్ సాంకేతికతతో వచ్చిన ఈ SUV కూడా లీటరుకు 27.97 కిమీ మైలేజీని ఇస్తుంది. హెడ్స్-అప్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. లుక్స్ పరంగా టొయోటా సిగ్నేచర్ గ్రిల్‌తో ఇది కాస్త భిన్నంగా, స్పోర్టీగా కనిపిస్తుంది.

హోండా సిటీ e HEV:
సెడాన్ కార్లను ఇష్టపడే వారికి, క్లాసీ లుక్‌తో ఆఫీస్‌కు వెళ్లాలనుకునే వారికి హోండా సిటీ ఇ:హెచ్ఈవి (e:HEV) ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిలోని ‘మల్టీ-మోడ్ డ్రైవ్’ సాంకేతికత సిటీలో ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లో నడుస్తూ, హైవేలపై పెట్రోల్ ఇంజిన్‌కు మారుతుంది. ఈ కారు లీటరుకు 27.13 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీనితో పాటు లగ్జరీ ఇంటీరియర్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి సేఫ్టీ ఫీచర్లు నిత్యం ప్రయాణించే వారికి పూర్తి రక్షణను, లగ్జరీని అందిస్తాయి.

టొయోటా ఇన్నోవా హైక్రాస్:
పెద్ద కుటుంబం ఉండి.. ఆఫీస్ అవసరాలతో పాటు సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇన్నోవా హైక్రాస్ తిరుగులేని ఆప్షన్. 2.0 లీటర్ శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చే ఈ 7 లేదా 8 సీటర్ ఎంపీవీ దాదాపు 23.24 కిమీ మైలేజీని అందిస్తుంది. లగ్జరీ ఓటోమన్ సీట్లు, విశాలమైన లెగ్‌రూమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణించడానికి, లగేజీతో లాంగ్ ట్రిప్స్ వేయడానికి మార్కెట్లో ప్రస్తుతం దీనికి సాటి లేదు.

మారుతి సుజుకి ఇన్విక్టో :
టొయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ను ఆధారంగా చేసుకుని మారుతి సుజుకి రీబ్యాడ్జ్ చేసి ప్రవేశపెట్టిన ప్రీమియం కారు ఇన్విక్టో. మారుతి నెక్సా (Nexa) షోరూమ్‌ల ద్వారా లభిస్తున్న ఈ కారు, ఇన్నోవా హైక్రాస్ లాగే 2.0 లీటర్ ఇంజిన్‌తో 23.24 కిమీ మైలేజీని ఇస్తుంది. కేవలం స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆటోమేటిక్ వేరియంట్లలోనే లభించే ఈ కారు, ప్రీమియం లుక్స్‌తో, అత్యాధునిక ఇంటీరియర్స్‌తో లగ్జరీ ప్రయాణాన్ని కోరుకునే వ్యాపారవేత్తలకు, పెద్ద కుటుంబాలకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలిచింది.

ఏపీ నుంచి ఈసారి బిజెపికి నో ఛాన్స్!

Rajya Sabha Elections
Rajya Sabha Elections

Rajya Sabha Elections: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో రాష్ట్రం నుంచి నలుగురు పదవీ విరమణ చేస్తారు. ఆ నాలుగు స్థానాలు కూటమి ఖాతాలో పడతాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కూటమికి ఏకపక్ష విజయం దక్కడంతో రాజ్యసభ పదవులన్నీ ఆ పార్టీకి దక్కుతాయి. ఒక్క రాజ్యసభ పదవులు మాత్రమే కాదు.. ఎమ్మెల్సీ పదవులు సైతం కూటమికే దక్కుతాయి. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని టిడిపి నేతలు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి రెండుసార్లు రాజ్యసభ పదవులను బిజెపికి కేటాయించారు. కేంద్రంలో అవసరాల దృష్ట్యా అలా తీర్చారు కానీ.. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి బలం పెరిగింది. జూన్లో 70 స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి. అందులో సింహభాగం స్థానాలు బిజెపికి దక్కనున్నాయి. రాజ్యసభలో బిజెపి బలం పెరిగిన దృష్ట్యా ఏపీ నుంచి ఆ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని టిడిపి నేతలు కోరుతున్నారు.

* నలుగురి పదవీ విరమణ..
ఏపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, అళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ రాజ్యసభ సభ్యులుగా పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో సతీష్ టీడీపీకి చెందిన నేత. ఏడాది కిందట రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అయ్యారు. దీంతో ఆయనకు రెన్యువల్ లభిస్తుంది. అయితే మిగతా మూడింటిలో ఒకటి జనసేనకు విడిచిపెట్టి.. రెండు రాజ్యసభ సీట్లు టిడిపి తీసుకోవాలని చూస్తోంది. కానీ బిజెపి కూడా ఆశిస్తోంది ఆ పదవిని. ప్రధానంగా తమిళనాడుకు చెందిన అన్నామలై పేరు వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం పోటీలో ఉన్నారు. అయితే మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వడాన్ని ఎక్కువమంది నేతలు తప్పుపడుతున్నారు. పైగా రెండుసార్లు బిజెపి రాజ్యసభ సీట్లు పొందింది. ఈసారి మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదు అని టిడిపి సీనియర్లు చంద్రబాబును కోరుతున్నారు. చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు.

* రాజ్యసభలో బిజెపికి మెజారిటీ..
ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో రాజ్యసభలో బిజెపికి స్పష్టమైన మెజారిటీ లేదు. అందుకే గత రెండుసార్లు బిజెపి కోరిన వెంటనే చంద్రబాబు ఆ పార్టీకి రాజ్యసభ పదవులను సర్దుబాటు చేశారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపికి స్పష్టమైన బలం ఉంది. పైగా జూన్లో పదుల సంఖ్యలో బిజెపికి రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. బిజెపి ఏకపక్షంగా రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఎన్డీఏ పరంగా బిల్లుల పాస్ కు అవసరమైన బలం ఎన్ డి ఏ సొంతమైంది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపికి మరో స్థానం ఇవ్వడం అంటే అది అతి అవుతుందని… అందుకే ఈసారి బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ ఇవ్వకూడదు అని చంద్రబాబుపై టిడిపి సీనియర్ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. ఆపై చాలామంది ఆశావహులు ముందుకు వచ్చి పదవి కోరుతున్నారు. దీంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవ్వక తప్పడం లేదు.

చంద్రబాబు ఆన్ డ్యూటీ.. కేంద్ర పెద్దల రియాక్షన్ అదే!

Chandrababu
Chandrababu

Chandrababu: కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబుపై కీలక బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తోంది. మొన్ననే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన సంగతి తెలిసిందే.. వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చట్టం బిల్లు కూడా వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆ బిల్లు సైతం వీగిపోయే అవకాశం ఉండడంతో వెనక్కి తగ్గింది. అయితే అన్ని పార్టీలకు నియోజకవర్గాల పెంపు అనేది అవసరమే. ప్రధానంగా ఏపీలో నియోజకవర్గాల పెంపుతో కూటమికి మరింత అదనపు బలం చేకూరే అవకాశం ఉంది. కానీ జాతీయస్థాయిలో విపక్షాలు వ్యతిరేకించడంతో ఈ బిల్లుకు బ్రేక్ పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తరుణంలో.. పునర్విభజన బిల్లుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపేలా.. చంద్రబాబుకు ఆ బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. విపక్షాలన్నింటినీ కూడాదీసి ఆ బిల్లుకు మోక్షం కల్పించాలని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం నడుస్తోంది.

* దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అప్పటి తమిళనాడు సీఎం స్టాలిన్ గట్టిగానే వ్యతిరేకించారు. కేరళ సీఎం గా ఉన్న పినరాయి విజయన్ సైతం వ్యతిరేకించారు. కర్ణాటకలో ఎలాగు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుంది. ప్రధానంగా పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది ఒక వాదన. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయని.. దీంతో రాజకీయ ఆధిపత్యం ఉత్తరాది రాష్ట్రాల చేతికి వెళ్లిపోతుంది అనేది దక్షిణాది రాష్ట్రాల వాదన.

ఒప్పించే పనిలో చంద్రబాబు..
అయితే ఎట్టి పరిస్థితుల్లో 2029 సార్వత్రిక ఎన్నికలకు.. నియోజకవర్గాల పెంపు అనేది చేయాలని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలంగా భావిస్తోంది. కానీ విపక్షాలన్నీ ఏకం అవ్వడంతో ఏం చేయాలో కేంద్ర పెద్దలకు పాలు పోవడం లేదు. ఇటువంటి తరుణంలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన చంద్రబాబును ప్రయోగిస్తున్నారట కేంద్ర పెద్దలు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతుగా చంద్రబాబు ఇప్పటికే కీలక నేతలతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగానే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉంటుందని.. ఎవరికి ఎటువంటి అన్యాయము జరగదని చంద్రబాబు వారిని ఒప్పిస్తున్నట్లు సమాచారం. ఈ చర్చల ప్రక్రియ కొలిక్కి వచ్చాక పునర్విభజన బిల్లును మరోసారి పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జాతీయస్థాయిలో ఇప్పుడు చంద్రబాబు అవసరాలు పెరగడం విశేషం.

కొడాలి నాని, వల్లభనేని వంశీ కి జగన్ ఫైనల్ వార్నింగ్!

Kodali Nani
Kodali Nani

Kodali Nani: ఏపీలో అత్యంత హాట్ నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం. కృష్ణాజిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచేవి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండే కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా రాజకీయ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుపై విరుచుకుపడేవారు. ఆయన కుమారుడు లోకేష్ పై సైతం వ్యక్తిగత కామెంట్లు చేసేవారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఈ ఇద్దరు నేతలు ఒక వెలుగు వెలిగారు. ఇందులో కొడాలి నాని మంత్రిగా కూడా వ్యవహరించారు. అటు వంశీ మోహన్ ఎమ్మెల్యే గా ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో ఆ ఇద్దరూ ఓడిపోయారు. ముందుగా అనారోగ్యానికి గురయ్యారు. ఇంకొకరు జైలుకు వెళ్లి అనారోగ్యం పాలయ్యారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారు. దీంతో వైసిపి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది.

* రేపల్లె ఫార్ములా..
మొన్ననే రేపల్లెలో మోపిదేవి శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నాయకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మొన్నటి ఎన్నికల్లో నోటా తో సమానంగా ఓట్లు వచ్చాయి. అయినా సరే అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోపిదేవి శ్రీనివాసరావును పిలిచి పార్టీ కండువా కప్పారు. స్థానిక వైసీపీ ఇన్చార్జ్ మోహన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని.. ఆయన గెలుపు బాధ్యతలు తీసుకుంటే.. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు గుడివాడ తో పాటు గన్నవరంలో అదే ఫార్ములా తో అడుగులు వేస్తున్నారట జగన్. అందుకే ఆ ఇద్దరు నేతలను పిలిచి చర్చించారట. వారి అభిప్రాయాన్ని సేకరించారట.

* కొత్త నేతలు రెడీ
గుడివాడలో ఇవే తనకు చివరి ఎన్నికలు అని కొడాలి నాని మొన్న ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా గుడివాడలో పార్టీ యాక్టివిటీస్ తగ్గాయి. అదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దూసుకుపోతున్నారు. గన్నవరం లో కూడా అదే పరిస్థితి. అక్కడి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. అందుకే ఆ రెండు నియోజకవర్గాల్లో టిడిపి పట్టు బిగించడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. గుడివాడలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్నారై జగన్మోహన్ రెడ్డికి టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు గన్నవరం నియోజకవర్గానికి చెందిన మహిళ నేత సుంకర పద్మశ్రీ సైతం వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవి ఆశించారు. షర్మిల రూపంలో ఆమెకు ఛాన్స్ మిస్సయింది. అందుకే ఆమె వైసీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే ఇద్దరు నేతలను పిలిచి పార్టీలోకి కొత్తవారు వస్తున్నారని.. ఉంటే మీరు రంగంలో ఉండండి.. లేకుంటే వారికి ఛాన్స్ ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం.

పెద్ది మూవీ ట్రైలర్ లో హైలెట్ అయ్యేది ఆ నటుడేనా..?

Peddi Movie Climax Twist
Peddi Movie Climax Twist

Peddi Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల కంటెంట్ మారిపోయింది. ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాలు చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ తో పాటు మరొక నటుడు కూడా హైలెట్ అవ్వబోతున్నారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ ని హైలెట్ చేస్తూ వచ్చారు. అంటే రామ్ చరణ్ ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు. అసలు సినిమా థీమ్ ఏంటి ఈ మూవీ ఎక్కడ జరుగుతుంది. ఏ సంవత్సరం కాలంలో ఈ సినిమా నడుస్తుంది అనే ఒక సెటప్ అంతా ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేశారు.

కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ క్యారెక్టర్ లోని కెపాబిలిటిని చూపిస్తూనే మీర్జాపూర్ లో మున్నాభాయ్ గా నటించి మెప్పించిన దివ్యాంద శర్మ ఈ సినిమాలో రామ్ బుజ్జి అనే ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఆ పాత్ర సినిమాకి చాలా హైలైట్ గా నిలువబోతుందట. సినిమా మొత్తానికి ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెబుతున్నారు.దానికి తగ్గట్టుగానే ట్రైలర్ లో సైతం దివ్యాంద శర్మ ను హైలెట్ చేస్తూ ట్రైలర్ కట్ అయితే చేశారట.

ఇక ఏది ఏమైనా కూడా అతని పాత్ర ఏంటి అతనికి రామ్ చరణ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ సినిమా స్టోరీకి తను ఎలాంటి కనెక్ట్ అవుతాడు అనే విషయాలన్నిటిని ట్రైలర్లో ప్రస్ఫుటంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారట… మొత్తానికైతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

RedMagic 11S Pro.. ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా..

RedMagic 11S Pro
RedMagic 11S Pro

RedMagic 11S Pro: ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారుల్లో ఎక్కువగా యూత్ ఉన్నారు. వీర గేమింగ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారి కోసం అత్యుత్తమ మొబైల్ గేమింగ్, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో ఉండే మొబైల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అదే RedMagic 11S Pro.ఇది ఓవర్‌లాక్ చేయబడిన Snapdragon 8 Elite (Gen 5) Leading Version చిప్‌సెట్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ మార్కెట్లోకి రాకముందే ఎలా ఉందో తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

RedMagic త్వరలో మార్కెట్లోకి 11S Proను తీసుకురాబోతుంది. ఇది 11 Pro సిరీస్‌కు mid cycle refresh‌గా రానుందని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం.. ఈ మోడల్ ప్రధానంగా గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరచడానికి రూపొందిస్తున్నారు. 11S Pro డిజైన్‌ చాలా వరకు RedMagic 11 Pro లాగే ఉండే అవకాశం ఉంది. ట్రాన్స్పరెంట్ స్టైల్ లో, ఫ్లష్ కెమెరా, active cooling fan ఉండనుంది. అలాగే ఈ మొబైల్ సిల్వర్ వింగ్, డార్క్ నైట్ వంటి కలర్లలో రానున్నట్లు సమాచారం.

ఈ ఫోన్‌లో 6.85 అంగుళాల AMOLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 144Hz refresh రేట్ తో పనిచేస్తుంది. 2K రిజల్యూషన్ తో gaming experience కోసం sharp panel ఉండొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా లోపల ఉండే డిస్ ప్లే selfie camera ఉండే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి front camera cutout లేకుండా full-screen gaming అనుభవం దొరకొచ్చు.

ఈ 11S Proలో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది overclocked Leading Version chip‌తో వస్తుంది, అంటే standard version కంటే కొంచెం ఎక్కువ clock speed ఉండొచ్చు. upgraded built-in fan తో పాటు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ , long gaming sessionsలో heat control కోసం advanced thermal design ఉండొచ్చు.

బ్యాటరీ విభాగంలో 7,500mAh లేదా కొన్నిరిపోర్టుల ప్రకారం 8,000mAh వరకు capacity ఉండొచ్చని సమాచారం ఉంది. Wired charging 80W వరకు, అలాగే కొన్ని లీక్‌లలో wireless charging support కూడా కనిపిస్తోంది. కానీ ఇది అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

ఈ మొబై్ లో 50MP రియర్ కెమెరా, సెల్పీ కోసం 16MP కెమెరా ఉండనుంది. REDMAGIC OS 11 ఆధారంగా Android 16 రావొచ్చని సమాచారం. ఇప్పటివరకు అధికారికంగా ధర గురించి బయటకు రాలేదు. అయితే గత RedMagic 11 Pro price ఆధారంగా చూస్తే, 11S Pro కూడా premium gaming segmentలోనే ఉండే అవకాశం ఉంది.

ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్...

Prabhas
Prabhas

Prabhas Marriage: సినిమా ఇండస్ట్రీలో సక్సెసులనేవి అంత ఈజీగా రావు…ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాతే సక్సెస్ లు వరిస్తాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. తనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధించాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరో మెట్టు పైకి ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలు ఆయన రేంజ్ ను మార్చబోతున్నాయి.

ప్రభాస్ సినిమాలా పరంగా ముందుకు దూసుకెళ్తున్నప్పటికి పర్సనల్ విషయాల్లో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయాడని చాలామంది చెబుతున్నారు. తన తోటి హీరోలందరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కట్టుంటే ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకపోవడం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిలిచిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది.

తన కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ అతన్ని అడుగుతున్నారు. నిజానికి తన దగ్గర కూడా ఆ విషయానికి సమాధానం లేదంటూ ప్రభాస్ తప్పించుకుంటున్నాడు. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అంటూ సిచువేషన్ ను దాటవేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా కొంతమంది హీరోయిన్లు సైతం ప్రభాస్ ఇష్టపడితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు.

జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి ఫరీయా అబ్దుల్లా…ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఫన్నీగా ఒక ఆన్సర్ ఇచ్చింది. మరి నిజంగానే ఆమె ప్రభాస్ ఓకే అంటే పెళ్లి చేసుకుంటుందా? లేదా అనే విషయం పక్కన పెడితే ప్రభాస్ కి అంత మంచి ఫాలోయింగ్ అంత మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఎందుకని పెళ్లి చేసుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అంటూ ఇండస్ట్రీ లో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి…