Homeఅంతర్జాతీయంChilkur Balaji Temple: అమెరికా అక్కసు.. మన వీసా దేవుడికి అంతర్జాతీయ గుర్తింపు..!

Chilkur Balaji Temple: అమెరికా అక్కసు.. మన వీసా దేవుడికి అంతర్జాతీయ గుర్తింపు..!

Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉన్న ఆలయం. విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఉద్యోగాలు రావాలని మొక్కుకునేవారు ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా మొక్కుకున్నవారిలో 80 శాతం మంది కోరికలు నెరవేరినట్లు ఆలయం అధికారులు, భక్తులు తెలిపారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే చిలుకూరు బాలాజీ వీసా దేవుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు మన దేవుడికి అంతర్జాతీయ గుర్తింపు […]

Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉన్న ఆలయం. విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఉద్యోగాలు రావాలని మొక్కుకునేవారు ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా మొక్కుకున్నవారిలో 80 శాతం మంది కోరికలు నెరవేరినట్లు ఆలయం అధికారులు, భక్తులు తెలిపారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే చిలుకూరు బాలాజీ వీసా దేవుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు మన దేవుడికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికా సెనేటర్‌ ‘వీసా కార్టెల్‌’ ఇందుకు కారణం. హెదరాబాద్‌ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయం భారతీయులకు కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ఎంతోమంది యువకులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ అమెరికా వీసా కలలను సాకారం చేసుకోవడానికి ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయం గురించి ఫ్రాన్స్‌ 24 అధికారిక చానల్‌ విశేష రిపోర్ట్‌ చేసింది. దీనిని ‘Visa Temple’గా పిలిచి, విశ్వాసం ఆధారంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి వీసా కోసం, 108 ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతలు తెలిపే సంప్రదాయాన్ని వివరించింది.

అమెరికా సెనేటర్‌ అక్కసు..
అయితే, ఇదే ఆలయాన్ని అమెరికా సెనేటర్‌ ఎరిక్‌ ష్మిట్‌ తీవ్రంగా విమర్శించారు. హెచ్‌–1బీ వీసాలు, భారతీయ ఐటీ వృత్తులపై తన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఈ ఆలయాన్ని ‘Visa Cartel’గా అభివర్ణించాడు. భక్తుల ప్రార్థనలను ఎగతాళి చేశారు. ఇది కేవలం ఒక ఆలయం గురించి మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతి, విశ్వాసాలు, వలస విధానాలపై జరుగుతున్న వివాదాన్ని ప్రతిబింబిస్తోంది.

చిలుకూరు బాలాజీ వెనుక చిన్న కథ.
చిలుకూరు బాలాజీ ఆలయం సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయం. ఇక్కడ హుండీ లేదు, డబ్బు స్వీకరణ లేదు, వీఐపీలకు ప్రత్యేకత లేదు. అందరూ ఒకే సామాన్య భక్తులుగా ప్రదక్షిణలు చేస్తారు. 1980–90లలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు వీసా వైఫల్యాల తర్వాత ఇక్కడ ప్రార్థన చేసి విజయం సాధించడంతో ’వీసా బాలాజీ’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు రోజుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఫ్రాన్స్‌ 24 రిపోర్ట్‌లో ఈ విశ్వాసాన్ని గౌరవంగా చిత్రీకరించారు. ఇది భారతీయుల ’అమెరికన్‌ డ్రీమ్‌’ను సూచిస్తుందని, కష్టాలు, నమ్మకం మధ్య జరిగే ప్రయాణాన్ని హైలైట్‌ చేశారు.సెనేటర్‌ వ్యాఖ్యల వెనుక రాజకీయాలుఎరిక్‌ ష్మిట్‌ వ్యాఖ్యలు హెచ్‌–1బీ వీసా వ్యవస్థపై జరుగుతున్న అమెరికా రాజకీయ చర్చలో భాగం.

అమెరికా ఉద్యోగాల్లో ఆధిపత్యం..
అమెరికాలో ఉద్యోగాలు, టెక్‌ సెక్టర్‌లో భారతీయుల ఆధిపత్యం, వీసా దుర్వినియోగం అనే అంశాలపై రిపబ్లికన్‌ సెనేటర్లు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంలో చిలుకూరు ఆలయ ఫోటోను పోస్ట్‌ చేసి ‘వీసా కార్టెల్‌కు సొంత వీసా ఆలయం ఉంది‘ అని వ్యాఖ్యానించడం భారతీయులను కలచివేసింది. ఇది భారతీయ విశ్వాసాలను ఎగతాళి చేయడమే. సాంస్కృతిక అసహనాన్ని ప్రదర్శించడం.
వీసా సమస్యలను మతపరమైన దృక్పథంతో చూడడం అని చెప్పవచ్చు.

భారతీయ సమాజంలో ఆలయాలు, దేవుళ్లు కేవలం మతపరమైనవి కాకుండా, సామాజిక, మానసిక మద్దతు అందించే కేంద్రాలు. వీసా, ఉద్యోగం, వివాహం వంటి జీవిత సమస్యల్లో విశ్వాసం బలాన్నిస్తుంది. ఫ్రాన్స్‌ రిపోర్ట్‌ ఈ మానవీయ కోణాన్ని అర్థం చేసుకుంది. కానీ సెనేటర్‌ వ్యాఖ్యలు దీన్ని రాజకీయ ఆయుధంగా మార్చాయి. ఈ సంఘటన రెండు వైపులా ఆలోచింపజేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper