Homeఎంటర్టైన్మెంట్Sukumar: సుకుమార్ ను అవమానించిన ప్రొడ్యూసర్... ఆయనతో మళ్ళీ సినిమా చేయలేదుగా...

Sukumar: సుకుమార్ ను అవమానించిన ప్రొడ్యూసర్… ఆయనతో మళ్ళీ సినిమా చేయలేదుగా…

Sukumar: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో సుకుమార్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను చేసిన సుకుమార్ ప్రస్తుతం మరోసారి రామ్ చరణ్ తో జతకట్టబోతున్నాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా డిఫరెంట్ గా ఉంటుందని కథ ను సైతం ఫైనల్ చేసి పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ […]

Sukumar: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో సుకుమార్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను చేసిన సుకుమార్ ప్రస్తుతం మరోసారి రామ్ చరణ్ తో జతకట్టబోతున్నాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా డిఫరెంట్ గా ఉంటుందని కథ ను సైతం ఫైనల్ చేసి పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ని ఒక ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించాడు అంటూ అతని అభిమానులైతే చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి అది అవమానం కంటే కూడా సినిమా సక్సెస్ అవ్వడానికి తనకి తానే అవమానించుకున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజుగా తెలుస్తుంది. సుకుమార్ అల్లు అర్జున్ తో చేసిన ఆర్య సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడం విశేషం…

ఆర్య సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివర్లో ఒక మాంటేజ్ సన్నివేశం కోసం దిల్ రాజు ను బతిమిలాడాడట. కానీ అప్పటికే ఆ సినిమా మీద అనుకున్న డబ్బులు పెట్టేసాము అని ఇక పెట్టడం చాలా కష్టమని చెప్పడంతో ఏం చేయాలో తెలియని సుకుమార్ దిల్ రాజు కాళ్లు పట్టుకొని మరి ఆ మాంటేజ్ కి డబ్బులు పెట్టించుకొని సినిమాని చేసి సక్సెస్ ఫుల్ గా నిలిపాడు.

అయితే ఇప్పటికి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న సుకుమార్ ఆర్య సినిమా తర్వాత దిల్ రాజు తో మరో సినిమా చేయలేదు. వీళ్ల కాంబోలో సినిమా వస్తుందంటూ గతంలో చాలా వరకు ప్రచారం జరిగినా కూడా అది కార్యరూపం దాల్చలేదు. ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర వహిస్తున్నాడు. కాబట్టే అతనితో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper