Homeఎంటర్టైన్మెంట్Allu Arjun And Lokesh Kanagaraj: అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ మూవీ టైటిల్...

Allu Arjun And Lokesh Kanagaraj: అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ మూవీ టైటిల్ ఇదేనా…

Allu Arjun And Lokesh Kanagaraj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు తనకి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ఆయన ఇండియాలో భారీ పాపులారిటి ని సంపాదించుకున్నాడు. ఇక ‘పుష్ప 2’ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెనుదిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా […]

Allu Arjun And Lokesh Kanagaraj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు తనకి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో ఆయన ఇండియాలో భారీ పాపులారిటి ని సంపాదించుకున్నాడు. ఇక ‘పుష్ప 2’ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెనుదిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలని తను అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. అల్లు అర్జున్ కి ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుంది. అల్లు అర్జున్ కెరీయర్ని మార్చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ మీద కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ‘యోధ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టైటిల్ని బట్టి చూస్తుంటే ఇది కూడా ఒక భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక లోకేష్ కనకరాజ్ కమర్షియల్ సినిమాలను చాలా అద్భుతంగా తరికెక్కించడంలో సిద్ధహస్తుడు… ఏ ఎపిసోడ్స్ ఎక్కడెక్కడ ఉండాలి. సినిమాలోని సన్నివేశాలతో ప్రేక్షకులను ఎలా బుక్ చేయాలి అనేది లోకేష్ కి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు.

గత సంవత్సరం రజనీకాంత్ చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా లోకేష్ కనకరాజు ఎక్కడ డీలా పడకుండా అల్లు అర్జున్ తో సినిమా సెట్ చేసుకున్నాడు అంటే మామూలు విషయం కాదు… కాబట్టి ఈ ప్రాజెక్టు మీద కూడా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుడిని మెప్పించగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper