Home Blog Page 252

రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..

Late Night Sleep
Late Night Sleep

Late Night Sleep: ఒకప్పుడు సాయంత్రం 8 అయితే చాలు బయట ఎవరూ ఉండేవారు కాదు. నగరాలు, పట్టణాలు మినహా.. మిగతా ప్రాంతాలలో జనం త్వరగానే పడుకుండిపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి పనులు చేసుకునేవారు. యాంత్రికరణ నాడు ఆ స్థాయిలో లేదు. అందువల్ల మనుషులకు శారీరకంగా శ్రమ అధికంగా ఉండేది. నాటి కాలంలో పెద్దగా జబ్బులు కూడా వచ్చేవి కాదు. స్మార్ట్ ఫోన్ వినియోగం.. టెక్నాలజీ ఈ స్థాయిలో అభివృద్ధి అనేవి నాటి కాలంలో కనిపించేవి కాదు.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యాంత్రికరణ అధికమైపోయింది. టెక్నాలజీ మీద ఆధారపడడం పెరిగిపోయింది. ఫలితంగా మనిషికి సుఖం అనేది ఎక్కువైపోయింది. దీనివల్ల సకాలంలో నిద్ర అనేది కరువైపోయింది. స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో చాలామంది రాత్రి 11 దాటిన తర్వాతే పడుకుంటున్నారు. కొంతమంది అయితే తెల్లవార్లు మెలకువ తోనే ఉంటున్నారు. దీనివల్ల మెటబాలిజం పూర్తిగా దెబ్బతింటున్నది. కొందరైతే రాత్రిపూట ఉద్యోగాల వల్ల నిద్రకు చాలా వరకు దూరమవుతున్నారు.

సకాలంలో నిద్రపోకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని.. అధిక రక్తపోటు సమస్య వేధిస్తుందని.. మధుమేహం
.. హృదయ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఏకాగ్రత.. జ్ఞాపకశక్తి తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి.. ఆందోళన విపరీతంగా పెరిగిపోతాయని చెబుతున్నారు. సకాలంలో నిద్ర పోకపోతే జీవ క్రియలు కూడా దెబ్బతింటాయని వైద్యులు అంటున్నారు.

ఒకవేళ అనివార్య పరిస్థితిలో నిద్ర ఆలస్యంగా పోతే.. ఏడు నుంచి 8 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోవాలని.. అప్పుడే శరీరానికి విశ్రాంతి లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం నడక లేదా రన్నింగ్ చేయాలి. కొవ్వు పదార్థాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి… నూనె తక్కువగా ఉండే ఆహార ప్రార్ధాలు తీసుకోవాలి. ఒత్తిడి ఏ మాత్రం లేకుండా చూసుకోవాలి.. ఇవన్నీ చేస్తే నిద్ర సులభంగా పడుతుందని.. ఎటువంటి ఇబ్బందులు లేకుండానే హాయిగా పడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు రాత్రిపూట మాంసాహారం తినకుండా.. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ తప్పదా!

Byreddy Siddharth Reddy
Byreddy Siddharth Reddy

Byreddy Siddharth Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై కేసు నమోదయింది. మంత్రులు నారా లోకేష్ తో పాటు టీజీ భరత్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఓ కంపెనీ ఏర్పాటుకు 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారు అంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గత రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో ఇవే హాట్ టాపిక్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీరుపై మంత్రి టీజీ భరత్, ఎంపీ బైరెడ్డి శబరి గట్టిగానే రిప్లై ఇచ్చారు. జోకర్, పిల్ల ఖైదీ, నేరస్తుడు అంటూ విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా మంత్రి టీజీ భరత్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆధారాలు లేకుండా మాట్లాడినందుకు ఆయనకు జైల్లో వేసే అవకాశం కూడా కనిపిస్తోంది.

* దూకుడుగా యువనేత..
ఇటీవల కర్నూలు జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడుగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మౌనం వహిస్తున్నారు. ఈ సమయంలో సిద్ధార్థ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పక్క రాజకీయ వ్యూహంతోనే ఆయన ఆరోపణలు ఉన్నట్లు అర్థం అవుతోంది. తనకు జైలు కొత్త కాదు అని.. అక్కడ మొక్క కూడా వేశానని.. వెళ్లి అలా చూస్తాను అంటూ వెటకారంగా మాట్లాడారు. రోజులు, నెలలు, సంవత్సరాలు.. అంతకంటే ఏం చేస్తారు లే అన్నట్టు ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఆపై బైరెడ్డి శబరి చదువులు, రాజకీయ పదవులపై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బైరెడ్డి కావాలనే రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారన్నది ఒక అనుమానం. అయితే ఎట్టి పరిస్థితుల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వదలకూడదని కూటమి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* పార్టీని క్రియాశీలకం చేసేందుకు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బయటకు వచ్చేసారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో బైరెడ్డి శబరి కి తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీ టికెట్ లభించడంతో ఆమె పోటీ చేసి గెలిచారు. కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయింది. పార్టీలో సీనియర్లంతా ఓడిపోయారు. పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ పార్టీని యాక్టివ్ చేసే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అప్పగించారు. అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అరెస్టుకు సిద్ధపడి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ విచారణలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు అరెస్టు ఖాయం అన్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఎండాకాలంలో మజ్జిగ తాగుతున్నారా.. రెండు వారాలపాటు అదే పని చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..

Summer Buttermilk Benefits
Summer Buttermilk Benefits

Summer Buttermilk Benefits: ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ అనివార్యంగా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పటికీ.. త్వరగానే ఇంటికి రావాల్సి వస్తోంది. ఇంటికి వచ్చిన తర్వాత విపరీతమైన ఉక్కపోత, దాహం.. ఇలాంటి సమయంలో దాహార్తి తీర్చుకోవాలంటే మజ్జిగ లేదా ఇతర పానీయాలను ఆశ్రయించాల్సి ఉంటుంది.

మజ్జిగ తాగడం వల్ల దాహం తీరుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాదు మన దేహానికి కావలసిన ప్రోటీన్లు.. ఇతర పదార్థాలు అందుతూ ఉంటాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి చాలామంది మజ్జిగ పడతారు. మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని అత్యంత సులువుగా జీర్ణం చేస్తూ ఉంటుంది. రెండు వారాలపాటు మజ్జిగను అదే పనిగా తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఎండాకాలంలో మజ్జిగను రెండు వారాలపాటు తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మజ్జిగలో ఉండే మంచి బ్యాక్టీరియా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అలాగే గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. మజ్జిగలో సహజమైన చల్లదన లక్షణం ఉంటుంది. ఇది శరీరంలో అంతర్గత విడిని పూర్తిగా తగ్గిస్తుంది. భోజనానికి ముందు మజ్జిగ తాగితే.. తక్కువ ఆహారం తీసుకుంటాం. దీనివల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. మజ్జి తాగడం వల్ల గట్ హెల్త్ కూడా మెరుగవుతుంది. మంచి బ్యాక్టీరియా ఉండడంవల్ల నిద్ర కూడా త్వరగానే వస్తుంది.

కొంతమంది మజ్జిగలో పచ్చి ఉల్లిపాయలు.. మిర్చి.. కొత్తిమీర.. పుదీనా వంటివి వేసుకుంటారు. వాటి వల్ల మజ్జిగ లో కొత్త రుచి ఏర్పడుతుంది. దీన్ని తాగడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా అజీర్తి.. ఇతర జీర్ణ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. అందువల్ల చాలామంది ఎండాకాలంలో మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే దీనిని రెండు వారాలపాటు అదే పనిగా తాగితే.. ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

మహిళల శిరోజాలతోనే ఈ గ్రామం ఫేమస్.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసా..

Long Hair Village
Long Hair Village

Long Hair Village: మామూలుగా అయితే గ్రామాలకు అక్కడి చారిత్రక నేపథ్యాలతో గుర్తింపు లభిస్తుంది. కొన్ని గ్రామాలైతే ఆలయాలకు.. ఇంకా కొన్ని గ్రామాలు చారిత్రాత్మక ప్రదేశాలకు.. మరికొన్ని గ్రామాలు ప్రత్యేకమైన వంటలకు.. ప్రత్యేక చిరునామాగా ఉంటాయి. కానీ, ఈ గ్రామం మాత్రం ఆడవాళ్ళ శిరోజాలతో గుర్తింపు పొందింది. కేవలం ఇక్కడి ఆడవాళ్ళ శిరోజాలను చూసేందుకే పర్యాటకులు వస్తారంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

చైనా దేశంలోని హవాంగులు యావో అనే గ్రామంలో మహిళలకు అత్యంత పొడవైన జుట్టు ఉంటుంది. ఈ గ్రామంలో రెడ్ యావో అనే తెగకు సంబంధించిన మహిళలు ఉంటారు. వీరికి 1.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవైన జుట్టు ఉంటుంది. వీరు జీవితంలో 18 సంవత్సరాల వయసులోనే ఒకే ఒక్కసారి తమ వెంట్రుకలను కత్తిరిస్తారు. పులియపెట్టిన బియ్యం.. నీటిని ఉపయోగించి జుట్టును శుభ్రం చేసుకుంటారు. ఫలితంగా ఆ జుట్టు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో రసాయనాలు ఉన్న షాంపూలను వాడారు. కృత్రిమమైన నూనెలు ఉపయోగించరు. కేవలం సహజసిద్దమైన పదార్థాలతోనే వారు జుట్టును మెరుగ్గా ఉంచుకుంటారు.

ఇక్కడ భౌగోళిక వాతావరణం కూడా మహిళల జుట్టు పెరగడానికి ఉపకరిస్తుంది. సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో వీరు జుట్టు సంరక్షణ చేసుకుంటారు. ఫలితంగా ఇక్కడ మహిళల శిరోజాలు పొడవు పెరుగుతాయి. అయితే ఇంత పొడవు పెరిగిన శిరోజాలను జడ వెయ్యాలంటే మాత్రం మరొకరి సహాయం ఖచ్చితంగా ఉండాలి. పూలు పెట్టుకునేటప్పుడు.. ఇతర స్థాయిలో అలంకరణలు చేసుకునేటప్పుడు కచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురు ఉండాల్సిందే. అయితే ఈ స్థాయిలో జుట్టు ఉన్నప్పటికీ ఇక్కడ మహిళల్లో సంతృప్తి లేదట. ఇంకా జుట్టు పెరగాలని వారు కోరుకుంటున్నారట.

సాధారణంగా చైనా మహిళలు జుట్టును అంతగా పెంచరు. ఒకవేళ పెంచినా సరే.. దానిని ఒక స్థాయి వరకే ఉంచుకుంటారు. కానీ ఈ గ్రామానికి చెందిన మహిళలు జుట్టును పెంచడంలో ప్రత్యేక తీరును ప్రదర్శిస్తున్నారు. అందువల్లే వారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే ఈ గ్రామంలో ఆడవాళ్లు జుట్టు ఈ స్థాయిలో ఎలా పెంచుకుంటున్నారు అనే విషయంపై గతంలో అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో తేలిన అంశాల ఆధారంగా.. ఇతర మహిళలు జుట్టు పెంచుకోవడం ప్రయత్నించారు. కొంతవరకు అది విజయవంతమైనప్పటికీ.. ఈ స్థాయిలో మహిళలు మాత్రం ఫలితం సాధించలేకపోయారు. ఈ గ్రామంలో భౌగోళిక వాతావరణం ఆడవాళ్ళ జుట్టు పెరుగుదలకు సహాయపడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్లే ఈ ప్రాంతంలో మహిళల జుట్టు విపరీతంగా పొడవు ఉందని వారు వివరిస్తున్నారు.

ఇంట్రస్టింగ్.. చంద్రబాబు లో ఆ మార్పు.. ఊహించారా?

Chandrababu
Chandrababu

Chandrababu: చంద్రబాబులో స్పష్టమైన వైఖరి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ప్రజలతో మమేకం అవుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటోంది. ప్రతిపక్షాలు అది ప్రచార స్టంట్ అంటున్నాయి. ఎందుకంటే ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి. తాజాగా ఆయన ఓ మత్స్యకారుడు ఇంటికి వెళ్లి.. వారితో కలిసి భోజనం చేసిన తీరు మాత్రం చాలా ఆకట్టుకుంటోంది. ఈసారి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు వైఖరిలో స్పష్టమైన మార్పు మాత్రం కనిపించింది. ఎప్పుడు పాలన, కొత్త ఆవిష్కరణలు, విజన్లు అంటూ హడావిడి చేసే ఆయన.. ఈసారి మాత్రం సామాన్య జనాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఒక సాధారణ ఆటో డ్రైవర్ తో మాటామంతి, కిరాణా షాప్ నడుపుకునే చిరు వ్యాపారితో సంభాషణ, ఒక చిన్న కుటుంబంతో మాట్లాడుతున్న తీరు, ప్రతి నెల పింఛన్ ఇచ్చేందుకు సామాన్యుడు చెంతకు వెళ్తున్న తీరు చూస్తుంటే మాత్రం.. ఆయన వైఖరిలో మార్పు గమనించాలి.

* ప్రతిపక్షం విమర్శలు..
అయితే చాలామంది చంద్రబాబు చేస్తున్న పనిని ప్రచార ఆర్భాటంగా చెబుతున్నారు. ఆయన రహస్యంగా ఏ పని చేయలేరు. ప్రోటోకాల్ ప్రకారం మీడియా ఉంటుంది. భద్రత ఉంటుంది. పైగా సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా యాక్టివ్ గా ఉన్న రోజులు. ఎప్పటికప్పుడు ఈ విషయాలు బయటపడక తప్పదు. దానిని ప్రచార కోణంలో చూస్తామంటే కుదరదు. అయితే విపక్షాలు ఎలాను విమర్శిస్తాయి. కానీ చంద్రబాబు వైఖరిని గమనించిన వారు మాత్రం గుర్తించగలరు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇలానే ప్రజలతో మమేకమైనప్పుడు ఆయనతో చంద్రబాబును పోల్చి విమర్శలు చేసేవారు. ఇప్పుడు అదే చంద్రబాబు అలా చేస్తుంటే ప్రచార ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు.

* పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ సాయం
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అంటే ముందుగా గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి. అంతకుముందు చంద్రబాబు పెద్దగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో.. బాధితులకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి అందుతోంది. ఏ అవసరానికి చెయ్యి చాచిన ముఖ్యమంత్రి తన సహాయ నిధి నుంచి సాయం అందిస్తున్నారు. ఒకవైపు సామాన్యులతో మమేకం అవుతున్న తీరు కూడా ఆకట్టుకుంటుంది. పరిణితి చెందిన నాయకుడిగా చంద్రబాబు ఆవిష్కృతం అవుతున్నారు.

వెంకటేష్ కొడుకు అర్జున్ కోసం స్టోరీస్ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్స్...

Venkatesh Son Arjun
Venkatesh Son Arjun

Venkatesh Son Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విక్టరీ వెంకటేష్… ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తను చాలావరకు సేవలనైతే అందించాడు. మరలాంటి వెంకటేష్ ప్రస్తుతం మరోసారి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల వైపే అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సర ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం ‘ పేరుతో త్రివిక్రమ్ డైరెక్షన్లో మరోసారి కుటుంబ కథ నేపథ్యంలోనే సినిమాను చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తన కొడుకు అయిన అర్జున్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ రాణించాలంటే నటన పరంగా మెళుకువలు నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయనను ఫారం అయితే పంపించారట. మరి అక్కడ యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్న అర్జున్ తొందరలోనే సినిమా ఇండస్ట్రీలో హీరోగా మారబోతున్నాడు అంటూ ఫిలింనగర్ సర్కిల్లో కొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి…ఇక ఇలాంటి క్రమంలోనే అర్జున్ తో సినిమా చేయడానికి కొంతమంది దర్శకులు కథలను కూడా రెడీ చేశారు. ఇక అందులో శేఖర్ కమ్ముల ఒకరు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ తో అర్జున్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని శేఖర్ కమ్ములు ప్రయత్నిస్తున్నాడు.

ఇక శేఖర్ కమ్ముల ఇంతక ముందే ఈ ఫ్యామిలీ హీరో అయిన రానా ను లీడర్ మూవీతో ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. కాబట్టి అర్జున్ బాధ్యతను కూడా తనకే అప్పజెప్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక అతనితో పాటుగా వెంకీ అట్లూరి సైతం వెంకటేష్ కొడుకుతో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట.

అది కూడా లవ్ స్టోరీ గా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు అర్జును ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు అంటే అదొక మంచి విషయమనే చెప్పాలి. ఎందుకంటే వెంకీ అట్లూరి ఈ మధ్య కాలంలో తన పంథాను మార్చుకొని సక్సెస్ ఫుల్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు.

సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ఆయన తన క్రేజ్ ను అమాంతం తారా స్థాయికి పెంచుకున్నాడు. ప్రస్తుతం సూర్యతో చేస్తున్న సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఆయన టాప్ డైరెక్టర్ గా మారిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

'డ్రాగన్' గ్లింప్స్ చూస్తే ఆ రెండు సినిమాలు గుర్తుకు వచ్చాయా..?కథ ఎక్కడ జరుగుతుంది...

NTR Dragon Glimpse
NTR Dragon Glimpse

NTR Dragon Glimpse: ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం లేదంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని నిన్న నైట్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ను కనుక మన అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బ్రిటిష్ వాళ్లు ఇండియాకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మాదక ద్రవ్యాల గురించి జరిగే స్టోరీగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. అలాగే ఆయన చెప్పిన డైలాగ్ లు గ్లింప్స్ మొత్తానికి హైలైట్ అయిందనే చెప్పాలి…’దేవుడు నాకొక గొప్ప వరమిచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం… నిద్రపోయినప్పుడు నా కల లోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు…మిగిలి ఉన్న శత్రువుల ముఖాలు మాత్రమే కనబడతాయి…పొరపాటున కూడా నా కలలోకి రావద్దు’…అంటూ ఎన్టీఆర్ తన శత్రువులకు చాలా పద్ధతిగా వార్నింగ్ ఇస్తున్నాడు.

ఈ డైలాగు అద్భుతంగా ఉండటమే కాకుండా ఎన్టీఆర్ లుక్ మీద కొన్ని రోజుల నుంచి వస్తున్న ట్రోల్స్ కి చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ గ్లింప్స్ ను కనుక చూసినట్లయితే సలాడ్ సినిమాలో ప్రభాస్ కి పడిన ఎలివేషన్స్ ఇందులో ఎన్టీఆర్ కి కూడా పడ్డాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే సలార్ సినిమాలో ఖాన్సర్ అనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసిన నీల్ ఈ సినిమా ను ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే ఒక ఆధిపత్య పోరుగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి ఆయన ఎలా తన పాత్రను ఎలా పోట్రే చేయబోతున్నాడు అనేది ఇప్పుడు కీలకంగా మారింది…

గ్లింప్స్ లో కొంతవరకు దూరంధర్ ఛాయలు కూడా కనిపించాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ భారీ సినిమాలను అత్యద్భుతమైన మేకింగ్ తో తెరకెక్కించగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు కాబట్టి ఈ సినిమాని సైతం భారీ రేంజ్ లోనే తీసి సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చాలా రోజుల నుంచి అప్డేట్ రావడం లేదు అంటూ ఎన్టీఆర్ అభిమానులైతే గోల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చినా నీల్ సినిమా మీద అమాంతం హైప్ ను పెంచేశాడు…

ఏపీ రాజకీయాల్లోకి ఆ హీరో భార్య!

Bhuma Mounika Reddy
Bhuma Mounika Reddy

Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మంచు ఫ్యామిలీ నుంచి ఒక మహిళ రానున్నారు. మంచు మోహన్ బాబు రెండో కోడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనికా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది. వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలో ఉంటారని భర్త మనోజ్ ప్రకటించారు. ఇటీవల ఈ దంపతులు ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే దానిని ప్రారంభించారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై మనోజ్ క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాల్లో భాగంగానే తాము ఆ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. తన భార్య మౌనికా రెడ్డి కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో మౌనిక రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది. అయితే ఏ పార్టీలో చేరుతారు అన్న విషయం పై మాత్రం మంచు మనోజ్ క్లారిటీ ఇవ్వలేదు.

* భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె..
మౌనికా రెడ్డి భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె. పెద్ద కుమార్తె అఖిల ప్రియా రెడ్డి ఆళ్లగడ్డ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాయలసీమలో భూమా కుటుంబానికి ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలు చేసిన భూమా తర్వాత కాలంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చారు. ప్రజారాజ్యం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత టిడిపిలోకి వచ్చారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పని చేయడం భూమా కుటుంబ ప్రత్యేకత. ఆళ్లగడ్డ తో పాటు నంద్యాల ప్రాంతంలో ఆ కుటుంబానికి మంచి పట్టు ఉంది. భూమా నాగిరెడ్డి చనిపోయిన సమయంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టిడిపి కి మద్దతుగా భూమా మౌనికా రెడ్డి ప్రచారం చేశారు. నిండు గర్భిణిగా ఉన్న సమయంలోనే ఆమె ప్రచార సభల్లో పాల్గొని మంచి వాగ్దాటితో ఆకట్టుకున్నారు.

* టిడిపి నుంచి పోటీ?
మంచు మనోజ్ మౌనికా రెడ్డి ని వివాహం ఆడిన తర్వాత.. మంచు ఫ్యామిలీలో చాలా రకాల పరిణామాలు జరిగాయి. అయితే ఇటీవల వివాదాలు అన్ని కొలిక్కి వచ్చాయి. మిరాయి చిత్రంతో నటుడిగా మళ్లీ తన సత్తా చాటుకున్నారు మనోజ్. అందుకే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు ఆ దంపతులు. అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీ పై మనోజ్ ప్రకటన చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో త్వరలో నియోజకవర్గాలు పెరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో మౌనిక రెడ్డి టిడిపి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన నుంచి పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎన్నికల ముంగిట దీనిపై క్లారిటీ రానుంది.

ఏపీలో మత వివాదాలు.. ఆ పార్టీకే నష్టం!

AP Politics
AP Politics

AP Religious Controversy: ఏపీలో ప్రస్తుతం భిన్న వాతావరణం కనిపిస్తోంది. ప్రధానంగా మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బయటపడుతున్నాయి. ఓ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే ఒక పాస్టర్ పై విశాఖ గ్రామీణ ప్రాంతంలో దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తనకు తాను దాడి చేయించుకుని సానుభూతి డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే మతపరమైన అంశాలు ఏపీలో ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అంతిమంగా ఓ పార్టీపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాల వెనుక ఆ పార్టీ ఉందన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం.

* కూటమి విడగొట్టేందుకు ప్రయత్నం
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. టిడిపి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జనసేనతో పాటు బిజెపి ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. అయితే ఆ మూడు పార్టీలు కలిసి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. కూటమి విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మరోవైపు మతపరమైన అంశాలు, దాడులు, కేసులు కూడా బయటపడుతున్నాయి. అయితే ఇదంతా ఉద్దేశపూర్వకం అని ఒక ప్రచారం ఉంది. అనుకూల విశ్లేషకులు, సోషల్ మీడియా ద్వారా ఏపీలో అస్థిరత సృష్టించేందుకు జరుగుతున్న కుట్రగా తెలుస్తోంది.

* మతపరమైన ముద్ర..
ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒక పార్టీకే నష్టం. ఇప్పటికీ ఆ పార్టీపై మతపరమైన ముద్ర ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ ఇటువంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.. అయితే ఒక మత పరంగానే కాదు.. రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కూడా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. సంతృప్తి కనిపిస్తోంది. దానిని చెడగొట్టేందుకు చేసే ప్రయత్నాలు ఇట్టే తెలిసిపోతాయి. ఎందుకంటే గతంలోనూ ఆ పార్టీ ఇటువంటివి చేసింది. అప్పుడు సక్సెస్ అయ్యాయి కానీ.. ఇప్పుడు ఎంత మాత్రం వర్కౌట్ కావు అనేది మెజారిటీ విశ్లేషకుల మాట.

మోడీ కొత్త టీం.. తెలుగు రాష్ట్రాల నుంచి వారికే ఛాన్స్!

Modi Cabinet Expansion
Modi Cabinet Expansion

Modi Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ప్రారంభం అయింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. అందుకే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలపై బలమైన చర్చ నడుస్తోంది. కొత్తగా కొంతమంది ఎంపీల పేర్లు కేంద్ర మంత్రులుగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో చేర్పులు మార్పులు ఉంటాయన్న టాక్ ఉంది. మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి.

* తెలంగాణలో ఆ ఇద్దరి మధ్య..
తెలంగాణకు సంబంధించి బండి సంజయ్ మార్పు ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల బండి సంజయ్ కుమారుడి వివాదంతో పొలిటికల్గా బిజెపికి డామేజ్ జరిగింది. అందుకే ఆయన మార్పు ఖాయమన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా ధర్మపురి అరవింద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన వరుసగా నిజామాబాద్ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. పిసిసి మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడే అరవింద్. పొలిటికల్ గా మంచి పట్టు ఉంది. ఆపై దూకుడు కలిగిన నేతగా గుర్తింపు ఉంది. బండి సంజయ్ మార్పు జరిగితే అరవింద్ వైపే హై కమాండ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు ఈటెల రాజేందర్ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కేంద్ర మంత్రి పదవితో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోరుకున్నారు. దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పైగా ఆయన తిరిగి గులాబీ పార్టీలో చేరిపోతారని కూడా తెగ ప్రచారం నడిచింది. ఒకవేళ బండి సంజయ్ మార్పు ఉంటే మాత్రం ఈటెల రాజేందర్ పేరు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

* ఏపీలో చేర్పులు మార్పులు..
ఏపీ నుంచి కూడా చాలామంది ఎంపీ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిజెపి నుంచి కేంద్రమంత్రిగా ఉన్న నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మను మార్చుతారన్న ప్రచారం ఉంది. ఆయన స్థానంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను తీసుకుంటారని తెలుస్తోంది. అదే సమయంలో పురందేశ్వరి పేరు కూడా వినిపిస్తోంది. ఆమె సైతం ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇంకో వైపు టిడిపికి మరో మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి బీసీ నేతగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఉంది. కోస్తాంధ్రలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అందుకే ఈసారి రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. అదే జరిగితే నంద్యాల ఎంపీగా ఉన్న బైరెడ్డి శబరి కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. జనసేనకు ఇవ్వాలనుకుంటే వల్లభనేని బాలశౌరి ఉన్నారు. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది ఊహాగానమేనా.. లేకుంటే నిజంగా కార్యరూపం దాల్చుతుందా? అనేది కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

బిజెపికి జగన్ శాశ్వత మిత్రుడు ఎలా?!

BJP And Jagan
BJP And Jagan

BJP And Jagan: భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఓ విశ్లేషకుడు చెప్పిన మాటలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా సర్కులేట్ చేస్తోంది. అయితే ఈ శాశ్వత స్నేహం అనేది ఎలా సాధ్యమో తెలియడం లేదు. బిజెపి సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటుంది వైసీపీ భావజాలం. సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా విభిన్నంగా ఉంటుంది. బిజెపి హిందుత్వ సిద్ధాంతాలతో ముందుకు వెళుతుంది అనేది బహిరంగ రహస్యం. అయితే జగన్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు బిజెపికి వ్యతిరేకంగా ఉంటుంది. అటువంటి వైసీపీని పట్టుకొని శాశ్వత మిత్రుడు అంటూ అమిత్ షా చెప్పారని చెప్పడం చూస్తుంటే మాత్రం దీని వెనుక రాజకీయ కోణం ఉందన్నది అర్థం అవుతోంది. అసలు అమిత్ షా అలా ఎందుకు అంటారు అనేది ప్రశ్న. ఇది కావాలనే చేస్తున్న ప్రచారంగా అర్థం అవుతోంది.

* అప్పటి మాదిరిగానే..
ఏపీలో కూటమిలో ఒక రకమైన గందరగోళం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నం అవుతుంది. గతంలో ప్రత్యేక హోదా విషయంలో ఇలాంటి గందరగోళం సృష్టించి లబ్ధి పొందింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును కార్నర్ చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేశారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం అన్నట్టు అనుమానాలు ఉన్నాయి. టిడిపి కీలక భాగస్వామి ఎన్డీఏలో. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామి. ఒక భాగస్వామి పార్టీ ఉండగా.. దాని ప్రత్యర్థి పార్టీని శాశ్విత మిత్రుడిగా ఎలా చూస్తారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా చేసుకుంటున్న ప్రచారం అని స్పష్టంగా తెలుస్తోంది.

* అంతిమంగా జగన్ కే నష్టం
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో కాస్త భయం ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల ఫలితాలే అందుకు కారణం. రాష్ట్రాలన్నీ బిజెపి చేతిలో ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లు మాత్రం అనుకున్నది సాధించలేకపోయింది. అందుకు చక్కటి ఉదాహరణ ఉత్తరప్రదేశ్. అటువంటి పరిస్థితి వస్తే సరైన మిత్రుడు ఉండడు. పోనీ జగన్ మోహన్ రెడ్డితో బిజెపి నేరుగా పొత్తు పెట్టుకోగలదా? బిజెపితో జగన్ కలవగలరా? మరి ఎలా శాశ్వత మిత్రుడు అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారికే తెలియాలి. ఆయనకు నేరుగా అమిత్ షా ఫోన్ చేశారా? లేకుంటే పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పారా? అనేది తెలియాలి. ఒకవేళ అమిత్ షా జగన్మోహన్ రెడ్డి తమకు శాశ్వత మిత్రుడు అని వైసిపి ప్రచారం చేసుకుంటే.. తమపై అవినీతి మరక పడుతుందని బిజెపి పెద్దలు భావిస్తే.. అది అసలుకే జగన్మోహన్ రెడ్డికి చేటు తెచ్చే అంశంగా మారిపోతుందని రాజకీయ అనుభవజ్ఞుల మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో..

YSRCP

YSRCP
YSRCP

YSRCP: ఏపీ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీని గట్టెక్కించడానికి కొంతమంది చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నంతకాలం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని అందరికీ తెలుసు. అందుకే కూటమిలో విభేదాల కోసం కుహనా మేధావులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మేధావుల ముసుగులో వారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు బయట పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్, ఫ్లేవర్ కనిపిస్తోంది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న టిడిపిని తాత్కాలిక భాగస్వామిగా.. జగన్మోహన్ రెడ్డిని సుదీర్ఘకాలం స్నేహితుడిగా అమిత్ షా పవన్ కళ్యాణ్ తో అన్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషించడం వెనుక పెద్ద వ్యూహం ఉన్నట్టు అర్థం అవుతోంది. దానిని వైయస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా ప్రొజెక్టు చేస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.

* జగన్ కు అనుకూలం
ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటుంది. అన్నింటికీ మించి తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుంది. కొద్ది రోజుల కిందట జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిశారట.. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కోరారట.. అందుకు అమిత్ షా తీవ్రంగా వ్యతిరేకించారట.. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అని చెప్పారట.. జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడట.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్లి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారట.. అదే విషయాన్ని కోర్ కమిటీలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ తో చెప్పించారట.. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. దానిపై వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

* క్లాస్ పీకితే పవన్ ఊరుకుంటారా..
ఒక్క మాట అనుకుందాం. అమిత్ షా కేంద్ర హోం మంత్రి కావచ్చు. బిజెపిలో నెంబర్ 2 కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం. ఒకరితో క్లాస్ పీకించే పరిస్థితి ఉండదు. అంతవరకు రానివ్వరు కూడా. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు విశ్లేషణ చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన భావనగా చెప్పవచ్చు. కూటమిలో విచ్ఛిన్నం తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం గా భావించవచ్చు. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. అర్జెంటుగా ఇప్పుడు టిడిపితో జనసేన విడిపోవాలి. బిజెపి సహకారం అందకూడదు. ఇప్పుడు అదే భావనతో ఈ కుహనా మేధావులు రంగంలోకి దిగుతున్నారు. అయితే గతం మాదిరిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారి విశ్లేషణను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. సమకాలీన రాజకీయ అంశాలపై లోతైన విశ్లేషణ ఆయన చేయవచ్చు కానీ.. ఎవరి భావజాలం ఎలా ఉంటుందో.. ప్రజలు ఇట్టే పసిగట్టేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ.. దానికి సోషల్ మీడియాలో ఇస్తున్న హైప్ అన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీని వెనుక ఉన్న పరమార్ధాన్ని గ్రహిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన జర్నలిస్టు.. ఆమె ప్రేమలో పడిపోయిన ధృవ్ రాటి, ప్రకాష్ రాజ్

Norway Journalist Controversy
Norway Journalist Controversy

Norway Journalist Controversy: నరేంద్ర మోడీ ఎవరు.. మన దేశ ప్రధాని. ఆయన పరిపాలనలో లోపాలు ఉండవచ్చు గాక.. ఆయన విధానాలలో లోపాలు ఉండవచ్చు గాక. అవి మనకు నచ్చకపోతే విమర్శించాలి. ఇబ్బందిగా ఉంటే ఆరోపించాలి. అంతేతప్ప ఆయనను పూర్తిగా వ్యతిరేకించకూడదు. కానీ నెత్తి మాసిన ప్రకాష్ రాజ్ , పనికిమాలిన ధృవ్ రాటికి అర్థం కావడం లేదు. పైగా ఉదయం లేస్తే మీరు నరేంద్ర మోడీ మీద విద్వేషాన్ని రగిలిస్తూనే ఉంటారు.

ధృవ్ రాటి ఎక్కడో జర్మనీలో ఉంటాడు. ప్రతిరోజు నరేంద్ర మోడీ మీద టన్నులకొద్దీ విషాన్ని చిమ్ముతూనే ఉంటాడు. పైగా రకరకాల వక్రీకరణలతో అదేదో బ్యాచ్ లాగా పనిచేస్తూ ఉంటాడు. యూట్యూబ్లో ఇతడికి కోటికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారంటే.. ఇతడి వెనుక ఎలాంటి గ్యాంగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక నేను ప్రశ్నిస్తూనే ఉంటా అనే వ్యక్తి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రామాయణ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. రాముడు గురించి ఇష్టం వచ్చినట్టు కూస్తూ ఉంటాడు. ఈ స్థాయిలో మాట్లాడుతున్న ఇతడు ఏమైనా శుద్ధ పూస అంటే.. అదేమీ లేదు. భార్యకు విడాకులు ఇచ్చాడు. తనకంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన కూడా నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఉంటాడు. నరేంద్ర మోడీ పెళ్లి చేసుకున్నాడు. చట్టబద్ధంగానే విడాకులు ఇచ్చాడు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టలేదు. ఏ మీనాడు కూడా ఆమె వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించలేదు. ఇతరుల మీద పరుష వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయంగా నరేంద్ర మోడీ ప్రత్యర్థుల పట్ల విమర్శలు మాత్రమే చేశారు. వారిని ఎన్నడు కూడా శత్రువులుగా చూడలేదు. కానీ ప్రకాష్ రాజ్ మాట్లాడితే విద్వేషానికి అంగీ లాగు తొడిగినట్టు ఉంటుంది.

ప్రకాష్ రాజ్ ఆమధ్య కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలేదు. మా ఎన్నికల పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలేదు. సుప్రసిద్ధ నటుడిగా పేరుపొందిన ప్రకాష్ రాజ్.. ఏనాడు కూడా సమయానికి సెట్ లోకి రాడు. నిర్మాత డబ్బుకు విలువ ఇవ్వడు. తను వచ్చినప్పుడు షూటింగ్ మొదలు పెట్టుకోవాలనుకుంటాడు. ఇటువంటి వ్యక్తి నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ ఉంటాడు.

రాటి, ప్రకాష్ రాజ్ టూల్ కిట్ బాగోతం ఇప్పుడు బయటపడింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్టు హెల్లీ లింగ్ ను రాటి, ప్రకాష్ రాజ్ అనుసరించడం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీని ప్రశ్నించక ముందు.. ఈమెకు ట్విట్టర్లో అంతగా ఫాలోవర్స్ ఉండేవారు కాదు. ఇప్పుడు ఏకంగా ఆ సంఖ్య 12వేలకు పెరిగిపోయింది. మోడీపై ద్వేషంతో ఈమెపై ప్రేమ కనబరుస్తున్న టూల్ కిట్ బ్యాచ్ కు మన దేశ ప్రధాని విలువ అర్థం కాదు. అర్థం చేసుకోలేరు. ఎంతైనా సోరోస్ స్కూల్ విద్యార్థులు కదా.. అలానే ఉంటారేమో.

'డ్రాగన్' గ్లింప్స్ లో ఎన్టీఆర్ నే డామినేట్ చేసిన ఈ కుర్రాడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

NTR Dragon Glimpse Review
NTR Dragon Glimpse Review

NTR Dragon Glimpse: ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న మేకర్స్ విడుదల చేసిన ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో కి సోషల్ మీడియా లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ నుండి ఒక సినిమా వస్తుందంటే , కచ్చితంగా కొన్ని ఎలిమెంట్స్ ని ఊహిస్తాము , అవి కాస్త తక్కువ అయినా కూడా మనం చాలా నిరాశకు గురి అవుతాము, కానీ మనం ఆయన సినిమా పై ఎన్ని అంచనాలు అయితే పెట్టుకుంటామో , ఆ అంచనాలను మించేలాగానే ఉంటాయి సినిమాలు. నిన్న విడుదల చేసిన డ్రాగన్ మూవీ గ్లింప్స్ ని చూస్తుంటే ప్రశాంత్ నీల్ మరోసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాడని అర్థం అవుతోంది. ఇదంతా పక్కన పెడితే ఈ గ్లింప్స్ వీడియో లో ఎన్టీఆర్ క్యారెక్టర్ తో పాటు, మిగిలిన క్యారెక్టర్స్ ని కూడా పరిచయం చేశాడు నీల్, వాటిల్లో బాబీ సర్కార్ అనే క్యారెక్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది .

పచ్చిగా చెప్పాలంటే ఇతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎన్టీఆర్ ని సైతం డామినేట్ చేసిందని సోషల్ మీడియా లో అందరూ అంటున్నారు. ఇంతకీ ఎవరు ఇతను?, ఈ రేంజ్ లో ఉన్నాడేంటి అని అతని గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు నెటిజెన్స్. అలా వెతకగా ఇతని పేరు రాఘవ్ జుయల్ అని తెలిసింది. ఇతను బాలీవుడ్ లో ఎక్కువగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తో బాగా హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత పలు టీవీ షోస్ లో కూడా కనిపించాడు. అలా వచ్చిన ఫేమ్ తో 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘కిల్’ మూవీ తో వెండితెర అరంగేట్రం చేసాడు . ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయనకు నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం లో నటించే అవకాశం దక్కింది.

ఈ సినిమా కి ముందే ఆయన ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రం లో నటిస్తున్నాడు. అలా బుల్లితెర నుండి నేది ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు రాఘవ్ జుయల్. ఈ సినిమాలో ఇతని క్యారెక్టర్ క్లిక్ అయితే రాబోయే రోజుల్లో ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా మారిపోతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు ఈ గ్లింప్స్ వీడియో ఇంకా చాలా మంది ప్రముఖ నటులు కనిపించారు , అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఉన్నాడు. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించినట్టు తెలుస్తోంది.

 

 

ఎన్టీఆర్ 'డ్రాగన్ ' గ్లింప్స్ రివ్యూ : నీల్ ప్రపంచం అద్భుతం.. కానీ ఆ ఒక్కటి తగ్గింది..

NTR Dragon Glimpse Review
NTR Dragon Glimpse Review

NTR Dragon Glimpse Review: ఎన్టీఆర్ అభిమానులతో పాటు, సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘డ్రాగన్’ గ్లింప్స్ వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ప్రశాంత్ నీల్ మీద ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోవచ్చు , ఆ అంచనాలకు మించే సినిమాని ఇస్తాడని అందరూ అంటుంటారు , ఈ గ్లింప్స్ వీడియో ని చూసిన తర్వాత కూడా అదే అనిపించింది. ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా ఆడియన్స్ ని ఆకర్షించేది స్టోరీ బిల్డింగ్. అంటే తన విజన్ లో ఉన్న ప్రపంచాన్ని వెండితెర పై ఆవిష్కరించడం. కేజీఎఫ్ లో కానీ, సలార్ లో కానీ, నీల్ నిర్మించిన ప్రపంచాలను అంతకు ముందు ఏ సినిమాలో కూడా మనం చూసి ఉండము . ఒక కమర్షియల్ సినిమాకు హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తోడు అయితే ఎలా ఉంటుందో , అదే నీల్ టేకింగ్. ‘డ్రాగన్’ కూడా అలాంటి సినిమానే.

బ్రిటిష్ వాళ్ళు మన దేశానికీ కాటన్ , స్టీల్ మరియు ఇతర ఖనిజాల కోసం వచ్చారు , కానీ వాళ్ళు మన భారతదేశం లో 250 ఏళ్ళు తిష్ట వేసుకొని కూర్చోవడానికి అసలు సిసలు కారణం , ఓపియం అనే మొక్క. దీని నుండే మాదకద్రవ్యాలను తయారు చేస్తారు. ఇది ఆఫ్ఘనిస్థాన్ మరియు గోల్డెన్ త్రైయాంగిల్ లో ఎక్కువ పండుతుంది, వీటిని ఉపయోగించుకొని బ్రిటిష్ వాళ్ళు ఎంత సంపద మూటగట్టుకున్నారు , కానీ వాళ్ళు ఇండియా ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ సంపద ని కూడా వదిలేసి వెళ్లిపోయారు , దాంతో ఆ వ్యాపారం రెండు గా చీలిపోయింది , ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ , మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ రెండు గ్యాంగ్స్ మధ్య జరిగే యుద్దాన్ని ఈ చిత్రం లో మనం చూడబోతున్నాము. స్టోరీ న్యారేషన్ ఎంతో ఆసక్తి కరంగా ఉంది కదూ , అదే విధంగా హీరోయిన్ రుక్మిణి వాసంత్ జెనిసిస్ తో విలన్స్ ని పరిచయం చేసే షాట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు.

దేవుడు ముందుగా కాంతిని సృష్టించాడు , రెండవ రోజు నింగి , నీరు సృష్టించాడు, మూడవ రోజు నేల ని సృష్టించాడు , నాల్గవ రోజు సూర్యుడు , నక్షత్రాలు, చంద్రుడు వంటి వాటిని సృష్టించాడు , 5 వ రోజు ఆయన ఆకాశం లో పక్షులు మరియు ఇతర జీవరాసులు సృష్టించాడు, 6 వ రోజు జంతువులూ , మనుషులను సృష్టించాడు , 7 వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు , అప్పుడే ఒక డెవిల్ పుట్టింది అంటూ ఎన్టీఆర్ ని పరిచయం చేస్తారు. గ్లింప్స్ మొత్తం అద్భుతంగా ఉంది కానీ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అసలు సూట్ అవ్వలేదని , ఆయన లుక్ ‘సలార్’ చిత్రం లో ప్రభాస్ కి స్పూఫ్ లాగా ఉందని, డైలాగ్ డెలివరీ కూడా ఆశించిన స్థాయిలో లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అయితే వేరే లెవెల్ లో ఉండేట్టు ఉంది కానీ , ఎన్టీఆర్ కి సూట్ అవుతుందో లేదో చూడాలి అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

 

ఈ రాశుల వారి ఇంట్లోకి ఈరోజు డబ్బు ప్రవాహం..

Today 27 June 2026 Horoscope
Today 27 June 2026 Horoscope

Today 20 May 2026 Horoscope:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి నిరుద్యోగులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు అందుతాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. పిల్లల కెరీర్ పై తల్లితండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు స్నేహితుల సలహా తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు . ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు రావడంతో వ్యాపారులు సంతోషంగా గడుపుతారు. అదనపు పెట్టుబడుల కోసం పెద్దలను సంప్రదిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు అన్ని పూర్తి చేస్తారు. దీంతో ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. స్నేహితుల మద్దతుతో అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల సపోర్టు ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు అందుతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలో రాణించడానికి తల్లిదండ్రుల మద్దతు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఊహించిన దానికంటే అధికంగా ఇంట్లోకి డబ్బు వస్తుంది. నీతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆదాయాన్ని పెంచుకునేందుకు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండాలి.

చంద్రబాబు గరిట తిప్పారు.. ఫేమస్ నెల్లూరు చేపల కూర వండారు..

chandrababu

Chandrababu Naidu : చంద్రబాబు ను హైటెక్ ముఖ్యమంత్రి అంటారు. అని ఆయన ఊర మాస్ అనే పదానికి పర్యాయపదం. ఆయన ఎప్పుడు క్లాస్ గా ఉండాలని అనుకుంటారు. కానీ, తనలో ఉన్న మాస్ అప్పీయరెన్స్ చూస్తే పసుపు పార్టీ అభిమానులు ఈలల మీద ఈలలు వేస్తారు. ఇక గోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు 2024 లో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సరికొత్తగా కనిపిస్తున్నారు. హైటెక్ ముఖ్యమంత్రిగా తనకున్న పేరును.. సరికొత్తగా మార్చుకుంటున్నారు. ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. తాజాగా ఏపీలో నెల్లూరు జిల్లాలో తుమ్మలపెంట ప్రాంతంలో జరిగిన మత్స్యకారుల సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ వెళ్లి చేపలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత గిరిబాబు అనే మత్స్యకారుడు ఇంటికి చంద్రబాబు వెళ్లారు. అతడు చేపల కూర వండుతుండగా.. చూశారు. తాను కూడా గరిట తిప్పి.. నెల్లూరు స్టైల్ చేపల కూరను అదిరిపోయే రేంజ్ లో వండారు.

కూర మొత్తం ఉడికిన తర్వాత గిరిబాబు కుటుంబ సభ్యులతో కలిసి చేపల కూరతో ఆహారం తిన్నారు. సాధారణంగా తినే తిండి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చంద్రబాబు.. ఈసారి మాత్రం తన శైలికి భిన్నంగా ఆహారం తిన్నారు. చేపల కూరను ఆస్వాదించారు. “నెల్లూరులో చేపల కూర ఎలా వండుతారు.. పచ్చి మామిడి ముక్కలు వేస్తేనే ఆ రుచి వస్తుందా.. సముద్రంలో ఎన్ని రోజులు వేటకు వెళ్తారు.. ఎన్ని రకాల చేపలు వేటలో లభ్యమవుతాయి.. మార్కెట్లో ధర ఎలా ఉంటుంది” ఈ విషయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు సాధారణంగా భోజనం చేయరు. ఆయన ఉదయం పూట మిల్లెట్స్ తో తయారుచేసిన టిఫిన్ తింటారు. కొవ్వు తీసిన పాలతో తయారుచేసిన కాఫీని తాగుతారు. అందులో షుగర్ వేసుకోరు. మధ్యాహ్నం కొర్రలు లేదా సామలు తింటారు. అందులో గ్రిల్డ్ ఫిష్ ఒక ముక్క ఉండేలా చూసుకుంటారు. సాయంత్రం ఫ్రూట్ సలాడ్ తింటారు. రాత్రి ఉడికించిన శనిగలు, రెండు పుల్కాలు తింటారు. సంవత్సరాలుగా చంద్రబాబు ఇదే డైట్ పాటిస్తున్నారు. అందువల్లే ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. యువకుల కంటే వేగంగా పనిచేస్తున్నారు.