Home Blog Page 251

ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!

Healthy Lifestyle Habits
Healthy Lifestyle Habits

Healthy Lifestyle Habits: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన 103 ఏళ్ల డాక్టర్ హోవార్డ్ టక్కర్ జీవితం మనందరికీ ఒక రోల్ మోడల్. వందేళ్లు దాటినా కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవిస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితం కోసం ఆయన ముఖ్యంగా మూడు అద్భుతమైన అలవాట్లను పాటించాలని సూచిస్తున్నారు. ఈ అలవాట్లు పాటిస్తే దీర్ఘాయిస్సు కూడా ఉంటుందని చెబుతున్నాడు. ఇంతకీ ఆ మూడు అలవాట్లు ఏంటంటే?

1. మెదడుకు పదును – నిరంతర అభ్యాసం:
మనం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎప్పుడూ చురుగ్గా ఉండాలని డాక్టర్ టక్కర్ బలంగా నమ్ముతారు. వయసు పెరిగేకొద్దీ చాలామంది ఆలోచించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం తగ్గించేస్తుంటారు. కానీ, మైండ్‌ను ఎప్పుడూ బిజీగా ఉంచడం వల్ల మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి. దీనికోసం ప్రతిరోజూ పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు (స్కిల్స్) నేర్చుకోవడం, విభిన్నమైన యాక్టివిటీస్‌లో పాల్గొనడం వంటివి చేయాలి. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉంటుందని, మెదడుకు ఎప్పుడూ పని పెట్టడమే దీర్ఘాయుష్షుకు మొదటి రహస్యమని ఆయన చెబుతారు.

2. నెగెటివిటీకి దూరం – ఒత్తిడి లేని మనసు
మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోపం, ద్వేషం, అసూయ, అసంతృప్తి వంటి ప్రతికూల భావాలు మనిషిని లోలోపల కుంగదీస్తాయి. ఈ నెగెటివిటీ వల్ల శరీరంలో హానికరమైన హార్మోన్లు విడుదలై తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) పెరుగుతుంది. ఈ ఒత్తిడే అనేక జబ్బులకు మూలకారణం అవుతుంది. అందుకే ఎవరిపైనా పగ, ద్వేషాలను మనసులో మోయకూడదని డాక్టర్ టక్కర్ సూచిస్తున్నారు. గతాన్ని వదిలేసి, క్షమించే గుణాన్ని అలవర్చుకుని ప్రశాంతంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, జీవితం సంతోషంగా సాగుతుంది.

3. మితమే హితం – నియంత్రణతో కూడిన జీవనం
జీవితాన్ని ఆస్వాదించడం అంటే హద్దులు మీరడం కాదు. ప్రతి విషయంలోనూ ఒక పరిమితిని పాటించడం. తినే ఆహారం, పాటించే లైఫ్ స్టైల్, మన కోరికలు.. ఇలా ఏవైనా సరే ‘అతి’ కాకుండా చూసుకోవాలి. నచ్చిన ఆహారాన్ని తినవచ్చు, కానీ అది అమితంగా ఉండకూడదు. అదేవిధంగా భౌతిక సుఖాల కోసమో, మితిమీరిన కోరికల కోసమో పరుగులు పెట్టకుండా, ఉన్నదానితో తృప్తి చెందుతూ లిమిట్స్ పాటించాలి. నియంత్రణతో కూడిన ఈ జీవన శైలి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా, జీవితంలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేలా చేస్తుందని ఈ శతాధిక వృద్ధ డాక్టర్ అనుభవపూర్వకంగా సలహా ఇస్తున్నారు.

మద్యం సేవించి ఆహారం తినకుండా నిద్రిస్తే ఎంత ప్రమాదమో తెలుసా..

Alcohol On Empty Stomach
Alcohol On Empty Stomach

Alcohol On Empty Stomach: ప్రస్తుత కాలంలో చాలా మంది యువత రాత్రిళ్లు మద్యం సేవించి భోజనం చేయకుండా నిద్రపోతున్నారు. ఇది ప్రమాదకర అలవాటుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించి ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో నిద్రపోవడం వల్ల శరీరంపై ఆల్కహాల్ ప్రభావం మరింత వేగంగా పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా జీర్ణాశయం, కాలేయం, నరాల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి అని చెబుతున్నారు. అసలు మద్యం సేవించి తినకుండా నిద్రిస్తే ఇంకా ఏం జరుగుతాయంటే?

మద్యం తాగిన తర్వాత ఆహారం తీసుకోకపోతే జీర్ణాశయంలో ఉండే సహజ రక్షణ పొర క్రమంగా దెబ్బతింటుంది. సాధారణంగా ఈ పొర కడుపులో ఉత్పత్తయ్యే యాసిడ్ నుంచి లోపలి చర్మాన్ని కాపాడుతుంది. కానీ ఆల్కహాల్ ఆ రక్షణ పొరను కరిగించడంతో యాసిడ్ నేరుగా జీర్ణాశయ గోడలను తాకి మంట, గాయాలు కలిగిస్తుంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి.

వైద్య నిపుణుల ప్రకారం.. ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల రక్తనాళాలు కూడా బలహీనపడతాయి. కొంతమందిలో వాంతులు, రక్త వాంతులు, కడుపులో బ్లీడింగ్ వంటి ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తాయి. దీర్ఘకాలం ఇలా కొనసాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా కేన్సర్‌కు కూడా దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మద్యం ప్రభావం ఎక్కువగా పడే అవయవం కాలేయం. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకుంటే అది చాలా వేగంగా రక్తంలో కలిసిపోతుంది. దీంతో కాలేయంపై అధిక ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, లివర్ సిరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కాలేయం పూర్తిగా పనిచేయకపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.

అలాగే రాత్రిళ్లు మద్యం సేవించి వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు పనితీరుపైనా ప్రభావం పడుతుంది. మొదట్లో మద్యం వల్ల త్వరగా నిద్ర వచ్చినట్టు అనిపించినా, అది నాణ్యమైన నిద్ర కాదు. మధ్యరాత్రిలో పలుమార్లు మేల్కొనడం, ఉదయం అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో మానసిక ఆందోళన, డిప్రెషన్ ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోవచ్చు. దీనివల్ల తలనిర్మళం, చెమటలు, బలహీనత, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మధుమేహ రోగుల్లో ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు.

వైద్య నిపుణులు చెబుతున్నదేమిటంటే, మద్యం సేవించకపోవడమే ఆరోగ్యానికి ఉత్తమ మార్గం. అయినప్పటికీ అలవాటు ఉన్నవారు కనీసం ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవద్దని సూచిస్తున్నారు. మితంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీరు తాగడం, తరచూ మద్యం సేవించకుండా ఉండడం ద్వారా కొంతవరకు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ కి బాలయ్య బాబు సినిమాలంటే ఇష్టమా..? తనకి నచ్చిన మూవీ ఇదే...

Gautam Krishna
Gautam Krishna

Mahesh Babu Son Gautam Krishna: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… కెరియర్ మొదట్లోనే స్టార్ హీరోగా అవతరించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు ప్లాపులను మూట గట్టుకున్నాడు. అయినప్పటికి తన పంథాను మార్చుకొని డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం తెలుగు మార్కెట్ కే పరిమితమైన ఆయన ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ఏకంగా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ ను రాపడుతుందా? లేదా అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఇక మహేష్ బాబు తనయుడు అయిన గౌతమ్ కృష్ణ సైతం సినిమా అంటే ఇష్టంతో పెరుగుతున్నాడు.

అలాగే తను నటనలో సైతం మెలుకువలు నేర్చుకోవడానికి మహేష్ బాబు అతనికి స్పెషల్ ట్రైనింగ్ ని కూడా ఇప్పిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చేసిన సినిమాలు నచ్చినప్పటికి బాలయ్య బాబు సినిమాలంటే మాత్రం అతనికి చాలా ఇష్టమట.

ఆయన చేసిన సినిమాల్లో ఒక రా ఎమోషన్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అతను ఆ సినిమాలంటే ఇష్టపడుతూ ఉంటారట. నిజానికి బాలయ్య బాబు చేసిన సినిమాల్లో లెజెండ్ సినిమా అంటే గౌతమ్ కృష్ణ కి విపరీతమైన ఇష్టమని ఇప్పటికి ఆ మూవీ టీవీలో వచ్చిన ప్రతి సారి దానిని మిస్ అవ్వకుండా చూస్తారట. మొత్తానికైతే బాలయ్య బాబు చేసే మాస్ కమర్షియల్ సినిమాలు ఈ జనరేషన్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తుండడం విశేషం…

ఇక దానికి తోడుగా మహేష్ బాబు కొడుకైన గౌతమ్ కృష్ణ కి విపరీతంగా నచ్చింది అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా గౌతమ్ తొందరలోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే ఘట్టమనేని ఫ్యామిలీ అభిమానులు సైతం ఆనందపడతారు…

మోడీ సార్ పాన్ రేటు కూడా పెంచుతరా.. మా హనుమంతన్న బాధ మీకు అర్థమైత లేదు..

V Hanumantha Rao
V Hanumantha Rao

V Hanumantha Rao: పెట్రోల్ పెరిగింది. డీజిల్ ధర కూడా పెరిగింది. నిత్యావసరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. యుద్ధం వల్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ధరలు పెంచడం వల్ల సామాన్యుల జీవితం మీద తీవ్రమైన ఇబ్బంది పడుతోందని.. ధరలు పెంచకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మొత్తం కలిపి మాట్లాడే విధానం ఒక విధంగా ఉంటే.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మాట్లాడే మాటలు మరో విధంగా ఉన్నాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి.

మన దేశంలో ఉపయోగించే క్రూడ్ ఆయిల్ అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ నుంచి మొదలుపెడితే.. అత్యంత ఖరీదైన బంగారం వరకు అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం. కేవలం ఇవి మాత్రమే.. చాలామంది సరదాగా తినే పాన్ లో ఉపయోగించే ముడి సరుకులు గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. అయితే యుద్ధం వల్ల పాన్ తయారీలో ఉపయోగించే ముడి సరుకులు ధర కూడా విపరీతంగా పెరిగింది. దీనిపై వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.”పెట్రోల్ ధరలు పెంచినవ్. డీజిల్ ధర కూడా పెంచినవ్.. అన్ని రేట్లు అడ్డగోలుగా పెంచినవ్. ఏం చేస్తున్నవో అర్థం కావడం లేదు. చివరికి పాన్ లో వాడే వస్తువులను కూడా వదిలిపెట్టవ. పాన్ తినే వాళ్ళ పరిస్థితి ఏంది. ఇంత ధరలు పెంచితే ఎట్ల తింటరు..మోడీ నీకు ఇది న్యాయం కాదు” అని హనుమంతరావు విమర్శించారు.

వాస్తవానికి ఈ కోణంలో ఏ కాంగ్రెస్ నాయకుడు.. ఏ బిఆర్ఎస్ నాయకుడు ఆలోచించలేదు. ఎంతసేపటికి పెట్రోల్ ధరలు.. డీజిల్ ధరల గురించి మాత్రమే మాట్లాడారు. కానీ చాలామంది పాన్ తినేవాళ్లు.. ధరలు పెరగడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే వారి తరఫున వి హనుమంతరావు వకల్తా పుచ్చుకున్నారు. మోడీ ధరలు తగ్గించు అంటూ డిమాండ్ చేశారు. హనుమంతరావు డిమాండ్ తో మోడీ తలవంచుతారా.. ధరలు తగ్గిస్తారా.. ఒకవేళ ధరలు తగ్గిస్తే మాత్రం హనుమంతరావు రేంజ్ తెలంగాణలో అమాంతం పెరుగుతుంది.

పరుగులే కాదు.. సంపాదనలోనూ విరాట్ కోహ్లీ కింగే..

Virat Kohli Earnings
Virat Kohli Earnings

Virat Kohli Earnings: విరాట్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అతడి గురించి ఎంత రాసినా సరే సరిపోదు. అతని గురించి ఎంత చెప్పినా సరే.. ఉపమానాలకు అందదు. ఎందుకంటే సమకాలీన క్రికెట్లో అతడు ఒక నిప్పు రవ్వ. పరుగుల చిరుత. విధ్వంసకారుడు. చేజింగ్ మాస్టర్. రన్ మిషన్.. అంతేకాదు హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ కూడా.

ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. అనేక సందర్భాలలో ఆరెంజ్ క్యాప్ సంపాదించుకున్నాడు. గత సీజన్లో బెంగళూరు జట్టు ఐపిఎల్ ట్రోఫీ అందుకోవడంలో కీలక భూమిక పోషించాడు. అదే కాదు తన విలువను కూడా మరింత పెంచుకున్నాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీ లోనే అత్యధిక మొత్తం సంపాదించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త ఘనత అందుకున్నాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఏకంగా 230 కోట్లు సంపాదించాడు. ఈ విషయాన్ని ఫెనాటిక్ స్పోర్ట్స్, హూరున్ నివేదికలు బయటపెట్టాయి. కెరియర్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు మాత్రమే ఆడుతున్నాడు. బెంగళూరు జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరించాడు.

విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ (227.2 కోట్లు), ధోని (చెన్నై సూపర్ కింగ్స్, 200 కోట్లు) రెండు, మూడు స్థానాలలో కొనసాగుతున్నారు. పరుగుల వరదను విపరీతంగా పారించడం వల్ల విరాట్ కోహ్లీ తన బ్రాండ్ విలువను భారీగా పెంచుకున్నాడు. ప్రతి సీజన్లోనూ అతడు వీపరితంగా పరుగులు చేస్తున్నాడు. కెరియర్ పరంగా చివరి దశలో ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ యువకులతో పోటీపడి బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగులు కూడా అదే స్థాయిలో సాధిస్తున్నాడు. అందువల్ల విరాట్ కోహ్లీ ఈ స్థాయిలో సంపాదిస్తున్నాడు.

విరాట్ కోహ్లి ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్లో నివాసం ఉంటున్నాడు. ఇతడికి కుమార్తె, కుమారుడు సంతానం. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ సతీమణి పిల్లలతో కలిసి ఇండియాలోనే ఉంటున్నది. విరాట్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్లను చూసేందుకు ఆమె మైదానంలోకి వస్తుంది. ఇంతవరకు విరాట్ కోహ్లీ పిల్లలను బయటికి తీసుకురాలేదు. వారి పిల్లల మృగాలను కూడా బయటకి చూపించలేదు. వారి విషయంలో విరాట్ కోహ్లీ అత్యంత జాగ్రత్తగా ఉంటున్నాడు.

వచ్చే ఏడాది రచ్చ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాల లిస్ట్ ఇదే...

Upcoming Telugu Movies 2026
Upcoming Telugu Movies 2026

Upcoming Telugu Movies 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. చాలామంది స్టార్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలందరు వచ్చే సంవత్సరం వాళ్ళ సినిమాలతో సందడి చేయబోతున్నారు. ఎవరెవరు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…

చిరంజీవి – బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా వచ్చే ఎడాది ప్రేక్షకులు ముందుకు రానుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆటోమేటిగ్గా ఈ కాంబో మీద విపరీతమైన బజ్ క్రియేట్ అయింది…

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా సైతం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట…

ఇక నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది… కళ్యాణ్ కృష్ణ అంటే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. కాబట్టి నాగార్జునతో మరోసారి కమర్షియల్ సినిమా చేసి సూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు… ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా సైతం వచ్చే ఏడాది మార్చి 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డివంగ ఉన్నాడు…

1500 కోట్లు బడ్జెట్ తో అత్యంత ప్రెస్టేజీయస్ గా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా సైతం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వ తేదీన ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ షరా వేగంగా జరుపుకుంటుంది. వచ్చేయ యేడాది ఈ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తారు. 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుందా లేదా అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది…

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీ దర్శకత్వంలో దొరికేకుతున్న డ్రాగన్ సినిమా సైతం వచ్చేయడాది ప్రేక్షకులందరికీ సిద్ధమవుతుంది షూటింగ్ 50% పూర్తయినప్పటికీ మొత్తాన్ని ఈ సంవత్సరం కంప్లీట్ చేసి వచ్చేయడాల్సిన వారు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టడానికి చేసుకుంటున్నారు…

అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో దొరికేకుతున్న సినిమా కూడా వచ్చేయడాదే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందట…

మొత్తానికి అయితే మన స్టార్ హీరోలు అందరూ వచ్చే ఏడాది వరుసగా బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు మరి ఇందులో ఎవరు పై చేసే సాధిస్తారు ఎవరు సక్సెస్ లను ముడగట్టుకుంటారు ఎవరు డిజాస్టర్ లను బాటపడతారని తెలియాల్సి ఉంది…

లాహోర్ నగరం మారిపోతుంది.. ఇండియా లో కలిసిపోవడం గ్యారంటీ

Lahore
Lahore

Lahore: పాకిస్తాన్.. ఈ దేశం పేరు చెబితే ఇస్లాం మతం గుర్తుకొస్తుంది. గతంలో పాకిస్తాన్ భారత దేశంలో అంతర్భాగమే. అప్పట్లో దేశ విభజన జరగడంతో పాకిస్తాన్ ఏర్పడింది.. పాకిస్తాన్ దేశంలో ఇస్లాం మతం ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ముస్లింలు మాత్రమే ఉంటారు. హిందువులు ఇక్కడ మైనారిటీలుగా ఉంటారు. పాకిస్తాన్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు హిందువులు అక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ముస్లింల చేతిలో దారుణాలకు గురవుతూనే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఏమాత్రం అభివృద్ధి సాధించలేదు. పైగా ఉగ్రవాదులతో అక్కడి పరిపాలకులు అంట కాగుతూ ఉంటారు. అందువల్ల అక్కడ నిత్యం దాడులు.. బాంబు పేలుళ్లు.. కాల్పులు చోటుచేసుకుంటాయి. మారణ హోమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లో ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని ఉగ్రవాదులే శాసిస్తూ ఉంటారు.

పాకిస్తాన్లో ప్రధాన నగరాలలో ఒకటి లాహోర్. ఈ నగరం ఇస్లామీకరణ గుర్తింపును క్రమంగా కోల్పోతుంది. ఎందుకంటే అక్కడ అనేక ప్రదేశాలకు హిందువులు, జైనులు, సిక్కులు వంటి వారి పేర్లను పునరుద్ధరిస్తున్నారు. లాహోర్ నగరంలో సైన్ బోర్డులపై పాత హిందూ, సిక్కులు, జైనుల పేర్లు మళ్లీ కనిపిస్తున్నాయి.

లాహోర్ నగరంలో ఇస్లాంపురం సైన్ బోర్డు ఇప్పుడు కృష్ణ నగర్ గా మారింది. బాబ్రీ మసీదు చౌక్ తిరిగి జైన్ మందిర్ గా రూపాంతరం చెందింది. రెహమాన్ గలి తిరిగి రామ్ గల్లి, ఫాతిమా జిన్నా రోడ్డు కాస్త క్వీన్స్ రోడ్డు గా మారిపోయింది. విభజన జరిగిన దాదాపు 80 సంవత్సరాల తర్వాత లాహోర్ నగరంలో ఉన్న ప్రాంతాలు పూర్వైభావాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇలా మార్చడానికి బలమైన కారణం ఉంది. ” మేము తీవ్రవాద ప్రతిబింబాన్ని వదిలించుకోవాలని అనుకుంటున్నాం. సమ్మిళిత, సహనశీల, బహుళ సాంస్కృతిక దేశంగా పరిణామం చెందాలని భావిస్తున్నాం. కొత్తగా ఏర్పడిన తీరును ప్రపంచానికి చూపించి.. తద్వారా దౌత్య, ఆర్థిక సాయాన్ని పొందాలని చూస్తున్నామని” పాకిస్తాన్ పాలకులు చెబుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దాయాది దేశం చాలాకాలంగా టెర్రరిజానికి నిధులు సమకూరుస్తోంది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అందువల్ల ఆ దేశానికి బిలియన్ డాలర్ల నష్టం ఎదురవుతోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షలు తిరిగి విధించకుండా ఉండేందుకు పాకిస్థాన్ కం క్రమంగా ఉగ్రవాదం నుంచి దూరంగా జరగాలని భావిస్తుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అంతేకాదు మనుగడ కోసం ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ మీద ఆధారపడి ఉంది.. ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇవ్వాలంటే.. కచ్చితంగా ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగువ్వాలి. రాజకీయంగా స్థిరత్వాన్ని కొనసాగించాలి. సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబించాలి. ఆ దేశంలో అసాంఘిక, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు ఉండకూడదు. విదేశీ పెట్టుబడిదారులు స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇస్తుంది.

మరోవైపు పాకిస్తాన్లో ఈ పేర్లు మార్చే కార్యక్రమాన్ని 2025లో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ మొదలుపెట్టారు. ఈ ప్రచారం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైల్ లో ఒక భాగం. ఈ ప్రాజెక్టు కోసం 50 బిలియన్ పాకిస్తాన్ రూపాయలను ఖర్చు పెడుతున్నారు. తద్వారా పాకిస్తాన్ దేశ సాంస్కృతిక రాజధాని లాహోర్ కు పూర్వపు వారసత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని.. వారసత్వ పర్యాటకం మెరుగుపడుతుందని మరియం నవాజ్ చెబుతున్నారు. కాగా లాహోర్ నగరం ఇలా మారిపోతున్న నేపథ్యంలో త్వరలో ఇండియాలో కలిసిపోతుందని భారతీయులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలా ఉంటే డ్రాగన్ 2000 కోట్లు కొల్లగొడుతుందా..?

NTR Dragon Movie
NTR Dragon Movie

NTR Dragon Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ మొత్తాన్ని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ వదిలారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా 2000 కోట్ల మార్క్ కలెక్షన్స్ ను వసూలు చేస్తుందంటూ ఇంతకుముందు మేకర్స్ భారీగా అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ గ్లింప్స్ ని చూసిన తర్వాత ఇందులో 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే మెటీరియల్ ఉందా అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సినిమాకి సంబంధించిన కథ ఏంటి అనేది మాత్రమే ఇక్కడ పరిచయం చేశారు. కాబట్టి సినిమా మొత్తాన్ని మనం అంచనా వేయలేం… సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగితే సినిమా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు బాగా నచ్చుతున్నాయి. కాబట్టి అక్కడ విపరీతమైన కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో వాళ్ళను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇక ఎన్టీఆర్ గతంలో చూసిన దేవర సినిమా అయితే ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదనే వార్తలు వస్తున్నాయి. సినిమాలో కథ బాగున్నప్పటికి ఆ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతుంది లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్ర చాలా బలమైనదిగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతుంది. ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేయగలుగుతుందా? లేదా అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది.

ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే కొంచెం లో లైటింగ్ లో ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాలో కొన్ని ఫ్రేమ్స్ చాలా బ్రైట్ గా పెట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ని నెంబర్ వన్ రైసులో ఉండే హీరోగా నిలుపుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిరి వెయిట్ చేయాల్సిందే…

ఆ రోజుల్లో అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చిన కొరటాల శివ...

Koratala Siva
Koratala Siva

Koratala Siva: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్లు ఎదగాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ లాంటి దర్శకుడు సైతం మొదట రైటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టినప్పటికి దర్శకుడిగా మారి మిర్చి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించి పెట్టిన ఆయన ఆ తర్వాత వెను తిరిగి చూడకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదుగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక అల్లు అర్జున్ కొరటాల శివ తో ఒక సినిమా చేయాలనుకున్నాడట. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి వరుస సక్సెస్ లను అందుకున్న కొరటాల శివ తో అతను సినిమా చేస్తే బాగుంటుందని తన సన్నిహితులు కూడా భావించారు. దాంతో అల్లు అర్జున్ కొరటాలను పిలిపించి మరి ఒక కథను రెడీ చేయమని చెప్పారట.

కానీ అప్పటికే కొరటాల శివకు మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమా చేసే కమిట్మెంట్ ఉండటం వల్ల అల్లు అర్జున్ తో సినిమా చేయడం కుదరలేదు. ఇక ఆచార్య తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు…

దాంతో ఆయన ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు. ప్రస్తుతం బాలయ్య బాబుతో ఒక పవర్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… ఈ సినిమా కనక పర్ఫెక్ట్ గా కుదిరితే మాత్రం కొరటాల శివ మరోసారి తన సత్తా చాటుకున్నవాడు అవుతాడు.

లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది. నిజానికి కొరటాల ప్రతి సినిమాలో కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి. ప్రతి సన్నివేశాన్ని మీటర్ మీద కొలిచినట్టుగా ఎంత భావోద్వేగం ఉండాలి, ఎంత యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి అనేది చాలా క్యాలిక్యులేటెడ్ గా చేసి మరి సక్సెస్ ని సాధిస్తూ ఉంటాడు…

జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి దువ్వాడ జంట!

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ జంట అంటే ముందుగా గుర్తొచ్చేది దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే మాధురితో వ్యవహారంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అయితే తిరిగి వైసిపిలో చేరి తానేంటో నిరూపిస్తానని దువ్వాడ శ్రీనివాస్ శపధం చేశారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గానే పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి వర్క్ అవుట్ కావడం లేదని అర్థం అవుతోంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తేవాలని ప్రయత్నాల్లో ఉన్నట్లు అర్థం అవుతోంది. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి విషయంలో పరోక్ష సంకేతాలు ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే.. కొత్త పార్టీ పెడితే కచ్చితంగా అధికారంలోకి వస్తారని దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్వెల మాధురి చెబుతున్నారు. కచ్చితంగా ఆ పార్టీలో చేరుతామని కూడా చెప్పుకొస్తున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారికి తలుపులు మూసివేసారని అర్థం అవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని వారు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు అయింది.

* వైసీపీ నుంచి వేటు
వ్యక్తిగత కుటుంబ వ్యవహారంతో దువ్వాడ శ్రీనివాస్ పై వేటు పడింది. దివ్వెల మాధురితో ఆయన సంబంధం వివాదానికి దారితీసింది. నాటకీయ పరిణామాల నడుమ ఆయనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేటు వేసింది. అయినా సరే తిరిగి వైసీపీలో చేరి సత్తా చాటుతానని గట్టిగానే చెబుతూ వచ్చారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రాలేదు. అయితే ఇటీవల మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తున్న దువ్వాడ శ్రీనివాస్ తన లైఫ్ .. తమిళనాడు సీఎం విజయ్ తో పోలిక ఉందని బాహటంగా ప్రకటించుకున్నారు. పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సీఎం అవుతారని తేల్చి చెప్పారు. ఆ పార్టీలో తనతో పాటు మాధురి కూడా చేరుతుందని ప్రకటించారు.

* రాజకీయాలకు దూరంగా..
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. తన పని తాను చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తూ విపరీతమైన స్టార్ డం ను సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. మొన్న తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ పైనే అంతటా ప్రచారం నడిచింది. తరువాత ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ తన ప్రభావం చూపుతారని ఆ ప్రచార సారాంశం. సరిగ్గా ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ తమిళనాడు విజయ్ జీవితాన్ని తన జీవితంతో పోల్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడో సినిమాలు చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు.. ఆయన అధికారంలోకి వచ్చేస్తున్నారంటూ.. ఆ పార్టీలో చేరుతానంటూ ఇలా విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. అయితే అది సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకునేందుకే కానీ.. అందులో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేస్తున్న వారు ఉన్నారు. అయితే ఇప్పటివరకు దువ్వాడ శ్రీనివాసును సాఫ్ట్ కార్నర్ తో చూసారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కానీ ఇప్పుడు ఆయన దృష్టి జూనియర్ ఎన్టీఆర్ పై పడడంపై మాత్రం తప్పుపడుతున్నారు.

ఇరాన్‌–అమెరికా ఉద్రిక్తతలు.. మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు?

Iran US Conflict Escalation
Iran US Conflict Escalation

Iran US Tensions: పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధం మొదలు పెట్టాడు. ఇజ్రాయెల్‌తో కలిసి దాదాపు 50 రోజులు భీకర దాడులు చేశారు. దీంతో ఇరాన్‌ కీలక నేతలు, సైనికాధికారులు మరణించినా యుద్ధంలో వెనక్కి తగ్గలేదు. అమెరికా దాడులను తట్టుకోవడంతోపాటు అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. దీంతో అమెరికాకు, అనుకూల దేశాలకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో అమెరికా పరోక్షంగా ఓడిపోయినట్లయింది. దీంతో పరువు పోకుండా ట్రంప్‌ చర్చల పేరుతో సీజ్‌ఫైర్‌ చేరుకున్నారు. కానీ తుది ఒప్పందం కుదరలేదు.

మళ్లీ యుద్ధ మేఘాలు..
ట్రంప్‌ పాలనలో ఇరాన్‌ విషయంలో అమెరికా ధోరణి మరోసారి కఠినంగా మారుతోంది. ఇటీవలి ప్రకటనలు, చర్యలు చూస్తే, రాజకీయ ఒత్తిడి, ఆర్థిక ఆంక్షలు, యుద్ధ సంకేతాలు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఇది కేవలం బెదిరింపులు మాత్రమేనా లేదా నిజమైన సంఘర్షణ దిశగా అడుగులు వేస్తున్నారా అనేది ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశమైంది.

తాజాగా ట్రంప్‌ హెచ్చరికలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరో దాడి అవసరమైతే వెనకాడేవాడిని కాదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి పరిమిత సమయమే ఇస్తున్నట్లు చెప్పడం ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ హెచ్చరికలు గతంలో ఇరాన్‌ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని ట్రంప్‌కు మాట ఇచ్చినట్లు తెలిపారు. ఇది అమెరికా దౌత్య విజయంగా చూడవచ్చు, కానీ చైనా–ఇరాన్‌ సంబంధాల లోతును పరిగణనలోకి తీసుకుంటే ఈ వాగ్దానం ఎంతవరకు నిలుస్తుందనేది సందేహాస్పదం.

యూఏఈపై డ్రోన్‌ దాడులు..
ప్రాంతీయ అస్థిరత సంకేతంగా గడిచిన 48 గంటల్లో ఇరాన్‌ నుంచి వచ్చిన ఆరు డ్రోన్లను యూఏఈ అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఇది హౌతీ తిరుగుబాటుదారులు లేదా ఇరాన్‌లో ఐఆర్‌జీసీ చేస్తున్న చర్యలకు సంకేతం. ఈ సంఘటనలు పర్షియన్‌ గల్ఫ్‌లో షిప్పింగ్‌ మార్గాలు, ఇంధన రవాణా భద్రతను ప్రభావితం చేస్తాయి. ఇటువంటి ఘటనలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతాయి.

ఇరాన్‌పై కొత్త ఆంక్షలు..
ఇదిలా ఉంటే.. అమెరికా ఆర్థిక యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్‌ ఫారిన్‌ కరెన్సీ ఎక్సే్ఛంజ్‌ సంస్థ ‘ఇబ్రహిమీ – అసోసియేట్స్‌’ (అమిన్‌ ఎక్సే్ఛంజ్‌)పై ఆంక్షలు విధించడం ద్వారా చైనా, హాంకాంగ్, యూఏఈలోని అనుబంధాలను టార్గెట్‌ చేసింది. ఇంకా 19 ఇరాన్‌ నౌకలపైనా ఆంక్షలు వచ్చాయి. ఈ చర్యలు ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడికి గురి చేస్తాయి. ఇరాన్‌ ఆయిల్‌ ఎగుమతులు, డాలర్‌ లావాదేవీలు ఇప్పటికే గణనీయంగా ప్రభావితమవుతున్నాయి.

అమెరికా టార్గెట్‌ అదే..
అమెరికా లక్ష్యం ఇరాన్‌ను ఒప్పందం వైపు లాగడం లేదా దాని ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించడమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, మధ్యప్రాచ్యంలో తన మిత్రదేశాల (ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ) భద్రతను కాపాడటం, చైనా–రష్యా ప్రభావాన్ని పరిమితం చేయడం. ఆంక్షల ఒత్తిడిలో దేశాంతరాల్లో ప్రాక్సీ శక్తుల ద్వారా ప్రతిస్పందించే అవకాశం ఉంది. డ్రోన్, క్షిపణి దాడులు పెరగవచ్చు.

చైనా, రష్యా వైపు ఇరాన్‌ మరింత మొగ్గు చూపితే అంతర్జాతీయ సంబంధాలు మారవచ్చు. ఇంధన ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రభావం చూపవచ్చు. ఇప్పటి వరకు ఆంక్షలు, హెచ్చరికలు, దౌత్యం ఒకేసారి నడుస్తున్నాయి. కానీ ఒక చిన్న తప్పిదం లేదా తీవ్రమైన ఘటన ఈ ఉద్రిక్తతలను పూర్తి స్థాయి సంఘర్షణగా మార్చే ప్రమాదం ఉంది.

ప్రత్యర్థులపై డ్రాగన్ లాగా రెచ్చిపోతున్న వైభవ్ సూర్యవంశీ.. ఇదేం కొట్టుడు రా బుడ్డోడా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: కనికరం లేదు.. దయా దాక్షిణ్యం లేదు. భయం అనేది లేదు. బెరుకు కనిపించడం లేదు. అతడికి తెలిసింది కేవలం ఒకటే కొట్టుడు. బీభత్సంగా బాదుడు.. ఈ సిద్ధాంతాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నాడు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు అదే టెంపో కొనసాగిస్తున్నాడు. అందువల్లే ఐపిఎల్ లో విధ్వంస కారుడిగా ముద్ర వేసుకున్నాడు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగుతోంది. ఈ 15 సంవత్సరాల బాలుడు అద్భుతాల మీద అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు 245 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 53 సిక్సర్లు.. 50 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా అతడు 579 పరుగులు చేశాడు. ప్రతి మూడు బంతుల్లో ఒకదానిని బౌండరీగా తరలిస్తున్నాడు. ఈ సీజన్లో 237 స్ట్రైక్ రేట్ తో 500 కు పైగా పరుగులు చేయడం టోర్నీలో ఇదే తొలిసారి. వైభవ్ ఇంకా 47 పరుగులు చేస్తే.. ఈ సీజన్లో అత్యధికంగా పరుగులు చేసిన అన్ క్యాప్డ్ ఆటగాడిగా జైస్వాల్ (625) రికార్డు బద్దలు కొడతాడు.

మంగళవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో ఐదు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. లక్నో ఆటగాడు మార్ష్(96) పరుగులు చేశాడు.. ఇంగ్లీస్ (60), రిషబ్ పంత్ (35) రన్స్ చేశారు. 221 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు జైస్వాల్ (43), సూర్య వంశీ (93) తిరుగులేని పునాది వేశారు. వీరిద్దరి తొలి వికెట్ కు 6.3 ఓవర్లలో 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్ జూరెల్ (53) తో కలిసి సూర్య వంశీ 105 పరుగులు జోడించాడు. సూర్య వంశీ అవుట్ అయిన తర్వాత.. ఫెరీర(16*) మిగతా బాధ్యతను పూర్తి చేశాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన రాజస్థాన్ ఏడు విజయాలు సాధించింది. రాజస్థాన్ జట్టు నెట్ రన్ రేట్+0.083 తో కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టు తన తదుపరి మ్యాచ్ మే 24న ముంబై ఇండియన్స్ తో ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. మిగతా జట్ల ఫలితంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ వెళ్తుంది.

తెలంగాణలో బిజెపిపై కుట్రకు వైసిపి సాయం!

Telangana BJP
Telangana BJP

Telangana BJP: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎవరికి ఎవరు మిత్రుడు.. ఎవరికి ఎవరు శత్రువు అన్నది తెలియకుండా పోతోంది. తెలంగాణలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు. అక్కడ గులాబీ పార్టీ గట్టిగానే దీనిపై రాజకీయ పోరాటం చేస్తోంది. బండి సంజయ్ ను రేవంత్ సర్కార్ కాపాడే ప్రయత్నం చేస్తుందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో ఈ కేసు విచారణ చేపడుతున్న న్యాయమూర్తి పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో అనుకూల తీర్పు ఇస్తే న్యాయమూర్తి భర్తకు ఓ పదవి ఆఫర్ చేశారు అనేది సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం. అయితే ఈ ప్రచారం చేసిన నిందితుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కావడం గమనార్హం. ఒకవైపు మనకు శాశ్వత మిత్రుడు జగన్ అంటూ బిజెపి పెద్దలు చెబుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అదే బిజెపి కేంద్రమంత్రి చుట్టూ జరుగుతున్న వివాదానికి.. గులాబీ పార్టీకి సాయం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా.

* బండి సంజయ్ కుమారుడికి వ్యతిరేకంగా
తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బండి సంజయ్ అనే నేత బిజెపికి చెందినవారు. ఆయన కుమారుడు లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. దానిని రాజకీయం చేస్తోంది గులాబీ పార్టీ. బండి సంజయ్ కు సీఎం రేవంత్ అండగా నిలుస్తున్నారు అనేది ఆ పార్టీ ప్రచారం. అదే ప్రచారం చేసింది వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్. అంటే పరస్పరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, గులాబీ పార్టీ సహకరించుకుంటున్నాయన్నమాట. అక్కడ బిజెపి కేంద్రమంత్రికి వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా తన బుద్ధిని బయట పెట్టుకుంది వైసీపీ. గెలవాలన్న ప్రయత్నంలో ఉంది తెలంగాణలో బిజెపి. అదే జరిగితే తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతోందని భయపడుతోంది గులాబీ పార్టీ. అదే గులాబీ పార్టీ అధికారంలోకి రావాలని కుట్రల్లో పాలుపంచుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఇలా ఒక విచిత్ర వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.

* గులాబీ టార్గెట్ అందుకే..
తెలంగాణలో బండి సంజయ్ బలమైన నేత. అధికారం నుంచి తమను దూరం చేశాడు అనే ఒకే ఒక్క కారణంతో బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది గులాబీ పార్టీ. బండి సంజయ్ ఇలాంటి బలమైన నేతను పలుచన చేస్తే బిజెపి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుందని భావిస్తోంది గులాబీ పార్టీ. ఒకవైపు బిజెపిని, మరోవైపు రేవంత్ సర్కార్ను బదనాం చేసేందుకు అవసరమైన సాయం అందిస్తోంది వైసిపి. ఒకవైపు జగన్ తమ శాశ్వత మిత్రుడు అంటూ బిజెపి పెద్దలు వ్యాఖ్యానించారు అంటూ ప్రచారం చేస్తోంది. అదే బిజెపిని తెలంగాణలో దారుణంగా దెబ్బతీస్తోంది. ఇక తెలుసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే.

చంద్రబాబు జపం లేనిదే పూట గడవట్లే!

Chandrababu
Chandrababu

Chandrababu: తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు గులాబీ పార్టీ భావజాలం ఒక్కటేనని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఆ రెండు పార్టీలు ఒకేసారి ఓడిపోయాయి. రాజకీయ ఉనికి చాటుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఆ రెండు పార్టీలకు సంబంధించి ఆడబిడ్డల పోరు ఉంది. అయితే ఆ రెండు పార్టీల విషయంలో ఏ పరిణామం జరిగినా దాని వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ఉంటారు అనే ప్రచారం ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తూ ఉంటుంది. వారికి ఎటువంటి చెడు జరిగినా.. అది చంద్రబాబు కుట్ర అని ఆరోపించడం వారికి అలవాటైన విద్య. చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత తన పార్టీ జెండాను పసుపు మయంగా మార్చడం వెనుక కూడా చంద్రబాబు ఉన్నారు అనేది గులాబీ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణ.

* అప్పుడు రేవంత్.. ఇప్పుడు కవిత
తెలంగాణకు సంబంధించి గులాబీ పార్టీని ఢీ కొట్టి నిలబడ్డారు రేవంత్ రెడ్డి. అంతకుముందు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అలా రేవంత్ పార్టీ మారడం వెనుక, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా రేవంత్ ఎంపిక వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు కవిత తన తండ్రి పార్టీని ఎదిరించి.. బయటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ జెండా పసుపు మయంగా కనిపిస్తోంది. దీని వెనుక కూడా చంద్రబాబు ఉన్నారు అనేది గులాబీ పార్టీ ఆరోపణ.

* కాంగ్రెస్ నుంచి షర్మిల వరకు..
ఏపీ విషయంలో చెప్పనవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే దాని వెనుక చంద్రబాబు ఉన్నారు అనేది జగన్ అనుమానం. వైయస్ కుటుంబంలో వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. దాని వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందారు జగన్ . తర్వాత సొంత కుటుంబ సభ్యులే ఆయనను హతమార్చారని.. వారిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని తల్లి విజయమ్మ, చెల్లెళ్లు షర్మిల, సునీతాలు ఆరోపించడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ ఎన్నికలకు ముందు పసుపు చీర కట్టుకుంటే షర్మిల చంద్రబాబు మనిషిగా జగన్ అభివర్ణించారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఏ పరిణామం జరిగినా.. దాని వెనుక చంద్రబాబు ఉన్నారు అనేది ఆ రెండు పార్టీల అనుమానం.

ఒక్క రనౌట్.. సెంచరీ మిస్.. మార్ష్ నుంచి కోహ్లీ దాకా ఎంతమంది ఉన్నారంటే..

Mitchell Marsh Run Out
Mitchell Marsh Run Out

Mitchell Marsh Run Out: ఐపీఎల్ లో పరుగుల వరద పారుతూ ఉంటుంది. బౌండరీ ల వర్షం కురుస్తూ ఉంటుంది. ప్లాట్ మైదానాలపై బ్యాటర్లు చెలరేగి ఆడుతుంటే అభిమానులు ఎగిరి గంతులు వేస్తారు. కొట్టు కొట్టు అంటూ బ్యాటర్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.

ఐపీఎల్ లో 20 ఓవర్లు మాత్రమే ఉంటాయి. స్వల్ప కాలంలో జరిగే ఈ మ్యాచ్లో భారీగా పరుగులు సాధించాలని ప్రతి ఆటగాడు అనుకుంటాడు. అందువల్లే ప్రారంభం నుంచి బౌలర్ల మీద బ్యాటర్లు ఎదురు దాడికి దిగుతుంటారు. ఫోర్ లను.. సిక్సర్ లను అలవోకగా కొడుతుంటారు. చూస్తుండగానే స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టిస్తుంటారు.. అందువల్లే ఐపిఎల్ లో పరుగుల ప్రవాహం జోరుగా సాగిపోతూ ఉంటుంది.

ఐపీఎల్ లో హాఫ్ సెంచరీలు మాత్రమే కాదు.. సెంచరీలు కూడా నమోదు అవుతుంటాయి. అయితే ఆటగాళ్లు వేగంగా ఆడే క్రమంలో.. తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు ప్లేయర్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. 90 పరుగులు దాటిన తర్వాత ప్లేయర్ల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సెంచరీ మార్క్ అందుకోవాలని తొందరలో బ్యాటర్లు వికెట్ చేజార్చుకుంటారు.

ఐపీఎల్ లో బ్యాటర్లు సెంచరీకి దగ్గరగా ఉన్నప్పుడు రన్ అవుట్ అయ్యి వెనక్కి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది మిచెల్ మార్ష్ రెండుసార్లు ఇలా ఔట్ అయ్యాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (99vs DC), గేల్(96 vs KKR), మిచెల్ మార్ష్(96 vs RR), మునువిందర్ బిస్లా(92 vs CSK) ,మిచెల్ మార్ష్ (90 vs CSK) ఉన్నారు.. రాజస్థాన్ జట్టుకు చేరిన మ్యాచ్ లో లక్నో ఆటగాడు మార్ష్ రనౌట్ అయ్యాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 96 పరుగులు చేసిన మార్ష్.. జైస్వాల్ విసిరిన బంతికి రన్ అవుట్ అయ్యాడు. ఇతడు 168.42 స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు చేశాడు. సెంచరీ కోల్పోయిన తర్వాత మార్ష్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.

పెట్రో ధరలు.. రూ.3 పెంచినందుకే గగ్గోలు.. ఆ దేశాల్లో ఎంత పెంచారో తెలిస్తే షాకే..!

Petrol Price Hike
Petrol Price Hike

Petrol Price Hike: పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. హర్మూజ్‌ మూసివేతతో గల్ఫ్‌ నుంచి యురోపియన్‌ యూనియన్‌తోపాటు ఆసియాలోని వివిధ దేశాలకు ఇంధన సరఫరా ఆగిపోయింది. దీంతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఇరాన్‌ శత్రు దేశాలు మినహా మిగతా ఓడలు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అయితే హర్మూజ్‌లో ట్రాఫిక్‌ కారణంగా నౌకల ప్రయాణం క్లిష్టంగా మారింది. దీంతో చాలా దేశాలు చమురు ధరలు పెంచాయి. యుద్ధం ప్రారంభమైన రెండు నెలల తర్వాత భారత్‌ కూడా ఇంధన ధరలు పెంచింది. దీనిపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

మయన్మార్‌లో భారీగా బాదుడు..
ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మే 15 వరకు లీటర్‌ పెట్రోల్‌పై మయన్మార్‌ 89.7% వరకూ, లీటర్‌‑డీజిల్‌పై 112.7% వరకూ ధరలు పెంచింది. ప్రపంచంలో ఇదే అత్యధిక పెంపు. ఇది గ్లోబల్‌ సరఫరాచైన్‌ కల్తీ, స్థానిక పాలనా వ్యవహారాలు లేదా కరెన్సీ సంక్షోభాల సంక్లిష్ట క్రియాచక్రాల ఫలితం కావచ్చు. చిన్న మార్కెట్లలో ఈ రకమైన భారీ ఒత్తిడి వాళ్ల ఆర్థిక వ్యవస్థలను నేలమాట చేస్తుంది. ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు దూకుడు, సరుకుల ధరలు అనూహ్యంగా పెరగటం, సాధ్యమైన సామాజిక అసంతృప్తికి కారణమవుతుంది.

పలు దేశాల్లో పెంపు ఇలా..
మన దాయాది దేశం పాకిస్తాన్‌లో పెట్రోల్‌ ధరలు 54.9 శాతం, డీజిల్‌ ధరలు 44.9 శాతం పెరిగాయి. మయన్మార్‌ తర్వాత పాకిస్తాన్‌లోనే గరిష్టంగా పెరిగింది. ఇక యూఏఈలో 52.4% (పెట్రోల్‌), 86.1% (డీజిల్‌) పెంపు, సాధారణంగా ఆయా దేశాల్లోని సబ్సిడీ తగ్గింపు లేదా గ్లోబల్‌ పెట్రోల్‌ వాహక ధరల ప్రభావం సూచిస్తుంది. అమెరికా వంటి పెద్ద మార్కెట్లలో పెట్రోల్‌ 44.5%, డీజిల్‌ 48.1% పెరగడం అనేది అంతర్జాతీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.

చైనా, ఫ్రాన్స్‌ నుంచి మధ్యంతర స్థాయిల వరకు
చైనా (పెట్రోల్‌ 21.7%, డీజిల్‌ 23.7%), ఫ్రాన్స్‌ (పెట్రోల్‌ 20.9%, డీజిల్‌ 31%)లో మధ్యస్థాయిలో పెరగడం, వీరు ప్రపంచ ఆర్థిక సంక్షోభాల బరువును కొంత మినహాయించుకుని ఉన్నప్పటికీ ఇంకొంచెం బాధ్యత హామిలా ఉంటుందని చూపిస్తుంది. ఇవి ఉత్పత్తి కనెక్టెడ్‌ డిమాండ్‌ మార్పులు, సంచార విధానాల తాత్కాలిక అనీయతలతో కూడా రెట్టింపు కాదు.

మన దేశంలో 4 శాతమే..
భారతంలో పెట్రోల్‌ ధర 4.2%, డీజిల్‌ 4.4% తక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వ సబ్సిడీలు లేదా పండిత కార్డుల ద్వారా ధరల నియంత్రణ కొనసాగడం. పౌర వాహనుల పై మోతాదులో డిమాండ్‌ పెరుగుదల కాకపోవడం లేదా స్థానిక మద్దతు విధానాలు.లేదా కరెన్సీ వాల్యూమ్స్, పర్థిత రిఫైనరీ అవుట్‌పుట్‌ పరిస్థితులు తాత్కాలికంగా భారత ధరలను వశీకరించినట్లై ఉంటుంది. ఈ పరిమిత పెంపు అన్ని సందర్భాలలో ప్రజలకి ఉపశమనం ఇవ్వవచ్చు. కానీ అది దీర్ఘకాలంలో ఖర్చును ప్రభుత్వ బడ్జెట్‌పై హెల్త్‌ చేసిన రీతిలోకి తీసుకెళ్తుంది. సబ్సిడీలు ఎక్కువసార్లు సంక్షేమ లక్ష్యాలను వేసుకున్నా, సమర్ధవంతమైన వినియోగాన్ని ప్రోత్సాహించే లేదా వనరుల దుర్వినియోగానికి దారితీస్తుంది.

రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..

Late Night Sleep
Late Night Sleep

Late Night Sleep: ఒకప్పుడు సాయంత్రం 8 అయితే చాలు బయట ఎవరూ ఉండేవారు కాదు. నగరాలు, పట్టణాలు మినహా.. మిగతా ప్రాంతాలలో జనం త్వరగానే పడుకుండిపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి పనులు చేసుకునేవారు. యాంత్రికరణ నాడు ఆ స్థాయిలో లేదు. అందువల్ల మనుషులకు శారీరకంగా శ్రమ అధికంగా ఉండేది. నాటి కాలంలో పెద్దగా జబ్బులు కూడా వచ్చేవి కాదు. స్మార్ట్ ఫోన్ వినియోగం.. టెక్నాలజీ ఈ స్థాయిలో అభివృద్ధి అనేవి నాటి కాలంలో కనిపించేవి కాదు.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యాంత్రికరణ అధికమైపోయింది. టెక్నాలజీ మీద ఆధారపడడం పెరిగిపోయింది. ఫలితంగా మనిషికి సుఖం అనేది ఎక్కువైపోయింది. దీనివల్ల సకాలంలో నిద్ర అనేది కరువైపోయింది. స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో చాలామంది రాత్రి 11 దాటిన తర్వాతే పడుకుంటున్నారు. కొంతమంది అయితే తెల్లవార్లు మెలకువ తోనే ఉంటున్నారు. దీనివల్ల మెటబాలిజం పూర్తిగా దెబ్బతింటున్నది. కొందరైతే రాత్రిపూట ఉద్యోగాల వల్ల నిద్రకు చాలా వరకు దూరమవుతున్నారు.

సకాలంలో నిద్రపోకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని.. అధిక రక్తపోటు సమస్య వేధిస్తుందని.. మధుమేహం
.. హృదయ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయని చెప్తున్నారు. ఏకాగ్రత.. జ్ఞాపకశక్తి తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి.. ఆందోళన విపరీతంగా పెరిగిపోతాయని చెబుతున్నారు. సకాలంలో నిద్ర పోకపోతే జీవ క్రియలు కూడా దెబ్బతింటాయని వైద్యులు అంటున్నారు.

ఒకవేళ అనివార్య పరిస్థితిలో నిద్ర ఆలస్యంగా పోతే.. ఏడు నుంచి 8 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోవాలని.. అప్పుడే శరీరానికి విశ్రాంతి లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం నడక లేదా రన్నింగ్ చేయాలి. కొవ్వు పదార్థాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి… నూనె తక్కువగా ఉండే ఆహార ప్రార్ధాలు తీసుకోవాలి. ఒత్తిడి ఏ మాత్రం లేకుండా చూసుకోవాలి.. ఇవన్నీ చేస్తే నిద్ర సులభంగా పడుతుందని.. ఎటువంటి ఇబ్బందులు లేకుండానే హాయిగా పడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు రాత్రిపూట మాంసాహారం తినకుండా.. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.