NTR Dragon Glimpse: ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న మేకర్స్ విడుదల చేసిన ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో కి సోషల్ మీడియా లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ నుండి ఒక సినిమా వస్తుందంటే , కచ్చితంగా కొన్ని ఎలిమెంట్స్ ని ఊహిస్తాము , అవి కాస్త తక్కువ అయినా కూడా మనం చాలా నిరాశకు గురి అవుతాము, కానీ మనం ఆయన సినిమా పై ఎన్ని అంచనాలు అయితే పెట్టుకుంటామో , ఆ అంచనాలను మించేలాగానే ఉంటాయి సినిమాలు. నిన్న విడుదల చేసిన డ్రాగన్ మూవీ గ్లింప్స్ ని చూస్తుంటే ప్రశాంత్ నీల్ మరోసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాడని అర్థం అవుతోంది. ఇదంతా పక్కన పెడితే ఈ గ్లింప్స్ వీడియో లో ఎన్టీఆర్ క్యారెక్టర్ తో పాటు, మిగిలిన క్యారెక్టర్స్ ని కూడా పరిచయం చేశాడు నీల్, వాటిల్లో బాబీ సర్కార్ అనే క్యారెక్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది .
పచ్చిగా చెప్పాలంటే ఇతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎన్టీఆర్ ని సైతం డామినేట్ చేసిందని సోషల్ మీడియా లో అందరూ అంటున్నారు. ఇంతకీ ఎవరు ఇతను?, ఈ రేంజ్ లో ఉన్నాడేంటి అని అతని గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు నెటిజెన్స్. అలా వెతకగా ఇతని పేరు రాఘవ్ జుయల్ అని తెలిసింది. ఇతను బాలీవుడ్ లో ఎక్కువగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తో బాగా హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత పలు టీవీ షోస్ లో కూడా కనిపించాడు. అలా వచ్చిన ఫేమ్ తో 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘కిల్’ మూవీ తో వెండితెర అరంగేట్రం చేసాడు . ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయనకు నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం లో నటించే అవకాశం దక్కింది.
ఈ సినిమా కి ముందే ఆయన ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రం లో నటిస్తున్నాడు. అలా బుల్లితెర నుండి నేది ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు రాఘవ్ జుయల్. ఈ సినిమాలో ఇతని క్యారెక్టర్ క్లిక్ అయితే రాబోయే రోజుల్లో ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా మారిపోతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు ఈ గ్లింప్స్ వీడియో ఇంకా చాలా మంది ప్రముఖ నటులు కనిపించారు , అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఉన్నాడు. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించినట్టు తెలుస్తోంది.
