Homeవింతలు-విశేషాలుLong Hair Village: మహిళల శిరోజాలతోనే ఈ గ్రామం ఫేమస్.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో...

Long Hair Village: మహిళల శిరోజాలతోనే ఈ గ్రామం ఫేమస్.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసా..

Long Hair Village: మామూలుగా అయితే గ్రామాలకు అక్కడి చారిత్రక నేపథ్యాలతో గుర్తింపు లభిస్తుంది. కొన్ని గ్రామాలైతే ఆలయాలకు.. ఇంకా కొన్ని గ్రామాలు చారిత్రాత్మక ప్రదేశాలకు.. మరికొన్ని గ్రామాలు ప్రత్యేకమైన వంటలకు.. ప్రత్యేక చిరునామాగా ఉంటాయి. కానీ, ఈ గ్రామం మాత్రం ఆడవాళ్ళ శిరోజాలతో గుర్తింపు పొందింది. కేవలం ఇక్కడి ఆడవాళ్ళ శిరోజాలను చూసేందుకే పర్యాటకులు వస్తారంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చైనా దేశంలోని హవాంగులు యావో అనే గ్రామంలో మహిళలకు అత్యంత […]

Long Hair Village: మామూలుగా అయితే గ్రామాలకు అక్కడి చారిత్రక నేపథ్యాలతో గుర్తింపు లభిస్తుంది. కొన్ని గ్రామాలైతే ఆలయాలకు.. ఇంకా కొన్ని గ్రామాలు చారిత్రాత్మక ప్రదేశాలకు.. మరికొన్ని గ్రామాలు ప్రత్యేకమైన వంటలకు.. ప్రత్యేక చిరునామాగా ఉంటాయి. కానీ, ఈ గ్రామం మాత్రం ఆడవాళ్ళ శిరోజాలతో గుర్తింపు పొందింది. కేవలం ఇక్కడి ఆడవాళ్ళ శిరోజాలను చూసేందుకే పర్యాటకులు వస్తారంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

చైనా దేశంలోని హవాంగులు యావో అనే గ్రామంలో మహిళలకు అత్యంత పొడవైన జుట్టు ఉంటుంది. ఈ గ్రామంలో రెడ్ యావో అనే తెగకు సంబంధించిన మహిళలు ఉంటారు. వీరికి 1.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవైన జుట్టు ఉంటుంది. వీరు జీవితంలో 18 సంవత్సరాల వయసులోనే ఒకే ఒక్కసారి తమ వెంట్రుకలను కత్తిరిస్తారు. పులియపెట్టిన బియ్యం.. నీటిని ఉపయోగించి జుట్టును శుభ్రం చేసుకుంటారు. ఫలితంగా ఆ జుట్టు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో రసాయనాలు ఉన్న షాంపూలను వాడారు. కృత్రిమమైన నూనెలు ఉపయోగించరు. కేవలం సహజసిద్దమైన పదార్థాలతోనే వారు జుట్టును మెరుగ్గా ఉంచుకుంటారు.

ఇక్కడ భౌగోళిక వాతావరణం కూడా మహిళల జుట్టు పెరగడానికి ఉపకరిస్తుంది. సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో వీరు జుట్టు సంరక్షణ చేసుకుంటారు. ఫలితంగా ఇక్కడ మహిళల శిరోజాలు పొడవు పెరుగుతాయి. అయితే ఇంత పొడవు పెరిగిన శిరోజాలను జడ వెయ్యాలంటే మాత్రం మరొకరి సహాయం ఖచ్చితంగా ఉండాలి. పూలు పెట్టుకునేటప్పుడు.. ఇతర స్థాయిలో అలంకరణలు చేసుకునేటప్పుడు కచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురు ఉండాల్సిందే. అయితే ఈ స్థాయిలో జుట్టు ఉన్నప్పటికీ ఇక్కడ మహిళల్లో సంతృప్తి లేదట. ఇంకా జుట్టు పెరగాలని వారు కోరుకుంటున్నారట.

సాధారణంగా చైనా మహిళలు జుట్టును అంతగా పెంచరు. ఒకవేళ పెంచినా సరే.. దానిని ఒక స్థాయి వరకే ఉంచుకుంటారు. కానీ ఈ గ్రామానికి చెందిన మహిళలు జుట్టును పెంచడంలో ప్రత్యేక తీరును ప్రదర్శిస్తున్నారు. అందువల్లే వారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే ఈ గ్రామంలో ఆడవాళ్లు జుట్టు ఈ స్థాయిలో ఎలా పెంచుకుంటున్నారు అనే విషయంపై గతంలో అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో తేలిన అంశాల ఆధారంగా.. ఇతర మహిళలు జుట్టు పెంచుకోవడం ప్రయత్నించారు. కొంతవరకు అది విజయవంతమైనప్పటికీ.. ఈ స్థాయిలో మహిళలు మాత్రం ఫలితం సాధించలేకపోయారు. ఈ గ్రామంలో భౌగోళిక వాతావరణం ఆడవాళ్ళ జుట్టు పెరుగుదలకు సహాయపడుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్లే ఈ ప్రాంతంలో మహిళల జుట్టు విపరీతంగా పొడవు ఉందని వారు వివరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper