Professor Nageswara Rao: ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతుంది. ఎందుకంటే ఆయన ఏపీలో కూటమి విచ్ఛిన్నం కోసం చిన్న పాటి ఒక ప్రయత్నం చేశారన్న విమర్శ ఉంది. జగన్మోహన్ రెడ్డి తమకు శాశ్వత మిత్రుడు అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నట్టు ప్రకటించేసారు. మధ్యలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఈ విశ్లేషణలో ఎంత మాత్రం నిజం లేదు అనేది ఇతర విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. పైగా ఎలాంటి నాగేశ్వరరావు.. ఇలా మారిపోయారు ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఆయన పాఠాలు చెబుతుంటే విద్యార్థులు మంత్రముగ్ధులై తరగతి గదిలో కనిపించేవారు. టీవీ డిబేట్లో ఆసక్తికర విశ్లేషణలు చేస్తే ఎక్కువమంది చూసేవారు. కేవలం తన విశ్లేషణలతో ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అయితే నాటి స్వతంత్ర విశ్లేషణ పోయింది. రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ వచ్చింది.
* ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డగోలు సమర్ధింపు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి అనుకూల విశ్లేషణ మొదలుపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. సమాజం మొత్తం తనను మేధావిగా కీర్తించడంతో అదే ధోరణితో ఆలోచనలు చేశారు. సమాజం మొత్తం వ్యతిరేకించే వాటిని సమర్థించడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమాజం మొత్తం వ్యతిరేకించింది. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడానికి అడ్డగోలుగా సమర్థించుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్యంతో మునిగిపోయాయి అంటే ఆయన విశ్లేషణ ఎంత అనుకూలంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నాడే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారు తప్పు అని చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకునే వారేమో.
* రాష్ట్రంలో కొత్త రచ్చ..
ఇప్పుడు బిజెపి శాశ్వత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అని.. ఆ మాట అన్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని.. పవన్ కళ్యాణ్ ను క్లాస్ పీకారని.. ఇలా రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ చేశారు. ఏపీ రాజకీయాల్లో కల్లోలం నింపే ప్రయత్నం చేశారు. స్వతంత్ర విశ్లేషణ నుంచి రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ వైపు నడిచారు. తనకున్న క్రెడిబిలిటీని దెబ్బ తీసుకున్నారు. ఒకప్పుడు టీవీ డిబేట్లకు ఆయనను పిలిచేవారు. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ ఛానల్ కు పరిమితం అవుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయన చేస్తున్న విశ్లేషణలు చూస్తుంటే మాత్రం… ఇప్పటివరకు ఆయనను అభిమానించేవారు సైతం వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయన మేధావి కాబట్టి.. విశ్లేషకుడు కాబట్టి.. దీనిని పట్టించుకుంటారనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అయితే మారిన విశ్లేషణ వైఖరి చూస్తుంటే మాత్రం అభిమానులకు ఇబ్బంది తెచ్చి పెడుతోంది.
























జగన్ ప్రెస్ మీట్.. సోషల్ మీడియాకు పండగే!
Jagan Press Meet: ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి హాజరు కావడం లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కేవలం 11 స్థానాలు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రావడంతో నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా రాదు. అదే విషయాన్ని ప్రభుత్వం తో పాటు స్పీకర్ తేల్చి చెప్పారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఆ అవకాశం లేకపోవడంతో వారాంతపు కామెంట్స్ అంటూ.. తాడేపల్లి లో ప్రెస్ మీట్ పెట్టి సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ అలా ప్రెస్ మీట్ పెడితే చాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బెదిరిపోతున్నాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నారు. ఆయన మాటల్లో తప్పిదాలు చోటు చేసుకోవడంతో.. రీల్స్, మీమ్స్ తో హోరెత్తిపోతోంది సోషల్ మీడియా..
* అప్పట్లో మీడియాకు దూరంగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. దీంతో ఆయనతో మాట్లాడేందుకు మీడియా చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. చివరకు ఢిల్లీ పర్యటన సమయంలో సైతం జగన్మోహన్ రెడ్డి మీడియాను దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చెప్పాలి అనుకుంటే.. రికార్డెడ్ తో కూడిన వీడియోను విడుదల చేసేవారు. వాటినే సాక్షితోపాటు మిగతా మీడియాకు విడుదల చేసేవారు. దీంతో అంతా జగన్మోహన్ రెడ్డి వాగ్దాటి గల మనిషి అని భావించేవారు. ఎటువంటి తత్తర పాటు లేకుండా మాట్లాడేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఏ మీడియాతో మాట్లాడే వారు కాదో.. అదే మీడియాతో వారాంతపు సమావేశాలు నిర్వహించి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్తున్నాయో లేదో చెప్పలేం కానీ.. ఆయన మాత్రం సోషల్ మీడియాలో టార్గెట్ అవుతున్నారు.
* గతంలో లోకేష్ కు..
గతంలో మంత్రి నారా లోకేష్ ను అలానే వెంటాడే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు. అయితే ఇప్పుడు వెంటాడకుండానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి సోషల్ మీడియాకు అవసరమైన వనరులను అందిస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈవారం తాడేపల్లి కి వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తిరిగి బెంగళూరు వెళ్ళిపోనున్నారు. దీంతో రెడీగా ఉన్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఆయన రెండు గంటలపాటు ఏకధాటిగా మీడియా సమావేశంలో పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఏదో ఒకటి తప్పుడుగా మాట్లాడి బుక్ అవుతున్నారు. మరి ఈరోజు ఎలాంటి తప్పుడు మాటలు వెలుగు చూస్తాయో చూడాలి.