Home Blog Page 247

ఇమ్రాన్ ఖాన్ తొలగింపు వెనుక అమెరికా.. వెలుగులోకి కుట్రకోణం

Imran Khan removal conspiracy
Imran Khan removal conspiracy

Imran Khan removal conspiracy: దేశాల మీద యుద్దాలు చేస్తుంది. అధ్యక్షులను అపహరిస్తుంది. చివరికి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదు. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. సుంకాల విధింపు నుంచి మొదలు పెడితే ఎన్నో దారుణాల దాకా అమెరికా చేసే పనులు ఉపోద్ఘాతాలకు అందవు. అందుకే అమెరికాను అత్యంత సామ్రాజ్యవాద దేశమని అంటుంటారు. గిట్టని వాళ్లను కొట్టి.. దండుకోవడంలో అమెరికా తర్వాతే ఎవరైనా. తనకు నచ్చని పాలకుడు అధికారంలో ఉంటే..అతడిని గద్దె నుంచి దించే దాకా అమెరికా నిద్రపోదు.

మన పొరుగున ఉన్న పాకిస్థాన్ కు గతంతో క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా పని చేశాడు. కొన్ని సందర్భాల్లో భారత్ అంటే కొంతలో కొంత అభిమానం చూపించే వాడు. పాకిస్థాన్ సైన్యాధిపతి పెత్తనాన్ని, సైనికుల దుర్మార్గాలను అతడు ప్రశ్నించేవాడు. పరిపాలనలో సంస్కరణలు చేపట్టేవాడు. అతడి పాలనలో దుర్మార్గాలు అంతగా సాగకపోవడంతో కొందరు అతడిని పదవి నుంచి తొలగించేందుకు పావులు కదపడం మొదలు పెట్టారు. దీనికి అమెరికా కూడా సహకరించిందనే ఆరోపణలున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ నుంచి పదవి నుంచి తొలగించేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా దౌత్య పత్రాలలీక్(సైఫర్ వివాదం) ఇటీవల వెలుగులోకి వచ్చింది. అమెరికా దౌత్యవేత్తగా పని చేసిన డొనాల్డ్ లూ, పాకిస్థాన్ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం ఓడిపోవాలని, అతడు దిగిపోతేనే అమెరికా, పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడతాయని చర్చలు జరిగాయని విమర్శలు వినిపించాయి.

ఈ విమర్శలను అమెరికా తోసిపుచ్చింది. నాయకత్వ మార్పు విషయంలో తమకు సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇదంతా కూడా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. అయితే ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడానికి అమెరికానే కారణమని డ్రాస్ సైట్ అనే ఇన్వెస్టిగేటింగ్ న్యూస్ ఏజెన్సీ సైఫర్ అనే దౌత్య పత్రాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిని ‘కేబుల్ ఐ 0678’ గా గుర్తించింది. ఆరేళ్ల క్రితం అవిశ్వాసతీర్మానంలో ఓడిపోవడానికి కంటే ముందు వాషింగ్టన్ లో నాటి పాకిస్థాన్ రాయబారి అసద్ ముజీద్, అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి డొనాల్డ్ లూ కీలక చర్చలు జరిగినట్టు సమాచారం.

అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ తన పదవి పోవడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. దీని వెనుక పాకిస్థాన్ ముస్లిం లీగ్ ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ వంటిపార్టీలు ఉన్నాయని విమర్శించారు. చివరికి డ్రాప్ సైట్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

విద్యార్థిపై కన్నేసింది.. చేయకూడని పని చేసింది.. చివరికి ఈ టీచర్ గతి ఏమైందంటే..

Teacher inappropriate behavior with Student
Teacher inappropriate behavior with Student

Teacher inappropriate behavior with Student: పాఠాలు చెప్పాల్సిన టీచర్ పక్కదారి పట్టింది.. విద్యార్థులలో తన పిల్లల్ని చూసుకోవాల్సింది పోయి.. పాడు ఆలోచన చేసింది.. చివరికి వక్రబుద్ధితో ఎంతటి దారుణం చేయాలో అంతటి దారుణం చేసేసింది.. కానీ టీచర్ గారి బాగోతం బయటపడింది. ఇప్పుడు చట్టం ముందు తలదించుకొని.. జైలు గోడల మధ్య జీవితాన్ని గడుపుతోంది.

అది ముంబై.. అక్కడ ఓ పాఠశాలలో మిహిర్(పేరు మార్చాం) అనే విద్యార్థి చదువుతున్నాడు. అదే పాఠశాలలో సమిత (పేరు మార్చాం) టీచర్ గా పని చేస్తోంది. మిహిర్ అందంగా ఉంటాడు. పైగా అతడికి కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు పోటీ జరుగుతుంది. అందులో మిహిర్ డ్యాన్స్ చేశాడు. అది సమిత చూసింది. అతడి దగ్గరకు వెళ్లి మాటలు మొదలుపెట్టింది. ఇలా ప్రతిరోజు అతడిని కలవడం, మాట్లాడటం అలవాటుగా మార్చుకుంది. ఆమె అలా మాట్లాడటం పట్ల మిహిర్ పెద్దగా అనుమానం వ్యక్తం చేసేవాడు కాదు. అయితే అతడితో వేరే సంబంధం పెట్టుకోవాలని సమిత భావించింది.. మొదట్లో అతడు ఆ బంధాన్ని తిరస్కరించాడు. కానీ ఆ తర్వాత సమిత ఒకరోజు అతడిని బలహీనమైన సందర్భంలో లొంగదీసుకుంది. ఆ తర్వాత ఏడాది పాటు అతనితో వ్యవహారం మొదలుపెట్టింది.. అతడికి మద్యం తాగించేది.. శారీరకంగా.. మానసికంగా వేధించేది. సమిత మాత్రమే కాదు.. ఆమె స్నేహితురాలు కూడా అతడిని ఫైవ్ స్టార్ హోటల్ తీసుకెళ్లేది. మద్యం తాగించేది. ఆ తర్వాత దారుణానికి పాల్పడేది..

మిహిర్ వార్షిక పరీక్షలు రాశాడు. పై చదువులకు వెళుతున్న క్రమంలో సమిత.. అతడిని ఎలాగైనా సరే శాశ్వతంగా తన వద్ద ఉంచుకోవాలని భావించింది. అయితే అప్పటికి సెలవులు రావడంతో అతడు ఇంటి వద్ద ఉండటం మొదలుపెట్టాడు. తన పని మనుషుల ద్వారా అతని గురించి తెలుసుకునేది.. అయితే మిహిర్ నిత్యం మూడిగా ఉండేవాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు. ఫలితంగా అతను చెప్పిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సమిత, ఆమె స్నేహితురాలిని అరెస్ట్ చేశారు. మిహిర్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే పద్యంలో పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. సమిత వాడిన కారు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. సాధారణంగా ఇటువంటి వ్యవహారాలలో మగవాళ్లు నిందితులుగా ఉంటారు. కానీ మిహిర్ తో సంబంధం పెట్టుకుని సమిత, ఆమె స్నేహితురాలు ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు..

ప్రెస్ మీట్ పెడితే జగన్ లో ఫ్రస్టేషన్!

Jagan Frustration
Jagan Frustration

Jagan Frustration: జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే ఏదో సంచలనం ఉంటుంది అనే రోజులు పోయాయి. ఎందుకంటే ప్రతివారం సంచలనాలు అంటే సాధ్యం కాదు కానీ. ఆయన సోషల్ మీడియాకు కావాల్సిన వార్తలను, ప్రాధాన్యత అంశాలను ఇచ్చి పోతున్నారన్న కామెంట్ ఉంది. ఈరోజు తాజాగా మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఆ మధ్యన విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తాడేపల్లికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో విశేషం ఉంటుంది అని అంతా ఆశించారు. కానీ ఆయన మాత్రం తనలో ఉన్న ఫ్రస్టేషన్ ను బయట పెట్టుకున్నారు. మరోసారి చంద్రబాబు వయస్సును గుర్తు చేసుకున్నారు. ఎంతోకాలం రాజకీయాలు చేయలేరని తనలో తాను ధైర్యం తెచ్చుకున్నట్టు ఉన్నారు. చంద్రబాబుకు గుండెపోటు వస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో మాటలు చెప్పారు.

మావిగన్ పేరు చెబితే చంద్రబాబుకు గుండెపోటు..
అయితే మరిచిపోయారు అనుకున్న మావిగన్ రాజధాని గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు జగన్. ఆ పేరు వింటేనే చంద్రబాబుకు గుండెపోటు వస్తుందని చెప్పారు. అయితే ఒక విషయం జగన్మోహన్ రెడ్డి మరిచారు. ఆయన ఏనాడైతే మావిగన్ అని ప్రతిపాదన చేశారో.. నాటి నుంచే విపరీతమైన ట్రోల్స్ కు గురయ్యారు. సోషల్ మీడియా కోడై కూసింది. వైసీపీ నేతలు సైతం ఆ పేరు పలికేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు అదే మావిగన్ పేరుతో చంద్రబాబు హడలెత్తిపోయారట.. ఆయనకు గుండెపోటు వచ్చినంత పనైందట.. ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పేసరికి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు సైతం షాక్ కు గురయ్యారు.. మరోవైపు అమరావతిపై మరోసారి విషం చిమ్మె ప్రయత్నం చేశారు. అయితే అందులో ఎవరికి పెద్దగా ఆశ్చర్యం లేదు కూడా. ఎందుకంటే సాక్షిలో వచ్చిన కథనాలనే తర్వాత ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తారు జగన్. అమరావతి విషయంలో జగన్ ఏం కామెంట్స్ చేసిన జనాలు పెద్దగా పట్టించుకోరు.

శాంతి భద్రతల విషయంలో..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో రాష్ట్రంలో శాంతిభద్రతల విషయం ప్రస్తావనకు వచ్చింది. కడపలో పెద్ద దస్తగిరి హత్య.. నకిలీ మద్యం దందాలు.. జోగి రమేష్ పై ప్రస్తావన ఇలా అన్నింటిని టిడిపి ఖాతాలో వేసి ప్రయత్నం చేశారు జగన్. జాతరలో జరిగిన గొడవతో పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యారని ఆయన భార్య చెప్పిన విషయాన్ని ఇప్పుడు జగన్ మరోసారి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తీరు చూస్తుంటే వైసీపీ నేతలకు సైతం మింగుడు పడడం లేదు. ప్రారంభంలో ఆహా ఓహో అన్నారు కానీ.. క్రమేపి వైసిపి నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి మరణాన్ని కోరుకోవడం.. ఆయన వయసును ప్రస్తావించడం.. ఇంకా ఎన్నాళ్లు బతుకుతాడు లే అనే మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డి నైజాన్ని బయటపెడుతోంది. ఈ వారాంతపు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డికి లాభం కంటే నష్టమే ఎక్కువగా చేకూరుస్తోంది.

పదవీ విరమణతో వైసీపీకి ఆ నేతల షాక్

YCP
YCP

Senior leaders shock to YCP: ఏపీలో రాజ్యసభ పదవుల సందడి మొదలైంది. నలుగురు పదవీ విరమణ చేయనున్నారు. ఆ నాలుగు పదవులు కూటమికి దక్కనున్నాయి. అయితే రాజ్యసభ పదవులకు ముగ్గురు వైసీపీ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి ఏంటనేది తెలియాల్సి ఉంది. వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ప్రచారం నడుస్తోంది. అందులో ఒకరు బిజెపి లోకి వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చుట్టూ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. ఇందులో సుభాష్ చంద్రబోస్ టిడిపి వైపు.. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బిజెపి వైపు వెళ్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చేనెల 21తో వారి రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఈరోజు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

నలుగురి పదవీ విరమణ..
ఏపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళనత్వాని, సానా సతీష్ పదవి విరమణ చేయనున్నారు. ఇందులో సతీష్ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు. ఏడాది కిందట ఆయనకు రాజ్యసభ పదవి దక్కింది. ఆ సమయంలోనే మరోసారి రెన్యువల్ చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పరిమళానత్వాన్ని బిజెపి కోటాలో అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవకాశమిచ్చింది. అయితే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ అడుగులు ఎటు వేస్తారా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ ఇద్దరు నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది.

ఆది నుంచి ఆళ్ల ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వస్తోంది. పార్టీకి అండదండగా నిలుస్తూ వచ్చారు అయోధ్య రామిరెడ్డి. ఆయన స్వతహాగా పారిశ్రామికవేత్త కూడా. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆయన వెంట అడుగులు వేస్తారు. అందుకే జగన్ ఆయనకు సుదీర్ఘకాలం రాజ్యసభ పదవి కట్టబెట్టారు. ఆయన సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంగళగిరి టిక్కెట్ ఇచ్చారు రెండుసార్లు. రామకృష్ణారెడ్డి రెండుసార్లు కూడా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం మొండి చేయి చూపారు. అప్పటినుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఏదో ఒక నిర్ణయానికి వస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది.

కుమారుడి కోసం..
పిల్లి సుభాష్ చంద్రబోస్ ది అదే పరిస్థితి. ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ మంత్రిగా కూడా వ్యవహరించారు. తర్వాత జగన్ వెంటే అడుగులు వేశారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అందుకే జగన్ ఆయనకు రాజ్యసభ అవకాశము ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన కుమారుడికి టికెట్ అడిగితే జగన్ నిరాకరించారు. అప్పటినుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. ఇప్పుడు భవిష్యత్తులో కుమారుడికి వైసీపీ టికెట్ దక్కేలా లేదు. అందుకే ఆయన సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఇద్దరు రాజ్యసభ పదవులు వదులుకున్న తర్వాత వైసీపీకి గుడ్ బై చెబుతారన్న టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

మీరు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులో తెలుసుకోవడం ఎలా..

Government Schemes Eligibility Check
Government Schemes Eligibility Check

Government Schemes Eligibility Check: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఎంతో మంది అర్హులైన ప్రజలు వాటి లబ్ధిని పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఏ పథకానికి తాము అర్హులో, ఎక్కడ దరఖాస్తు చేయాలో తెలియక చాలామంది మధ్యలోనే ఆగిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించింది. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగార్థులు, వృద్ధులు, చిన్న వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమాచారం కోసంwww.myscheme.gov.com ఇప్పుడు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది.ఇందులో రాష్ట్రం, వయసు, లింగం, వృత్తి, ఆదాయం, కులం వంటి కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేస్తే, వారికి సరిపోయే ప్రభుత్వ పథకాల జాబితా వెంటనే కనిపిస్తుంది. దీంతో తగిన స్కీమ్ కోసం వేర్వేరు వెబ్‌సైట్లలో వెతకాల్సిన అవసరం తగ్గుతుంది.

ఈ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్య కోసం స్కాలర్‌షిప్‌లు, రైతులకు సబ్సిడీలు, మహిళల స్వయం ఉపాధి పథకాలు, గృహ నిర్మాణ పథకాలు, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్ వంటి అనేక సేవలను ఒకే చోట తెలుసుకోవచ్చు. ప్రతి పథకం గురించి అర్హతలు, అవసరమైన పత్రాలు, చివరి తేదీలు వంటి పూర్తి సమాచారం కూడా అందుతుంది.

అంతేకాదు, కొన్ని పథకాల కోసం అదే పోర్టల్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసే సౌకర్యం కూడా ఉంది. దీంతో మధ్యవర్తుల అవసరం తగ్గి, ప్రజలు సులభంగా ఇంటి నుంచే అప్లై చేసుకునే అవకాశం కలుగుతోంది. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఎప్పుడైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

డిజిటల్ యుగంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంలో ఈ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది. సరైన సమాచారం లేక లబ్ధి కోల్పోతున్న వారికి ఇది ఒక మంచి మార్గదర్శక వేదికగా మారింది. ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒకసారి ఈ పోర్టల్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్.. మరో బిగ్ ప్లాన్.. గేమ్ చేంజర్ ఇదీ...

Microsoft
Microsoft

Microsoft Hyderabad Data Center: Microsoft సంస్థ భారతదేశంలో తన క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలను భారీగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖపట్నంలో ఒక Data center ను ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపిన ఐటీ దిగ్గజం, ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక డేటా సెంటర్ నిర్మాణానికి నడుం బిగించింది. ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడిగా ఇది నిలవనుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

గత సంవత్సరం డిసెంబర్‌లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన భారత ఏఐ (AI) పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తమ ఉనికిని, సాంకేతిక సామర్థ్యాన్ని మరింత విస్తరించడానికి రాబోయే నాలుగేళ్లలో కంపెనీ ఏకంగా 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో డాటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.అయితే 2026 మధ్య నాటికి ఈ కొత్త డేటా సెంటర్‌ను ప్రారంభించే అవకాశం ఉందని, దీనితో భారతదేశంలోనే మైక్రోసాఫ్ట్ అతిపెద్ద హైపర్‌స్కేల్ ఉనికిని కలిగి ఉంటుందని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు.

భారతదేశంలో మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవలతో పాటు, వారి సరికొత్త ఏఐ అసిస్టెంట్ ‘కోపైలట్ 365’ (Copilot 365) కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నెలకు సుమారు 30 డాలర్ల ధర కలిగిన ఈ అధునాతన ఏఐ సహాయకుడిని వినియోగించుకోవడానికి భారతీయ కార్పొరేట్ రంగం ఎంతో ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆసియా వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కేటాయించిన భారీ పెట్టుబడిలో సింహభాగం నేరుగా ఈ హైదరాబాద్ డేటా సెంటర్ నిర్మాణానికే తరలిరావడం విశేషం.
హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతున్న ఈ డేటా సెంటర్ ప్రధానంగా భారతదేశంలోని ప్రముఖ ఐటీ దిగ్గజాల ఏఐ సేవల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి ప్రధాన కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల కోసం డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. సమాచారం ప్రకారం.. ఈ టాప్ ఐటీ కంపెనీలలో ప్రతి ఒక్కటి ఇప్పటికే సుమారు 50,000 కోపైలట్ లైసెన్సులను కలిగి ఉన్నాయి. ఈ భారీ డిమాండ్‌కు అనుగుణంగా అత్యంత వేగవంతమైన, సురక్షితమైన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అందించడంలో హైదరాబాద్ డేటా సెంటర్ కీలక పాత్ర పోషించనుంది.

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !

Andhra Pradesh Heatwave
andhra Pradesh Heatwave

Andhra Pradesh Heatwave: ఏపీ ఉడికిపోతోంది. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు దాటుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే పరిస్థితి. ఇంటి నుంచి బయటకు రాలేం. ఇళ్లల్లో ఉండలేం అన్నట్టు ఉంది పరిస్థితి. సాయంత్రానికి గోడలు వేడెక్కిపోతున్నాయి. భానుడు ప్రచండుడిగా మారి నిప్పులు జరుగుతున్నాడు. బుధవారం పలనాడు జిల్లా పిడుగురాళ్లలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. 11 జిల్లాల్లో 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతట ఒకేలా పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీనికి తోడు వడగాలులు తోడవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
* ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దీనికి తోడు తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. వడదెబ్బకు నిన్నను ఇద్దరు మృతి చెందారు. ప్రధానంగా పని ప్రదేశాల్లో ఉపాధి వేతన దారులు కుప్పకూలిపోతున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా 300 మండలాల్లో ఈరోజు తీవ్రవాడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతోంది.
* ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో తీవ్రవాడగాలులు వీస్తాయి.
* శ్రీకాకుళం విజయనగరం తదితర ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉంది.
* ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తోంది. వేసవి సూచనలను చేస్తుంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇల్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తుంది. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది.

పాపం నాగబాబు.. పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు

Nagababu
Nagababu

Nagababu: జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. ఏడాది కిందట ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. క్యాబినెట్ లో ఉన్న ఒక్కగానొక్క మంత్రి పదవి ఆయనతో భర్తీ చేస్తారని ప్రచారం నడిచింది. 24 మంత్రి పదవులు భర్తీ చేసిన చంద్రబాబు ఒకదానిని మాత్రం ఖాళీగా ఉంచారు. రాజ్యసభ ఎంపికలో సమీకరణలు మారడంతో నాగబాబుకు అవకాశం దక్కలేదు. అందుకే మంత్రిని చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనుకున్నట్టుగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో వెంటనే మంత్రిగా ప్రమాణం చేయిస్తారని అంతా భావించారు. కానీ దాదాపు 13 నెలలు దాటుతున్నా.. ఇంకా ఎమ్మెల్సీ గానే ఉన్నారు నాగబాబు. అమాత్య పదవిని అందుకోలేకపోయారు.

* పెద్దల సభకు వెళ్లాలని..
ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి పోటీ చేసి ఓడిపోయారు మెగా బ్రదర్ నాగబాబు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో చాలా యాక్టివ్ గా పని చేశారు. మెగాస్టార్ చిరంజీవికి అండగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ జనసేన ను ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్లీ సినిమాల వైపు వెళ్లిపోయారు. కానీ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు తిరిగి ఆక్టివయ్యారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని చూసారు. కానీ అందుకు ఛాన్స్ దక్కలేదు. అందుకే కూటమి గెలుపు కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే తనకు రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచన ఉన్నట్లు సన్నిహితుల వద్ద పేర్కొన్నారు. అది వీలుకాక పోవడంతో మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఏడాదిన్నర దాటుతున్న కార్యరూపం దాల్చడం లేదు.

* విస్తరణ పై కొనసాగుతున్న సస్పెన్స్..
జూన్ 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతుంది. అయితే అప్పుడే విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. మరో ఏడాది వరకు విస్తరణ చేపట్టే అవకాశం లేదన్న టాక్ కూడా ఉంది. చాలామంది మంత్రులను మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తారు అన్న ప్రచారం ఉంది. అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు కు మంత్రిగా చాన్స్ లభిస్తుంది అనేది ఎక్కువ మంది వాదన. అలాగే వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలని నాగబాబు భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారట. అయితే నాగబాబు అమాత్య అనే పదవి సొంతం చేసుకునేందుకు మరో ఏడాది సమయం పట్టి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

నాగిని ఎద అందాలు చూడతరమా?

Mouni Roy beige couture gown
Mouni Roy beige couture gown

"కుర్చీ మడత పెట్టి".. తాత జీవితం ఇలా ముగిసిపోయింది.. ఇంత దారుణం జరిగిందా..

Kurchi Thatha Death
Kurchi Thatha Death

Kurchi Thatha Death: అప్పట్లో సోషల్ మీడియాలో కుర్చీ మడత పెట్టి తాత కొద్ది రోజులపాటు సంచలనం సృష్టించాడు. ఏకంగా అతని మీద గుంటూరు కారం సినిమాలో ఒక పాట కూడా రూపొందించారు. ఆ పాట యూట్యూబ్లో కొన్ని కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. మహేష్ బాబు సినీ కెరియర్ లోనే హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా అది రికార్డు సృష్టించింది.

ఆ పాట రూపొందించడానికి ప్రధాన కారణమైన కుర్చీ తాత అలియాస్ మహమ్మద్ పాషా కన్నుమూశారు. మహమ్మద్ పాషా వయసు 64 సంవత్సరాలు. ఇన్ హైదరాబాద్ నగరంలోని కృష్ణకాంత్ పార్క్ లో మంగళవారం ఉదయపు నడక నడుస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వడదెబ్బ వల్ల ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కుర్చీ తాత అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బ వల్ల కొంతమేర ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో కూడా చూపించారు. అయితే మార్నింగ్ వాక్ చేస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. చాతిలో నొప్పి వస్తుందని చెప్పుకుంటూనే కన్నుమూశారు.

కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా విపరీతంగా ఎండలు నమోదు అవుతున్నాయి. దీనివల్ల చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్దలు, వృద్ధులు, చిన్నారులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా వడదెబ్బతో చనిపోయే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. అందువల్లే ఎండాకాలంలో ముఖ్యంగా ప్రస్తుత కాలంలో బయటికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల అకస్మాత్తుగా గుండెపోటు మరణాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కుర్చీ తాత కూడా అలానే చనిపోయాడు. ఆయన మరణం పట్ల చుట్టుపక్కల వారు సంతాపం వ్యక్తం చేశారు.

కుర్చీ తాత ఆరోగ్యంగానే ఉండేవారు. ఆయనకు ఆగ్రహం ఎక్కువ. పైగా సమాజంలో పెడపోకడల మీద ఆయన తనదైన శైలిలో స్పందించేవారు. అందువల్లే అప్పట్లో యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కుర్చి మడత పెట్టి.. అనే పదాన్ని వాడారు. అది కాస్త విపరీతంగా సర్కులేట్ అయింది. ఎవరికి మహమ్మద్ భాషను సోషల్ మీడియా స్టార్ ను చేసింది. వ్యూస్ కోసం ఆయనను వాడుకున్న సినిమా వాళ్లు.. యూట్యూబర్లు తర్వాత పట్టించుకోలేదు. కొన్ని సందర్భాలలో కుర్చీ తాత పలు ప్రాంతాల్లో కనిపించారు.

‘రామ బాణం’వెనుక అసలు కథ ఇదే..

Rama Banam
Rama Banam

Rama Banam: భారతీయ సంస్కృతిలో ‘రామ బాణం’అనే పదానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక పని అనుకున్న విధంగా పూర్తి చేయడం.. గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవడం, చెప్పిన మాట ఖచ్చితంగా నిజం కావడం వంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ‘రామ బాణం’అంటే తప్పకుండా ఫలితాన్ని ఇచ్చే అస్త్రం అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ పద ప్రయోగం వెనుక ఉన్న పురాణ కథ ఉంది. ఆ వివారల్లోకి వెళితె..

హిందూ ఇతిహాసమైన రామాయణంలో శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలుస్తాడు. ఆయన చేతిలోని కోదండం, దానిలో నుంచి ప్రయోగించే బాణాలు అపారమైన శక్తిని కలిగి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. రాముడు ధర్మబద్ధంగా, నిజాయితీతో యుద్ధం చేయడం వల్ల ఆయన బాణం ఎప్పుడూ గురి తప్పదని ప్రజల నమ్మకం. అందుకే ఖచ్చితమైన విజయాన్ని ‘రామ బాణం’తో పోల్చడం ప్రారంభమైందని పండితులు వివరిస్తారు.

లంక యుద్ధంలో ఈ పదానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టం కనిపిస్తుంది. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు ఎంతో మహా వీరుడు. అతడు అనేక దివ్యాస్త్రాలను సంపాదించి దేవతలను కూడా ఓడించిన యోధుడిగా పేరు పొందాడు. యుద్ధంలో అతడిని ఎదుర్కోవడం దేవతలకే కష్టమని వర్ణనలు ఉన్నాయి. శ్రీరాముడి వానరసేన కూడా అతడి మాయా యుద్ధాలకు ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇంద్రజిత్తును సంహరించేందుకు లక్ష్మణుడు అనేక అస్త్రాలను ప్రయోగించినా అవి పెద్దగా ఫలితం ఇవ్వలేదని కథనం చెబుతుంది. చివరికి లక్ష్మణుడు తన అన్న అయిన శ్రీరాముడు ధర్మస్వరూపుడని, ఆయన సత్యవంతుడని స్మరించుకుంటూ ఒక దివ్యబాణాన్ని సంధిస్తాడు. ‘రాముడు నిజమైన ధర్మపరుడు అయితే ఈ బాణం తప్పకుండా లక్ష్యాన్ని చేధించాలి’ అని సంకల్పించి బాణాన్ని ప్రయోగించాడని పురాణ కథనాలు పేర్కొంటాయి.

అప్పుడు ఆ బాణం నేరుగా వెళ్లి ఇంద్రజిత్తు తలను ఖండించిందని చెబుతారు. ఈ సంఘటన తర్వాత ‘రాముడి పేరు మీద సంధించిన బాణం ఎప్పుడూ గురి తప్పదు’ అనే నమ్మకం మరింత బలపడింది. అదే కాలక్రమేణా ‘రామ బాణం’ అనే జాతీయంగా ప్రజల్లో విస్తరించిందని పండితుల అభిప్రాయం.

ఇంకో కోణంలో చూస్తే ‘రామ బాణం’ అనేది కేవలం ఒక ఆయుధానికి సంబంధించిన పదం కాదు. అది సత్యం, ధర్మం, నిబద్ధత, అచంచల విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. మంచి ఉద్దేశంతో చేసిన పని చివరికి విజయాన్ని అందిస్తుందనే భారతీయ తత్వాన్ని కూడా ఈ పద ప్రయోగం ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం కూడా రాజకీయాల్లో, వైద్యరంగంలో, సామాజిక చర్చల్లో ‘ఇది రామ బాణంలా పనిచేస్తుంది’ అనే మాట తరచూ వినిపిస్తుంది. అంటే సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే మార్గం అని అర్థం.

నంద్యాల వదిలి కర్నూలు.. బైరెడ్డి పక్కా స్కెచ్!

Baireddy Siddharth Reddy
Baireddy Siddharth Reddy

Baireddy Siddharth Reddy: కర్నూలు జిల్లా వైసీపీ రాజకీయాల్లో యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్ద రచ్చ పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక్కడే నాయకుడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు దూకుడు పెంచినట్లు అర్థం అవుతోంది. ఇటీవల ఆయన మంత్రి టీజీ భరత్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని సవాల్ చేస్తూ టీజీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీసులు జారీ చేశారు. అయితే సిద్ధార్థ రెడ్డి ఈ సంచలన కామెంట్స్ వెనుక భారీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అది అంతర్గతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నట్లు సమాచారం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

* మంత్రిపైనే ఆరోపణలు..
ఇటీవల కర్నూలు జిల్లాలో దూకుడు పెంచారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంత్రి టీజీ భరత్ ను టార్గెట్ చేసుకున్నారు. ఓ పరిశ్రమ ఏర్పాటుకు 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు చేశారు. మధ్యలో లోకేష్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఈ తరుణంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రంగంలోకి దిగారు. సోదరుడు సిద్ధార్థ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే నేరుగా మంత్రి టీజీ భరత్ సిద్ధార్థ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా సిద్ధార్థ రెడ్డి పేరు మార్మోగిపోయింది. అయితే పక్కా వ్యూహంతో కర్నూలుపై కన్నేసిన సిద్ధార్థ రెడ్డి టీజీ భరత్ ను టార్గెట్ చేసుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసేందుకే సిద్ధార్థ రెడ్డి ఈ ఎత్తుగడ వేసినట్టు గుర్తించారు. అందుకే హై కమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

* పార్టీలో ప్రకంపనలు..
వచ్చే ఎన్నికల్లో కర్నూలు నగరంలో పోటీ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది నేతలు ఉన్నారు. ఇప్పటికే వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ నంద్యాల జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలు నగర నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు నగరం నుంచి పోటీ చేసేందుకు గాను సిద్ధార్థ రెడ్డి ఎత్తుగడ వేసినట్లు అర్థం అవుతుంది. అయితే దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రోత్సాహంతోనే సిద్ధార్థ రెడ్డి రాజకీయంగా దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే కర్నూలు వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

కింజరాపు రామ్మోహన్ నాయుడు మార్పు తప్పదా?

Kinjarapu Ram Mohan Naidu
Kinjarapu Ram Mohan Naidu

Kinjarapu Ram Mohan Naidu: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న బలమైన చర్చ నడుస్తోంది. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. కొత్త టీం రావడంతో పాటు కొందరి మంత్రుల ఉద్వాసన ఉండబోతుందన్న టాక్ కూడా ఉంది. కొందరి మంత్రి పదవులు చేర్పులు మార్పులు ఖాయమన్న చర్చ నడుస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు ఉంటుందన్న టాక్ నడుస్తోంది. పౌర విమానయాన శాఖ నుంచి ఆయనకు వేరే శాఖకు బదిలీ చేస్తారని కూడా తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ పరిధిలో ఇటీవల జరిగిన పరిణామాలతో రామ్మోహన్ నాయుడు మార్పు అనివార్యం అని సమాచారం. అయితే రామ్మోహన్ నాయుడుకు ఏ శాఖ ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

* కీలకమైన పోర్టు పోలియో..
శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి విజయం సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడును కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఎన్డీఏలో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో రామ్మోహన్ నాయుడుకు కీలకమైన పౌర విమానయాన శాఖ దక్కింది. అయితే పౌర విమానయాన శాఖ అనేది ఇప్పటికే ప్రైవేటీకరణ ఎక్కువగా జరిగింది. దీంతో ఆ శాఖ పరిధిలో చేసే అవకాశం ఏదీ లేదు. 2014లో కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం పార్టీగా టిడిపి ఉండేది. ఆ సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు వ్యవహరించేవారు. 2018లో టిడిపి ఎన్ డి ఏ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పదవిని వదులుకున్నారు అశోక్ గజపతిరాజు. దానిని కొనసాగింపుగా రామ్మోహన్ నాయుడుకు ఆ పదవి దక్కింది. అయితే పౌర విమానయాన శాఖలో నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. దీంతో అది రామ్మోహన్ నాయుడుకు మైనస్ గా మారింది. అందుకే ఆయన శాఖ మార్పు ఉంటుందన్న టాక్ మొదలైంది.

* తండ్రి నిర్వర్తించిన శాఖ.
రామ్మోహన్ నాయుడుకు కొత్తగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పదవిని ఆయన తండ్రి కింజరాపు ఎర్రం నాయుడు నిర్వర్తించారు. 1996 సమయంలో జాతీయస్థాయిలో కూటమి ప్రభుత్వాలు నడుస్తుండేవి. ఆ సమయంలో టిడిపి కీలకంగా ఉండేది. అందుకే ఎర్రం నాయుడుకు గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు పంచాయతీరాజ్ శాఖ దక్కింది. ఒక విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రం నాయుడు ప్రాబల్యం ఆశాఖ ద్వారానే పెరిగింది. ఇప్పుడు మరోసారి రామ్మోహన్ నాయుడుకు అదే శాఖ కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఆడవారి పాట.. మగవారి ఆట.. ఉద్దానంలో పండుగల స్పెషల్ అదే!

Uddanam Folk Songs
Uddanam Folk Songs

Uddanam Folk Songs: జనం నోటి నుంచి వచ్చేది జానపదం. ప్రజల కష్టసుఖాలు, భావోద్వేగాలను పలికిస్తోంది ఈ పురాతన కళారూపం. ఏ సందర్భానైనా భావాన్ని ప్రకటించగల గొప్ప స్వరూపం జానపదాలది. అటువంటి జానపదాల పుట్టినిల్లు ఉత్తరాంధ్ర. శ్రమజీవి కష్టంలో వినిపిస్తుంటుంది. వారి ఆనందంలోనూ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవత పండుగలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామ దేవతలను ఆహ్వానిస్తూ అక్కడి మహిళలు సైతం జానపదాలను పాడుతున్నారు. ప్రస్తుతం ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* జానపదాలకు పెట్టింది పేరు..
శ్రీకాకుళం జిల్లాలో జానపదాలకు పెట్టింది పేరు ఉద్దానం. అక్కడ మహిళలు సైతం జానపదాలను పాడుతుంటారు. అయితే మిగతా ప్రాంతాలకు అవి కొత్తగా కనిపిస్తాయి కానీ.. ఈ ప్రాంతం వారికి మాత్రం అవి ఒక ఆణిముత్యాలు. ప్రతి పాట వెనుక ఒక పరమార్ధం ఉంటుంది. పాటలో ప్రతి మాట వెనుక అర్థం దాగి ఉంటుంది. అంతలా పెనవేసుకుపోయింది జానపదం. అయితే అక్కడ మహిళలు కూడా జానపద కళాకారులే. ప్రస్తుతం ఈ గ్రామంలో చూసినా.. మహిళలు పాట పాడుతూ గ్రామదేవతలను ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ గ్రామ దేవత పండుగలే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

* వాయిద్య సహకారం..
చిన్నపిల్లాది మొదలు పెద్దవారి వరకు ఈ జానపదాలను అలవోకగా పాడగలరు. అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా యాదవ మహిళలు జానపదాల్లో ముందుంటారు. తమదైన శైలిలో పాడుతుంటారు. అయితే ఈ పాటకు లయబద్ధంగా సాగే వాయిద్యాలు ప్రత్యేకం. ఎలాంటి పాటనైనా.. ఇలాంటి మాట నైనా లయబద్ధం కల్పించడం ఈ వాయిద్యాల సహజ లక్షణం. అందుకే గ్రామ దేవత పండుగలు ఈ వాయిద్యాలు సైతం కీలక భూమిక వహిస్తాయి. అయితే గ్రామ దేవతలను ఆహ్వానించే తీరు.. జానపదాల రూపంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థం అవుతుంది.

జగన్ వర్సెస్ బాలినేని.. ఈరోజు ప్రకంపనలే!

Jagan Vs Balineni
Jagan Vs Balineni

Jagan Vs Balineni: మరికొద్ది క్షణాల్లో ఏపీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకోనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో మీడియా ముందుకు రానున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు వచ్చిన ఆయన తాడేపల్లికి ఈ వారం వచ్చారు. తిరిగి బెంగళూరుకు వెళ్తూ వెళ్తూ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మరోవైపు అదే సమయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ యధాలపంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నడవనుంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం సాక్షి మీడియాలో తనపై వచ్చిన కథనాల గురించి సమగ్రంగా వివరించనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం, తన నుంచి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా లాక్కున్న వ్యాపారాలు గురించి సమగ్రంగా వివరించనున్నారు. దీంతో అందరి దృష్టి ఆ ఇద్దరు నేతలపై పడింది. కచ్చితంగా ఏదో ఒక రాజకీయ సంచలనం నమోదు కానుంది అనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

* ఇటీవల చంద్రబాబుతో భేటీ..
ఏడాది కిందట జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకు వ్యతిరేక ముద్ర తో రాజకీయం నడిపారు బాలినేని. కానీ అదే చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇంతలోనే సాక్షి మీడియాలో బాలినేనికి వ్యతిరేకంగా పతాక స్థాయిలో కథనాలు వచ్చాయి. దీనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు మాజీమంత్రి. సాక్షిలో తనపై వచ్చిన కథనాల పై పూర్తి స్పష్టత నిచ్చేందుకు.. అసలు తెర వెనుక ఏం జరిగింది.. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తన చుట్టూ జరిగిన రాజకీయ కుట్రలు.. తన వ్యాపారాలను అడ్డగోలుగా బదలాయింపులు వంటి వాటిపై పూర్తి స్పష్టతనివ్వనున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సంచలన ప్రకటనలు ఉంటాయని కూడా ప్రచారం నడుస్తోంది.

* సంచలనాల నమోదు.
జగన్మోహన్ రెడ్డి సైతం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే అనుకూల జర్నలిస్టులను పిలిచి.. కొన్ని రకాల మైకులు పెట్టి.. రికార్డెడ్ వీడియోలను ఎడిటింగ్ చేసి.. ఈ వారం విడుదల చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. జగన్ మీడియా సమావేశం అంటేనే సోషల్ మీడియా కు పండుగలా మారుతుంది. అందుకే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం లైవ్ టెలికాస్ట్ లో మాట్లాడనున్నారు. జగన్మోహన్ రెడ్డి రికార్డ్ ప్రెస్ మీట్ వీడియోలు మీడియా చేతికి చిక్కి.. ప్రసారం కాకమునుపే బాలినేని లైవ్ టెలికాస్ట్ ప్రసారం కానుంది.. సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది..

ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నాడు?

Professor Nageswara Rao
Professor Nageswara Rao

Professor Nageswara Rao: ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతుంది. ఎందుకంటే ఆయన ఏపీలో కూటమి విచ్ఛిన్నం కోసం చిన్న పాటి ఒక ప్రయత్నం చేశారన్న విమర్శ ఉంది. జగన్మోహన్ రెడ్డి తమకు శాశ్వత మిత్రుడు అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నట్టు ప్రకటించేసారు. మధ్యలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఈ విశ్లేషణలో ఎంత మాత్రం నిజం లేదు అనేది ఇతర విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. పైగా ఎలాంటి నాగేశ్వరరావు.. ఇలా మారిపోయారు ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఆయన పాఠాలు చెబుతుంటే విద్యార్థులు మంత్రముగ్ధులై తరగతి గదిలో కనిపించేవారు. టీవీ డిబేట్లో ఆసక్తికర విశ్లేషణలు చేస్తే ఎక్కువమంది చూసేవారు. కేవలం తన విశ్లేషణలతో ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అయితే నాటి స్వతంత్ర విశ్లేషణ పోయింది. రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ వచ్చింది.

* ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డగోలు సమర్ధింపు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి అనుకూల విశ్లేషణ మొదలుపెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. సమాజం మొత్తం తనను మేధావిగా కీర్తించడంతో అదే ధోరణితో ఆలోచనలు చేశారు. సమాజం మొత్తం వ్యతిరేకించే వాటిని సమర్థించడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమాజం మొత్తం వ్యతిరేకించింది. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడానికి అడ్డగోలుగా సమర్థించుకున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్యంతో మునిగిపోయాయి అంటే ఆయన విశ్లేషణ ఎంత అనుకూలంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నాడే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారు తప్పు అని చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకునే వారేమో.

* రాష్ట్రంలో కొత్త రచ్చ..
ఇప్పుడు బిజెపి శాశ్వత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అని.. ఆ మాట అన్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని.. పవన్ కళ్యాణ్ ను క్లాస్ పీకారని.. ఇలా రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ చేశారు. ఏపీ రాజకీయాల్లో కల్లోలం నింపే ప్రయత్నం చేశారు. స్వతంత్ర విశ్లేషణ నుంచి రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ వైపు నడిచారు. తనకున్న క్రెడిబిలిటీని దెబ్బ తీసుకున్నారు. ఒకప్పుడు టీవీ డిబేట్లకు ఆయనను పిలిచేవారు. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ ఛానల్ కు పరిమితం అవుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయన చేస్తున్న విశ్లేషణలు చూస్తుంటే మాత్రం… ఇప్పటివరకు ఆయనను అభిమానించేవారు సైతం వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయన మేధావి కాబట్టి.. విశ్లేషకుడు కాబట్టి.. దీనిని పట్టించుకుంటారనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అయితే మారిన విశ్లేషణ వైఖరి చూస్తుంటే మాత్రం అభిమానులకు ఇబ్బంది తెచ్చి పెడుతోంది.

‘ఆటా-సటా’పై హైకోర్టు ఆగ్రహం.. ఈ పద్ధతిలో పెళ్లిళ్లు ఎలా ఉంటాయి..

Rajasthan Marriage Tradition
Rajasthan Marriage Tradition

Rajasthan Marriage Tradition: భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాత సామాజిక ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి సంప్రదాయాల్లో రాజస్థాన్‌లో కనిపించే ఆటా-సటా వివాహ పద్ధతి ఒకటి. ఈ ఆచారం ప్రకారం రెండు కుటుంబాలు పరస్పర అంగీకారంతో తమ ఇంటి ఆడబిడ్డలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాయి. అంటే ఒక కుటుంబంలోని అబ్బాయి, మరో కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే… అదే సమయంలో ఆ కుటుంబంలోని అబ్బాయికి ఈ కుటుంబంలోని అమ్మాయిని వివాహం చేస్తారు. ఒకప్పుడ వరకట్న సమస్యలు, ఆడపిల్లలపై వేధింపులు ఉండడంతో కొందరు పెద్దలు ఇలాంటి పెళ్లిళ్లను చేశారు. దీనినే తెలుగు రాష్ట్రాల్లో ‘కుండ మార్పిడి’ పెళ్లిళ్లు అని అంటారు. అయితే ఈ వివాహ పద్ధతి వివాదంగా మారింది. ఈ వింత ఆచారంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వివరాల్లోకి వెళితె..

ఆటా-సటా అనే పదానికి స్థానిక భాషలో మార్పిడి లేదా ఇచ్చిపుచ్చుకోవడం అనే అర్థం ఉంది. పూర్వ కాలంలో కట్న భారం తగ్గించడానికి, పెళ్లి ఖర్చులు తగ్గించడానికి ఈ పద్ధతి ప్రారంభమైందని సామాజిక పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలు పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ విధానాన్ని అనుసరించేవి. దీంతో రెండు కుటుంబాల మధ్య ఆర్థిక భారం తగ్గుతుందని భావించేవారు. ఈ ఆచారం ముఖ్యంగా రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాలు, తెగల సమాజాలు, కొన్ని వెనుకబడిన వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలుస్తోంది.

అయితే కాలక్రమేణా ఈ సంప్రదాయం అనేక సమస్యలకు దారితీసింది. ముఖ్యంగా బాల్య వివాహాలు పెరగడానికి ఇది ఒక కారణంగా మారిందని మహిళా హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఒక కుటుంబంలో పెళ్లి వయసు వచ్చిన అబ్బాయికి జోడీ కావాలంటే, మరో కుటుంబం తమ చిన్న వయసు ఉన్న అమ్మాయిని కూడా వివాహం చేయాల్సి వస్తోంది. దీంతో చట్ట విరుద్ధంగా చిన్నారుల పెళ్లిళ్లు జరిగే ఘటనలు పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా ఈ పద్ధతిలో మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత అభిప్రాయాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని విమర్శలు ఉన్నాయి. ఒక వివాహంలో సమస్యలు వస్తే, మరో కుటుంబంలోని జంట జీవితంపైనా దాని ప్రభావం పడుతుందని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక కోడలిపై వేధింపులు జరిగితే, ప్రతీకారంగా మరో కుటుంబంలోని కోడలిని కూడా ఇబ్బంది పెట్టే ఘటనలు బయటపడ్డాయి.

ఇటీవల ఈ అంశంపై రాజస్థాన్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్య వివాహాలు, మహిళల హక్కుల ఉల్లంఘనలు కొనసాగడానికి ఇలాంటి సంప్రదాయాలే కారణమవుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల హక్కులను రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేస్తూ, చట్ట విరుద్ధ వివాహాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

కోర్టు వ్యాఖ్యల తర్వాత మహిళా సంఘాలు, బాలల హక్కుల సంస్థలు ఈ ఆచారాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో అవగాహన పెంచడం, బాల్య వివాహాలపై కఠిన చట్టాలు అమలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే ఇలాంటి సంప్రదాయాలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.