Spirit Vs Dragon: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు ప్రభాస్… ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుండడం విశేషం… ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. దేవర సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు డ్రాగన్ సినిమాతో మరోసారి పెను సంచలనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ప్రస్తుతం ప్రభాస్ ఎన్టీఆర్ ల మధ్య విపరీతమైన పోటీ అయితే ఉందనే విషయం మనకు తెలిసిందే.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా వచ్చే సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ అవ్వనుంది. అలాగే ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘డ్రాగన్’ సినిమా సైతం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. రెండింటిలో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ఇద్దరు మ్యాజిక్ చేసి సినిమాని మరోసారి టాప్ లెవల్లో నిలబెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రశాంత్ నీల్ ఇంతకుముందు చేసిన కేజిఎఫ్ సిరీస్ అలాగే సలార్ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి సైతం అలాంటి విజయాన్నే కట్టబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అతనికి పెద్దగా గుర్తింపైతే తీసుకురావడం లేదు.
కాబట్టి ఈ సినిమాతోనే ఆయన పెను సంచలనాలను క్రియేట్ చేయాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే ఆయన భారీగా డీలా పడిపోయే ప్రమాదం ఉంది… మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇక వీళ్లలో ఎవరు పై చేయి సాధిస్తారు…ఎవరు వెనకబడిపోతారు అనేది తెలియాలంటే మాత్రం మరొక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…
