Home Blog Page 20

లీకైన SKN ఆడియో రికార్డు.. 'రాజాసాబ్' ఫలితంతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కామెంట్స్..

Prabhas skn

SKN leaked audio : సోషల్ మీడియా లో పరిచయం అక్కర్లేని పేరు SKN . ఒకప్పుడు మెగా ఫ్యామిలీ కి పీఆర్వో గా పనిచేసేవారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కి పీఆర్వోగా చాలా ఏళ్ళు పనిచేసి మంచి ఫేమ్ ని సంపాదించారు. అలా అంచలంచలుగా ఎదుగుతూ ‘టాక్సీ వాలా’ చిత్రం తో నిర్మాతగా మారే రేంజ్ కి వచ్చారు. తొలిసినిమానే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘బేబీ’ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు. అయితే కొన్ని పెద్ద సినిమాలకు ఆయన అప్పుడప్పుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటారు. అలా ఆయన పని చేసిన చిత్రం ‘రాజా సాబ్’. ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా , ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

ఈ సినిమా విడుదలకు ముందు SKN చేసిన హంగామా మామూలుది కాదు. సంక్రాంతికి పోటీ లో ఉన్నది , ఇంత కాలం తనకు ఉపాధి కల్పించిన మెగాస్టార్ చిరంజీవి అనేది కూడా మర్చిపోయి ‘సంక్రాంతి పోటీ లో ఉంటున్నది డైనోసార్ అమ్మా.. కాస్త జాగ్రత్త’, ‘పండగ పండగ రెబల్ పండగ’ వంటి మాటలు మాట్లాడారు SKN. అవి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ కూడా యాంటీ ఫ్యాన్స్ ఈ మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో తిప్పుతూ SKN వెక్కిరిస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే SKN కి మారుతీ మొదటి నుండి మంచి స్నేహితుడు కూడా. ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతీ ఎమోషనల్ అయ్యి మాట్లాడుతుంటే , ఆయన వెనుక నిల్చొని SKN కూడా కంటతడి పెట్టుకున్నారు.

వీటిని చూసి వీళ్లిద్దరి మధ్య ఎంతటి ఎమోషనల్ బాండ్ ఉందో అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేశారు అప్పట్లో. అయితే ఇదంతా డ్రామా యేనా అని అనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా సోషల్ మీడియా లో లీకైన SKN కి సంబంధించిన ఆడియో వింటే ఎవరికైనా ఇలాంటి అనుమానాలు రాక తప్పదు. ఆ ఆడియో లో ఆయన మాట్లాడుతూ ‘రాజా సాబ్ ఫలితం తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను అడుగుతారేంటి?, మీరు అడగాల్సింది హీరో , డైరెక్టర్ లేదా నిర్మాతని కదా’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఆడియో విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ SKN పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నీకు సంబంధం లేదని ఎలా చెప్తావు , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ఊరికే సరదాగా వేయించుకున్నావా మూవీ టైటిల్స్ లో అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అయినటువంటి ఆ ఆడియో ని మీరు కూడా వినేయండి.

‘లెనిన్' చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్.. సంచలనం రేపుతున్న అఖిల్ పోస్ట్..

akhil lenin

Akhil Akkineni : సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘ గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రంతో ఈ నెల 10 న మన ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. అక్కినేని అఖిల్ కూడా ఇంటర్వ్యూస్ నాన్ స్టాప్ గా ఇస్తూనే ఉన్నారు. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి లో గ్రాండ్ గా నిర్వహించారు. అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా విచ్చేసిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది , మూవీ బజ్ కి ఈ ప్రొమోషన్స్ మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ , ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా బజ్ కి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వేరే లెవెల్ బూస్ట్ ఇవ్వనున్నారు.

ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే అఖిల్ ఎన్టీఆర్ ని కలిసిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్తుండడం , అనంతరం అఖిల్ ని ప్రేమగా హత్తుకోవడం వంటివి చూడొచ్చు. అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ , అప్పట్లో ఎన్టీఆర్ , ఏఎన్నార్ ఆత్మీయంగా హత్తుకున్నా ఫొటోలతో పోలుస్తూ యాదృచ్ఛికం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ కి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు మహేష్ బాబు లతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ముగ్గురు గతం లో అఖిల్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ అయితే అఖిల్ ని తన సొంత తమ్ముడిగా భావిస్తుంటారు. చిరంజీవి , నాగార్జున ఎంత సాన్నిహిత్యంగా ఉంటారో , అఖిల్ , రామ్ చరణ్ అంతకు మించి సాన్నిహిత్యం తో ఉంటారు.

ఇలా స్టార్ హీరోలందరితో మంచి రిలేషన్స్ ని మైంటైన్ చేస్తూ , వాళ్ళ అభిమానుల సపోర్టు ని కూడా సొంతం చేసుకున్నారు అఖిల్. ఇలా అన్నీ కలిసి వస్తున్నప్పటికీ కూడా ఆయనకు సరైన సక్సెస్ రాకపోవడం బాధాకరం. లెనిన్ చిత్రం తో ఆ బాధకు ఫుల్ స్టాప్ పడుతుందని , కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఆయన అందుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ‘లెనిన్’ నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

అక్కినేని నాగార్జున 'కింగ్ 100' సంచలన అప్డేట్.. విలన్ గా నటించనున్న హాట్ బ్యూటీ..

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

Akkineni Nagarjuna : అక్కినేని అభిమానులు నాగార్జున నటిస్తున్న 100 వ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడే ఈ సినిమా షూటింగ్ కి గత కొన్ని రోజులుగా బ్రేక్ పడింది. ఎందుకంటే నాగార్జున చిన్న తనయుడు అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం ఈ ఎంల 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నాగార్జున అన్నీ దగ్గరుండి చూసుకుంటుండడంతో ఈ సినిమా షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ పడింది. ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి అవ్వడంతో , నాగార్జున ‘కింగ్ 100’ పై ఫోకస్ పెట్టారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం లో సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్ర పోషించబోతున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు నాగార్జున – టబు లది ఎవర్ గ్రీన్ జంట, వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం కూడా నడిచింది అంటూ అప్పట్లో ఒక వార్త వినిపించేది. అలాంటి జంట చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాకుండా , ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం లో ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతుంది అనేది ఇన్ని రోజులు రివీల్ కాలేదు. కచ్చితంగా నాగార్జున కి జోడిగా నటించబోతుందని అనుకున్నారు. కానీ ఇందులో ఆమె విలన్ క్యారెక్టర్ లో నటించబోతుంది అట. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని , నాగార్జున తో ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఢీ కొట్టేవిధంగా డైరెక్టర్ కార్తీక్ ఆమె పాత్రని డిజైన్ చేసారని అంటున్నారు. టబు కి విలన్ క్యారెక్టర్స్ చేయడం కొత్తేమి కాదు.

గతం లో బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి పాత్రలకు కేవలం టబు మాత్రమే న్యాయం చేయగలదు అనే రేంజ్ లో ఆమె జీవించింది. ఇప్పుడు మరోసారి ఆమె అలాంటి పాత్ర లో కనిపించబోతుండడం ‘కింగ్ 100’ కి పెద్ద ప్లస్ అనే పాయింట్ అనే చెప్పొచ్చు. త్వరలోనే జరగబోయే భారీ షెడ్యూల్ లో ఆమె పాల్గొనబోతుంది. షూటింగ్ కార్యక్రమాలు ఈ ఏడాది లోనే పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

అట్లాంటిక్ సముద్రంలో చిన్న దేశం కానీ అందరి నోట్లో..

Cape Verde, Cabo Verde

Cabo Verde : ప్రపంచ క్రీడల్లో కొన్నిసార్లు గెలిచిన జట్టుకంటే ఓడిపోయిన జట్టే ఎక్కువ చర్చకు వస్తుంది. ఎందుకంటే వారి పోరాటం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అలాంటి గుర్తింపును సంపాదించుకున్న చిన్న దేశం కాబో వెర్డే (Cape Verde/Cabo Verde).

అట్లాంటిక్ మహాసముద్రంలో, పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ తీరానికి సుమారు 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న పది ద్వీపాల సమూహమే కాబో వెర్డే. కేవలం ఐదున్నర లక్షల జనాభా మాత్రమే ఉన్న ఈ చిన్న దేశం పేరు గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. కారణం… ఫుట్‌బాల్.

ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై ఎన్నో బలమైన దేశాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సమయంలో, ఈ చిన్న దేశం నాకౌట్ దశకు చేరుకోవడం విశేషం. అంతేకాదు, ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనాను చివరి వరకు ఉత్కంఠభరితంగా నిలువరించడం ద్వారా తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. మ్యాచ్ ఫలితం అర్జెంటీనా వైపే వెళ్లినా, పోరాట పటిమ మాత్రం కాబో వెర్డేకే ప్రశంసలు తెచ్చిపెట్టింది. పరిమిత వనరులు ఉన్న దేశం కూడా సంకల్పం ఉంటే ప్రపంచ వేదికపై తన ముద్ర వేయగలదని నిరూపించింది.

ఈ దేశం గురించి మరో ఆసక్తికరమైన విషయం దాని భౌగోళిక స్వరూపం. పేరు “గ్రీన్ కేప్” అని అర్థం వచ్చినా, ఈ ద్వీపాల్లో పెద్దగా పచ్చదనం కనిపించదు. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన రాతి నేలలు, నల్లటి అగ్నిపర్వత బూడిద, పొడి వాతావరణమే ఎక్కువగా కనిపిస్తాయి. వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు తక్కువ. తాగునీటి కొరత కూడా ఎప్పటికప్పుడు సవాలుగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ కఠిన పరిస్థితుల మధ్య జీవిస్తున్న ప్రజలు తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు.

కాబో వెర్డే ప్రత్యేకత మరో అంశంలోనూ కనిపిస్తుంది. దేశంలో ఉన్న జనాభా కంటే విదేశాల్లో నివసించే కాబో వెర్డే మూలాలు కలిగిన ప్రజలే ఎక్కువ. అమెరికాలోని బోస్టన్ ప్రాంతంలోనే సుమారు ఐదు లక్షల మంది కాబో వెర్డే వలసదారులు ఉన్నారని అంచనా. పోర్చుగల్‌లో కూడా లక్షల సంఖ్యలో ఈ దేశస్థులు స్థిరపడ్డారు. ఈ ప్రవాస సమాజం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బలంగా నిలుస్తోంది.

15వ శతాబ్దంలో పోర్చుగీసువారు ఈ ద్వీపాలను గుర్తించే వరకు ఇక్కడ శాశ్వత మానవ నివాసం లేదని చరిత్ర చెబుతోంది. ఆ తరువాత ఆఫ్రికా తీర ప్రాంతాల ప్రజలు, పోర్చుగీసు వలసదారులు కలిసి ఇక్కడ స్థిరపడ్డారు. అందుకే నేటి కాబో వెర్డే ప్రజలు ఆఫ్రికన్, యూరోపియన్ సంస్కృతుల సమ్మేళనంగా కనిపిస్తారు. అధికార భాష పోర్చుగీస్ అయినప్పటికీ, రోజువారీ జీవితంలో ఎక్కువ మంది కాబో వెర్డియన్ క్రియోల్ (Kriolu) భాషనే మాట్లాడుతారు.

క్రీడల్లో విజయానికి కేవలం భారీ జనాభా, అపారమైన సంపద, ఆధునిక సదుపాయాలు మాత్రమే ప్రమాణాలు కావని కాబో వెర్డే మరోసారి నిరూపించింది. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, యువతకు అవకాశాలు, దేశం కోసం ఆడాలనే తపన ఉంటే చిన్న దేశం కూడా ప్రపంచ దిగ్గజాలకు గట్టి సవాల్ విసరగలదని ఈ దేశం చూపించింది.

ప్రపంచ పటంలో చాలామందికి తెలియని ఈ చిన్న ద్వీప దేశం, ఇప్పుడు తన ఫుట్‌బాల్ ప్రతిభతో కోట్లాది మంది దృష్టిని ఆకర్షిస్తోంది. పరిమాణంలో చిన్నదైనా, ఆత్మవిశ్వాసంలో మాత్రం ఎంతో పెద్ద దేశంగా కాబో వెర్డే నిలిచింది. ప్రపంచ క్రీడా చరిత్రలో ఇలాంటి కథలే కొత్త తరాలకు ప్రేరణగా నిలుస్తాయి.

అట్లాంటిక్ సముద్రంలో చిన్న దేశం కానీ అందరి నోట్లో.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

వణికిపోతున్న ప్రకాష్ రాజ్..'ప్రశ్న రావణ్ ' ఫోన్లో ఏముంది..? వెలుగులోకి రానున్న సంచలన నిజాలు..

Prakash Raj And Prashna Ravana
Prakash Raj And Prashna Ravana

Prashna Ravan : గత రెండు మూడు రోజుల నుండి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఏ రేంజ్ లో విరుచుకుపడుతున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మాత విద్వేషాలను రెచ్చగొట్టే ‘ప్రశ్న రావణ్’ ని అరెస్ట్ చేస్తే , ప్రకాష్ రాజ్ కి ప్రాణం పోయినంత పని అయ్యింది. అతని కోసం రోజుకి రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ‘జనం చూస్తున్నారు’ అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తీవ్రవాదులను ప్రోత్సహిస్తూ , హిందూ దేవుళ్లపై దుర్భాషలాడుతూ , ఇష్టమొచ్చినట్టు మాట్లాడే రావణ్ కోసం ప్రకాష్ రాజ్ ఇంతలా పోరాడడం సిగ్గు చేటు అంటూ మండిపడుతున్నారు. ఇక నేడు ప్రకాష్ రాజ్ అప్లోడ్ చేసిన వీడియో అయితే జనాల్లో అనేక అనుమానాలకు భీజం పోసింది.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ఇప్పుడు పోలీసులు రావణ్ మొబైల్ ని తీసుకొని , అతని వద్ద ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని సేకరిస్తారు. అతనికి మద్దతుగా నిలబడిన ప్రతీ ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తారు, ఇదే కదా జరిగేది’ అంటూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఇది విన్న తర్వాత ఇన్ని రోజులు ప్రకాష్ రాజ్ బాధపడింది రావణ్ ని అరెస్ట్ చేసినందుకు కాదు , అతనితో ఈయన నడిపిన గూడూపుఠాణి మొత్తం బయటపడుతుంది అనే భయం తోనే ప్రకాష్ రాజ్ ఇంతలా ఆరాటపడుతున్నారు , వణికిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. రావణ్ , ప్రకాష్ రాజ్ లను నడిపిస్తున్న నెట్ వర్క్ మొత్తం ఈ రిమాండ్ రిపోర్ట్ లో బాటపడబోతుందని, ఇక వీళ్ళ ఆట ముగిసిపోయింది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే , ప్రకాష్ రాజ్ కి తమిళనాడు DMK పార్టీ తో ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

వాళ్లకు మద్దతుగా, ఆ పార్టీ నాయకులతో , ఎమ్మెల్యేలతో మంత్రులతో కలిసి ఎన్నో ప్రెస్ మీట్ లు కూడా ఇచ్చారు. ఒక ప్రెస్ మీట్ లో అయితే DMK పత్తి ఎమ్మెల్యే తో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘బాగా మాట్లాడానా ?, ఇంకా ఏమేమి మాట్లాడాలి’ అని అడగడం , అందుకు సదరు DMK నేత సూచనలు ఇవ్వడం వంటివి మన కళ్లారా చూశాము . అలాంటి DMK పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ని తమిళనాడు సీఎం విజయ్ అరెస్ట్ చేయిస్తే ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. తన సన్నిహిత పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే ఇప్పటి వరకు స్పందించని ప్రకాష్ రాజ్ , ఒక సాధారణ యూట్యూబర్ అరెస్ట్ అయితే , ఎందుకు ఇంతలా ఉలిక్కిపడుతున్నారు?, కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగింది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ అనుమానిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మీద సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు.. పోలీసులు ఏం చేస్తారో..

Sugali Preethi Case
Sugali Preethi Case

Sugali Preethi Case : ఏపీలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారంలోకి రాగానే.. తన కుమార్తె సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని.. ఆ హామీ అమలుకు నోచుకోలేదని.. ఆయన తమను మోసం చేశారని సుగాలి పార్వతి ఆరోపించారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆఫిర్యాదుల పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం లో జనసేన అధినేతపై ఫిర్యాదు చేశారు.

“అప్పట్లో జన సేన అధినేత ఈ కేసు గురించి పదే పదే చెప్పేవారు. నా కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ నా కుమార్తె కేసు విషయంలో ఇంతవరకు న్యాయం జరగలేదు. అధికారులకు వచ్చిన తర్వాత తాము చేపట్టే మొదటి కేసు సుగాలి ప్రీతిదని పవన్ కళ్యాణ్ హామీ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.. ఇంతవరకు నా కుమార్తె కేసులో ఎటువంటి పురోగతి లేదు.. గడచిన ఐదు రోజులుగా వందల మంది పోలీసులు.. నాకు జిల్లాల ఎస్పీలు ఉరుకుల పరుగులు పెడుతున్నారు. యూట్యూబర్ జోసెఫ్ ను అరెస్ట్ చేశారు. ఇందులో కొంతమేర శ్రద్ధ నా కుమార్తె కేసు మీద పెట్టి ఉంటే న్యాయం జరిగి ఉండేదని” పార్వతీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

“నా కుమార్తె వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లల్లో ఉంటున్నారు. కర్నూలులో అత్యంత దర్జాగా తిరుగుతున్నారు. నా కళ్ళ ముందు అనంత కనిపిస్తోంది. నాకు మాత్రమే ఎందుకు ఈ వివక్ష.. నా కుమార్తె కేసులో ఆధారాలు మొత్తం తారుమారు అయ్యాయని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అసలు ఆయనకు ఆ ఆధారాలు ఎక్కడివి.. ఆధారాలు లేకుండా ఆయన ఎలా మాట్లాడారు.. ఆయనపై ఎన్నో కేసులు పెట్టాలి.. డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఒక దివ్యాంగురాలైన నాకు మాట ఇచ్చి మర్చిపోయారు. ఇది మోసం కాదా.. ఈ కేసులో ప్రముఖ పాత్ర పోషించిన వారికి పవన్ కళ్యాణ్ క్లీన్ చీట్ ఇచ్చారు. ఇది ముమ్మాటికి దుర్మార్గం. నేను దివ్యాంగురాలిని. జనసేన నాయకులు.. వీర మహిళలు నన్ను బాడీ షేమింగ్ చేశారని” పార్వతి ఆరోపించారు.

పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. వారు పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్ కు వచ్చి.. ఫిర్యాదు చేసిన వ్యవహారంపై సాక్షి మీడియా.. వైసీపీ నాయకులు కీలకంగా దృష్టి సారించారు. ఆ అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్వతి అనేక సందర్భాల్లో 2019 నుంచి 2024 వరకు ప్రీతి కేసు కు సంబంధించి మాట్లాడినప్పుడు నాడు జగన్ గానీ.. వైసీపీ మీడియా గానీ పట్టించుకోలేదు. ఇప్పుడు జనసేనానికి వ్యతిరేకంగా ఉండడంతో సాక్షి మీడియా ప్రముఖంగా పార్వతి కి ప్రాధాన్యం ఇస్తోంది.. దీనిని బట్టి సుగాలి ప్రీతి కేసు మరోసారి ఏపీలో సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో అసదుద్దీన్ చిచ్చు.. ఎటు దారితీసేనో!?

Asaduddin Owaisi : ఎం ఐ ఎం చీఫ్… అసదుద్దీన్ ఓవైసీ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో చిచ్చు రాజేశాడు. సోషల్ మీడియా వేదికగా సౌత్, వెస్ట్ హైదరాబాద్ నుంచి అనేక ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు మార్చడం అన్యాయమని, ఇది సాధారణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతోందని వ్యాఖ్యానించారు. గుడిమాల్కాపూర్ మార్కెట్ తరలింపును ఆధారంగా చేసుకుని, నగరంలోని వివిధ జోన్ల మధ్య వివక్ష ఉందనే పెద్ద అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాతనగరం సౌత్ పరిధిలోకి, మెహదీపట్నం-కార్వాన్ పరిసరాలు వెస్ట్ పరిధిలోకి వస్తాయి. ఈ నిర్ణయాలు ప్రాంతాల మధ్య అసమానతను పెంచుతున్నాయని, స్థానికుల భావోద్వేగాలను రెచ్చగొట్టాడు.

తరలింపునకు కారణాలు..
ఇటీవలి సంవత్సరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, శాంతిభద్రతను మెరుగుపరచడం, శివారు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన కార్యాలయాలు, విభాగాలను రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొత్త భవనాలకు, తూర్పు-ఉత్తర శివార్లకు మార్చింది. ఇందులో కలెక్టరేట్ సంబంధిత విభాగాలు, వక్ఫ్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయాలు, పోలీస్ నిర్వహణ కార్యాలయాలు, మార్కెటింగ్ శాఖ నోడల్ కార్యాలయాలు ఉన్నాయి. పాతనగరంలోని ఇరుకైన రోడ్లు, అధిక జనసాంద్రత వల్ల రోజూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో విశాలమైన రోడ్లు, మెరుగైన కనెక్టివిటీ, ఆధునిక సౌకర్యాలు ఉండటం వల్ల పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. శివార్ల అభివృద్ధి ద్వారా నగరం మొత్తం సమతుల్యంగా వృద్ధి చెందాలనేది లక్ష్యం.

ఓవైసీ ఆందోళన ఎందుకు?
ఓవైసీ ఇలా జోన్ల వారీగా అసంతృప్తిని బయటపెడుతున్నారనేది బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. పాతనగరం ఎంఐఎంకు ఎప్పటి నుంచో బలమైన ఆధారం. అయితే వెస్ట్ జోన్‌లో ఐటీ కారిడార్ విస్తరణ వల్ల మెహదీపట్నం, కార్వాన్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో జనాభా మార్పులు పార్టీకి కొత్త సవాళ్లను తెస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు, కుటుంబాలు నివసించడం వల్ల స్థానిక సంప్రదాయ ఓటర్ల నిష్పత్తి మారుతోంది. ఈ ప్రాంతాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు లేదా వ్యాపార కేంద్రాలు శివార్లకు తరలిపోతే, స్థానిక మైనారిటీల ఆర్థిక వనరులు దెబ్బతినడమే కాక, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు ప్రభావితమవుతారు. గుడిమాల్కాపూర్ వంటి సాంప్రదాయ మార్కెట్లు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనవి. అందుకే ప్రభుత్వం సౌత్, వెస్ట్ హైదరాబాద్‌ను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందనే భావోద్వేగ అంశాన్ని ఉపయోగిస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓవైసీ వ్యూహం..
సాధారణ పరిపాలనా మార్పులను కూడా ప్రాంతీయ వివక్షగా చిత్రీకరించడం ద్వారా, పాతనగరంలోని కొత్త ఓటర్లను, వెస్ట్ హైదరాబాద్‌లోని వ్యాపార వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకం చేయాలనేది ఓవైసీ ప్రధాన ప్రణాళిక. నగర అభివృద్ధి అంతా హైటెక్ సిటీ లేదా ఉత్తర హైదరాబాద్ వైపు మాత్రమే జరుగుతోందని, సౌత్-వెస్ట్ ప్రాంతాలను పాలకులు వదిలేస్తున్నారని బలంగా ప్రచారం చేసి, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును రక్షించుకోవడానికి ఈ భౌగోళిక వ్యూహాన్ని అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా స్థానిక సంఘాల్లో ఐక్యతను పెంపొందించి, ప్రత్యర్థి పార్టీల ప్రభావాన్ని తగ్గించాలనేది ఓవైసీ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ వివాదం మరింత రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది. స్థానిక సంఘాల నుంచి నిరసనలు, ప్రజా ఉద్యమాలు రావచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వం మరోవైపు నగరం మొత్తం అభివృద్ధిని నొక్కి చెప్పి, తరలింపు నిర్ణయాలను సమర్థించవచ్చు. ఓవైసీ ఈ అంశాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే, ఎన్నికల సమయంలో ఓటర్ల మధ్య చర్చలు ఎక్కువవుతాయి. ఈ చర్చ నగర అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యత, రాజకీయ వ్యూహాల మధ్య సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.

పెట్రోల్ బంక్ లో వర్కర్.. వేల కోట్ల ఎదిగాడు..కానీ ఇక్కడే ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్..

Bhupal Naik Fraud
Bhupal Naik Fraud

Bhupal Naik Fraud: పాలేరుగా జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెట్రోల్ బంక్ లో చేరాడు. అనంతరం రకరకాల పనులు చేశాడు. వేషం మార్చాడు. సొంత ఊరికి వచ్చాడు. ఎకరాల భూమి కొన్నాడు. అందులో చేపల చెరువులు తవ్వించాడు. చుట్టూ బౌన్సర్లు.. ఖరీదైన కార్లు.. రేమండ్ సూట్లు.. బాటా బూట్లు.. చేతికి రోలెక్స్ గడియారం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రేంజ్ మామూలుగా లేదు. ఒక పాలేరు నుంచి ఈ స్థాయి దాకా ఎదగడం అంటే మాటలు కాదు. కానీ దీన్ని పాజిటివ్ కోణంలో కాకుండా.. మరో కోణంలో చూస్తే.. చూడ్డమేంటి ఆయన చేసింది అదే.. చివరికి ఏం జరిగిందంటే..

అతడి పేరు నేతావత్ భూపాల్ నాయక్. మహబూబాద్ జిల్లా కురవి మండలం కందికొండ ప్రాంతం.. ఇతడు కిసాన్ పరివార్ లిమిటెడ్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో సంస్థలను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత డిపాజిట్లు వసూలు చేశాడు. అసలుకు రెట్టింపు అని ప్రచారం చేసుకున్నాడు. ఇలా ఏకంగా కొన్ని కోట్ల వసూలు చేశాడు. వాస్తవానికి ఈ కంపెనీలలో పెట్టుబడులు పెట్టకూడదని.. అవి పూర్తిగా నిషేధమని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 2022లో జూలైలో ఒక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ ఆ ప్రకటనను దాస్తూ భూపాల్ నాయక్ వందలాది మంది రైతులను మోసం చేశాడు. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ ఆశించాడు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని ప్రకటించాడు. భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాడు. ర్యాలీలు.. సమావేశాలు భారీగా నిర్వహించాడు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బిల్డప్ కూడా ఇచ్చాడు.

కోట్ల వసూలు చేసిన భూపాల్ నాయక్ అనేక డొల్ల సంస్థల్లోకి వాటిని మళ్లించాడు. దీనికోసం 30 నుంచి 40 వరకు బ్యాంకుల ఖాతాలు ఉపయోగించుకున్నాడు. ఆ డబ్బులను తన అవసరాల కోసం మళ్లీ ఖాతాలలోకి మళ్లించి ఉపయోగించుకున్నాడు. ఇతడు ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో భూపాల్ నాయక్ మాత్రమే కాకుండా.. ఇంకా ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. కిసాన్ పరివార్.. షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అత్యంత మోసపూరితమైనవని.. వీటిలో డబ్బులు ఎవరు పెట్టుబడులుగా పెట్టకూడదని గతంలోనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ప్రకటించింది. కాకపోతే ఆ ప్రకటనను బయటికి రాకుండా చూసుకోగలిగాడు భూపాల్ నాయక్. చివరికి ఇతడి వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. తాము పెట్టుబడి పెట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలని బాధితులు ఇతడిని డిమాండ్ చేశారు. దీంతో అతడు ఒక మంత్రి పేరు చెప్పి వారిని బెదిరించాడు. ఈ క్రమంలో వారంతా కూడా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు లోతుగా దర్యాప్తు చేశారు. చివరికి భూపాల్ నాయక్ అసలు రంగును బయటపెట్టారు. ఇతడి దందా వందల కోట్లలో సాగిన నేపథ్యంలో.. ఈడి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త..

Rainy Season Diseases
Rainy Season Diseases

Rainy Season Diseases: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వాతావరణంలో తేమ పెరగడం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్ల వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. దీంతో జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తే.. తజాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు. అవేంటంటే..

వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కలుషిత నీటి వల్ల వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పాటు టైఫాయిడ్, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే నీటిని బాగా కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగడం మంచిది. బయటకు వెళ్లినప్పుడు కూడా శుభ్రమైన తాగునీటినే ఉపయోగించాలి.ఇంటి పరిసరాలు తడిగా, మురికిగా ఉంటే దోమలు, ఈగలు, క్రిములు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇంట్లో గాలి బాగా ఆడేలా చూడాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. తరచూ నేల, బాత్రూమ్, వంటగదిని శుభ్రం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

వర్షాకాలంలో బయట విక్రయించే ఆహారం త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు రావచ్చు. కాబట్టి ఇంట్లో తాజాగా తయారుచేసిన వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే సూప్‌లు, వేడి పాలు, హెర్బల్ టీ వంటి వేడి పానీయాలు శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి. వర్షంలో తడిసిన బట్టలతో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వర్షంలో తడిస్తే వెంటనే పొడి దుస్తులు ధరించి, జుట్టును కూడా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. అవసరమైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తులసి, అల్లం, పసుపు, వెల్లుల్లి వంటి సహజ పదార్థాలు శరీర రక్షణ వ్యవస్థకు మేలు చేస్తాయి. అలాగే నిమ్మకాయ, ఉసిరి, నారింజ వంటి విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం వైరస్‌లతో పోరాడే శక్తిని పెంచుకుంటుంది. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా మోచేతితో కప్పుకోవాలి. జలుబు లేదా జ్వరం ఉన్నవారితో అత్యంత సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

జ్వరం, తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు వంటి లక్షణాలు రెండు మూడు రోజులకుపైగా కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. స్వయంగా మందులు వాడటం కంటే వైద్యుల సలహాతో చికిత్స తీసుకోవడం సురక్షితం.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దయచేసి నా సినిమా చూడాలంటూ పోసాని కృష్ణ మురళి రిక్వెస్ట్.. వీడియో వైరల్..

Posani Krishna Murali
Posani Krishna Murali

Posani Krishna Murali: గత వైసీపీ ప్రభుత్వం లో పోసాని కృష్ణ మురళి రాజకీయంగా , సినిమాల పరంగా ఎంత యాక్టీవ్ గా ఉండేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జగన్ కి సపోర్టు గా నిలుస్తూ , ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే , తీవ్రమైన పదాలతో దూషించడం అలవాటు గా పెట్టుకునేవారు పోసాని. ఆ క్రమం లో ఆయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ లపై ఏ రేంజ్ లో విమర్శలు చేసేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఎవ్వరూ వినలేని భాషతో రెచ్చిపోయి , చివరికి ఆయన ఇంట్లోని ఆడవాళ్ళని సైతం బూతులు తిట్టి తన అక్కసు తీర్చునేవారు. అలా చేసినందుకు పోసాని కృష్ణమురళి దాదాపుగా 3 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ , మళ్లీ ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పోసాని కృష్ణ మురళి మంచి నటుడు మాత్రమే కాదు , గొప్ప దర్శకులు, రచయిత , స్క్రీన్ ప్లే రైటర్ కూడా. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ ‘గోకులం లో సీత’ కి కథ , మాటలు , స్క్రీన్ ప్లే ఇచ్చింది ఆయనే. నటుడుగా పాపులర్ అయ్యాక కూడా ఆయన ‘మెంటల్ కృష్ణ’, ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘ఆపరేషన్’. అరుణా రెడ్డి’. ఈ చిత్రం ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా పోసాని కృష్ణ మురళి ప్రొమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘టీడీపీ పార్టీ వాళ్ళు , వైసీపీ పార్టీ వాళ్ళు , కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు , కాంగ్రెస్ పార్టీ వాళ్ళు , బీజేపీ పార్టీ వాళ్ళు, మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు, వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను , మన అందరికీ అభిప్రాయ భేదాలు ఉన్నా సరే, నా ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’ సినిమా చూస్తే నన్ను అభిమానిస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని నిన్ననే విడుదల చేశారు. క్వాలిటీ షార్ట్ ఫిలిం మేకింగ్ కంటే దారుణంగా ఉంది , ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి సినిమాని తెరకెక్కించిన పోసాని నుండి ఇలాంటి క్వాలిటీ సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ట్రైలర్ పోసాని మార్క్ నటన కూడా కనిపించలేదు , చాలా బలహీనంగా నటించారు, మరి థియేటర్స్ లో విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

వ*యా*గ్రా పనిచేసింది.. ఇంగ్లాండ్ గెలిచింది. ఫుట్ బాల్ చరిత్రలో ఇదో అద్భుతం

England Football Team
England Football Team

England Football Team: ముందుగా ఫిఫా వరల్డ్ కప్ లో క్వార్టర్స్ కు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టుకు అభినందనలు. ఆ జట్టు ఈ స్థాయి దాక రావడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఎన్నో అవమానాలను చవిచూసింది. వాటిని దాటుకొని ఇక్కడిదాకా వచ్చింది. ఇక్కడదాకా రావడం అంటే ఏటికీ ఎదురు ఈదడమే.. అయినప్పటికీ ఇంగ్లాండ్ ప్లేయర్లు విజయాన్ని మాత్రమే నమ్ముకున్నారు. వీర స్వర్గం వద్దనుకున్నారు. అందువల్లే గెలుపును సాధించి దర్జాగా ఫ్రీ క్వార్టర్స్ లోకి అడుగు పెట్టారు.

ఇంగ్లాండ్ జట్టు ఈ గెలుపు సాధించడం వెనక చాలా చరిత్ర ఉంది. వాస్తవానికి ప్రస్తుత ఫిఫా కప్ లో ఇలాంటి అద్భుతం చోటుచేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఫిఫా కప్ లో భాగంగా మెక్సికో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుతమైన విజయం సాధించింది. ఒక దశలో ఇంగ్లాండ్ ప్లేయర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి మెక్సికో అభిమానులు చేయని ప్రయత్నం అంటూ లేదు. వారు బస చేసిన హోటల్ గది ఎదుట ఎంత హంగామా సృష్టించాలో.. అంతటి హంగామా కొనసాగించారు. బాంబులు పేల్చారు. నినాదాలు చేశారు. డ్రమ్స్ వాయించారు. చివరికి రోడ్డుమీద నినాదాలు కూడా చేశారు. ఇంగ్లాండ్ ప్లేయర్లకు నిద్ర లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు కేవలం మైదానంలో పోరాటాన్ని మాత్రమే నమ్ముకున్నారు. నిద్ర లేకపోయినా పర్వాలేదు.. మెక్సికో జట్టుకు నిద్ర లేకుండా చేయాలి అనుకున్నారు. మైదానంలో వీరోచితమైన పోరాటం చేసి మెక్సికో జట్టుకు నిజంగానే చుక్కలు చూపించారు. మెక్సికో అభిమానులకు నిద్రలేని రాత్రులను పరిచయం చేశారు.

ఈ మ్యాచ్ కంటే ముందు ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ తమ జట్టు ప్లేయర్లకు వ*యా*గ్రా మాత్రలు ఇచ్చింది. పడకగది మీద రెచ్చిపోవాలని సూచించింది. ఏ మాత్రం టైం దొరికినా సరే వీర కుమ్ముడు కుమ్మేయండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్లేయర్లు రెచ్చిపోయారు. వాత్సాయను రాసిన పుస్తకంలో మాదిరిగా కుమ్ముడు కుమ్మారు. ఫలితంగా ఒత్తిడి తగ్గించుకున్నారు. ఆట మీద పూర్తిస్థాయిలో మనసు లగ్నం చేశారు. ఒత్తిడిలో వీరోచితంగా ఆడారు. బంతిని పాస్ చేయడం.. గోల్ పోస్ట్ లోకి నెట్టడం.. మైదానంలో పాదరసాల మాదిరిగా కదలడం.. ఇలాంటి విన్యాసాలు చేయడంతో ఇంగ్లాండు జట్టు విజయం సులభమైంది. మెక్సికో అభిమానుల వెర్రి చేష్టలకు స్పష్టమైన సమాధానం లభించింది. ఇక జన్మలో ఇంగ్లాండు జట్టు ప్లేయర్లను మెక్సికో అభిమానులు ప్యాంపర్ చేయరు. కాగా, ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మూడు , మెక్సికో రెండు గోల్స్ చేశాయి.

వెంకీ అట్లూరి దర్శకత్వం లో నాని.. స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు..

Nani And Venky Atluri
Nani And Venky Atluri

Nani And Venky Atluri: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం, విపరీతమైన రీ షూట్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ చిత్రం విడుదల అవ్వడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ , లేదా డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత నాని ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నాని పుట్టినరోజు సందర్భంగా చేశారు. అయితే ‘ది ప్యారడైజ్’ మూవీ షూటింగ్ ఆలస్యం అవ్వడం, సుజిత్ ఓజీ 2 చిత్రానికి షిఫ్ట్ అవ్వడం తో , ఈ సినిమా హోల్డ్ లో పడింది.

సుజిత్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని ‘ఓజీ 2’ పైనే పెట్టాడు. అయితే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని ఏ సినిమా చేయబోతున్నాడు అనే అంశం పై సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘బ్లాస్ట్’ మూవీ డైరెక్టర్ సుభాష్ తో ఒక సినిమా ఒప్పుకున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా నాని డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య తో ‘విశ్వనాధ్ & సన్స్’ చిత్రం చేస్తున్న వెంకీ అట్లూరి, రీసెంట్ గానే నాని ని కలిసి ఒక స్టోరీ ని వినిపించారట. నాని కి ఆ స్టోరీ లైన్ బాగా నచ్చడం తో , స్క్రిప్ట్ డెవలప్ చెయ్యమని చెప్పారట.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించబోతున్నట్టు సమాచారం. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న వెంకీ అట్లూరి కి ఆడియన్స్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్, నాని లాంటి హీరో తో పని చేస్తే కచ్చితంగా అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాలంటే కొన్ని నెలలు ఎదురు చూడక తప్పదు.

భారత్ లో ఇంజనీరింగ్ విప్లవం ముగింపు.. కాలేజీలు మూత .. ఏం జరుగుతోంది

India Engineering Colleges Closure
India Engineering Colleges Closure

India Engineering Colleges Closure: మనదేశంలో ఇంజనీరింగ్ విప్లవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. అంతకుముందు వివిధ రాజులు.. కట్టిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అయితే మనదేశంలో ఇంజనీరింగ్ విప్లవానికి సరికొత్త దిశ దశ చూపించారు. ఆయన చూపించిన తోవలోనే చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు పనిచేస్తున్నారు. ఆయన పేరును నిత్యం స్మరించుకుంటూ ఉంటారు.

మనదేశంలో ఇంజనీరింగ్ విప్లవం ఈనాటిది కాదు. దానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.. మన పురాణాల్లో.. చారిత్రక గాథల్లో ఇంజనీరింగ్ నైపుణ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆలయాలు.. పెద్దపెద్ద నిర్మాణాలు ప్రపంచ వింతలను మించిపోతాయి. ప్రపంచ వింతలు 7 అని చెబుతుంటాం కదా.. వాస్తవానికి ఆ ఏడు కూడా మనదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కాకపోతే అందులో తాజ్ మహల్ కు మాత్రమే చోటు దక్కింది.. సున్నా కనిపెట్టిన ఆర్యభట్టు.. రాతి నిర్మాణాలలో సరికొత్త చరిత్ర సృష్టించిన పల్లవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతూ ఉంటుంది.

ఈ స్థాయిలో గుర్తింపు సాధించిన మన దేశంలోనే ఇంజనీరింగ్ వ్యవస్థ క్రమక్రమంగా తన ప్రభను కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. ముగింపు దశకు వచ్చినట్టు కనిపిస్తోంది. మనదేశంలో ఇంజనీరింగ్ వ్యవస్థలో నిశ్శబ్దంగా సంచలనం నమోదవుతున్నది. ఏఐసిటిఈ గణాంకాల ప్రకారం 2025 -26 విద్యా సంవత్సరంలో మనదేశంలో మొత్తంగా 58 ఇంజనీరింగ్, సాంకేతిక కళాశాలలను దశలవారీగా మూసి వేయబోతున్నారు. అంతేకాదు 950 కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలలో సాంకేతిక కోర్సులను నివ్వబోతున్నారు. ఎప్పుడు చదువుతున్న విద్యార్థులను వారి డిగ్రీలను పూర్తి చేయడానికి అనుమతిస్తారు. ఇకపై ఈ విద్యాసంస్థలు కొత్తగా మొదటి సంవత్సరం విద్యార్థులను చేర్చుకోవు. అత్యధిక సంఖ్యలో కాలేజీలు మూసి వేతకు గురవుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ముందు వరసలో ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి.

తక్కువ విద్యార్థుల నమోదు.. అధ్యాపకుల కొరత.. నియంత్రణ నిబంధనలు పాటించడంలో విఫలం వంటి కారణాల వల్ల మూసివేతలు జరుగుతున్నాయి.. ఇదే విషయాన్ని ఏఐసీటీఈ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు ఈ పరిణామాన్ని ఇంజనీరింగ్ నిపుణులు మరో విధంగా చెబుతున్నారు. పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంటున్నదని.. దీనిని నెగిటివ్ కోణంలో చూడకూడదని చెబుతోంది.. నేటి కాలంలో ఇంజనీరింగ్ కంపెనీల లక్ష్యాలు మారిపోయాయని.. అలాంటప్పుడు నాణ్యమైన ప్రమాణాలు పాటించి.. అటువంటి విద్యాసంస్థల్లో చదివిన వారికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని.. అందువల్లే కాలేజీలు మూసివేతకు గురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మొబైల్ వినియోగదారులకు షాక్..

Mobile Recharge Price Hike
Mobile Recharge Price Hike

Mobile Recharge Price Hike: నిత్యావసర వస్తువులు, ఇతర సేవల ధరల పెరుగుదలతో ఇప్పటికే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు టెలికం రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు కూడా వినియోగదారులకు గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ పరిశోధనా సంస్థ Centrum Institutional Research తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రానున్న రోజుల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అవెలా ఉంటాయంటే?

రాబోయే 3 నుండి 4 నెలల కాలంలో టెలికం కంపెనీలు తమ టారిఫ్ (రీఛార్జ్ ప్లాన్ల) ధరలను 12 నుండి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడే అవకాశం ఉంది. టెలికం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా 4G మరియు 5G నెట్‌వర్క్‌ల విస్తరణ వేగంగా జరగడమే ధరల పెంపునకు గల ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల సాధారణ వినియోగదారుల డేటా వినియోగం మునుపెన్నడూ లేనంతగా భారీగా పెరిగింది. ఈ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని, నాణ్యతను మెరుగుపరచడానికి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది.

మరోవైపు, ప్రస్తుత జూన్ త్రైమాసికంలో టెలికం కంపెనీల ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ – ప్రతి వినియోగదారుడి నుండి వచ్చే సగటు ఆదాయం) 1 నుండి 1.5 శాతం వరకు పెరగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. అయితే, కంపెనీలు దీర్ఘకాలికంగా లాభాల్లో కొనసాగాలన్నా, తదుపరి సాంకేతికతను తట్టుకోవాలన్నా ARPU మరింత పెరగడం అవసరమని భావిస్తున్నాయి. అందుకే, రానున్న పండుగల సీజన్ లేదా తదుపరి త్రైమాసికం లోపు వినియోగదారులపై టారిఫ్ పెంపు భారాన్ని మోపడానికి టెలికం దిగ్గజాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.

అబ్బాయిలు 28.. అమ్మాయిలు 26.. ఇదొక్కటి చాలు ప్రపంచానికి భారత్ ఎంత ఆదర్శమో చెప్పడానికి..

India Marriage System
India Marriage System

India Marriage System: నిజమే భారత్ ఒక సనాతన దేశం. కొంతమంది ఉదారవాదులు.. ఎర్రి భావజాలం ఉన్నవాళ్లు.. మన దేశ ధర్మాన్ని.. సంస్కృతిని విమర్శిస్తూ ఉంటారు. అదేపనిగా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కానీ భారత్ అంటే ఏంటి.. భారతదేశం గొప్పతనం.. భారతదేశానికి సంబంధించిన సంస్కృతి ఇప్పటికి చరిత్ర పుటల్లో భద్రంగానే ఉంది.

మన దేశానికి గొప్ప పేరును తీసుకొచ్చిన అనేక అంశాలలో ప్రధానమైనది వివాహ వ్యవస్థ. ఇప్పటికీ మనదేశంలో 85% వివాహాలు పెద్దలు కుదిర్చినవే. అంతటి అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల్లో చాలామంది పెద్దలు కుదిరించిన వివాహాలు చేసుకోవడం విశేషం. పెద్దలు కుదిరించి చేసిన వివాహాలలో చాలావరకు బలంగా ఉంటున్నాయి. నేటి కాలంలో ప్రేమ వివాహాలు విఫలమవుతున్న వేళ.. పెద్దలు కుదిరించి చేసిన వివాహాలు మాత్రం బలంగా నిలబడుతున్నాయి.

ఇటీవల మనదేశ వివాహ వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం మనదేశంలో 85% వివాహాలు ఇప్పటికీ పెద్దలు కుదిరించి చేసినవే కావడం విశేషం. 15 సంవత్సరాల క్రితంతో పోల్చి చూస్తే భారతీయుల సగటు వివాహ వయసు రెండు సంవత్సరాలు.. పెరిగింది. ఇందులో అబ్బాయిలకు 28.. అమ్మాయిలకు 26 ఏళ్ల వయసులో వివాహాలు చేస్తున్నారు. 65% కుటుంబాలు కాబోయే వధూవరుల బయోడేటా తో పాటు జాతక చక్రాలను కోరుతున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే అత్యంత చిన్న వయసులో వివాహం జరుపుకుంటున్న పురుషులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియా దేశంలో పురుషుల యావరేజ్ మ్యారేజ్ ఏజ్ 39.3 సంవత్సరాలు కావడం విశేషం.

ప్రేమ వివాహాలు కూడా మనదేశంలో బాగానే జరుగుతున్నాయి. గతంతో పోల్చి చూస్తే వీటి సంఖ్య పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం.. ఉద్యోగం.. కెరియర్.. ఇతర వ్యవహారాలతో యువత తమకు కావలసిన భాగస్వాములను ఎంచుకున్నప్పటికీ.. అంతిమంగా వివాహం ప్రస్తావన వచ్చేసరికి పెద్దల నిర్ణయానికి ఓటు వేయడం విశేషం. పెద్దల కట్టుబాట్లు.. సంస్కృతి.. సంప్రదాయాలు.. ఇతర వ్యవహారాలు భారతీయ వివాహ వ్యవస్థను మిగతా దేశాలతో పోల్చి చూస్తే భిన్నంగా నిలుపుతున్నాయి. అందువల్లే సర్వే నిర్వహించిన సంస్థ ఆసక్తికరమైన విషయాలను బయటకు వెల్లడించింది.

“ప్రేమ వివాహాలు చేసుకోవడానికి యువత ఆసక్తిగా ఉన్నారు. కొంతమంది పెద్దలు కుదిరించి చేసిన వివాహాలకు ఆసక్తి చూపిస్తున్నారు. కులాల కట్టుబాట్లు చాలా వరకు తగ్గిపోయాయి. సంస్కృతి సంప్రదాయాలను పాటించే క్రమంలో కొత్త కొత్త విధానాలు తెరమీదికి వచ్చాయి. వెస్ట్రన్ కల్చర్ మన జీవితంలోకి వేగంగా దూసుకుని వచ్చినప్పటికీ.. సనాతన సంస్కృతిని అధిగమించే స్థాయిలో అయితే కాదని” సర్వే నిర్వహించిన వారు చెబుతున్నారు. కాకపోతే ఈ సర్వే ద్వారా భారతీయ వివాహ వ్యవస్థ గురించి అనేక రకాలైన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కార్లు కొంటే రూ.2 లక్షలు మాఫీ.. పాత కారు ఇస్తే లక్ష.. ఏంటీ ఈ పాలసీ..

Delhi EV Policy 2.0
Delhi EV Policy 2.0

Delhi EV Policy 2.0: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం Delhi EV Policy 2.0 (2026-2030) ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల కొనుగోలుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించి 2030 నాటికి ఢిల్లీని గ్రీన్ మొబిలిటీ నగరంగా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ఈ పాలసీ ద్వారా కార్లు కొనేవారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎంత వరకు డబ్బు ఆదా అవుతుంది?

ఈ కొత్త ఢిల్లీ పాలసీ ప్రకారం.. రూ. 30 లక్షతల లోపు ఎక్స్ షోరూమ్ ధర ఉన్న ప్రతి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారుకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుండి 100% పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కొనుగోలుదారులకు ఆన్ రోడ్ ధరపై నేరుగా రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. తమ కుటుంబం కోసం మొదటి లేదా రెండవ కారుగా ఈవీని ఎంచుకోవాలని చూస్తున్న వారికి ఈ ఆఫర్ ఒక గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది.

ఈ సరికొత్త ఈవీ విధానం జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మార్చి 31, 2030 వరకు కొనసాగుతుంది. ఈ పాలసీ వల్ల అన్నింటికంటే ఎక్కువగా లబ్ధి పొందేవి ఫోర్ వీలర్స్ కావడం విశేషం. అయితే, కొనుగోలుదారులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వంద శాతం పన్ను మినహాయింపు కేవలం పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వాహనాలకు ఈ రాయితీలు వర్తించవు.

భారతదేశంలో అత్యంత నమ్మదగిన, బడ్జెట్ అనుకూల ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం రూ. 15 లక్షల విభాగంలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నింటినీ అందుకోవడానికి మార్కెట్లో ప్రస్తుతం ఎనిమిది ప్రముఖ మోడళ్లు రేసులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా టాటా టియాగో ఈవీ (Tata Tiago EV), ఎమ్‌జీ కామెట్ ఈవీ (MG Comet EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ (Citroen eC3X), టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), మహీంద్రా ఎక్స్ యూవీ 3 ఎక్స్ వో ఈవీ(Mahindra XUV3XO EV) ప్రముఖంగా ఉన్నాయి.

పన్ను మినహాయింపులతో పాటు, పాత వాహనాలను వదిలించుకోవాలనుకునే వారికి ప్రభుత్వం అదనపు గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైనా తమ పాత BS-IV లేదా అంతకంటే పాత ఢిల్లీ-రిజిస్టర్డ్ పెట్రోల్ లేదా డీజిల్ కారును స్క్రాప్ (రద్దు) చేసి, ఆ తర్వాత ఆరు నెలల లోపు అర్హత గల కొత్త ఈవీని కొనుగోలు చేస్తే.. వారికి రూ. 1 లక్ష వరకు అదనపు స్క్రాపింగ్ ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే, ఈ అదనపు లబ్ధి కేవలం మొదటి ఒక లక్ష మంది దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది.

వైయస్ జగన్ కోసం జడ శ్రావణ్ 25 కోట్ల ఖర్చు.. వెలుగులోకి బ్లాస్టింగ్ వీడియో

Jada Sravan
Jada Sravan

Jada Sravan Kumar: నిజమే.. మీరు చదివింది ముమ్మాటికి నిజమే. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు. నేను కావాలని స్ప్రెడ్ చేస్తున్న ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అంతకంటే కాదు. ఈ విషయాన్ని స్వయంగా జడ శ్రావణ్ చెప్పారు. అది రికార్డు అయింది. యూట్యూబ్ ద్వారా బయటికి వచ్చింది. రకరకాల చర్చలకు కారణమైంది. అంతేకాదు, జడ శ్రవణ్ అసలు రంగు బయటపడుతోంది.

కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలలో జడ శ్రవణ్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది కదా.. పైగా ఆయన ఓ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. పది ఫెయిల్ అయిన నువ్వు డిప్యూటీ సీఎం అవ్వంగా లేంది.. జడ్జి చదువుకున్న నేను డిప్యూటీ సీఎం కాకూడదా అంటూ ప్రశ్నించారు. వాస్తవానికి జడ్జి అనేది ఒక చదువు కాదు. అది ఒక ఉద్యోగం మాత్రమే. అనుభవం ద్వారానే అది ఇస్తారు. ఆ విషయాన్ని మర్చిపోయి శ్రవణ్ మాట్లాడారు. జనసేన నాయకుల చేతిలో తీవ్రస్థాయిలో విమర్శలకు గురయ్యారు. జడ శ్రవణ్ ఎప్పుడైతే ఆ విమర్శ చేశారో.. అప్పట్నుంచి జన సైనికుల చేతిలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జడ శ్రవణ్ గురించి జనసేన నాయకులు కొత్త కొత్త వీడియోలు బయటపెడుతున్నారు.

జనసేన నాయకులు బయటపెట్టిన వీడియోలలో ఒకటి మాత్రం సంచలనం కలిగిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో బ్లాస్టింగ్ కు కారణమవుతోంది. ఆ వీడియోలో జడ శ్రవణ్ జగన్ గురించి చెప్పారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు వేయడానికి దాదాపు 25 కోట్ల వరకు శ్రావణ్ ఖర్చు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500 కేసులు వేశానని శ్రావణ్ చెప్పుకొచ్చారు. దళిత వైద్యుడు సుధాకర్ చనిపోయినప్పుడు.. దళితుల హత్యలు జరిగినప్పుడు శ్రావణ్ ఏనాడు కూడా బయటికి రాలేదు. కనీసం బాధితుల తరఫున స్వరం కూడా వినిపించలేదు. అటువంటి వ్యక్తి 25 కోట్లు ఖర్చుపెట్టి 500 కేసులు వేసాడు అంటే నమ్మశక్యంగా లేదని జనసేన నాయకులు అంటున్నారు.

తన వ్యక్తిగత జీవితంలో నిజాయితీని మాత్రమే నమ్ముకున్నానని పదేపదే చెప్పే శ్రావణ్.. 25 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని.. ఆ నగదు ఎలా సమీకరించారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. పాటికి పదిసార్లు పవన్ కళ్యాణ్ ను విమర్శించే శ్రావణ్.. తాను 25 కోట్లు ఏ రూపంలో సంపాదించారో చెప్పాలని అడుగుతున్నారు. ఒక జడ్జిగా ప్రభుత్వం ఆయనకు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుందని.. జీతం కూడా భారీగానే ఇస్తుందని.. ఎంతటి భారీ జీతం ఇచ్చినప్పటికీ ఆ స్థాయిలో నగదు ఎలా సమీకరిస్తారని జనసేన నాయకులు అడుగుతున్నారు. మరి దీనికి జడ శ్రావణ్ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.