Home Blog Page 19

కూటమికి ఆ ఐదు అంశాలు.. వైసిపి భయం అదే!

AP Politics
AP Politics

AP Politics: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. ఐదు అంశాలను ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకుంది. అవే తిరిగి కూటమిని నిలబెడతాయని బలంగా నమ్ముతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోలోపల భయం ఉన్నా.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఐదు అంశాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కచ్చితంగా కూటమి వైపే స్పష్టమైన ముగ్గు కనిపిస్తోంది ప్రస్తుతానికి.

* లక్షల ఓట్ల తొలగింపు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్ జరుగుతోంది. ఓటర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. దొంగ ఓట్లకు చెక్ పెడుతున్నారు. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆందోళన ఉంది. ఆ పార్టీపై ఒక విమర్శ కూడా ఉంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారిని సైతం ఓటర్లుగా చేర్పించారు అనేది ఆ పార్టీ ఆరోపణ. ప్రతి బూత్ పరిధిలో 50 ఓట్లకు తక్కువ కాకుండా ఇలాంటివి వైసిపి సానుభూతిపరులు కొనసాగుతున్నారు అనేది ఒక అంచనా. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 లక్షల ఓట్లు జాబితాల నుంచి తొలగించనున్నారు. అదే జరిగితే చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అవుతాయి.

* అత్యవసర సమయాల్లో పవన్..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతోంది అనేది కూటమి నుంచి వచ్చే ఆరోపణ. కానీ అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూటమికి అండగా నిలుస్తున్నారు. విధ్వంస రాజకీయాల్లో కులమతాలు పడకుండా, యువత కూటమి విషయంలో పక్క ఆలోచన చేయకుండా పవన్ గట్టిగా నిలబడుతున్నారు. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ఎండగడుతున్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు.

* అభివృద్ధి అజెండా..
అభివృద్ధి అజెండా అనేది కూటమి ప్రభుత్వంపై సానుకూలతకు ప్రధాన కారణం. గతంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చురుగ్గా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ఇవన్నీ ప్రజల్లో ఒక రకమైన సంతృప్తికి కారణం.

* కూటమి సమన్వయం..
అన్నింటికీ మించి కూటమి మధ్య సమన్వయం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మూడు పార్టీల నాయకత్వాలు సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి. ఎక్కడ సమన్వయ లోపం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఆపై మరో 15 సంవత్సరాలు కూటమి కొనసాగాలని భావిస్తున్నాయి. పార్టీల నాయకత్వాల మధ్య విభేదాలకు అవకాశం లేదు. నియోజకవర్గాల స్థాయిలో సైతం సమన్వయం కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నా.. ఎక్కడికక్కడే సద్దుమణిగించే వ్యవస్థ వచ్చింది. ఇది సైతం కలిసి వచ్చే అంశం.

* చివరి ఏడాది సంక్షేమం..
సంక్షేమ పథకాలు సైతం అమలు చేసి చూపిస్తున్నారు. ప్రధానమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. సంప్రదాయ సంక్షేమ పథకాలకు ఎక్కడ బ్రేక్ ఇవ్వడం లేదు. మరోవైపు ఎన్నికల చివరి ఏడాది విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు. అవే ప్రచార అస్త్రంగా మార్చనున్నారు. తాము వస్తేనే అభివృద్ధితో పాటు సంక్షేమం కొనసాగుతుందని ప్రచారం చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందనున్నారు. ఇలా ఈ ఐదు అంశాలు కూటమికి అనుకూలంగా మారనున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయం కూడా అదే.

ట్రంప్ దగ్గరికి టీవీ9 రజనీకాంత్.. కేఏ పాల్ రికమండేషన్ అలా ఉంటుంది మరి..

TV9 Rajinikanth
TV9 Rajinikanth

TV9 Rajinikanth: మన తెలుగు మీడియా కేఏ పాల్ ను జోకర్ ను చేసింది. అంతకుముందు ఓ ముఖ్యమంత్రి తన అల్లుడి కోసం కేఏ పాల్ స్థాయిని తగ్గించడానికి ఎన్నో రకాల కుట్రలు చేశాడు. అందులో విజయవంతం అయ్యాడు కూడా. అప్పటినుంచి కే ఏ పాల్ దారి తప్పారు. తనకున్న స్థాయిని కోల్పోవడం మొదలుపెట్టారు. ఆయన వెనుక జరిగిన కుట్రలు.. ఆయన పరపతిని ఇక్కడ తగ్గించాయి. కానీ అమెరికాలో మాత్రం కేఏ పాల్ స్థాయి తగ్గలేదు. పైగా ఆయన రేంజ్ మరింత పెరిగింది.

తాజాగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ అమెరికా వెళ్లారు. ఆయన ఎందుకు వెళ్లారు అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. వాస్తవానికి అమెరికాలో తెలుగు వల్ల సభలు లేదా సమావేశాలు జరగడం లేదు. ఒకవేళ దాన్ని కవర్ చేయాలి అనుకుంటే వీడియో ఫుటేజీ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మేనేజ్మెంట్ కు ఆబ్లిగేషన్ ఉండి ఉంటే అక్కడికి తన ప్రతినిధిని ఒకరిని పంపించాల్సి ఉంటుంది. కానీ ఏకంగా మేనేజింగ్ ఎడిటర్ అక్కడికి వెళ్లడం.. అమెరికాలో తిరగడం.. వైట్ హౌస్ ప్రాంతంలో కనిపించడం నిజంగానే ఆశ్చర్యం. టీవీ9 మనదేశంలో పెద్దపెద్ద న్యూస్ నెట్వర్క్ సంస్థల్లో ఒకటి. ఈ సంస్థకు జాతీయస్థాయి చానల్స్ ఉన్నాయి. ఒకవేళ అమెరికా కు వెళ్లి ఏదైనా న్యూస్ కవర్ చేయాలి అనుకుంటే జాతీయస్థాయి చానల్స్ వెళ్లే అవకాశం ఉంది. కాని వాటిని కాదని రజనీకాంత్ అక్కడికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి అమెరికాలో ఉన్న పరిస్థితులను కవర్ చేయాలి.. ముఖ్యంగా వైట్ హౌస్ పరిసర ప్రాంతంలో ఉన్న వ్యవహారాలను కవర్ చేయాలి అనుకుంటే కచ్చితంగా అత్యున్నత స్థాయిలో అనుమతులు రావాలి. ఆ అనుమతులు రావడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైట్ హౌస్ వర్గాలు అనుమతులు ఇవ్వడం అంత సులభం కాదు. కాని దానిని సులభం చేసేశాడు కేఏ పాల్. అమెరికా వైట్ హౌస్ వర్గాలతో మాట్లాడి రజనీకాంత్ కు ఆ అవకాశం కల్పించాడు. అందువల్లే రజనీకాంత్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివాసముండే ఓవల్ ఆఫీస్ నుంచి లైవ్ మాట్లాడాడు. అక్కడ ప్రతి అంశాన్ని పూస గుచ్చినట్టు చెప్పాడు. బంకర్ నుంచి మొదలుపెడితే ట్రంప్ బెడ్ రూమ్ వరకు.. ప్రతి దృశ్యాన్ని లైవ్ లో చూపించాడు. దీనినిబట్టి కేఏపాల్ రేంజ్ ఏమిటో రజినీకాంత్ కు అర్థమై ఉంటుంది. ఇటీవల రజనీకాంత్ అమెరికా వెళ్ళిన విషయంపై.. కేఏ పాల్ ను కలిసిన విషయంపై ఒక కథనం రాశాం. కాకపోతే వారిద్దరి కలయిక క్యాజువల్ మీటింగ్ లాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ తెర వెనుక ఇంత స్టోరీ నడుస్తోంది అంటే మామూలు విషయం కాదు. దీని అందరికీ కర్త , కర్మ ఎవరో తెలియదు గానీ క్రియ మాత్రం కేఏ పాల్.

ప్రభాస్ ను కలిసిన దురంధర్ డైరెక్టర్... ఆయన చెప్పిన కథకి రెబల్ స్టార్ మైండ్ బ్లాక్ అయిందా...

Prabhas
Prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసే ప్రతి సినిమాతో ఏదో ఒక సంచనాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ మూవీ ఆశించిన మేరకు విజయం సాధించలేదు. నిజానికి ఆ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ బాగున్నప్పటికి దర్శకుడు మారుతి అనుకున్న రేంజ్ లో సినిమాని తీయలేకపోయాడు. దానివల్ల సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన సలార్ 2, కల్కి 2 సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తోడుగా దురంధర్ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించిన ఆదిత్య ధర్ సైతం ప్రస్తుతం ప్రభాస్ ను కలిసి ఒక కథను వినిపించారట. ఈ కథ నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది…

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఆదిత్య ధర్ ఇంతకుముందు చేసిన దురంధర్ సినిమాలో డైరెక్షన్ తాలూకు వాల్యూనైతే చూపించాడు. ఆయన ఒక సీన్ ని ఎంతలా ఓన్ చేసుకొని చేస్తాడు దానివల్ల ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఎదురవుతుంది అనేది కూడా సినిమాలో మనకు చూపించాడు.

ప్రభాస్ తో చేయబోయే సినిమాలో కూడా అలాంటి ఒక ఇంటెన్స్ కథనైతే రాసుకున్నారట. ప్రతి సీన్ లో కూడా ప్రభాస్ యొక్క డెప్త్ ను చూపించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆదిత్య ధర్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే మరో రెండు, మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఆదిత్యధర్ సైతం ప్రభాస్ తో సినిమా చేస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. బాలీవుడ్ చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి వాళ్లేవ్వరికి అంత పెద్దగా మార్కెట్ లేదనే విషయాన్ని గమనించిన ఆదిత్య ధర్ ప్రభాస్ అయితేనే తన కథకి న్యాయం జరుగుతుందని ఆయన్ని కలిసినట్టుగా తెలుస్తుంది…

చిరంజీవి ఎంకరేజ్ చేసిన నటులు వీళ్లే...

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన విభిన్న తరహా సినిమాలను చేశాడు. చిరంజీవి తన కెరియర్ లో తను మాత్రమే ఎదగకుండా తన తోటి నటులను సైతం ఎంకరేజ్ చేసిన సందర్భాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, శివాజీ, ఉత్తేజ్ లాంటి నటులను చిరంజీవి కెరియర్ స్టార్టింగ్ లో బాగా ఎంకరేజ్ చేశాడు. నిజానికి బ్రహ్మానందం కి సినిమాలో అవకాశం ఇప్పించింది కూడా చిరంజీవి నే అని బ్రహ్మానందం పలు సందర్భాల్లో తెలియజేశారు.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు సినిమాల పరంగా సక్సెస్ లను సాధిస్తూనే తన తోటి నటులకు కూడా అవకాశాలు వచ్చే విధంగా చాలా రకాలుగా హెల్ప్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలను చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయన చాలా వరకు కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో అతను 50 సంవత్సరాల పైబడిన వయసు గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ల పరం పర ను కొనసాగించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది… చిరంజీవి గతంలో చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. బాబీ డైరెక్షన్ లో సినిమా చేసిన తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇక శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం చేస్తున్న ప్యారడైజ్ మూవీ సూపర్ సక్సెస్ అయితేనే శ్రీకాంత్ ఓదెల తో చిరంజీవి సినిమా చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఆ అవకాశం లేదనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు ఎలాంటి అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోయే సినిమా ఏ కథతో రాబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…

కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి ఎందుకు కాలేకపోయారు.. చేపల పులుసును ఎందుకు మూసుకున్నారు..

Kirak RP
Kirak RP

Kirak RP: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆ వీడియోలే కనిపించేవి. సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు అందరూ ఆ కర్రీ పాయింట్ల ముందు క్యూలో ఉండేవారు. అక్కడ దొరికేది పెద్ద పెద్ద కూరలు కాదు.. భూమ్మీద లభించే అరుదైన వస్తువులతో తయారుచేసే కూరలు అంతకంటే కాదు. జస్ట్ చేపల పులుసు.. అది కూడా నెల్లూరు చేపల పులుసు.. దానికోసం జనం విరగబడేవారు. క్యూలో ఉండేవారు.

ఈ స్థాయిలో హైపు ఎవరికైనా లభిస్తే.. దానిని మరో రేంజ్ కు తీసుకెళ్లేవారు. కానీ అక్కడ ఉన్నది కిరాక్ ఆర్పి.. ఏం చేయాలో తెలుసు ఆయనకు.. చేపల పులుసు ఎలా అమ్మాలో తెలుసు ఆయనకు.. కానీ వచ్చిన డిమాండ్ ఎలా నిలబెట్టుకోవాలో తెలియక.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా వార్తల్లో విఫల వ్యక్తిగా మిగిలిపోయారు. అసలు ఎందుకు ఇలా జరిగింది
.. ఎందుకు ఇలా అయింది.. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. కాకపోతే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు స్ట్రాటజీ సక్సెస్ అవ్వడం వెనుక కిరాక్ ఆర్పి ఉన్నాడు. ఫ్లాప్ అవడం వెనక కూడా కిరాక్ ఆర్పి ఉన్నాడు.

కిరాక్ ఆర్ పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రారంభించినప్పుడు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రమోషనల్ వీడియోలు చేయించుకున్నాడు. హైదరాబాద్ నగరాల్లో ఒకేసారి నాలుగు సెంటర్లు ఏర్పాటు చేశాడు. మెయిన్ కిచెన్ ఒక దగ్గర ఏర్పాటు చేసి.. డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాడు. కాకపోతే మొదట్లోనే ఇక్కడ లభించే చేపల పులుసు కు ధర విపరీతంగా ఉందని కామెంట్లు వినిపించాయి. అంతేకాదు కారం ఎక్కువగా ఉంటుందని.. పులుపు తక్కువగా ఉంటుందని.. ఉప్పు తక్కువగా ఉంటుందని.. ఇలాంటి కామెంట్లు కూడా వినిపించాయి. ఇలాంటి సమయంలో కస్టమర్ లను తెలివిగా మేనేజ్ చేయాల్సింది పోయి.. కిరాక్ ఆర్పి దురుసుగా ప్రవర్తించాడు. ఫలితంగా కస్టమర్లు దూరమయ్యారు.. విపరీతమైన డిమాండ్ ను క్యాష్ చేసుకోలేక.. కర్రీ పాయింట్లను నిర్వహించలేక చేతులెత్తేశాడు. ఫలితంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అలా ముగిసిపోయిన అధ్యాయం అయిపోయింది.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును ప్రారంభిస్తున్నప్పుడు కిరాక్ ఆర్పి ప్రఖ్యాత పచ్చళ్ళ ప్రకాష్ అలియాస్ బాబాయ్ దగ్గరికి వెళ్లారు. తాను కర్రీ పాయింట్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి ప్రకాష్ కొన్ని సూచనలు చేశారు. వాటికి తగ్గట్టుగా కిరాక్ ఆర్ పి కర్రీ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆయన చెప్పినట్టుగా మార్కెటింగ్ స్ట్రాటజీ అమలు చేయకపోవడంతో.. చివరికి నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పేరు పొందిన హోటళ్లు.. కర్రీ పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరణ పొందుతున్నాయి. అవన్నీ కూడా క్రమక్రమంగానే పేరు తెచ్చుకున్నాయి. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మాత్రం విపరీతమైన డిమాండ్ సొంతం చేసుకుంది. కానీ ఆ డిమాండ్ నిలబెట్టుకోవడంలో విఫలమైంది. హోటల్ వ్యాపారం లోకి రావాలి అనుకునే వారికి.. నిలబడాలి అనుకునే వారికి.. ఏం చేస్తే బాగుపడతామో అనుకునే వారికి.. నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఒక లైవ్ ఎగ్జాంపుల్.

ఈ బ్యాంక్ లో FD చేసే వారికి గుడ్ న్యూస్..

Axis Bank FD Interest Rates 2026
Axis Bank FD Interest Rates 2026

Axis Bank FD Interest Rates 2026: చాలామంది తమ డబ్బును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటారు. అయితే ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకులో FD చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్ వడ్డీరేట్ల పై సవరణలు చేసింది. ఈ సవరణలతో సీనియర్ సిటిజెన్లకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ వివరాలు లోకి వెళ్తే..

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ రూ. 3 కోట్ల లోపు విలువ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంకు అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ కొత్త వడ్డీ రేట్లు జూలై 4, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధానం, మార్కెట్ పరిస్థితులు, నిధుల సమీకరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా సవరణల ప్రకారం, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల లోపు కాలపరిమితి ఉన్న రూ. 3 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3.00 శాతం నుంచి గరిష్ఠంగా 6.50 శాతం వరకు వార్షిక వడ్డీ అందించనుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అదనపు వడ్డీ ప్రయోజనం కల్పిస్తూ 3.50 శాతం నుంచి గరిష్ఠంగా 7.25 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.

ఈ మార్పులతో సురక్షిత పెట్టుబడులను కోరుకునే వారికి ఎఫ్‌డీలు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, స్థిర ఆదాయాన్ని కోరుకునే పెట్టుబడిదారులు సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీల ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. అయితే వడ్డీ రేట్లు ఎఫ్‌డీ కాలపరిమితిని బట్టి మారుతాయని, పెట్టుబడి పెట్టే ముందు తాజా రేట్లను పరిశీలించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తించవు. అవి మెచ్యూరిటీ అనంతరం ఎఫ్‌డీని పునరుద్ధరించినప్పుడు మాత్రమే అమలులోకి వస్తాయి. పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, నగదు అవసరాలు, కాలపరిమితిని పరిగణనలోకి తీసుకుని సరైన ఎఫ్‌డీ పథకాన్ని ఎంచుకోవడం ద్వారా మెరుగైన లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

గోమాతలు చనిపోతే.. వివాహాలు చేయరు.. ఈ వింత ఆచారం ఎక్కడంటే..

Cow Worship Tradition In India
Cow Worship Tradition In India

Cow Worship Tradition In India: మనదేశంలో ఆవులను దేవతలుగా పూజించే సంస్కృతి ఉంటుంది. గృహప్రవేశాల సమయంలో ఆవులనే ముందుగా ఇంట్లోకి తీసుకొస్తారు. ఆవులకు పూజలు చేసిన తర్వాతే.. గృహప్రవేశం చేస్తారు. కొన్ని జాతుల్లో అయితే వివాహాలు జరిగేటప్పుడు ఆవులకు పూజలు చేస్తారు. ఆ తర్వాత వివాహ క్రతువు మొదలుపెడతారు.

మనదేశంలో భిన్న రాష్ట్రాలు ఉన్నట్టే.. ఆయా రాష్ట్రాలలో భిన్న సంస్కృతులు ఉన్నాయి. అలాంటి సంస్కృతిని కొనసాగించే రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ప్రముఖంగా ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటవీ గ్రామాలు అధికంగా ఉంటాయి. ఈ గ్రామాలలో రకరకాల తెగలు నివసిస్తూ ఉంటాయి. ఈ తెగలకు భిన్నమైన సాంప్రదాయాలు ఉంటాయి. అటువంటి సాంప్రదాయమే ఇది. కాకపోతే ఈ సాంప్రదాయం దేశంలోనే వింతైనది..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అశోక్ నగర్ జిల్లాలో చాలావరకు మారుమూల గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలలో ఒక వింత సంప్రదాయం ఉంది. ఈ గ్రామాల పరిధిలో ఆవు గనుక చనిపోతే దాదాపు పుష్కర కాలం పాటు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. ముఖ్యంగా వివాహాలు చేయరు. పురాతన కాలం నుంచి ఈ సాంప్రదాయం ఇక్కడ అమల్లో ఉంది. ఒకవేళ పెళ్లి చేయాలి అనుకుంటే గ్రామాల పొలిమేర ప్రాంతాల్లో ఆ క్రతువు నిర్వహిస్తారు. ఆ తర్వాత పొలిమేరల నుంచి అమ్మాయిలను అత్తారింటికి పంపుతారు. ఒకవేళ అబ్బాయికి గనక పెళ్లి చేస్తే.. కొద్దిరోజుల పాటు బంధువుల ఇంట్లోనే ఉంచుతారు. గ్రామాలలో పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు మొత్తం పాటిస్తూ ఉంటారు. చివరికి ధనవంతులు కూడా వివాహాలను బయట నిర్వహిస్తారు. అయితే మొదట్లో ఈ వ్యవహారం బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత ప్రతిబంధంగా మారిందని పేదలు అంటున్నారు. తమ విషయంలో ఈ ఆచారాన్ని కాస్త సడలించే విధంగా చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

ఈ ప్రాంతంలో ఆవులకు విపరీతమైన ప్రాధాన్యమిస్తారు. వాటిని ఇంట్లో సభ్యులుగా భావిస్తారు. వాటికి విశేషంగా పూజలు కూడా చేస్తారు. అందువల్లే అవి చనిపోతే ఇటువంటి శుభకార్యం నిర్వహించకూడదని పెద్దలు నిబంధనలను విధించారు. ఆ నిబంధనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే అత్యవసరమైన శుభకార్యాలను వేరే ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు . ఆ తర్వాత పొలిమేర నుంచి బయటికి పంపిస్తున్నారు.

పులులు కాదు.. సింహాలనూ ఈ కుక్కలు కంటపడితే వెంటపడి చంపేస్తాయ్..

Indian Wild Dog
Indian Wild Dog

Indian Wild Dog: మామూలుగా పులులు ఎలా ఉంటాయి.. ఇది కూడా ఒక క్వశ్చనేనా అనుకోకండి. అంతటి క్రూరమైన పులులను కూడా ఇవి ఒక్క వేటులో వేసేస్తాయి. సింహాలు అడవులకు మృగరాజులు. అవి కూడా వీటిని చూస్తే భయపడిపోతుంటాయి. భయపడ్డమే కాదు ఎదురుపడకుండా జాగ్రత్త పడతాయి. అడవి పందులు, హైనాలు, తోడేళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే క్రూరమైన జంతువుల నుంచి మొదలుపెడితే జింకల వరకు వీటిని చూస్తే చుచ్చు పోసుకుంటాయి. ఇంతకీ ఈ ప్రత్యేకమైన జంతువులు ఎక్కడున్నాయి.. ఏ ప్రాంతంలో ఉన్నాయి.. అనేకదా మీ డౌటు.. అయితే చదివేయండి ఈ స్టోరీ..

సింహాల నుంచి మొదలు పెడితే జింకల వరకు.. పులుల నుంచి మొదలు పెడితే అడవి పందుల వరకు సింహ స్వప్నం లాగా నిలిచే ఆ జంతువుల పేరు రేచు కుక్కలు. ఇవి ఆసియాలోని అన్ని దేశాలలో ఉంటాయి.. వీటిలో పోరాడే తత్వం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని దేశాలలో మాత్రమే కనిపిస్తున్నాయి. వీటి సంఖ్య దాదాపు 60 శాతం వరకు తగ్గింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో ఈ కుక్కలు కనిపించాయి. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో ఇవి ఉన్నాయి. ఈ కుక్కలు చూసేందుకు పొడవుగా ఉంటాయి. తలభాగం.. తోక భాగం నక్కను పోలి ఉంటుంది. పెద్దగా అరవవు. సూటిగా చూస్తుంటాయి. అదును కోసం ఎదురు చూస్తుంటాయి. ఒకసారి ఎటాక్ మొదలుపెట్టాయా.. ఇక అంతే సంగతులు. నేరుగా పీకను మాత్రమే పట్టుకుంటాయి. ఇవి గుంపుగా వేటను సాగిస్తూ ఉంటాయి. దుప్పులను.. జింకలను ఇష్టంగా తింటాయి. కొన్ని సందర్భాలలో అడవి బర్రెలు.. అడవి దున్నలను కూడా తినేస్తూ ఉంటాయి.

ఒకప్పుడు వీటి సంఖ్య విస్తారంగా ఉండేది. ఆహారం సరిగ్గా లభించకపోవడం.. జనవాసాలకు వచ్చినప్పుడు చనిపోవడం.. వాతావరణంలో మార్పులు.. ఇంకా అనేక రకాల కారణాల వల్ల వీటి సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. గడచిన వంద సంవత్సరాల కాలంలో వీటి సంఖ్య 60 శాతానికి పడిపోయింది. ఈ కుక్కలు అత్యంత విశ్వాసంగా ఉంటాయి. కాకపోతే సమిష్టి జీవితాన్ని ఇష్టపడుతుంటాయి. ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. పైగా వేటాడే సమయంలో సంకేతాలు ఇచ్చుకుంటూ ఉంటాయి. కేవలం వాసన ద్వారా మాత్రమే ఇవి తమ సంతతిని గుర్తిస్తాయి. గట్టిగా అరవవు.. కరిస్తే మాత్రం వదిలిపెట్టవు. దాడి చేస్తే ప్రాణాలు తీసేదాకా ఊరుకోవు. అందువల్ల వీటిని రేచు కుక్కలు అని పిలుస్తుంటారు. వీటి సంతతిని కాపాడేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వీటి సంఖ్య అధికంగా ఉండడం విశేషం.

ఈ రాశుల వారికి ఈరోజు రాజయోగం.. ఏ పని మొదలుపెట్టినా.. కలిసి వస్తుంది..

Today 7 July 2026 Horoscope
Today 7 July 2026 Horoscope

Today 7 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా రాజయోగం ఏర్పడనుంది. మరికొన్ని రాశుల వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. గతంలో కోల్పోయిన డబ్బులు తిరిగి పొందుతారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వీరితో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులు నాణ్యమైన ప్రదర్శనతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి ధన సహాయము అందుతుంది. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా వ్యాపారులకు ఆదాయం భారీగా పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉండే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న కోరికలను నెరవేర్చుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ప్రాజెక్టులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. పదోన్నతుల విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులలో సులభంగా పూర్తి చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అనుకొని అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీరికి కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. దీంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభాలే ఉంటాయి. తమ తెలివితేటల ప్రదర్శన ద్వారా ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని సమస్యలు తొలగిపోవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారులు లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తిచేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు గణనీయంగా ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారులు పెద్దలను సంప్రదిస్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి బెడద ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కొన్ని రహస్యాలను బయటకు చెప్పకపోవడమే మంచిది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

ఆరుగురు డైరెక్టర్స్ తో ఒకే సినిమా.. నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ సరికొత్త ప్రయోగం..

Pradeep Ranganathan Replacing Vijay in Tamil Nadu
Pradeep Ranganathan Replacing Vijay in Tamil Nadu

Pradeep Ranganathan : డైరెక్టర్ గా హీరో గా ప్రదీప్ రంగనాథన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డైరెక్టర్ గా ఆయన మొదటి చిత్రం ‘కోమలి’ సూపర్ హిట్ అయ్యింది . ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తూ హీరో గా చేసిన ‘లవ్ టుడే’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఇతర డైరెక్టర్స్ దర్శకత్వంలో ఆయన హీరో గా నటించిన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘LIK’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇకపోతే నేడు ఆయన తదుపరి చిత్రాన్ని నేడు ఒక బ్లాస్టింగ్ వీడియో తో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈసారి డైరెక్టర్ గా , హీరో గా కాదు , నిర్మాతగా.

ఆయన నిర్మాతగా ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ని చేయబోతున్నట్టు కొంతకాలం క్రితం ఒక వార్త ప్రచారం లోకి వచ్చింది. ఇందులో ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ ఫేమ్ మమిత బైజు ప్రధాన పాత్ర పోషించబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను నిజం చేస్తూ , నేడు ప్రదీప్ రంగనాథన్ అధికారికంగా ప్రకటించారు. ‘PR షో’ అనే బ్యానర్ పై ఈ క్రేజీ మూవీ ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి కథ కూడా ఆయనే అందించారు. ఈ చిత్రానికి ఒకరు కాదు, ఆల్ఫా యూనిట్ ద్వారా ఏకంగా 6 మంది దర్శకులు దర్శకత్వం వహించనున్నారు. సాయి అభయంకర్ సంగీత దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అనామిక మహి , స్వశిక , డైరెక్టర్ అస్వత్ మారిముత్తు , శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఒక సినిమాకు ఏకంగా 6 మంది దర్శకత్వం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి.

ప్రదీప్ ఈ విధంగా ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నారనే చెప్పాలి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా సక్సెస్ అవుతారో లేదో చూడాలి. ఇకపోతే ఆయన హీరో గా నటించే సినిమాల వివరాలు ప్రస్తుతానికి బయటకు రాలేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం , నిర్మాతగా వ్యవహరించబోయే ఈ సినిమా మీదనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అస్వత్ మారిముత్తు గతం లో ప్రదీప్ ని హీరో గా పెట్టి ‘డ్రాగన్’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రజినీకాంత్ హీరో గా నటిస్తున్న ‘ధర్మన్ ‘ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించబోతుండడం గమనార్హం.

ఎలాంటి తనఖా లేకుండా రూ.10 లక్షల వరకు రుణం.. ఎవరు అర్హులో తెలుసా..

Gold Loans
Gold Loans
PM Vidyalaxmi Scheme ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం PM విద్యాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేకుండా, గ్యారంటీ ఇవ్వకుండానే నామమాత్రపు వడ్డీతో రూ.10 లక్షల వరకు విద్యా రుణాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు దూరమవుతున్న విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. అయితే ఈ పథకంకు ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి ఎవరు అర్హులు?

PM Vidhyalaxmi పథకం కింద దేశంలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు విద్యా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలు, ల్యాప్‌టాప్, ఇతర విద్యా అవసరాలకు సంబంధించిన ఖర్చులను ఈ రుణం ద్వారా భరించవచ్చు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సులభమైన నిబంధనలతో రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఎవరు అర్హులు?
PM విద్యాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు భారత్‌లోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందాలి. కుటుంబ ఆదాయం, విద్యా అర్హతలు, కోర్సు స్వభావం వంటి అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.

రూ.10 లక్షల వరకు రుణం
ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు విద్యా రుణం పొందవచ్చు. ఈ మొత్తానికి ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే తృతీయ వ్యక్తి గ్యారంటీ కూడా అవసరం ఉండదు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు తక్కువ వడ్డీతో రుణం అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

వడ్డీ రాయితీ కూడా
ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా కల్పిస్తోంది. చదువు పూర్తయ్యే వరకు లేదా మోరటోరియం కాలంలో వడ్డీ సబ్సిడీ లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల విద్య పూర్తయ్యే వరకు రుణ భారం తగ్గుతుంది.

దరఖాస్తు ఎలా చేయాలి?
విద్యార్థులు PM Vidyalaxmi పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, అడ్మిషన్ సమాచారం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. అనంతరం ఎంపిక చేసిన బ్యాంకు దరఖాస్తును పరిశీలించి రుణ మంజూరుపై నిర్ణయం తీసుకుంటుంది.

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు 4.48 లక్షల మంది విద్యార్థులకు రూ.18,172 కోట్ల విలువైన విద్యా రుణాలు PM విద్యాలక్ష్మి పథకం కింద మంజూరయ్యాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ఉన్నత విద్యను కొనసాగిస్తూ తమ లక్ష్యాలను చేరుకుంటున్నారు.

రవి బిష్ణోయ్ ఔట్.. కొత్త ఆటగాడికి చోటు.. మూడో టి20 లో టీమిండియా గేమ్ ప్లాన్ ఇదే

తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ లో గెలుపు ముందు బోర్లా పడాల్సి వచ్చింది.. టీమిండి అలా ఓడిపోవడానికి ప్రధాన కారణం రవి బిష్ణోయ్. తన చెత్త బౌలింగ్ తో పరుగులు మాత్రమే కాదు.. టీమ్ ఇండియాకు గెలుపును కూడా దూరం చేశాడు. అతని బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ బెతల్ అత్యంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఒక దశలో ఐదు వికెట్ల కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును గెలిపించాడు బెతల్. వాస్తవానికి ఈ మ్యాచ్ లో రవి బిష్ణోయ్ మినహా మీద టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. కానీ ఆ అద్భుతాన్ని రవి నాశనం చేశాడు.

ఈ సిరీస్లో మూడో మ్యాచ్ మంగళవారం జరగబోతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మేనేజ్మెంట్ రవి బిష్ణోయ్ మీద వేటు వేసినట్టు తెలుస్తోంది. అతడిని పక్కనపెట్టి ప్రసిద్ కృష్ణకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అతడు ఐర్లాండ్ జట్టు మీద తేలిపోయిన నేపథ్యంలో.. సూర్యాంష్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఇతడు బ్యాటింగ్ చేయగలడు.. బౌలింగ్ కూడా చేయగలడు.. అందువల్ల అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అతడు 4 ఓవర్ల కోటాను విజయవంతంగా వేయగలరు. మరొక శివం కూడా పేస్ బౌలింగ్ వేయగలడు. బ్యాటింగ్ కూడా చేయగలడు. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో విఫలం కావడంతో.. మేనేజ్మెంట్ పై అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మూడో మ్యాచ్ ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరుగుతుంది. ఇది బ్యాటర్లకు ఒక స్వర్గం లాంటిది. ఇక్కడ సూర్య వంశీ గనుక సెట్ అయితే పరుగులు ప్రవాహం లాగా వస్తుంటాయి. గత మ్యాచ్లో కెప్టెన్ అయ్యర్.. తిలక్ వేగంగా బ్యాటింగ్ చేశారు. అలాంటప్పుడు మూడో మ్యాచ్లో వీరిద్దరూ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తేనే సిరీస్ మీద ఆశలు సజీవంగా ఉంటాయి.

ఈ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి.. టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.. మైదానం మీద తేమ మామూలుగా ఉండడంతో బంతి స్వింగ్ లేదా బౌన్స్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఐదు నుంచి ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత స్పిన్నర్లు సత్తా చూపించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల మ్యాచ్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసిన సూర్య వంశీ.. ఈ మ్యాచ్లో భారీగా పరుగులు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు ఓపెనర్ గా రావడం ఖాయం అయిన నేపథ్యంలో.. అతడు గనుక భారీ ఇన్నింగ్స్ ఆడితే టీమ్ ఇండియాకు తిరుగు ఉండదని అభిమానులు అంచనా వేస్తున్నారు.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్త ఒంట్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది

Nizamabad Crime

Nizamabad Crime : పోలీసుల కేసులు పెడుతున్నారు.. న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తున్నాయి.. సమాజం దూరం పెడుతున్నది.. అయినవాళ్లు దగ్గరికి కూడా రావడం లేదు. అయినప్పటికీ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పైగా కొత్త కొత్త పద్ధతుల్లో ఈ దుర్మార్గాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రాణాలు పోతున్నాయి. ఈ వ్యవహారాలలో ఎక్కువగా మగవాళ్ళప్రాణాలు గాలిలో కలిసిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలలో చిచ్చులు పెడుతున్నాయి. అంతేకాదు ప్రాణాలు కూడా తీస్తున్నాయి. గతంలో ఇటువంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చినప్పుడు పెద్దలు పంచాయతీలు పెట్టేవారు. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించేవారు. తద్వారా ఈ వ్యవహారాలు ఆదిలోనే ముగిసిపోయేవి. ఇప్పుడు పెద్ద కుటుంబాలు లేవు. పెద్దలు చెప్పిన మాటలు వినే పరిస్థితి లేదు. అందువల్లే మనుషులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. చివరికి మృగాల కంటే హీనంగా మారిపోతున్నారు. వివేచన కోల్పోయి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటిదే ఈ సంఘటన కూడా. కాకపోతే ఈ నేరం జరిగిన తీరు సభ్య సమాజం తరలించుకునే విధంగా ఉంది. అసలు ఒక ఆడది ఇలా కూడా చేస్తుందా అనే విధంగా ఉంది..

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలో న్యాల్కల్ అనే గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తన వివాహేత్ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అత్యంత దారుణంగా అంతం చేసింది. ఈ గ్రామానికి చెందిన ప్రశాంత్, సంధ్య భార్యాభర్తలు. కొంతకాలంగా ఈమె వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం ప్రశాంత్ కి తెలుసు.. అనేక సందర్భాలలో ఆమెను పట్టుకున్నాడు. నిలదీశాడు. పెద్దలు పంచాయతీలు కూడా పెట్టారు. అయినప్పటికీ సంధ్య ప్రవర్తన మారలేదు. మరింత విచక్షణ రహితంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఎ నేపథ్యంలో గత నెల 30న డాబా మీద పడుకున్న తన భర్తను అక్కడ నుంచి తోసి వేసింది. అయితే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు ఆసుపత్రికి చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న భర్తను ఎలాగైనా చంపాలని సంధ్య భావించింది.. ఈ క్రమంలో టాయిలెట్ క్లీనర్ ను భర్త శరీరంలోకి ఎక్కించింది. అతని పరిస్థితి విషమంగా మారి చనిపోయాడు.. అయితే ఈ వ్యవహారం పోలీసులకు తెలియడంతో వారు సంధ్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

సర్పంచ్ అయ్యర్ భయ్యా.. ఇప్పటికైనా లోపం అర్థమైందా.. ఎక్కడుంది తేడా..

Shreyas Iyer Comeback Opportunity
Shreyas Iyer Comeback Opportunity

Shreyas Iyer : సూర్య కుమార్ యాదవ్ సారధిగా పరవాలేదు. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. అందువల్లే అతని స్థానంలో అయ్యర్ కు చోటు లభించింది. సారధిగా ప్రమోషన్ వచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం లేదు. ఎందుకంటే సారధి మార్పు టీమ్ ఇండియాకు ప్రతిబంధకంగా మారింది. ఐర్లాండ్ సిరీస్ ఓటమి.. ఇంగ్లాండ్ జట్టుతోనూ రెండో మ్యాచ్ లో ఓటమి.. వంటి పరిణామాలు టీమిండియాను ఇబ్బందికి గురిచేస్తున్నాయి.. ముఖ్యంగా టీమ్ ఇండియా సారధి శ్రేయస్ అయ్యర్ కు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి.

నిజానికి టీమిండియా సొంత దేశంలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ట్రోఫీ గెలిచింది. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఐర్లాండ్ గడ్డమీద అడుగుపెట్టింది. కానీ ఆ నామక జట్టు చేతిలో రెండు మ్యాచ్లు ఓడిపోయి పరువు తీసుకుంది. ఈ ఓటమి పరంపర ఇక్కడితో ఆగిపోలేదు.

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ లో టీం ఇండియా గెలవాల్సిన చోట ఓడిపోయింది. దాదాపు 16 ఓవర్ల వరకు ఆట మీద పట్టు సాగించిన టీమిండియా.. 17 ఓవర్లో పట్టు విడిచింది. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం చేయి జారిపోయింది.

ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడం.. ఇంగ్లాండ్లో తొలి మ్యాచ్ ఓడిపోవడంతో.. రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా ఇలా ఇబ్బంది పడేందుకు ప్రధాన కారణం జట్టు కూర్పు అని సీనియర్ ప్లేయర్లు ఆరోపిస్తున్నారు. రోహిత్ నాయకత్వంలో.. సూర్య నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. కానీ వారి వ్యక్తిగత ప్రదర్శన అంత గొప్పగా లేదు.. కానీ అయ్యర్ పరిస్థితి అలా లేదు. ఆటగాడిగా అతడు ఐర్లాండ్ సిరీస్లో విఫలమయ్యాడు. నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ సిరీస్లో రెండో మ్యాచ్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. జట్టును ఏకతాటిమీద నిలిపి.. ఆడించడంలో విఫలమవుతున్నాడు.

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న వారంతా యంగ్ ప్లేయర్లే. ఐపీఎల్ లో వీరు సత్తా చూపించారు. కానీ ఇంటర్నేషనల్ లో మాత్రం ఆడలేక పోతున్నారు. అభిషేక్ శర్మ మిగతా వారంతా నీలకడలేని ఆడతీరుతో విమర్శల పాలవుతున్నారు. ఐర్లాండ్ సిరీస్ లో మందకోడి పిచ్ ల మీద ఆడలేక పోయారు. ఇంగ్లాండులో బాండ్స్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్లో కిషన్ వేగంగా పరుగులు చేయలేదు. చివర్లో తిలక్ వర్మ దూకుడుగా ఆడాడు కాబట్టి ఆ స్కోర్ లభించింది.

ఇక బౌలింగ్లో రవి ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి పరువు తీశాడు. ఒక రకంగా మ్యాచ్ ఓడిపోవడానికి అతడే కారణమయ్యాడు . డెత్ ఓవర్లలో రవికి బంతి ఇవ్వడం శ్రేయస్ చేసిన అతి పెద్ద తప్పు. ఐపీఎల్ లో అయ్యర్ పంజాబ్ జట్టు లో పరిమిత వనరులతోనే అదరగొట్టాడు. కానీ ఇంగ్లాండ్ సిరీస్లో మాత్రం ఉన్న వనరులను వినియోగించుకోలేకపోతున్నాడు.. తిలక్ .. శివం దుబే వంటి వారు ఉన్నప్పటికీ.. డెత్ ఓవర్లలో శ్రేయస్సు వారిని వినియోగించుకోలేకపోతున్నాడు.. జట్టు సారధిగా సూర్య ఉన్నప్పుడు.. ఎవరైనా ప్రధాన బౌలర్ ఇబ్బంది పడుతుంటే వెంటనే తాత్కాలిక బౌలర్లను రంగంలోకి దింపేవాడు. ఫలితాన్ని జట్టుకు అనుకూలంగా మార్చేవాడు. అయ్యర్ అటువంటి ప్రణాళిక మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఐపీఎల్ లో అయ్యర్ తన స్థాయి ఏమిటో చూపించాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వచ్చే సరికి ఇబ్బంది పడుతున్నాడు. వాస్తవానికి ఒక మ్యాచ్ గెలవడంలో సారథికి పూర్తి బాధ్యత ఉంటుంది. ఓడిపోయే విషయంలో కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే చేస్తారు. సారధి అందరి ఆటగళ్ల ప్రదర్శన అంచనా వేసి అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ టీమిండియా సొంతం చేసుకోవాలంటే తదుపరి మూడు మ్యాచ్లు గెలవాలి. అది జరగాలంటే ఆటగాళ్లు నిర్లక్ష్యాన్ని పక్కనపెట్టి.. తమ పూర్తిస్థాయి ఆట తీరు ప్రదర్శించాలి.

'లెనిన్' మూవీ మొట్టమొదటి రివ్యూ.. సెకండ్ హాఫ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు..ఓవరాల్ ఎలా ఉందంటే..

Lenin Movie Trailer
Lenin Movie Trailer

Lenin Movie Review : అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘లెనిన్’ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో చేస్తున్నారు మూవీ టీం. సోషల్ మీడియా తెరిస్తే చాలు , ఎక్కడ చూసినా ‘లెనిన్’ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూస్ మాత్రమే కనిపిస్తున్నాయి. నిన్న తిరుపతి లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని నాగార్జున , అఖిల్ మాటల్లోని నమ్మకాన్ని చూసి , ఈసారి చాలా గట్టిగా కొట్టబోతున్నాము అనే నమ్మకం అక్కినేని ఫ్యాన్స్ లో కూడా వచ్చింది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ ప్రివ్యూ షో ని నిన్న రామానాయుడు స్టూడియోస్ లో వీక్షించారు మూవీ టీం. ఈ షో కి కొంతమంది మీడియా ప్రముఖులు కూడా విచ్చేసారు.

వాళ్ళ నుండి ఈ చిత్రానికి వస్తున్న టాక్ ఇప్పుడు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమా ఆరంభం నుండే ఒక పల్లెటూరులోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుందని , అఖిల్ లుక్స్ , నటన చాలా నేచురల్ గా ఉందని, ముఖ్యంగా ఆయన యాస కూడా ఆకట్టుకునే విధంగా ఉందని , హీరోయిన్ గా భాగ్యశ్రీ భొర్సే కూడా అద్భుతంగా నటించిందని , వీళ్ళతో పాటు సపోర్టింగ్ క్యాస్ట్ నటన కూడా బాగా పేలిందని , ఈ రేంజ్ లో ఫస్ట్ హాఫ్ ఉంటుందని అసలు ఊహించలేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కే అభిమానులకు భుక్తాయాసం వచ్చినంత పని అయ్యింది అనుకుంటే , సెకండ్ హాఫ్ వేరే లెవెల్ లో ఉందని, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వుద్దని అంటున్నారు.

ఈ ట్విస్ట్ గురించి అక్కినేని నాగార్జున కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేకించి హైలైట్ చేసి చెప్పారు. ఆడియన్స్ కి కూడా అదే రేంజ్ లో ఎక్కితే మాత్రం అఖిల్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ లాంటి సినిమాగా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ బ్లాక్స్ చాలా అద్భుతంగా వచ్చాయట, ముఖ్యంగా అఖిల్ నుండి ఈ రేంజ్ పెర్ఫార్మన్స్ ని అభిమానులు కూడా ఊహించి ఉండరని అంటున్నారు. మరి సినిమా నిజంగా ఆ రేంజ్ లో ఉందో , లేదా కేవలం సినిమాకు హైప్ పెంచడం కోసం ఇలాంటి టాక్ చెప్పారా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ట్రైలర్ కి తగ్గట్టే సినిమా ఉంటుందో లేదో చూడాలి.

లీకైన SKN ఆడియో రికార్డు.. 'రాజాసాబ్' ఫలితంతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కామెంట్స్..

Prabhas skn

SKN leaked audio : సోషల్ మీడియా లో పరిచయం అక్కర్లేని పేరు SKN . ఒకప్పుడు మెగా ఫ్యామిలీ కి పీఆర్వో గా పనిచేసేవారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కి పీఆర్వోగా చాలా ఏళ్ళు పనిచేసి మంచి ఫేమ్ ని సంపాదించారు. అలా అంచలంచలుగా ఎదుగుతూ ‘టాక్సీ వాలా’ చిత్రం తో నిర్మాతగా మారే రేంజ్ కి వచ్చారు. తొలిసినిమానే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘బేబీ’ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు. అయితే కొన్ని పెద్ద సినిమాలకు ఆయన అప్పుడప్పుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటారు. అలా ఆయన పని చేసిన చిత్రం ‘రాజా సాబ్’. ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా , ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

ఈ సినిమా విడుదలకు ముందు SKN చేసిన హంగామా మామూలుది కాదు. సంక్రాంతికి పోటీ లో ఉన్నది , ఇంత కాలం తనకు ఉపాధి కల్పించిన మెగాస్టార్ చిరంజీవి అనేది కూడా మర్చిపోయి ‘సంక్రాంతి పోటీ లో ఉంటున్నది డైనోసార్ అమ్మా.. కాస్త జాగ్రత్త’, ‘పండగ పండగ రెబల్ పండగ’ వంటి మాటలు మాట్లాడారు SKN. అవి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ కూడా యాంటీ ఫ్యాన్స్ ఈ మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో తిప్పుతూ SKN వెక్కిరిస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే SKN కి మారుతీ మొదటి నుండి మంచి స్నేహితుడు కూడా. ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతీ ఎమోషనల్ అయ్యి మాట్లాడుతుంటే , ఆయన వెనుక నిల్చొని SKN కూడా కంటతడి పెట్టుకున్నారు.

వీటిని చూసి వీళ్లిద్దరి మధ్య ఎంతటి ఎమోషనల్ బాండ్ ఉందో అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేశారు అప్పట్లో. అయితే ఇదంతా డ్రామా యేనా అని అనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా సోషల్ మీడియా లో లీకైన SKN కి సంబంధించిన ఆడియో వింటే ఎవరికైనా ఇలాంటి అనుమానాలు రాక తప్పదు. ఆ ఆడియో లో ఆయన మాట్లాడుతూ ‘రాజా సాబ్ ఫలితం తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను అడుగుతారేంటి?, మీరు అడగాల్సింది హీరో , డైరెక్టర్ లేదా నిర్మాతని కదా’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఆడియో విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ SKN పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నీకు సంబంధం లేదని ఎలా చెప్తావు , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ఊరికే సరదాగా వేయించుకున్నావా మూవీ టైటిల్స్ లో అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో వైరల్ అయినటువంటి ఆ ఆడియో ని మీరు కూడా వినేయండి.

‘లెనిన్' చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్.. సంచలనం రేపుతున్న అఖిల్ పోస్ట్..

akhil lenin

Akhil Akkineni : సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘ గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రంతో ఈ నెల 10 న మన ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. అక్కినేని అఖిల్ కూడా ఇంటర్వ్యూస్ నాన్ స్టాప్ గా ఇస్తూనే ఉన్నారు. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి లో గ్రాండ్ గా నిర్వహించారు. అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా విచ్చేసిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది , మూవీ బజ్ కి ఈ ప్రొమోషన్స్ మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ , ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా బజ్ కి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వేరే లెవెల్ బూస్ట్ ఇవ్వనున్నారు.

ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే అఖిల్ ఎన్టీఆర్ ని కలిసిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్తుండడం , అనంతరం అఖిల్ ని ప్రేమగా హత్తుకోవడం వంటివి చూడొచ్చు. అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ , అప్పట్లో ఎన్టీఆర్ , ఏఎన్నార్ ఆత్మీయంగా హత్తుకున్నా ఫొటోలతో పోలుస్తూ యాదృచ్ఛికం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ కి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు మహేష్ బాబు లతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ముగ్గురు గతం లో అఖిల్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ అయితే అఖిల్ ని తన సొంత తమ్ముడిగా భావిస్తుంటారు. చిరంజీవి , నాగార్జున ఎంత సాన్నిహిత్యంగా ఉంటారో , అఖిల్ , రామ్ చరణ్ అంతకు మించి సాన్నిహిత్యం తో ఉంటారు.

ఇలా స్టార్ హీరోలందరితో మంచి రిలేషన్స్ ని మైంటైన్ చేస్తూ , వాళ్ళ అభిమానుల సపోర్టు ని కూడా సొంతం చేసుకున్నారు అఖిల్. ఇలా అన్నీ కలిసి వస్తున్నప్పటికీ కూడా ఆయనకు సరైన సక్సెస్ రాకపోవడం బాధాకరం. లెనిన్ చిత్రం తో ఆ బాధకు ఫుల్ స్టాప్ పడుతుందని , కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఆయన అందుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ‘లెనిన్’ నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.